rich
-
మస్క్, బెజోస్‌ను మించిన ‘బ్లాక్‌పాంథర్’ సంపద
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు.. టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్(Elon Musk), అమెజాన్ సీఈఓ జెఫ్‌బెజోస్(Jeff Bezos). కానీ వాళ్ల సందపను మించిన ఖజానా సుపర్ హీరోల ప్రపంచంలో ‘బ్లాక్‌పాంథర్’ వద్ద ఉంది. హాలివుడ్ సినిమాలకు నెలవైన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లోని బ్లాక్ పాంథర్ అత్యంత సంపన్న సూపర్ హీరోగా నిలిచింది. అది రియల్‌లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైప్‌లో.. అదెలాగో చూసేద్దాం.బ్లాక్ పాంథర్ అని పిలువబడే టి'చల్లా మార్వెల్ కామిక్స్ ప్రచురించిన అమెరికన్ కామిక్ పుస్తకాల్లో కనిపించే ఒక కాల్పనిక సూపర్ హీరో. స్టాన్ లీ, జాక్ కిర్బీ అనే రచయితలు ఈ పాత్రను సృష్టించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఈ కాల్పనిక కథను తెరకెక్కించింది. అందులోని అంశాల ప్రకారం.. ఆఫ్రికాలోని వకాండా, రమొండాకు టి'చల్లా రాజు సంరక్షకుడిగా ఉండేవాడు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించి తన సామ్రాజ్యం బ్లాక్ పాంథర్ పగ్గాలు చేపడుతాడు. ఒక రాజకీయ నాయకుడిగా, సూపర్ హీరోగా ఉంటాడు. అంతర్గత, బాహ్య బెదిరింపుల నుంచి వకాండా రాజ్యాన్ని రక్షిస్తుంటాడు. దాంతో తనను బ్లాక్ పాంథర్‌గా పిలిచేవారు.టి'చల్లా పాలిస్తున్న బ్లాక్ పాంథర్ 500 బిలియన్ డాలర్ల(సుమారు రూ.42 లక్షల కోట్లు) సంపదతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి రియల్ బిలియనీర్ల నికర విలువను సైతం అధిగమించింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లో బ్లాక్ పాంథర్ సామ్రాజ్యం అత్యంత సంపన్న సూపర్ హీరోగా నిలిచింది. ప్రపంచంలోనే అరుదైన, నశించలేని లోహమైన విబ్రేనియం ఏకైక నిల్వలు బ్లాక్పాంథర్లోనే ఉన్నాయి. విబ్రేనియం శక్తిని గ్రహించి, దాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కాల్పనిక కథలో రాశారు. దాంతో వకాండా విబ్రేనియంపై గుత్తాధిపత్యం చలాయిస్తుంది. అందుకే అంత సంపదను మూటగట్టకుందనేలా కథలో తెలిపారు.ఇదీ చదవండి: స్విగ్గీ ‘స్కూట్సీ’లో రూ.1,000 కోట్ల పెట్టుబడినిజ జీవితంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుఎలాన్ మస్క్: 400 బిలియన్ డాలర్లు, కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్జెఫ్ బెజోస్: 239.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు - అమెజాన్మార్క్ జుకర్ బర్గ్: 211.8 బిలియన్ డాలర్లు, కంపెనీలు మెటా-ఫేస్బుక్లారీ ఎల్లిసన్: 204.6 బిలియన్ డాలర్లు, కంపెనీలు-ఒరాకిల్బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ: 181.3 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎల్వీఎంహెచ్-లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీలారీ పేజ్: 161.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)సెర్గీ బ్రిన్: 150 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)వారెన్ బఫెట్: 146.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు బెర్క్‌షైర్ హాత్వేస్టీవ్ బామర్: 126 బిలియన్ డాలర్లు, కంపెనీలు మైక్రోసాఫ్ట్జెన్సెన్ హువాంగ్: 120.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎన్విడియా -
స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులు
ధనికుల జాబితాలో చోటు సంపాదించుకోవడంలో వ్యాపారవేత్త(BusinessMan)లతో సమానంగా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ముందుంటున్నారు. అందులో భారతీయ మహిళా గాయకుల(Singers)కు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని సర్వేల ప్రకారం భారత్‌లోని ధనిక మహిళా గాయకుల జాబితా కింది విధంగా ఉంది. ఇందులో లాతా మంగేష్కర్, తులసీ కుమార్, శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది.టాప్ ధనిక భారతీయ మహిళా గాయకులు, వారి ఆస్తుల(Asset) విలువ కింది విధంగా ఉంది.లతా మంగేష్కర్ రూ.368 కోట్లుతులసి కుమార్ రూ.210 కోట్లు శ్రేయా ఘోషల్ రూ.185 కోట్లు సునిధి చౌహాన్ రూ.100-110 కోట్లు నేహా కక్కర్ రూ.104 కోట్లు ఆశా భోంస్లే రూ.80-100 కోట్లు అల్కా యాగ్నిక్ రూ.68 కోట్లు మోనాలీ ఠాకూర్ రూ.25 కోట్లుపలక్ ముచ్చల్ రూ.8-9 కోట్లుఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?సంపద పెరగాలంటే భవిష్యత్తులో మంచి రాబడి ఇచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు.. వంటి చాలా మార్గాలు సంపదను పెంచుతాయని చెబుతున్నారు. -
ఆ జత జాడీలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏం మాయ చేశాయి..!
అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగానే, జత జాడీలు చైనాలోని ఒక కుటుంబాన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేశాయి. ఫొటోలో కనిపిస్తున్న ఈ రెండు జాడీలు చైనాకు చెందిన ఒక కుటుంబంలో గత శతాబ్దంగా ఉంటున్నాయి. పాతబడిన ఈ జాడీలను పనికిరాని వస్తువులుగా భావించి, ఆ కుటుంబం వారు వాటిని ఒక మూలన పడేశారు. అయితే ఈ జాడీలే తమకు కోట్లు కురిపిస్తాయని వారు ఊహించలేదు. అయితే, ఒక పురావస్తు నిపుణుడి సలహాపై, ప్రస్తుతం ఈ జాడీలను వారు వేలంలో పెడితే, అప్పుడే తెలిసింది వారికి ఈ జాడీల ప్రాముఖ్యత! పదహారో శతాబ్దానికి చెందిన చక్రవర్తి జియాజియ్ హయాంలో ఈ జాడీలను తయారు చేసినట్లు గుర్తించి, వాటిని 9.6 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 102 కోట్లు) కొనుగోలు చేశారు. అతి పురాతనమైన ఈ జాడీలను చైనీస్ మింగ్ రాజవంశం ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి వీరి దగ్గరకు ఎలా వచ్చాయో తెలియదు గాని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి నుంచి ఈ జాడీలు వారి ఇంటి వంటగదిలో నిరుపయోగంగా ఉంటున్నాయి. ఎగిరే చేపల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ జాడీలను వారు కేవలం ఇంట్లో అలంకరణకు మాత్రమే వాడేవారట! అందుకే అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. (చదవండి: వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!) -
దే..వుడా!
జాన్వీ కపూర్ స్నేహితురాలికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందట. ఆ అమ్మాయి శోక సముద్రంలో మునగడం జాన్వీని కదిలించింది. దాంతో తన ఫ్రెండ్ బీఎఫ్‌ని ఉడికించాలని.. తను స్విట్జర్లండ్లో వింటర్ జాకెట్‌తో బ్యాక్ నుంచి తీసుకున్న ఓ ఫొటోను తన ఫ్రెండ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందట.. విత్ మై బాయ్‌ఫ్రెండ్ ఇన్ స్విట్జర్లండ్ అనే రైటప్‌తో! ఆ పోస్ట్ చూసి ‘అబ్బా.. తన ఎక్స్‌కి స్విట్జర్లండ్ తీసుకెళ్లే రిచ్ బాయ్‌ఫ్రెండ్ దొరికాడా!’ అని ఆమె బీఎఫ్ కుళ్లుకుంటాడని ఆశపడిందట జాన్వీ! కానీ ఆప్పటికే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇన్‌స్టా అకౌంట్‌ని అన్‌ఫాలో చేసేశాడట. ఆ నిజాన్ని ఆలస్యంగా గ్రహించిన జాన్వీ ‘దే..వుడా!’ అంటూ తల పట్టుకుందట. -
నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం: భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన.. ఢిల్లీలో! (ఫోటోలు)
-
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?
ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్‌కి గురై ఆల్కహాల్‌కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!) -
అసమానతల భారతం
ప్రపంచం ముందుకు పోతోంది... దేశం శరవేగంతో సాగిపోతోంది... అని పాలకులు భుజాలు ఎగరేస్తున్న వేళ కళ్ళు తిరిగే గణాంకాల లెక్క ఇది. అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో కొందరు అంతెత్తున ఉంటే, అనేకులు అధఃపాతాళంలోనే ఉన్నారని తేలింది. భారతదేశంలో ఆదాయం, సంపదల్లో అస మానతలు గడచిన శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా తారస్థాయికి చేరాయని ‘వరల్డ్ ఇనీక్వా లిటీ ల్యాబ్’ అధ్యయన పత్రం వెల్లడించింది. నోబెల్ బహుమతి గ్రహీత థామస్ పికెట్టీ సహా నలుగురు ప్రసిద్ధ ఆర్థికవేత్తలు రూపొందించిన ఈ పత్రం ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. ఆదాయ అసమానతలో మన దేశం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలను సైతం వెనక్కి నెట్టేసింది. బ్రిటీషు పాలనలో కన్నా ఇప్పుడే భారత్‌లో అసమానతలు ఎక్కువయ్యా యట. ఇది ఆందోళన రేపుతోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ‘భారతదేశ ఆదాయం, సంపదల్లో అసమానత 1922 – 2023: బిలియనీర్ల రాజ్య ఆవిర్భావం’ అనే ఈ పత్రం అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 2000ల నుంచి దేశంలో అసమానతలు తారాపథానికి దూసుకుపోయాయి. ప్రస్తుతం దేశ సంపదలో 40 శాతం పైగా కేవలం ఆర్థిక బలసంపన్నులైన అగ్రశ్రేణి 1 శాతం మంది దగ్గరే పోగుబడింది. దేశ ఆదాయం లెక్కన చూస్తే 22.6 శాతం ఈ కొందరి వద్దే ఉంది. ఇక, కింది 50 శాతం జనాభా జాతీయ ఆదాయం మాత్రం 15 శాతమే. వెరసి, గడచిన ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేనట్టు అత్యధిక స్థాయిలో ఒకేచోట సంపద పోగుబడుతోంది. మరో ముఖ్య విషయమేమంటే, భారత్‌లో ఆర్థిక సమాచార నాణ్యత అంతంతే గనక వాస్తవిక అసమానతా స్థాయులతో పోలిస్తే పత్రంలో పేర్కొన్న అంచనాలు ఇంకా తక్కువేనట. పైనున్న వర్గాలు పైపైకి పోతుంటే, కింది వర్గాలు ఇంకా కిందకు పోయేలా ఆర్థిక అసమానతలు పెరగడం ఆందోళన రేపుతోంది. సమాజంలో అశాంతి, అస్థిరత పెచ్చరిల్లే ముప్పుంది. ఇలాంటి అంతర్జాతీయ నివేదికలే కాదు దేశంలోని స్థానిక నివేదికలు సైతం అసమానతల్ని పట్టిచూపుతున్నాయి. కర్ణాటకలోని ప్రగతివాద బృందాల సమ్మేళనమైన ‘బహుత్వ కర్ణాటక’ సైతం దేశంలో, ముఖ్యంగా కన్నడ సీమలో పెరుగుతున్న ఆదాయ అసమానతల్నీ, ఉపాధి రంగంలోని ఆందోళనకరమైన ధోరణుల్నీ ఈ మధ్యే తన నివేదికలో వివరించింది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి వృద్ధి, ఆదాయ సమానత అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ‘గ్యారెంటీ’ ప్రకటనలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ మధ్య ఉన్న అంతరాన్ని వెల్లడించింది. నిజానికి, కేంద్రంలోని ప్రస్తుత పాలకులు పదేళ్ళ క్రితం అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల అజెండాతో గద్దెనెక్కారు. తమ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వంతున వృద్ధి చెందిందనీ, ముఖ్యంగా 2023లో ఆఖరి మూడు నెలల్లో అత్యంత వేగంగా ఈ పురోగతి సాగిందనీ వారు జబ్బలు చరుస్తున్నారు. అయితే, వారు అధికారంలో ఉన్న ఈ రెండుసార్లలోనే బీద, గొప్ప తేడా బాగా పెరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. పైపెచ్చు, ఢిల్లీ సర్కార్ శతకోటీశ్వరులకు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపణలు సరేసరి. గమనిస్తే 1991నాటి ఆర్థిక సరళీకరణ ఆసరాగా దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 1991లో వారి సంఖ్య కేవలం 1 కాగా, 2022 నాటికి 162కు పెరిగిందని ఫోర్బ్స్ పత్రిక కథనం. పికెట్టీ తాజా పత్రం ఫోర్బ్స్తో పాటు పలు పత్రికలనూ, ఇతర అధ్యయనాలనూ ఉటంకించింది. అవన్నీ దేశంలో ధనికులకూ, గ్రామీణ నిరుపేదలకూ మధ్య అంతరం పెరుగుతోందని నిర్ధారిస్తున్నాయి. అయితే, ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటనే మాట సత్యదూరమనే వారూ లేకపోలేదు. పికెట్టీ అధ్యయన విధానం పారదర్శకంగా లేదనీ, అసమానతల్ని పెంచి చూపేలా ఫోర్బ్స్ వగైరా నుంచి సంపన్నుల జాబితాలను ఎంచుకుంటున్నారనీ దశాబ్ద కాలంగా విమర్శకుల అభ్యంతరం. అయితే ఎంత ఎక్కువనే మాట పక్కనపెడితే... దేశంలో ఆర్థిక అసమానతలు ఇప్పటికీ గణనీయంగా ఉన్నాయనేది ఎవరూ కాదనలేనిది. వాటిని తగ్గించడానికి ప్రయత్నించడమే కర్తవ్యం. దారిద్య్రాన్ని తగ్గించడానికి వీలుగా వృద్ధిపై పెట్టడం వల్ల ఇటు ఆదాయ, సంపదల్లో అసమాన తలు పెరిగినప్పటికీ అదే పంథాను అనుసరించాలా అన్నది మరో ప్రాథమిక ప్రశ్న. 1960 – 80ల మధ్య పై శ్రేణిలోని 10 శాతంతో పోలిస్తే, దిగువనున్న 90 శాతం మంది గణనీయంగా వృద్ధి సాధించారు. ఆర్థికసరళీకరణ అనంతరం మాత్రం మిగతా జనాభా కన్నా అగ్రశ్రేణి వర్గమే పైకెదిగింది. ఇక, 2014–2022 నడుమ దిగువ 50 శాతంతో పోలిస్తే, మధ్య 40 శాతం జనాభా వృద్ధి నిదానించింది. అగ్రస్థాయి 10 శాతం వారి పురోగతేమో ఆపలేని వేగం అందుకుంది. ధనిక, పేద తేడాకు ఇది ప్రధాన కారణం. మొత్తానికి గత దశాబ్దిన్నరలోనే అసమానతలు హెచ్చాయనేది నిర్వివాదాంశం. శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిందనే వాస్తవాన్ని గుర్తిస్తే... ఆర్థిక వ్యత్యాసాల్ని చక్కదిద్దడానికి తాజా పత్ర రచయితలు చేసిన కొన్ని విధాన సూచనల్ని కొట్టిపారేయలేం. సంపద పంపిణీ దృష్ట్యా చూస్తే, పేదలతో పోలిస్తే ధనికులు తక్కువ పన్నులు కట్టే ఇప్పటి విధానంలో మార్పు తేవాలి. ఆదాయం, సంపదలు రెంటినీ పరిగణించేలా పన్ను షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించి, భారత్‌లోని బిలియనీర్ల పైన సూపర్ ట్యాక్స్ విధించాలని వారు సూచిస్తున్నారు. అలాగే, బీదాగొప్ప తేడాల్ని తగ్గించేందుకు వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలపై దృష్టి సారించాలి. స్వల్పకాలిక వరాల కన్నా సుస్థిర, దీర్ఘకాల దారిద్య్ర నిర్మూలన పథకరచన సాగించాలి. సంక్లిష్టమైన ఈ వృద్ధి, దారిద్య్రం, ఆర్థిక అసమానత లాంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేయాలి. ప్రజాస్వామ్య భారతం ధనికస్వామ్యంగా మారితేనే కష్టం, నష్టం. -
రిచ్ సపోర్ట్ సిరీస్.. నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్!
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), తెలంగాణ గవర్నమెంట్ చొరవతో.. అక్టోబర్ 2023లో SAMARTHan@RICH పేరుతో 'నెలవారీ సపోర్ట్ సిరీస్' (Monthly Support Series) ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా మెడికల్ టెక్నాలజీ (మెడ్‌టెక్) ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి పుట్టుకొచ్చింది. SAMARTHan@RICH నెలవారీ సపోర్ట్ సిరీస్ ద్వారా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) అవగాహన & అప్లికేషన్ ప్రాసెస్, వైద్యుల నుంచి ఐడియా వ్యాలిడేషన్, ఉత్పత్తి అభివృద్ధి & వాణిజ్యీకరణ కోసం రెగ్యులేటరీ రోడ్‌మ్యాప్, క్లినికల్ ధ్రువీకరణ అధ్యయనాలను నిర్వహించడం వంటివి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు IP ఏజెన్సీల నిపుణులు వంటి అనుభవజ్ఞులైన వైద్యులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో స్టార్టప్‌ల ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. విజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా.. రెగ్యులేటరీ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేసుకోవచ్చు. వారి టెక్నాలజీలను మెరుగుపరచుకోవచ్చు. అంతే కాకుండా రోగుల జీవితాన్ని మార్చే పరిష్కారాలను వేగంగా అందించడానికి స్టార్టప్‌లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని RICH సీఈఓ 'రష్మీ పింపాలే' అన్నారు. ఐడియా వ్యాలిడేషన్, క్లినికల్ వ్యాలిడేషన్, రెగ్యులేటరీ గైడెన్స్‌పై సెషన్లతో ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. దీని ద్వారా ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా.. సంచలనాత్మక పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. SAMARTHan@RICH నెలవారీ ప్రాతిపదికలో పాల్గొనటానికి ఆసక్తి కలిగిన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. -
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
ధనవంతులకు ఫ్రీ పాస్లా..! : హర్ష్ గొయెంకా
న్యూఢిల్లీ: దేశమంతా వరల్డ్ కప్ ఫైనల్ సందడి నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తం భారత్-ఆసీస్ మ్యాచ్ ఫీవరే కనిపిస్తోంది. ఈ ఫీవర్ పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ట్వీట్‌ను నెటిజన్లు ఆయనకే బూమరాంగ్ చేసి రివర్స్ ప్రశ్నలేశారు. ఇంతకీ హర్ష్ గొయెంకా ఏమని ట్వీట్ చేశారంటే ‘ ప్రముఖ వ్యాపారస్తులైన నా స్నేహితులెవరూ డబ్బులు చెల్లించి ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనలేదు. వాళ్లందరూ ఫ్రీ పాస్‌లు తీసుకున్నారు. ఇక్కడ బాధేంటంటే ధనవంతులు డబ్బు చెల్లించడానికి ఇష్టపడకపోవడమే’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆయన ఫాలోవర్ ఒకతను ‘మరి మీ పరిస్థితేంటి సార్? టికెటా..పాసా..?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హర్ష్ గొయెంకా ఏదీకాదని సమాధానమిచ్చారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఒక్కోటి రూ. 2 లక్షల దాకా ప్రముఖ రీసెల్లింగ్ ప్లాట్‌ఫాంలో అమ్ముడవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో టికెట్ స్టార్టింగ్ ధర 32వేలుండడం విశేషం. భారత్, ఆసీస్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 ఇదీచదవండి...‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!
ప్రపంచంలో ఎలాన్ మస్క్, ఇండియాలో ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతులని అందరికి తెలుసు. అయితే వీరికంటే కూడా సంపన్న కుటుంబం ఒకటుందని నివేదికలు చెబుతున్నాయి తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది, ఎక్కడుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సౌదీలోని కింగ్ 'సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్' నేతృత్వంలో ఉన్న కుటుంబం అత్యంత సంపన్న కుటుంబం అని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కుటుంబంలో 15,000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. వీరికి చమురు నిల్వల నుంచి భారీగా సంపద వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో అత్యంత ధనవంతుడు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్.. ఆయన నికర విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు. అయితే కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తమ ఖచ్చితమైన నికర విలువను వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం విలాసవంతమైన అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1000 గదులు, సినిమా థియేటర్, అనేక స్విమ్మింగ్ పూల్స్ మరియు మసీదు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ రాజ కుటుంబం విలాసవంతమైన పడవలు, ఖరీదైన బంగారు పూతతో కూడిన కార్లు, ఖరీదైన దుస్తులు వినియోగిస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద ఉన్న అనేక లగ్జరీ క్రూయిజ్ షిప్‌లలో ఒక దాని విలువ సుమారు రూ. 400 మిలియన్ డాలర్లు. ఇంకా వీరు రెండు హెలిఫ్యాడ్స్, స్పోర్ట్స్ పిచ్ వంటి వాటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ విమానం బోయింగ్ 747-400 కలిగి ఉన్నారు. టర్కీ బిన్ అబ్దుల్లా ఏకంగా 22 మిలియన్స్ ఖరీదైన కార్లు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో అనేక అన్యదేశ్య మోడల్స్ అయిన లాంబోర్ఘిని అవెంటడోర్ సూపర్‌వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్, జీప్, బెంట్లీ మొదలైనవి ఉన్నాయి. -
డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది?
చాలామంది యువతులు తమ అభిరుచులను నెరవేర్చుకునేందుకు ధనవంతుడైన భర్త రావాలని కోరుకుంటుంటారు. ఇదేవిధంగా అమెరికాలో నివాసం ఉంటున్న ఇజీ అనాయా తన 7 ఏళ్ల వయసులో తను ఎలాగైనా ధనవంతుడి భార్యని కావాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె ముందున్న కల. ఆమె పెరిగి పెద్దయ్యాక ఈ కలను నెరవేర్చుకోవడానికి మార్గాలను అన్వేషించి, చివరికి విజయం సాధించింది. నేడు ఆమె ఒక ధనవంతునికి భార్యగా మారి, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రతిరోజూ ఉదయం ఆమె జిమ్‌కి వెళ్లే ముందు తన తన పిల్లలను అత్యంత ఖరీదైన జీపు రాంగ్లర్ రూబికాన్‌లో ఎక్కించుకుని, వారిని స్కూల్లో దింపుతుంది. ఆమె ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తరచూ షాపింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ విలాసవంతమైన భోజనాల కోసం ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తుంది. ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని పలు రహస్యాలను బయటపెట్టింది. బ్రూక్లిన్‌లో నివాసముంటున్న అనాయాకు ప్రస్తుతం 43 ఏళ్లు. ఆమె కేటర్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ‘నేను నా జీవనశైలి గురించి నా 7 సంవత్సరాల వయస్సులోనే కలలుగన్నాను. నా చిన్నతనంలో ధనవంతులైన ఆడవాళ్లను చూసినప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా వాళ్లలా మారాలి అని అనుకునేదాన్ని. ఎలాగైనా అలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించేదానిని. నా 33 ఏళ్ల వయస్సులో ఈ కల నెరవేరింది. నేను అనుకున్నవన్నీ నిజం అయ్యాయి’ అని తెలిపింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం అనయ ఒక ధనవంతుడిని తన ‘షుగర్ డాడీ’గా మార్చుకుంది. యూరోపియన్, అమెరికన్ దేశాలలో డేటింగ్లో వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఇది. తమ అవసరాలను తీర్చుకునేందుకు కాలేజీకి వెళ్లే యువతులు ధనవంతులతో డేటింగ్ చేస్తారు. ఇందుకు బదులుగా వారు ఆ ధనవంతుల నుంచి డబ్బు, బహుమతులను పొందుతారు. ఈ విధంగా వచ్చిన సొమ్ముతో వారు తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు. అయితే అనాయా విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. దీని గురించి అనాయా మాట్లాడుతూ ‘నేను నా షుగర్ డాడీని 10 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో కలిశాను. మేము దాదాపు ఆరు నెలల పాటు డేటింగ్ చేశాం. ఆ తర్వాత వివాహం చేసుకున్నాం. ఈ రోజు నేను అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పింది. అదేవిధంగా ఆమె టిక్‌టాక్‌లో తన కథను వివరించింది. ‘నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. తరువాత మా పిల్లలను పాఠశాలకు తీసుకువెళతాను. అనంతరం నేను జిమ్‌కి వెళ్తాను. నాకు నచ్చినది ఏదైనా వెంటనే కొంటాను. ఎంత ఖరీదు అయినా వెనుకాడను. మా దగ్గర డబ్బుకు లోటు లేదు కాబట్టి నాకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. మేము ప్రతి వారాంతంలో పారిస్ లాంటి విలాసవంతమైన ప్రదేశాలలో గడుపుతాం. నేను పుట్టుకతో ధనవంతురాలిని కాదు. పేద కుటుంబంలో పుట్టారు. నాకు కార్పొరేట్ ప్రపంచానికి చెందిన కొందరి నుండి సాయం లభించింది. దీంతో నేను అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందాను. అయితే నేను దీని కోసం నేను నా స్నేహితులకు దూరం కావాల్సి వచ్చింది. నేను మాన్హాటన్కు వెళ్లి, కార్పొరేట్ ప్రపంచంలో పని చేయడం మొదలుపెట్టాను. స్వచ్ఛంద కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లాను. అప్పుడే నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను అతనిని నా ‘షుగర్ డాడీ’గా మార్చుకున్నాను. మనం ఎలా జీవించాలనుకుంటున్నామో, అలా మనల్ని మనమే నిలబెట్టుకోవాలి’ అని తెలిపింది అనాయా. ఇది కూడా చదవండి: గాంధీ హత్య కుట్రను వంటవాడు ఎలా భగ్నం చేశాడు? -
లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు
ఆ జంటకు లాటరీ తగలడంతో వారిద్దరూ ఆ సొమ్మును ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేస్తూ, ఎంజాయ్ చేశారు. ఇంతలో వారికి వచ్చిన ఒక ఈమెయిల్ వారి జీవితాలను దుర్భరం చేసింది. తమకు లాటరీలో £1.8 మిలియన్(18 కోట్లు) వచ్చిన విషయం, ఆ తరువాత భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తమను ఎలా విడదీసినదీ ఆ మహిళ తెలిపింది. భారీ మొత్తంతో ఇల్లు కొనుగోలు రోజర్, లారా గ్రిఫిథ్స్లు 2005లో నేషనల్ లాటరీలో జాక్‌పాట్ కొట్టారు. ఆ సొమ్ములోని కొంత మొత్తంతో వారు ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఎంజాయ్ చేసేందుకు మిగిలిన మొత్తం ఖర్చు చేశారు. దీంతో వెనక్కి తిరిగిచూసుకుంటే తమ దగ్గర అస్సలు డబ్బులు మిగలలేదని లారా తెలిపింది. చాలామంది మాదిరిగానే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దుబాయ్‌లో ఎంజాయ్ లాటరీ సొమ్ము అందిన కొన్ని వారాలకు రోజర్£18,000తో సాఫ్ట్-టాప్ ఆడీ కొనుగోలు చేశాడు. లారా తాము దుబాయ్‌లో ఎంజాయ్ చేసేందుకు, బిజినెస్ క్లాస్‌లో విమాన ప్రయాణం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసింది. ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రోజర్ మాట్లాడుతూ తాము 10 రోజుల్లో £15,000 ఖర్చు చేశామని తెలిపారు. ఆమెకు హ్యాండ్ బ్యాగ్లన్నా, షాపింగ్అన్నా ఇష్టమని అన్నారు. దంతాలను తెల్లగా మార్చుకునేందుకు.. డైలీస్టార్ తెలిపిన వివరాల ప్రకారం రోజర్ తన దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ఖర్చు చేశాడు. కూల్‌గా కనిపించేందుకు డిజైనర్ దుస్తులు కొనుగోలు చేశారు. బొటెక్స్ కోసం ఒకసారి £300 ఖర్చు చేశాడు. టాటూల కోసం £500కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడు. లాటరీ గెలుచుకున్న ఎనిమిదేళ్ల తరువాత అంటే 2013 నాటికల్లా వారి దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. వారి అనుబంధం కూడా ముగిసింది. రోజూ విలాసవంతమైన పార్టీలు 14 ఏళ్ల పాటు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. తమ ఆర్థిక దుస్థితికి కారణం నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపించుకున్నారు. లారా మాట్లాడుతూ లాటరీ గెలుచుకున్న తరుణంలో తమ మధ్య వివాదాలు లేవన్నారు. తాము రోజూ పార్టీలు చేసుకునేవారమన్నారు. ఆనందంగా కాలం గడిపామన్నారు. అయితే డబ్బును ఎలా కాపాడుకోవాలో తమకు తెలియలేదన్నారు. బూడిదైన భవనం.. భారీగా నష్టం తాము లాటరీ సొమ్ములోని £670,000తో నార్త్ యార్క్‌షైర్‌లో కొనుగోలు చేసిన భవనం 2010లో కాలి బూడిదయ్యిందన్నారు. తాము ఆ ఇంటికి తక్కువ మొత్తానికే బీమా చేయించామన్నారు. ఆ సొమ్ము వచ్చినప్పుడు తన భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తాను చూశానని లారా తెలిపింది. దానిలో భర్త అతని స్నేహితుడిని మరో యువతి ఫోన్ నంబర్ అడిగినట్లు ఉందన్నారు. అదే తమ జీవితాలను దుర్భరం చేసిందన్నారు. తాను తన భర్త అతని స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణను గమనించానని లారా పేర్కొన్నారు. తన భర్త ఒక యువతి ఫోన్ నంబర్ అడిగిప్పుడు అతని స్నేహితుడు ఆమెతో ఎంజాయ్ చేసేందుకు భర్తకు సలహాలు ఇచ్చాడని లారా తెలిపింది. దూరమైన భర్త దీనిని తాను గమనించానని తెలిసినా తన భర్త తనను క్షమాపణలు కోరలేదని, పైగా అతని బ్యాగు సద్దుకుని, తనపై అరుస్తూ, తనను నిందిస్తూ వెళ్లిపోయాడని లారా తెలిపింది. తరువాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని, ఫేస్బుక్లో అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించగా తనను బ్లాక్చేశాడని లారా తెలిపింది. వారం రోజుల పాటు అతనిని ద్వేషించానని, ఆ తరువాత అతనిని మనసులోనే క్షమించేశానని, ఎందుంటే అతనిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని లారా పేర్కొంది. ఇది కూడా చదవండి:‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు.. -
అంబానీ.. అదానీ ఓకే.. మరి మనం?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఓసారి మస్క్ అని మరోసారి మరొకరని.. ఒకదాంట్లో అంబానీ టాప్ అని.. మరొకదాంట్లో అదానీ అని.. ఇలా అత్యంత కుబేరుల జాబితాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.. ఇంతకీ దేశంలో టాప్ 1 శాతం రిచెస్ట్ జాబితాలో చేరాలంటే.. ఎంత సంపద ఉండాలో మీకు తెలుసా? తెలియదు కదా.. అందుకే ఆ పనిని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ చేసిపెట్టింది. వివిధ దేశాల్లో టాప్ 1 శాతం ధనవంతుల జాబితాలో చేరాలంటే.. వ్యక్తిగత నికర సంపద కనీసం ఎంత ఉండాలి(కటాఫ్ మార్క్) అన్న వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత నికర సంపద(అప్పులన్నీ తీసేయగా మిగిలినది) కనీసం రూ.1.4 కోట్లు ఉంటే చాలు.. మీరు మన దేశంలోని 1 శాతం ధనవంతుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చినట్లే. ప్రపంచంలో ధనికులు ఎక్కువగా ఉండే మొనాకోలో ఇది రూ.102 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మొనాకోదే ఫస్ట్ ప్లేస్. చదవండి: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్మెంట్! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ -
ప్రైవేట్ జెట్ ఉన్న ఈ టాప్ బిలియనీర్ల గురించి తెలుసా? (ఫొటోలు)
-
16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ..
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసేందుకు తన కారును అమ్ముకోవాల్సివచ్చింది. అయినా అతను బాధపడలేదు. ఎందుకంటే తన కల నెరవేర్చుకునేందుకు కారు అమ్మడం అతనికి తప్పనిసరి అయ్యింది. ఇప్పుడతను తన బిజినెస్ కారణంగా ఏటా 10 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.103 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించి.. బ్రిటన్‌కు చెందిన 40 ఏళ్ల రాబ్డెన్స్ జీసీఎస్సీ పూర్తి చేసిన తరువాత స్కూలుకు వెళ్లడం మానివేశాడు. బిజినెస్ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. డైలీ స్టార్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రుల గ్యారేజీలో ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించాడు. ఇందుకోసం రాబ్డెన్స్ 2008లో తన కారును వెయ్యి పౌండ్లకు అమ్మేశాడు. ఇప్పుడతను పెద్ద ఐటీ కన్సల్టెన్సీ కంపెనీకి సీఈఓ. ‘ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని’ ఈ కంపెనీలో వందమందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఈ కంపెనీని నెలకొల్పి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాబ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాబ్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను స్కూలు చదువులో ప్రతిభ చూపలేకపోయేవాడిని. అయితే ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని. ఏ పరికరం ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడిని. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు నాతో పాటు ఒకరు ఉండేవారు. అతను అడ్మిన్‌తోపాటు అకౌంట్స్ చూసుకునేవాడు. 18 నెలలకే మా సంస్థలో 10 మంది సిబ్బంది ఉండేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మా వ్యాపారం అభివృద్ధిదాయకంగా ముందుకుసాగింది. ప్రస్తుతం మేము 10 మిలియన్ పౌండ్లకు పైగా బిజినెస్ చేస్తున్నాం. వ్యాపారరంగంలో మేము ఇంతలా రాణించిన నేపధ్యంలో పలు పురస్కారాలు అందుకున్నాం’ అని అన్నారు. -
ఎంతటి సంపన్నుడయినా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా?
మోసం... సాధారణంగా ఇది నమ్మకాన్ని ఆనుకుని ఉంటుందేమో! అందుకే నమ్మిన వ్యక్తులనే ఎదుటివారు నయవంచన చేస్తుంటారు. మోసాలకు పాల్పడేవారు ఎదుటివారి మానసిక బలహీనతలను ఉపయోగించుకోవడం ద్వారా ఎంతటి తెలివితేటలు కలిగినవారినైనా ఇట్టే బురిడీ కొట్టిస్తారు. నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ఎంతటి సంపన్నులైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లెక్కకు అందనంత బిలియన్ డాలర్లకు సంబంధించిన మోసాల వార్తలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్, ఎఫ్‌టీఎక్స్ (బహామాస్-ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్) వ్యవస్థాపకుడు. ఈయన తన కంపెనీ పెట్టుబడిదారులుగా ప్రముఖులను ఆకర్షించి, వారి చేత పెట్టుబడులు పెట్టించారు. ఈ ప్రముఖుల జాబితాలో టామ్ బ్రాడీ, స్టెఫ్ కర్రీ, నవోమి ఒసాకా, లారీ డేవిడ్, కెవిన్ ఓ లియరీ తదితరులు ఉన్నారు. బిలియనీర్ అయిన బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సామ్రాజ్యం నవంబర్ 2022లో కూలిపోయింది. ఇప్పుడు ఎఫ్‌టీఎక్స్ దివాలా కంపెనీ. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మోసానికి సంబంధించిన పలు కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఎలిజబెత్ హోమ్స్ చేసిన పని ఇదే.. ఇదే కోవలోనే ఎలిజబెత్ హోమ్స్ కథ కూడా ఉంటుంది. హోమ్స్ అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా పేరొందింది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె నికర విలువ ఆస్తుల $4.5 బిలియన్లు. ప్రస్తుతం పనిచేయని ఆమె సంస్థ థెరానోస్‌లో ఆమె 50% వాటా కలిగివుంది. థెరానోస్ కంపెనీ పెట్టుబడిదారుల జాబితాలో రూపర్ట్ ముర్డోక్, వాల్టన్ కుటుంబంతో సహా ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు కనిపిస్తాయి. 2022లో ఆమెపై వచ్చిన ఆరోపణలలో దోషిగా తేలిన నేపధ్యంలో ఆమె యూఎస్ నుండి పారిపోయే ప్రయత్నంలో హోమ్స్ మెక్సికోకు వన్-వే టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు కోర్టు వెల్లడించింది. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్,హోమ్స్లు తెలివైనవారిని ప్రముఖులను ఎలా మోసం చేశారు? వీరు నైపుణ్యం కలిగిన మోసగాళ్ల మాదిరిగానే, ఎదుటివారి భావోద్వేగాలను, వారి అవసరాలను ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి. భిన్నమైన వ్యక్తిత్వాలను గుర్తించి.. ఇలా మోసపోతున్న బాధితుల జాబితాలో అమాయకులు, వయసుపైబడినవారు సాధారణంగా కనిపిస్తారు. మోసాలకుగురయిన బాధితుల డేటా భిన్నమైన వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది. ఇది చాలా నిశితంగా పరిశీలిస్తేనే అవగతమవుతుంది. దీనిపై పరిశోధకులు చేపట్టిన పరిశోధనలలో అధునికులు, బాగా చదువుకున్నవారు, యువకులందరూ స్కామ్‌లకు గురవుతారని వెల్లడయ్యింది. మోసగాళ్ళు నిర్దిష్ట జనాభాను తమ లక్ష్యంగా చేసుకుంటారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగర్భం.. లోపల ఏముందో చూసేసరికి.. మితిమీరిన నమ్మకంతోనే.. దుర్బలత్వంతో కూడిన మితిమీరిన నమ్మకమే మోసాలకు ప్రధాన కారకం అని కూడా పరిశోధనలో కనుగొన్నారు. ఒక రంగంలో అత్యధిక విజయాలు సాధించిన వారి సామర్థ్యం మరో రంగంలో వీక్‌గా ఉండటాన్ని మోసగాళ్లు గ్రహిస్తారు. ఉదాహరణకు బెర్నీ మాడాఫ్.. ఆర్థిక నిపుణులు కాని సంపన్నులను, బాగా చదువుకున్న వృత్తిపరమైనవారిని సులభంగా మోసం చేశారని పరిశోధనలో తేలింది. చాలామంది విపరీతమైన నమ్మకం కారణంగానే స్కామ్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. దీనికి ఉదాహరణ లాటరీ విజేతలు వీరే నంటూ వచ్చే ప్రకటనలు. ఇవి ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా చాలామంది వీటి బారిన పడి మోసపోతుంటారు. సాధారణంగా మోసగాళ్లు ఇతరులలో భవిష్యత్ భయం వంటి బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తారు. దీంతో మోసగాళ్ళు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. దీంతో వారు ఎదుటివారిలో తమపై మరింత నమ్మకం కలిగేలా వాతావరణం సృష్టిస్తారు. సెలబ్రిటీలు- సామాజిక గుర్తింపు సోషల్ ప్రూఫ్ అనేది మనస్తత్వవేత్త రాబర్ట్ సియాల్డిని రూపొందించబడిన పదం. వినియోగదారులు.. ఇతరులు ఏమి చేస్తున్నారో తెలుసుకుని, దానికి ప్రతిస్పందనగా తాము ఏమి చేయాలనేది నిర్ణయించుకుంటారు. దీనినే సోషల్ప్రూప్ అనవచ్చు. సెలబ్రిటీలు తమ సామాజిక గుర్తింపును ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. పలువురు ప్రముఖులు ఆధునిక సాంకేతికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఉత్పత్తి లేదా సేవల ప్రభావంపై అమితమైన నమ్మకం కలిగివుంటారు. క్రిప్టోకరెన్సీ బారినపడి.. అక్టోబర్ 2022లో కిమ్ కర్దాషియాన్.. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను ప్రచురించినందుకు $250,000 చెల్లించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఆమె యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి $1.26 మిలియన్ సెటిల్మెంట్ చెల్లించడానికి అంగీకరించారు. ఆమె నెలకొల్పిన సంస్థ ఎథేరియం మ్యాక్స్ బారినపడి సెలబ్రిటీలు మడోన్నా, జస్టిన్ బీబర్, డీజే ఖలీద్, పారిస్ హిల్టన్, గ్వినేత్ పాల్ట్రో, స్నూప్ డాగ్, సెరెనా విలియమ్స్, జిమ్మీ ఫాలన్లు మోసపోయారని తేలింది. అప్రమత్తతతో నేరాలకు అడ్డుకట్ట పలు పరిశోధనల ప్రకారం మోసగాళ్ల కోణం నుండి చూస్తే ఆర్థికంగా దిగువస్థాయిలో ఉన్నవారి కంటే ధనవంతులను లేదా సంస్థలను మోసం చేయడం చాలా సులభం. నిపుణులు మోసాలకు గురైన వారిని ఇంటర్వ్యూ చేయగా వారు ‘బ్రాండ్’కు అమితంగా ప్రభావితమయ్యారని, మోసపోయినా వారు బహిర్గతం చేయడానికి, అవమానాన్ని ఎదుర్కొనేందుకు, లేదా నేరాన్ని నివేదించడానికి ఇష్టపడటం లేదని తేలింది. సోషల్ మీడియా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడి మోసాలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో నిపుణులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి ఎందుకు పంపిస్తున్నారంటే.. -
11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ..
సాధారణంగా 11 ఏళ్ల చిన్నారులు వీడియో గేమ్స్ ఆడటం, చదువుకోవడం లేదా ఏదో ఒకటి తింటూ కనిపిస్తారు. అయితే ఆ చిన్నారి వీరందరికీ భిన్నంగా ధనవంతుల మాదిరిగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ చిన్నారి కోట్లకు అధిపతి. వ్యాపారంలో విజయం సాధించింది. ఈ చిన్నారి పేరు పీక్సీ కర్టీస్. ఆమె స్థాపించిన కంపెనీ పీక్సీ ఫిడ్గెట్స్.. పిల్లల బొమ్మలను, దుస్తులను విక్రయిస్తుంటుంది. పీక్సీ చైల్డ్ ఇన్ఫ్లుయెన్సర్గానూ పేరు పొందింది. ఆ చిన్నారి సోషల్ మీడియా అకౌంట్‌ను ఆమె తల్లి రాక్సీ హ్యాండిల్ చేస్తుంటుంది. ది సన్ రిపోర్టును అనుసరించి పీక్సీ రూ. 72 కోట్లకుపైగా ఆస్తికి యజమాని. ఆ చిన్నారి తన 15 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంది. యూరప్‌కు ప్రైవేట్ జెట్‌లో విహారయాత్రలు చేసేందుకు వెళ్లింది. పెద్దవారి మాదిరిగా చర్మ సౌందర్యం కోసం అనేక ట్రీట్మెంట్లు తీసుకుంటోంది. ఆమె దగ్గర పలు లగ్జరీ వాహనాలు ఉన్నాయి. పీక్సీ ఇన్‌స్టాగ్రామ్‌కు 1,36,000కు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. పీక్సీ తల్లి కూడా ఇదేవిధమైన లగ్జరీ లైఫ్ గడుపుతోంది. ఆమె తన కుమార్తె కోసం 193,000 పౌండ్లు (సుమారు రెండు కోట్లు) వెచ్చించి కార్లు కొనుగోలు చేసింది. వీటిలో 43 వేల పౌండ్లు(సుమారు 44 లక్షలు) విలువైన మెర్సిడీస్ బెంజ్ కారు కూడా ఉంది. రాక్సీ తన కుమార్తె గురించి మాట్లాడుతూ తన కుమార్తె అన్ని పనులకు ఈ కార్లను వాడదని, తన సోదరునితో పాటు స్కూలుకు వెళ్లేందుకు, ఇతర ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఈ కార్లను వాడుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో పీక్సీ గురించిన కథలనాలను చూసిన యూజర్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ ఆ చిన్నారి ఎప్పుడూ ఫోను చూస్తూనే కనిపిస్తుందని అన్నారు. మరో యూజర్ 11 ఏళ్ల చిన్నారికి ఇంజక్షన్ ప్లాంపర్ అవసరం ఏముందని, ఆమె పెద్ద అయ్యాక అందం కోసం వివిధ థెరపీలు చేయించాల్సి ఉంటుందన్నారు. ఇంకొక యూజర్ 11 ఏళ్ల చిన్నారికి 3 వేల డాలర్ల విలువైన బ్యాగ్ ఇవ్వడం తగినది కాదన్నారు. ఇది కూడా చదవండి: సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్‌గా షార్క్ దూసుకురావడంతో.. -
రిచ్ కిడ్స్: అంబానీ కొడుకులు, కూతురు ఏం పని చేస్తారు.. ఎంత సంపాదిస్తారు?
దేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం.. ముఖేష్ అంబానీ కుటుంబం. ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఉత్సాహంగా పనిచేస్తూ కుటుంబానికి విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారి పిల్లలు అంటే ఇద్దరు కొడుకులు, కూతురు ఏం పని చేస్తున్నారు.. వ్యక్తిగతంగా ఎంత సంపాదిస్తున్నారన్నది ఆసక్తికరం. రిలయన్స్ గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి తన పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ఉన్నత చదువులు చదివారు. వారి తండ్రి, తాతలను అనుసరించి వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వారు రిలయన్స్ గ్రూప్‌లో ముఖ్యమైన విభాగాలను చూసుకుంటున్నారు. ఆకాష్ అంబానీ ఆకాష్ అంబానీ యూఎస్ఏలోని రోడ్ ఐలాండ్‌లోని ప్రతిష్టాత్మక బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. వ్యాపారం విషయానికి వస్తే తన తండ్రిని అనుసరించారు. ఆకాష్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఉన్నారు. ఇందులో టెలికాం సేవలు, జియో సినిమా ఉన్నాయి. ఆకాష్ అంబానీ జీతం ఎంత అనేది వెల్లడించనప్పటికీ, ఆయన నెలవారీ జీతం దాదాపు రూ. 45 లక్షలు ఉంటుందని అంచనా. ఇషా అంబానీ సోదరుడు ఆకాష్ అంబానిలాగే ఇషా అంబానీ కూడా వ్యాపారంలో మెలకువలు సాధించింది. ఆమె శిక్షణ పొందిన బిజినెస్ అనలిస్ట్ అలాగే సలహాదారు. యూఎస్‌లోని అగ్రశ్రేణి సంస్థలో కొంతకాలం పనిచేసిన తరువాత ఇషా అంబానీ తన తండ్రి వ్యాపారంలో చేరారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డివిడెండ్ లాభాలతో కలిపి ఇషా అంబానీ నెలవారీ జీతం రూ.35 లక్షలు ఉంటుందని అంచనా. అనంత్ అంబానీ ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు, ఆఖరి సంతానం అయిన అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఎనర్జీ వింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డు మెంబర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అంచనాల ప్రకారం.. అనంత్ అంబానీ నెలవారీ జీతం రూ. 35 లక్షలు. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
వాచీలు, హ్యాండ్ బ్యాగులు అంటే మక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అధిక ధనవంతుల్లో (రూ.250 కోట్ల, అంతకంటే ఎక్కువ) సగానికి పైనే ఈ ఏడాది వాచీలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, కళాకృతులను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. తద్వారా తమ అభిరుచులపై పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ రూపంలో వెల్లడించింది. పది రకాల విలాసవంతమైన ఉత్పత్తులపై పెట్టుబడులను నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) ఏటా ట్రాక్ చేస్తుంటుంది. 2022లో వీటిపై పెట్టుబడులు 16 శాతం పెరిగినట్టు తెలిపింది. ► అన్నింటికంటే కళాకృతులకు డిమాండ్ నెలకొంది. 2022లో వీటిపై రాబడులు 29 శాతంగా ఉండడం ఆసక్తికరం. ► క్లాసిక్ కార్లు (పాతం కాలం నాటి) 25 శాతం రాబడులతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ స్థాయి రాబడులు 9 ఏళ్ల కాలంలోనే అధికం కావడం గమనార్హం. ఉదాహరణకు మెర్సిడెజ్ బెంజ్ ‘ఉహ్లెన్‌హాట్ కూప్’ 2022లో 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. క్లాసిక్ కార్లలో ఇప్పటి వరకు గరిష్ట ధర పలికింది ఇదే కావడం గమనించాలి. ► గతేడాది లగ్జరీ వాచీల ధరలు 18 శాతం వృద్ధి చెందడంతో ఇవి మూడో స్థానంలో నిలిచాయి. ► లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, వైన్, జ్యుయలరీ రాబడుల పరంగా 5, 6, 8వ స్థానాల్లో నిలిచాయి. ► అరుదైన విస్కీ ధరలు 3 శాతం పెరిగాయి. కానీ, గత పదేళ్ల కాలంలో ఈ పది పెట్టుబడుల్లోనూ అరుదైన విస్కీ అత్యధికంగా 373 శాతం రాబడులతో మొదటి స్థానంలో నిలిచింది. -
దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!
సాధారణంగా డబ్బులు సంపాదించేందుకు ప్రజలు రకరకాల పనులు చేస్తుంటారు. అయితే అందులో కొందరు మాత్రమే సంపన్నులుగా మారుతారు. ఇలా మారడానికి వారికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే మనుషులు ఓకే గానీ జంతువుల కూడా వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నాయని తెలిస్తే షాక్ అవుతారేమో! అవునండి ఇది నిజం. ప్రస్తుతం మనం వందల కోట్ల ఆస్తులు ఉన్న ఓ పెంపుడు పిల్లి గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోని అత్యంత సంపన్న పెంపుడు జంతువుల జాబితాలో ఒలివియా బెన్సన్ అనే పెంపుడు పిల్లి మూడవ స్థానంలో ఉందట. అంత మొత్తం ఆ పిల్లి ఎలా సంపాదించిందని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. విపరీతమైన క్రేజ్, ఒక్కో పోస్ట్‌కు లక్షలు ప్రఖ్యాత అమెరికన సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం పాటల పరంగానే కాకుండా ఇటు సోషల్‌మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 240 మిలియన్లు ఉండడమే అందుకు నిదర్శనం. టేలర్ తన ఇన్‌స్టా అకౌంట్లో తన ఫోటోలతో పాటు తరుచు తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్కు సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ వచ్చేది. దీంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆ పిల్లి వీడియోను చూడటంతో పాటు లైక్, షేర్ చేయడం చేయడం మొదలుపెట్టారు. ఈ నేఫథ్యంలో దానికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అలా కాలక్రమేణ ఆ పిల్లి ఫోటోలు, వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. అలా దాని ఫోస్ట్లకు వచ్చిన వ్యూస్ బట్టి అది కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. రోలింగ్ స్టోన్స్ నివేదిక ప్రకారం ఆ పిల్లి సంపద అంచనా విలువ $97 మిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 800 కోట్లు). ఇన్స్టాగ్రామ్ డేటాను ఉపయోగించి ఒలివియా విలువను లెక్కించిన ఆల్ అబౌట్ క్యాట్స్ అనే వెబ్సైట్ ఈ జాబితాను రూపొందించింది. View this post on Instagram A post shared by Taylor Swift (@taylorswift) చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
రెండు దేశాల భారత్
ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. క్షీరసాగర మథనంలో కొందరికే అమృతం దక్కినట్టు స్వాతంత్య్ర ఫలాలు కూడా కొందరికే దక్కాయి. దేశం పేదది కాకపోయినా దేశంలో ఇంకా పేదవాళ్లున్నారు. విలువలకు పేరున్న దేశమైనా కులాల అసమానతలున్నాయి. అందుకే ఈ దేశంలోని వైవిధ్యాలనే కాదు, వైరుద్ధ్యాలనూ తరచి చూసుకోవాలి. జనాల మధ్య అంతరాలను తగ్గించడం ద్వారానే ఈ దేశాన్ని ఒక్కటిగా చేయగలం అని గుర్తించాలి. క్షీర సాగర మథనం. సముద్రం నుంచి అమృతాన్ని వెలికితీసేందుకు ఇటు రాక్షసులు, అటు దేవతలు రెండు వర్గాలు కలిసి శ్రమించి, మంధర పర్వతంతో సముద్రాన్ని మథిస్తారు. అందులోంచి అనేక విశిష్ట వస్తువులు, మనుషులు, జంతువులు, అనంతరం విషం, చిట్టచివరకు అమృతం వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన కథే కావొచ్చు. కానీ నేడు ఇదే అత్యంత సందర్భోచితమైన అంశం. ఏ అమృతం కోసమైతే ఇరు వర్గాలు సమంగా శ్రమించాయో, దాని ఫలితాలు మాత్రం ఇరు పక్షాలకీ సమంగా అందలేదు. చావును శాశ్వతంగా తరిమికొట్టే అమృ తాన్ని దేవతలు చేజిక్కించుకుని, మరొక వర్గానికి మత్తులో ముంచెత్తే సురాపానం అంటగట్టారు. దేవతలు కదా ఏం చేసినా చెల్లుతుంది. మరో వర్గం కూడా అంతే శ్రమించినప్పటికీ అసలు ఫలితం దక్కక పోవడం కథలోని సారాంశం. అమృతం అందుకున్న వర్గం మరింత శక్తితో తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటూనే వచ్చింది. మరొక వర్గం కాలక్రమేణా దాడులకూ, దౌర్జన్యాలకూ గురై క్షీణించింది లేదా అధికారగణం చేతిలో బానిసలుగా మారిపోయింది. అసలు విషయానికొద్దాం. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మన భారత ప్రభుత్వం ఈ సంద ర్భాన్ని ‘అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవా లని నిర్ణయించింది. అందుకుగానూ గతేడాది మార్చి 12 నుంచి వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు 15, 2023 వరకు ఈ ఉత్సవాలను నిర్వ హిస్తోంది. ఈ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర ప్రయాణంలో పాల్గొన్న ప్రజలందరికీ ఈ ఉత్సవాలను అంకితం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 75 ఏళ్ల ఉత్సవాలు కాబట్టి అమృత్ మహోత్సవ్ అనే పేరు పెట్టారు కానీ, సరిగ్గా సరిపోయింది అది. అమృతం కోసం సాగర మథనంలో పాల్గొన్న అందరికీ అమృతం అందనట్టే స్వాతంత్య్ర ఫలాలు సైతం కొందరికే దక్కాయన్న విషయానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర పాలన మన దేశ ప్రజలకు అందించింది ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అణచివేత. గత 75 ఏళ్ళలో జరిగిన ఆర్థికాభివృద్ధి, సమకూరిన సంపద, అతికొద్ది మంది సంపన్నుల, ఆధిపత్య వర్గాలకే వెళ్ళి పోయింది. సమాజంలో సంపద సమష్టిగానే వృద్ధి చెందుతుంది. కానీ ఫలితాలు అందరికీ అందడంలో మాత్రమే తేడా ఉంటుంది. మన దేశంలోని కేవలం వందమంది కోటీశ్వరులు 57 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కలిగివున్నారని గ్లోబల్ రిపోర్టు తెలియజేసింది. అంటే ఇది భారతదేశ రెండు సంవత్సరాల ఆర్థిక బడ్జెట్‌కు సమానమని గుర్తించాలి. అదేవిధంగా 50 శాతం మంది జనాభా కేవలం 6 శాతం సంపదను కలిగి ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఒక సంవత్సరంలోనే, అది కూడా కోవిడ్ సమయంలోనే 102 మందిగా ఉన్న కోటీశ్వరులు(బిలియనీర్స్) 142కి పెరిగారు. మార్చి 2020 నుంచి, నవంబర్ 30, 2021 వరకు 23 లక్షల కోట్లు ఉన్న కోటీశ్వరుల సంపద 57.3 లక్షల కోట్లకు చేరినట్టు లెక్కలు చెబు తున్నాయి. అదే విధంగా కోవిడ్ సమయంలోనే ఇప్పటి వరకు ఉన్న పేదలకు అదనంగా, 4.6 కోట్ల మంది పేదరికంలోకి దిగజారి పోయారు. అదేవిధంగా భారత దేశానికి మరొక అవలక్షణం ఉన్నది. అదే కులం. భారత దేశంలో సమకూరిన సంపద కూడా కొన్ని కులాలకే పరిమితమైపోయింది. ఇదే విషయాన్ని నితిన్ కూర్ బర్తి అనే విద్యావేత్త, 1961 నుంచి 2021 వరకు చేసిన అధ్యయనంలో కులాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయనీ, మన దేశంలో ఉన్న ఆధిపత్య కులాలు ఆదాయంలోనూ ఖర్చులోనూ మిగిలిన కులాల కన్నా ముందు వరుసలో ఉన్నాయనీ తేల్చారు. ‘వెల్త్ ఇన్ ఈక్వాలిటీ క్లాస్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియా – 1962–2021’ అన్న ఈ పరిశోధనా పత్రాన్ని ఆయన ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు 2018లో సమర్పించారు. 2011లోని ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా ప్రకారం, ఒక ఎస్సీ కుటుంబానికి ఒక సంవత్సర ఆదాయం 89 వేలు ఉంటే, ఎస్టీ కుటుంబ వార్షికాదాయం 75 వేలు ఉంది. అదే ఓబీసీల్లో ఇది ఒక లక్షా నాలుగు వేలు. ఇక ఆధిపత్య కులాల్లో ఇది లక్షా 64 వేలు అని నితిన్ తేల్చారు. అదేవిధంగా సంవత్సర ఖర్చు ఎస్సీల్లో 87 వేలు, ఎస్టీల్లో 72 వేలు, ఓబీసీల్లో లక్షా ఎనిమిదివేలు, అగ్రకులాల్లో లక్షా 46 వేలుగా ఆయన లెక్కలు గట్టారు. సాధారణ ప్రజల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు మనకు ఈ లెక్కలు చెబుతున్నాయి. వీటితో పని లేకుండానే ఏ గ్రామం వెళ్ళినా ఈ తేడాలు మనకు వీధుల్లో దర్శనమిస్తాయి. దళిత కుటుంబాల్లో, వారి ఇళ్లల్లో ఈ విషయాలు అత్యంత స్పష్టంగా మనం గమనించొచ్చు. ఇదే విషయం ఇటీవల మరొక సర్వేలో తేలింది. క్రానిక్ పావర్టీ రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిగిన పరిశోధన ద్వారా ఇదే విషయం అక్షరసత్యమని రుజువయ్యింది. పేదరికం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వంగా కొందరికి మారిపోయిందని ఆ సంస్థ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. ఇది భారత దేశానికే పరిమితమైన పరిణామంగా ఆ సంస్థ పేర్కొన్నది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలు, దళిత వాడలు, ఆ వర్గాలకు చెందిన ప్రజలు పేదలుగానే పుట్టి, పేదలు గానే మరణిస్తూ, తమ పిల్లలకు సైతం పేదరికాన్నే వారసత్వంగా ఇచ్చి వెళుతున్నారని ఈ పరిశోధన అభిప్రాయపడింది. ప్రపంచంలో వందమంది పేదలుంటే అందులో 28 మంది మనదేశంలోనే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆకలితో అలమటించే భారత దేశ ప్రజల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం 18 కోట్ల మంది ఇంకా సరిౖయెన ఆహారం కూడా అందని స్థితిలో బతుకులీడుస్తున్నారని 2020 నివేదికలో పేర్కొన్నారు. ఇంకా మహిళల్లో ఆకలి బాధ తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ వయసు ఉన్న మహిళల్లో దాదాపు 51 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లల్లో 35 శాతం మంది సరిౖయెన ఎదుగదలను కలిగిలేరు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో మన ర్యాంకు 101 అని తేల్చారు. అయితే మన దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నదనుకుంటే పొరపాటే. బియ్యం, గోధుమల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. భారత రైతాంగం కష్టపడి పండించిన ఈ ధాన్యమంతా ఎఫ్‌సీఐ గోదాముల్లో పడి మూలుగుతోంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం, గడచిన ఐదేళ్ళలో 38 వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పుచ్చి, పురుగుల పాల య్యాయి. 2021 డిసెంబర్ నాటికి 213 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 378 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. కానీ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో ఇంకా ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వరి, గోధుమల లాంటి ఆహారధాన్యాలు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆకలితో కాలే కడుపునకు పిడికెడు అన్నం లేదు. ఇది భారత దేశ అమృతోత్సవ సంబరాల సత్యాలు. భారత దేశంలో క్షీరసాగర మథనం లాంటి సంప్రదాయాలే మనకు ఆద ర్శాలు. ఒక వైపు సంపద, మరోవైపు పేదరికం, ఒకవైపు ఆహార ధాన్యాల నిల్వలు పుచ్చిపోతోన్న స్థితి, మరోవైపు ఆకలితో మలమల లాడే కడుపులు. ఇన్ని సాక్ష్యాలున్నా ఇంకా మనది సమైక్య భారతమని అందామా? ముమ్మాటికీ అనలేం. ఇది వైరుద్ధ్య భారతం. ఇక్కడ ఒక్క భారతం లేదు. ఇవి రెండు భారతాలు. ఇంకా చెప్పాలంటే మరెన్నో భారతాలు. నిజానికి ఈ దేశం పేదది కాదు. ప్రజలే పేదవాళ్ళు. ఈ వైరుద్ధ్యాలు ఇప్పటికైనా మనకు అర్థం కాకపోతే, పరిణామాలు ఎవ్వరూ ఊహించలేరు. అమృతోత్సవాలు జరపడం కాదు, అందరికీ అమృతం అందించే గుణం కావాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...
టాంజానియా: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. టాంజానియాకి చెందిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఏదో లాటరీ తగిలి కాదు, రెండు పెద్ద రత్నాలను విక్రయించి ధనవంతుయ్యాడు. గనులు తవ్వే పని చేసుకుంటూ బతికే లైజర్ అనే వ్యక్తికి ముంజేయి పరిమాణంలో ఉండే రెండు రత్నాల రాళ్లు దొరికాయి. వీటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోలు (20.4 పౌండ్లు) కాగా, రెండవ దాని బరువు 5.103 కిలోలు (11.25 పౌండ్లు) ఉన్నాయి. ముదురు వైలెట్-నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతని వద్ద నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిని దేశంలోని ఉత్తరాన ఉన్న టాంజానిట్ గనులలో లైజర్ కనుగొన్నారు. (తెరుచుకున్న ఈఫిల్ టవర్.. కానీ) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి సైమన్ మ్సంజిలా మాట్లాడుతూ.. మిరేరానీలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్ రత్నాలను గుర్తించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని టాంజానియాలోని ఒక టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు. టాంజానియా సెంట్రల్ బ్యాంక్ అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన చెక్కు అందించిన సమయంలో దేశ అధ్యక్షుడు జాన్ మాగుఫులీ స్వయంగా ఫోన్ చేసి లైవ్‌లో అభినందించారు. మైనింగ్ చేసే వారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం గత ఏడాది దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. (అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం) -
ఆసియా కుబేరుడు అంబానీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కునెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 1.6 శాతం పెరిగి రూ.1,099.80 ఆల్‌టైమ్ హై స్థాయికి చేరింది. దీంతో అంబానీ సంపద 44.3 బిలియన్ డాలర్ల(దాదాపు 3.05 లక్షల కోట్లు)కు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. జాక్ మా సంపద విలువ 44 బిలియన్ డాలర్లు(3.03 లక్షల కోట్లు)గా ఉంది. ఈ ఏడాది ముకేశ్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లమేర పెరిగితే, జాక్ మా సంపద 1.4 బిలియన్ డాలర్లమేర హరించుకుపోయింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆ మచ్చికంతా నీడలోనే
అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఓ ధనికుడు. అతను ఖరీదైన ఓ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. ధనికుడు ఆ గుర్రాన్ని తనకున్న పచ్చికమైదానానికి తీసుకురమ్మని పనివాళ్ళను ఆదేశించాడు.ఆ తర్వాత ఆ పనివాళ్ళల్లో ఒకరిని వంతులవారీ దాని మీద ఎక్కి స్వారీ చేయమని చెప్పేవాడు.అయితే ఎవరు తన ముందుకు వచ్చినా ఆ గుర్రం తన ముందరి కాళ్ళను పైకెత్తి వారిని బెదరగొట్టి తరిమేసేది.ఎవరికీ లొంగేది కాదు.కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. ఆ పల్లెటూరుకి ఓ సూఫీ జ్ఞాని వచ్చాడు.ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న ధనికుడు ఆ జ్ఞానిని దర్శించుకున్నాడు. తాను కొన్న ఖరీదైన గుర్రం గురించి చెప్పాడు. అది మాట వినడం లేదని, మచ్చిక చేసుకునే మార్గం తెలియడం లేదని వాపోయాడు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో చెప్పవలసిందిగా కోరాడుధనికుడు చెప్పిన మాటలన్నీ విన్న సూఫీ జ్ఞాని సరేనని ఆ ధనికుడి ఇంటికి మరుసటి రోజు ఉదయమే వెళ్ళాడు.సూఫీ జ్ఞాని దగ్గరకు ఆ గుర్రాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అది మేలుజాతి గుర్రమనీ, ఒక్కసారి మచ్చికవుతే చాలు అది సులువుగా దగ్గరవుతుందని, దాని తెలివితేటలు అపారమనీ జ్ఞానికి అర్థమైపోయింది. జ్ఞాని సమక్షంలో ఓ నౌకరు ఆ గుర్రం మీద ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఆ గుర్రం అతనిని అది ఎప్పటిలాగే ముందర కాళ్ళతో బెదిరించి తరిమేసింది.అది గమనించిన జ్ఞానికి ఓ ఆలోచన వచ్చింది.దాన్ని తూర్పు ముఖంగా చూస్తున్నట్టు నిలబెట్టమన్నారు జ్ఞాని.అలా నిలబెట్టిన తర్వాత ఓ నౌకరుని దాని మీదకు ఎక్కి కూర్చోమన్నారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ గుర్రం ఏ మాత్రం తిరగబడలేదు. చక్కగా సహకరించింది.తన మీదకు ఎవరినీ ఎక్కించుకోవడానికి సహకరించని ఆ గుర్రం ఉదయం వేళల్లో తనకు వెనుకవైపు నుంచి వచ్చే సూర్యకిరణాలతో తన నీడా, తనపై ఎక్కడానికి ప్రయత్నించే వ్యక్తి నీడా భారీగా కనిపించడం వల్ల అది తెగ భయపడిపోయేది. ఈ విషయాన్ని గ్రహించిన జ్ఞాని తూర్పుముఖంగా దాన్ని నిలబెట్టమని చెప్పారు. ఇలా చేయడం వల్ల దాని నీడ దానికి వెనకాతలే పడడంతో దానికి మునుపటి భయం పోయింది. ఎవరు తన దగ్గరకు వచ్చినా ఏ మాత్రం తిరుగుబాటు చేయక అన్ని విధాలా సహకరించింది.ధనికుడికి ఆ గుర్రం మీద స్వారీ చేయాలన్న కోరికా తీరింది. జ్ఞానికి ధన్యవాదాలు తెలిపాడు. సమస్యెలా పరిష్కరించారని ధనికుడు అడగగా అంతా నీడలోనే ఉందని చెప్పి ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు. – యామిజాల జగదీశ్ -
దేశంలో కుబేరులు మరింత పెరిగారు
ముంబై: దేశీయంగా సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2017లో అత్యంత సంపన్న కుటుంబాల సంఖ్య 1.60 లక్షల పైకి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. అయితే, వీరి ఉమ్మడి సంపద మాత్రం సుమారు అయిదు శాతమే వృద్ధి చెంది.. రూ. 153 లక్షల కోట్లుగా నమోదైంది. కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ తరఫున అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు రూ. 25 కోట్ల పైగా సంపద ఉన్న కుటుంబాలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే అయిదేళ్లలో సంపన్న కుటుంబాల సంఖ్య 3.30 లక్షలకు, నికర సంపద విలువ రూ. 352 లక్షల కోట్లకు చేరవచ్చని అధ్యయనంలో అంచనా వేశారు. -
దేశంలో అత్యంత ధనిక సీఎంలు వీరే...!
-
ఇళ్లు చూపే అంతరాలు
ముంబైలో మురికివాడల ఉనికిని చాలామంది గుర్తించనప్పటికీ నగర ఆర్థిక వ్యవస్థకు బాగా దోహదం చేస్తున్న పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోరాదు. నిజానికి మురికివాడలు లేకుంటే ముంబై స్తంభించిపోవచ్చు. విశ్లేషణ భూమ్మీద సంపన్నులు, పేదల మధ్య అంతరం మరీ కొట్టొచ్చినట్లు కనిపించే నగరం ఉందంటే అది ముంబైనే అని చెప్పాలి. దేశంలోనే అతి సంపన్నుడైన ముఖేష్ అంబానీ నివసిస్తున్న 27 అంతస్తుల నివాస భవనం ఇక్కడే ఉంది. 36 ఫ్లోర్లతో టెక్స్టైల్ టైకూన్ గౌతమ్ సింఘానియా నిర్మించిన భారీ భవంతీ ఇక్కడే ఉంది. అనిల్ అంబానీ 19 ఫ్లోర్ల భవనంలో ఉంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్ తన కుటుంబం కోసం తొమ్మిదంతస్తుల భవంతి నిర్మించుకున్నారు. ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా ఏడు ఫ్లోర్లతో కూడిన నివాసంలో కుటుంబంతో ఉంటున్నట్లు తెలిసింది. ఈ సామాజిక శ్రేణిలో ఉంటున్న ఇతరులకు కూడా అద్భుత భవనాలు ఉన్నాయి కానీ పైన చెప్పిన ఆకాశ హర్మ్యాలు వీరికిలేవు. ఈ సంపన్నుల సంపదపై లేక వారి డాంబికాలతో నాకు పేచీ లేదు. కానీ ఇదీ కొన్ని పోలికలకు తావిస్తోంది. నందన్ నీలేకని రాసిన ‘ఇమేజింగ్ ఇండియా: ఐడియాస్ ఫర్ ది న్యూ సెంచురీ’ పుస్తకంలో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా చెబుతున్న ధారవిలో ఉన్న తుక్కు, తోలు, రీసైక్లింగ్ పరిశ్రమ సంవత్సరానికి 1.7 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తోందని తెలిపారు. ఇది అంబానీ నూతన గృహ నిర్మాణానికి పెట్టినంత వ్యయానికి సమానమని అంచనా. ఈ ఆకాశహర్మ్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, కనిపించని గుడిసెలు ముంబైలో అధిక భాగంలో వ్యాపించి ఉన్నాయి. వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థతో అతి పెద్దనగరంగా ముంబైకి ఉన్న ప్రతిష్టను ఇది పలుచబారుస్తోంది. మురికివాడల శ్రమతో ముంబై ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న తోడ్పాటును ఆర్థికవేత్తలెవరూ అర్థం చేసుకోలేదు. మురికివాడలు లేకుంటే ముంబై నగరం స్తంభించిపోవచ్చు. మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ ముంబై నగరంలో 12.5 లక్షల గుడిసెల్లో 62 లక్షల మంది గుడిసెవాసులు ఉన్నట్లు తేల్చింది. 1995కి ముందునుంచీ నగరంలో ఉన్న గుడిసె వాసులకు ఉచితంగా గృహాలను కల్పిస్తామని మొదట్లో చెప్పారు. తర్వాత దానిని 2000 సంవత్సరం వరకు పొడిగించారు. ఇక్కడ చెప్పొచ్చే అంశం మురికివాడల ఉనికి, నత్తనడకన నడుస్తున్న వాటి పునరావాసం మాత్రం కాదు. మురికి వాడలు, గుడిసెవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఇక్కడ చర్చనీయాంశం. ఇటీవలే నగరంలోని అసల్ఫా మురికివాడ సుందరీకరణలో భాగంగా దాని వెలుపలి గోడలకు రంగులద్దారు. గుడిసెవాసుల జీవితాలకు కాస్త రంగులద్దడం అన్నమాట. కంటికి వికారంగా ఉండే వారి జీవితాలను పరోక్షంగా చిన్నచూపు చూసే చర్య ఇది. మురికివాడలకు వెలుపల ఉన్నవారు నగరంలో మురికివాడలు ఉన్నాయన్న విషయాన్ని నమ్మేందుకు కూడా ఇష్టపడరు. పైగా నగరాన్ని వృద్ధి చేయడంలో వారి పాత్రను గుర్తించాలని కూడా వీరు భావించరు. అనియత రంగంలో చాలాభాగం మురికివాడల నిర్వహణలోనే సాగుతోంది. మీ ఇళ్లలో పనిమనుషులు, మీ డ్రైవర్లు లాగే ఫైవ్ స్టార్ హోటల్స్‌లో వెయిటర్లు కూడా ఈ మురికివాడలకు చెందినవారే. చాలా సందర్భాల్లో వీరు నివసించే గుడిసెలు కుటుంబం మొత్తానికి కూడా 100 నుంచి 140 చదరపు అడుగులకు మించి ఉండవు. పునరావాసం కింద వీరికి కల్పిస్తున్న గృహాలు 225 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంటే వారు ఇంతవరకు నివసిస్తున్న నివాస ప్రాంతం ఇప్పుడు రెట్టింపు అవుతుం దన్నమాట. కానీ ఇవి కూడా వారికి అందటం కష్టమే. ఎందుకంటే వీరికి గృహాలను నిర్మించి ఇవ్వవలసిన బిల్డర్లు, డెవలపర్లు మురికివాడల్లో నిర్మాణ హక్కులను పొందడమే కాకుండా అనుమతించిన మేరకు గుడిసె వాసులు కాని వారికి ఇలా కట్టిన గృహాలను అమ్ముకుం టారు. దీనికి వీరు గుడిసెవాసులకు డబ్బు చెల్లిస్తారు. గత రెండు దశాబ్దాల్లో ఉచితంగా 1.7 లక్షల మందికి గృహ నిర్మాణ పథకాలు మంజూరయ్యాయి. వీటిలో 1,441 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. కానీ ఇవన్నీ అమలై ఉంటే నగర గృహ కల్పన విధానంపై ఇది ప్రభావం చూపి పేదలకు మెరుగైన జీవితాన్ని అందించే అవకాశముండేది. ఇప్పుడు ప్రభుత్వం గుడిసెవాసులకు 322 చదరపు అడుగులలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తలుస్తోంది. ఈ అదనపు స్థలంలో కుటుంబాలు కాస్త సౌకర్యవంతంగా ఉంటాయి. మొదట్లో 100–140 చదరపు అడుగుల్లో ఉన్న స్లమ్ యూనిట్లు తర్వాత పునరావాసంలో 225 చదరపు అడుగులకు పెరిగాయి. తర్వాత వీటిని 269 చదరపు అడుగులకు పెంచారు. ఈ పెంపుదల ప్రభుత్వం ఉదారంగా తీసుకున్నది కాదు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 322 చదరపు అడుగుల పరిమితిని విధించింది మరి. అందుచేత, భూమి లభ్యతపైనే ఇంటి పరిమాణం ఆధారపడుతుంది. ముంబైలో ఇళ్లలో 10 శాతం మాత్రమే సగం జనాభా ఉంటున్న మురికివాడల స్వాధీనంలో ఉన్నాయి. అందుకే ముంబైలో కొన్ని అతి భారీ భవంతులు ఉండగా మరికొన్ని బతకడానికి మాత్రమే సరిపోయే పరిమాణంలో ఉంటున్నాయి. చివరకు మురికివాడలకు దూరంగా ఉండే ప్లాట్లలోని వారు కూడా ప్రధానమంత్రి అవాస్ యోజన పథకంలో తలపెట్టనున్న పరిణామం కలిగిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
బిచ్చగాళ్లల్లో ఇద్దరు కోటీశ్వరులు
-
హైదరాబాద్‌లో రిచ్ బెగ్గర్స్..!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మెహదీపట్టణంలోని ఓ దర్గా వద్ద బిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు నవంబర్ 11న చర్లపల్లి ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈ బిచ్చగాళ్లలో చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఇద్దరి మహిళలను చూసి జైలు అధికారులు అవాక్కయ్యారు. దీంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కోట్లకు కోట్ల ఆస్తి ఉండి.. విదేశాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలని తెలుసుకోని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వివరాలు.. ఫర్జానా, రబియా బసీరా అనే మహిళలు గత కొద్దిరోజులుగా లంగర్ హౌస్‌లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తున్నారు. బాబా సూచనలతో.. హైదరాబాద్ ఆనంద్‌బాగ్‌కు చెందిన ఫర్జానా(50) ఏంబీఏ చదివింది. లండన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేసింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అయిన కుమారుడి దగ్గర ఉండేది. అనారోగ్యానికి గురైన ఫర్జానా. ఓ బాబాను సంప్రదించింది. వ్యాధి తగ్గాలంటే దేవుడి దయ ఉండాలని, దర్గా వద్ద భిక్షాటన చేయాలని సూచించడంతో ఈ వృత్తిని ఎంచుకుంది. తల్లిని వదిలించుకోవాలనే ఫర్జానా కొడుకు ఇలా చేశాడని జైలు అధికారులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల మోసం.. రబియా బసీరాకు అమెరికా గ్రీన్ కార్డ్ కూడా ఉంది. గతంలో అమెరికాలో టీచర్‌గా కూడా పనిచేసింది. నగరంలో కోట్లకు కోట్ల ఆస్తి ఉంది. బంధువులతో కలిసి ఉండాలని హైదరాబాద్‌లోనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోయాడు. తనకు అండగా ఉన్న కూతురు కూడా కన్ను మూసింది. కోడుకులు, బంధువులు మోసం చేసి ఆస్తి లాక్కొని ఒంటరిదాన్ని చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ ఇద్దరి బిచ్చగత్తెల స్టోరీ బిచ్చగాడి సినిమాను తలపిస్తోంది. -
పేదలా? సంపన్నులా..? ఫేసే చెప్పేస్తుంది బాసూ!!
టొరంటో: ఫేస్ రీడింగ్ గురించి తెలిసిందే. ఎదుటి వ్యక్తి ముఖకవళికల ఆధారంగా అతను ఏమనుకుంటున్నాడో చెప్పేయడమన్నమాట. అయితే అదే ముఖాన్ని చూసి ఓ వ్యక్తి సంపన్నుడా? నిరుపేదా? అనే విషయాన్ని కూడా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుటుంబ వార్షికాదాయం సగటున 75వేల అమెరికా డాలర్లు ఉండే వారిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ ఆదాయం 60వేల డాలర్ల నుంచి లక్షడాలర్ల వరకు ఉన్న కొంత మంది వ్యక్తుల ముఖచిత్రాలను వలంటీర్లకు చూపించారు. వారిలో ఎవరు పేదవారో, ఎవరు సంపన్నులో గుర్తించమన్నారు. 53 శాతం మంది కరెక్టుగా పేదవారిని, డబ్బున్న వారిని గుర్తించగలిగారు. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు అతని ముఖకవళికలు, తోటివారితో మెలిగే విధానంపై ప్రభావం చూపుతాయిని తేలింది. మన ముఖం మన అనుభవాలను, భావోద్వేగాలను ప్రదర్శిస్తుందని శాస్త్రవేత్తల్లో ఒకరైన నికోలస్ రల్స్ చెబుతున్నారు. అంతేగాక మనం ఎవరిని చూసినా మొదటగా వారి ముఖం చూస్తామని, మన మెదడులోని న్యూరాన్స్ మన ముఖ కవళికలను గుర్తించేలా చేస్తాయని ఆయన తెలిపారు. -
ధనిక, పేద తేడాతో వ్యవసాయ పన్ను!
రాష్ట్రాలను కోరిన ఆర్థిక సలహాదారు అరవింద్ న్యూఢిల్లీ: పేద, ధనిక రైతుల స్థితిగతులకనుగుణంగా రాష్ట్రాలు రైతులపై వ్యవసాయ ఆదాయ పన్ను భారం మోపాలని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. కేంద్రప్రభుత్వం రైతులపై ఆదాయపన్ను విధించకుండా రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని, అయితే రాష్ట్రాలు ఆ పన్ను వేయకుండా ఎవరూ ఆపలేరని అరవింద్ చెప్పారు. ఒకవేళ అలాంటి పన్ను విధించాలని రాష్ట్రాలు భావిస్తే ఆ నిర్ణయాధికారం, అవకాశాలు 29 రాష్ట్రాలకూ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ధనిక, పేద రైతులను గుర్తెరిగి పన్ను వేయాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యవసాయ ఆదాయంపైనా ఖచ్చితంగా పన్ను వేయాల్సిందేనని నీతి ఆయోగ్ సభ్యుడైన బిబేక్ డిబ్రోయ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అయితే, అలాంటి పన్నును కేంద్రప్రభుత్వం విధించబోదని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. వ్యవసాయ ఆదాయంపై పన్ను ప్రసక్తే లేదు: పనగరియా వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ప్రశ్నే లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను ఎలా విధిస్తామని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రోయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై శుక్రవారం సీఐఐ సదస్సు సందర్భంగా స్పందిస్తూ... దేశంలోని 80 శాతం గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయంతో ముడిపడ్డాయని పేర్కొన్నారు. -
తేనె పూసిన కత్తి అక్కరలేదు!
జెన్‌పథం ఆయన ఓ జెన్ గురువు. ఊరూరూ తిరుగుతూ తోచిన నాలుగు మంచి మాటలు చెప్పడం ఆయనకు ఇష్టం. ఆయన వెళ్ళే ప్రాంతంలో ఎవైరనా ఏైదనా తినడానికి ఇస్తే అది తిని ఆకలి తీర్చుకునే వారు. ఎప్పుైడనా తినడానికి ఏదీ దొరకకపోయినా బాధపడేవారు కాదు. ఉంటే తినడం లేదంటే పస్తు ఉండిపోవడం ఆయనకు మామూలే. ఒకరోజు ఓ ధనికుడు ఆయనను చూడటానికి వచ్చి - ‘‘అయ్యా! మీలాంటి ఓ గొప్ప జ్ఞానులు ఎందుకు ఉంటారు? మీకు నేనో ఆశ్రమం ఏర్పాటు చేస్తాను. మీరు అక్కడే ఉండొచ్చు. మీ ధ్యానానికి ఎలాంటి లోటూ రాకుండా మీకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసిపెడతాను. మీరు ఎక్కడికీ వెళ్ళకుండా ఇరుగుపొరుగు వారు మీ దగ్గరకే వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకునేలా ప్రచారం చేస్తాను. మీరు దర్జాగా ఇక్కడే ఉండొచ్చు... ఏమంటారు?’’ అని అడిగాడు. ఆయన చెప్పినదంతా సావధానంగా విన్న జెన్ గురువు ఓ నవ్వు నవ్వి - ‘‘మీరన్నది నిజమే. వినడానికి బాగుంది. కానీ నాకది సరిపోదు. క్షమించండి’’ అన్నారు. ‘‘తప్పుంటే మన్నించండి’’ అన్నాడు ధనికుడు. అప్పుడు గురువు ఇలా అన్నారు - ‘‘మీరు చెప్పినదానిలో ఒక్క తప్పూ లేదు. కానీ నేను చెప్పేది వినండి. అగరవత్తులు వెలిగించి గదిలో ఓ చోట పెట్టినప్పుడు ఆ గది అంతా గుబాళిస్తుంది. నిజమే. కానీ కాస్సేపటికి ఆ అగరవత్తులు ఆరిపోయి బూడిద, పుల్లలూ మిగులుతాయి. వాసన ఉండదు. అలా నాకిష్టమైన సంచారాన్నీ పద్ధతులనూ విడిచిపెట్టి పేరుప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడటం వల్ల ఎవరికి ఏం లాభముంటుంది? డబ్బూ, పేరూ, ప్రతిష్టలూ, పదవులూ, హోదా, గౌరవం వంటివన్నీ తేనె పూసిన కత్తి లాంటివి... కత్తికి తేనె పూశారన్న విషయాన్ని మరచిపోయి రుచి బాగుంటుందని తొందరపడి నాకితే రుచి మాట దేవుడెరుగు... నాలుక తెగి రక్తం కారుతుంది. కనుక నాకు తేనె పూసిన కత్తి అంటే ఇష్టం లేదు. దానికన్నా కొలనులో ఉన్న నీటిని దోసిలిలోకి తీసుకుని దాహం తీర్చుకుంటే చాలు అనుకునే వాడిని... దానితోనే నేను తృప్తి పడతాను. నాకు అంతకన్నా ఏదీ అక్కరలేదు’’ అన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత ధనికుడు మరొక్క మాట మాట్లాడితే ఒట్టు. - యామిజాల జగదీశ్ -
డబ్బుతోపాటొచ్చే దరిద్రం ఏమిటో తెలుసా?
న్యూయార్క్: డబ్బూ, డబ్బూ, డబ్బూ....డబ్బుతోటిదే లోకం. డబ్బుంటే సకల సౌకర్యాలు కనుసన్నల్లోకి వస్తాయని భావించేవాళ్లు, పాపిష్టిది డబ్బు, ప్రపంచాన్ని పాపపంకిలం చేస్తుందని ఈసడించేవాళ్లూ ఉంటారు. సమస్యలను తీర్చే, సమస్యలను తెచ్చే డబ్బు గురించి ఎవరి అనుభవాలనుబట్టి వారు నిర్వచనాలు ఇస్తుంటారు. డబ్బుతోబాటు డాబు, దర్పం వస్తుందని, దాన్ని వెన్నంటే స్వార్థం, పిసినారి తనాన్ని కూడా మూటగట్టుకొస్తుందని ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ పలు శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపించింది. డబ్బున్న మారాజులు విందు, వినోదాల్లో తేలిపోవచ్చుగానీ వారికి సామాజిక జీవితం తక్కువని, ఎక్కువ శాతం వారు ఒంటరిగానే గడుపుతారని, అదే డబ్బులేని పేదవాళ్లు ఎక్కువగా సామాజిక జీవితం గడుపుతారని, అంటే బంధు, మిత్రులతో సుఖ సంతోషాలు పంచుకుంటారని ఈ అధ్యయనాల్లో తేలింది. తోటివారు ఏమైనా చెబుతుంటే దండిగా డబ్బున్న వాళ్లు వారి మాటలు వినిపించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తుంటారు. అదే మధ్యతరగతి వాళ్లు తోటి వాళ్లు తమ కష్ట సుఖాల గురించి వివరిస్తుంటే అసహనంగా కదులుతూ మొబైల్ ఫోన్ లేదా పేపరు చూస్తూ అప్పుడప్పుడు మాత్రమే తలాడిస్తూ ఉంటారు. ఇక తక్కువ ఆదాయం కలిగిన కష్ట జీవులు తమ కష్టాల గురించి ఏకరువు పెడుతుంటే రెప్ప వాల్చకుండా చెప్పేవారి కళ్లలోకి చూస్తూ తలాడిస్తుంటారు. దయతో వారి మాటలను అర్థం చేసుకుంటారు. మొత్తంగా డబ్బున్న వారిలో ఔదార్యం మరీ తక్కువగాను, మధ్య తరగతి కుటుంబాల్లో కాస్త ఎక్కువగాను, దిగువ తరగతి పేదల్లో మరీ ఎక్కువగాను ఉంటుందని సామాజిక ప్రయోగాల ద్వారా తేల్చారు. కాయకష్టం చేసుకొని బతికే పేదవాళ్లలోనే తొటివారికి సేవచేయాలనే పెద్ద మనసు ఉంటుందని, వారు ఎక్కువ సామాజిక జీవితాన్ని గడపడం ద్వారానే వారికి ఈ గుణం అబ్బిందని అధ్యయనంలో వెల్లడైంది. పాత, చౌక కారును నడిపే యజమానులు బాటుసారులు రోడ్డు దాటుతున్నప్పుడు ఎక్కువసార్లు ఆగి, వారు దాటాకనే కారు నడుపుతారని, ఖరీదైన కార్లలో వెళ్లేవాళ్లు బాటసారుల కోసం కారును ఆపకుండా వీలైనంత వరకు దూసుకెళ్లేందుకే ప్రయత్నిస్తారని మరో అధ్యయనంలో రుజువైంది. దీన్నిబట్టి ఎక్కువ డబ్బున్నవారి, తక్కువ డబ్బున్న వారి మనస్తత్వం తీరును అర్థం చేసుకోవచ్చు. డబ్బున్న వారే ఎక్కువ మోసాలకు పాల్పడతారని, వారిలో చోర గుణం (స్టడీస్ ఆఫ్ షాప్లిఫ్టింగ్లో పేర్కొన్న అంశాల ప్రకారం)కూడా ఎక్కువగానే ఉంటుందట. డబ్బుకు సంబంధించిన ఓ వీడియో గేమ్‌ను డబ్బున్న వాళ్లతో, డబ్బులేని వాళ్లతో ఆడించగా డబ్బున్న వాళ్లు ఆ గేమ్‌లో మోసానికి పాల్పడ్డారు. వారిలో ఎక్కువ మంది పన్ను ఎగవేసేవారు ఉన్నట్లు కూడా తేలింది. అంతేకాకుండా తక్కువ డబ్బున్న వారే తమ డబ్బులో ఎక్కువ శాతం సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నట్లు, ఎక్కువ డబ్బున్న వాళ్లు సామాజిక కార్యక్రమాలకు అతి తక్కువ విరాళాలు ఇస్తున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ప్రజల మధ్య ఎక్కువ ఆర్థిక అసమానతలున్న దేశాల్లో ధనవంతుల్లో దుర్మార్గం ఎక్కువ, ఔదార్యం తక్కువగా ఉందని, తక్కువ ఆర్థిక అసమానతులున్న దేశాల్లో ధనవంతుల్లో ఔదార్యం ఎక్కువగా ఉందని కూడా అధ్యయనకారులు సూత్రీకరించారు. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో సామాజిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జీవన ప్రమాణాలు, జీవించే ప్రామాణిక కాలం, ఆరోగ్య వసతులు తక్కువ. శిశు మరణాలు ఎక్కువ. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం పాళ్లు, సంతోషం పాళ్లు తక్కువే. అందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల మాట్లాడుతూ సమకాలీన సమాజంలో ఆర్థిక అసమానతులను అధిగమించడమే అసలైన సవాల్ అని అన్నారు. అందరికి నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, పన్నుల వ్యవస్థను సరళీకరిస్తుందని ఆయన చెప్పారు. -
దిగజారిన రాజకీయాలు
– ధనవంతులే రాజ్యమేలుతున్నారు – ప్రజాస్వామ్యం అపహాస్యం – సెమినార్లో సీపీఐ, సీపీఎం నేతల ఆవేదన కర్నూలు సిటీ: రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయని, ధనంతులు చట్టాల రూపకర్తల స్థానంలో వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు ఎంఏ గఫూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయ పార్టీలు ఎన్నికలను అవినీతిమయం చేశాయని ఆరోపించారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో సీపీఐ, సీపీఎం నగర కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం ధన రాజకీయలు– ఎన్నికల సంస్కరణలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో 542 మంది ఎంపీలుంటే 433 మంది కోటీశ్వరులేనన్నారు. 2009 ఎన్నికల్లో 58 శాతం ఉన్న కోటీశ్వర్లు..నరేంద్ర మోడీ, చంద్రబాబు పుణ్యమా అని ప్రస్తుత ఎంపీల్లో కోటీశ్వరులు 82 శాతానికి పెరిగారన్నారు. ఎమ్మెల్యేఅభ్యరి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు, ఎంపీ అభ్యర్థి రూ. 30 కోట్ల నుంచి రూ. 60 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఇలాంటి వారంతా గెలిస్తే ఖర్చు పెట్టిన సొమ్ము సంపాదించుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నారు కానీ, ప్రజాసంక్షేమంపై కాదన్నారు. జిల్లాకు సంబంధించి ఇటీవలే ప్రతిపక్షం నుంచి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేకు రూ. 7కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంటే కాదు ఇప్పటి వరకు ఇచ్చింది రూ. 3కోట్లేనని ఆయనే చెబుతున్నట్లు సమాచారం. ఇలా రూకలకు సంతలో పశువుల్లా అమ్ముడపోయే వారికి ఓట్లు వేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కమ్యూనిస్టులు ఏ రోజు కూడా పదవుల కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని, ప్రజల తరుపున పేదల గొంతుకను వినిపించేందుకే పనిచేస్తున్నారని తెలిపారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, రామాంజనేయులు, ఆయా పార్టీల నాయకులు గౌస్ దేశాయ్, రాముడు, జగన్నాథం, రసూల్, వామ పక్ష పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బ్రిటన్ సంపన్నుల్లో రూబెన్ సోదరులు టాప్
బ్రిటన్ సంపన్నుల్లో భారత సంతతికి చెందినవారు టాప్ ర్యాంక్ లో నిలిచారు. సండేటైమ్స్ సంపన్నుల జాబితాలో రూబెన్, హిందూజా సోదరులు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైలో పుట్టిన వ్యాపార దిగ్గజాలు 77 ఏళ్ల డేవిడ్ రూబెన్, 74 ఏళ్ల సైమన్ రూబెన్ సోదరులు ఈసారి సండేటైమ్స్ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో యూకే సంపన్నుల జాబితాలో అగ్రభాగాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది ఐదో స్థానంలో ఉన్న రూబెన్ సోదరుల సంపద విలువ ఈసారి 3.4 బిలియన్ పౌండ్లు పెరిగింది. దాంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సోదరుల తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో హిందూజా గ్రూప్‌నకు చెందిన శ్రీచంద్ హిందూజా, గోపీచంద్ హిందూజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానాన్ని సంపాదించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 50 మంది కుబేరుల జాబితాలో ముఖేశ్, అనిల్ అంబానీ కలసి 17.90 బిలియన్ పౌండ్ల సంపదతో 30వ స్థానానికి పరిమితమయ్యారు. స్టీల్ పరిశ్రమల సంక్షోభం, యూకే ధనవంతుల సంపద ర్యాంకింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. 2008 లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్ లో నిలిచిన ఆర్సిలర్ మిట్టల్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద ఈ సంవత్సరం 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950 సమయంలో బ్రిటన్ వెళ్ళి అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో భారీగా సంపదను ఆర్జించారు. సంపన్న ఇరాకీ జోయెషీ కుటుంబంలో పుట్టిన ప్రవాస భారతీయులైన ఈ హిందూజా సోదరులకు ఇండియాలో కూడ అశోక్ లేలాండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి మొదటి తరగతి కంపెనీలు ఉన్నాయి. -
మెట్రోలో ముందే సీట్ల బుకింగ్?
► సంపన్నుల కోసం ప్రీమియం సీట్లు ఏర్పాటుచేయాలి ► సామాన్యులకూ మరింత సుఖవంతం చేయాలి ► మెట్రో రైళ్ల రాకపోకలను మరింత పెంచాలి ► ఢిల్లీ మెట్రోకు సుప్రీంకోర్టు సూచన న్యూఢిల్లీ: ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రవేశపెట్టిన 'సరి-బేసి' అంకెల విధానానికి మద్దతుగా సుప్రీంకోర్టు కొన్నిచర్యలను ప్రతిపాదించింది. ఈ విధానం కారణంగా తమ లగ్జరీ వాహనాలు ఉపయోగించుకోలేని సంపన్నులు, ధనికులు, ప్రముఖుల కోసం 'సౌకర్యవంతమైన ప్రీమియం సీట్లు' ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు సూచించింది. ప్రయాణికులు సాధారణ ధర కంటే ఐదు, ఆరు రెట్లు అధిక ధర చెల్లించి.. మెట్రో రైలులో సీట్లను ముందే బుక్ చేసుకునేలా ప్రీమియం సర్వీసులను అందుబాటులోకి తెచ్చే అవకాశాలను డీఎంఆర్సీ పరిశీలించాలని తెలిపింది. 'కారు యజమానులు మెట్రో కోసం వచ్చినప్పుడు వారికి కూర్చొనేందుకు తగిన చోటు కల్పించాలి. ఉదాహరణకు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ లాంటి వారికి మెర్సిడెస్, టయోటా వంటి భారీ వాహనాలున్నాయి. అలాంటి వారు మెట్రో ఉపయోగించుకోవడానికి వీలుగా మీరు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. సామాన్య ప్రయాణికుల కోసం కూడా మెట్రో రవాణా సదుపాయాన్ని మరింత సుఖవంతం చేయాలని, రైళ్ల రాకపోకలను మరింతగా పెంచాలని న్యాయస్థానం సూచించింది. -
సుందర భారతం కొందరిదే
సందర్భం అభివృద్ధి పేరిట దేశ సంపదలను కొల్లగొడుతున్నందువల్లే ధనిక, పేద తేడాలు పెరుగుతున్నాయి. వాటిని కప్పిపుచ్చడానికే ప్రచారార్భాటం. పుష్కర స్నానంతో పాపపరిహారం సరేగానీ, ఈ దుర్మార్గ వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సిద్ధమవుదాం! దేశం ప్రగతి పథంలో మునుముందుకు పోతోం దని మోత మోగుతోంది. ప్రత్యేకించి ప్రధాని నరేం ద్రమోదీ సారథ్యంలో దేశం అభివృద్ధిబాట పట్టి, సుసంపన్నమైపోతోందని తెగ ప్రచారం సాగుతోం ది. అయితే ఇటీవల విడు దలైన ‘గ్లోబల్ వెల్త్ డేటా-2014’ (ప్రపంచ సంప దల గణాంక సమాచారం) తెలుపుతున్న వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. మన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సైతం కీలకమైనదిగా పేర్కొన్న ఈ గణాంక సమాచారం ప్రకారం 110 కోట్ల జనా భా ఉన్న భారతదేశ మొత్తం సంపదలో దాదాపు సగం (49%) జనాభాలో ఒక్క శాతం (ఇంచుమిం చు కోటి మంది) చేతుల్లోనే ఉంది! మిగతా సగం సంపదలో (51%) నాలుగింట మూడువంతులు 10% జనాభా చేతుల్లోనే ఉందట. అంటే 89% జనా భాకు ఉన్నది 13% సంపద మాత్రమే. ఇంచుమిం చు 8 కోట్ల వరకు ఉండే ఆదివాసుల చేతుల్లో ఉన్న సంపద అందులో 1% మాత్రమే. బిహార్ ఎన్నికల సాకుతో కులాల వారీ లెక్కలను బయటపెట్టలేదు గానీ, లేకపోతే దళితుల, బడుగువర్గాల ఉద్ధరణ పేరిట పాలకులు చెప్పుకునే గొప్పల బండారం కూడా బయటపడేదే. ఏదిఏమైనా ఇలా దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రంగా విస్తరిస్తుండగా... అభి వృద్ధి అంటే శత సహస్ర కోటీశ్వరుల ఆస్తులను పెం పొందించడమే తప్ప సామాన్య ప్రజల జీవన పరిస్థి తులను మెరుగుపరచడం మాత్రం కాజాలదు. ప్రజల ఆదాయాలు, ఆహారం, విద్య, వైద్యం, గృహవసతి వంటి కనీస అవసరాలు తీరడం, వాటి నాణ్యతలే నిజమైన అభివృద్ధికి కొలబద్ధలు. నేటికీ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే ఉంటోంది. ‘పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు’, ‘రైతే రాజు’, ‘వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక’ అంటూ పాలకులు తెగ ఊదరగొట్టడం మామూలే. కానీ వ్యవసాయాధారిత కుటుం బాల్లో 30%కు సెంటు భూమి కూడాలేదు. రెక్కల కష్టమే జీవనాధారం. పని దొరికితే అర్ధాకలైనా తీరుతుంది, లేకుంటే పస్తు లే. పూరి గుడిసెల్లో గడిపేవారు 54%. కాగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఒక్కటే గది లేదా గుడారంలో పిల్లాజెల్లా కుటుంబమంతా గడిపేవారు 14%. వీటికి సైతం అద్దె చెల్లిస్తున్నవారు12%! ఇక 4.5% గూడే లేకుండా ఆకాశం కప్పుకింద బతికేస్తున్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయమని తెగ ఊదరగొట్టే మోదీ ప్రభుత్వం దమ్మిడీ ఖర్చుగానీ, ఫలితంగానీ లేని మూడు కార్యక్రమాలను చేపట్టింది. ‘స్వచ్ఛ భారత్’, ‘బ్యాలెన్సే లేని బ్యాంకు ఖాతాలను తెరి పించడం’, ‘యోగా దినం’ అట్టహాసంగా నిర్వహిం చింది. ప్రచార ఆర్భాటమే తప్ప వీటివల్ల పేదసాద లకు, సామాన్యులకు కలిగిన ప్రయోజనం శూన్యం. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేని ఇళ్లు 54%, నెలనెలా క్రమబద్ధమైన ఆదాయం లేని వారు 90%. 10%కి మాత్రమే నెలనెలా జీతానికి హామీ ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసినా, ప్రపంచం లోని ప్రతి నలుగురు కటిక దరిద్రుల్లో ఒకరు (25%) మన దేశంలోనే ఉన్నారు. తిండికే లేనివారు విద్య, వైద్యం కోసం ఎలా ఖర్చు చేయగలరు? అనే యోచ నే పాలకులకు లేదు. నిర్వహణ, సదుపాయాలు బాగా లేవంటూ ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలను మూసేసి, ప్రజారోగ్యాన్ని, విద్యను ప్రైవేటు, కార్పొ రేటు రంగ జలగలకు అప్పగించి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చేతులు దులిపేసుకుంటున్నాయి. గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వ హించిన ఒక జాతీయ సర్వే గత 7-8 ఏళ్లలో విద్యపై సాధారణ కుటుంబాల ఖర్చు రెట్టింపయిందని అం చనా వేసింది. ప్రాథమిక విద్యకు సైతం కనీసం ఏడాదికి రూ.10 వేలు ఖర్చవుతోంది. ఇకపై తర గతులకు, కళాశాల, సాంకేతిక విద్యలకు ఖర్చు పలు రెట్లు పెరుగుతూపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రు లలో డాక్టర్లు, మందులు, సౌకర్యాలు లేకుండా చేసిన ఫలితంగా ప్రజలు ప్రైవేటు వైద్యం కొనుక్కోక తప్పడంలేదు. గ్రామీణ పేదలు సైతం నెలసరి ఆదాయం కంటే 15 నుంచి 20 రెట్లు ఎక్కువగా వైద్యం కోసం ఖర్చు చేయాల్సివస్తోంది. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, దివాలా తీయాల్సి వస్తోంది, బికారులుగా మారాల్సి వస్తోంది. విద్య, వైద్యం శ్రామికులకే కాదు మధ్యతరగతికి సైతం కొనుక్కోడానికి కూడా అందనివిగా మారిపోవడ మనే ఈ దుస్థితి కుటుంబ సంబంధాలపై, అనుబం ధాలపై, మానవ సంబంధాలపై సైతం తీవ్ర దుష్ర్ప భావం చూపుతోంది. ఇది చాలదని మోదీ ప్రభుత్వం ‘అభివృద్ధి’ పేరిట అంతో ఇంతో భూవసతి ఉన్న రైతుల భూములను లాక్కుని స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు, రియల్ ఎస్టేటర్లకు కట్టబెట్టేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టా నికి సవరణలను చేపట్టే పేరిట అది కొత్తగా తయా రు చేసిన బిల్లు రైతాంగం భూములను నిర్లజ్జగా లాక్కుని, కుబేరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నిలువు దోపిడీ బిల్లు వల్ల నిర్వాసితులయ్యే రైతు ల, కూలీల జీవనోపాధి సమస్యనుగానీ, దేశ ఆహార భద్రతకు కలిగే ముప్పునుగానీ పట్టించుకోకుండా రైతుల భూములు లాక్కోడానికి సిద్ధమైంది. మోదీ ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేని కారణంగా ఆ బిల్లును నెగ్గించుకోలేక ఆర్డినెన్స్ మీద ఆర్డినెన్స్ జారీ చేస్తూ రైతులకు మరణ శాసనాన్ని విధిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఇలాంటి దొడ్డిదోవ పాలనలో ఆరితేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అదే బాటపట్టారు. రాజధాని ప్రాంతం పేరిట లక్ష ఎకరాలు, వివిధ అభివృద్ధి కేం ద్రాల పేరిట మిగతా ప్రాంతాల్లో మరో తొమ్మిది లక్షల ఎకరాలు సాగుభూములను స్వాహా చేసి, కార్పొరేట్లకు, రియల్టర్లకు కట్టబెట్టడంలో తలము నకలై ఉన్నాడు. పాలకులకు తగినట్టే, పెద్ద ఎత్తున రైతాంగాన్ని భూముల నుంచి తొలగిస్తే తప్ప దేశం అభివృద్ధి చెందదని బాహాటంగానే పాలకవర్గ మేధా వులు విశ్లేషణలను గుప్పిస్తున్నారు. అభివృద్ధి ముసుగులో దేశ సంపదలను కొల్ల గొడుతున్న ఫలితంగానే ధనిక, పేద తేడాలు పెరిగి పోతున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు, మీడియా మేనేజిమెంటు కొన సాగిస్తున్నారు. అది తారస్థాయికి చేరి వికటించిన ఫలితంగానే రాజమండ్రి పుష్కరాల్లో 27 మంది అమాయకులు అన్యాయంగా బలైపోయారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల ఎడతెగని ప్రచారంతో కోట్లలో పోటెత్తిన భక్తులకు పుష్కర స్నానంతో పాప పరిహారం జరిగిందో లేదో తెలియదు. కానీ హృద యమే లేని పాలకులు కావలి కాస్తున్న దుర్మార్గ వ్యవస్థ సృష్టిస్తున్న ఆర్థిక అసమానతల వల్ల కలు గుతున్న అనర్థాలకు మాత్రం మరే నిష్కృతీ లేదు... ఈ దుర్మార్గ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయ డం తప్ప. అందుకు సిద్ధం అవుదాం! ఏపీ విఠల్ (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు) మొబైల్: 98480 69720 -
కారు కొంటేనే మంచి భర్త!
మగోడు మా పక్కింటి వాళ్లు సంపన్నులు. మా బంధువులలో కూడా చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ల ఇంట్లో ఏ కొత్త వస్తువు చూసినా ‘‘అది మన ఇంట్లో ఉండాల్సిందే’’ అని పట్టుపడుతుంది మా ఆవిడ. మంచి భర్త అంటే ఎవరు? అనే ప్రశ్నకు- ‘‘పువ్వులో పెట్టి చూసుకునేవాడు’’ అనే సమాధానం వినిపిస్తుంటుంది. నేను అక్షరాల అలాంటి భర్తనే. ఏ రోజూ నా భార్యను చిన్న మాట కూడా అనలేదు. కానీ ఆమె దృష్టిలో నేను అసమర్థుడిని. దీనికి కారణం ఆమె గొంతెమ్మ కోరికలు. మా పక్కింటి వాళ్లు సంపన్నులు. మా బంధువులలో కూడా చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ల ఇంట్లో ఏ కొత్త వస్తువు చూసినా ‘‘అది మన ఇంట్లో ఉండాల్సిందే’’ అని పట్టుపడుతుంది మా ఆవిడ. ‘‘అదెలా కుదురుతుంది? వారి స్థాయి ఎక్కడ? మన స్థాయి ఎక్కడ? ఉన్నంతలోనే సర్దుకుపోవాలి’’ అని చెప్పినా ఒక పట్టాన వినదు. ఒకరోజు మా ఆవిడ వాళ్ల అక్క, ఆమె భర్త మా ఇంటికి వచ్చారు. ‘‘మీ బావ కారు కొనడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంక రెండు నెలల్లో మా ఇంటికి కారు వస్తుంది’’ అని మా ఆవిడతో చెప్పింది వాళ్ల అక్క. ఇక అది మొదలు...‘కారు కొనండి’ అని రోజూ పోరు..! ఒకోసారి తట్టుకోలేనంత కోపం వస్తుంది. అయినా నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. మనశ్శాంతి కోసం యోగా కూడా చేస్తున్నాను. నా భార్య కళ్లు తెరిపించాల్సిందని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. - జీవిఆర్, ఖమ్మం -
తెలంగాణకు తీరని అన్యాయం
* ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్ * సంపన్నులు, బహుళజాతికి ప్రాధాన్యం * కేంద్ర బడ్జెట్‌పై ఎంపీలు, చార్టర్‌డ అకౌంటెంట్ల అసంతృప్తి సంపన్నుల, బహుళజాతి బడ్జెట్... ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన నరేంద్రమోడీ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందరికీ అన్ని ఇస్తామని భ్రమింపజేసిన ఆయన.. చివరికి ఏదీ లేదని నిరూపించారు. పేదల పట్ల వారికున్న వైఖరి, సంక్షేమంపై ఉన్న వ్యతిరేకతను ఈ బడ్జెట్లో నిరూపించారు. కేవలం సంపన్నులు, బహుళజాతి సంస్థలకు ఉపకరించే ప్రణాళికలను మాత్రమే బడ్జెట్లో ఆవిష్కరించారు. అన్నింటా ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో విదేశీ నిధుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలపై విదేశీ పెత్తనం పెరిగే ప్రమాదాన్ని ఈబడ్జెట్ తెలియజేస్తోంది. ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. మోడీ గతంలో చెప్పినమాటలకు.. చేతలకు పొంతనలేదని ఈ బడ్జెట్‌తో తేలింది. - రాపోలు ఆనందభాస్కర్, రాజ్యసభ సభ్యుడు బడ్జెట్ ఆశాజనకంగా లేదు... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇది దేశాని కి అంత మంచిది కాదు. ముఖ్యంగా రక్షణ రం గంలో కూడా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడంతో నష్టం వాటిల్లుతుంది. కేంద్రం ఇంతకాలం చెప్పిన దానికి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణకు కేంద్ర పాలకులు తీరని అన్యాయం చేశారు. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడితో ఒక రాష్ట్రానికి ఓ న్యాయం.. ఇంకో రాష్ట్రానికి మరో న్యాయం చేయడం మంచిపద్ధతి కాదు. తెలంగాణ రీ ఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచిన వాటిని కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ముఖ్యంగా ఏపీకి ఏడు ప్రాజెక్టులు, తెలంగాణకు ఒకే ప్రాజెక్టు ఇవ్వడంతో కేంద్ర వైఖరి తెలిసిపోయింది. బీజేపీ, అనుకూల ప్రభుత్వాలున్న రాష్ట్రాల బడ్జెట్‌గా మారింది. ఇదే తీరుగా వ్యవహరిస్తే కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. - కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ ఏ రంగానికి న్యాయం చేయలేదు... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అరైవె ఏళ్ల కల నిజమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో న్యాయంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. అయితే ఎవరి ఒత్తిడి వల్ల జరిగిందో.. ఏమో కానీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మాత్రం పూర్తి అన్యాయం జరిగింది. బడ్జెట్లో తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఏ రంగానికి కనీస న్యాయం చేయలేదు. కేవలం మొక్కుబడిగా హార్టికల్చర్ యూనివర్సిటీని మాత్రమే ప్రకటించారు. ఇప్పటివరకు గిరిజన విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించకుండా ప్రజలను నిరాశపరిచారు. రీఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచినా గ్యారంటీ లేదు. భవిష్యత్ పేరుతో అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్లో ఇతరపార్టీల గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. అన్యాయం చేస్తే మోడీ సర్కార్‌పై పోరాటం చేస్తాం. - అజ్మీరా సీతారాంనాయక్, మహబూబాబాద్ ఎంపీ పారిశ్రామిక రంగానికి చేయూత... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చే విధంగా ఉంది. అలాగే భారతదేశ ప్రజలను, బయటి దేశాల్లోని ఇన్వెస్టర్లను సైతం కొంత నిరాశ పరిచే విధంగా కూడా ఉంది. నల్లధనం వెలికి తీస్తాం.. అని మొదట్లో చెప్పిన మోడీ ఇప్పుడు బడ్జెట్లో ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడం బాధాకరం. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు బడ్జెట్లో స్థానం లేకపోవడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఈ ఏడాది కూడా అందే పరిస్థితి లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పొదుపు పరిమితిని ప్రస్తుతం రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్ష వరకు పెంచడంతో దానిపై వడ్డీరేటు 8 శాతం నుం చి 9 శాతం వస్తుంది. -త్రిపురనేని గోపిచంద్, సీఏ ఇన్స్టిట్యూట్ కార్యదర్శి పన్నుల విభాగంలో మార్పులు... ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్.. పన్నుల విభాగంలో పలు మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ. 2 నుంచి రూ 2.5 లక్షలు పెంచారు. అలాగే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటీజన్స్‌కు రూ. 2.5 నుంచి రూ.3లక్షలకు పెంచి, సేవింగ్స్ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.5లక్షలకు పెంచారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు పన్నుల నుంచి ఉపశమనం కలిగింది. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సబ్బులు, సౌందర్య సాధనాలు, 19 ఇంచులలోపు ఎల్సీడీ, ఎల్ఈడీ కలర్ టీవీలు, చెప్పులు, సిమెంట్, స్టీల్ ధరలు కాస్త తగ్గుతాయి. -పీవీ నారాయణరావు, సీఏ సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌కు అనుమతి రాలేదు... చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన సిరిసిల్లలో టెక్స్టైల్స్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరం. ఆరు టెక్స్టైల్స్ క్లస్టర్లలో కనీసం ఒక్కదానికి అనుమతిచ్చినా నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గేది. ఉద్యోగులకు ఐటీ మినహాయింపు రూ. 2.5 లక్షలకు ఇవ్వడం నిరాశజనకం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 5లక్షలు ఇస్తే బాగుండే ది. ఏపీ భాగస్వామ్య రాజకీయంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. పేదలను మరిచి విదేశీ, కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెట్ వేసింది. ఓంప్రకాష్లోయ, చార్టర్డ్ అకౌంటెంట్ -ఓం ప్రకాష్లోయ, సీఏ ప్రకటనదారులకు ఖర్చు తగ్గుతుంది... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో మీడియా ప్రకటనలపై సర్వీస్ టాక్స్ ఎత్తివేస్తున్నట్లు చెప్పడంతో ప్రకటనదారులకు ఖర్చు తగ్గుతుంది. మన దేశానికి ఇంపోర్ట్ చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో ఇతర దేశాల వస్తువులకు స్వస్తి పలికి స్వదేశీ ప్రొడక్ట్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలను దేశీయ కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని నిబంధన పెట్టడం మంచిది. ఇలా చేయడం ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్టే. - పిప్పర్తి రాఘవరెడ్డి, సీఏ చంద్రబాబు, వెంకయ్యనాయుడి కుట్ర... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలో భాగంగానే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూపీఏ హయాంలో ఎఫ్‌డీఏలను వ్యతిరేకించినా బీజేపీ.. ప్రస్తుతం రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఎలా స్వాగతిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంధ్రాకు వరాల జల్లు కురిపించిన కేంద్రం, తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించింది. కొత్త సీసాలో పాత సార మాదిరిగా కేంద్ర బడ్జెట్ ఉంది. - బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ సెక్రటరీ యూపీఏ విధానాలనే కొనసాగించింది... యూపీఏ ప్రభుత్వం కొనసాగించిన ప్రజా వ్యతిరేక విధానాలనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందనడానికి గురువారం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ నిదర్శనంగా నిలిచింది. ఈబడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తుందే తప్ప, పేదలకు ఒరిగిందేమీలేదు. ఎన్నికల ముందు మోడీ జపం చేసిన నాయకులు ఈ బడ్జెట్‌తో కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. అధిక ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ సర్కార్, పేదలకు అనుకూలమైన బడ్జెట్‌ను తీసుకురాలేకపోయింది. - తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి నిరుద్యోగులకు మొండి చేయి... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలూ కల్పించలేదు. ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మోడీ బడ్జెట్‌పై నిరుద్యోగులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోడీ అమలు చేయలేదు. ఆంధ్రాకు కాకినాడ నుంచి చెన్నయ్‌కు నౌకాయా నం ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి నిరుద్యోగులకు ఉపాధి దోరుకుతుంది. తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్లో ఎలాంటి ఊసులేకపోవడం శోచనీయం. - కోమాకుల నాగరాజు, నిరుద్యోగి, వరంగల్