Vitamins
-
ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం!
మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, స్థూల పోషకాలు ఉండాలని చెబుతుంటారు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మన ఆహారంలో అత్యంత కీలకమైన పోషకాలను కోల్పోతున్నామట. ఇటీవల పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మన తీసుకునే ఆహారంలో అత్యంత కీలకమైన, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలను కోల్పోతున్నామని పరిశోధకులు చెప్పారు. ఇంతకీ ఏంటా నాలుగు కీలక పోషకాలంటే..!హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాంటా బార్బరా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు కాల్షియం, ఐరన్, విటమిన్ సీ, ఈతో సహా శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను సరిపోని స్థాయిలో వినయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకో 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తుల డేటాపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇలా మొత్తం 31 దేశాలలోని ప్రజల డేటాను సర్వే చేసి మరీ అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అందులో పురుషుల, స్త్రీల డేటాను వేరు చేసి మరి అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరిపై దాదాపు 15 విటమిన్లు, ఖనిజాల గురించి అధ్యయనం చేసింది. అందులో నాలుగు కీలక పోషకాలను ఆహారం నుంచి చాల తక్కువ మోతాదులో తీసుకుంటున్నారని తేలింది. ముఖ్యంగా అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ తగినంతగా తీసుకోవడం లేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక సగానికి పైగా ప్రజల్లో రిబోఫ్లావిన్, ఫోలేట్, విటమిన్ సీ, బీ6, నియాసిన్ తదితరాలను చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ప్రపంచ జనాబాలో దాదాపు 22% మంది చాలా తక్కువ స్థాయిలో ఈ పోషకాలను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు పరిశోధకులు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషించేవని తెలిపారు. (చదవండి: పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!) -
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్‌ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్‌ఫుడ్‌కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్‌తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ కన్సల్టంట్ -
బోడకాకర ఉంటే, మటన్, చికెన్ దండగ, ఒక్కసారి రుచి చూస్తే
ఏ సీజన్లో లభించే కూరగాయలు, పళ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంటే ఆయా కాలంలో వచ్చే వైరస్లు, రోగాల నుంచి కాపాడతాయని దీని అర్థం. వర్షాకాలం పచ్చగా నిగ నిగలాడుతూ కనిపించే కూరగాయల్లో ఒకటి బోడ కాకర కాయ. వీటినే బొంత కాకర కాయలు అని కూడా పిలుస్తారు. ఇంకా అడవి కాకర, ఆ-కాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడకాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. కండరాలను బలోపేతం చేస్తుందని, సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు నిపుణులు.శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను అందిస్తుంది. విటమిన్ డీ12, విటమిన్ డీ, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటివి లభిస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. దీన్ని ఫ్రై లేదా, ఉల్లిపాయలు, మసాలతో కూర చేసుకుంటారు. పోషకాలతో పోలిస్తే, చికెన్, మటన్ కంటే ఇది చాలా బెటర్ అంటారు. బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలుబోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకుమంచిది. రోగనిరోధక శక్తిని బలపడుతుంది తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.రక్తపోటు, కేన్సర్ వ్యాధుల నుంచి రక్షించడంలోసాయపడుతుంది. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇందులోని ఫ్లావనాయిడ్లు వృద్ధాప్య ముడతలను నివారిస్తాయి. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది -
Beauty Tips: పండులాంటి ప్యాక్..!
ముఖంలో నిగారింపు, చర్మంలో కోమలత్వం తగ్గుతుందని దిగులు చెందుతున్నారా..! అయితే ఈ సింపుల్, బెస్ట్ బ్యూటీ చిట్కాలు మీకోసమే..ఇలా చేయండి..– అరటితొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి.– ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.– తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.– అరటి పండులో ఉన్న విటమిన్ బి6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.– ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.– క్రమం తప్పకుండా వాడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి.. -
కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!
కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.2. ఒక టేబుల్ స్పూన్ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.6. రూటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.7. ఇది బూడిద తెగులును అరికడుతుంది. గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందంఇవి చదవండి: ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే! -
నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా!
కొంతమంది ఎప్పుడూ ఉసూరుమంటూ ఉంటారు. టార్చి లైటు వేసి చూసినా, వారి ముఖంలో ఉత్సాహం కనిపించదు. ఇంకొందరేమో ఉత్సాహానికి మారుపేరులా... ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం మన ప్రవర్తనపైన, పనితీరుపైనా ప్రభావం చూపుతుందనడానికి అదొక తార్కాణం. కొన్ని రకాల ఆహార పదార్థాలను నిత్యం తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అవేమిటో చూద్దామా... ఉత్సాహంగా ఉంచే ఆహారం అనగానే అదేదో ఖరీదైన తిండేమో అని అనుకోనక్కరలేదు. ఇంకా చె΄్పాలంటే మిగిలిన వాటితో పోల్చితే అవి కాస్తంత చవగ్గానే దొరుకుతాయి. టొమాటో: దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే. నట్స్: ముఖ్యంగా వాల్‌నట్స్‌లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ΄్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్‌నట్స్‌లో పీచుపదార్థం అధికం. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్–ఇ, ఉండి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్స్‌ని అందిస్తాయి. బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది. ఆల్మండ్స్ చర్మకాంతికి తోడ్పడతాయి. రోజూ గుప్పెడు నట్స్ తింటూ ఉంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. గ్రీన్‌టీ: ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది. కప్పు గ్రీన్ టీ తీసుకోగానే కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్నట్లనిపిస్తుంది. యోగర్ట్ లేదా పెరుగు: మనం కర్డ్ లేదా పెరుగు అంటాం కానీ, విదేశాలలో దీనినే యోగర్ట్ అంటారు. అయితే మన పెరుగుకూ దానికీ ఉన్న తేడా ఏమిటంటే... పెరుగు కాస్త పలచగా ఉంటుంది. యోగర్ట్ గట్టిగా ఉంటుంది. పెరుగు కాస్తంత పుల్లదనాన్ని కలిగి ఉంటుంది. యోగర్ట్‌లో ఏమాత్రం పులుపు ఉండదు. కస్టర్డ్ ΄ûడర్ కలిపినట్టుగా గడ్డగా... కొద్దిపాటి తియ్యగా ఉంటుంది. ఈ రెండూ కూడాప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది. బీన్స్: ప్రోటీన్స్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్‌ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అయితే ఇందులో అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు. బెర్రీస్: ముఖ్యంగా నేరేడుపండ్లు-వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. ఆకుకూరలు: ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బీ, సీ, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్‌ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. వీలయినంత వరకూ వీటిలో కొన్నింటిని అయినా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఉత్సాహంగా ఉండవచ్చు. ఇవి చదవండి: కిచెన్ టిప్స్: మనకిష్టమైన పదార్థాలను ఇలా కాపాడుకుందాం..! -
మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!
కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.. ఐరన్ ఉండే ఆహారం... మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ ఎ తప్పనిసరి... మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి. విటమిన్ బి 12.. విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి. కాల్షియం... మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి... ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. మెగ్నీషియం... మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు అవసరం.. భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం. ఇవి చదవండి: సమాజాన్ని అద్దంలో చూపించాను -
రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి!
'మన శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ ప్రతి కణానికి సరిగ్గా అందడంలో రక్తం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆరోగ్యం కోసం తగినంత రక్తం శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో రక్తం లోపించిన పరిస్థితిని అనీమియా అంటారు. రక్తం సరిగ్గా ఉండటానికి సరైన ఆహారాలు తినటం ఎంత ముఖ్యమో ప్రాసెస్డ్ ఆహారాలు, కృత్రిమ షుగర్స్ గల ఆహారాలు తగ్గించడం కూడా అంతే ముఖ్యం.' ఐరన్ అనేది ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ లో కనిపించే ఒక ఖనిజం. హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు, గుడ్లు, మాంసం, చేపలు, టోఫు, పప్పులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. విటమిన్ బి 12 అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయలేవు. అందువల్ల ఆహారంలెఓ విటమిన్–బి 12 లభించే మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పెరగలేవు, అందువల్ల ఫోలిక్ యాసిడ్ ఉండే గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బీన్స్, చిక్కుళ్ళు తీసుకోవాలి. ప్రోటీన్లు అనేవి శరీరం యొక్క నిర్మాణాత్మక భాగాలు. ప్రోటీన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ప్రోటీన్ల–మూలం మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు, ధాన్యాలు, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఐరన్ మన రక్తం లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యమైనది. ఆకు కూరల్లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తం పెరిగి అనీమియా వంటి సమస్య రాకుండా ఉంటుంది. చిక్కుళ్ళు, పప్పు దినుసులు చిక్కుళ్ళు, పప్పు దినుసుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ ఐరన్ రక్తవృద్ధికి సహాయపడాలంటే వీటితో పాటు విటమిన్ సి అధికంగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే వీటిలో ఫోలియేట్, విటమిన్ బి 6 కూడా ఉండటం వల్ల రక్తం తయారవ్వటానికి ఇవి బాగా దోహదం చేస్తాయి. నట్స్, సీడ్స్ బాదం, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు వంటి నట్స్, సీడ్స్ లో ఫోలియేట్, ఐరన్, విటమిన్ ఇ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ ఎర్ర రక్తకణాలు నష్టపోకుండా కాపాడుతుంది. బీట్ రూట్ బీట్ రూట్స్ లో ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అందుకని మన శరీరం లో బ్లడ్ లెవల్స్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ బీట్రూట్స్ లో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అలాగే రక్తంలో ఆక్సిజన్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి. సిట్రస్ పండ్లు నారింజ పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది మన శరీరంలో రక్తం పెరగడానికి అవసరం అయ్యే ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు ఈ సిట్రస్ పండ్లు కూడా తీసుకోవటం మంచిది. ఇవి కూడా చదవండి: ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే.. -
బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు!
'మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ, బచ్చలికూరను చాలామంది ఇష్టపడరు.. అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు.' బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్‌కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి, పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమ స్యనుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు! -
గుడ్లు, ఆకుకూరలు తింటున్నారా? మీ చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా?
శరీరానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం తింటామో అదే మన చర్మంపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ఆహారం తీసుకోకపోతే వ్యర్థమే. బ్యాలెన్స్ డైట్లో విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. మరి విటమిన్-ఎ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభ్యమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. క్యారట్లు: విటమిన్-ఎ కి బెస్ట్ ఛాయిస్ క్యారట్లు. రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమన్ ‘ఎ’లో దాదాపుగా 334 శాతం అందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. చాలామంది క్యారట్స్ని వండుకొని తింటారు. కానీ క్యారట్స్లోని పోషకాలు సంపూర్తిగా అందాలంటే పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. పాలు: పాలల్లో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ప్రతిరోజూ గ్లాసెడు పాలు తాగడం వల్ల మీ స్కిన్‌టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గుడ్లు గుడ్లలో విటమిన్ ‘డి’ తోపాటు అధికమోతాదులో విటమిన్ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగవుతుంది. ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమన్ ‘ఎ’ పుష్కలంగా ఉంటుంది. కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. ప్రతిరోజూ వీటిని మీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి టమాటా: విటమిన్ ‘ఎ’ టమాటాల్లో అధికంగా ఉంటుంది. సహజంగానే మనరోజువారీ వంటకాల్లో టమాటా ఉపయోగిస్తాం! వంటలతోపాటు టమాటా సూప్, టమాటా చట్నీ ఇలా కూడా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ: కెరోటినాయిడ్, ఆల్ఫా-కెరోటిన్ లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్‌కి కూడా సహాయపడుతుంది. -
పోషకాహార లోపంతో సతమతమవుతున్న చిన్నారులు.. రోజూ ఏం తినాలంటే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: మహిళలు, చిన్నారుల్లో పోషకాహార స్థితిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో పోషణ మాసోత్సవాన్ని చేపట్టారు. తద్వారా ఆరోగ్యకరంగా జీవించేందుకు బాటలు వేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నగరంతో సహా శివారు జిల్లాలైన మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డిలలో పోషకాల లోపంతో సతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పోషకాలపై అవగాహన కల్పించి, పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించే మాసోత్సవాన్ని పోషణ్ అభియాన్ పేరుతో ఈ నెలాఖరు వరకు ఆయా జిల్లా సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇదీ లక్ష్యం.. స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలతో తల్లిదండ్రులను చైతన్యం చేస్తారు. పోషకాహార లోపం లేని తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గర్భిణులు మిటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. బహుమతుల ప్రదానం పోషణ మాసోత్సవంలో భాగంగా నగరంతో సహా శివారు జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల్లో పిల్లల ఎత్తు, బరువు చూస్తారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు బహుమతులు అందజేస్తారు. రక్తహీనత శిబిరాలు నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించటం వల్ల.. మాసోత్సవాల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారులకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు పాలు, పండ్లు సూచిస్తున్నారు. యువజన, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. బరువు లేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోషణ మాసోత్సవాన్ని షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నాం. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసోత్సవం సజావుగా సాగేలా చూస్తున్నాం. వయస్సుకు తగ్గ బరువులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై వారికి వివరిస్తున్నాం. – కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి, మేడ్చల్–మల్కాజిగిరి. -
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
మీకు తెలుసా
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..? రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త. ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట. అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. -
మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?
కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? ఎందుకు తింటారంటే..? చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్‌లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. కాల్షియం, ఐరన్ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి. పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు. -
విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి?
ఇటీవల మనందరిలో పెరిగిన ఆరోగ్యస్పృహ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రయత్నంలో ‘విటమిన్ల’ కోసం సప్లిమెంట్లు అతిగా తీసుకునేవారూ ఉన్నారు. జీవక్రియల కోసం విటమిన్లు కీలకమే. కానీ ‘ఆరోగ్య స్పృహ’ అంటూ అతిచేయడంతో విటమిన్ల మోతాదు పెరిగి ‘హైపర్ విటమినోసిస్’ కు గురయ్యే ప్రమాదమూ ఉంది. ఆ అనర్థాలేమిటో తెలిపే కథనమిది. మోతాదుకు మించి విటమిన్లు తీసుకోవడం వల్ల ‘హైపర్ విటమినోసిస్’ అనే కండిషన్ వస్తుందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కండిషన్‌ను ‘విటమిన్ టాక్సిసిటీ’గా కూడా పేర్కొంటున్నారు. నీటిలో కరిగేవాటికంటే... ఫ్యాట్లో కరిగేవే డేంజర్ విటమిన్లలో ఏ, బీ కాంప్లెక్స్, సీ, డీ, ఈ, కే అనే విటమిన్లు ఉంటాయి. వీటిల్లో ‘ఏ, డీ, ఈ, కే’ అనేవి కొవ్వు (ఫ్యాట్)లో కరిగితేనే దేహంలోకి ఇంకుతాయి. ఇక విటమిన్ ‘బీ–కాంప్లెక్స్’తో పాటు విటమిన్ ‘సీ’ మాత్రం నీళ్లలో కరుగుతాయి. ఈ బీ కాంప్లెక్స్, సీ విటమిన్లు నీళ్లలో కరగడం వల్ల కాస్త ఎక్కువైనా... మూత్రంతో పాటు బయటకు తేలిగ్గా వెళ్తాయి. దాంతో హానికి పెద్దగా అవకాశం ఉండదు. కానీ సమస్యల్లా విటమిన్ ఏ, డీ, ఈ, కే లు కొవ్వుల్లో కరగడం వల్ల... వీటి మోతాదు పెరిగినప్పుడు అంత తేలిగ్గా బయటకు వెళ్లడం సాధ్యపడదు. దాంతో ఎక్కువైనప్పుడు కొన్ని అనర్థాలు తెచ్చిపెడతాయి. విటమిన్–ఏ పెరిగితే... విటమిన్–ఏ లోపిస్తే రేచీకటి వంటి సమస్యలు వస్తాయి. విటమిన్– ఏ పెరగడం వల్ల ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), వికారం లేదా వాంతులు, తలనొప్పి, కండరాల–కీళ్ల నొప్పులు, మరీ మోతాదు ఎక్కువైతే కాలేయం తన విధులు నిర్వర్తించలేకపోవడం వంటి అనర్థాలు వస్తాయి. విటమిన్–డీ ఎక్కువైతే... ఆరుబయట చేసే ఉద్యోగాలు బాగా తగ్గడం, దాదాపుగా అందరూ ఆఫీసుల (ఇన్‌డోర్స్)కే పరిమితం కావడంతో ఇటీవల మన దేశంలో విటమిన్ ‘డీ’ లోపం బాగానే పెరిగింది. ఒక దశలో విటమిన్–డీ లోపం కేసులు చాలా పెద్ద సంఖ్యలో రావడంతో చాలామంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విటమిన్–డీ సప్లిమెంట్లను ఇవ్వడం మొదలుపెట్టారు. డీ–విటమిన్ ఎక్కువైతే అది రక్తంలో క్యాల్షియమ్ మోతాదుల్ని పెంచుతుంది ఫలితంగా కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని మానసిక సమస్యలు కనిపించవచ్చు. అలాగే తలనొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ, జీర్ణవ్యవస్థకు (గ్యాస్ట్రో ఇంటస్టినల్) సమస్యలు రావచ్చు. అంటే ఉదాహరణకు వికారం, వాంతులు, మలబద్ధకం, కడుపునొప్పి వంటివి కనిపించే అవకాశాలున్నాయి. ఇక మూత్ర వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు... అంటే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, మూత్రపిండాల్లో క్యాల్షియమ్ ఎక్కువగా చేరే ‘నెఫ్రోక్యాల్సినోసిస్’ వంటి సమస్యలూ రావచ్చు. ఫలితంగా కిడ్నీ పనితీరు దెబ్బతినేందుకు అవకాశాలుంటాయి. విటమిన్–ఈ పెరగడం వల్ల దేహాన్ని అందంగా ఉంచడంతో పాటు కొంతమేరకు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే ఇదే విటమిన్ దేహంలో పెరగడం వల్ల... అది మరో విటమిన్ అయిన విటమిన్–కే చేయాల్సిన విధుల్ని దెబ్బతీస్తుంది. దాంతో తేలిగ్గా రక్తస్రావం జరగడానికీ, అంతర్గత రక్తస్రావాలకూ అవకాశం ఏర్పడుతుంది. విటమిన్–కే పెరుగుదలతో దుష్ప్రభావాలివి... దేహంలో విటమిన్–కే పెరగడం అన్నది చాలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అయితే ఇలా పెరగడం వల్ల కామెర్లు, హీమోలైటిక్ అనీమియా వంటి కండిషన్లు ఏర్పడతాయి. చికిత్స : సమస్య నిర్ధారణలో హైపర్ విటమినోసిస్ వల్ల వచ్చిన అనర్థమే అన్నది చాలా కీలకం. దేహంలో ఏ విటమిన్లు ఎక్కువయ్యాయో దాన్ని బట్టి నిర్దుష్టమైన చికిత్స ఉంటుంది. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువైతే... దానికి విరుగుడుగా మూత్రం ఎక్కువగా వచ్చేందుకు ఉపకరించే ‘ఎసెటజోలమైడ్’ వంటి మాత్రలు సూచిస్తారు. ∙విటమిన్–డీ పెరిగినట్లు తెలిస్తే... దానికి విరుగుడుగా దేహంలోని క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, చాలా ఎక్కువ మోతాదులో మూత్రం వచ్చేందుకు వాడే ‘లూప్ డైయూరెటిక్స్’ వంటివి వాడతారు. అలాగే క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు కల్సిటోనిన్ వంటి ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రేలు, బిస్ఫాస్ఫోనేట్ వంటివి ఇస్తారు. ► విటమిన్–ఈ పెరిగినట్లు నిర్ధారణ అయితే రక్తస్రావాలు, అంతర్గత రక్తస్రావాలు నివారించేందుకు విటమిన్–కే, ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ΄్లాస్మా) వంటి ప్రక్రియలు చేస్తారు. ► విటమిన్–కే పెరిగినట్లు తెలిస్తే... దాని అనర్థాలు నివారించేందుకు వార్‌ఫేరిన్ వంటి మందులు లేదా కామెర్లకు వాడే మందులు ఉపయోగిస్తారు. నివారణ : దేహంలోని జీవక్రియలకు ఎంతో కీలకమైన విటమిన్లు చాలావరకు మనం తీసుకునే సమతులాహారంతోనే సమకూరుతుంటాయి. నిర్దుష్టంగా ఏవైనా విటమిన్ లోపాల వల్ల వచ్చే లక్షణాలను కనుగొంటే డాక్టర్లు వీటిని సూచిస్తారు. అంతేతప్ప... విటమిన్లు పెరిగితే ఆరోగ్యమూ పెరుగుతుందనే అపోహతో ‘ఆన్ కౌంటర్ మెడిసిన్’లలా విటమిన్ సప్లిమెంట్లు వాడటం ఎంతమాత్రమూ సరికాదు. - డాక్టర్ కె. శివరాజు ,సీనియర్ ఫిజీషియన్ -
పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే...
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరమన్న సంగతి అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా అన్నిపాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఎముకల ఎదుగుదలకి ఏం చేయాలో తెలుసుకుందాం.... తల్లిదండ్రులు.. పిల్లలు రోజుకు కనీసం 2 గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే మీ పిల్లల ఆహారంలో బచ్చలికూర, బెండకాయ, పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడాలి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అన్నింటికీ మించి నువ్వులలో క్యాల్షియం చాలా అధికమొత్తంలో ఉంటుంది కాబట్టి పిల్లలు రోజూ ఒక స్పూను నువ్వులు తినేలా చూస్తే చాలు... తప్పకుండా ఉండాలండి కాల్షియం శోషణ విటమిన్ డి సహాయపడుతుంది. దీనికే విటమిన్ డి 3 అని కూడా పేరు. మన దేశంలో విటమిన్ డికి ఎలాంటి కొదవ లేకున్నా.. చాలా మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్‌ను తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ►నవజాత శిశువులకు కూడా విటమిన్ డి అవసరం. అందుకోసం వారి ఒంటికి నువ్వుల నూనె రాసి, లేలేత సూర్యకిరణాలు తగిలేలా చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత మృదువుగా మర్దనా చేస్తూ స్నానం చేయించాలి. ఈ విటమిన్లు కూడా ► శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయులు ఎక్కువగా ఉంటే విటమిన్ డి సమృద్ధిగా ఉన్నట్లే. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్యాబేజీ, ఆకుపచ్చ మొలకలు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ కె, మెగ్నీషియం ఉంటాయి. శీతల పానీయాలు వద్దే వద్దు... పిల్లలు ఎంత మారాం చేసినా వారిని శీతల పానీయాలు తాగనివ్వకూడదు. ఎప్పుడో ఒకసారి అయితే ఫరవాలేదు కానీ తరచూ ఇవి తాగడం పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ డ్రింక్‌లను తాగించండి. దీనివల్ల పిల్లల ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది. -
అయోమయమా.. జట్టు రాలుతుందా..? అయితే ఈ కారణమే కావచ్చు..!
ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ప్రోటీ న్లు, కాల్షియం లేదా విటమిన్లు. వీటిలో జింక్ ఒకటి. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. మన శరీరానికి జింక్ చాలా అవసరం. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్‌లు అవసరం. ఆ ఎంజైమ్‌లను పనిచేసేలా చేయడం కోసం జింక్ అత్యవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. అదే గర్భిణిలు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు మాత్రం 12 మిల్లీ గ్రాములు అవసరం పడుతుంది. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి. బరువు తగ్గడం.. జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతో అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. జుట్టు రాలిపోవడం.. జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు అధికంగా రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు. తరచూ జలుబు.. జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాని వల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు తగ్గుతుంది. చూపు మసక బారడం.. ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి కాబట్టి శరీరంలో జింక్ లోపిస్తే చూపు మసకబారుతుంది. గందరగోళం.. మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి. సంతానోత్పత్తిపై ప్రభావం.. జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనం.. శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. అయితే జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది కాబట్టి లోప నివారణకు సప్లిమెంట్లు తీసుకోక తప్పదు. ఇలా నివారించాలి.. జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లను తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. -
ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి..? అందులో ఉండే విటమిన్లేంటి?
మహబూబ్‌నగర్ రూరల్: కరోనా వైరస్ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక పోష కాలు ఉన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించింది. పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)ను ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకారం అందిస్తోంది. బియ్యంలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలు కలపటంతో ఆ ఆహారం తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా కరోనాలాంటి పలురకాల వైరస్‌లను మానవులు తట్టుకుంటారని భావిస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తయారీకి జిల్లాలోని రైస్‌మిల్లుల్లో యంత్రాలను మార్చాలని యజమానులకు అధికారులు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఏప్రిల్‌లో సరఫరా చేయగా.. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులు, రేషన్ లబ్ధిదారులకు కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి👉🏻Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటు.. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థ అందించిన నిల్వలకు అదనంగా పోషకాలు కలుపుతున్నారు. ఇందుకు మిల్లుల్లో బ్లెండింగ్ యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు సుమా రు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 10 పారా బాయిల్డ్ రైస్‌మిల్లుల్లో వీటిని ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 700 క్వింటాళ్ల ఫోర్టిఫైడ్ నిల్వలను సరఫరా చేస్తున్నారు. మరో అయిదు మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–ఏ, జింక్, ఇతర విటమిన్లు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021 యాసంగిలో పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యం 7,540 మెట్రిక్ టన్నులు ఈ మిల్లులకు కేటాయించగా.. ఫోర్టిఫైడ్ రైస్ పౌరసరఫరాలశాఖ గోదాములకు చేరింది. ఉపయోగం ఏంటి? సాధారణ బియ్యంలో ఐరన్ విటమిన్ డి, బి–12తో పాటు మరిన్ని పోషకాలు కలపటంతో సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి. గోధుమలు, మినుములు, పెసర, అపరాలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మారుస్తారు. వీటిని కెనరల్స్ అంటారు. ఈ కెనరల్స్ పౌడర్‌ను ముద్దల రూపంలోకి మార్చి క్వింటా సాధారణ బియ్యానికి కిలో కెనరల్స్ కలుపుతారు. సాధారణ బియ్యంలో కార్బొహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. తోడుగా కెనరల్స్ కలపటంతో పిండి పదార్థాలు, పోషకాలు జమవుతాయి. పోషకాలు కలిపిన బియ్యం వండితే బలవర్ధక ఆహారం తయారవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్వింటాకు కిలో చొప్పున.. వంద కిలోల సాధారణ బియ్యానికి కిలో పోషకాల నిల్వలను కలుపుతున్నారు. మిల్లుల్లో ఓవైపు మరపట్టిన.. మరోవైపు పోషకాల నిల్వలు వచ్చి ఒకేచోట పడేలా యంత్రాలను అమర్చుతున్నారు. ఉత్తర్వులు రావాలి.. పోషకాల మిళిత బియ్యాన్ని ఇప్పటికే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మున్ముందు పాఠశాలలలు, రేషన్ లబ్ధిదారులకు అందిస్తాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. – జగదీశ్‌కుమార్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మహబూబ్‌నగర్ చదవండి👇🏽 కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
Snake Gourd: పొట్లకాయ తింటున్నారా... అయితే.. కిడ్నీలు, బ్లాడర్ పనితీరు..
పొట్లకాయ... పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది ఈ స్నేక్‌గార్డ్. సాధరణంగా పొట్లకాయ అంటే చాలా మంది ముఖం చిట్లిస్తారు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... నోరూరించే రుచులు ఆస్వాదించవచ్చు. అంతేకాదు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. భారత్ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ పొట్లకాయలను ఆహారంలో ఉపయోగిస్తారు. మనదేశంలో వీటితో రకరకాల కూరలు వండటం పరిపాటి. అయితే, కొన్ని దేశాల్లో పొట్లకాయలు బాగా పండిన తర్వాత వాటి గుజ్జును టమాటా గుజ్జుకు ప్రత్యామ్నాయంగా కూడా వినియోగిస్తారు. ఇక ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో వీటి మొలకలను, ఆకులను తింటారు కూడా. పొట్లకాయలో ఉండే పోషకాలు ►పొట్లకాయల్లో ఫైబర్ ఉంటుంది. ►స్వల్పంగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు కూడా కలిగి ఉంటుంది. ►ఇక విటమిన్లలో... విటమిన్–ఏ, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటివి పొట్లకాయలో లభిస్తాయి. ►వీటితో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ►పొట్ల కాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి. ►వీటిలో పుష్కలంగా ఉండే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ►జ్వరానికి పథ్యంగా పనిచేస్తాయి. ►శరీరంలోని వ్యర్థాలను బయటకు(డిటాక్సీఫై) పంపిస్తుంది. ►డీ హైడ్రేషన్ తగ్గిస్తుంది. కిడ్నీలు, బ్లాడర్ పనితీరును మెరుగపరుస్తుంది. ►ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ►జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ►పొట్లకాయలో యాంటీ బయాటిక్ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ►శ్వాస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాత పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవాలనిపిస్తోంది కదా! అయితే, ఎప్పటిలా కూరలా కాకుండా ఇలా కట్లెట్ తయారు చేసుకుని రుచిని ఆస్వాదించండి. పొట్లకాయ కట్లెట్ ఇలా తయారీ కావలసినవి: లేత పొట్ల కాయ – 1; బంగాళదుంపలు – 3 (మీడియం సైజువి); తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 3 (మెత్తగా చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను కడిగి, పెద్ద సైజు చక్రాలుగా తరగాలి ►ఉడికించి, తొక్క తీసేసిన బంగాళ దుంపలు ముద్దలా అయ్యేలా చేతితో కలపాలి. ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు, మెత్తగా చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఉల్లి తరుగు మెత్తపడే వరకు వేయించాలి ►బంగాళ దుంప ముద్ద, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు జత చేసి బాగా వేయించి, దింపేయాలి ►ఈ మిశ్రమాన్ని పొట్లకాయ చక్రాలలో కూరాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి ►స్టఫ్ చేసిన చక్రాలను పొడి బియ్యప్పిండిలో పొర్లించి, కాగిన నూనెలో వేసి రెండు వైపులా దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ►టొమాటో సాస్ లేదా చిల్లీ సాస్‌తో అందించాలి. చదవండి: Gas Problem Solution: గ్యాస్ సమస్యా... పాస్తా, కేక్ బిస్కెట్స్, ఉల్లి, బీట్రూట్స్ తింటే గనుక అంతే! -
Health Tips: వంకాయ కూర తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ ‘కె’ వల్ల
ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ.. తాజా కూరలలో రాజా ఎవరండీ... ఇంకా చెప్పాలా వంకాయేనండీ.. అవును నిజమే.. మహానుభావులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్లు కూరగాయలలో వంకాయ నిజంగా కింగే! తెలుగువారి మెనూలో కచ్చితంగా ఉండే కూరగాయ ఇది. గుత్తి వంకాయ, వెన్న వంకాయ, వంకాయ నువ్వుల పులుసు, వంకాయ ఉల్లి పచ్చడి.. ఇలా ఏ రకంగా ఎవరు వండినా, ఎలా వండినా... తనదైన రుచిని వంటకానికి అద్దడం వంకాయ ప్రత్యేకత. కేవలం రుచిలోనే కాదండోయ్... ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ వంకాయ భేష్! వంకాయలో ఉండే పోషకాలు: ►వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు ఉంటాయి. ►చక్కెర, పీచు పదార్థాలు పుష్కలం. ►ఇక విటమిన్ల విషయానికొస్తే... విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటివి ఉంటాయి. ►క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు వంకాయలో ఉంటాయి. ►యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ►కేలరీలు తక్కువ. చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల... వంకాయ కూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ►జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. ►ఫలితంగా స్థూలకాయాన్ని, గుండెజబ్బులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి. ►వంకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ 15. కాబట్టి ఇది డయాబెటిస్ పేషంట్లకు మంచిది. ►అంతేకాదు వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ►కొవ్వు శాతం తక్కువ.. నీరు ఎక్కువగా ఉంటుంది. ►కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు దీనిని తరచూ తినడం మంచిది. ►అదే విధంగా వంకాయ హైబీపీని అదుపు చేస్తుంది. ►రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వంకాయలు తగ్గిస్తాయి. ►న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడగలుగుతాయి. ►ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్ వంటివి గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ►ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది. గమనిక: ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Pista Pappu: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
పిస్తా పప్పు.. చూడగానే నోరూరిపోతుంది! చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చాలా మంది రోజూవారీ డైట్లో తప్పక దర్శనమిస్తుంది ఈ పిస్తా. ఈ అలవాటు మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. పిస్తా కేవలం రుచికి మాత్రమే కాదు... మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. కొంచెం తిన్నా చాలు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో మనకు కావాల్సిన శక్తి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా కూడా ఒకటి. మరో విషయం.. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. పిస్తా పప్పులో ఉండే పోషకాలు: ►పిస్తా పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. ►పిస్తాలో పీచు పదార్థాలు, మాంసకృత్తులు కూడా ఎక్కువే. ►ఇక పిస్తాలో లభించే విటమిన్లు.... విటమిన్ బి6, సి, ఇ. ►పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ. ►ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి. ►ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే... పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక ఔన్సు అంటే (28 గ్రాములు) సుమారు 49 పిస్తా పప్పుల్లో ఉంటే పోషకాలు.. కాలరీలు: 159 కార్బోహైడ్రేట్లు: 8 గ్రా. ఫైబర్: 3 గ్రా. ప్రొటిన్: 6 గ్రా. ఫ్యాట్: 13 గ్రా.(90 శాతం అనుశాటురేటెడ్ ఫ్యాట్స్) పొటాషియం: 6 శాతం ఫాస్పరస్: 11 శాతం విటమిన్ బీ6: 28 శాతం థయామిన్: 21 శాతం మెగ్నీషియం: 15 శాతం. చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల... పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►డ్రై ఫ్రూట్స్ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ. ►ఇందులోని విటమిన్ బి6 ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. ►రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. ►రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ►పిస్తాలోని అధిక ఫైబర్, ప్రొటిన్ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో తక్కువగా తినడం.. తద్వారా బరువు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. ►ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బి6 అధికంగా లభించే ఆహారపదార్థాల్లో పిస్తా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి పిస్తా తినడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. ►ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియాను పెంపొందిస్తుంది. ►ఇందులో ఉండేది ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వే కాబట్టి డైట్లో పిస్తాను చేర్చుకోవచ్చు. చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల.. -
విటమిన్ పేరిట విషం మాత్రలు ఇచ్చి ముగ్గురి హత్య
సాక్షి, చెన్నై: ఈరోడ్ జిల్లా సెన్నిమలైకు చెందిన ఓ కుటుంబంలోని వారికి విటమిన్ పేరిట విషం మాత్రలు ఇవ్వడంతో ముగ్గురు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నిమలైకి చెందిన కరుప్పన్నన్, ఆయన భార్య మల్లిక, కుమార్తె దీప, పని మనిషి కరుప్పాయి శనివారం సాయంత్రం పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో వీరి పొలంలో కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న కళ్యాణ సుందరం కూడా అక్కడే ఉన్నాడు. అటువైపు కరోనా శిబిరం నుంచి వచ్చినట్టు పేర్కొంటూ యువకుడు ఫీవర్ టెస్ట్ చేసి విటమిన్ మాత్రలు ఇచ్చి వెళ్లాడు. అవి వేసుకున్న కాసేపటికే కరుప్పన్నన్ కుటుంబం స్పృహ తప్పింది. గమనించిన ఇరుగుపొరుగు వారిని ఆస్పత్రికి తరలించగా మల్లిక, కరుప్పాయి, దీప మృతి చెందారు. కరుప్పన్నన్ కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్యాణ సుందరం ఆ మాత్రలు వాడకపోవడంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. కరుప్పన్నన్ పొలం లీజుతో పాటు ఆయన నుంచి తీసుకున్న రూ.13 లక్షలు చెల్లించలేని స్థితిలో హత్యకు పథకం పన్నినట్టు అంగీకరించాడు. చదవండి: జూన్‌లో 10.8 కోట్ల కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేసిన సీరమ్ ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య -
చులకన వద్దు.. గరిటెడైనను చాలు గాడిద పాలు!
సాక్షి, అమరావతి: గాడిదను మనం చాలా చులకనగా చూస్తుంటాం.. ఒరేయ్ గాడిదా.. అంటూ దాని పేరును ఓ తిట్టులా వాడేస్తాం. మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన ఆ గాడిద పాలలోమనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు అవి మనకు అక్కరకొస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి. దేశంలో గాడిద పాల వినియోగం పూర్వకాలం నుంచే ఉన్నా.. పాల కోసమే గాడిదల్ని పెంచే దశకు మనం ఇంకా రాలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా ఉపఖండ ప్రాంతాలను మినహాయిస్తే.. అమెరికా, లాటిన్ అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరింది. ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలెండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం వాణిజ్య స్థాయిలో కొనసాగుతోంది. యూరోప్‌లో సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో గాడిద పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయన్న నమ్మకం అనాదిగా ఉంది. వయసు మళ్లిన వారు గాడిద పాలను బలవర్ధక ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. లాటిన్ అమెరికన్ దేశాల్లో గాడిద పాలను ఔషధంగానే కాకుండా తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఔషధంగానే తీసుకుంటున్నారు. ఈ పాలు తాగితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. లీటర్ గాడిద పాల ధర సుమారు రూ.2 వేలపైనే ఉంది. ఔషధ వినియోగం కోసం సుమారు 25, 30 మి.లీ. మోతాదులో విక్రయిస్తున్నారు. ఒక్కో మోతాదు ధర రూ.200 నుంచి రూ.300 వరకూ ఉంది. మన ఇళ్ల దగ్గరకొచ్చేవారు 10 మి.గ్రా ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న గాడిదపాల వినియోగం ఇటీవల కరోనా నేపథ్యంలో బాగా పెరిగింది. పుష్కలంగా పోషకాలు గాడిద పాలల్లో విటమిన్ సీ, బీ, బీ12, ఈ విటమిన్లతో పాటు, న్యూట్రిన్లు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో సీ విటమిన్ 60 రెట్లు అధికం కీలకమైన ఓమేగా–3, 6తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలం తల్లిపాలతో సమాన స్థాయిలో కేలరీలు, మినరల్స్ ఉంటాయి. గేదె పాలతో సమానమైన బలం ఇస్తాయని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆస్తమా, క్షయ, గొంతు సంబంధిత వ్యాధుల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో గాడిద పాలను వినియోగిస్తారు. నవజాత శిశువులకు పూర్తి పోషకాలను అందించడంతో పాటు చర్మవ్యాధులను నయం చేస్తాయి. గాడిద పాలల్లో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తక్కువ. ఆవుల వల్ల వచ్చే ఎలర్జీ వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి. గాడిద పాలలో కాల్షియం ఎక్కువ. పిల్లల్లో ఎముకలను పటిష్ట పర్చడం, విరిగిన ఎముకలను అతికించే స్వభావం వీటికి ఉంది. ఈ పాల వినియోగంతో ఉబ్బసం, సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్టు ఇటీవల సైప్రస్ వర్సిటీ నిర్ధారించింది. కొవ్వు శాతం చాలా తక్కువ గాడిద పాలు తల్లి పాలకు దగ్గర ఉంటాయి. తల్లి పాలకు దాదాపు సమానంగా వీటిలో లాక్టోజ్ ఉంటుంది. ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. స్థూలకాయం నుంచి బయటపడేందుకు గాడిద పాలను సూచిస్తున్నారు. మనకు మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నా.. మన దేశంలో మాత్రం గాడిద పాలు వాణిజ్య స్థాయిలో వినియోగంలోకి రాలేదు. – డాక్టర్ జి.రాంబాబు, అసిస్టెంట్ సర్జన్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ జనాభాలో దాదాపు 2 నుంచి 6 శాతం ప్రజలకు ఆవు పాలు సరిపడవు. ఆ పాల వల్ల ఎలర్జీలొస్తాయి. అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయి. – ఐక్యరాజ్యసమితి అధ్యయనం మా తాతముత్తాతల దగ్గర్నుంచి మా ఇంట్లో గాడిద పాలు వాడుతున్నాం. గాడిద పెంపకందార్లే ఇంటి ముందుకొచ్చి పాలు పితికి ఇస్తారు. చిన్న అమృతాంజనం సీసా పాలకు రూ.100 తీసుకుంటారు. ఇప్పుడు కరోనా కూడా రావడంతో ఇంట్లో పిల్లలకీ ఇస్తున్నాం.. – మురళీ, చీరాల గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయకపోయినా, రోగుల జీవిత కాలాన్ని పొడిగించేందుకు మాత్రం దోహదపడతాయి – లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్‌దీపక్ ప్రకటన -
Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు
చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం.. ఇందులోనే ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్ సీ, 1 శాతం విటమిన్ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి! (చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !) -
వెన్న రుచికరమే కాదు...ఆరోగ్యకరం కూడా!
ఇటీవల నూనెల వాడకం బాగా పెరిగాక వెన్నను గతంలోలా మునపటంత విరివిగా ఉపయోగించడం లేదు. కానీ నిజానికి వెన్న చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. వెన్నలోని కొన్ని పోషకాలూ, వాటితో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) అనే పోషకాలు ఉన్నాయి. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నలోని బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని ఈ బ్యుటిరేట్. బ్యూటిరేట్కు మరో మంచి లక్షణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా అది సమర్థంగా తగ్గిస్తుంది.