MLA Durgam Chinnaiah Attack on Mandamarri Toll Plaza Staff - Sakshi
Sakshi News home page

వీడియో: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్‌చల్‌.. సిబ్బందిపై దాడి

Published Wed, Jan 4 2023 9:51 AM | Last Updated on Wed, Jan 4 2023 10:20 AM

MLA Durgam Chinnaiah Attack On Staff Of Mandamarri Toll Plaza - Sakshi

సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్‌చల్‌ చేశారు. తన వాహనానికి రూట్‌ క్లియర్‌ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. 

టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్‌ క్లియర్‌ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: అసైన్డ్‌ భూములపై కేసీఆర్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement