Bellampally
-
బెల్లంపల్లిలో ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత! బీజేపీకే ప్లస్సా?
లైంగిక వేధింపులు ఎమ్మెల్యే పరువుని నీళ్లలో ముంచాయి. భూముల కబ్జాలు అడ్డంతిరుగుతున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ఎసరు తెస్తున్నాయి. సోంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేకు ఏదురు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత మాజీ మంత్రి వినోద్‌కు అనుకూలంగా మారుతుందా? కాంగ్రెస్ విజయానికి దారులు ఏర్పాటు చేస్తుందా? కమలం పార్టీ సత్తచాటుతుందా? బెల్లంపల్లి ఎన్నికల పోరుపై సాక్షి స్పేషల్ రిపోర్ట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నియోజకవర్గంలో బెల్లంపల్లి మున్సిపాలీటీ నెన్నెల, బీమిని, కన్నేపల్లి, తాండూరు, వేమనపల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 112 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో 1,61,249 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో నేతకాని, మాల, మాదిగా, మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ కులాల ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని అచరించే ఓటర్లు, సింగరేణి ఓటర్లు ఉన్నారు. ఎస్సీలలో నేతకాని ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు : ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నా వారికి పట్టాలు ఇప్పించారు. అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యాలు మారుమూల ప్రాంతాలకు కల్పించారు. కానీ ఎమ్మెల్యేగా పెద్దగా అభివృద్ధి పనులు చేయలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, మెడికల్ కళశాల, మంచిర్యాల జిల్లా కేంద్రంగా బెల్లంపల్లిని ఏర్పాటు చేయాలని ప్రజలు ఉద్యమించారు. కానీ వీటిని సాధించడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎమ్మెల్యే వివాదాల పుట్ట అకారణంగా టోల్ ప్లాజా సిబ్బందిపై, అరిజిన్ పాల కంపేని ప్రతినిధిపై లైంగిక వేధింపులు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు అందోళన కోనసాగిస్తోంది. అదేవిధంగా సర్కార్ భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వేంచర్లకు డిఎంఎఫ్ నిదులు కేటాయించడం ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాయని ప్రచారం ఉంది. వీటితో ప్రజల్లో ఎమ్మెల్యే పరువుపోయిందట. పార్టీ నిర్వహించిన సర్వేలలో ఎమ్మెల్యేపై తీవ్రమైన వ్యతిరేకత బయట పడుతుందట. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గంకు టిక్కెట్ ఇస్తే మునగడం ఖాయమని తెలిందట. సిట్టింకిలకే టికెట్ అని చెప్పిన అధిష్టానం దుర్గంకే ఈసారి టికెట్ కట్టబెట్టింది. ఎమ్మెల్యేపై వ్యతికత కాంగ్రెస్‌కు బలంగా మారనుందా? ఎమ్మెల్యేపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు బలంగా మారినట్టు కనిపిస్తోంది. ఈసారి ఎలాగైన గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్దమవుతున్న మాజీ మంత్రి వినోద్.. ఎమ్మెల్యే చిన్నయ్య, అవినీతి, లైంగిక వేధింపులు ప్రజల్లో తీసుకవెళ్లుతున్నారు. తనకు ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారట. ఎమ్మెల్యే వ్యతిరేకతపై ప్రజల్లో అనూహ్యమైన స్పందన లభిస్తోందట. స్పందన చూసి వినోద్ విజయం ఖాయమని భావిస్తున్నారట. కానీ కాంగ్రెస్‌లో విభేదాలు వినోద్‌కు తలనోప్పిగా మారయట. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తనవర్గానికి టిక్కెట్ దక్కేలా ఎత్తుగడలు వేస్తున్నారట. ఆ టిక్కెట్ విభేదాలు కాంగ్రెస్‌లో దాడులు చేసుకునే స్థాయికి చేరాయట. కాంగ్రెస్ కంటే బీజేపీకే మరింత ప్లస్? ఈ విభేదాలు ఎన్నికలలో ప్రభావితం చూపుతాయని వినోద్ అందోళ చెందుతున్నారట. కానీ ఎమ్మెల్యే వ్యతిరేకత తనను గెలిపిస్తుందని భావిస్తున్నారట. బీజేపీ ఇంచార్జ్ ఏమాజీ కూడా సర్కారు వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకత కాంగ్రెస్ కంటే బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారట. కానీ అనుకున్నంత బీజేపీకి ఊపు రావడం లేదని అందోళన చెందుతున్నారట. మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకత, సర్కార్ వైపల్యాలు కలిస్తే చాలు కమలం వికసిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారట. మూడు పార్టీలు తామే విజయం సాధిస్తామని అంచనాలు వేసుకుంటున్నాయట. మరి ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు
సాక్షి, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను మరోసారి దుర్గం చిన్నయ్యకు కేటాయించడంపై శేజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామా పిశాచికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కామ పిశాచి, చీటర్‌కు లైసెన్స్ ఇచ్చి నీకు అడ్డులేదు రెచ్చిపో, ఇష్టమొచ్చిన అమ్మాయిని వేధించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు. కాగా బీఆర్ఎస్ పార్టీ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దుర్గం చిన్నయ్య పేరు ఉండడంపై బాధితురాలు శేజల్ తీవ్రంగా స్పందించారు. .తాను ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవలేదని వాపోయారు. దుర్గం చిన్నయ్య భవిష్యత్తులో మహిళలను వేధించకుండా ఉంటారని గ్యారంటీ ఎంటని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఎమ్మెల్యే అరాచకాలకు బలికావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు దోచుకోవాలని, అమ్మాయిలను వేధించాలని దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇచ్చారంటూ శేజల్ మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దుర్గం చిన్నయ్య చేసిన తప్పులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన లైంగిక వేధింపులు, అక్రమాలు, భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తానని.. దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు. చదవండి: సీఎం కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు: కూనంనేని -
మావోయిస్టు అగ్రనేత కటకం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ బెల్లంపల్లి/ చర్ల: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ (69) అలియాస్ ఆనంద్ కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన కొంతకాలం నుంచి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో దండకారణ్యం గెరిల్లా జోన్లో మే 31న మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. వందలాది మంది పార్టీ, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) కార్యకర్తలు, నాయకులు, కమాండర్ల సమక్షంలో విప్లవ సాంప్రదాయాలతో సుదర్శన్ అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. సుదర్శన్ భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు మావోయిస్టు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సుదర్శన్ మృతికి సంతాపంగా సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ర్యాడికల్ విద్యార్థి సంఘంతో మొదలై.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన పేద కార్మిక కుటుంబంలో పుట్టిన కటకం సుదర్శన్.. 1974లో మైనింగ్ డిప్లొమా చదువుతున్న సమయంలో విప్లవ పోరాటంలో అడుగుపెట్టారు. 1975లో ర్యాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. తర్వాత బెల్లంపల్లి పార్టీ సెల్ సభ్యుడిగా, సింగరేణి కార్మిక ఉద్యమం, ర్యాడికల్ విద్యార్థి యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నక్సల్బరీ, శ్రీకాకుళం సంఘర్షణ విముక్తి, పోరాటాల ప్రేరణతో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. 1978లో లక్సెట్టిపేట, జన్నారం ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని విప్లవోద్యమంలో సమీకరించారు. 1980లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా దండకారణ్య ప్రాంతంలోకి విప్లవోద్యమాన్ని విస్తరించడంలో కీలకంగా పనిచేశారు. 1987లో దండకారణ్య కమిటీ సభ్యుడిగా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇంద్రవెల్లి ఆదివాసీ రైతాంగ ఉద్యమానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్) 9వ కాంగ్రెస్‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఐదు దశాబ్దాల ప్రస్థానం.. 2004లో పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో 2007లో మరోమారు కేంద్ర కమిటీకి ఎన్నికై పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేశారు. మొత్తంగా 2001 నుంచి 2017 వరకు సెంట్రల్ రీజనల్ బ్యూరో (సీఆర్బీ) కార్యదర్శిగా కొనసాగిన ఆయన.. తర్వాత అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతల నుంచి వైదొలగి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విప్లవోద్యమ ప్రస్థానంలో సుదర్శన్ కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రచురితమైన పలు విప్లవ పత్రికలకు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. జీవిత భాగస్వామి ఎన్కౌంటర్లో మృతి విప్లవోద్యమంలో చేరిన తర్వాత సుదర్శన్ సహచర విప్లవకారిణి కోలం లలితాబాయి అలియాస్ లలితక్కను విప్లవ సిద్ధాంతం ప్రకారం వివాహం చేసుకున్నారు. లలితక్క పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2003లో కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో ఆమె మృతి చెందారు. తర్వాత సుదర్శన్ మరో సహచర విప్లవకారిణి పద్మను ద్వితీయ వివాహం చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది. ప్రభుత్వాల ఫాసిస్టు విధానాల వల్లే సుదర్శన్ మరణం: మావోయిస్టులు విప్లవోద్యమ నాయకులకు, కార్యకర్తలకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే సుదర్శన్ మరణించారని మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. తీవ్ర అనారోగ్యంతో వైద్యం కోసం మావోయిస్టు, పీఎల్ఏ కార్యకర్తలు, నాయకులు పట్టణాలకు వెళ్తే.. పట్టుకుని హత్యలు చేయడం, లొంగిపోతేనే మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కొత్త ప్లాన్.. వారికి ఎక్కువ సీట్ల కేటాయింపు! -
ఆదిలాబాద్: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
-
ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
-
ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెలంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను నమ్మించి మోసం చేశారని సంచలన ఆరోపణలు చేసిన యువతి మరొక వీడియోను విడుదల చేశారు. రకరకాలుగా తమను వేధించారని ఆమె అందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మోసాలను బట్ట బయలు చేస్తామన్నారు ఎమ్మెల్యేను తాము బ్లాక్ మెయిల్ చేస్తున్నాననేది అబద్దమన్నారు. ఎమ్మెల్యే తప్పుడు కేసులతో తనను అరెస్టు చేయించారన్నారు.. కానీ పోలీసులు తాము పట్టుకున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసుల సంగతి తేల్చాలంటే ఎమ్మెల్యే ఇంటి సీసీ పుటేజీ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.. తనకు ప్రాణహని ఉందన్నారు. తమకు రక్షణ. కల్పించాలని పోలీసులను కోరారు. ఇందులో అనేకమంది ఉన్నారని వారిపై సమగ్రమైన విచారణ. జరిపించాలని కోరారు. సాయం చేస్తా.. సరదా తీర్చండి! -
సాయం చేస్తా... సరదా తీర్చండి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు డెయిరీ విస్తరణకు సాయం చేస్తానంటూ యాజమాన్యాన్ని వేధించారని, ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలంటూ ఇబ్బందిపెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఆయన బంధువుకు కొంత వాటా ఇచ్చామని.. ఆయన కోరినట్టు కాకున్నా బ్రోకర్ ద్వారా వేరే యువతిని పంపామని డెయిరీ భాగస్వామి పేరిట ఓ ఆడియో విడుదలైంది. డబ్బులతో పాటు అన్ని రకాలుగా తమను వాడుకుని కూడా.. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడుతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా విడుదల చేశారు. అసైన్డ్ భూమి.. ఐదు శాతం వాటా! ఆర్జిన్ డెయిరీ సంస్థ మంచిర్యాల జిల్లాలో తమ బ్రాంచ్ ఏర్పాటు కోసం కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. అది తెలిసిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనే ఆ డెయిరీ ఏర్పాటు చేయాలని, అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కంపెనీ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండెకరాల అసైన్డ్ భూమిని అప్పగించారు. అది లావణి పట్టా భూమి అయినా విక్రయించినట్టుగా పేర్కొని బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ స్థలంలో డెయిరీ ప్లాంటు, పాల నిల్వ కోసం శీతల గిడ్డంగి, ప్యాకింగ్ కేంద్రం నిర్మించాలని ప్రణాళిక వేశారు. నిర్మాణం మొదలయ్యే ముందే ఆ ప్రజాప్రతినిధి తన సమీప బంధువు పేరుతో ఐదు శాతం వాటా సైతం తీసుకున్నారని.. తర్వాత డబ్బులు, ఇతర ‘సాయం’ కూడా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో గొడవ తలెత్తినట్టు తెలిసింది. గత జనవరిలో ఏకకాలంలో పదిచోట్ల ఈ డెయిరీ నిర్వాహకులపై మోసం కేసులు నమోదయ్యాయి. పోలీసులు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను పిలిపించి విచారించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కంపెనీలో భాగస్వామి అయిన షెజల్ అనే యువతి పేరిట ఆడియో, వీడియో, పలు వాట్సాప్ స్క్రీన్షాట్లు విడుదల అయ్యాయి. ‘ట్యాబ్లెట్లు’ అంటూ అమ్మాయి కోసం చాటింగ్! డెయిరీ పనుల నిమిత్తం పలుమార్లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిశామని, ఆయన కోరిన పనులు చేసిపెట్టామని సంస్థలో భాగస్వామి అయిన యువతి ఆడియోలో ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినప్పుడు నా వెంట సంస్థలో పనిచేసే ఓ అమ్మాయి వచ్చేది. ఆమెపై ఎమ్మెల్యే కన్నేశాడు. ఓ రోజు ఫోన్ చేసి.. ఆ అమ్మాయిని రాత్రికి తన వద్దకు పంపించాలన్నారు. ఆమె అలాంటిది కాదని చెప్పినా వినలేదు. అమ్మాయిని పంపకుంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరించాడు. చివరికి ఎవరి ద్వారానో ఓ బ్రోకర్‌ను సంప్రదించి ఎమ్మెల్యే వద్దకు వేరే ఓ యువతిని పంపాల్సి వచ్చింది. నేరుగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే ఆ యువతిని పిలిపించుకున్నారు. తర్వాత దళిత బంధు పథకం కోసం మాట్లాడుదామని మమ్మల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, మంచిర్యాలకు పిలిపించుకున్నాడు. అన్నింటిలో ఇన్వాల్వ్ చేయవద్దని, చెప్పినవన్నీ చేయలేమని మేం అనడంతో.. మాపై తప్పులు కేసులు పెట్టించారు. మేం తప్పు చేయలేదని చెప్పినా పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లి ఇబ్బందిపెట్టారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో మాకు అండగా నిలవాలి..’’ అని పేర్కొన్నారు. తర్వాత షెజల్ పేరిట మరో వీడియో విడుదలైంది. ‘‘ఎమ్మెల్యే మనుషులు మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే, పోలీసులదే..’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. – ఇక యువతిని పంపే అంశంలో ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుడి మధ్య జరిగినవిగా చెప్తున్న వాట్సాప్ చాటింగ్‌లలో.. ‘ట్యాబ్లెట్లు కావాలి. రిలాక్సేషన్ పొందాలి. ఆ అమ్మాయి వస్తుందా?’ అంటూ సాగిన సంభాషణలు, హైదరాబాద్‌లో చేసిన ‘ఎంజాయ్’పైనా మెస్సేజ్‌లు ఉండటం గమనార్హం. దళితబంధులో కోట్లు కొట్టేసేలా? దళితబంధులో 200 పాడి యూనిట్లు ఇప్పిస్తే రూ.2 కోట్లు ఇస్తామని మంచిర్యాల జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తన నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఆఫర్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరో నియోజకవర్గంలోని ఓ యువ నాయకుడితో కూడా యూనిట్లు ఇప్పించేలా చర్చలు జరిగినట్టు తెలిసింది. మరో ప్రజాప్రతినిధి గేదెలకు బదులు ట్రాక్టర్లు ఇవ్వాలని కోరగా.. ఆ మేరకు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి రెండో విడత యూనిట్లు మంజూరు కాక ప్రణాళిక ముందుకు కదల్లేదని తెలిసింది. సదరు మార్కెట్ చైర్మన్ మాత్రం డబ్బులు తీసుకుని గేదెలు ఇవ్వలేదని, ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్‌కావడంతో వివాదం మరింత ముదిరిందని సమాచారం. ఈ వ్యవహారంలోనే డెయిరీ వారిని కూడా ఇన్వాల్వ్ చేసేందుకు ప్రజాప్రతినిధి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తోపాటు వరంగల్ ప్రాంతంలో ఈ డెయిరీ నిర్వాహకులపై పలు కేసులు ఉన్నాయని.. రైతులకు పశువుల బీమా కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన వివాదాలు, ఇతర కేసులు నమోదయ్యాయని సమాచారం. వ్యవహారంపై సీఎంవో నజర్? మంచిర్యాల జిల్లాలో ప్రలోభాల వ్యవహారంపై ఈ నెల 26న ‘సాక్షి’లో ‘పాల కోసం ప్రలోభాలు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిఘా వర్గాలు పలు వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఇందులో అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయి ఆరోపణలు రావడంతో సీఎం ఆఫీసు కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. నాపై దుష్పప్రచారం చేస్తున్నారు నాపై కావాలనే ప్రైవేటు డైయిరీ నిర్వాహకులు దుష్పప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మోసాలపై కేసులు నమోదు చేస్తే.. కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. డెయిరీ సంస్థ రైతులను మోసం చేసింది. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెడతాను. – దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే -
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు
-
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు
సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై మహిళా తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియోలో.. ‘దుర్గం చిన్నయ్య అనే వ్యక్తిని తొలిసారి మా బ్రాంచ్ ఓపెనింగ్ రోజు కలిశాము. మీ కంపెనీలో మాకు తెలిసన వాళ్లకు షేర్స్ ఇవ్వండి.. మీకు ఫుల్ సపోర్ఠ్ చేస్తాను, మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అని చెప్పారు. మేము దానికి ఓకే చెప్పాము. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచూ బిజినెస్ పనుల కోసం మాట్లాడేవాళ్లం. కొన్నిసార్లు మాతో పాటు మా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి కూడా వచ్చేది. ఒకరోజు ఎమ్మెల్యే కాల్ చేసి మీతోపాటు ఒక అమ్మాయి వచ్చింది కదా.. ఆమెను ఒకరోజుకు నాతో పంపిస్తారా అని అడిగారు. ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాం. కానీ ఎవరో ఒక అమ్మాయిని తప్పకుండా తన దగ్గరికి పంపాలని ఎమ్మెల్యే అడిగారు. లేకపోతే మీ ఇష్టం అంటూ బెదిరించారు. దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ద్వారా బ్రోకర్ల నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్‌గా ఆయనకు అప్పజెప్పాం. వాళ్లతో ఆయన టచ్‌లో ఉన్నారు. తరువాత దళితబంధు సమావేశమని మళ్లీ ఒకసారి మమ్మల్ని పిలిపించి మందు ఏర్పాటు చేశారు. నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. మా దగ్గర డబ్బులు తీసుకొని తన పర్సనల్ పనులకు వాడుకున్నాడు. చెప్పింది చేయకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. చాలా మోసం చేశాడు. మళ్లీ దళిత బంధు గురించే మట్లాడాలని ఒత్తిడి చేసి బెల్లంపల్లిలోని ఆయన ఇంటికి పిలిపించాడు. తరువాత ఆయన అక్కడున్న పోలీసులకు మమ్మల్ని అప్పగించి 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. మేం ఏం తప్పులు చేయకున్నా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్ చేశారు. మాకు సంబంధం లేదు అని చెబితే కూడా మీరు ఏమున్నా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదని నన్ను రిమాండ్‌కు పంపించారు. రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు. ఏ కేసులతో నాకు ఏలాంటి సంబంధం లేదు. తప్పుడు కేసులకు సంబంధించి మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. వీటిని చూపిస్తుంటే కూడా పోలీసులు.. మాకు ఇవ్వన్నీ సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు. దుర్గం చిన్నయ్య, వాళ్ల మనుషుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు మీడియా సపోర్ట్ కావాలి. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకు రావాలి’ అని శైలజ విజ్ఞప్తి చేశారు. -
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్
-
మంచిర్యాల: నా వాహనాన్నే ఆపుతారా? టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి!
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: అసైన్డ్ భూములపై కేసీఆర్ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు! -
పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
సాక్షి, బెల్లంపల్లి : మండలంలోని నాగారాం గ్రామంలో ఏలాది అనిల్(19) తండ్రి సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలాది వెంకటి– మల్లక్కల మూడో కుమారుడు అనిల్ గ్రామంలో కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆరు నెలలుగా ఇంటి పక్కనే ఉన్న హోంగార్డు మడె తిరుపతి ఇంట్లో నిద్రించేవాడు. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి హమాలీ పనులకు వెళ్తున్నాడు. రెండు రోజులుగా తనకు ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.10వేలు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. వరి పంట అమ్మినడబ్బులు రాగానే కొనిస్తానని తండ్రి నచ్చజెప్పాడు. అయిన సంతృప్తి చెందక మనస్థాపానికి గురై తాను నిద్రించే పక్కింట్లో తాడుతో మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి వెంకటి ఫిర్యాదు మేరకు ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. పలు అనుమానాలు... అనిల్ పక్కింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కింట్లో ఎవరు ఉండటం లేదు. మృతిడి చేతిలోని చిట్టీపై ఇద్దరి యువకుల పేర్లు రాసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. యువకుడు వేరే కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సింగరేణియులదే చైర్మన్ పీఠం..
సాక్షి, బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిసారి కార్మిక కుటుంబాల నుంచే చైర్మన్ (చైర్ పర్సన్)గా ఎన్నికవుతున్నారు. రాజకీయ నేపథ్యం అంతగా లేకపోయిన మున్సిపల్ ప్రథమ పౌరులుగా ప్రా తి నిధ్యం వహిస్తున్నారు. ఇతర వర్గాల కుటుంబాల నుంచి ఇంత వరకు ఓటర్లు మున్సిపల్ పీఠాన్నీ ఎక్కించిన దాఖలాలు లేకపోవడం బెల్లంపల్లి మున్సిపల్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, కార్మికుల భార్యలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అవుతున్నారు. కార్మిక కుటుంబాలను ఓటర్లు ఆదరిస్తున్నారు. అందలం ఎక్కిస్తున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ చరిత్రలో ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరుగగా ఏడుగురు అభ్యర్థులు చైర్మన్‌గా వ్యవహరించారు. వీరంతా కార్మిక కుటుంబాల నుంచి ఎన్నిక కావడం విశేషం. ప్రస్తుతం పుర ప్రజల దృష్టంతా చైర్మెన్ అభ్యర్థిపైనే కేంద్రీ కృతమై ఉంది. ఈదఫా ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్మెన్ సీటులో కూ ర్చోబెడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో ఓటరు మహాశయులు గత చరిత్రను పున:రావృతం చేస్తారా లేదా కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతారా అనేది తేలాల్సి ఉంది. కార్మిక కుటుంబాలకే ఆదరణ... బెల్లంపల్లి మున్సిపల్ చైర్మెన్‌గా కార్మిక కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఎన్నికవుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఆరు సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుగురు మున్సిపల్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి రాణించారు. ప్రప్రథమంగా 1987లో బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్న ఇరిగిరాల చంద్రశేఖర్ (టీడీపీ) పోటీ చేసి తొలి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 1992లో రెండోసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో ఫిట్టర్‌గా పని చేస్తున్న అమురాజుల రాజేశ్వరరావు (టీడీపీ) మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ క్రమంలోనే సింగరేణిలో సంక్షేమాధికారిగా పదోన్నతి రావడంతో రాజేశ్వరరావు చైర్మన్ పదవికి అర్థాంతరంగా రాజీనామా చేశారు. 1995లో మున్సిపాలిటీకి మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో షాట్‌ఫైరర్‌గా పనిచేస్తున్న జంగం కేశవులు (కాంగ్రెస్) ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్యంగా మున్సిపల్ చైర్మన్ అయ్యారు. నాల్గోసారి 2001లో నిర్వహించిన ఎన్నికల్లో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్న మత్తమారి సూరిబాబు భార్య మత్తమారి సరస్వతీ (కాంగ్రెస్) విజయబావుట ఎగురవేసి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో ఐదోసారి సింగరేణి కంపెనీలో ల్యాంప్‌రూమ్ క్లర్క్‌గా పనిచేస్తున్న మత్తమారి సూరిబాబు (కాంగ్రెస్) బరిలో దిగి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. సూరిబాబుకు ఆయన ప్రత్యర్థి పసుల సురేష్‌కు సమంగా చెరి 209 ఓట్లురాగా అదృష్టవశాత్తు టాస్‌తో గెలిచి చైర్మన్ అయి రికార్డు సృష్టించారు. ఆరోసారిగా 2014లో సింగరేణి కార్మిక కుటుంబం నుంచే మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించారు. సింగరేణి ఉద్యోగిగా పని చేస్తున్న పసుల మహేష్ తన భార్య పసుల సునీతారాణి (టీఆర్ఎస్)తో పోటీ చేయించి గెలిపించారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా సునీతారాణి నాలుగేళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మున్సిపల్ సభ్యులు అవిశ్వాసం ప్రవేశపెట్టి సునీతారాణిని ఆ పదవి నుంచి దింపేశారు. ఆమె స్థానంలో కార్మిక కుటుంబానికి చెందిన మునిమంద స్వరూప మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ఏడాది కాలం పాటు బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఎవరిని వరించనుందో చూడాలి. ఈసారి ఏమవుతుందో..? ఏడోసారిగా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. ఈ దఫా ఎన్నికల్లోనూ అనేక మంది కార్మిక కుటుంబాలకు చెందిన వ్యక్తులు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కంపెనీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల భార్యలు, కొడుకులు, కూతుళ్లు పోటీకి సై అంటున్నారు. కొందరు రిటైర్డు కార్మికులు కూడా ‘హమ్ కిసీసే కమ్ నహీ’ అంటున్నారు. ఈ క్రమంలో పుర ప్రజలు మరోమారు సింగరేణి కుటుంబాలను మున్సిపల్ చైర్మన్‌గా పీఠం ఎక్కిస్తారో లేదా వేరే వ్యక్తులను అందలం ఎక్కించి గత చరిత్రను చెరిపేస్తారో వేచి చూడాల్సిందే. -
విషం కలిసిన కూల్‌డ్రింక్ తాగిన చిన్నారులు
సాక్షి, బెల్లంపల్లి : పాతకక్షలు పగబట్టాయో..? మరేం జరిగిందో తెలియదుగానీ.. అభంశుభం తెలియని ఓ పసివాడి ప్రాణం మాత్రం గాలిలో కలిసిపోయింది. కూల్‌డ్రింక్ (మజా)లో విషం కలిపిన విషయం తెలియని ఆ ఇద్దరు చిన్నారులు ఆనందంగా తాగి అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే.. పసివాడి ప్రాణం పోయింది. మరొకరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. తాళ్లగురిజాల ఎస్సై కిరణ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కపల్లి పంచాయతీ లంబాడితండాకు చెందిన బానోత్ తిరుపతి, రజిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు ఐశ్వర్య (7) బెల్లంపల్లిలోని లోటస్ పాఠశాలలో ఒకటో తరగతి, కుమారుడు శివరాంనాయక్ (4) స్థానిక అంగన్వాడీకేంద్రంలో చదువుకుంటున్నాడు. సోమవారం సాయంత్రం తిరుపతి, రజిత పిల్లలతో కలిసి శివారులో ఉన్న పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఐశ్వర్య, శివరాం పొలం గట్లపై ఆడుకుంటున్న సమయంలో వారికి గట్టుపై మాజా కూల్‌డ్రింక్ బాటిల్ కన్పించింది. ఆ బాటిల్ తీసుకుని చిన్నారులిద్దరూ తాగారు. కొద్దిసేపటికి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. తాము తేని కూల్‌డ్రింక్ గట్టుపై ఎలా ఉందని అనుమానించిన ఆ దంపతులు బాటిల్‌తోపాటు పరిసరాలను పరిశీలించగా.. ఆ ప్రాంతంలో మద్యంసీసాలు కనిపించాయి. కూల్‌డ్రింక్ బాటిల్‌ను తీసుకుని పరిశీలించగా క్రిమి సంహారక మందు వాసన వచ్చింది. అందులో విషం కలిపినట్లు అనుమానించేలోపే.. ఆ చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని తిరుపతి బైక్‌పై బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు పంపించారు. కరీంనగర్‌కు తరలిస్తుండగా.. శివరాం పరిస్థితి విషమించి.. పెద్దపల్లి శివారులో చనిపోయాడు. ఐశ్యర్యను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం ఉదయం శివరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను కాపాడుకునేందుకు ఆమె వద్దే ఉన్న ఆ కన్నతల్లి.. తన కుమారుడు శివరాంనాయక్ను కడసారి చూసేందుకు వచ్చి గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. కొడుక్కు అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆ తల్లిదండ్రులు శోకాతప్త హృదయాలతో కూతురి వద్దకు పయనమయ్యారు. -
ఇరవై రెండేళ్లకు ఇంటికి...
బెల్లంపల్లి: మతిస్థిమితం సరిగా లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు సరిగ్గా 22 ఏళ్లకు ఇల్లు చేరిన ఘటన బెల్లంపల్లిలో వెలుగుచూసింది. బాధితుడి తల్లి రాజమ్మ కథనం ప్రకారం... పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కపురం గ్రామానికి చెందిన కట్రాజుల రాజమ్మ, లక్ష్మయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. వీరిలో నంబయ్య పెద్ద కొడుకు. లక్ష్మయ్య బెల్లంపల్లిలో సింగరేణి ఉద్యోగం చేసేవాడు, పట్టణంలోని మహ్మద్ ఖాశీం బస్తీలో నివాసం ఉండేవాడు. పెద్ద కొడుకైన నంబయ్యకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అంతలోనే నంబయ్య మతి స్థిమితం కోల్పోయాడు. ఆ క్రమంలోనే 1997లో బెల్లంపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్లిన నంబయ్య ఆకస్మికంగా ఓ గుర్తు తెలియని రైలును పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు నంబయ్య కర్ణాటక రాష్ట్రంలో మతిస్థిమితం లేకుండా సంచరించాడు. ఆ తర్వాత కేరళ రాష్ట్రానికి వెళ్లి పోయాడు. కేరళ వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలో తనకు తానుగా తెలుగు మాట్లాడుకుంటుండగా అక్కడ నివాసం ఉంటున్న తెలుగు వారు ఆదరించి నర్సయ్యను ఓ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్పించారు. మూడేళ్ల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన నంబయ్య మతిస్థిమితం నుంచి బయటపడ్డాడు. ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత ఆయనకు ఇంటి ధ్యాస పట్టింది. ఇళ్లు, తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో అక్కడి తెలుగువారు నెమ్మదిగా బెల్లంపల్లి ఇంటి అడ్రస్‌ను తెలుసుకుని నంబయ్యను శుక్రవారం క్షేమంగా ఇంటికి చేర్చారు. 22 ఏళ్ల క్రితం ఇంటిని వదిలివెళ్లిన కొడుకు ఇన్నాళ్లకు సురక్షితంగా ఇంటికి రావడంతో నంబయ్య తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకును ఆప్యాయంగా చేరదీసిన తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడో తిరిగి , ఆరోగ్యం కుదురుపడి, గతం గుర్తుకు వచ్చి ఇంటి దారి పట్టిన కొడుకును ఆమె అక్కున చేర్చుకుని ఆనందంతో పొంగి పోయింది. తల్లి ని కలుసుకున్న ఆనందంతో నంబయ్య తబ్బి ఉబ్బై పోయాడు. కాగా రెండు దశాబ్దాల అనంతరం ఇంటికి చేరిన నంబయ్యను చూడటానికి బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పరామర్శించారు. -
భూమి దక్కకపోతే చచ్చిపోవాలనుకున్న..!
సాక్షి,బెల్లంపల్లి: ‘‘మాకున్న గా ఏడెకరాల భూమిని నమ్ముకుని బతుకుతున్నం. గా భూమి దప్ప మాకింకేదిక్కులేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు సుత లేవ్. మా అయ్య కాపాడుకుంట అచ్చిన భూమి నాగ్గాక్కుండ పోయినంక ఇక బతుకుడెందుకు..? నా భూమి నాకు పట్టా కాకపోతే చచ్చిపోవాలని అనుకున్న..’’ ఇదీ నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు కొండపల్లి శంకరయ్య ఆవేదన. యాభై ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి మరో వ్యక్తి పేరిట పట్టా చేయడంతో శంకరయ్య పది నెలల నుంచి పడిన బాధ వర్ణణాతీతం. వివరాలిలా ఉన్నాయి.. కొండపల్లి మల్లయ్యకు కూతురు, కుమారుడు శంకరయ్య ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. శంకరయ్యకు కూడా పెళ్లి చేయడంతో ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం శంకరయ్య తండ్రి మల్ల య్య చనిపోయాడు. ఆయన మరణాంతరం నందులపల్లి గ్రామ శివారు సర్వేనంబర్ 271/ఏలో 7.01 ఎకరాల భూమి వారసత్వంగా శంకరయ్య పేరిట 20 ఏళ్ల క్రితం పట్టా అయింది. ఆ భూమిలో నుంచి రెండు ఎకరాల్లో పత్తి పంట, మిగతా 5 ఎకరాల్లో వరి సాగు చేసుకుంటూ శంకరయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం డబ్బులు తనకు కూడా వస్తాయని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ ఆ పథకం కింద నయాపైసా చేతికి అందలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అందరి మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకం కూడా రాలేదు. దీంతో ఆందోళనకు గురైన శంకరయ్య పలుమార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, గ్రామ వీఆర్వో కరుణాకర్‌ను కలిసి పాసుపుస్తకం ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. ఎప్పుడు కలిసి అడిగినా ధరణి వెబ్సైట్ పని చేయడం లేదని, ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని నిరక్షరాస్యుడైన శంకరయ్యకు ఇన్నాళ్లూ రెవెన్యూ ఉద్యోగులు నమ్మబలుకుతూ వచ్చారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ.. పట్టాదారు పాసు పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ శంకరయ్య ఎంతగా తిరిగాడో లెక్కలేదు. భూ ప్రక్షాళన కార్యక్రమం ఆరంభమైనప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వందకు పైబడి సార్లు చెప్పులరిగేలా తిరిగాడు. అంతకుమించి ఆర్ఐ, వీఆర్వో చుట్టూ రోజు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకున్నట్లుగానే తహసీల్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణ చేశాడు. ఏ ఒక్కనాడూ ఆ అధికారులు కరుణించిన పాపాన పోలేదు. కనీసం ఆన్లైన్లో పట్టాదారు పేరు మార్పిడి చేసి, శంకరయ్య పేరున పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసి, చేసిన తప్పును సరిదిద్దుకోలేకపోయారు. పైగా అమాయకుడైన శంకరయ్యను ఎప్పటికప్పుడు తిప్పించుకుని ఎంతో వేదన కలిగించారు. కాసులకు ఆశపడి ఏకంగా మరొకరి పేరుమీద భూమిపట్టా చేసి ఆ పేద కుటుంబానికి ప్రత్యక్ష నరకం చూపించారు. బాధపడని రోజు లేదు..! భూప్రక్షాళన కార్యక్రమం అయిపోయినప్పటి నుంచి పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు కోసం శంకరయ్య దిగులు ప్రారంభమైంది. భూమి తన వద్దే ఉన్నా.. ఆ భూమిని తానే సాగు చేసుకుంటున్నా ఎందువల్ల పట్టా పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు ఇవ్వడం లేదో రోజు ఇంట్లో భార్యాబిడ్డలతో కుమిలిపోయే వాడు. ఎప్పుడిస్తారో అని రోజు పడిగాపులు కాసేవాడు. ఆ దిగులుతో అన్నం ముద్ద నోట్లోకెళ్లేది కాదు. భార్య, కొడుకులు ఎంత ధైర్యం చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఆయనను చూసీ ఆ ఇల్లాలు, కొడుకులు కూడా సరిగా అన్నం తినని రోజులు కోకోల్లలు. ఆ తీరుగా భూమి పట్టా రాకుండా ఆ బాధిత కుటుంబం బాధ పడని రోజంటూ లేకుండా పోయింది. చివరికి శంకరయ్య పెద్ద కొడుకు శరత్ ఓ ఆలోచన చేసి ఫేస్బుక్లో ‘మన వ్యవసాయం–మన పంటలు’ గ్రూపులో తన తాత మల్లయ్య పేరిట పట్టాదారు పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు అందించని తీరును వీడియో లైవ్‌గా పోస్టు చేశాడు. ఆ పోస్టు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ కంట పడడం, ఆ సమస్య ఏంటో పరిశీలించాలని కలెక్టర్ భారతీ హోళీకేరీని ఆదేశించడంతో శంకరయ్య సమస్య వెలుగు చూసింది. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి నేరుగా శరత్‌తో మాట్లాడడం, ఆడియో వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ విచారణలో రెవెన్యూ అధికారులు లీలలు ఒక్కసారిగా బయట పడ్డాయి. చివరికి కలెక్టర్ విచారణ జరిపి బాధిత రైతు పేరిట పట్టాదారు పాసుపుస్తకం ఆన్లైన్లో మార్చారు. మొదటి విడత రైతుబంధు చెక్కు అందజేసి రెండో విడతకు సంబంధించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేయడంతో కథ సుఖాంతమైంది. -
కబ్జాకు గురవుతున్న చెరువు
కాసిపేట: ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి రైతులను, గ్రామాలను పచ్చగా ఉంచుతామని చేపట్టిన చెరువు మరమ్మతులు కాసిపేట మండలంలో మాత్రం రైతులకు శాపం గా మారాయి. మిషన్ కాకతీయ పేరుతో కంట్రాక్టర్ అవతారమెత్తి చెరువు మరమ్మతులు పనులు చేపట్టినా.. అధికార పార్టీ నాయకులు మత్తడిని పూర్తిగా తొలగించడంతో చెరువులో చుక్కనీరు లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించి గతంలో చెరువులో మా భూములను కోల్పోయామని కబ్జాలకు పాల్పడుతున్నారు. దీంతో చెరువు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మండలంలోని పల్లంగూడ గ్రామశివారు ఊరచెరువు అభివృద్ధి పనులకు 2016లో టెండర్లు పిలిచి రూ. 25లక్షలు నిధులు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న కంట్రాక్టర్‌ను బెదిరించి అధికార పార్టీ నాయకులు చెరువుల పనులు చేయడం సర్వసాధారణంగా మారింది. మిషన్‌కాకతీయతో చెరువులు వినియోగంలోకి రావడం మాట పక్కన పెడితే ఊరచెరువు విషయంలో మాత్రం నాయకుల తీరు రైతులకు శాపంగా మారుతోంది. దీంతో మూడేళ్లుగా పోలా లు బీడులుగానే ఉంటున్నాయి. టెండరు వచ్చిన కంట్రాక్టర్ నుంచి పనులు తీసుకున్న మండల నాయకులు మరమ్మతుల పేరుతో మొదట చెరు వు మత్తడిని పూర్తిగా తొలగించి, పనులు చేపట్టకపోవడంతో చెరువులో చుక్కనీరు లేకుండా పో యింది. దీంతో చెరువుపై సుదీర్ఘకాలంగా ఆధారపడి పోలాలు చేసుకుంటున్న రైతులు మూడేళ్లుగా భూములను బీడులుగా వదులుతున్నారు. ఈ వి షయమై రైతులు అధికార పార్టీ నాయకులు, ఎ మ్మెల్యే, అధికారులను కలిసి పలుమార్లు విన్న వించినా.. ప్రయోజనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిషన్ కాకతీయతో ఉన్న చెరువు అనవాలు లేకుండా పోయిందని రైతులు నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్వా కంతో ప్రస్తుతం చెరువుకబ్జా అవుతుందని నాయకులు, అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. వెంటనే చెరువు సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. నీరు లేకపోవడంతో చెరువు కబ్జా.. 60 ఏళ్ల క్రితం నిర్మించిన చెరువులో మరమ్మతులు లేకున్న ప్రతి ఏడాది ఆయకట్టు కింద కనీసం 50 ఎకరాలు వరి పంట సాగు అయ్యేది. మత్తడి తొలగించి తూములు తీసి ఉంచడంతో చెరువులో చుక్కనీరు లేకుండా అయింది. చెరువులో పోయిన తన భూమికి పరిహారం ఇవ్వలేదంటూ ప్రస్తుతం చెరువు భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నా రు. సంబంధిత రైతులు మిషన్‌కాకతీయ పనులు అడ్డుకుంటున్నట్లు తెలిపి పనులు నిలిపివేసిన వా రు ప్రత్యమ్నాయ మార్గాలు చూడలేదు. 60 ఏళ్ల క్రితం నుంచి ఉన్న చెరువు విషయంలో భూమి విషయం మాట్లాడకుండా ప్రస్తుతం నీరు లేకపోవడంతో కబ్జాకు దిగడంతో సంబంధిత నాయకులు కబ్జాను ప్రోత్సహించేందుకే అధికారికంగా మరమ్మతుల పేరుతో మత్తడి కూల్చివేశారని రై తులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి చెరువును అభివృద్ధిలోకి తీసుకురావా లని పలువురు కోరుతున్నారు. చెరువు మీద ఆధారపడిన రైతు కుటుంబాలకు అన్యాయం చేయడం సరికాదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గడువులోగా ‘భగీరథ’ గగనమే
‘రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం పనులను మార్చి 31 వరకు పూర్తి చేసి, ఏఫ్రిల్1 నుంచి ఇంటింటికీ తాగునీరు అందించాలి. 1 తర్వాత ఏ ఇంటి నుంచి కూడా మహిళ తాగునీటి కోసం గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాధికారులు శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందిచాలి.’ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక మిషన్ భగీరథ పథకం అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవీ. సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మిషన్ భగీరథ పథకం పనులు సీఎం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే మరో మూడు, నాలుగు నెలలు గడిస్తే కానీ భగీరథ పనులు పూర్తయ్యేలా లేవు. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ వేసవిలో కూడా పుర ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అడ ప్రాజె క్టు నుంచి అంతర్గత పైపులైన్ ద్వారా బెల్లంపల్లి పుర ప్రజలకు తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి పైపులైన్ పనులు ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు పూర్తి అ య్యాయి. కాని మున్సిపాలిటీ పరిధిలో యూఎల్ఎస్ఆర్, జీఎల్బీఆర్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటి పనులు మందకొడిగా సాగుతుండడంతో ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కారణంగా ఇన్నాళ్ల నుంచి భగీరథ పథకం పనులకు గ్రహణం పట్టగా ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులను ప్రారంభించారు. అసంపూర్తిగా పైపులైన్ పనులు.. మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మంచిర్యాల – బెల్లంపల్లి గోదావ రి నీటి పథకం పైపులైన్లు మాత్రమే వార్డులలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలు వార్డులలో మిషన్ భగీరథ పైపులను అనుసంధానం చేయాల్సి ఉండగా, మరికొన్ని వార్డులలో కొత్తగా పైపులను విస్తరించాలి. ప్రజారోగ్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 8 నుంచి 10 కిలో మీటర్ల దూరం వరకు పైపులైన్ వేయాల్సి ఉంది. ఆయా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో పుర ప్రజలకు తాగునీ టిని సరఫరా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పందించని అధికారులు.. మిషన్ భగీరథ పథకం పనుల నిర్వహణపై ప్రజారోగ్యశాఖ అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావట్లేదు. ఇటీవలే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వేసవిలో పుర ప్రజలకు తాగునీటి కష్టాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం చెప్పినట్లుగా మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేయడానికి ఇంకా కేవలం నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. -
పంట పొలాల్లో మృత్యుహేల
వేమనపల్లి(బెల్లంపల్లి): విద్యుత్ తీగలు యమపాశాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఖరీదు మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. విద్యుత్ స్తంభాలు వేస్తుండగా పై నున్న హైటెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ సరఫరా కావడంతో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వేమనపల్లి మండలంలోని ముల్కలపేట గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామానికి చెందిన గొండె చిన్నరామన్న(60), చిన్న సురేందర్(22), వశాఖ భీంరావ్(25) బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముల్కలపేట శివారులో ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ లైన్ కోసం చిన్నగొడె రామన్న, రామగిరి పున్నం, సూసర్ల రమేశ్, జంబోజి వెంకటస్వామి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తలా ఎకరం, అర ఎకరం పొలాలున్నాయి. ఒక్కో రైతు మామూళ్ల కింద సుమారు రూ.25వేలు చొప్పున అధికారులకు చెల్లించారు. వీరికి గతేడాది విద్యుత్ లైన్ మంజూరయింది. ఆరు నెలల క్రితం మండల ఏఈ ట్రాన్స్ఫార్మర్ అందజేశారు. రైతులే సబ్‌స్టేషన్‌కు వెళ్లి తెచ్చుకున్నారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌కో కాంట్రాక్టర్ విద్యుత్ లైన్ అమర్చాలి. కనెక్షన్ ఇవ్వడంలో కాలయాపన.. రైతులు ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కాంట్రాక్టర్ వచ్చి విద్యుత్‌లైన్ అమర్చాలంటే ఆలస్యం అవుతుందని ఏఈ మాట దాటవేస్తూ వచ్చాడు. దీంతో రైతులే లైన్ నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఏఈ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నీల్వాయికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ వర్కర్ శంకర్ లైన్ అమర్చేందుకు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తానే కూలీలను తీసుకొచ్చి లైన్, ట్రాన్స్ఫార్మర్ అమర్చుతానని 15 రోజులుగా తిప్పుకుంటున్నాడు. కాని కూలీలను తీసుకురాకుండా రైతులతోనే స్తంభాల కోసం గోతులు తవ్విం చాడు. రైతులతోనే ట్రాన్స్ఫార్మర్కు ప్లాట్‌ఫారమ్(గద్దె) కట్టించాడు. తాళ్ల సహాయంతో ఆదివారం ఆరు స్తంభాలను గోతుల్లోకి దించి నిలబెట్టారు. ఎల్సీ తీసుకోకుండానే స్తంభాలను లైన్‌గా సరిచేస్తున్నారు. పైన ఉన్న లెవన్కేవీ(మేన్లైన్)కు విద్యుత్ లైన్‌కు సరఫరా ఉండడంతో స్తంభంలో ఉన్న చువ్వలకు విద్యుత్ సరఫరా అయింది. దీంతో స్తంభం చేతితో పట్టుకుని సరి చేస్తున్న చిన్నగొండె రామన్న, అతని సోదరుడు పోచన్న కొడుకు సురేందర్, వెంట వచ్చిన కూలీ వశాఖ భీంరావ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తాడు సహాయంతో అదే స్తంభాన్ని పట్టుకున్న తేర్కరి లచ్చన్న, రామగిరి పున్నం, జంబోజి వెంకటస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు రైతులు బోర్కుటి పరవేశి, కొండ్ర రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రాత్రి దాకా ఆందోళన.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బంధువులు మృతదేహాలతో రాత్రి వరకూ పొలాల్లోనే ఆందోళనకు దిగారు. మృతుల కుటంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్‌రూరల్ సీఐ జగదీష్, నీల్వాయి, చెన్నూర్, కోటపల్లి ఎస్సైలు భీమేష్, ప్రమోద్, వెంకన్న ఆందోళనకారుల వద్దకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. రాత్రి జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, బెల్లంపల్లి ట్రాన్స్‌కో డీఈ ఘటనా స్థలానికి వెళ్లి నచ్చజెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం, రైతుబీమా, ఆపద్బంధు సాయం, డబుల్ బెడ్రూం ఇండ్లు అందేలా సహకరిస్తామన్నారు. కాంట్రాక్టర్, సంబధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యంతోనే... బెల్లంపల్లి: ఆరు నెలల క్రితం విద్యుత్ లైన్ వేసి ఉంటే ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవి కావు. ముమ్మాటికీ విద్యుత్ అధికారులు, విద్యుత్ కాం ట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యం వల్లే మూడు నిండు ప్రాణా లు బలయ్యాయి. వాస్తవంగా విద్యుత్ లైన్‌ను కాంట్రాక్టర్‌తో ఏర్పాటు చేయించాల్సి ఉంది. కాని తీవ్ర కాలయాపన చేయడంతో రైతులే ముం దుకొచ్చి లైన్ వేసుకునే పనులకు సిద్ధపడ్డారు. లైన్ ఏర్పాటు చేయడంలో రైతులు, కూలీలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అనూహ్యంగా ప్రమాదం జరిగి మృతుల కుటుం బాల్లో తీవ్ర వేదన మిగిల్చింది. సదరు రైతులకు వ్యవసాయ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం కోసం కాంట్రాక్టర్ కేదారినాథ్‌తో విద్యుత్ అధికారులు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కాని కాంట్రాక్టర్ సకా లంలో విద్యుత్ లైన్ పనులు చేపట్టకుండా జాప్యం చేసినట్లు ఆరోపణలు న్నాయి. ఆ ప్రాంతంలో ఆరునెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అదే క్రమంలో రైతులకు విద్యుత్ లైన్ వేయడానికి కరెంట్ మెటీరియల్‌ను కూడా కొన్ని నెలల క్రితమే కాంట్రాక్టర్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. కాని మృతి చెందిన రైతులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఆరునెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినప్పుడే విద్యుత్‌లైన్ వేసి, కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇప్పడు ఆ ప్రమాదం జరిగి ముగ్గురు మృతిచెంది, మరో ఐదుగురు గాయపడే వారు కాదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అంటున్నారు. అక్కల పెళ్లి ఎప్పుడు చేస్తవ్ తమ్మి.. ‘అక్కల పెళ్లి చేయందే తాను పెళ్లి చేసుకోనంటివి. అందరినీ అనాథలను చేసి అందని లోకాలకు పోతివా.. తమ్మీ’ అంటూ విద్యుత్ శాఖలో దినసరి కూలీగా పనిచేస్తూ మృత్యువాత పడిన వశాఖ భీంరావ్ నలుగురు అక్కలు మృతదేహంపై పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన ప్రమాద స్థలంలో పలువురి గుండెలను పిండేసింది. నీల్వాయికి చెందిన భీంరావ్ పదేళ్లుగా విద్యుత్ శాఖలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. తండ్రి బిక్కుమేర చిన్ననాటనే చనిపోయాడు. తల్లి మల్లక్క వృద్ధురాలు. ఇద్దరు సోదరులు పెద్ద అన్న వెంకటేశ్ మానసిక వికలాంగుడు. చిన్న అన్న మధునయ్య వేరే కాపురం ఉంటున్నాడు. నలుగురు అక్కలు శంకరక్క, సత్తక్క, లక్ష్మి, రమకు వివాహం కాలేదు. వీరందరూ భీంరావ్ చేసే కూలీ పని పైనే ఆధారం. -
నామినేషన్ల స్వీకరణకు వేళాయే
బెల్లంపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఇతర సిబ్బందిని నియామించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యా హ్నం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికా రి అభ్యర్థుల నుంచి ఈనెల 7నుంచి 9వరకు నా మినేషన్లను స్వీకరిస్తారు. మూడు రోజుల పాటు మాత్రమే నామినేషన్లను అందజేయాల్సి ఉంటుంది. అందజేసిన నామినేషన్ పత్రాలను 10న పరిశీలిస్తారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేరోజు బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనేది రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార పర్వాన్ని నిర్వహించడానికి అవకాశం కల్పిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల సమరం క్రమంగా దగ్గర పడడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈనెల 21న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా.. గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఆచరణలో మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన చోటా, మోటా నాయకులు పోటీకి సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపికను స్వయంగా ప్రధాన పక్షాల అధినాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడమే ప్రధాన లక్ష్యంగా అభ్యర్థులను బరిలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీల గుర్తులు ఉండవు. ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులను మాత్రమే కేటాయిస్తారు. రాజకీయ పార్టీల కనుసన్నల్లో అభ్యర్థులు పల్లె సమరానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓటర్లను మ చ్చిక చేసుకునేందుకు సమావేశాలు, విందులను ఏర్పాటు చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో.. అసెంబ్లీ నియోజకవర్గంలో 114 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, భీమిని, నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి మండలాలు ఉండగా ఆయా మండలాల పరిధిలో ఇదివరలో 67 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా లంబాడీ తండాలను, 500 జనాభా దాటి ,3 కిలో మీటర్ల దూరం ఉన్న గ్రామాలను వేరుచేసి నూతనంగా మరో 47 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. -
రిటైర్డ్ కార్మికుల రాస్తారోకో
50 శాతం పింఛన్ పెంచాలని డిమాండ్ బెల్లంపల్లి : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు 50 శాతం పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం బెల్లంపల్లిలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు రాస్తారోకో చేశారు. భారతీయ జనతా మజ్దూర్ మోర్చా, తెలంగాణ సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంటాచౌరస్తాలోని తెలంగాణ దీక్షా శిబిరం వద్ద నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు వద్ద వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం బజార్‌ఏరియా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 18 ఏళ్ల నుంచి రిటైర్డ్ కార్మికులకు పింఛన్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతుండగా పింఛన్ మాత్రం ఒక్క శాతం కూడా పెంచడం లేదన్నారు. చాలీచాలని పింఛన్‌తో కుటుంబాలను పోషించుకోవడం దుర్భరంగా మారిందన్నారు. అర్థాకలితో పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతున్నా సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల పట్టించుకోవడం లేదని విమర్శించారు. పదో వేజ్‌బోర్డులో రిటైర్డ్ కార్మికులకు 50 శాతం పింఛన్ పెంచి, రూ.10 లక్షల గ్రాట్యూటీ సీలింగ్‌ను ఎత్తివేయాలని, బొగ్గు గనులలో ప్రైవేట్ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించి డిపెండెంట్లకు ఉద్యోగవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పింఛన్ పెంపుదలకు జాతీయ కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి రిటైర్డ్మెంట్ కార్మిక సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు జి.వెంకటయ్య, భారతీయ జనతా మజ్దూర్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.లింగయ్య, నాయకులు ఎల్.రాజమల్లు, డి.రాజలింగు, ఎస్.భూమయ్య, ఎన్.రాజకొమురయ్య, అంజయ్య, బి.కిష్టయ్య, ఎ.డానయ్య, జ్యోతిప్రకాశ్ పాల్గొన్నారు. -
బెల్లంపల్లిలో దారి దోపిడీ
బెల్లంపల్లి(ఆదిలాబాద్): బెల్లంపల్లి మండలంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో దారి దోపిడీ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బెల్లంపల్లి శివారులో ఉన్న కన్నాల సోనీ పెట్రోలు బంకు మేనేజర్ సయ్యద్ ఆసిఫ్ పెట్రోలు అమ్మగా వచ్చిన డబ్బులతో అశోక్‌నగర్‌లోని తన ఇంటికి బైక్‌పై ఒంటరిగా బయలు దేరాడు. మూసీవేతకు గురైన 68-డి బొగ్గు గని వద్ద ఇద్దరు దుండగులు దారి కాచి ఆసిఫ్‌ను అడ్డగించారు. అతనిని కొట్టి అతని వద్ద నున్న రూ.3.40 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాటిన మొక్కలను సంరక్షించాలి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పదో వార్డు నెంబర్ 2 ఇంకై ్లన్ బస్తీలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎక్కడా ఖాళీ స్థలం కనిపించకుండా విస్తారంగా మొక్కలు నాటించాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో మహిళలు ముందుండడం అభినందనీయమన్నారు.మున్సిపాలిటీలో లక్ష్యం ప్రకారంగా మొక్కలు నాటడం జరుగుతోం§lన్నారు. అనంతరం ఎమ్మెల్యే, చైర్పర్సన్, అధికారులు నెంబర్ 2 ఇంకై ్లన్ బస్తీలో కలియతిరిగి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు తాళ్లపల్లి లక్ష్మి, బత్తుల సుదర్శన్, ఎస్కె యూసుఫ్, ఎలిగేటి శ్రీనివాస్, లింగంపల్లి రాములు, వంశీకష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్, రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, నాయకులు మునిమంద రమేష్, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షుడు ఎండీ. ఎజాజ్, ఖలీల్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు లక్ష్మి, మున్సిపల్ రెవెన్యూ అధికారి మల్లారెడ్డి పాల్గొన్నారు. -
గుండెలు పిండేసే విషాదం
బెల్లంపల్లి: పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారిన ఓ ప్రభుత్వ పాఠశాల పసిపాప ప్రాణాలు బలిగొంది. ఉపాధ్యాయుడి ఉదాసీన వైఖరి చిన్నారి ఊపిరి తీసింది. సర్కారీ నిష్ఫూచీ సర్పమై చిన్నారిని కాటేసింది. తమ చిట్టితల్లి చదువుల రాణిగా చూడాలని ఆశ పడ్డ ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. గుండెలను పిండేసే విషాదం జరిగిందిలా.... ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాముకాటుకు గురై ఎనిమిదేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. గామానికి చెందిన గణేష్, అమృత దంపతుల చిన్న కుమార్తె శ్రీహర్ష (8) స్థానిక చాణక్య విద్యానికేతన్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. రోజులాగే తరగతిగదిలో కూర్చొని పాఠాలు వింటోంది. కిటికీ పక్కన పాము పుట్టతో పాటుగా ముళ్లకంచె ఉంది. ఆమె పెన్సిల్ కిటికీ నుంచి బయటకు పడింది. దీంతో శ్రీహర్ష కిటికీ నుంచి బయటకు చేయి పెట్టి తీసుకుంటుండగా పుట్టలో నుంచి పాము బయటకు వచ్చి కాటు వేసింది. వెంటనే ఈ విషయం అక్క శ్రీవిద్యకు చెప్పింది. ఆమె ఉపాధ్యాయుడు అర్జయ్యకు దృష్టికి తీసుకువచ్చారు. ముళ్లతో గాయమైందని వారిని దబాయించిన ఉపాధ్యాయుడు క్లాస్‌రూంలోనే కొంత సమయం వరకు ఉంచారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్లిన శ్రీహర్షను ఏమైందని తల్లిదండ్రులు అడిగినా ఆమె చెప్పలేక, ముక్కులోంచి నురుగులు కక్కుతూ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత జరిగిన విషయాన్ని చెప్పింది. వారు చిన్నారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే చనిపోయింది.