అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(నాసా) తాజాగా అంగారక గ్రహం- బృహస్పతి మధ్యనున్న 16 సైక్ అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్‌పై పని చేస్తోంది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రిలియన్ డాలర్ల (ఒక క్వాడ్రిలియన్.. రూ.7,44,045) విలువైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు అంచనా.
నాసా తెలిపిన వివరాల ప్రకారం బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహశకలం సగటు వ్యాసం సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు). భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. లేదా హైదరాబాద్ - గుంటూరు మధ్య దూరం. ఈ గ్రహశకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
సాధారణంగా పలు గ్రహశకలాలు రాతి లేదా మంచుతో నిండి ఉంటాయి. కానీ 16 సైక్‌ను మృత గ్రహానికి చెందిన ఓపెన్ మెటాలిక్ హార్ట్‌గా భావిస్తున్నారు. ఈ గ్రహశకలంపై లభ్యమయ్యే బంగారాన్ని భూమిపైకి తెచ్చి, అందరికీ సమానంగా పంచగలిగితే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చు. ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ 1852 మార్చి 17న ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. గ్రీకు దేవత అయిన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి పేరు పెట్టారు.
ఆ గ్రీకు దేవత ఒక చేపగా జన్మించింది. ప్రేమ దేవుడైన ఎరోస్ (రోమన్ మన్మథుడు)ను వివాహం చేసుకుంది. సైక్ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది. నాసా ఈ సైక్ స్పేస్‌క్రాఫ్ట్ పరిశోధనను 2022 ఆగష్టులో ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని భావించారు. అయితే ఏవో కారణాలతో ఈ మిషన్‌ను 2023(ఈ ఏడాది)కి వాయిదా వేశారు. మరి ఈ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక?
Comments
Please login to add a commentAdd a comment