సాధారణంగా 11 ఏళ్ల చిన్నారులు వీడియో గేమ్స్ ఆడటం, చదువుకోవడం లేదా ఏదో ఒకటి తింటూ కనిపిస్తారు. అయితే ఆ చిన్నారి వీరందరికీ భిన్నంగా ధనవంతుల మాదిరిగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ చిన్నారి కోట్లకు అధిపతి. వ్యాపారంలో విజయం సాధించింది. ఈ చిన్నారి పేరు పీక్సీ కర్టీస్. ఆమె స్థాపించిన కంపెనీ పీక్సీ ఫిడ్‌గెట్స్.. పిల్లల బొమ్మలను, దుస్తులను విక్రయిస్తుంటుంది. పీక్సీ చైల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ పేరు పొందింది. ఆ చిన్నారి సోషల్ మీడియా అకౌంట్‌ను ఆమె తల్లి రాక్సీ హ్యాండిల్ చేస్తుంటుంది.
ది సన్ రిపోర్టును అనుసరించి పీక్సీ రూ. 72 కోట్లకుపైగా ఆస్తికి యజమాని. ఆ చిన్నారి తన 15 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంది. యూరప్‌కు ప్రైవేట్ జెట్‌లో విహారయాత్రలు చేసేందుకు వెళ్లింది. పెద్దవారి మాదిరిగా చర్మ సౌందర్యం కోసం అనేక ట్రీట్‌మెంట్లు తీసుకుంటోంది. ఆమె దగ్గర పలు లగ్జరీ వాహనాలు ఉన్నాయి. పీక్సీ ఇన్‌స్టాగ్రామ్‌కు 1,36,000కు మించిన ఫాలోవర్స్ ఉన్నారు.
పీక్సీ తల్లి కూడా ఇదేవిధమైన లగ్జరీ లైఫ్ గడుపుతోంది. ఆమె తన కుమార్తె కోసం 193,000 పౌండ్లు (సుమారు రెండు కోట్లు) వెచ్చించి కార్లు కొనుగోలు చేసింది. వీటిలో 43 వేల పౌండ్లు(సుమారు 44 లక్షలు) విలువైన మెర్సిడీస్ బెంజ్ కారు కూడా ఉంది. రాక్సీ తన కుమార్తె గురించి మాట్లాడుతూ తన కుమార్తె అన్ని పనులకు ఈ కార్లను వాడదని, తన సోదరునితో పాటు స్కూలుకు వెళ్లేందుకు, ఇతర ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఈ కార్లను వాడుతుందని తెలిపారు.
సోషల్ మీడియాలో పీక్సీ గురించిన కథలనాలను చూసిన యూజర్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ ఆ చిన్నారి ఎప్పుడూ ఫోను చూస్తూనే కనిపిస్తుందని అన్నారు. మరో యూజర్ 11 ఏళ్ల చిన్నారికి ఇంజక్షన్ ప్లాంపర్ అవసరం ఏముందని, ఆమె పెద్ద అయ్యాక అందం కోసం వివిధ థెరపీలు చేయించాల్సి ఉంటుందన్నారు. ఇంకొక యూజర్ 11 ఏళ్ల చిన్నారికి 3 వేల డాలర్ల విలువైన బ్యాగ్ ఇవ్వడం తగినది కాదన్నారు.
ఇది కూడా చదవండి: సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్‌గా షార్క్ దూసుకురావడంతో..
Comments
Please login to add a commentAdd a comment