planets
-
నేడు వలయాకార సూర్య గ్రహణం
నేడు అరుదైన సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణం కాబట్టి భారత్‌లో ఇది కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అయితే.. రింగ్ ఆఫ్ ఫైర్‌ను నేరుగా వీక్షించడం మంచిదికాదని ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు. అలాగే.. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏప్రిల్ 20వ తేదీన సూర్య గ్రహణం సంభవించింది. ఇవాళ సంభవించేంది రెండో గ్రహణం. మూడో గ్రహణం.. అక్టోబర్ 28-29 తేదీల మధ్య చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక గ్రహణమే అయినా.. భారత్‌లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడం సూర్యగ్రహణం.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతుంది. ఇది అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే జరుగుతుంది. అయితే, ప్రతీ అమావాస్య, పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు. -
టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? భూమి మీదకు తెస్తే ఏమవుతుంది?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(నాసా) తాజాగా అంగారక గ్రహం- బృహస్పతి మధ్యనున్న 16 సైక్ అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్‌పై పని చేస్తోంది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రిలియన్ డాలర్ల (ఒక క్వాడ్రిలియన్.. రూ.7,44,045) విలువైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు అంచనా. నాసా తెలిపిన వివరాల ప్రకారం బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహశకలం సగటు వ్యాసం సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు). భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. లేదా హైదరాబాద్ - గుంటూరు మధ్య దూరం. ఈ గ్రహశకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా పలు గ్రహశకలాలు రాతి లేదా మంచుతో నిండి ఉంటాయి. కానీ 16 సైక్‌ను మృత గ్రహానికి చెందిన ఓపెన్ మెటాలిక్ హార్ట్‌గా భావిస్తున్నారు. ఈ గ్రహశకలంపై లభ్యమయ్యే బంగారాన్ని భూమిపైకి తెచ్చి, అందరికీ సమానంగా పంచగలిగితే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చు. ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ 1852 మార్చి 17న ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. గ్రీకు దేవత అయిన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి పేరు పెట్టారు. ఆ గ్రీకు దేవత ఒక చేపగా జన్మించింది. ప్రేమ దేవుడైన ఎరోస్ (రోమన్ మన్మథుడు)ను వివాహం చేసుకుంది. సైక్ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది. నాసా ఈ సైక్ స్పేస్‌క్రాఫ్ట్ పరిశోధనను 2022 ఆగష్టులో ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని భావించారు. అయితే ఏవో కారణాలతో ఈ మిషన్‌ను 2023(ఈ ఏడాది)కి వాయిదా వేశారు. మరి ఈ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక? -
నక్షత్రాలు పేలితే భూమికి ముప్పు!
భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏమిటీ ముప్పు? అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది. సూపర్నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి. ఎలా గుర్తించారు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్‌లతో సూపర్‌నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్ఎన్ 1987ఏ, ఎస్ఎన్ 2010జేఎల్, ఎస్ఎన్ 1994ఐ అనే సూపర్నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్లో బలమైన సూపర్నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవా ఒకటి పేలిపోయింది. దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇతర గ్రహాలపై జీవజాలం.. ఓజోన్ పొర ఆధారం
అనంతమైన విశ్వంలో మనం జీవిస్తున్న ఈ భూగోళంపైనే కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలపైనా జీవజాలం ఉందా? ఇప్పుడు లేకపోయినా గతంలో ఎప్పుడైనా ఉండేదా? ఒకవేళ ఉంటే అవి ఎలాంటి జీవులు? ఈ ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా భూమిపై మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. సువిశాలమైన విశ్వంలో భూమికి ఆవల జీవుల ఉనికిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు అలుపెరగకుండా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మన పాలపుంత(గెలాక్సీ)లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? అనేది తెలుసుకొనేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఎన్నెన్నో పద్ధతులు అనుసరించారు. ఇతర గ్రహాలపై జీవజాలం ఉన్నట్లు ఇప్పటివరకైతే బలమైన ఆధారాలేవీ లభించలేదు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిపై దృష్టి పెట్టారు. అదేమిటో తెలుసుకోవడం ఆసక్తికరమే. ► మన భూగోళానికి రక్షణ కవచం ఓజోన్ పొర అన్న సంగతి తెలిసిందే. అత్యంత హానికరమైన అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షిస్తోంది. అందుకే భూమిపై కోట్లాది జీవులు నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. ► ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి సాధ్యమని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే అంశాన్ని సరికొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు. ► ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు. ► ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు. ► విశ్వ పరిణామ క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలకు లోహతత్వం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. ఇలాంటి నక్షత్ర మండల్లాలోని గ్రహాల చుట్టూ దట్టమై ఓజోన్ పొర ఏర్పడుతుందని, తద్వారా అక్కడ జీవులు ఉద్భవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ► అధిక లోహతత్వం ఉన్న నక్షత్రాల పరిధిలోని గ్రహాలే జీవుల అన్వేషణకు మెరుగైన లక్ష్యాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ► గ్రహాల చుట్టూ రక్షిత ఓజోన్ పొర ఏర్పడాలంటే దానికి సంబంధించిన నక్షత్రానికి ఏయే లక్షణాలు ఉండాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ► విశ్వంలో గ్రహాలను కలిగిన చాలా నక్షత్రాల ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంది. మన నక్షత్రమైన సూర్యుడు ఇదే విభాగంలోకి వస్తాడు. ► సూర్యుడి నుంచి వెలువడుతున్న అల్ట్రావయొలెట్ కాంతి(రేడియేషన్) మన భూగ్రహ వాతావరణంపై చూపిస్తున్న సంక్లిష్టమైన ప్రభా వాన్నే ఇతర గ్రహాల వాతావరణంపైనా చూపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అన్నా సపిరో ఒక ప్రకటనలో వెల్లడించారు. ► నక్షత్రాల్లోని లోహతత్వం వాటి నుంచి ఉద్గారమయ్యే అల్ట్రావయెలెట్ కాంతిని ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూవీ రేడియేషన్ నక్షత్రాల సమీపంలో కక్ష్యలో తిరిగే గ్రహాల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న దానిపై దృష్టి సారించారు. ► మన భూగోళంపై ఉన్న వాతావరణం ఇక్కడి జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకొనేందుకు ఉపకరిస్తుందని, ఇదే సూత్రాన్ని ఇతర గ్రహాలకు సైతం వర్తింపజేయవచ్చని సైంటిస్టు జోస్ లెలీవెల్డ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఐదు గ్రహాలు ఒకే కక్ష్యపై కనువిందు చేశాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే రేఖలో 50 డిగ్రీల పరిధిలో కనిపించాయి. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటన సూర్యాస్తమయం తర్వాత కనిపించింది. సూర్యా స్తమయం తర్వాత పశ్చిమం వైపు 50 డిగ్రీల పరిధిలో ఐదు గ్రహాలు కనిపించాయి. భూమిపై నుంచి చూసేటప్పుడు.. ఐదు గ్రహాలు ఒకే రేఖపై ఆర్క్ ఆకారంలో కనిపించాయి. చదవండి: వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ! -
అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో నాలుగు గ్రహాలు
ఏలేశ్వరం(తూర్పుగోదావరి): అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. దీనిని ప్లానెట్స్ పరేడ్ అని అంటారు. ఇది బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య కనువిందు చేసింది. దీనిని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయి సందీప్ వెల్లడించారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్ అన్నారు. -
ఆశ్చర్యపోయే అంశం.. సూర్యుడు లేని గ్రహాలు!
గ్రహం.. అనగానే ఏదో ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించడం పరిపాటి. కానీ, 2021 ముగింపులో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే అంశం గోచరమైంది. పాలపుంత గెలాక్సీలో ఎటువంటి నక్షత్రం చుట్టూ భ్రమణం చేయకుండా స్వేచ్ఛగా తిరిగే 100కుపైగా భారీ గ్రహాలను కనుగొన్నారు. ఇవన్నీ సైజులో గురుగ్రహం కన్నా పెద్దవి. ఇలాంటివి మరిన్ని లక్షలుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్(మాతృ నక్షత్రం లేని గ్రహాలు) 70– 172 వరకు కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కనుగొన్న ఫ్రీఫ్లోటింగ్ ప్లానెట్స్ కన్నా తాజాగా కనుగొన్నవి రెట్టింపున్నాయి. నక్షత్ర ఉత్పత్తి సమయంలో ఇలాంటి గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా. బరువులో జూపిటర్కు సుమారు 13 రెట్లున్న ఈ గ్రహాల ఉత్పత్తిపై భిన్న అంచనాలున్నాయి. నక్షత్రాల్లాగానే వాయు సమూహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి నశించడం వల్ల ఏర్పడి ఉండొవచ్చని, మాతృనక్షత్రం నుంచి భ్రమణం చేసే సమయంలో అనూహ్యంగా కక్ష్య నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని.. పలు ఊహాగానాలు చేస్తున్నా వీటి పుట్టుకకు మాత్రం సరైన కారణాలు ఇంకా తెలియలేదు. (చదవండి: వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్ దాడి) జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో వీటి వివరాలు ప్రచురించారు. వృశ్చిక రాశి నక్షత్ర సముదాయానికి దగ్గరలో వీటిని గుర్తించారు. పలు నక్షత్రాల మధ్య ఇవి స్వేచ్ఛగా పరిభ్రమించేందుకు కారణాలు అన్వేషించాల్సిఉందని పరిశోధనలో పాల్గొన్న రియా మిరెట్ రొయిగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపుతో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. నక్షత్రంతో పనిలేకుండా తిరిగే వీటిలో వాతావరణం వృద్ది చెందడాన్ని పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం ఉందని సైంటిస్టుల భావన. (చదవండి: అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో! ప్రాణాలు పోతున్నా జనాల్ని కాపాడుతున్నారు) -
అదిగదిగో ప్లానెట్ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా
మన సౌర కుటుంబంలో గ్రహాలెన్ని? ఇదేం ప్రశ్న తొమ్మిది గ్రహాలు కదా అంటారా.. కాదు కాదు.. ఫ్లూటోను లిస్టులోంచి తీసేశారు కాబట్టి ఎనిమిదే అంటారా.. ఏం అన్నా అనకున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం ఫ్లూటో కాకుండానే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫ్లూటో అవతల ఓ పెద్ద గ్రహం ఉందనడానికి కొన్నిరకాల ఆధారాలు ఉన్నాయని, కానీ దాని జాడ మాత్రం కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలేమో.. అలాంటి గ్రహమేదీ లేకపోవచ్చని చెప్తున్నారు. అసలు ఈ తొమ్మిదో గ్రహం ఏమిటి? దానికి ఆధారాలేమిటి? ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? ఫ్లూటోను తొలగించాక.. మనం చిన్నప్పటి నుంచీ సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయనే చదువుకున్నాం. కానీ కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు.. గ్రహాలకు సంబంధించి కొన్ని పరిమాణం, ఆకృతి, దాని కక్ష్య వంటి పలు నిబంధనలు రూపొందించారు. అందులో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ప్లూటో అప్పటి నుంచి మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలే (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్) మాత్రమే మిగిలాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఫ్లూటోకు కొంచెం అటూఇటూగా మరో మూడు, నాలుగు మరుగుజ్జు గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. కానీ ఇటీవల ఫ్లూటో, ఇతర మరుగుజ్జు గ్రహాలు కాకుండానే.. తొమ్మిదో గ్రహం ఉండి ఉంటుందన్న ప్రతిపాదనలు మొదలయ్యాయి. ‘ప్లానెట్ 9’ ఉందంటూ.. 2016లో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)కు చెందిన అంతరిక్ష పరిశోధకులు మైక్ బ్రౌన్, కోన్స్టాంటిన్ బటిగిన్ ‘ప్లానెట్ 9’ను ప్రతిపాదించారు. ఫ్లూటో అవతల సౌర కుటుంబం చివరిలో ఓ భారీ గ్రహం పరిభ్రమిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దానికి ప్రస్తుతానికి ‘ప్లానెట్ 9’ అని పేరు పెట్టారు. ►2018లో ది ఆస్ట్రానమికల్ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధన కూడా సౌర కుటుంబం అంచుల్లో ఏదో పెద్ద గ్రహం ఉండవచ్చని అంచనా వేసింది. ‘2015 బీపీ519’గా పిలిచే ఓ భారీ ఆస్టరాయిడ్ కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి.. నెప్ట్యూన్ కక్ష్యకు సమీపంగా సూర్యుడి చుట్టూ తిరిగి వెళుతుంది. అంత దూరంలో భారీ గ్రహం ఉందని, దాని ఆకర్షణ వల్లే ఈ ఆస్టరాయిడ్ సౌర కుటుంబం పరిధిలో ఉందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. భారీ గ్రహాల గురుత్వాకర్షణను బట్టి.. అంతరిక్షంలో నక్షత్రాలు, భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తి చుట్టూ ఉండే గ్రహాలు, ఆస్టరాయిడ్లు, ఇతర ఖగోళ వస్తువులపై ప్రభావం చూపుతూ ఉంటుంది. సౌర కుటుంబంలోనే అతి భారీ గ్రహమైన గురుడి గురుత్వాకర్షణ కారణంగానే.. ఆ గ్రహ కక్ష్యలో, అంగారకుడు–గురు గ్రహాల మధ్య పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్లు తిరుగుతుంటాయి. అదే తరహాలో క్యూపియర్ బెల్ట్‌లోనూ ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు గుంపులుగా పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏదైనా భారీ గ్రహం గురుత్వాకర్షణ ప్రభావం చూపితే తప్ప.. ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు అలా వ్యవహరించవని సూత్రీకరించారు. ►మార్స్–గురు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉన్నట్టుగానే.. నెప్ట్యూన్ గ్రహం పరిభ్రమించే చోటు నుంచి అవతల సుమారు 500 కోట్ల కిలోమీటర్ల వెడల్పున మరో బెల్ట్ ఉంటుంది. దానినే క్యూపియర్ బెల్ట్ అంటారు. ప్లూటోతోపాటు ఎన్నో మరుగుజ్జు గ్రహాలు, కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు ఆ బెల్ట్‌లోనే తిరుగుతుంటాయి. ఆ గ్రహం ఎలా ఉండొచ్చు? క్యూపియర్ బెల్ట్‌లో మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల గుంపులు, కక్ష్య, పరిమాణాలను బట్టి.. పలు కంప్యూటర్ సిమ్యులేషన్లు, గణిత సూత్రాల ఆధారంగా ‘ప్లానెట్ 9’ అంచనాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ లెక్కన.. భూమి ప్లానెట్ 9 ►భూమితో పోలిస్తే ప్లానెట్ 9 పది రెట్లు పెద్దగా ఉండి ఉంటుంది. ►సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఎంతదూరంలో ఉందో.. అంతకు 20 రెట్లు దూరంలో తిరుగుతూ ఉంటుంది. ►ప్లానెట్–9 సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు కనీసం 10 వేల ఏళ్ల నుంచి 20 వేల ఏళ్లకుపైగా సమయం పడుతుంది. నేరుగా ఎందుకు గుర్తించలేం? సౌర కుటుంబం అంచుల్లో ఉన్న గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్లు పరిభ్రమించే వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా సూర్యుడి చుట్టూ తిరిగేందుకు కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మనం పరిశీలిస్తున్న సమయంలో.. అవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు.అందువల్ల వాటిని నేరుగా గుర్తించడం కష్టం. ఒకసారి గుర్తిస్తే.. వాటి పరిమాణం, వేగం, ఇతర అంశాలు తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు ప్లానెట్ 9 ►సౌర కుటుంబం చివరిలో ఉన్న నెప్ట్యూన్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు 165 ఏళ్లు పడుతుంది. అదే ప్లూటోకు 248 ఏళ్లు, దాని అవతల ఉన్న మరుగుజ్జు గ్రహం ఎరిస్కు 558 ఏళ్లు, సెడ్నాకు 11,408 ఏళ్లు పడుతుంది. భిన్న వాదన కూడా ఉంది క్యూపియర్ బెల్ట్‌లోని కొన్ని మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల కక్ష్య, ఇతర అంశాలు భిన్నంగా ఉండటానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చని.. అక్కడ భారీ గ్రహం ఉండకపోవచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ బ్లాక్ హోల్ అయితే? సౌర కుటుంబం ఆవల భారీ గ్రహం కాకుండా.. చిన్న స్థాయి బ్లాక్‌హోల్ ఉండి ఉండొచ్చని మరో ప్రతిపాదన కూడా ఉంది. ఆ బ్లాక్‌హోల్ ప్రభావం వల్లే కొన్ని ఆస్టరాయిడ్లు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని 2020లో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనా పత్రం వెలువరించారు. ఖగోళ వస్తువులను ఇన్ఫ్రారెడ్ తరంగాల ద్వారా కాకుండా.. ఎక్స్‌రే, గామా కిరణాల ద్వారా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని సూచించారు. -
మన ‘గ్రహ’బలం ఎంత?
మీరీ విషయం విన్నారా.. మన భూమిలాగే ఉన్న మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారట. అక్కడ జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉందంటున్నారు.. అవునూ.. ఇక్కడ భూమ్మీద కాబట్టి మనం హాయిగా జీవించగలుగుతున్నాం. అదే సౌర కుటుంబంలోని మిగతా గ్రహాలకుగానీ మనం వెళితే.. స్పేస్ సూట్ లేకుండా అక్కడ మనం బతకగలమా? బతికితే ఎన్నాళ్లూ లేదా ఎన్ని క్షణాలు? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? మాకు వచ్చింది.. మరి సమాధానం కనుగొందామా? చలో మరి సౌర కుటుంబంలోని మన బంధువుల ఇంటికి.. సూర్యుడు.. సూర్యుడి దగ్గరికి వెళ్లగానే వెంటనే మాడిపోయి.. ఆవిరైపోతాం. కాబట్టి ఇక్కడ అస్సలు చాన్సే లేదు. బతికే సమయం: సెకను కన్నా తక్కువ బుధుడు సూర్యుడి వైపు ఉన్న ప్రాంతం చాలా వేడిగా ఉంటుంది. అక్కడ 427 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి వైపు కాకుండా ఉన్న ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మైనస్ 179 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు కలిసే చోట నిలబడితే మనం ఊపిరి బిగబట్టే సమయం బతకొచ్చు. బతికే సమయం: రెండు నిమిషాలకు పైగా.. శుక్రుడు దీనిపై దాదాపు 482 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి భూమిపై మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఆవిరి అయ్యేంత సమయం బతుకుతాం. సమయం: సెకను కన్నా తక్కువ భూమి ఆక్సిజన్, నీరు, ఆహారం ఇవన్నీ మానవ జీవనానికి అనుకూలంగాదీన్ని మార్చేశాయి. సమయం: 80 సంవత్సరాలకు పైగా.. అంగారకుడు ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. గాలి చాలా పలుచగా ఉండటంతో ఈ చల్లదనం మన భూమిపై మాదిరిగా బాధించదు. సమయం: రెండు నిమిషాలకు పైగా.. గురుడు పూర్తిగా వాయు గ్రహం కాబట్టి.. ఇక్కడ బతకడం చాలా కష్టం. నిలబడాలని ప్రయత్నిస్తే ఆ గాలి లోపలికి వెళ్లిపోతాం. అక్కడి పీడనానికి వెంటనే ఆ గాలిలోనే కలసి పోతాం. సమయం: సెకను కన్నా తక్కువ.. శని శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాల కారణంగా ఈ గ్రహంపై నడవలేం.. కనీసం నిల్చోలేం. సమయం: సెకను కన్నా తక్కువ. యురేనస్, నెప్ట్యూన్ గురుడు మాదిరిగానే ఈ రెండు గ్రహాలు కూడా వాయు గ్రహాలే. ఇక్కడ కూడా ఆ వాయువుల్లోకి వెళ్లిపోతాం. వాయువుల పీడనానికి గాల్లోనే కలసిపోతాం. బతికే సమయం: రెండు గ్రహాల్లో సెకను కన్నా తక్కువ.. -
పంచాయతీలదే పూర్తి బాధ్యత
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమ సంపూర్ణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా హరితహారం కార్యక్రమం కింద నర్సరీల్లో మొక్కలను పెంచడం, వాటిని నాటించడం, సంరక్షించడం అంతా పంచాయతీలకే ప్రభుత్వం అప్పగించింది. గతంలో హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీల ఆధ్వర్యంలోనే నిర్వహించినా వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించడంతో అందరి సహకారంతోనే హరితహారం కార్యక్రమం కొనసాగింది. అయితే ఇప్పటి నుంచి పంచాయతీలే హరితహారానికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేశారు. గతంలో రెండు మూడు గ్రామాలకు ఒక నర్సరీని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీ శాఖలు వేరు వేరుగా నర్సరీలను నిర్వహించి గ్రామాలకు అవసరమైన మొక్కలను సరఫరా చేశారు. అయితే సవరించిన పంచాయతీరాజ్ చట్టంలో హరితహారం కార్యక్రమ బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించడంతో ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పంచాయతీ నర్సరీలను నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 656 గ్రామ పంచాయతీలు ఉండగా అంతే మొత్తంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. వచ్చే జూన్, జూలై మాసాల్లో హరితహా రం ఐదవ విడత కార్యక్రమాన్ని నిర్వహించనుండటంతో ఈ కార్యక్రమం పూర్తిగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలోనే సాగనుంది. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలు హరితహారం బాధ్యతలను నిర్వహించాయి. ఇక నుంచి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే అన్ని శాఖలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. గ్రామానికి 40 వేల మొక్కలు.. హరితహారం కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఏటా 40 వేల మొక్కలను నాటించాలని ప్రభుత్వం గతంలోనే లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పించడంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించారు. ఇప్పుడు మాత్రం పంచాయతీల ప్రతినిధులు ఈ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. కాగా భౌగోళికంగా చిన్నగా ఉన్న పంచాయతీల్లో ఇంత మొత్తంలో మొక్కలు నాటడం సాధ్యం అవుతుందా లేదా అనే సంశయం వ్యక్తం అవుతోంది. మేజర్ పంచాయతీలు, భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న గ్రామాలలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం సాధ్యం అవుతుంది. చిన్న పంచాయతీల్లో మాత్రం భారీ లక్ష్యం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయిన తరుణంలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరగా వాటికి ప్రభుత్వం పెద్ద బాధ్యతనే అప్పగించిందని అంటున్నారు. -
సౌర కుటుంబంలో ఇంకో బుల్లి గ్రహం..
సౌర కుటుంబం గురించి మనకంతా తెలుసు అనుకుంటున్నాం గానీ.. దీంట్లో ప్లూటోకు ఆవల ఇంకో బుల్లి గ్రహం ఉన్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. 2015టీజీ387 అని పిలుస్తున్న ఈ డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) వ్యాసం కేవలం 300 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన జాబిల్లి కంటే పదిరెట్లు చిన్నదన్నమాట. అయితే ఈ బుల్లిగ్రహం సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పట్టే సమయం మాత్రం ఏకంగా 40 వేల ఏళ్లు! సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఇది గరిష్టంగా 2300 అస్ట్రనామికల్ యూనిట్స్ దూరం (భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం ఒక అస్ట్రనామికల్ యూనిట్) వెళుతుందని దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన డేవిడ్ థోలెన్ తెలిపారు. సౌరకుటుంబం అంచుల్లో ఇలాంటి మరుగుజ్జు గ్రహాలు ఇంకా బోలెడన్ని ఉండే అవకాశముందని, వాటి సైజు, తిరిగే దూరాలను పరిగణలోకి తీసుకుంటే చాలావాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమని డేవిడ్ వివరించారు. మూడేళ్ల క్రితం ఈ మరుగుజ్జు గ్రహం దాదాపు 65 అస్ట్రనామికల్ యూనిట్స్ సమీపానికి రావడం వల్ల గుర్తించడం వీలైందని అంచనా. ఈ గ్రహ కక్ష్యను కంప్యూటర్ల ద్వారా కృత్రిమంగా సృష్టించినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్న ప్లానెట్ ‘ఎక్స్’ ఇదే కావచ్చునన్న అంచనా కలుగుతుందని డేవిడ్ వివరించారు. -
ఈ అవతార్.. కొత్తది యార్..
జాబిల్లి మట్టిని ముట్టుకుంటే ఎలా ఉంటుంది? అంగారకుడిపై ఉండే అగ్నిపర్వతం ఎత్తు ఎంత? ఇవేమిటి.. వీటితోపాటు సుదూర గ్రహాల విషయాలు మీరు స్వయంగా అనుభూతి పొందే రోజు వచ్చేస్తోంది ఎలాగంటారా? మీ అవతారాలను రోబోల రూపంలో ఇతర గ్రహాలపైకి పంపేస్తే సరి అంటోంది జపాన్! అవతార్ గుర్తుంది కదా.. హాలీవుడ్లో సూపర్‌హిట్ సినిమా ఇది. మనిషి పండోరా అనే గ్రహంపైకి వెళ్లడం.. ఆ గ్రహంపై హీరో ఓ యంత్రంలో పడుకుంటాడు. యంత్రం ఆన్ కాగానే.. అతడి మెదడులోని ఆలోచనలన్నీ ఆ గ్రహంపై ఉండే జీవి శరీరంలోకి చేరిపోతాయి. ఆ అవతారంతో గ్రహంపై హీరో కొన్ని పనులు చక్కబెట్టడం స్థూలంగా ఆ సినిమా ఇతివృత్తం. జపాన్ విమానయాన సంస్థ ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ (ఏఎన్ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)లు ఇప్పుడు ‘అవతార్ ఎక్స్’ పేరుతో చేపట్టిన ఓ ప్రాజెక్టు అవతార్ సినిమా కథకు ఏమాత్రం తీసిపోనిది. కాకపోతే ఇందులో యుద్ధాలు ఏమీ ఉండవు అంతే తేడా. మరి ఏముంటాయి అంటారా? మనిషి భూమ్మీద డ్రిల్లింగ్ మెషీన్‌తో పనిచేస్తూంటే.. ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ల దూరంలో రోబోల రూపంలో ఉండే మనిషి అవతారాల చేతుల్లోని యంత్రాలు పనిచేస్తాయి! జాబిల్లిపైకి కానివ్వండి.. మనం ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్న అంగారకుడిపైన కానివ్వండి ప్రయోగాలు చేయడం ఆషామాషీ కాదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాల ద్వారా మనిషి ఇప్పటివరకూ చేరగలిగింది జాబిల్లిపైకి మాత్రమే. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి మనిషిని పంపే ఆలోచనలు ఉన్నా అవి ఎంత వరకు విజయవంతమవుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో జపాన్ సంస్థలు ఓ వినూత్న ఆలోచనతో అవతార్–ఎక్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. ఇతర గ్రహాలపైకి మనిషిని పంపకుండానే.. అవసరమైన అన్ని ప్రయోగాలు చేసేందుకు రోబోలను మాధ్యమంగా ఎంచుకున్నాయి. ఇందుకోసం ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వర్చువల్ రియాలిటీ, హ్యాప్టిక్ టెక్నాలజీ (స్పర్శ, రుచి, వాసన వంటి అనుభూతులను కలిగించేవి)లను వాడుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది మార్చిలోనే భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఏఎన్ఏ ‘అవతార్ విజన్’ పేరుతో జాక్సా ‘జే–స్పార్క్’ పేరుతో ఈ పథకానికి సంబంధించిన ప్రణాళికను విడుదల చేశాయి. తాజాగా ఈ రెండు సంస్థలు కలసి ‘అవతార్ – ఎక్స్’కు శ్రీకారం చుట్టాయి. ఒయిటాలో అత్యాధునిక పరిశోధనశాల.. అవతార్–ఎక్స్ కోసం జపాన్‌లోని క్యూషూ దీవిలో ఉండే ఒయిటా ప్రాంతంలో ఓ భారీ ప్రయోగశాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అభివృద్ధి చేసే కొత్త కొత్త సాంకేతికతలన్నింటి ప్రయోగాలు ఇక్కడే జరుగుతాయి. 2020–25 మధ్యకాలంలో ఈ టెక్నాలజీలన్నింటినీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, భూమి దిగువకక్ష్యల్లో పరిశీలించి చూస్తారు. ఈ సమయంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించేందుకు కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఏ టెక్నాలజీలు మనిషి ఇతర గ్రహాలపై సుఖంగా నివసించేందుకు అవసరమైన అన్ని టెక్నాలజీలను అవతార్ ఎక్స్‌లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. రోబోలను భూమ్మీద నుంచే నియంత్రిస్తూ అంతరిక్షంలో నిర్మాణాలు ఎలా చేయాలి.. ఆయా గ్రహాలపై ఎగిరే విమానాలను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా భూమ్మీది పైలట్లు నియంత్రించడం ఎలా.. అన్నవి కూడా ఇందులో ఉంటాయి. భవిష్యత్తులో జాబిల్లి, అంగారక గ్రహాలపై మనిషి ఏవైనా కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. వాటిని ఇక్కడి నుంచే నియంత్రించడం ఎలా అన్నది కూడా అవతార్ ఎక్స్‌లో భాగంగా ఉంటుంది. ఆయా గ్రహాలపై ఉన్న అనుభూతిని అందరికీ కలిగించగలిగే టెలీప్రెజెన్స్ టెక్నాలజీల ద్వారా సామాన్య ప్రజలకు వినూత్నమైన వినోదాన్ని అందించొచ్చని జాక్సా, ఏఎన్ఏలు భావిస్తున్నాయి. టెలీప్రెజెన్స్ టెక్నాలజీ కోసం ఏఎన్ఏ రూ.700 కోట్ల మొత్తంతో అవతార్ ఎక్స్ ప్రైజ్‌తో ఓ పోటీని కూడా ఏర్పాటు చేసింది. – సాక్షి, హైదరాబాద్ -
భ్రమా..? బ్రహ్మా..?
సమస్త చరాచర జగత్తంతా బ్రహ్మ సృష్టేనని అంటారు.మనం నివసిస్తున్న భూగోళమే మనకు తెలిసిన బ్రహ్మాండం.సృష్టిలో ఇదొక్కటే బ్రహ్మాండమా? మరో నాలుగువేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయా? విశాల విశ్వంలో ఎన్నో సౌర కుటుంబాలు ఉంటే అక్కడ మనలాంటి కుటుంబాలు ఉండవా? భూమిని మింగిన మానవుడు ఆ నింగినిమింగక మానేస్తాడా? మనకు తెలిసిన సృష్టి మాత్రమేనా? మిగిలినదంతా మనిషి సృష్టేనా? ఎన్నో నిజాలను ఛేదించిన మానవుడు అన్నే అబద్ధాలనూఅల్లాడుగా! మన నింగి అవతల జీవం ఉందా? బ్రహ్మ సృష్టిలో అది కూడా ఒక మాయా? లేక అంతా మన భ్రమా? మనం నివసించే భూమికి వెలుపల మరింకెక్కడైనా జీవం ఉందా..? ఉంటే, ఎక్కడ ఉంది? ఎలా ఉంది? జీవం ఉన్నత ఇతరేతర గ్రహాలకు వెళ్లి భూమ్మీది మనుషులు మనుగడ సాగించగలరా..? చాలాకాలంగా ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి శతాబ్దాలుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. భూమికి వెలుపల గ్రహాలపై జీవానికి సంబంధించి ఇప్పటివరకు లభించినవల్లా చిన్నచిన్న ఆధారాలు మాత్రమే! సౌర కుటుంబానికి వెలుపల ఎక్కడో ఒకచోట గ్రహాంతరవాసులు ఉండవచ్చని, వారు మనకంటే తెలివైన వారై ఉంటారని సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డాడు. విశాల విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఒకటి కాదు, రెండు కాదు కోటాను కోట్లుగా ఉన్నాయి. ‘కెప్లర్ స్పేస్ మిషన్’ 2013లో వెల్లడించిన నివేదిక ప్రకారం భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఏకంగా 4 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇవన్నీ సూర్యుని వంటి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి. భూమిని పోలిన ఈ గ్రహాలపై ఎక్కడో ఒక చోట జీవజాలం మనుగడ సాగిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తల ఊహ. గ్రహాంతర జీవుల ఉనికిని ఆధునిక శాస్త్రవేత్తలెవరూ కొట్టిపారేయడం లేదు. భూమికి వెలుపల– ఇంకా చెప్పాలంటే మన సౌరకుటుంబానికి వెలుపల ఉన్న కొన్ని గ్రహాలపై జీవులు ఉండవచ్చని, ఆ జీవుల్లో మనుషులను పోలిన తెలివితేటలు గల జీవులు కూడా ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంత రిక్షంలో అక్కడక్కడా గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ) కనిపించినా, గ్రహాంతర వాసులు భూమిపైకి లేదా కనీసం భూమి పరిసరాల్లోకి వచ్చారనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు. అలుపెరుగని అన్వేషణ భూమికి ఆవల జీవం కోసం శాస్త్రవేత్తలు అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అంగారకునిపై జరిపిన అన్వేషణల్లో కొన్ని ఆశాజనకమైన ఫలితాలు లభించాయి. అంగారకుని ఉపరితలం నుంచి సేకరించిన మట్టిలోని మూలకాలు, అక్కడ వ్యాపించి ఉన్న వాయువుల నమూనాలు సూక్ష్మజీవుల మనుగడకు సానుకూలంగా ఉన్నట్లు ‘నాసా’ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూమిపై రాలిపడ్డ గ్రహశకలాలను కూడా ‘నాసా’ శాస్త్రవేత్తలు నిశితంగా పరీక్షించారు. వీటి కణాల్లో జీవానికి కీలకమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ నిర్మాణాలను గుర్తించారు. దీని ఆధారంగా భూమ్మీద పడిన అంతరిక్ష ధూళి నుంచి ఇక్కడ జీవం ఆవిర్భవించి ఉండవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ‘నాసా’ శాస్త్రవేత్తలు 2011 నవంబర్‌లో ప్రయోగించిన ‘క్యూరియాసిటీ రోవర్’ 2012 ఆగస్టులో అంగారకుని ఉపరితలంపై ‘గేల్ కార్టర్’ ప్రాంతంలో దిగింది. అయితే, ఇది అంగారకునిపై జీవుల ఉనికిని మాత్రం కనుగొనలేకపోయింది. ఒకవైపు ‘నాసా’ తనవంతు ప్రయోగాలు, ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై జీవం ఉనికి కనుగొనే లక్ష్యంతో 2014లో న్యూయార్క్‌లోని కార్నెల్ వర్సిటీలో కార్ల్ సాగన్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ఈ సంస్థ రెండు భారీ టెలిస్కోప్‌ల సాయంతో సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై నెలకొన్న పరిస్థితులను తిలకించి, వాటిపై జీవం మనుగడకు ఉండే అవకాశాలపై పలు అంచనాలు వేసింది. ఇదిలా ఉంటే, భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో సౌరమండలాన్ని తలపించే నక్షత్ర వ్యవస్థలో ‘గ్లైకోలాల్డిహైడ్’ అనే చక్కెర అణువుల ఉనికిని కోపెన్‌హాగెన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవకణాల నిర్మాణంలో కీలకమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏల్లో కీలకమైనవి ఈ చక్కెర అణువులే కావడంతో అక్కడ జీవుల ఉనికి ఉండవచ్చనే అంచనాకు వచ్చారు. భూమిలాంటి మరికొన్ని గ్రహాలు సౌరకుటుంబానికి వెలుపల భూమిలాంటి గ్రహాల కోసం శాస్త్రవేత్తలు చిరకాలంగా అన్వేషణ సాగిస్తూ వస్తున్నారు. శక్తిమంతమైన టెలిస్కోప్‌ల సాయంతో అంతరిక్షాన్ని తరచి తరచి చూస్తూ వస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా 1992 నుంచి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భూమిని సరిపోలిన 3,797 గ్రహాలను గుర్తించారు. అలాగే, సౌరకుటుంబం తరహా 632 బహుళ గ్రహ వ్యవస్థలను గుర్తించారు. ఈ గ్రహాలపై తగినంత పరిమాణంలో ఆక్సిజన్ ఉన్నట్లయితే, వాటిపై జీవం మనుగడకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ వాటిపై ఆక్సిజన్ ఎంత ఉందనేది మాత్రం వారు అంచనా వేయలేకపోతున్నారు. భూమిలాంటి గ్రహాలు మరికొన్ని ఉంటాయని, వాటిపై సాధారణ జీవజాలంతో పాటు మనుషులను పోలిన తెలివైన జీవులు కూడా ఉంటారని శతాబ్దాల నాటి నుంచి కొందరు తత్వవేత్తలు నమ్ముతూ వస్తున్నారు. ఫ్రెంచి తత్వవేత్త బెర్నార్డ్ లె బొవియర్ డి ఫాంటినెల్, ఇంగ్లిష్ వైద్యుడు, తత్వవేత్త జాన్ లాకె, ఫ్రెంచి ఖగోళవేత్త నికోలస్ కామిల్ ఫ్లెమారియన్ వంటి వారు సౌరకుటుంబానికి వెలుపల ఇదే తరహా గ్రహ వ్యవస్థలు ఉంటాయని, వాటిలోనూ భూమిలాంటి గ్రహాలు ఉంటాయని, ఆ గ్రహాలపై జీవజాలం ఉంటుందనే విశ్వాసాన్ని తమ రచనల్లో ప్రకటించారు. పద్దెనిమిదో శతాబ్దిలో యురేనస్‌ను కనుగొన్న విలియమ్ హెర్షెల్ సహా ఆయన సమకాలికులైన ఖగోళవేత్తలు పలువురు సౌరకుటుంబంలో గ్రహాంతరవాసులు ఉంటారని నమ్మేవారు. అద్భుతాలకు ఆలవాలం అంతు చిక్కని అంతరిక్షం అంతులేని అద్భుతాలకు ఆలవాలం. ఆది నుంచి ఆకాశాన్ని చూసినప్పుడల్లా మానవుడు అబ్బురపడుతూనే ఉండేవాడు. పగటి వేళ తూర్పున ఉదయించే సూర్యుడు మధ్యాహ్నం నడినెత్తికి చేరుకుని, పశ్చిమాన అస్తమించడం, సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి అలముకున్నాక ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ లెక్కించలేనన్ని నక్షత్రాలు, నక్షత్రాల సరసనే కనిపించే నెలవంక దినదినాభివృద్ధి చెంది, పున్నమి నాటికి నిండుగా కనువిందు చేయడం, అలాగే క్రమ క్రమంగా క్షీణించి అమావాస్య నాటికి అసలే కనిపించకుండా పోవడం వంటి క్రమం తప్పని దృశ్యాలు, కాలంతో మారే రుతువులు, అప్పుడప్పుడు వచ్చే గ్రహణాలు మనుషుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కొందరు ఆలోచనాపరులు వీటి కారణాలను అన్వేషించడం ప్రారంభించారు. అంతరిక్ష అద్భుతాలపై అన్వేషణ క్రీస్తుపూర్వం నాలుగు వేల ఏళ్ల నాడే మొదలైంది. గ్రహణాలను లెక్కించడమే తొలి పురోగతి అంతరిక్ష పరిశీలనతో గ్రహణాలను కచ్చితంగా లెక్కించడమే ఖగోళ శాస్త్రంలోని తొలి పురోగతి. క్రీస్తుపూర్వం నాలుగువేల ఏళ్ల కిందట చైనా జ్యోతిషులు ఈ ఘనతను సాధించారు. క్రీస్తుపూర్వం 2698–2598 మధ్య కాలంలో హ్వాంగ్ టే అనే చైనా చక్రవర్తి అబ్జర్వేటరీని నిర్మించాడు. అప్పటి వారికి సూర్య చంద్రులతో పాటు బుధ, శుక్ర, అంగారక, గురు, శని గ్రహాల గురించి తెలుసు. క్రీస్తుపూర్వం 2449లో సంభవించిన పంచగ్రహ కూటమిని వారు రికార్డు చేశారు. ప్రాచీన ఖగోళ శాస్త్రానికి ఆద్యులు బాబిలోనియా ప్రాంతానికి చెందిన కాల్డియన్లు, ఈజిప్షియన్లు అని గ్రీకు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కాల్డియన్లు పెద్ద పెద్ద సిద్ధాంతాలను ప్రతిపాదించకపోయినా, శతాబ్దాల తరబడి ఆకాశాన్ని నిశితంగా పరిశీలించి కొన్ని కీలకమైన విషయాలను కనుగొన్నారు. భూమి తనలో తాను తిరిగే వేగం ఆధారంగా ప్రతి 18 సంవత్సరాల 11 రోజుల వ్యవధిలో 235 చాంద్రమాసాలు వస్తాయి. ఈ వ్యవధిలో ఏర్పడిన గ్రహణాలను గుర్తు పెట్టుకుని, మళ్లీ వచ్చే 235 చాంద్రమాసాలలో అవే గ్రహణాలు పునరావృతం అవుతాయని కనిపెట్టారు. కాల్డియన్లు రికార్డు చేసిన గ్రహణ సమయాలలో తేడాను డాక్టర్ జె.కె.ఫాదరింగ్ హామ్ అనే ఆధునిక శాస్త్రవేత్త సవరించాడు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలోని సూక్ష్మమైన తగ్గుదల, ఫలితంగా రోజు కాల పరిమితిలో ఏర్పడ్డ పెరుగుదలను గుర్తించి, ఆయన గ్రహణ సమయాలను మరింత నిక్కచ్చిగా సూచించాడు. వేదాలలో ఖగోళ విజ్ఞానం ప్రపంచంలో ప్రాచీన నాగరికతలు విలసిల్లిన కాలంలోనే భారతదేశంలో వేదాలు ఉనికిలో ఉన్నాయి. వేదాలు ఏ కాలానికి చెందినవనే విషయమై కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే, మన వేదాలలో ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన అనేక శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా రుగ్వేదంలో రాశిచక్ర వర్ణన ఉంది. ‘‘పన్నెండు ఆకులు గల కాలచక్రం గగనంలో తిరుగుతోంది. ఆ చక్రం మీద 720 మిథునాలు ఉన్నాయి.’’ అనే వర్ణన రుగ్వేద శ్లోకాల్లో ఉంది. భగవద్గీతలో విశ్వరూపాన్ని వర్ణించే శ్లోకాలు ఉన్నాయి. ఆది మధ్యాంతాలు లేని భూ గగన దిగంతరమంతా విశ్వరూపంలో సాక్షాత్కరిస్తుందని, సమస్త చరాచర ప్రపంచం దానిలో ఏకకాలంలో కనిపిస్తుందని వర్ణించాడు గీతకారుడు. మరే దేశపు ప్రాచీన సాహిత్యంలోనూ అనంత విశ్వం గురించి ఇలాంటి కవితాత్మక వర్ణన కనిపించదు. భారతీయ ఖగోళ విజ్ఞానానికి మూలగ్రంథం ‘సూర్య సిద్ధాంతం’. ఇది పూర్తిగా దొరకలేదు. శిథిలమైన లిఖిత ప్రతులు మాత్రమే దొరికాయి. దీని కర్త ఎవరో, రచనా కాలమేదో తెలియదు. సూర్యుడు మయుడికి ఉపదేశించిన సిద్ధాంతమే ఈ గ్రంథం అని సంప్రదాయవాదులు భావిస్తారు. ‘సూర్యసిద్ధాంతం’ గ్రంథంలో దొరికిన భాగాలలోని విషయాల ప్రకారం భూమి వ్యాసం 1600 యోజనాలు. యోజనం అంటే 4.9 మైళ్లు. ఈ లెక్కన ‘సూర్యసిద్ధాంతం’ ప్రకారం భూమి వ్యాసం 7,849 మైళ్లు. ఇది నేటి లెక్కకు దాదాపు దగ్గరగానే ఉంది. ఆధునిక పరిశోధనల ప్రకారం భూమధ్యరేఖ వద్ద భూమి వ్యాసం 7,917, 5 మైళ్లు. భూమి నుంచి చంద్రునికి గల దూరం 51,566 యోజనాలుగా (2.53 లక్షల మైళ్లు) లెక్కగట్టింది ‘సూర్యసిద్ధాంతం’. ఇది కూడా ఆధునిక లెక్కలకు దగ్గరగానే ఉంది. ఆధునిక పరిశోధనల ప్రకారం ఈ దూరం 2,38,900 మైళ్లు. ‘సూర్యసిద్ధాంతం’ రచించిన నాటికి టెలిస్కోప్ వంటి పరికరాలేవీ అందుబాటులో లేవు. ఏ పద్ధతిలో ఈ లెక్కలను గుణించారో కూడా తెలియదు. ‘సూర్యసిద్ధాంతం’ తర్వాత భారతదేశం నుంచి వెలుగులోకి వచ్చిన గొప్ప ఖగోళ శాస్త్ర గ్రంథం ‘ఆర్యభట్టీయం’. దీనిని క్రీస్తుశకం 476 ప్రాంతానికి చెందిన ఆర్యభట్టు రచించాడు. కాలాన్ని లెక్కించేందుకు జలగడియారం, ఛత్రయంత్రం వంటి పరికరాలను కనుగొన్నాడు. భూభ్రమణ వేగాన్ని, రోజు వ్యవధిని, గ్రహణ కాలాలను నిర్దుష్టంగా లెక్కగట్టాడు. గ్రహణాలు ఛాయల ప్రభావం వల్ల ఏర్పడతాయని తేల్చిచెప్పాడు. ఆర్యభట్టు తర్వాత మొదటి భాస్కరాచార్యుడు, వరాహ మిహిరుడు, రెండవ భాస్కరాచార్యుడు ఖగోళ, గణిత, జ్యోతిష శాస్త్రాల్లో గణనీయమైన కృషి చేశారు. కోపర్నికస్ కంటే ముందే... సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని ప్రపంచానికి ముందుగా చెప్పిన శాస్త్రవేత్త కోపర్నికస్ అనే చాలామంది నమ్ముతారు. నిజానికి ఈ విషయాన్ని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త అరిస్టార్కస్ లోకానికి వెల్లడించాడు. భూమి నుంచి సూర్య చంద్రుల దూరాలను లెక్కించడానికి అతడు చాలా ప్రయత్నాలు చేశాడు. అరిస్టార్కస్ సమకాలీనులు, అతడి తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిన శాస్త్రవేత్తలు అతడి సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. ప్రాచీన గ్రీకు ఖగోళ చరిత్రలో చిట్టచివరి ప్రసిద్ధుడైన టాలెమీ భూ కేంద్ర సిద్ధాంతాన్ని పునరుద్ధరించాడు. విశ్వానికి భూమి కేంద్రంగా ఉందనే వాదాన్ని బలంగా వినిపించాడు. దాంతో అరిస్టార్కస్ సిద్ధాంతం పూర్తిగా మరుగునపడింది. నవీనయుగ ప్రారంభంలో క్రీస్తుశకం పదిహేనో శతాబ్దికి చెందిన పోలిష్ శాస్త్రవేత్త కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదనే వాదాన్ని పునరుద్ధరించాడు. కోపర్నికస్ సిద్ధాంతంతో ఖగోళశాస్త్రంలో పురోగమనం మొదలైంది. కోపర్నికస్‌కు శతాబ్దం తర్వాతి వాడైన గెలీలియో టెలిస్కోప్‌ను కనుగొనడంతో ఖగోళ శాస్త్ర పురోగమనం మరింతగా ఊపందుకుంది. గెలీలియో కనుగొన్న టెలిస్కోప్ సాయంతో నాటి శాస్త్రవేత్తలు శుక్ర గ్రహం గమనాన్ని, గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను భౌతికంగా చూడగలిగారు. అంతరిక్షంలోనూ వ్యాపారం గ్రహాంతర జీవుల ఉనికి గురించి కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, కొందరు తెలివైన మనుషులు అంతరిక్షంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. వ్యాపారం అంతరిక్షానికి సంబంధించినదే అయినా వారి లావాదేవీలు సాగేది మాత్రం ఈ భూమ్మీదనే. చంద్రుడి మీద మనిషి కాలు మోపిన తర్వాత అతితెలివి వ్యాపారులకు కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగి, ఏకంగా చంద్రుడిపై స్థలాలను ఎడాపెడా అమ్మడం మొదలుపెట్టారు. భూమికి వెలుపల ఉండే గ్రహాలపై ఉన్న స్థలాలను ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోజాలరంటూ 1979లో ఐక్యరాజ్య సమితి చొరవతో ‘ఇంటర్నేషనల్ మూన్ ట్రీటీ’ అమలులోకి వచ్చినా, చాలా దేశాలు దానికి ఆమోదం తెలపలేదు. ఇదే అదనుగా కొందరు చంద్రునిపై స్థలాల అమ్మకాలను ప్రారంభించారు. ఇప్పుడైతే వ్యవహారమంతా ఆన్లైన్లోనే సాగిస్తున్నారు. చంద్రుడిపై ఎకరా స్థలాన్ని 30 డాలర్లకే (రూ.2,067) విక్రయిస్తూ, భలే మంచి చౌకబేరము... అనే రీతిలో ఊరిస్తున్నారు. భూమ్మీద ఎడారి ప్రదేశాల్లో సైతం ఇంత చౌకగా స్థలాలు దొరికే వీలు లేకపోవడంతో కొందరు ఎందుకైనా పనికొస్తుందనే ఉద్దేశంతో చంద్రునిపై స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. అంతరిక్షంలోని గ్రహాంతర స్థలాలను సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఈనాటిది కాదు. జగజ్జేతగా చరిత్రకెక్కిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కూడా అంతరిక్షాన్ని సొంతం చేసుకోవాలని తలచాడు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన ప్రష్యా రాజు ఫ్రెడెరిక్ తన జబ్బును నయం చేసిన జుర్గెన్ అనే వైద్యుడికి చంద్రుడిని రాసిచ్చేశాడు. జుర్గెన్ వారసుల్లో ఒకరు చంద్రుడిపై వారసత్వ హక్కుల కోసం 1996లో కోర్టుకెక్కడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడక్కడా కొందరు విచిత్రమైన వ్యక్తులు చంద్రుడిపైనే కాదు, ఇతరేతర గ్రహాలపై హక్కులు తమవేనంటూ కోర్టులకెక్కిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి తలతిక్క మనుషుల వల్ల సీరియస్‌గా అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు, పరిశోధన సంస్థలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ‘నాసా’ అంగారకుడిపైకి ‘క్యూరియాసిటీ రోవర్’ పంపడంతో, యెమెన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ‘నాసా’పై కేసు వేశారు. అంగారక గ్రహం మూడువేల ఏళ్ల కిందటే పూర్వీకుల నుంచి తమ వంశానికి సంక్రమించిందని, తమ అనుమతి లేకుండా ‘నాసా’ అంగారక గ్రహంపై చొరబాటుకు తెగబడిందని, అందువల్ల ‘నాసా’ తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ వాదించారు. ఈ కేసు వల్ల ‘నాసా’కు, కోర్టుకు కాలహరణం తప్ప ఒరిగిందేమీ లేదు. అంతరిక్షంపై హక్కుల కోసం మనుషులు నానా తంటాలు పడుతుండటం ఒక ఎత్తయితే, సమీప భవిష్యత్తులోనే మనుషులు గ్రహాంతర వాసులను కలుసుకోగలుగుతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత శతాబ్ది ముగిసేలోగానే మనుషులు గ్రహాంతర జీవులను భౌతికంగా కలుసుకోగలరని, వారితో సంభాషణలు నెరపగలరని అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మిచియో కకు చెబుతున్నారు. ఒకవేళ ఆయన అంచనా ఫలిస్తే, ఇప్పటి తరం వాళ్లు విదేశీయానాలు చేస్తున్నంత తేలికగా మన తర్వాతి తరాల వాళ్లు గ్రహాంతర యానాలు చేయగలరేమో! · అంతరిక్ష అన్వేషణలో కొన్ని మైలురాళ్లు 1610 గెలీలియో టెలిస్కోప్ కనుగొన్నాడు. టెలిస్కోప్ సాయంతో గురు గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను, శుక్ర గ్రహ గమనాన్ని గుర్తించాడు. 1840 టెలిస్కోప్ సాయంతో చంద్రుని ఫొటోను స్పష్టంగా తీయగలిగారు. 1865 జూల్స్ వెర్న్ రాసిన ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’ నవల ప్రచురితమైంది. ఇది తర్వాతి కాలంలో అంతరిక్ష పరిశోధనలకు ఎంతగానో దోహదపడింది. 1924 రష్యాలో గ్రహాంతర యానాల సంఘం స్థాపన. 1946 అంతరిక్షం నుంచి భూగోళం ఫొటోలను తీయగలిగారు. 1947 తొలిసారిగా ప్రాణులను (ఈగలు) అంతరిక్షంలోకి పంపారు. 1951 తొలిసారిగా రెండు జాగిలాలను అంతరిక్షంలోకి పంపారు. 1961 తొలిసారిగా మానవుడు అంతరిక్షంలోకి వెళ్లాడు. ఈ ఘనత సాధించినది రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్. 1969 తొలిసారిగా మానవుడు చంద్రునిపై అడుగు మోపాడు. ఈ ఘనత అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు దక్కింది. 1971 అంతరిక్షంలో తొలి పరిశోధన కేంద్రాన్ని (శాల్యూట్–1) రష్యా ఏర్పాటు చేసింది. 1990 ‘నాసా’ తొలిసారిగా మొత్తం సౌర కుటుంబాన్ని ఫొటో తీయగలిగింది. 2011 ‘నాసా’ తొలిసారిగా అంగారకునిపైకి ‘క్యూరియాసిటీ రోవర్’ను విజయవంతంగా పంపింది. -
వందకు పైగా కొత్త గ్రహాలు!
లాస్ఏంజెలెస్: మన సౌర కుటుంబానికి వెలుపల వందకు పైగా గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటి ఉపగ్రహాలపై జీవనానికి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ గ్రహాలన్నీ వాయు గ్రహాలైనప్పటికీ వాటి ఉపగ్రహాలపై మాత్రం భూమి మాదిరిగా నేలలు ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్లాండ్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2009లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా ఇప్పటికే మన సౌర వ్యవస్థకు వెలుపల వేలాది గ్రహాలను కనుగొన్న విషయం తెలిసిందే. -
ఆ రెండు గ్రహాలు.. ఆవాసయోగ్యాలే!
ట్రాపిస్ట్–1... ఈమధ్యే సౌర కుటుంబానికి ఆవల గుర్తించిన గ్రహ వ్యవస్థ పేరు ఇది. ఏడు గ్రహాలతో కూడిన ట్రాపిస్ట్ –1లో కనీసం రెండు గ్రహాలపై ఆవాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు అమీ బార్ అనే శాస్త్రవేత్త. మొత్తం ఏడు గ్రహాలు కూడా కొంచెం అటు ఇటుగా భూమి సైజులోనే ఉండటం వల్ల ట్రాపిస్ట్ –1 పై శాస్త్రవేత్తలు అమితాసక్తిని చూపుతున్నారు. మిగిలిన గ్రహ వ్యవస్థలతో పోలిస్తే ట్రాపిస్ట్–1 చాలా పాతది. అంతేకాకుండా సాపేక్షంగా సగటు ఉష్ణోగ్రతలూ తక్కువే. అందుకే ఈ గ్రహ వ్యవస్థలో ఆవాసయోగ్యమైనవి ఉండే అవకాశాలు ఎక్కువన్న అంచనాతో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. మొత్తం గ్రహాలను బి, సి, డి, ఇ, ఎఫ్, జి. హెచ్... అనుకుంటే డి, ఇ లు రెండూ ఆవాసయోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోందని బార్ చెబుతున్నారు. -
అంతరిక్షంలో మరో సౌరవ్యవస్థ
మియామి : అచ్చంగా మన సౌర వ్యవస్థను పోలిన మరో సౌర వ్యవస్థను అమెరికాకు చెందిన నాసా గుర్తించింది. కెప్లర్ టెలిస్కోప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఈ సౌర వ్యవస్థ ఉన్నట్లు నాసా అధికారులు ప్రకటించారు. మన సౌర వ్యవస్థలో సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించిన విధంగానే.. అంతరిక్షంలో కొత్తగా గుర్తించిన సౌర వ్యవస్థలోనూ ఒక నక్షత్రం చుట్టూ.. గ్రహాలు తిరుగుతున్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా గుర్తించిన సౌర వ్యవస్థలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడా జీవరాశి మనుగడ సాగించేందుకు అవకాశం లేదని నాసా తెలిపింది. కొత్తగా కనుగొన్న సౌర వ్యవస్థలోని కెప్లర్ 90ఐ గ్రహంలో రాళ్లు, పర్వతాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆ గ్రహం నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 14.4 రోజుల సమయం పడుతుందని నాసా తెలిపింది. అంటే భూమి మీద రెండు వారాల సమయం.. అక్కడ ఒక్క రోజుతో సమానం. మన భూమితో పోలిస్తే అక్కడ ఉష్ణోగ్రత చాలా అధికం. కెప్లెర్ 90ఐ గ్రహం మీద.. 426 డిగ్రీల సెల్సియెస్ వేడి ఉంటుంది. -
మూన్ టు మార్స్
అడిలైడ్: ఎన్నో ఏళ్లుగా విశ్వాంతరంలో గ్రహాంతరవాసుల ఉనికి కోసం మానవుడు అన్వేషిస్తున్నాడు. ఇలాంటి తరుణంలోనే తానే గ్రహాంతరవాసిగా మారుతాడని బహుశా అతను ఊహించి ఉండడు! ఇతర గ్రహాలపై మానవుడు కాలనీలు కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస అంతరిక్ష పరిశోధనలు.. ఆ రోజు మరెంతో దూరంలో లేదని చెప్పకనే చెబుతున్నాయి. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, నానాటికీ పెరుగుతున్న జనాభా, కమ్ముకొస్తున్న అణు యుద్ధ భయాలు, విజృంభిస్తున్న కొత్త వ్యాధులు.. ఇవన్నీ భూగోళాన్ని నివాసానికి పనికిరాని గ్రహంగా మార్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మానవుడికి దిక్కు ఏమిటి? అని అందరూ ఆలోచిస్తుండగా పక్క గ్రహాల నుంచి మానవుడికి వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. మరి మానవుడు మరో గ్రహానికి వెళ్లి నివసించడం సాధ్యమా? చంద్రుడిపైకి వెళ్లాలా, అంగారకుడి మీదకెళ్లాలా? అనే ఎన్నో అనుమానాలు, అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. రానున్న కొన్నేళ్లలో చంద్రుడిపై మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకోగలిగితే తర్వాత లక్ష్యం మాత్రం అంగారకుడే (మార్స్) అవుతుంది. భూమితో పలు రకాల పోలికలు ఉండటమే దానికి కారణం. ఈ నేపథ్యంలో చంద్రుడిపై శాశ్వతంగా నిర్మించే కుగ్రామం అంగారక గ్రహాన్ని చేరుకోడానికి తొలిమెట్టు అవుతుందని ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వెల్లడించింది. అంగారక గ్రహానికి చేరుకుని అక్కడ కాలనీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. తమ తొలి లక్ష్యం చంద్రుడిపై శాశ్వత గ్రామాలను ఏర్పరచడం అయితే అంతిమ లక్ష్యం మాత్రం అంగారకుడిపై కాలనీలు ఏర్పాటు చేయడమేనని ఈఎస్ఏ తెలిపింది. మానవ మనుగడ విస్తరణకు చంద్రుడు ఒక చక్కని ప్రదేశమని అడిలైడ్‌లో 4 వేల మంది అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులతో జరిగిన వార్షిక సమావేశంలో ఈఎస్ఏ పేర్కొంది. ‘ఓ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుని 17 ఏళ్లుగా నివసిస్తున్నాం. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత, అనువైన గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాం. అలాగే అంగారక గ్రహంపైకి తొలి హ్యూమన్ మిషన్ ప్రారంభించే దశలో ఉన్నాం’అని ఈఎస్ఏకు చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. ‘చంద్రుడిపైకి వచ్చే పదేళ్లలో కొన్ని మిషన్లకు ప్రణాళికలు తయారు చేశాం. ఈ మిషన్లు ఓ ఉద్యమాన్ని లేవనెత్తి చంద్రుడిపై శాశ్వత గ్రామాన్ని నిర్మించేందుకు అవసరమైన సమాచార సంపదను సృష్టిస్తాయి’అని వివరించారు. మరోవైపు 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఉపసంహరించుకోనున్న నేపథ్యంలో.. దానికి ప్రత్యామ్నాయంగా శాశ్వత లూనార్ కాలనీ (చంద్ర గ్రామం)ని ఏర్పాటు చేసేందుకు స్పేస్ ఏజెన్సీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ‘డీప్ స్పేస్ గేట్‌వే’అనే కార్యక్రమంలో భాగంగా తొలి లూనార్ స్పేస్ స్టేషన్‌ను నిర్మించే ప్రాజెక్టును నాసా (నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్) చేపట్టింది. ఈ లూనార్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి రష్యా స్పేస్ ఏజెన్సీ, నాసా ఇటీవల సహకార ఒప్పందం కూడా చేసుకున్నాయి. -
సౌర కుటుంబంలో మరో గ్రహం?
సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని పుస్తకాల్లో చదువుకున్నాం.. ఫ్లూటో గ్రహం కాదని ఖగోళ శాస్త్రవేత్తలు తేల్చడంతో ఇప్పుడు ఎనిమిదే ఉన్నాయి. అయితే నెప్ట్యూన్‌కు అవతల ఇంకో గ్రహం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్లానెట్ ఎక్స్, ప్లానెట్ 9గా పిలుస్తున్న ఈ గ్రహం వాస్తవంగానే ఉందని కార్నెగీ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్, నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీలకు చెందిన స్కాట్ షెపర్డ్, ఛాడ్విక్ ట్రుజిల్లో లు ప్రకటించారు. సూర్యుడి చుట్టూ చాలా దూరంగా తిరుగుతున్న కొన్ని ఉప గ్రహాలను, వాటి కక్ష్యా కోణాలను పరిశీలించినప్పుడు అవి ఓ భారీ గ్రహం ప్రభావానికి లోనవుతున్నట్లు తెలిసిందని పేర్కొంటున్నారు. దీన్ని బట్టి సౌరకుటుంబం అంచుల్లో మరో గ్రహం ఉండే అవకాశాలు పెరిగాయంటున్నారు. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరానికి దాదాపు 200 రెట్లు దూరంలో ఉందని, పరిమాణంలో భూమి కన్నా 15 రెట్లు ఎక్కువ ఉందని పేర్కొంటున్నారు. చిలీ, హవాయిల్లో ఉన్న శక్తిమంతమైన టెలిస్కోపులు, కెమెరాలు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ప్లానెట్ ఎక్స్‌కు చాలా దూరంలో తిరుగుతున్న ఓ ఖగోళ వస్తువు ఇతర నక్షత్రాలు, గ్రహాల గురుత్వ శక్తి ప్రభావానికి లోనవుతోందని చెబుతుండటం శాస్త్రవేత్తలో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
గ్రహం అనుగ్రహం
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.చతుర్దశి ప.4.01 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం శ్రవణం రా.1.13 వరకు, వర్జ్యం తె.5.11 నుంచి 6.45 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం ప.11.21 నుంచి 12.11 వరకు అమృతఘడియలు ప.2.38 నుంచి 4.16 వరకు -
గురుత్వ తరంగం ఏమిటి?
వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వ తరంగాలు బ్లాక్‌హోల్స్ గుట్టు రట్టు చేయడంతో పాటు కీలక సమాచారాన్ని అందించనున్నాయి. దీంతో విశ్వ ఆవిర్భావ రహస్యాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గురుత్వ తరంగాల ప్రయోగం తీరుతెన్నులు క్లుప్తంగా.. రబ్బరు షీట్‌ను తీసుకోండి.. గాల్లో వేలాడేలా నాలుగువైపులా పట్టుకోండి. పది కిలోల బరువున్న గుండును దాని మధ్యలో ఉంచారనుకోండి. ఏమవుతుంది? గుండు బరువుకు షీట్ వంగిపోతుంది. ఆ ప్రాంతంలో ఓ గుంతలాంటిది ఏర్పడుతుంది. ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంతో చెప్పిందీ ఇదే! కాలం, ప్రదేశాల కూర్పు రబ్బరుషీటైతే... ద్రవ్యరాశి అధికంగా ఉన్న గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఇనుప గుళ్లన్నమాట! కాలం ప్రదేశాలు రెండూ వంపునకు గురైతే దాన్నే గురుత్వశక్తి అంటారని ఆయన చెప్పారు. ఇంతకీ ఈ సోది అంతా ఇప్పుడెందుకని అనుకుంటున్నారా? ఈ గురుత్వ శక్తి తాలూకూ తరంగలను శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారన్న వార్తలు మీరు చదివే ఉంటారు కదా... అందుకన్నమాట! ఈ గురుత్వ తరంగాలేమిటి? అవి ఎలా ఏర్పడతాయి? వీటిని గుర్తించేందుకు చేసిన ప్రయోగం ఏమిటి? మొత్తమ్మీద అసలీ ప్రయోగంతో మనకు ఒరిగేదేమిటి? అన్న విషయాలను తెలుసుకుంటే.... గురుత్వ తరంగాలు పుట్టేదిలా.. ద్రవ్యరాశి ఉన్న చోట కాలం, అంతరిక్షం వంపునకు గురవుతాయని చెప్పుకున్నాం కదా... ద్రవ్యరాశిని బట్టి ఈ వంపులో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. పైన చెప్పుకున్న ప్రయోగంలో పదికిలోల ఇనుప గుండు ఉండగానే.... మరో అరకిలో గుండును రబ్బరుషీట్ ఓ చివర వదిలితే ఏమవుతుంది? బరువు తక్కువున్న గుండు నెమ్మదిగానైనా పెద్ద గుండు వద్దకు చేరుకుంటుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నా.... గ్రహాలన్నీ సూర్యుడి (సౌరకుటుంబంలో అత్యధిక ద్రవ్యరాశి ఉన్న ఖగోళ వస్తువు) ఇదే కారణం. మరి... సూర్యుడకి కొన్ని రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న కృష్ణ బిలాలు... అవికూడా కొంచెం దగ్గరదగ్గరా ఉంటే? ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటూ ఉంటాయి. వికర్షించుకుంటూ ఉంటాయి కూడా. ఫలితంగా వీటి చుట్టూ ఉన్న కాల, ప్రదేశాల వంపులో తేడాలు వచ్చేస్తాయి. నిశ్చలంగా ఉన్న నీటిలో అకస్మాత్తుగా ఓ గులకరాయిలో పడితే పుట్టే అలల మాదిరిగా గురుత్వ తరంగాలు పుడతాయి. కృష్ణబిలాల ఆకర్షణ, వికర్షణలతోపాటు ఇంధనం ఖర్చయిపోయిన నక్షత్రాలు పేలిపోయినప్పుడు (సూపర్నోవే), ఈ విశ్వం ఆవిర్భావానికి కారణమైన మహా విస్ఫోటం వంటి అనేక సంఘటనల ద్వారా గురుత్వ తరంగాలు పుట్టి... విశ్వమంతా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. లిగో శాస్త్రవేత్తలు గుర్తించింది రెండు కృష్ణబిలాలు లయమైపోవడం వల్ల పుట్టిన తరంగాలనే! ఈ తరంగాలు విశ్వమంతా వ్యాపిస్తూ... అక్కడి కాలం, ప్రదేశాల వంపును కూడా మారుస్తూంటాయి. మన భూమినే తీసుకుంటే ఈ గురుత్వ తరంగాల కారణంగా ఇది అతిసూక్ష్మ స్థాయుల్లో సంకోచ, వ్యాకోచాలకు గురవుతూంటుంది. గుర్తించింది ఇలా.. పైన చెప్పుకున్న రబ్బరు షీట్ ఉదాహరణనే తీసుకుందాం. ఈ రబ్బరుషీట్పై ఇద్దరు వ్యక్తులు కొంచెం ఎడంగా నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. ఇద్దరి మధ్య దూరాన్ని కొలవాలంటే... రబ్బరుషీట్పై ఏదైనా గుర్తులు ఉంచుకుని (కిలోమీటర్ రాయి వంటివి) లెక్కించవచ్చు. అయితే గురుత్వ తరంగాల ప్రభావంతో రబ్బరు షీట్ కూడా సంకోచ, వ్యాకోచాలకు గురవుతూంటుంది కాబట్టి ఇద్దరి మధ్య దూరం కూడా మారుతూంటుంది. మార్పులు ఉన్నట్లు నిర్ధారణైతే ఐన్‌స్టీన్ ప్రతిపాదించింది కరెక్టేనని చెప్పవచ్చు. లిగో ప్రయోగం ద్వారా సాధించింది కూడా ఇదే! లిగో ప్రయోగంలో రెండు ప్రాంతాల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవైన గొట్టాలను ఉపయోగించారు. ఎల్ ఆకారంలో ఉన్న ఈ గొట్టాల్లో ఒకటి భూమి తాలూకూ సంకోచాన్ని, మరొకటి వ్యాకోచాన్ని గుర్తించిందన్నమాట. లేజర్ కాంతి కిరణం గొట్టం ఒక చివరి నుంచి మరో చివరకు చేరేందుకు పట్టిన సమయాన్నిబట్టి దూరాన్ని లెక్కించారు. గురుత్వ తరంగాలు ఢీకొన్నప్పుడు ఈ దూరంలో తేడాలు వచ్చినట్లు గుర్తించారు. తద్వారా గురుత్వ తరంగాలు ఉన్నట్లు నిర్ధారించారు. - సాక్షి, హైదరాబాద్ ప్రయోజనం? విశ్వం ఆవిర్బావం మొదలుకొని అనేక ఖగోళ విషయాలను కొత్త కోణంలో అర్థం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటివరకూ మనం రేడియో తరంగాల ద్వారా మాత్రమే విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మహా విస్ఫోటం తరువాత విశ్వం ఎలా విస్తరించిందన్న విషయంతోపాటు, కృష్ణబిలాలను అర్థం చేసుకునేందుకు, లిగో ప్రయోగం కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీలు కొన్ని సాధారణ ప్రజలకూ ఉపయోగపడేవే. -
చంద్రుడు ఇలా పుట్టాడట!
లాస్ఏంజెలిస్: భూమి, థియా అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనం చెబుతోంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే 430 ఏళ్ల కింద ఈ రెండు గ్రహాలు ఢీకొన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. థియాకు భూమి 45 డిగ్రీల కోణంలో పార్శ్వంగా ఢీకొని ఉంటుందని భావించారు. కానీ అవి రెండు ఎదురెదురుగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు తేల్చారు. చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన ఏడు రాళ్లు, హవాయి, ఆరిజోనాల్లోని భూమి లోపలి పొరల్లో సేకరించిన అగ్నిపర్వత రాళ్లను పరిశీలించాక వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ రెండు రకాల రాళ్లలో ఉన్న ఆక్సిజన్ పరమాణువు నిర్మాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. భూమి పొరల్లోని రాళ్లు, చంద్రుడిపై రాళ్లలో సాధారణ ఆక్సిజన్, దాని ఐసోటోప్ల నిష్పత్తి ఒకే విధంగా ఉందని ప్రొఫెసర్ ఎడ్వర్డ్ యంగ్ తెలిపారు. -
ఔట్ ఆఫ్ ది వరల్డ్..!
శీర్షిక చూసే ఇదేదో ప్రపంచ గతినే మార్చే మహాద్భుత వస్తువు అనుకోవద్దండోయ్! త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారైన ఓ నమూనా. మరి ఇందులో విశేషం ఏమిటంటారా? ఇది మన భూగోళం అవతలి నుంచి వచ్చిన ఖనిజంతో తయారైంది. ఓ తోకచుక్క భూమిని ఢీ కొట్టిన చోట లభించిన ఖనిజంతో దీన్ని రూపొందించారు. ఇనుము, నికెల్... మరికొన్ని ఇతర ఖనిజాలతో కూడిన ఈ తోకచుక్క రాయిని పొడిగా మార్చి... ఆ పౌడర్‌ను ప్రింటర్లో వాడి ఈ నమూనాను రూపొందించారు. భవిష్యత్తులో ఇతర గ్రహాల మీద మానవుడు ఆవాసం ఏర్పరచుకున్నపుడు... అవసరమైన వస్తువులను అక్కడే ఇలా త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారుచేసుకోవచ్చని... ఆ దిశగా ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తున్నారు. అయితే అక్కడి భారరహిత స్థితిలో, భిన్న పీడనాల్లో ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందనేది పరీక్షించి చూడాలంటున్నారు శాస్త్రవేత్తలు. -
అక్కడ కూడా..!
లండన్: మన సౌర మండలానికి బయట.. వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. గ్రహాన్ని పోలిన పీఎస్ఓ జే318.5-22 అనే ఈ ఆవరణ భూమికి 75 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యరహిత మండలంలో ఉంది. వేడి ధూళి, ఇనుప ద్రవ బిందువులతో కూడిన మేఘాల పొరలు అక్కడున్నాయని పరిశోధకులు తెలిపారు. సుదూర రోదసిలో నివాసయోగ్యమైన గ్రహాలను కనుక్కోడానికి ఈ అధ్యయన ఫలితాలు దోహదపడొచ్చని పేర్కొన్నారు. ఎడిన్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం చిలీలోని టెలిస్కోపు ద్వారా దీన్ని గుర్తించింది. పీఎస్ఓ జే318.5-22 దాదాపు 2 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని అంచనా. ఇది పరిభ్రమించినప్పుడు దీని కాంతిలో తేడాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇది గురుగ్రహమంత పరిమాణంలో ఉందని, అయితే ద్రవ్యరాశి మాత్రం ఎనిమిదింతలు ఎక్కువని, అక్కడి మేఘాల్లో 800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని పేర్కొన్నారు. -
మరో మూడు ప్రపంచాలు..!
ఈ విశాల విశ్వంలో భూమి ఒంటరి అని ఒకప్పుడు అనుకునే వారు. ఇరవై ఏళ్ల కిందట ‘51 పెగసీ బీ’ని గుర్తించడంతో ఖగోళశాస్త్రంలో ఓ సంచలనం నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌరకుటుంబానికి అవల దాదాపు 1800 గ్రహాలను గుర్తించారు. వజ్రాల రాశులు పోసి ఉన్న గ్రహాలు కొన్నైతే... ఆమ్లవర్షాలతో తడిసి ముద్దయ్యేవి మరికొన్ని. మరి ఇన్ని వందల గ్రహాల్లో భూమిని పోలినవి ఎన్ని? సూర్యుడి నుంచి ఉండే దూరం, గ్రహంపై ఉష్ణోగ్రత తదితర అంశాలనుబట్టి ఆ గ్రహం హ్యాబిటబుల్ జోన్లో ఉందా? అన్నది లెక్కకడతారు. ఈ లెక్కన భూమిని పోలిన గ్రహాలు మూడింటి వింతలేమిటో చూడండి మరి! గ్లీసీ 667 సీసీ... దాదాపు 22 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమి కంటే 4.5 రెట్లు బరువైంది. ఇక్కడ ఒక ఏడాదికి కేవలం 28 రోజులే. సూర్యుడి కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. అయితే ఈ నక్షత్రం నుంచి వెలువడే మంటలకు దగ్గరగా గ్రహం వస్తూంటుంది కాబట్టి ఇదంత ఆవాసయోగ్యమైంది కాదని అంచనా. కెప్లెర్ 22బీ... భూమి కంటే దాదాపు 2.4 రెట్లు ఎక్కువ సైజున్న గ్రహం ఇది. 600 కాంతి సంవత్సరాల దూరంలో ఆవాసయోగ్యమైన ప్రాంతంలోనే తన నక్షత్రం చుట్టూ తిరుగుతూంటుంది. సూర్యుడి లాంటి ఈ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 290 రోజులు పడుతుంది. కెప్లెర్ 452 బీ... భూమితో చాలా దగ్గరి పోలికలున్న గ్రహం ఇది. మూడు నాలుగు నెలల క్రితమే దీని గురించి ప్రపంచానికి తెలిసింది. భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ గ్రహం. -
అంతరిక్షంలో ముఖం
మూడు గ్రహాలు.. ఒక ఉపగ్రహం... ఒక ముఖం అదీ స్టోరీ! ఇదేంటనేనా మీ సందేహం? సింపుల్. ఈ రోజు(శనివారం) రాత్రి బుధ, గురు గ్రహాలు భూమికి కొంచెం దగ్గరగా రానున్నాయి. మన భూమికి చందమామ పేరుతో ఓ సహజ ఉపగ్రహం ఉండనే ఉంది. దీంతో ఇవన్నీ కలిసి శనివారం రాత్రి ఆకాశంలో మూతి ముడుచుకున్న ముఖం ఆకారంలో కనిపించనున్నాయి. మనమెలాగూ భూమ్మీద ఉంటాం కాబట్టి ఈ ముఖాన్ని చూడలేం కాబట్టి... ఆ ముఖం ఎలా ఉంటుందో ఈ ఫొటోలో చూసి ఆనందించండి.