manchiryala town
-
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేసే ప్రయత్నం సరికాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముందుగా పరిహారం చెల్లించాకే భూములు సేకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో జరిపిన సమీక్షలో పలు సూచనలు చేశారు. మంచిర్యాల–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి ఎన్హెచ్ఏఐ వద్ద పరిహారానికి సంబంధించి డ్రాఫ్ట్ అవార్డులు 1,023 వరకు పెండింగులో ఉండటంపై ప్రశ్నించారు. 15 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని అధికారులు పేర్కొనే క్రమంలో.. భూమిని సేకరించి పరిహారం చెల్లిస్తామంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొనటాన్ని మంత్రి తప్పుపట్టారు.భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులను వచ్చేవారం ప్రారంభించాలని, తాను ఇప్పటికే పదిసార్లు ఆదేశించినా పనులు మొదలుపెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి డిసెంబర్/జనవరిలో టెండర్లు పిలవాలని సూచించారు. శ్రీశైలం దారిలో మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నందున తుక్కుగూడ నుంచి డిండి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి నిర్ణయించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.దీని ఆమోదంపై తాను సీఎంతో మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. రూ.7 వేల కోట్లు ఖర్చయ్యే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎంతో ఉపయుక్తమైందని, ఈ పనుల్లో వేగం పెరగాలని సూచించారు. భద్రాచలానికి 3 గంటల్లో వెళ్లేలా చేసే గౌరెల్లి–వలిగొండ రోడ్డు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం–దేవరపల్లి రోడ్డులో సరీ్వసు రోడ్డు ఆప్షన్ ఉండాలని సూచించారు. విపక్షాల వికృత చేష్టలు.. రైతులకు లాభదాయక పరిహారం ఇచ్చి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ కోసం యత్నిస్తుంటే విపక్షాలు కలెక్టర్లపై కూడా దాడులు చేసి చంపేందుకు కుట్రచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని విమర్శించారు. -
సివిల్స్ కల జల సమాధి
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): ఎలాగైనా ఐఏఎస్ కావాలని ఆ యువతి కన్న కల జల సమాధి అయ్యింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్‌లో విషాదం నెలకొంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్‌గా పని చేస్తున్నారు. నస్పూర్‌లోని సీసీసీ టౌన్షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. శనివారం ఏం జరిగింది..? ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు. స్పందించిన సింగరేణి అధికారులు సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్‌లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రయాణంలో ఉండగా మరణ వార్త విజయ్‌కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్‌ను కాలేజీలో దింపడం కోసం శనివారం రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్‌నగర్‌కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్‌పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్‌కు తరలించారు. విజయ్‌కుమార్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు. 10 మందికి పైగా గల్లంతు? ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్మెంట్లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది. రావూస్ సంస్థకు బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్‌కు చెందిన సోని తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. -
మోదీ 3.0.. 100 రోజులు.. మనవి 2 రోడ్లు
సాక్షి, హైదరాబాద్: మోదీ 3.0 తొలి ‘వంద రోజుల ప్రణాళిక’లో తెలంగాణకు చెందిన రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు దక్కింది. ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరసల జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఇందులో ఎంపిక చేశారు. ఈ వంద రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియతో మందగించిన పురోగతిని వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మూడో విడత పాలనను వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో దేశవ్యాప్తంగా 3 వేల కి.మీ. నిడివి గల జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులను చేర్చారు. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే క్రమంలో పనులను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తారు. వాటిలో తెలంగాణకు సంబంధించి ఈ రెండు జాతీయ రహదారులుండటం విశేషం. ఇందులో ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల రోడ్డుకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక జగిత్యాల–కరీంనగర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఆరు నెలల క్రితమే టెండర్లు పూర్తికాగా, ఇప్పుడు వాటిని రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) వేగంగా చర్యలు తీసుకుంటోంది.రెండు రోడ్ల అనుసంధానంనిజామాబాద్–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్పూర్ మధ్య విస్తరించి ఉన్న ఎన్‌హెచ్–63ను విస్తరించాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది. ట్రక్కులు అధికంగా తిరిగే ఈ జాతీయ రహదారి రెండు వరసలతో ఇరుకుగా ఉండి ప్రమాదాలకు నిలయంగా మారటంతో నాలుగు వరసలకు విస్తరించనున్నారు. ఇందులో ఆర్మూరు–మంచిర్యాల మధ్య కీలక ప్రాంతాన్ని ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. రాష్ట్రం పరిధిలోని మిగతా నిడివిని రాష్ట్రప్రభుత్వ అ«దీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరిస్తోంది.పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరిస్తారు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా సాగే ఈ రోడ్డు నిడివి 131.8 కిలోమీటర్లు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల పట్టణాల వద్ద 6–12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇతర రోడ్ల క్రాసింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. భూసేకరణ విషయంలో గతంలో స్థానికులు వ్యతిరేకించి ఉద్యమించడంతో రెండుమార్లు దీని డిజైన్ మార్చాల్సి వచి్చంది. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వచి్చంది. ఇప్పుడు ఆలస్యం కాకుండా పనులను వేగంగా పూర్తి చేయనున్నారు.‘ప్రమాదాల రోడ్డు’కు ప్రాధాన్యం జగిత్యాల నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్–563లో కీలక భాగమైన 58.86 కి.మీ. నిడివి కూడా ఇప్పుడు వంద రోజుల ప్రణాళికలో చోటు దక్కించుకుంది. ఈ రోడ్డు రెండు వరసలుగా ఉండి ఇరుగ్గా మారటంతో ప్రమాదాలకు నిలయమైంది. దీన్ని విస్తరించాలని చాలాకాలంగా యతి్నస్తున్నా పనుల్లో వేగం రాలేదు. కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య ఎట్టకేలకు పనులు మొదలు కాగా, జగిత్యాల–కరీంనగర్ మధ్య టెండర్ల ప్రక్రియతో ఆగిపోయింది. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని ఇప్పుడు నిర్ణయించారు. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వంద రోజుల గడువులో నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ఈ నిడివి పనులకు రూ.2,151 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా, ఇప్పుడు దాని విలువ రూ.2,300 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అది కూడా పూర్తికావొచి్చంది. కొన్ని అవాంతరాలున్నా, వేగంగా అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఆర్టీసీ ఉద్యోగిపై దాడి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఆన్‌డ్యూటీలో ఉన్న ఉద్యోగి(కంట్రోలర్)పై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేయడానికి వచ్చి ఇన్‌గేట్(అనుమతిలేని చోట) వద్ద కారు పార్కింగ్ చేసి వె ళ్తుండగా కంట్రోలర్ గమనించారు. కారును అక్కడ నుంచి తీసివేయాలని సూచించారు. దీంతో వారిద్ద రు ఉద్యోగి జమాల్పాషాపై పిడగుద్దులు గుద్దారు. స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్క ర్లు కొడుతోంది. ఆర్టీసీ కంట్రోలర్ జమాల్‌పాషా దాడి విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని సీఐ బన్సీలాల్ తెలిపారు. -
డ్రైవింగ్ స్కూళ్లలోనూ లైసెన్స్..
ఆదిలాబాద్: రహదారి భద్రత చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నూతన సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా ఈ స్కూళ్లలో డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మోటారు వాహన చట్టం మార్పులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ అంతా కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో సాగనుంది.ఈ చట్టం జూన్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ లేదు సరికదా ఇప్పటికిప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కూడా కష్టమే. రవాణా శాఖ చట్టం నిబంధన మేరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడున్న వారు ఏర్పాటుకు సముఖంగా లేరు. డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తే అనుమతి ఇస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.పారదర్శకతతో డ్రైవింగ్ ఉంటేనే..అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే డ్రైవింగ్ శిక్షణ నాణ్యమైనదిగా, సమర్థవంతమైనదిగా, పారదర్శకతతో ఉంటే లైసెన్స్‌లు ఇవ్వాలనేది రవాణా శాఖ ముఖ్యోద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే 5–ఏ సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో రవాణా శాఖ అధికారులను పరిమితం చేస్తూ తీసుకొస్తున్న అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ప్రస్తుతం కష్టతరంగానే ఉండబోనుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా కఠిన నిబంధనలతో స్కూళ్ల ఏర్పాటు కష్టమే అంటున్నారు.మూడెకరాలు కావాల్సిందే..డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కనీసం మూడెకరాల స్థలం కావాలి. రెండెకరాల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లు ఏర్పాటు చేయాలి. మరో ఎకరంలో శిక్షణ తరగతుల కోసం భవనం, తరగతి గదులు, ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ, టీచింగ్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకు పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం. భూముల విలువ రూ.లక్షలు, రూ.కోట్లలో ఉండగా మూడెకరాల్లో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కష్టమే అంటున్నారు. అయినా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందా అనేది అనుమానమేనని అంటున్నారు. -
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ
ఆదిలాబాద్: 108 అంబులెన్స్‌లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్చేశారు. 108 అంబులెన్స్‌లో ఉట్నూర్‌కు తరలిస్తున్న క్రమంలో జైనూర్ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎన్టీ శ్రీనాథ్ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్‌ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్‌తో పాటు పైలెట్ రమాకాంత్ ఉన్నారు. -
సాయం చేస్తా... సరదా తీర్చండి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు డెయిరీ విస్తరణకు సాయం చేస్తానంటూ యాజమాన్యాన్ని వేధించారని, ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలంటూ ఇబ్బందిపెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఆయన బంధువుకు కొంత వాటా ఇచ్చామని.. ఆయన కోరినట్టు కాకున్నా బ్రోకర్ ద్వారా వేరే యువతిని పంపామని డెయిరీ భాగస్వామి పేరిట ఓ ఆడియో విడుదలైంది. డబ్బులతో పాటు అన్ని రకాలుగా తమను వాడుకుని కూడా.. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడుతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా విడుదల చేశారు. అసైన్డ్ భూమి.. ఐదు శాతం వాటా! ఆర్జిన్ డెయిరీ సంస్థ మంచిర్యాల జిల్లాలో తమ బ్రాంచ్ ఏర్పాటు కోసం కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. అది తెలిసిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనే ఆ డెయిరీ ఏర్పాటు చేయాలని, అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కంపెనీ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండెకరాల అసైన్డ్ భూమిని అప్పగించారు. అది లావణి పట్టా భూమి అయినా విక్రయించినట్టుగా పేర్కొని బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ స్థలంలో డెయిరీ ప్లాంటు, పాల నిల్వ కోసం శీతల గిడ్డంగి, ప్యాకింగ్ కేంద్రం నిర్మించాలని ప్రణాళిక వేశారు. నిర్మాణం మొదలయ్యే ముందే ఆ ప్రజాప్రతినిధి తన సమీప బంధువు పేరుతో ఐదు శాతం వాటా సైతం తీసుకున్నారని.. తర్వాత డబ్బులు, ఇతర ‘సాయం’ కూడా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో గొడవ తలెత్తినట్టు తెలిసింది. గత జనవరిలో ఏకకాలంలో పదిచోట్ల ఈ డెయిరీ నిర్వాహకులపై మోసం కేసులు నమోదయ్యాయి. పోలీసులు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను పిలిపించి విచారించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కంపెనీలో భాగస్వామి అయిన షెజల్ అనే యువతి పేరిట ఆడియో, వీడియో, పలు వాట్సాప్ స్క్రీన్షాట్లు విడుదల అయ్యాయి. ‘ట్యాబ్లెట్లు’ అంటూ అమ్మాయి కోసం చాటింగ్! డెయిరీ పనుల నిమిత్తం పలుమార్లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిశామని, ఆయన కోరిన పనులు చేసిపెట్టామని సంస్థలో భాగస్వామి అయిన యువతి ఆడియోలో ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినప్పుడు నా వెంట సంస్థలో పనిచేసే ఓ అమ్మాయి వచ్చేది. ఆమెపై ఎమ్మెల్యే కన్నేశాడు. ఓ రోజు ఫోన్ చేసి.. ఆ అమ్మాయిని రాత్రికి తన వద్దకు పంపించాలన్నారు. ఆమె అలాంటిది కాదని చెప్పినా వినలేదు. అమ్మాయిని పంపకుంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరించాడు. చివరికి ఎవరి ద్వారానో ఓ బ్రోకర్‌ను సంప్రదించి ఎమ్మెల్యే వద్దకు వేరే ఓ యువతిని పంపాల్సి వచ్చింది. నేరుగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే ఆ యువతిని పిలిపించుకున్నారు. తర్వాత దళిత బంధు పథకం కోసం మాట్లాడుదామని మమ్మల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, మంచిర్యాలకు పిలిపించుకున్నాడు. అన్నింటిలో ఇన్వాల్వ్ చేయవద్దని, చెప్పినవన్నీ చేయలేమని మేం అనడంతో.. మాపై తప్పులు కేసులు పెట్టించారు. మేం తప్పు చేయలేదని చెప్పినా పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లి ఇబ్బందిపెట్టారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో మాకు అండగా నిలవాలి..’’ అని పేర్కొన్నారు. తర్వాత షెజల్ పేరిట మరో వీడియో విడుదలైంది. ‘‘ఎమ్మెల్యే మనుషులు మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే, పోలీసులదే..’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. – ఇక యువతిని పంపే అంశంలో ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుడి మధ్య జరిగినవిగా చెప్తున్న వాట్సాప్ చాటింగ్‌లలో.. ‘ట్యాబ్లెట్లు కావాలి. రిలాక్సేషన్ పొందాలి. ఆ అమ్మాయి వస్తుందా?’ అంటూ సాగిన సంభాషణలు, హైదరాబాద్‌లో చేసిన ‘ఎంజాయ్’పైనా మెస్సేజ్‌లు ఉండటం గమనార్హం. దళితబంధులో కోట్లు కొట్టేసేలా? దళితబంధులో 200 పాడి యూనిట్లు ఇప్పిస్తే రూ.2 కోట్లు ఇస్తామని మంచిర్యాల జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తన నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఆఫర్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరో నియోజకవర్గంలోని ఓ యువ నాయకుడితో కూడా యూనిట్లు ఇప్పించేలా చర్చలు జరిగినట్టు తెలిసింది. మరో ప్రజాప్రతినిధి గేదెలకు బదులు ట్రాక్టర్లు ఇవ్వాలని కోరగా.. ఆ మేరకు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి రెండో విడత యూనిట్లు మంజూరు కాక ప్రణాళిక ముందుకు కదల్లేదని తెలిసింది. సదరు మార్కెట్ చైర్మన్ మాత్రం డబ్బులు తీసుకుని గేదెలు ఇవ్వలేదని, ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్‌కావడంతో వివాదం మరింత ముదిరిందని సమాచారం. ఈ వ్యవహారంలోనే డెయిరీ వారిని కూడా ఇన్వాల్వ్ చేసేందుకు ప్రజాప్రతినిధి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తోపాటు వరంగల్ ప్రాంతంలో ఈ డెయిరీ నిర్వాహకులపై పలు కేసులు ఉన్నాయని.. రైతులకు పశువుల బీమా కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన వివాదాలు, ఇతర కేసులు నమోదయ్యాయని సమాచారం. వ్యవహారంపై సీఎంవో నజర్? మంచిర్యాల జిల్లాలో ప్రలోభాల వ్యవహారంపై ఈ నెల 26న ‘సాక్షి’లో ‘పాల కోసం ప్రలోభాలు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిఘా వర్గాలు పలు వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఇందులో అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయి ఆరోపణలు రావడంతో సీఎం ఆఫీసు కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. నాపై దుష్పప్రచారం చేస్తున్నారు నాపై కావాలనే ప్రైవేటు డైయిరీ నిర్వాహకులు దుష్పప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మోసాలపై కేసులు నమోదు చేస్తే.. కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. డెయిరీ సంస్థ రైతులను మోసం చేసింది. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెడతాను. – దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే -
మంచిర్యాల: నా వాహనాన్నే ఆపుతారా? టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి!
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: అసైన్డ్ భూములపై కేసీఆర్ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు! -
సిలిండర్ లో నీళ్లు.. ఆందోళనకు దిగిన బాధితులు
-
నేడు మూడువేల కిలోమీటర్ల మైలురాయి దాటనున్న షర్మిల పాదయాత్ర
-
తన వర్గానికి చెందిన నాయకులతో జిల్లా కేంద్రంలో అసమ్మతి సమావేశం
-
పలు ప్రాంతాల్లో భూకంపం
జగిత్యాల/రామగుండం/మొగుళ్లపల్లి/మల్హర్/మంచిర్యాలటౌన్: రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఆదివారం స్వల్పంగా భూమి కంపించింది. 3 నుంచి 5 సెకన్లపాటు కంపించడంతో ఆయా జిల్లాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యా రు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సాయం త్రం 6.48 గంటల సమయంలో 5 సెకన్లపాటు భూమి కంపించింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, బీర్పూర్, రాయికల్, గొల్లపల్లి మండలాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరు గులు తీశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అంతర్గాం, ముత్తారం మండలాల్లో భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి. జయశంకర్ భూపాలపల్లి మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు రంగాపురంలో రాత్రి 7 గంటల సమయంలో భూమి 3 సెకన్ల పాటు.. మల్హర్ మండలం కుంభపల్లి, దుగ్గొండి మండలం రేకంపల్లిలో, కొత్తపల్లి(బి), మానేరు పరీవాహక ప్రాంతంలో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 2 సెకన్లపాటు భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలో... మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ ఆదివారం సాయంత్రం 6:48 గంటల సమయంలో 3 సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ, ఐబీ ప్రాంతం, నెన్నెల మండలం చిత్తాపూర్, జంగాల్‌పేటలో, హాజీపూర్ మండలం నర్సింగాపూర్‌లో, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, దండేపల్లి, భీమారం మండలాల్లోనూ భూమి కంపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా భూమి కంపించి రిక్టర్ స్కేల్‌పై 4.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. అక్టోబర్ 23న కూడా వీటిల్లోని కొన్నిప్రాంతాల్లో భూకంపం సంభవించింది. వారం తర్వాత మళ్లీ భూమి కంపించడం తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వరద నీటిలో చిక్కుకున్న మహిళ
-
మంచిర్యాలలో మలబార్ గోల్డ్ కొత్త షోరూం
మంచిర్యాల: ప్రముఖ బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆగస్టు 26న మంచిర్యాలలో కొత్త షోరూంను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో ఈ కంపెనీ మొత్తం షోరూంల సంఖ్య పదిహేనుకు చేరింది. కేపీఆర్ ప్లాజా, గంగా రెడ్డి రోడ్, మార్కెట్ ఏరియాలో నిర్మించిన కొత్త షోరూంను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపాలిటీ చైర్మన్ ముకేష్ గౌడ్లు ప్రారంభించారు. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అసమానమైన డిజైన్లు, సాటిలేని నాణ్యత, సేవా నైపుణ్యంతో ప్రత్యేక ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందిస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. -
రెండేళ్లకే నూరేళ్లు నిండాయి
మంచిర్యాలక్రైం: ఓ చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి వరండాలోని గ్రిల్స్‌పైకి ఎక్కి జారిపడి మృత్యుఒడికి చేరింది.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ‘మా విందుభోజనం’ హోటల్ యజమాని కొండబత్తుల ప్రవీణ్‌కుమార్, వాణి దంపతులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీసీ ప్రాంతంలోని ఎస్ఆర్ రెసిడెన్సీ నాలుగో అంతస్తులో ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆయన్(5), కూతురు శాన్వి(23 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం కుటుంబసభ్యులు ఎవరి పనుల్లో వారు ఉండగా.. శాన్వి నిద్రలేచి వరండాలోకి వచ్చింది. రెసిడెన్సీ ముఖ ద్వారం వైపు వెళ్లి సిమెం టు గ్రిల్స్ పట్టుకుని కొంతదూరం పైకి ఎక్కింది. అక్కడ గ్రిల్స్ సందుల్లో నుంచి కిందికి చూస్తూ అదుపుతప్పి కింద పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండో బర్త్‌డేకు ముందే మృత్యువాత శాన్వి 2019 సెప్టెంబర్ 9న జన్మించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న రెండో పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పుట్టినరోజు వేడుకలతో వెలిగిపోవాల్సిన ఆ ఇంట ఇప్పుడు చీకట్లు కమ్ముకున్నాయి. -
కాబోయే అమ్మకు కరోనా టెన్షన్.. ఆసుపత్రికి వెళ్లని గర్భిణులు
సాక్షి, మంచిర్యాలటౌన్: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. కరోనా వల్ల సరైన సమయంలో గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లలేక పోతున్నారు. వైద్యులను ఫోన్లో సంప్రదించి వారికి ఉన్న సమస్యను వివరించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కానీ కొందరు ప్రసవానికి దగ్గర పడుతుండడం, కొందరికి కరోనా సోకడం వల్ల ఏమి చేయాలనేదానిపై ఎన్నో సందేహాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ రాధిక పలు సూచనలు చేస్తున్నారు. అధైర్య పడొద్దు.. కరోనా రాకుండా ముందస్తుగానే గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కరోనా వచ్చిన అధైర్యపడకుండా, వైద్యుల సూచనల మేరకు తగిన మందులను వాడితే సరిపోతుంది. ప్రసవం సమయంలో కోవిడ్ పాజిటివ్ వస్తే, అలాంటి వారికి ప్రత్యేకంగా సాధారణ ప్రసవం గానీ, ఆపరేషన్ ద్వారా ప్రసవం చేస్తున్నారు. ప్రైవేటులో కరోనా సోకిన వారికి ప్రసవం చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తుండగా, జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్‌తో వచ్చిన వారిలో 14 మందికి అక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్టులు సిజేరియన్, సాధారణ ప్రసవాలను చేశారు. గర్భం దాల్చిన వారు కరోనా రాకుండా ఉండేందుకు బయటకు వెళ్లకుండా ఉంటూనే, ఇంట్లో కూడా మాస్క్‌ను తప్పనిసరిగా ధరించి, సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. ఇంట్లో ప్రత్యేక గదిలోనే ఉంటూ, నీరు ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాలు ఉంటే టెస్టు తప్పదు.. ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటివి వస్తే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే మందులను కూడా వాడాలి. కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకున్నప్పుడు, పాజిటివ్‌గా వస్తే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. గర్భం దాల్చిన తరువా త 4 నెలలకు గానీ కరోనా వ్యాక్సిన్‌ను వేసుకోవద్దు. గర్భం దాల్చినట్లుగా తెలిసిన వెంటనే వైద్యుల సమక్షంలో చెకప్ చేసుకుని 7 నెలల వరకు నెలకు ఒకసారి, 7–9 నెలల మధ్యలో 15 రోజులకు ఒకసారి, 9 నెలలు పడ్డాక వారానికి ఒకసారి వైద్యులను సప్రదించాలి. ప్రస్తుత సమయంలో కోవిడ్ ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుని ఆసుపత్రికి వెళ్లాలి. గర్భి ణులకు వైద్య పరీక్షలను చేయించడంలో ఆశ కార్యకర్తలదే కీలకపాత్ర. కరోనా వచ్చిన వారికి ప్రసవం చేసినా అందులోని బిడ్డకు కరోనా వచ్చేందుకు అవకాశం లేదు. గర్భిణులకు పాజిటివ్‌గా వస్తే మాత్రం వారిలో ఉన్న జ్వర తీవ్రతను బట్టి మందులు, యాంటీబాడీస్ ట్యాబ్లెట్లను వాడాలి. నాలుగు రోజు ల తరువాత కూడా జ్వరం ఉంటేనే కరోనా టెస్టుకు వెళ్లాలి. కరోనా వచ్చినా, రాకపోయినా, ధైర్యంగా ఉంటూ, పూర్తి పౌష్టికాహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణుల్లో మాత్రం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారిని తొమ్మిది నెలల పాటు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కోవిడ్ సోకిన వారు సైతం ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, సరిపడా నీరు తాగాలి. – డాక్టర్ రాధిక, గైనకాలజిస్టు, జిల్లా ఆసుపత్రి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.. గర్భం దాల్చిన నాటి నుంచే వారికి పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, వారికి 7 నెలలు నిండే వరకు స్థానిక పీహెచ్సీలో వైద్య పరీక్షలను నెలలో ఒకసారి చేయిస్తున్నాం. 7 నెలలు నిండగానే వారికి జిల్లా ఆసుపత్రిలో నెలలో ఒకసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. గర్భిణులను ప్రతి నెలా ఆసుపత్రులకు తీసుకెళ్లి, తీసుకురావడం ఇబ్బందిగా ఉన్నా, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాం. – కృష్ణవేణి, ఆశ కార్యకర్త, లక్సెట్టిపేట్ మండలం చదవండి: ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే! -
ఎకరా పొలం ఉన్నా బతికేటోళ్లం!
సాక్షి, మంచిర్యాల: ‘నాకు తెలివి ఉంది. కానీ పైస లేదు. అందరికీ ఈనెల 25వ తారీఖున వాయిదా పెట్టాను. వాళ్లు అడిగితే ఏమి చెప్పాలి. ఈ మధ్య తరగతి వానికి ఇజ్జత్ ఎక్కువ. ఇజ్జత్పోతే బతకలేం. ఒక ఎకరం పొలం ఉన్నా అమ్ముకుని బతికేటోళ్లం. ఉన్నవాళ్లు బతికారు. నా ఆస్తి అమ్మితే రూ.10 లక్షలు వస్తయి. అంతకంటే రూ.7 నుంచి 8 లక్షల వరకు ఎక్కువ అప్పు ఉంటాను. ఈ రూ.7 నుంచి 8 లక్షల అప్పులకే మా నాలుగు ప్రాణాలు పోతున్నయి. ఈ సంవత్సరం 30 ఎకరాల పత్తి వేసిన. వంద క్వింటాళ్లు వచ్చింది. కైకిళ్లకు రూ.20 వేలు పోను రూ.3 లక్షలు వచ్చింది. ఆ రూ.3 లక్షలు ఒకరికి ఇచ్చిన. నేను పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం లాసు వచ్చింది. అందులో బిడ్డ పెళ్లి చేశాను. ఏం చేయాలి చెప్పండి. మా ఆత్మహత్యలకు ఎవరూ కారణం కాదు. కౌలు రైతు పరిస్థితి ఇంతే. నువ్వు లేకపోతే ఉండలేమని భార్యా, పిల్లలు అన్నారు. నా పిల్లలు ఉన్నా.. అప్పులోళ్లు వాళ్లను అడుగుతారు. అందుకే ఈ నిర్ణయం. నన్ను తిట్టుకోకండి అన్నా, వదిన, సందీప్, మహేందర్’ ఇదీ అప్పుల బాధతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లికి చెందిన ఓ కౌలు రైతు ఆవేదన.. అప్పులోళ్లు వస్తే పరువు పోతుందనే.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లికి చెందిన కౌలు రైతు జంజిరాల రమేశ్ (45), భార్య పద్మ (40), కూతురు సౌమ్య (19), కుమారుడు అక్షయ్ (16) బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లీ, కూతుళ్లు ఒక గదిలో.. తండ్రీ, కొడుకులు మరో గదిలో ప్రాణాలు తీసుకున్నారు. గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ కన్పించట్లేదని మృతుడి అన్న వెళ్లి చూడగా.. నలుగురూ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించారు. కొన్నేళ్లుగా రమేశ్ అదే గ్రామానికి చెందినవారి దగ్గర భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా సాగులో నష్టాలు వస్తున్నాయి. గతేడాది కూతురు పెళ్లి కోసం అప్పు చేశాడు. అందులో ఇటీవల కొంత బాకీ తీర్చాడు. మిగిలిన వారు అప్పు కట్టాలని ఒత్తిడి చేస్తుండటంతో గురువారం తీరుస్తానని వాయిదా పెట్టాడు. చేతిలో పైసలు లేకపోవడం.. అప్పులవాళ్లు ఇంటికొస్తే ఏమి చేయాలో తోచక ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు సౌమ్యను మూడు రోజుల కిందటే అత్తవారింటి నుంచి తీసుకొచ్చారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను చూసి బంధువులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్‌రెడ్డి, ఏసీపీ రెహ్మాన్ పరిశీలించారు. -
శివరాత్రి రోజున శ్వేత నాగు దర్శనం; జన్మ ధన్యం!
సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని లక్సీట్టిపెట్ మునిసిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో మహా శివరాత్రి పర్వదినాన పసుపునుటి సంతోష్ ఇనే వ్యక్తి ఇంటి పరిధిలో అరుదైన పెద్ద శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. కాలనీ వాసులు పెద్దఎత్తున శ్వేత నాగు పాముకు పూజలు చేసి పాలు పోశారు. మహాశివరాత్రి రోజు ఈ శ్వేత దర్శనం ఇవ్వడంతో జన్మ ధన్యమైందని భక్తులు అన్నారు. ఈ శ్వేత నాగును దర్శించుకునేందుకు కాలనీ వాసులు తరలివచ్చారు. స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో.. శ్వేతనాగును పట్టుకుని అడవిలో వదిలేశారు. చదవండి: కడతేరిన ‘ఫేస్బుక్’ ప్రేమ రిటైర్డు డీజీపీ మెయిల్ నుంచి మెసేజ్ రావడంతో.. -
శివరాత్రి రోజున అరుదైన శ్వేత నాగు దర్శనం
-
ఒకరిది ఆకలి వేట..మరొకరిది బతుకు బాట!
జన్నారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు జీవులదీ ఒకటే లక్ష్యం. ఓ జీవిది బతుకుబాట అయితే.. మరో జీవిది ఆకలివేట. జన్నారం అటవీ డివిజన్లో కనిపించిన ఈ దృశ్యాన్ని ఎఫ్‌డీవో తన కెమెరాలో బంధించారు. దుప్పిని వేటాడేందుకు అడవికుక్క కాచుకుని ఉండగా.. కుక్క నుంచి తప్పించుకు పరుగుతీసేందుకు దుప్పి సిద్ధంగా ఉంది. కాగా, ఒకప్పుడు అటవీలో పచ్చదనంగా ఉంటూ అనేక జంతువులు ఉండేవి. అదే ఇప్పుడు పచ్చదన కరువైంది. దాంతో శాఖాహర జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక వాటిపైనే ఆధారపడే మాంసాహర జంతువులు కూడా ఈమధ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రమాదాల బారిన పడుతొన్నాయి. ఇక, వేసవీ సమీపిస్తొన్న కొలది నీటిజాడ కరువైంది. అందుకే జంతువులన్ని ఆహరం కోసం, నీటి అన్వేషనలో ఒక చోటు నుంచి మరొ చోటుకు వలన పోతున్నాయి. కరీనంనగర్, జన్నారం, అడవీ, జంతువులు, వలసలు చదవండి: అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. -
ఇన్‌స్టా పరిచయం.. పోలీస్ స్టేషన్లో పంచాయితీ
మంచిర్యాలక్రైం: వారిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. యువతీ, యువకుడి పరిచయం కాస్త స్నేహంగా మారి.. చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరిన సంఘటన జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తల్లి రాధ తెలిపిన కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన ఓరుగంటి ఉదయ్‌కిరణ్ మంచిర్యాలలోని హైటెక్ సిటీలో గిటార్ నేర్పిస్తుంటాడు. అతడికి ఇన్స్ట్ర్రాగ్రామ్లో ఓ యువతితో పరిచయం అయింది. వాళ్లిద్దరు కొంత కాలంగా వాట్సాప్ మెస్సేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకోవడంతో పాటు ఫోన్‌కాల్స్ మాట్లాడుకున్నారు. గత నెల 17న సదరు యువతి ఇంటికి రమ్మని తన కొడుకుని ఆహ్వానించిందని ఉదయ్‌కిరణ్ తల్లి రాధ ఆరోపిస్తోంది. ఇంటికి వెళ్లిన ఉదయ్‌కిరణ్‌తో యువతి సెల్ఫీలు కూడా దిగిందని అనంతరం తన మేనమామలు, తమ్ముడు, అమ్మతో కలిసి ఉదయ్‌కిరణ్‌ను బంధించి పెళ్లి చేసుకోవాలని బెదిరించడమే కాకుండా దాడి చేయించిందని ఆరోపించింది. అనంతరం ఉదయ్‌కిరణ్‌ను పోలీసులకు అప్పగించారని, పోలీసులకు తాను ఫిర్యాదు చేస్తే తిరస్కరిస్తున్నట్లు రాధ పేర్కొంది. ఈ విషయమై సీఐ ముత్తి లింగయ్యను వివరణ కోరగా ఉదయ్‌కిరణ్ తల్లి రాధ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సదరు యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్‌కిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చదవండి: కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా? -
3న క్షౌరశాలలు మూసివేత
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాలలో కార్పొరేట్ బ్యూటీ సెలూన్ ఏర్పాటును నిరసిస్తూ క్షౌరవృత్తిదారులు చేపట్టిన నిరసనలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రకటించింది. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటుకానున్న కార్పొరేట్ బ్యూటీ సెలూన్‌ను వ్యతిరేకిస్తూ జనవరి 21 నుంచి క్షౌరవృత్తిదారులు దుకాణాలు మూసివేసి రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం శోచనీయమని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ అన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమైందని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలలు మూసివేసి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులు తమ పొట్టగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ క్షౌరవృత్తిదారులు నిద్రాహారాలు మాని పది రోజులుగా నిరసనలు చేస్తున్నా పాలక యంత్రాంగం నుంచి కనీస స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఫిబ్రవరి 3న జరగనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్షౌరవృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు. -
సింగరేణికి సోలార్ సొబగులు
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న సింగరేణికి చెందిన భూములిప్పుడు సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా మూసేసిన భూగర్భ గనులు, ఓపెన్ కాస్టులు, నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఆ సంస్థ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో 1,500 ఎకరాల భూమి వినియోగంలోకి రానుంది. విద్యుత్ అవసరాల కోసం సంస్థ ఏటా రూ.486 కోట్లు ఖర్చు చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ వినియోగంలోకి వస్తే ఏటా రూ.300 కోట్ల భారం తగ్గనుంది. 25 ఏళ్ల జీవిత కాలంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్లకు మొత్తం రూ.1,399 కోట్ల పెట్టుబడి అవుతోంది. అయితే.. ఏటా రూ.300 కోట్ల ఆర్జనతో మొదటి ఐదేళ్లలోనే ఈ పెట్టుబడి తిరిగి రానుంది. మొదటి దశ బీహెచ్ఈఎల్ నిర్మాణ పనులు చేస్తుండగా.. మిగతా రెండు దశల ప్లాంట్ల నిర్మాణం అదాని సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. వచ్చే 25 ఏళ్లు ఈ సంస్థలే ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. సింగరేణి సౌర్యం సౌర విద్యుత్ ఉత్పాదనలో కొత్తపుంతలు తొక్కుతున్న ‘సింగరేణి’.. వచ్చే రెండేళ్లలో మూడు దశల్లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా పనులు ముమ్మరం చేసింది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనుల్లో ఈ ఏడాది కరోనాతో జాప్యం జరగగా.. మళ్లీ పనులు పుంజుకున్నాయి. మొదటి దశలో మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లోని 50 ఎకరాల్లో 10 మెగావాట్లు, మణుగూరులో 150 ఎకరాల్లో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో చాలాచోట్ల పనులు పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా.. రెండు, మూడో దశ పనులు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలో జేకే–5 ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో 230 ఎకరాల్లో 39 మెగావాట్లకు గాను 15 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మరో 24 మెగావాట్లు ఈ నెలాఖరులో పూర్తి కానుంది. ప్రాజెక్టులపై 500 మెగావాట్లు ఈ మూడు దశలు విజయవంతమైతే సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్ సోలార్) ఫలకాలతో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ ప్రణాళిక రూపొందించింది. గోదావరి, అనుబంధ నదులపై భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఆలోచనలున్నాయి. ప్రయోగాత్మకంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లో మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లపై 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పనులు మొదలయ్యాయి. వీటితో పాటు ఓసీపీల్లో నీటి ఉపరితలాల పైనా తేలియాడే సౌర ఫలకాలు బిగించి సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. -
పులి చంపేసింది!
సాక్షి, మంచిర్యాల/పెంచికల్పేట్/బెజ్జూర్: రాష్ట్రంలోని అటవీ గ్రామాల్లో పులుల అలజడి కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందటే పెద్ద పులి దాడిలో ఒకరు మరణించిన ఘటన మరువక ముందే మరో గిరిజన యువతిని పులి బలి తీసుకుంది. కుమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి శివారులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండపెల్లికి చెందిన పసుల నిర్మల (18) తల్లి లస్మక్క మరికొందరు కూలీలతో కలసి అన్నం సత్తయ్య చేనులో పత్తి తీసేందుకు వెళ్లింది. కూలీలంతా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తినేందుకు వెళ్తుండగా నిర్మలపై వెనక నుంచి ఒక్కసారిగా పులి దాడి చేసింది. మొదట నడుముపై పంజాతో తీవ్రంగా గాయపర్చింది. ఆ తర్వాత గొంతుపై కరచుకుని లాక్కెళ్లింది. అక్కడే ఉన్న అన్నం చక్రవర్తి అనే యువకుడు కర్రతో పులిని బెదిరించగా మరోసారి దాడి చేసేందుకు యత్నించి పారిపోయింది. చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా అటవీ అధికారి శాంతారామ్, ఎఫ్‌డీవో వినయ్‌కుమార్, రేంజ్ అధికారులు ఘటనాస్థలాన్ని చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దాడి చేసిన పులి గురించి వివరాలు సేకరించారు. జెడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ ఐదు టీంలతో రెండు చోట్ల బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధిస్తామన్నారు. సమీప అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. వణుకుతున్న అటవీ గ్రామాలు.. ఈనెల 11న దహెగాం మండలం దిగిడలో విఘ్నేశ్ అనే యువకుడిపై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.. ఇది జరిగిన 18 రోజుల్లోనే జిల్లాలో మరొకరు పులికి బలి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడ్రోజుల క్రితం పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ శివారులో పెద్దవాగులో పులి సంచరిస్తుండగా యువకులకు కనిపించింది. అంతకు ముందు బెజ్జూరు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి అటవీ ప్రాం తాల్లోనూ ఓ పులి కొందరి కంటపడింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు ఎలా వెళ్లాలని స్థానికులు వణికిపోతున్నారు. దహెగాం అడవుల్లో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కడం లేదు. కాగజ్‌నగర్ డివిజన్లో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆరు పులుల వరకు సంచరిస్తున్నాయి. తడోబా అందేరి టైగర్ రిజర్వులో పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసిన ఘటనలు అనేకం.. ఈ క్రమంలో అటువంటి ఘటనలే ఇక్కడా పునరావృతం అవుతుండటంతో అక్కడి జనం భయాందోళన చెందుతున్నారు. అంబులెన్స్‌కు అడ్డుగా.. ఇటు నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా బెజ్జూర్–పెంచికల్పేట్ సరిహద్దులోని గొల్లదేవర వద్ద దాదాపు 9 నిమిషాల పాటు పులి అంబులెన్స్‌కు అడ్డొచ్చినట్టు అంబులెన్స్ డ్రైవర్ గణేశ్ ‘సాక్షి’కి తెలిపారు. దీంతో వాహన లైట్లు బంద్ చేసి అక్కడే వేచిచూశానన్నారు. బెజ్జూర్–సులుగుపల్లి, చిన్నసిద్దాపూర్, పెద్ద సిద్దాపూర్ గ్రామాల వైపు అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు వెల్లడించాడు. దాడిచేసింది కొత్త పులే.. దిగిడలో దాడి చేసిన పులి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజా ఘటనలో దాడి చేసింది మరో పులిగా గుర్తించాం. దీనిని మ్యాన్ఈటర్ అనలేం.. పత్తి చేన్లు అటవీప్రాంతంలో పులి ఆవాసం వరకు విస్తరించాయి. దీంతో పులి ఆవాసానికి ప్రతికూలంగా మారాయి. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తాం.. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నాం. – శాంతారామ్, జిల్లా అటవీ అధికారి ‘అవ్వా సచ్చిన్నే’ అనే అరుపు విని.. అందరం మధ్యాహ్నం పని ముగించుకుని పత్తి చేనులో అన్నం తినేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా ‘అవ్వా సచ్చిన్నే’ అంటూ అరుపు వినబడింది. ఉలిక్కిపడి చూడడంతో పులి యువతిని నోట కరుచుకొనిపోతోంది. వెంటనే ఓ కర్ర తీసుకుని పులిపైకి విసిరాను. అక్కడున్నవాళ్లమంతా అరవడంతో దూరంగా వెళ్లింది. వెళ్లి చూసేసరికి అప్పటికే యువతి మృతి చెందింది. నేను, రాజన్ కలిసి ఆమెను తీసుకొస్తుండగా మాపైకి కూడా గాండ్రిస్తూ మీదకు ఉరకబోయింది. అందరం గట్టిగా అరవడంతో అడవిలోకి పారిపోయింది. –అన్నం చక్రవర్తి, ప్రత్యక్ష సాక్షి -
జన్నారంలో కరోనా కలకలం..
సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని జన్నారం మండలంలో కరోనా భయపెడుతుంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన ముంబాయి వలస కార్మికుడితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించిన దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన నలుగురు వ్యక్తులను అధికారులు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఆ నలుగురితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ ముద్రలు వేశారు. జన్నారం మండలంలో ఇప్పటివరకు 11 కరోనా కేసులు నమోదు కాగా, శనివారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తపాలపూర్‌కు చెందిన నలుగురికి, రోటిగూడకు చెందిన ఇద్దరికి, చింతలపల్లికి చెందిన ఒకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో జన్నారంలో కేసుల సంఖ్య 17కు చేరింది. జిల్లాలో కరోనా బారిపడిన వారి సంఖ్య 37కు చేరింది.