ఔట్ ఆఫ్ ది వరల్డ్..! | out of the world | Sakshi
Sakshi News home page

ఔట్ ఆఫ్ ది వరల్డ్..!

Published Sun, Jan 10 2016 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

ఔట్ ఆఫ్ ది వరల్డ్..!

ఔట్ ఆఫ్ ది వరల్డ్..!

శీర్షిక చూసే ఇదేదో ప్రపంచ గతినే మార్చే మహాద్భుత వస్తువు అనుకోవద్దండోయ్! త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారైన ఓ నమూనా. మరి ఇందులో విశేషం ఏమిటంటారా? ఇది మన భూగోళం అవతలి నుంచి వచ్చిన ఖనిజంతో తయారైంది. ఓ తోకచుక్క భూమిని ఢీ కొట్టిన చోట లభించిన ఖనిజంతో దీన్ని రూపొందించారు. ఇనుము, నికెల్... మరికొన్ని ఇతర ఖనిజాలతో కూడిన ఈ తోకచుక్క రాయిని పొడిగా మార్చి... ఆ పౌడర్‌ను ప్రింటర్‌లో వాడి ఈ నమూనాను రూపొందించారు.
 
భవిష్యత్తులో ఇతర గ్రహాల మీద మానవుడు ఆవాసం ఏర్పరచుకున్నపుడు... అవసరమైన వస్తువులను అక్కడే ఇలా త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారుచేసుకోవచ్చని... ఆ దిశగా ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తున్నారు. అయితే అక్కడి భారరహిత స్థితిలో, భిన్న పీడనాల్లో ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందనేది పరీక్షించి చూడాలంటున్నారు శాస్త్రవేత్తలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement