
‘ఇదేంటీ.. అంతమంది శిశువులను ఎత్తుకుని కనిపిస్తున్నారు.. వైద్యానికిగాని వచ్చారా!’అనిపిస్తోంది కదూ! మీ అనుమానం నిజమే. వారు వచ్చింది వైద్యంకోసమేగానీ.. వైద్యుడి వద్దకు మాత్రం కాదు. ఉదయంపూట వచ్చే సూర్యకిరణాలతో చిన్నారులకు ‘డి’విటమిన్ లభిస్తుందని డాక్టర్ సూచించడంతో మంచిర్యాల జిల్లా కేంద్రం ఆసుపత్రిలో జన్మించిన శిశువులను వారి బంధువులు ఇదిగో ఇలా బుధవారం ఉదయం 8 గంటలకు ఎత్తుకుని ఆసుపత్రి ఎదుట కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ మంచిర్యాల