ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!
ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ‍్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది.
తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్‌కి గురై ఆల్కహాల్‌కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది.
అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్‌అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది.
ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!)
Comments
Please login to add a commentAdd a comment