- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నాటిన మొక్కలను సంరక్షించాలి
Published Wed, Jul 27 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
బెల్లంపల్లి : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పదో వార్డు నెంబర్ 2 ఇంకై ్లన్ బస్తీలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎక్కడా ఖాళీ స్థలం కనిపించకుండా విస్తారంగా మొక్కలు నాటించాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని ప్రజలకు సూచించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో మహిళలు ముందుండడం అభినందనీయమన్నారు.మున్సిపాలిటీలో లక్ష్యం ప్రకారంగా మొక్కలు నాటడం జరుగుతోం§lన్నారు. అనంతరం ఎమ్మెల్యే, చైర్‌పర్సన్, అధికారులు నెంబర్ 2 ఇంకై ్లన్ బస్తీలో కలియతిరిగి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు తాళ్లపల్లి లక్ష్మి, బత్తుల సుదర్శన్, ఎస్‌కె యూసుఫ్, ఎలిగేటి శ్రీనివాస్, లింగంపల్లి రాములు, వంశీకష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్, రాజేశ్వర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, నాయకులు మునిమంద రమేష్, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షుడు ఎండీ. ఎజాజ్, ఖలీల్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు లక్ష్మి, మున్సిపల్ రెవెన్యూ అధికారి మల్లారెడ్డి పాల్గొన్నారు.
Advertisement