
హాయ్... హనీ...
హెల్త్‌టిప్స్
తేనెలోని మినరల్స్, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి పంచదార బదులు తేనెను వంటకాల్లో కానీ పానీయాల్లో కానీ ఉపయోగించొచ్చు.ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి, కొద్దిగా తేనె కలిపి తాగితే జీర్ణాశయం శుద్ధవుతుంది.పెసర పిండి లేదా శనగ పిండితో తేనెను కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫేషియల్ చేసుకున్న ముఖారవిందం మీ సొంతం.
వంట చేసేటప్పుడు చర్మం కాలడం కానీ కత్తి గాట్లు కానీ పడితే ఆ గాయాలపై స్వచ్ఛమైన తేనెను రాయండి. అతిత్వరగా గాయం మానడంతో పాటు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు.