మీకు తెలుసా? చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి | Did you know trees breathe? | Sakshi
Sakshi News home page

మీకు తెలుసా? చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి

Published Sat, Sep 28 2024 11:06 AM | Last Updated on Sat, Sep 28 2024 11:06 AM

Did you know trees breathe?

మనం శ్వాస తీసుకునే విధంగానే చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి. కానీ మనం ఆక్సిజన్‌ తీసుకుని కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తే, చెట్లు కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అయితే. ఒక చెట్టు ఎంత ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఒక చెట్టు తన జీవితకాలంలో విడుదల చేసే ఆక్సిజన్‌ పరిమాణం చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వేర్వేరు రకాల చెట్లు వేర్వేరు పరిమాణాల్లో ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.

ఒక చెట్టు వయసు పెరిగే కొద్దీ అది విడుదల చేసే ఆక్సిజన్‌ పరిమాణం కూడా పెరుగుతుంది. పెద్ద చెట్లు చిన్న చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. వెలుతురు, నీరు, మట్టి నాణ్యత వంటి పరిస్థితులు చెట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆక్సిజన్‌ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది.

స్పష్టంగా చె΄్పాలంటే, 50 సంవత్సరాల వయసు ఉన్న ఒక మామిడి చెట్టు తన జీవితకాలంలో 81 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది. 271 టన్నుల ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని అంచనా. మనకు స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్లు ఎంత అవసరమో దీనిని బట్టి అర్థం అవుతోంది కదా... 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement