Minerals
-
మైకా గనిలో...టీడీపీ రౌడీల విధ్వంసం
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలోని ఓ మైకా క్వార్ట్ ్జ గనిని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు బుధవారం దౌర్జన్యంగా స్వాదీనం చేసుకున్నారు. లీజు వేరొకరి పేరున ఉన్నా, రౌడీలను రంగంలోకి దింపి దాడులు చేసి గనిలో విధ్వంసం సృష్టించారు. గనిలో పనిచేసే వారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేశారు. ఆపై గనిలో తిష్టవేశారు. కొంత కాలంగా కూటమి పారీ్టల నేతలు తిరుపతి – నెల్లూరు జిల్లా సరిహద్దులోని మైకా, మైకా క్వార్ట్ ్జ, సిలికా ఖనిజంపై కన్నేశారు. లీజు దారులతో ఐదు నెలలుగా మంతనాలు నెరుపుతూ వచ్చారు. వారు లొంగకపోవడంతో రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసి ఒక్కొక్కటిగా స్వా«దీనం చేసుకుంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల పరిధిలో మైకా క్వార్ట్ ్జ ఖనిజం గనులు సుమారు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో గతంలో 140 వరకు గనులు ఉండేవి. అన్ని గనుల్లో అత్యంత నాణ్యమైన ఖనిజం దొరక్కపోవడంతో ప్రస్తుతం 10 మాత్రమే కొనసాగుతున్నాయి. కొంత కాలంగా ఈ ఖనిజానికి చైనాలో డిమాండ్ పెరిగింది. టన్ను రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు అమ్ముడుపోతోంది. దీంతో ఒక్కో గనిలో రోజుకు 50 నుంచి 100 టన్నుల వరకు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని మైకా క్వార్ట్ ్జ గనుల్లో ఖనిజం తవ్వకాలను ఆపేసింది. ఆ తర్వాత కీలక మంత్రి ఆదేశాల మేరకు ఓ గనిలో తవ్వకాలు ప్రారంభించారు. లైసెన్స్ ఉన్న ఆ వ్యాపారి యువ మంత్రికి ముఖ్య అనుచరుడు. మరో రెండు నెలల తర్వాత ఇంకో రెండు గనుల్లో తవ్వకాలకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపారు. ఈ నేపథ్యంలో సైదాపురం మండలం జోగుపల్లిలోని ‘చుక్క పాత్ర’ గనిపై నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల కన్ను పడింది. ఎవరంతకు వారు స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తుదకు వారిద్దరూ కలిసి కబ్జాకు పూనుకున్నారు. వారికి గనిని అప్పగించేందుకు యజమాని ససేమిరా అనడంతో ఓ ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దింపారు. నెల్లూరు జిల్లా కనుపూరుకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు బుధవారం సాయంత్రం 50 మంది రౌడీ మూకలతో ఆ గనిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. యంత్రాలు, సీసీ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేసి.. కాపలాగా ఉన్న గిరిజనుల గుడిసెలను పీకేశారు. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. ఆపై గనిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గని యజమాని చరణ్ సైదాపురం పోలీసులు, నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా, ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.మైకా, మైకా క్వార్ట్ ్జ, ఉపయోగాలు సైదాపురం మండలంలో మైకా, మైకా క్వార్ట్ ్జ, ఫల్స్‌పర్, పవర్ ముఖ్‌లైట్ వంటి ఖనిజాలు లభ్యమవుతున్నాయి. మైకా క్వార్ట్ ్జని అణువిద్యుత్, సోలార్ ప్లేట్ల కోసం వినియోగిస్తారు. మిగిలిన రకాలను టైల్స్ పరిశ్రమలు, సిగరెట్ ప్యాకెట్ లోపల సిల్వర్ కలర్ పేపర్ కోసం, కూలింగ్ గ్లాస్‌ల తయారీకి వినియోగిస్తారు. -
ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు
భారత ప్రభుత్వం అరుదైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలని యోచిస్తోంది. ‘నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్’పై ఇటీవల జరిగిన బడ్జెట్ సెమినార్లో కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి వీణా కుమారి మాట్లాడారు. అరుదైన ఖనిజాలను వెలికితీసే సంస్థలు రుణాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఈ సందర్భంగా వీణా మాట్లాడుతూ..‘లిథియం వంటి కీలకమైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేయాలి. అందుకోసం ప్రభుత్వం సహకారం అందిస్తుంది. సంస్థలు రుణాలు పొందేలా ఏర్పాటు చేస్తాం. మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మైనింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం సంస్థలకు కొన్ని రాయితీలు ఇవ్వాలనే చర్చలు సాగుతున్నాయి. గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారంపై భారత్ దృష్టి సారిస్తుంది. వెలికితీసిన ఖనిజాల తరలింపునకు గనుల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే బలమైన బ్యాంకులుప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ వాడకం పెరుగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, బ్యాటరీలు, మధర్‌బోర్డులు, ప్రాసెసర్లు, ఇతర వస్తువుల తయారీలో లిథియం వంటి అరుదైన ఖనిజాలను వాడుతున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఖర్చుతోపాటు, రవాణా క్లిష్టంగా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. అయితే వాటిని వెలికితీసి అభివృద్ధి చేయడం సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ఖనిజాల అన్వేషణ, మైనింగ్, శుద్ధీకరణ, ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ప్రభుత్వం కోరుతోంది. -
Supreme Court: ‘రాయల్టీ’ రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఖనిజాలపై చెల్లించే రాయల్టీ పన్ను కాదని న్యాయస్థానం తేలి్చచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. గనుల, ఖనిజాల అభివృద్ధిపై కేంద్రం నియంత్రణకు వీలు కలి్పస్తున్న రాజ్యాంగంలోని జాబితా–1లో పేర్కొన్న ఎంట్రీ 54 ప్రకారం.. ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చిచెప్పింది. అయితే ఖనిజ హక్కులపై రాయల్టీ విధించే రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాలు అధికంగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఈ తీర్పుతో లబ్ధి చేకూరనుంది. తమ ప్రాంతంలో ఉన్న గనులు, ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వసూలు చేసిన రూ.వేల కోట్ల పన్నులను తిరిగి తమకు ఇప్పించాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. తీర్పును అమల్లోకి తీసుకురావాలని కోరాయి. రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ వ్యతిరేకించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశంపై లిఖితపూర్వకంగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పన్నులను రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే విషయంలో ఈ నెల 31న తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. 1989 నాటి తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉందంటూ తమ తీర్పును జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్వయంగా చదివి వినిపించారు. ధర్మాసనంలోని 8 మంది సభ్యులు రాష్ట్రాల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. జస్టిస్ నాగరత్న ఒక్కరే వ్యతిరేకిస్తూ భిన్నమైన తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలో జాబితా–2లోని ఎంట్రీ 50 కింద గనులు, ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంట్‌కు లేదని జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో చెప్పారు. రాయల్టీ అంటే పన్ను అని తేల్చేస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచి్చన తీర్పు సరైంది కాదని పేర్కొన్నారు. ఆæ తీర్పును తోసిపుచ్చారు.రాష్ట్రాల అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయవచ్చు ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పటికీ.. దేశంలో ఖనిజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘ఖనిజాభివృద్ధి ఆటంకం కలగకుండా ఉండటానికి రాష్ట్రాల రాయల్టీ అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయగలదు. ఆ మేరకు పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే రాష్ట్రాలు దానికి కట్టుబడి ఉండాలి’ అని స్పష్టం చేసింది. -
చంద్రుడిపై ఖనిజాలను గుర్తించిన చంద్రయాన్-3
బెంగుళూరు: చంద్రయాన్-3 ల్యాండర్ నుండి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. శివ శక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుండి జాబిల్లి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణగ్రత వివరాలను ఇదివరకే ఇస్రోకు చేరవేసిన రోవర్ ఇప్పుడు చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ క్రమంలో రోవర్‌లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. అలాగే క్రోమియం(Cr), టైటానియం(Ti), కాల్షియం(Ca), మాంగనీస్(Mn), సిలికాన్(Si), అల్యూమినియం(Al), ఇనుము(Fe) వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇది కూడా చదవండి: అది వారికున్న పాత అలవాటే.. జయశంకర్ -
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
ఖనిజ లీజులకు దశల వారీగా ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి గనులను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం దశల వారీగా నిర్వహిస్తున్న ఈ–వేలం ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. తొలి దశలో గ్రానైట్ మినహా మిగిలిన చిన్న తరహా ఖనిజాల లీజులకు మంచి స్పందన లభించింది. 35 లీజులకు నిర్వహించిన ఈ–వేలంలో రూ. 16 కోట్ల ఆదాయం లభించింది. రెండో దశలో 27 లీజులకు ఈ–వేలం ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటి వరకు 20 లీజులకు వేలం పూర్తయింది. వారం రోజుల్లో మిగిలిన 7 లీజులకు ఈ–వేలం పూర్తి చేస్తామని మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లీజు పొంది పని చేయకుండా ఉన్న 2,724 చిన్న తరహా గనులను ఆపరేషన్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ–వేలం విధానాన్ని ప్రారంభించారు. సీఎం చొరవతో ఈ–వేలానికి సుమారు 700 గనులు ఆపరేషన్ చేయడం ప్రారంభించాయి. ఈ లీజుల్లో ఎక్కువ క్వార్ట్జ్, బ్లాక్ గ్రానైట్, బెరైటీస్, సిలికాశాండ్, ప్రొఫలైట్ ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. మిగిలిన వాటికి ఈ–వేలం నిర్వహించి తవ్వకాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న మైనింగ్ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేయడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతిచ్చిన ఈ లీజుల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోవడంతో పాటు, మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. సద్వినియోగం చేసుకోని లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. దశల వారీగా 6 నెలల్లో వెయ్యి లీజుల్లో తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ. 500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని గనుల శాఖ అంచనా వేస్తోంది. -
ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
కార్టజినా: 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్‌జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్‌తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది! -
అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు!
పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా అహ్లాదాన్ని అందించే ఐలాండ్స్ చాలానే ఉన్నాయి. కానీ తినగలిగే ఐలాండ్ గురించి మీకు తెలుసా? అవును అక్కడ మట్టిని బ్రెడ్‌లో సాస్‌లా, కూరల్లో మసాలాగా వాడతారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..? ఇరాన్ తీరానికి 8 కి.మీ. దూరంలో, పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో కన్నీటి చుక్క ఆకారంలో ఉంటుందది.పేరు హోర్ముజ్ ద్వీపం. అగ్నిపర్వత శిలలతో, మట్టి, ఇనుముతో నిండిన ఈ ఐలాండ్ చూడటానికి.. పసుపు, ఎరుపు, నీలం వంటి పలు రంగుల్లో ఇంద్రధనస్సులా మెరుస్తుంది. అందుకే దీన్ని రెయిన్బో ఐలాండ్‌గా పిలుస్తారు స్థానికులు. మొత్తం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంపై 70కి పైగా ఖనిజాలను గుర్తించారు పరిశోధకులు. హోర్ముజ్ ఐలాండ్.. ఎన్నో కోట్ల సంవత్సరాల కిందట పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉప్పు గుట్టల్లా పేరుకుపోయి.. అగ్నిపర్వత అవక్షేపాలతో కలసి రంగు రంగుల దిబ్బలుగా మారిందని వారి పరిశోధనల సారాంశం. ఈ రంగురంగుల గుట్టలు, ఎర్రటి బీచులు, అందమైన ఉప్పు గుహలకు అక్కడి భౌగోళిక పరిస్థితులే కారణమని తేల్చారు వాళ్లు. కాలక్రమేణా భూమిలోకి కిలోమీటర్ల మేర పాతుకుపోయిన ఈ గుట్టల్లోంచి తేలికైన ఉప్పు పొరలు పెల్లుబకడంతో గోపురాల్లా కనిపిస్తూ పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయట. ఇక్కడ లభించే ‘గెలాక్’ అనే ఎర్రటి మట్టిని.. స్థానిక వంటకాల్లో వాడుతుంటారు. అగ్నిపర్వత శిలల నుంచి పుట్టుకొచ్చిన.. హేమటైట్ అనే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇది ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మట్టి నుంచే ‘సూరఖ్’ అనే సాస్ని కూడా తయారు చేస్తున్నారు. అది బ్రెడ్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటుందట. అయితే ఈ మట్టిని వంటకాల్లోనే కాదు.. కాస్మెటిక్స్, డిజైనింగ్స్‌లో కూడా వాడుతున్నారు. (క్లిక్: 13.5 సెకన్లలో ఫుడ్ సర్వ్ చేసే హోటల్.. ఎక్కడో తెలుసా?) ఒక్కోవైపు ఒక్కో అందం ఈ ఐలాండ్‌కు నైరుతిలో బహుళవర్ణాలతో మెరిసే లోయ ఉంటుంది. దాన్నే రెయిన్బో వ్యాలీ అంటారు. మొత్తం ఐలాండ్ అంతా రంగురంగుల్లో మెరుస్తున్నప్పటికీ ఈ లోయ మరింత ప్రత్యేకం. సూర్య కిరణాల వెలుగుల్లోనే ఈ అందాలను చూడాలనేది పర్యాటకుల మాట. ఆ లోయ పక్కనే మరో లోయ.. శిల్పులు చెక్కిన శిల్పాల్లా ఎన్నో వింత ఆకారాలు దర్శనమిస్తాయి. అయితే వాటిని మనుషులు చెక్కలేదంటే నమ్మబుద్ధి కాదట. వ్యాలీ ఆఫ్ స్టాచ్యూస్ (విగ్రహాల లోయ)గా పేరున్న ఈ లోయలో.. బర్డ్స్‌లా, డ్రాగన్స్‌లా వింతవింత రూపాలు మనల్ని మైమరిపిస్తాయట. అవన్నీ వేలాది సంవత్సరాలుగా ప్రకృతి కోతతో ఏర్పడిన అద్భుతాలే. ఇక ఐలాండ్‌కి పశ్చిమ దిక్కున కిలోమీటర్ మేర విస్తరించిన ఈ లోయలోని ఉప్పు స్ఫటికాలకు వైద్య గుణాలున్నాయని, నెగెటివ్ ఎనర్జీని పారదోలే ఉప్పుదేవతని స్థానికులు విశ్వసిస్తారు. -
మొటిమల సమస్యా? మీ కోసమే..
న్యూఢిల్లీ: ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పోటీ యుగంలో త్రీవ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో మొటిమలు, పొడి చర్మం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యతో ఇబ్బందిపడే వారు కాస్మొటిక్స్ మందులు, క్రీమ్స్, వాడి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంటి చిట్కాలతో మొటిమల సమస్యను తగ్గించవచ్చు. కాగా నిగనిగలాడే మెరిసే చర్మం కావాలనుకునేవారికి గళ్ల ఉప్పు (సీ సాల్ట్ లేదా సముద్రపు ఉప్పు) వాడడమే మేలైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. మొటిమలతో బాధపడ్తున్న వేలాది మంది సీసాల్ట్ ఉపయోగించి ప్రయోజం పొందారు. గళ్ల ఉప్పు (సీ సాల్ట్) ప్రయోజనాలు గళ్లఉప్పులో చర్మ సంరక్షణకు కావాల్సిన పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. అంతేకాక సీ సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం, కాల్షియం, సోడియం పొటాషియం తదితర లవణాలతో చర్మం మెరిసేందుకు తోడ్పడుతుంది. చర్మానికి ఉపయోగించే విధానం మొదటగా ఒక బౌల్(గిన్నె) తీసుకొవాలి. తర్వాత టేబుల్ స్పూన్ సేంద్రీయ తేనె, టీస్పూన్ సీసాల్ట్, 6 చుక్కల నిమ్మరసం తదితర మిశ్రమాలను గిన్నెలో వేసి కలపాలి. మిశ్రమాన్ని కలిపాక మొఖానికి 5 నుంచి 10నిమిషాలు నెమ్మదిగా మర్ధన చేయడం ద్వారా మొటిమలు, జిడ్డు చర్మం, పోడిబారిన చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా సీసాల్ట్ వినియోగించుకుంటే చర్మ సంరక్షణకు ఎంతో మేలు. -
వెతికేద్దాం.. వెలికితీద్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇసుకతోపాటు ఇతర ఖనిజాల ద్వారా రూ.2,868.95 కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో ఇసుక వాటా రూ.2,837.32 కోట్లు. అయితే, దీర్ఘకాలంలో ఇసుక వెలికితీత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను టీఎస్ఎండీసీ అన్వేషిస్తోంది. టీఎస్ఎండీసీకి కేంద్రం ఇదివరకే జాతీయ ఖనిజాన్వేషణ సంస్థ హోదాను కల్పించింది. దీంతో సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో సున్నపురాయి బ్లాక్‌లలో వెలికితీత పనులను టీఎస్ఎండీసీకి అప్పగిస్తూ ఖనిజాన్వేషణ కోసం రూ.29 కోట్లను జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్టు కేటాయించింది. సున్నపురాయి అన్వేషణకు సంబంధించి ఇప్పటికే తొలిదశలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన టీఎస్ఎండీసీ.. ప్రస్తుతం రెండోదశలో పూర్తి స్థాయిలో తనకు కేటాయించిన సున్నపురాయి బ్లాక్‌లలో అన్వేషణ ప్రారంభించింది. గ్రానైట్ వ్యాపారానికి మొగ్గు... నిర్మాణరంగంలో వినియోగించే గ్రానైట్‌కు స్థానికంగా, విదేశీ మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించాలని టీఎస్ఎండీసీ భావిస్తోంది. దీని కోసం మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘బిజినెస్ డెవలప్మెంట్ సెల్’ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లోని 92.29 హెక్టార్లలో ప్రతీ ఏటా 36,400 క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను వెలికితీయవచ్చని టెక్నో, కమర్షియల్ ఫీజిబిలిటీ నివేదిక ఆధారంగా అంచనాకు వచ్చింది. వంతడుపుల, తాళ్లపూసపల్లె, ఇనుగుర్తి, నమిలిగొండ, కొత్తగట్టులోని రెండుచోట్ల గ్రానైట్ నిల్వలున్నట్లు టీఎస్ఎండీసీ గుర్తించింది. రోడ్ మెటల్ యూనిట్లు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణరంగం ఊపుమీద ఉండటంతో బండరాళ్ల తరలింపు నిర్మాణదారులకు సమస్యగా మారింది. సహజ ఇసుక వినియోగం పెరగడంతో తరచూ కొరత ఎదురవుతోంది. దీంతో సహజ వినియోగాన్ని తగ్గించేందుకు కృత్రిమ ఇసుక వైపుగా వినియోగదారులను మళ్లించేందుకు టీఎస్ఎండీసీ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ మెటల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖానామెట్, బండరావిరాల, యాచారంలో ఏర్పాటయ్యే ఈ యూనిట్ల ద్వారా కంకర, కృత్రిమ ఇసుకను విక్రయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పర్యావరణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీ, టీఎస్ఎండీసీ సంయుక్తంగా ప్రయ త్నాలు సాగిస్తున్నాయి. -
గ్రీన్‌లాండ్‌ను కొనేద్దామా!
వాషింగ్టన్/స్టాక్‌హోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ‘డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ దృష్టి సారించారు. డెన్మార్క్‌లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. ట్రంప్ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్లాండ్లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్లో విస్తారమైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ బయటపెట్టింది. మేం అమ్మకానికి లేం: గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ఈ విషయమై గ్రీన్లాండ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్లాండ్ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్లాండ్ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ మాట్లాడుతూ..‘ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్ కాదుగా’ అని వ్యాఖ్యానించారు. మూడుదేశాల వలస పాలనలో.. గ్రీన్‌లాండ్‌ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్‌లాండ్‌ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్ విడిపోవడంతో గ్రీన్‌లాండ్‌పై అధికారాలు డెన్మార్క్‌కు దక్కాయి. గ్రీన్లాండ్లో మెజారిటీ ఇన్యుట్ జాతిప్రజలే. వీరంతా గ్రీన్లాండిక్ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ 1953లో విలీనం చేసుకుంది. డానిష్ భాషను తప్పనిసరి చేసింది. దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్ 1972లో హోంరూల్ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్లాండ్కు దక్కాయి. -
నాలుగున్నరేళ్లలో రూ.2,160 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత నాలుగున్నరేళ్లలో ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా రూ.2,160 కోట్లు ఆదాయం లభించిందని, 2018 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు రూ.610 కోట్ల ఆదాయం లభించిందని ఆ సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో నిక్షిప్తమై ఉన్న నూతన ఖనిజాలను వెలికి తీసి ఆదాయం సమకూర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రాష్ట్రాలకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, గనులశాఖ డైరెక్టర్ సుశీల్‌కుమార్, టీఎస్ ఎండీసీ డైరెక్టర్ మల్సూర్, పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
అంతరిక్షంలో ఖనిజాన్వేషణ
వాషింగ్టన్ : మీరు అవతార్ సినిమా చూశారా? అందులో, మనుషులు ఖనిజాల కోసం పండోరా అనే గ్రహంపై మైనింగ్ చేస్తారు.. గుర్తుందా? వెండితెరపై ఈ సన్నివేశాలు కొత్త ఆలోచనలకు పునాదులు వేశాయి. భూమిపై ఉన్న ఖనిజాలు కొన్నేళ్లలో కనుమరుగవనున్న నేపథ్యంలో మనుషుల అవసరాలు తీర్చేందుకు మనిషి ఎప్పటినుంచో ఇతర గ్రహాల వైపు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా ఈ ఆలోచనను నిజం చేయబోతోంది. అంతరిక్షంలో ఉన్న విలువైన ఖనిజాలను తవ్వుకుని భూమికి తీసుకురావాలన్న ఆలోచనను మెల్లిగా అమలులో పెడుతోంది. ఇందులో భాగంగా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇప్పటికే ప్రయోగించింది. త్వరలోనే అది తన పనిని పూర్తి చేయనుంది. ఏంటి ఈ మిషన్? అంతరిక్ష ఖనిజాన్వేషణలో భాగంగా ‘101955 బెన్నూ’ అనే గ్రహశకలాన్ని అధ్యయనం చేయాలని నాసా భావించింది. ఇందుకోసం ఒసిరిస్– రెక్స్ OSIRIS& REx (Origins, Spectral Interpretation, Resource Identification, Secu rity, Regolith Explorer) అనే స్పేస్ క్రాఫ్ట్‌ను 2016, సెప్టెంబరు 9న ప్రయోగించింది. ఇది దాదాపు 20 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఈ డిసెంబరులో ఈ గ్రహశకలాన్ని చేరుతుంది. ఏడాదిపాటు దాని చుట్టూ పరిభ్రమిస్తూ దాని ఫొటోలను తీయడం, సర్వే చేయడం పూర్తి చేస్తుంది. 2020 నాటికి గ్రహశకలాన్ని చేరుకుని దాని ఉపరితలాన్ని కొద్దిగా తవ్వి ఆ శాంపిల్స్‌ను తీసుకుంటుంది. 2021 మార్చినాటికి తిరుగుయాత్ర మొదలు పెట్టి, 2023, సెప్టెంబరు 24న భూమిని చేరుతుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోన్న బెన్నూ గ్రహశకలం ప్రతీ ఆరేళ్లకోసారి భూమికి సమీపంలోకి వస్తుంది. ఈ గ్రహశకలంపై 10 శాతం ఇనుము, నికెల్ నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు 800 మిలియన్‌డాలర్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నాసా చేపట్టింది. బెన్నూ విశేషాలేంటి? సౌర వ్యవస్థలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఒక గ్రహశకలం. ఇది ప్రతీ ఆరేళ్ల కోసారి భూమికి సమీపంగా వస్తుంది. దీని పూర్తిపేరు 101955 బెన్నూ’. తొలిసారిగా దీన్ని 1999లో గుర్తించారు. ఇది రాంబస్ ఆకారంలో ఉండే సీ–టైప్ ఆస్టరాయిడ్ లేదా కార్బనేíషియస్ ఆస్టరాయిడ్. దీని ఉపరితలం ఎక్కువగా కార్బన్ సమ్మేళనాలతో నిండి ఉంటుంది. మిగిలిన కొద్దిమొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల కోసమే నాసా పరిశోధకులు ఇపుడు ఒసిరిస్‌ను ప్రయోగించారు. బెన్నూ ఎత్తు 510 మీటర్లు అంటే మన ఈఫిల్ టవర్ (324మీటర్లు) కన్నా అధికం. మానవాళికి ఏం లాభం? సైంటిస్టుల అంచనాలు నిజమై.. అనుకున్న ప్రకారం ఈ గ్రహశకలంపై ఖనిజాలు ఉన్నాయని తేలితే. అంతులేని ఖనిజ సంపద మానవుల సొంతమవుతుంది. మానవాళి భవిష్యత్తు అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గం దొరికినట్లవుతుంది. ఈ గ్రహశకలంపై ఉన్న ఖనిజాలను పూర్తిగా తవ్వి తేగలిగితే.. ఇపుడున్న మార్కెట్ విలువ ప్రకారం..15 క్వింటిలిన్ ( దాదాపు లక్షల కోట్ల డాలర్లు) ఉంటుందని అంచనా. భూమిపై ఖనిజాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ ఆస్టరాయిడ్ మైనింగ్ సాధ్యమైతే భవిష్యత్తులో మానవాళి మనుగడకు ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎలా తవ్వుతుంది? ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఒక రోబోచేయి ఉంటుంది. ఒసిరిస్ బెన్నూను చేరగానే ఈ రోబోచేయి టాగ్సామ్ మెకానిజం (టచ్ గో శాంపిల్ అక్వైజేషన్ మెకానిజం) ద్వారా పనిచేయడం మొదలుపెడుతుంది. తొలుత నైట్రోజన్ గ్యాస్‌ను విడుదల చేస్తుంది. రిగోలియత్గా పిలిచే దాని ఉపరితలాన్ని 60 – 2000 గ్రాముల వరకు మొత్తం మూడుశాంపిళ్లను సేకరిస్తుంది. అలా సేకరించిన ఆ శాంపిల్స్‌తో ఒసిరిస్ తిరిగి భూమికి బయల్దేరుతుంది. -
తొడిమలు తీస్తే... తాజా!
ఇంటిప్స్ ► మొదలు చివర తుంచేసి, బెండకాయలకు ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి. ► అల్లం–వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది. ► ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథా కావు. ►అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తబడకుండా ఉంటాయి. -
ఔట్ ఆఫ్ ది వరల్డ్..!
శీర్షిక చూసే ఇదేదో ప్రపంచ గతినే మార్చే మహాద్భుత వస్తువు అనుకోవద్దండోయ్! త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారైన ఓ నమూనా. మరి ఇందులో విశేషం ఏమిటంటారా? ఇది మన భూగోళం అవతలి నుంచి వచ్చిన ఖనిజంతో తయారైంది. ఓ తోకచుక్క భూమిని ఢీ కొట్టిన చోట లభించిన ఖనిజంతో దీన్ని రూపొందించారు. ఇనుము, నికెల్... మరికొన్ని ఇతర ఖనిజాలతో కూడిన ఈ తోకచుక్క రాయిని పొడిగా మార్చి... ఆ పౌడర్‌ను ప్రింటర్లో వాడి ఈ నమూనాను రూపొందించారు. భవిష్యత్తులో ఇతర గ్రహాల మీద మానవుడు ఆవాసం ఏర్పరచుకున్నపుడు... అవసరమైన వస్తువులను అక్కడే ఇలా త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారుచేసుకోవచ్చని... ఆ దిశగా ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తున్నారు. అయితే అక్కడి భారరహిత స్థితిలో, భిన్న పీడనాల్లో ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందనేది పరీక్షించి చూడాలంటున్నారు శాస్త్రవేత్తలు. -
హాయ్... హనీ...
హెల్త్‌టిప్స్ తేనెలోని మినరల్స్, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి పంచదార బదులు తేనెను వంటకాల్లో కానీ పానీయాల్లో కానీ ఉపయోగించొచ్చు.ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి, కొద్దిగా తేనె కలిపి తాగితే జీర్ణాశయం శుద్ధవుతుంది.పెసర పిండి లేదా శనగ పిండితో తేనెను కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫేషియల్ చేసుకున్న ముఖారవిందం మీ సొంతం. వంట చేసేటప్పుడు చర్మం కాలడం కానీ కత్తి గాట్లు కానీ పడితే ఆ గాయాలపై స్వచ్ఛమైన తేనెను రాయండి. అతిత్వరగా గాయం మానడంతో పాటు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. -
మిన్నరల్స్
కొంత కార్బోహైడ్రేట్, ఇంత ప్రొటీన్... మరికొన్ని విటమిన్స్... కూసింత ఫ్యాట్... గోరంత మినరల్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ సున్నా... ఆరోగ్యం మిన్న! ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసిందే కానీ, మినరల్స్ విషయంలో తరచూ అశ్రద్ధ చూపిస్తారు. వాటి అవసరం ఎంత గొప్పదో చెబితే జాగ్రత్త పడతారని నమ్ముతున్నాం. నేలలో విత్తనాలు చల్లి ఊరుకుంటే సరిపోదు. నీళ్లు, ఎరువులు అనే పోషకాలు కావాలి. అప్పుడే పంట ఫలవంతం అవుతుంది. అలాగే మన శరీరానికి కూడా ఫ్యాట్స్,కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనే పోషకాలు కావాలి.మినరల్స్.. పోషకాల్లో చివరివీ, చిట్టిమోతాదుల్లో అవసరమైనవే అయినా అత్యంతముఖ్యమైనవి. శరీరం నిర్వర్తించే వివిధ పనులకు వాటి సాయం కావల్సిందే. అవి కూడా అందినప్పుడే మనిషికి ఆరోగ్యం.. అదే మహాభాగ్యం అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మినరల్స్‌ను మేజర్ మినరల్స్, ట్రేస్ మినరల్స్ అని రెండురకాలుగా విభజించారు. మేజర్, ట్రేస్.. ఏ మినరల్స్ అయినా అన్నిటినీ సమపాళ్లలో తీసుకోవాలి. ఒక మినరల్ మోతాదు మించితే ఇంకో మినరల్ శరీరంలో చోటును కోల్పోవాల్సిందే. ఉదాహరణకు.. మ్యాంగనీస్ని మోతాదుకి మించి ఏకొంచెం ఎక్కువ తీసుకున్నా ఐరన్ డెఫిషియెన్సీ ఏర్పడుతుంది. ఏ మినరల్స్నయినా ఆహారం ద్వారా తీసుకుంటేనే మంచిది. ఒకవేళ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తే మోతాదు మించకుండా జాగ్రత్తపడాలి.అదీ వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. మేజర్ మినరల్స్ వీటి అవసరం పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఇవి శరీరంలో నిల్వ ఉండటమే గాక రకరకాల దారుల గుండా శరీరమంతా ప్రయాణం చేస్తుంటాయి. కాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, సల్ఫర్ మొదలైనవి మేజర్ మినరల్స్. కాల్షియం... ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, కండరాల కదలికలకు, నాడీ వ్యవస్థ పనులకు, రక్తపోటును సాధారణస్థాయిలో ఉంచడానికి, రోగనిరోధక శక్తిని కాపాడ్డానికీ కాల్షియం అవసరమవుతుంది. రోజుకి ఎంత కాల్షియం తీసుకోవాలి అనేది వయసు, ఎదుగుదల దశను బట్టి ఉంటుంది. మూడేళ్లలోపు పిల్లలకైతే రోజుకి 700 నుంచి1000 మి.గ్రా. కాల్షియం ఇవ్వాలి ఆహారం ద్వారానే. 8 ఏళ్ల లోపు పిల్లలకైతే వెయ్యి మిల్లీగ్రాములు, 18ఏళ్ల లోపువాళ్లకైతే 13 వందల మిల్లీగ్రాములు, యాభై ఏళ్ల లోపు వాళ్లకు వెయ్యి మిల్లిగ్రాములు కాల్షియం సరిపోతుంది. 70 ఏళ్లలోపు మహిళలకైతే 12 వందల మిల్లీగ్రాములు, పురుషులకైతే వెయ్యి మి.గ్రా. కాల్షియం చాలు. 70 పైబడిన ఎవరికైనా 12 వందల మిల్లీగ్రాములు సరిపోతాయి. గర్భిణులు, తల్లులైతే రోజుకి వెయ్యి మి.గ్రా. కాల్షియం తీసుకోవాలి. అయితే ఈ కాల్షియంను శరీరం గ్రహించాలంటే మన శరీరంలో విటమిన్ డి తగినంత ఉండాలి. సప్లిమెంట్ల (మాత్రల) రూపంలో మోతాదుకు మించి తీసుకుంటే విపరిణామాలు కలిగే ప్రమాదం ఉంటుంది. జీర్ణక్రియ మందగించడం, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, కోమాలోకి వెళ్లడం వంటివి జరగొచ్చు. కాల్షియం తక్కువైతే ఆస్టియోపొరాసిస్ వస్తుంది. కాల్షియం పాల ఉత్పత్తులు, చేపలు, కూరగాయలు, టోఫూ, కాయ ధాన్యాల్లో దొరుకుతుంది. క్లోరైడ్ .. జీర్ణక్రియకు తోడ్పడే ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. క్లోరైడ్ తక్కువైతే నీరసం, కండరాలు బిగుసుకుపోవడం, మూత్రంలో పొటాషియం పోవడం, బీపీ తక్కువడం వంటివి కనిపిస్తాయి. ఉప్పు, పాలు, మాంసం, బ్రెడ్, కూరగాయలు, సోయాజసాస్లో క్లోరైడ్ పుష్కలం. మెగ్నీషియం... శరీరంలో జరిగే 300 జీవరసాయనిక ప్రతిక్రియలకు, కండరాలు, నాడీవ్యవస్థ సక్రమంగా పరిచేసేందుకు, గుండె చప్పుడు సాధారణ స్థాయిలో ఉండేందుకు, ఎముకల దృఢత్వానికి, రోగనిరోధక శక్తి పెరగడానికీ ఉపకరిస్తుంది. మెగ్నీషియం తక్కువైతే రక్తంలో ఇన్సులిన్ స్రవించే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీని ప్రభావం షుగర్ వ్యాధిగ్రస్తుల మీద ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల బ్లడ్‌షుగర్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సూచించిన ప్రకారం మహిళలు రోజుకి 310 నుంచి 320 మిల్లీగ్రాములు, పురుషులు 400 నుంచి 420 మిల్లీగ్రాముల మెగ్నీషియంను తీసుకోవాలి. బీన్స్, ధాన్యాలు, కూరగాయలు, నట్స్, కాయ ధాన్యాలు, ఆకుకూరలు, సీ ఫుడ్, డార్క్చాక్లేట్స్, ఉప్పు నీరు, పాల పదార్థాల్లో మెగ్నీషియం లభిస్తుంది. ఫాస్ఫరస్... ఎముకలు, పళ్ల పటుత్వానికి, కొన్నిరకాల ప్రొటీన్ల తయారీకి, కణాల రిపేర్‌కి ఫాస్ఫరస్ తనవంతు కృషిని అందిస్తుంది. ఇది తక్కువైతే నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, కండరాల సమస్యలూ వస్తాయి. రోజుకి 700 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్‌ను తీసుకోవాలి. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లు, పాల పదార్థాలు, పొట్టు ధాన్యాల్లో ఫాస్ఫరస్ లభిస్తుంది. పొటాషియం... గుండె చప్పుళ్లు సాధారణస్థాయిలో ఉండేట్టు చూస్తుంది. ప్రొటీన్స్‌ను తయారు చేయడంలో, అవి జీర్ణమయ్యేలా చూడ్డంలో, కార్బోహైడ్రేట్స్ ఉపయోగంలో, రక్తంలోని పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడంలో, కండరాలు సోడియంను గ్రహించేలా చేయడంలో, మనం బరువులెత్తినప్పుడు కండరాలకు తోడ్పడంలో, ఆహారం నుంచి శక్తిని గ్రహించడంలో తోడ్పడ్తుంది. దీని కొరత కండరాలు బిగుసుకుపోవడం, బలహీనమవడం, ఆస్టియోపొరాసిస్, కిడ్నీలో రాళ్లు, నిస్త్రాణ, శ్వాస ఆడకపోవడం, గందరగోళం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. రోజుకి 4 వేల 7 వందల మి.గ్రా. పొటాషియంను తీసుకోవాలి. పొటాషియం చేపలు, చికెన్, బంగాళదుంపలు, టమాటో, బీన్స్, మాంసం, పాలు, పండ్లు, కూరగాయలు, పొట్టు ధాన్యాలు, కాయ ధాన్యాలు, అరటి, కమలా, పాలకూర, చిలకడదుంపలు, కొబ్బరి నీళ్లలో దొరుకుతుంది. సోడియం... నాడీ, కండర వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఫ్లూయిడ్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరం అమినో యాసిడ్స్, గ్లూకోజ్ వంటి పోషకాలను గ్రహించేలా చేస్తుంది. సోడియం మోతాదు పెరిగితే బీపీకి దారితీస్తుంది. అధిక మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల దాహం పెరిగి ఎక్కువగా ఉన్న ఉప్పు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మహిళలు, పురుషులు రోజుకి 1500 మి.గ్రా. సోడియంను తీసుకోవాలి. సోడియం టేబుల్ సాల్ట్, పాలు, బ్రెడ్, కూరగాయలు, మాంసం, సోయాసాస్‌లో దొరుకుతుంది. సల్ఫర్... ప్రొటీన్ అణువులను ఏర్పరుస్తుంది. సల్ఫర్ కొరత వల్ల కండరాల నొప్పి, కండరాలు బలహీనవమడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చేపలు, గుడ్లు, పాలు, కాయ ధాన్యాలు, నట్స్‌లో సల్ఫర్ ఉంటుంది. ట్రేస్ మినరల్స్ ఇవి తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. కానీ ప్రాధాన్యం ఎక్కువే. క్రోమియం, కాపర్, ఫ్లోరైడ్, అయోడిన్, ఐరన్, మ్యాంగనీస్, మాల్బిడినమ్, సెలేనియం, జింక్.. మొదలైనవి ట్రేస్ మినరల్స్. క్రోమియం...ఇన్సులిన్ హార్మోన్ ప్రభావాన్ని పెంచుతుంది. క్రోమియం తక్కువైతే గ్లూకోజ్ నిర్వహణా సామర్థ్యం తగ్గిపోతుంది. నిస్సత్తువ ఆవరిస్తుంది. పురుషులైతే రోజుకి 30 నుంచి 35మైక్రోగ్రాములు, మహిళలైతే 20 నుంచి 25 మైక్రోగ్రాముల క్రోమియంను తీసుకోవాలి. కాలిఫ్లవర్ జాతి, బంగాళదుంపలు, బీన్స్, ద్రాక్ష రసం, గోధుమలు, కాలేయం, పొట్టు ధాన్యాల్లో క్రోమియం లభ్యమవుతుంది. కాపర్... శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. మెలనిన్‌ను సంశ్లేషణం చేయడంలో సాయపడ్తుంది. రక్తస్రావం ఆపడంలోను, రోగనిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలోనూ తోడ్పడుతుంది. కాపర్ తక్కువైతే రక్తహీనత, పెరిఫెరల్ న్యూరోపతి వంటి జబ్బులు వస్తాయి. రోజుకు 900మైక్రోగ్రాముల కాపర్‌ను తీసుకోవాలి. కాయ ధాన్యాలు, నట్స్, గింజలు, పొట్టు ధాన్యాలు, మాంసం, తాగు నీరు, సీ ఫుడ్, కొకోల్లో కాపర్ ఉంటుంది. ఫ్లోరైడ్... దంతాల ఆరోగ్యానికి, ఎముకల నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. దంతాల మీద సాఫ్ట్ ఎనామిల్‌ను బాగుచేస్తుంటుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. ఇది తక్కువైతే దంతక్షయానికి, ఆస్టియోపొరాసిస్కీ దారితీస్తుంది. తాగు నీరు, చేపలు, అన్ని రకాల ‘టీ’ల్లో ఫ్లోరైడ్ ఉంటుంది. అయోడిన్... హార్మోన్ల ఉత్పత్తిలో థైరాయిడ్కి 60 శాతం సహకారం అందిస్తుంది. అందుకే ఇది తక్కువైతే థైరాయిడ్ హార్మోన్ పనితీరు కుంటుపడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది, కాళ్ల్లూచేతులూ మొహానికి తిమ్మిర్లు, భ్రమలు కలగడం వంటివి పరిణమిస్తాయి. రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాలి. ఉప్పు, బీన్స్, గుడ్లు, సీ ఫుడ్, బ్రెడ్, పాల పదార్థాల్లో అయోడిన్ దొరుకుతుంది. ఐరన్.... హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అత్యవసరం. మయోగ్లోబిన్ తయారీకి తోడ్పడుతుంది. ఐరన్ తక్కువైతే అలసట, నీరసం, చిరాకు కలుగుతాయి. మూడేళ్లలోపు పిల్లలకు రోజుకి 7 మి.గ్రా. ఐరన్‌ను, 8 ఏళ్లలోపు పిల్లలకు 10 మి.గ్రా., 13 ఏళ్లలోపు పిల్లలకు 8 మి.గ్రా. ఐరన్ ఇవ్వాలి. పురుషులు, రుతుక్రమం ఆగిన మహిళలు 8 మి.గ్రా. ఐరన్ తీసుకోవాలి. పిల్లతల్లులు 18 మి.గ్రా. గర్భిణులు రోజుకి 27 మి.గ్రా. ఐరన్‌ను తీసుకోవాలి. మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, బీన్స్, కాయ ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, ఉడికించిన బంగాళదుంపలు, ఎండు ద్రాక్ష, గోధుమలు, ఓట్స్‌లో ఐరన్ ఉంటుంది. మాంగనీస్... కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఆమినోయాసిడ్స్ మొదలు ప్రొటీన్స్ వరకు అన్ని జీవక్రియలకు తోడ్పడుతుంది. ఎముకల నిర్మాణానికీ చేయి అందిస్తుంది. గ్లూకోజ్ జీవక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మహిళలు రోజుకి 1.8 మిల్లీగ్రాములు, పురుషులు 2.3 మి.గ్రా. మాంగనీస్ తీసుకోవాలి. కాయ ధాన్యాలు, శనగలు, పైనాపిల్, పాలకూర, చిలకడ దుంప, పప్పు దినుసుల్లో మాంగనీస్ లభిస్తుంది. మాల్బిడినమ్... అమినో యాసిడ్స్ జీర్ణం చేయడంలో ఎంజైమ్స్‌కి సహకరిస్తుంది. పురుషులు, మహిళలు ఎవరికైనా రోజుకి 45మైక్రోగ్రాముల మాల్బిడినమ్ కావాలి. కాయ ధాన్యాలు, నట్స్, పప్పు ధాన్యాలు, బ్రెడ్, ఆకు కూరలు, కూరగాయలు, పాలు, కాలేయం ద్వారా మాల్బిడినమ్ అందుతుంది. సెలేనియం... థైరాయిడ్ హార్మోన్స్‌ను నియంత్రిస్తుంది. ఆంటీ యాక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి కాన్సర్‌ను నివారిస్తుంది. ఇది విటమిన్ ఇ తో కలిసి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మద్యపానం వల్ల వచ్చిన కాలేయ జబ్బుల నుంచి కూడా మందుబాబులను కాపాడుతుంది. సెలేనియం తక్కువైతే కండరాల నొప్పి, నీరసం వస్తాయి. పెద్దవాళ్లందరికీ రోజుకి 55 మైక్రోగ్రాముల సెలేనియం అవసరం. మాంసం, సీ ఫుడ్, నట్స్, పాల పదార్థాలు, పప్పు ధాన్యాలు, పొట్టు ధాన్యాల్లో సెలీనియం ఉంటుంది. జింక్... ఆర్ఎన్ఏ, డీఎన్ఏ ఉత్పత్తికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి చక్కగా ఉండేలా చూస్తుంది. గాయాలు త్వరగా మానేలా, నాలుక మీది రుచి మొగ్గలు సరిగ్గా పనిచేసేలా చూస్తుంది. అంధత్వానికి కారణమయ్యే పరిస్థితిని నివారిస్తుంది. జింక్ తక్కువైతే ఆకలి మందగించడం, రోగనిరోధక శక్తి క్షీణించడం, ఎదుగుదల కుంటుపడడం, డయేరియా, జుట్టురాలడం, నంపుంసకత్వం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి సమస్యలు వస్తాయి. పురుషులు రోజుకి 11మిల్లీగ్రాములు, మహిళలైతే 8 మిల్లీగ్రాముల జింక్ తీసుకోవాలి. మాంసం, చేపలు, బీన్స్, నట్స్, పాలపదార్థాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పొట్టు ధాన్యాలు, కాయగూరల్లో జింక్ ఉంటుంది. - సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ శాంపుల్ మినరల్ రిచ్ డైట్ బ్రేక్‌ఫాస్ట్ ఐటం మినరల్స్ మొత్తం కాలరీలు ఫ్యాట్‌ఫ్రీ పాలు కాల్షియం120ఎమ్‌జి 102 (200ంఎల్) ఫాస్ఫరస్ 90ఎమ్‌జి ఐరన్ 0.2 ఎమ్‌జి రాగిదోస-2, కాల్షియం 344ఎమ్‌జి 328 చట్నీ, సాంబార్ ఐరన్ 3.9 పొటాషియం 405ఎమ్‌జి జింక్ 2.3 ఎమ్‌జి బాయిల్డ్ ఎగ్ ఫాస్ఫరస్ 220 173 ఐరన్ 2.1 సోడియం124ఎమ్‌జి జింక్ 2.7 సెలీనియం77మైక్రోగ్రాములు వాటర్‌మిలన్1కప్పు ఐరన్7.9ఎమ్‌జి 30 పొటాషియం 160ఎమ్‌జి మెగ్నీషియం13ఎమ్‌జి కొబ్బరినీళ్లు 1గ్లాస్ పొటాషియం 515ఎంజి 43 మెగ్నీషియం51.1ఎమ్‌జి కాల్షియం 49.4ఎమ్‌జి ఫాస్ఫరస్ 41.1ఎమ్‌జి సోడియం 216ఎమ్‌జి లంచ్ అన్నం 2కప్పులు సెలీనియం 19.11మైక్రోగ్రాములు 412 మ్యాంగనీస్1.8ఎమ్‌జి ఐరన్1.6ఎమ్‌జి ఫాస్ఫరస్162ఎమ్‌జి జింక్ 1.2ఎమ్‌జి సోయాబీన్ కర్రీ కాల్షియం 175ఎమ్‌జి 298 ఐరన్ 8.8ఎమ్‌జి జింక్2.0ఎమ్‌జి మ్యాంగనీస్ 1.4ఎమ్‌జి పెరుగు 1కప్పు కాల్షియం448 ఎమ్‌జి 137 మెగ్నీషియం 46.5ఎమ్‌జి జింక్2.4ఎమ్‌జి ఫ్లోరైడ్29.4ఎమ్‌జి కీర సలాడ్ మెగ్నీషియం 14ఎమ్‌జి 80 టమాటా పొటాషియం 146ఎమ్‌జి సోడియం 12.9ఎమ్‌జి ఈవినింగ్ స్నాక్స్ పాలకూర శాండ్విచ్ కాపర్7.9ఎమ్‌జి 23 మ్యాంగనీస్ 17.2మైక్రోగ్రాములు ఐరన్ 15.8ఎమ్‌జి వాల్నట్స్4, పిస్తా4 మెగ్నీషియం 373ఎమ్‌జి 93 బాదాం 6 జింక్ 3.57ఎమ్‌జి మ్యాంగనీస్2.62మైక్రోగ్రాములు డిన్నర్ అన్నం సెలీనియం 19.11మైక్రోగ్రాములు 325 (ఒకటిన్నర కప్పు) మ్యాంగనీస్1.8ఎమ్‌జి ఐరన్1.6ఎమ్‌జి ఫాస్ఫరస్162ఎమ్‌జి జింక్1.2ఎమ్‌జి గుమ్మడికాయ కూర ఐరన్ 1.4ఎమ్‌జి 40 పొటాషియం564ఎమ్‌జి సోడియం2.5ఎమ్‌జి ఫాస్ఫరస్73.5ఎమ్‌జి ఫ్యాట్‌ఫ్రీ పాలు కాల్షియం120ఎమ్‌జి 87 (200ఎంఎల్) ఫాస్ఫరస్90ఎమ్‌జి ఐరన్0.2ఎమ్‌జి -
సంస్కరణల బిల్లులకు లైన్‌క్లియర్
బొగ్గు బిల్లు; గనులు, ఖనిజాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపునకు పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్ కాంగ్రెస్, లెఫ్ట్ మినహా ప్రభుత్వానికి సహకరించిన విపక్షం రెండు బిల్లులపై ఓటింగ్; జేడీయూ వాకౌట్.. వీగిపోయిన విపక్షాల సవరణలు ముగిసిన బడ్జెట్ తొలి విడత సమావేశాలు.. ఏప్రిల్ 20న తిరిగి మొదలు న్యూఢిల్లీ: సంస్కరణల్లో భాగంగా, వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపును చట్టబద్ధం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు కీలక బిల్లులు శుక్రవారం పార్లమెంట్ ఆమోదం పొందాయి. అనూహ్యంగా, పలు విపక్షాలు మద్దతివ్వడంతో ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో ఆమోదం సులభమైంది. విపక్షాలు.. ముఖ్యంగా బొగ్గు , ఖనిజ నిక్షేపాలున్న రాష్ట్రాల పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాల చివరి రోజున ‘గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు’, ‘బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) సవరణ బిల్లు’లు ఆమోదం పొందడం విశేషం. ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన బిల్లులను విపక్షం పట్టుతో రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపించాల్సి వచ్చింది. సమావేశాలు ముగియడానికి రెండు రోజులే ఉండడంతో ఈ బుధవారం ఆ కమిటీలు నివేదికలను సభ ముందుంచా యి. వాటిపై చర్చకు మరింత సమయం కావాలని ప్రధాన విపక్షం డిమాండ్ చేయడంతో వాటి ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఆ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లు ఎప్రిల్ 5 తర్వాత రద్దైపోతాయి. అందువల్ల, శుక్రవారం ఆమోదం పొందలేకపోతే మరోసారి ఆర్డినెన్స్‌లను జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. గనులు, ఖనిజాల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంతో ఇనుప ఖనిజం సహా ఖనిజ నిక్షేపాల కేటాయింపు ఇక వేలం ద్వారా జరిపేందుకు మార్గం సుగమమైంది. జూన్ నుంచి వీటి వేలం ప్రక్రియ రాష్ట్రాలు ప్రారంభించే అవకాశముంది. తమ రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో అవి బిల్లులకు మద్దతిచ్చాయి. మొత్తమ్మీద ఈ భేటీల్లో ప్రభుత్వం బీమా, బొగ్గు, ఖనిజాల బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందింది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు సాగుతాయి. బొగ్గు బిల్లు.. వేలం ద్వారా బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు చట్టబద్ధత కల్పించే ‘బొగ్గు గనులు (ప్రత్యేక నిబంధనల) బిల్లు, 2015’పై శుక్రవారం రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. బిల్లుకు 107 మంది సభ్యులు మద్దతివ్వగా, 62 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందినందువల్ల.. రాజ్యసభ ఆమోదంతో బొగ్గు బిల్లుకు పార్లమెంట్ ఆమోద ప్రక్రియ ముగిసినట్లైంది. బిల్లులో కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, పీ భట్టాచార్య, సీపీఎం సభ్యులు పీ రాజీవ్(సీపీఎం), కేఎన్ బాలగోపాల్, సీపీఐ సభ్యడు రాజా తీసుకువచ్చిన సవరణలు వీగిపోయాయి. ఓటింగ్ సమయంలో జేడీయూ నేత శరద్ యాదవ్, తమ పార్టీ సభ్యులతో పాటు వాకౌట్ చేశారు. అంతకుముందు జరిగిన స్వల్పకాలిక చర్చకు బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సమాధానమిచ్చారు. బొగ్గు గనులున్న రాష్ట్రాలు, బొగ్గును వినియోగిస్తున్న రాష్ట్రాలు.. ఈ రెండింటి ప్రయోజనాలను కేంద్రం కాపాడుతుందని హామీ ఇచ్చారు. నియమ, నిబంధనల రూపకల్పనలో ఎంపిక కమిటీ సూచలనను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. గోయెల్ పేర్కొన్న ఇతర అంశాలు.. జాయింట్ వెంచర్లలో విదేశీ కంపెనీలకు అవకాశమివ్వబోం. దేశీయ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని కూడా 26 శాతానికి మించనివ్వం. చిన్నతరహా వినియోగదారుల కోసం ప్రత్యేక కోటాను ఏర్పాటు చేయాలని కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశిస్తాం. స్థానికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం డిస్ట్రిక్ట్ మినరల్ కమిటీల ఏర్పాటు. బొగ్గు గనులున్న అన్ని ప్రధాన రాష్ట్రాల్లో.. బొగ్గు వెలికితీత వల్ల ఏర్పడుతున్న కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న ప్రజల కోసం ప్రతీ రాష్ట్రంలో ఒక్కో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు. పరిహార చెల్లింపుల కోసం కమిషనర్ ఆఫ్ పేమెంట్స్’ నియామకం సుప్రీం రద్దు చేసిన 204 గనులను బిల్లులో ‘షెడ్యూల్ 1’ గనులుగా పేర్కొన్నారు. వాటిలో ఉత్పత్తి చేస్తున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 42 గనులను ‘షెడ్యూల్ 2’గా వర్గీకరించారు. ఖనిజాల బిల్లు.. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సూచించిన సవరణకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో.. గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు రాజ్యసభ అడ్డంకి దాటేసింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ బిల్లులో ఈ సవరణను చేర్చడంతో బిల్లు మరోసారి లోక్‌సభకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, రాజ్యసభ ఆమోదం పొందిన 20 నిమిషాల్లోనే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడం విశేషం. రాజ్యసభలో కాంగ్రెస్, వామపక్షాలు మినహా అన్ని పార్టీలూ ఈ బిల్లుకు మద్దతివ్వగా, ఓటింగ్ ముందు జేడీయూ వాకౌట్ చేసింది. అనుకూలంగా 117 ఓట్లు, వ్యతిరేకంగా 69 ఓట్లు వచ్చాయి. అంతకుముందు, రాష్ట్రాలు సహా, మిత్ర పక్షాలతో సంప్రదింపులు అవసరమని, అందువల్ల బిల్లును మళ్లీ ఎంపిక కమిటీకి పంపాలన్న రాజీవ్(సీపీఎం) తీర్మానంపై ఓటింగ్ జరగ్గా.. మిత్రపక్షాలైన శివసేన, అకాలీదళ్, విపక్ష పార్టీలైన టీఎం సీ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకే, డీఎంకే, జేఎంఎంలు వ్యతిరేకిస్తూ ఓటేశాయి. తీర్మానాన్ని కాంగ్రెస్, వామపక్షాలు సమర్థించాయి. మైనిం గ్ లెసైన్సులను గతంలో గరిష్టంగా 30 ఏళ్ల లీజుకు ఇచ్చేవారు. ప్రస్తుత బిల్లులో 50 ఏళ్లుగా మార్చారు. నల్లబంగారం కథ దేశాన్ని పదేళ్లు ఏలిన యూపీఏ ప్రభుత్వాన్ని చావుదెబ్బ తీసింది బొగ్గు స్కాం. దేశ కుంభకోణాల చరిత్రలోనే.. రూ. 1.86 లక్షల కోట్ల భారీ లూటీ (కాగ్ నివేదిక)తో చరిత్ర సృష్టించింది. విపక్ష బీజేపీ ఒత్తిడిపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. స్కాం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. 2014 జూలైలో స్కాం కేసుల విచారణకు ప్రత్యేక సీబీఐ కోర్టు ఏర్పాటు. 2014 సెప్టెంబర్ 24న, 1993 నుంచి 2010 వరకు జరిగిన 214 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2015, మార్చిలో స్కాం నిందితుడిగా మాజీ ప్రధాని మన్మోహన్‌కు సమన్లు వచ్చాయి. 2014 మేలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అదే సంవత్సరం 21న బొగ్గు క్షేత్రాల వేలం ఆర్డినెన్స్ జారీ చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌పై బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ.. విపక్షాలు అడ్డుకోవడంతో రాజ్యసభ లో మాత్రం గట్టెక్కలేకపోయింది. డిసెంబర్ 26న మరోసారి అదే ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ మార్చి 4 బొగ్గు బిల్లు లోక్‌సభ ఆమోదించింది. విపక్షం డిమాండ్‌తో మార్చి 11న రాజ్యసభ ఎంపిక కమిటీకి నివేదన . మార్చి 18న కమిటీ నివేదిక అందజేత. కేవలం 33 బొగ్గు గనుల వేలంలో ఇప్పటికే ప్రభుత్వానికి రూ. 2.13 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 214 గనుల కేటాయింపుతో ఖజానా నష్టపోయిందని కాగ్ చెప్పిన మొత్తం కన్నా ఇది ఎక్కువ. -
సమరోత్సాహం
బాక్సైట్‌పై మావోయిస్టుల యుద్ధం గ్రామాలలో చైతన్య సదస్సులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఆదివాసీలు పాడేరు : ప్రభుత్వం బాక్సైట్ తుట్టె ను కదపడం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు కలిసొచ్చింది. విశాఖ ఏజెన్సీలో విలువైన ఈ ఖనిజాన్ని వెలికితీసి ఆర్థికంగా లాభపడాలనుకున్న టీడీపీ ప్రభు త్వ చర్యలు దళసభ్యులకు అనుకూలమయ్యాయి. బాక్సైట్ తవ్వకాలను వ్యతి రేకిస్తున్న ఆదివాసీలు మావోయిస్టులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా మన్యంలో స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంతో తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల మారుమూల ప్రాంతాలతోపాటు ఒడిశా సరిహద్దుల్లోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు మావోయిస్టు పార్టీ ఇటీవల శ్రీకారం చుట్టింది. కాకులు దూరని కారడవుల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తూ గిరిజనుల మద్దతును కూడగడుతున్నది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని నాయకులు కూడా విశాఖ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి గిరిజనులను మరింత చైతన్య పరుస్తున్నట్లు తెలిసింది. దీంతో విశాఖ ఏజెన్సీ, ఏఓబీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మారుమూల గూడేలు, ఒడిశాకు చెందిన గిరిజనులు కూడా మావోయిస్టుల పిలుపునకు స్పందించి బాక్సైట్ వ్యతిరేక సదస్సులకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలను అడవి నుంచి తరమికొట్టే ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలనే మావోయిస్టుల పిలుపునకు మారుమూల గిరిజనులు స్పందిస్తున్నారని చెప్పడానికి ఇటీవల మావోయిస్టులు నిర్వహించిన సదస్సులే నిదర్శనం. ఈ పరిస్థితితో పోలీసుశాఖ అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున కూంబింగ్‌కు సమాయత్తం అవుతుంది. ఇప్పటికే చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు, మావోయిస్టుల బూటు చప్పుళ్లతో అటవీ ప్రాంతాలు మారు మోగుతున్నాయి. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
పెద్దతరహా ఖనిజాలపై రాయల్టీ పెంపు!
తాండూరు: పెద్ద తరహా ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం రాయల్టీని పెంచింది. దీంతో ప్రభుత్వానికి రాయల్టీ ఆదాయం పెరగనుంది. ఈ మేరకు పెద్ద తరహా ఖనిజాలపై రాయల్టీని పెంచుతూ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 1న 630 జీవోను జారీ చేసింది. దీంతో కొత్త రాయల్టీ విధానం అమల్లోకి వచ్చింది. లైమ్‌స్టోన్, ల్యాటరైట్, క్వార్డ్జ్, షేల్, ఇనుము తదితర పెద్ద తరహా ఖనిజాలపై రాయల్టీ పెరిగింది. సిమెంట్ ఉత్పత్తుల తయారీకి వినియోగించే లైమ్‌స్టోన్ (సున్నపురాయి)పై టన్నుకు రూ.63 ఉన్న రాయల్టీ ఛార్జీలను రూ.80కు, ల్యాటరైట్ (ఎర్రమట్టి)పై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) విలువ ప్రకారం టన్నుకు రూ.46- రూ.51 (15 శాతం నుంచి 25శాతం) రాయల్టీని కేంద్రం ప్రభుత్వం పెంచింది. క్వార్డ్జ్(పలుగురాయి)పై రూ.20 నుంచి రూ.35కు, షేల్పై రూ.36 నుంచి రూ.60, ఇనుము టన్నుకు రూ.60 నుంచి రూ.80కు రాయల్టీని పెంచింది. తాండూరు ప్రాంతంలోని పెద్ద తరహా ఖనిజాలపై ఏడాదికి సుమారు రూ.25కోట్ల మేరకు రాయల్టీ రూపంలో ఆదాయం వస్తోంది. కొత్త రాయల్టీ విధానం ప్రకారం సర్కారుకు అదనంగా రూ.5 కోట్ల ఆదాయం సమకూరనుంది. చిన్నతరహా ఖనిజాలపై.. చిన్నతరహా ఖనిజాలపైనా రాయల్టీని పెంచాలనే దిశగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. నాపరాతి బండలు (లైమ్‌స్టోన్ స్లాబ్), సుద్ద (పుల్లర్స్ఎర్త్) తదితర చిన్నతరహా ఖనిజాలపై రాయల్టీ పెరగనుందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ రాష్ట్ర గనుల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక చదరపు అడుగు నాపరాతికి ప్రభుత్వానికి రూ.7 రాయల్టీ వస్తోంది. దీనిపై 10-20 శాతం రాయల్టీ పెంచాలని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఒక చదరపు అడుగు నాపరాతికి రూ.10 రాయల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇక తెల్ల సుద్ద టన్నుకు రూ.110 -రూ.121, ఎర్ర సుద్ధ టన్నుకు రూ.44 నుంచి సుమారు రూ.50 వరకు రాయల్టీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో చిన్నతరహా ఖనిజాల కొత్త రాయల్టీపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. చిన్నతరహా ఖనిజాలపై రాయల్టీ ఛార్జీల పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.50 లక్షల వరకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా. ఎన్నికల సందర్భంగా తాండూరు పర్యటనలో తాండూరు నాపరాతిపై రాయల్టీని తగ్గిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో రాయల్టీ పెంచుతారా.. లేదా.. అనేది సందిగ్ధంగా మారింది. మరోవైపు తాండూరు సరిహద్దులోని కర్ణాటకలో సుమారు రూ.450 రాయల్టీ ఉంది. ఇదే పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేసి, కష్టాల్లో ఉన్న నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. -
గోవాలో మైనింగ్‌పై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: గోవాలో అన్ని ఖనిజాల తవ్వకంపై తన ఆదేశాల ప్రకారం 18 నెలలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొన్ని షరతులతో ఎత్తేసింది. ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వుకోవడానికి అనుమతించింది. మైనింగ్‌పై తను నియమించిన నిపుణుల కమిటీ తుది నివేదిక ఇచ్చేంతవరకు తవ్వకాలపై గట్టి నియంత్రణ ఉంచాలని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని హరిత ధర్మాసనం.. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు, గోవా ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 2007 నవంబర్ 22 తర్వాత లీజులు తీసుకున్న వారి తవ్వకాలు చట్టవిరుద్ధమని, లీజు ప్రాంతం వెలుపల ఖనిజాన్ని డంప్ చేయకూడదని పేర్కొంది. జాతీయ పార్కులు, అభయారణ్యాలకు ఒక కి.మీ దూరంలో మైనింగ్ జరపొద్దని ఆదేశించింది. కోర్టు తీర్పుపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. -
ఖనిజం ఫుల్... ‘ఖజానా’ నిల్..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సహజ సంపదకు జిల్లా పెట్టింది పేరు. బొగ్గు నిల్వలు మొదలుకుని అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న వివిధ రకాల ఖనిజాల వరకు అనేకం ఇక్కడ లభ్యమవుతాయి. జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో ఇతర ప్రాంతాల్లో దొరకని ఖనిజాలు సైతం ఇక్కడ లభ్యమవుతుంటాయి. బొగ్గు నిల్వలు, బారైట్స్, ఐరన్ ఓర్, డోలమైట్, మైకా వంటి ఖనిజాలతో పాటు రాష్ట్ర అవసరాలు తీర్చే స్థాయిలో నిల్వల గల ఇసుక రీచ్‌లు అనేకం ఉన్నాయి. ఇలా సహజ సంపదకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జిల్లాలో మైనింగ్ శాఖ పరిస్థితి మాత్రం కొంత దయనీయంగా ఉంది. వేలకోట్ల విలువైన సహజ సంపద ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడం, పూర్తిస్థాయిలో అజమాయిషీ లేకపోవడంతో వాటన్నింటినీ పర్యవేక్షించే మైనింగ్ శాఖకు ఆదాయం నామమాత్రంగానే ఉంది. జిల్లాలో సుమారు 12 రకాలకు పైగా వివిధ రకాల లోహాలు, నిల్వలు ఉన్నాయి. వీటికి సంబంధించి లీజు కేటాయింపులన్నీ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో అనుకున్నంత ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని మైనింగ్ శాఖ అతి కష్టం మీద అధిగమించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోగల గనులను పరిగణలోకి తీసుకుని జిల్లాకు ఈ ఏడాది కేవలం రూ.37 కోట్ల వార్షిక లక్ష్యాన్ని మాత్రమే ప్రభుత్వం నిర్దేశించగా... రూ.40 కోట్లు వసూలైంది. జిల్లాలోని ఖనిజ వనరులన్నిటినీ సక్రమంగా వినియోగంలోకి తీసుకొస్తే ఇంతకంటే రెండింతల ఆదాయం సాధ్యమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో మైనింగ్ శాఖ పరిధిలో ఉండే ఇసుక రీచ్‌లను జిల్లా పరిషత్‌లకు కట్టబెట్టడంతో ఈ వ్యవహారం అక్రమాలకు కేంద్రబిందువుగా మారింది. జిల్లాలో మేజర్ మినరల్స్ కేటగిరిలో మొత్తం 12 రకాల లోహాలకు గాను, 15,037 హెక్టార్లలో 65 లీజ్‌లు కేటాయించారు. ఇందులో ఖమ్మం మైనింగ్ అసిస్టెంట్ై డెరెక్టర్ పరిధిలో 694.887 హెక్టార్ల విస్తీర్ణంలో లభ్యమయ్యే బారైట్, రంగురాళ్లు, డోలమైట్, ఐరన్‌ఓర్, అబ్రకం, పలుగురాళ్లు, బొగ్గు నిల్వలకు సంబంధించి 22 లీజులు ఉన్నాయి. కొత్తగూడెం మైనింగ్ ఏడీ పరిధిలో వీటితోపాటు అత్యధికంగా 12 బొగ్గు గనులు, 43 ప్రైవేట్ లీజ్‌లు ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో బొగ్గుతోపాటు ఐరన్‌ఓర్ గనులు పుష్కలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా ఐరన్ఓర్కు సంబంధించి సమస్యలు ఉత్పన్నం అవడంతో కేటాయించిన మూడు లీజులు కూడా పనిచేయడం లేదు. అనేక సమస్యలను అధిగమించి నేలకొండపల్లి ప్రాంతంలో 17 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న లో గ్రేడ్ ఐరన్‌ఓర్ ఇటీవలే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతోపాటు బయ్యారం ప్రాంతంలో 70 హెక్టార్లు, భధ్రాచలం డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 3 వేల హెక్టార్లలో ఐరన్‌ఓర్ నిల్వలు ఉన్నప్పటికీ అటవీ చట్టాలు, పర్యావరణ సమస్యలు వంటి రకరకాల కారణాలతో అవన్నీ నిలిచిపోయాయి. అయితే వీటన్నింటినీ సక్రమంగా వినియోగంలోకి తెస్తే ఏటా రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వానికి రాయల్టీ వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు మైనర్ మినరల్స్ కేటగిరిలో 305 లీజులు ఉన్నాయి. ఇవి 478.350 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నల్లరాయి లీజులే 205 ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా మైనర్ మినరల్స్ నుంచే అధికంగా ఉంది. ప్రసుత్తం వస్తున్న ఆదాయంలో 30 శాతం గ్రానైట్ నుంచి, 20 శాతం డోలమైట్ నుంచి, 50 శాతం స్టోన్ మెటల్ నుంచి సమకూరుతోంది. పుష్కలంగా ఇసుక నిల్వలు... జిల్లాలో 45కు పైగా ఇసుక రీచ్‌లున్నాయి. వీటిలో భద్రాచలం పరిధిలోని 11 ఇసుక రీచ్‌లను గతంలో ఎస్టీలకు కేటాయించారు. వాటిలో 7 రీచ్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. గోదావరి నదీ తీరప్రాంతంలో ఉన్న రీచ్‌ల్లో వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఇసుక రీచ్‌ల కేటాయింపు వ్యవహారం మైనింగ్‌శాఖ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత వీటిని జిల్లా పరిషత్‌కు కేటాయించడం, రీచ్‌ల్లో భారీగా అక్రమాలు జరగడంతో ప్రస్తుతం అన్ని రీచ్‌లూ మూతపడ్డాయి. అయితే వందల లారీల ఇసుక నిత్యం అక్రమంగా రవాణా అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం రూ. కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ప్రభుత్వానికి నివేదిక పంపాం : ఏడీ జిల్లాలో సహజ సంపద నిల్వలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపామని ఖమ్మం డివిజన్ మైనింగ్‌శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎస్.వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పలు కేటాయింపుల్లో సాంకేతిక సమస్యలు, కోర్టు ఇబ్బందులు ఉండటంతో జరగలేదని, త్వరితగతినే అన్నీ పూర్తవుతాయని వివరించారు.