tree
-
చెట్టూ... నీ చరిత్ర చెప్పూ..
సాక్షి, ఆదిలాబాద్: దేశంలో ఇప్పుడు ప్రతి పౌరుడికీ ఓ గుర్తింపు ఉంది. అదే ఆధార్.. అలాంటి ఓ గుర్తింపే ప్రతి చెట్టుకు ఉంటే..? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామానికి వెళితే.. ఇలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న చెట్లు అడుగడుగునా కనిపిస్తాయి. దుకాణాల్లో కనిపించే క్యూఆర్ కోడ్ స్కానర్ల మాదిరే ఈ గ్రామ పరిధిలోని ప్రతి చెట్టుకూ స్కానర్లు కనిపిస్తాయి. వాటిని స్కాన్ చేస్తే ఆ చెట్టు వివరాలన్నీ మనకు ఫోన్లో దర్శనమిస్తాయి.చెట్టు గుర్తింపు నంబర్, అది ఏ రకం, మొక్క నాటిన తేదీ, సంవత్సరం, దాని వయస్సుతో పాటు అది వాతావరణం నుంచి ఎంత కార్బన్డయాక్సైడ్ తీసుకున్నదనే సకల వివరాలు కనిపిస్తాయి. దేశంలో చెట్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు వేసిన తొలి గ్రామంగా ముఖరా (కే) రికార్డు సృష్టించింది. చెట్ల డేటాబేస్‌ను క్రోడీకరించేందుకు ‘డిజిటల్ ట్రీ ఆధార్’కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభించారు. గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఓ చెట్టుకు స్కానర్‌ను అమర్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రామంలోని ప్రతి చెట్టును జియోట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఆది నుంచి ప్రత్యేకమే.. ఆరేళ్ల క్రితమే ఏర్పడిన ముఖరా (కె) గ్రామపంచాయతీ ఆది నుంచీ ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామ తొలి సర్పంచ్‌గా గాడ్గే మీనాక్షిని ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని చెత్త నుంచి వర్మీకంపోస్టును తయారు చేసి విక్రయించగా వచ్చిన రూ.5 లక్షలతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో వీధి దీపాలకు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్ బిల్లు జీరోగా మారింది.బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడం ద్వారా ఓడీఎఫ్ ప్లస్‌లో స్థానం దక్కించుకుంది. గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు కూడా నిర్మించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామంలో 1,05,624 మొక్కలను ఐదేళ్లలో నాటారు. ప్రస్తుతం ఆ చెట్లు, మొక్కలకు జియోట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శక్తికరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జాస్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్‌లెస్ విలేజ్ అవార్డులు లభించాయి. నాటిన ప్రతీ మొక్క బతకాలన్నదే మా తపన మనం ఎన్ని మొక్కలు నాటాం? ఎన్ని బతికాయి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే విషయాలు తెలుసుకునేందుకే జియోట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్ బిగించే కార్యక్రమం చేపట్టాం. మొక్క ఎండిపోతే తిరిగి అక్కడే మరో మొక్క నాటేందుకు జియోట్యాగింగ్ ఉపయోగపడుతుంది. – గాడ్గే మీనాక్షి, మాజీ సర్పంచ్, ముఖరా (కె) -
వయసు 14 ఏళ్లే.. కానీ లక్ష మొక్కలు నాటింది..!
‘ప్రసిద్ధి సింగ్’ను ‘చెట్ల అమ్మాయి’ అని పిలవొచ్చు. ఎందుకంటే ఎక్కడ ప్రసిద్ధి ఉంటే అక్కడ ఒక చెట్టయినా ఊపిరి పోసుకుంటుంది. తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి ఇప్పటికి లక్ష మొక్కలు నాటిందంటే నమ్ముతారా? కాని నిజం. ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ తన లక్ష్యం పది లక్షల మొక్కలు నాటడం అని తెలిపి అందరిలో స్ఫూర్తి నింపింది. 2016లో ప్రసిద్ధికి ఆరేళ్లు ఉన్నప్పుడు తుపాను వారి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అనేక చెట్లు నేలకూలాయి. ఆ వయసులోనే ప్రసిద్ధి నేలకూలిన మొక్కలను చూసి బాధపడింది. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడితే ఉత్సాహంగా తనూ పాల్గొంది. రెండేళ్లపాటు తమిళనాడులోని రకరకాల ప్రాంతాలకు వెళ్లి మొక్కలు నాటింది. నాటే కొద్ది ఆ అమ్మాయికి మొక్కల కోసం పని చేయాలనిపించి లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. ఆ వయసులో అది సాధ్యమా అని ఎవరైనా తనని అడిగితే, ‘చిన్న కొవ్వొత్తి ఇంటికంతా వెలుగు ఇవ్వడం లేదా? ఇది కూడా అంతే. సంకల్పం బలంగా ఉంటే తప్పక సాధ్యమవుతుంది’ అని చెప్పేది. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరికొంతమందిని కలుపుకొని ‘ప్రసిద్ధ ఫారెస్ట్ ఫౌండేషన్’ ప్రారంభించింది. అందులో కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధుల కోసం తోటి పిల్లలకు పెయింటింగ్, యోగా నేర్పేంది. అలా వచ్చిన డబ్బుతో కార్యక్రమాలు నిర్వహించేది. ఈ క్రమంలో ఎన్నో పాఠశాలలకు వెళ్లి, అక్కడి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు అనుమతి కోరింది. ఇంత చిన్నపిల్ల ఏం చేస్తుందా అని వారు ఆశ్చర్యపోయినా, తనకు అవకాశం ఇచ్చేవారు. అలా అనేక పాఠశాలల్లో మొక్కలు నాటింది. మెల్లగా తన గురించి అందరికీ తెలిసింది. తన సంకల్పానికి మరికొందరు తోడయ్యారు. అలా ఇప్పటికి 110 ప్రాంతాల్లో 1.3 లక్షల కంటే ఎక్కువ మొక్కలు నాటింది. పర్యావరణం కోసం, అడవుల సంరక్షణ కోసం ఆమె చేస్తున్న పనికి మెచ్చుకుంటూ 2021లో పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించారు. తమిళనాడు వాతావరణ సదస్సు 3.0లో ఆమెను చైల్డ్ ఛాంపియన్ స్పీకర్‌గా యునిసెఫ్ గుర్తించింది. త్వరలో తమిళనాడులోని 200 పాఠశాలల్లో ’Green Brigade’ కార్యక్రమం మొదలుపెట్టి, విద్యార్థులకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, వారిని అందులో భాగస్వాములను చేయనుంది. (చదవండి: స్టైల్గానే కాదు అందంగా నాజుగ్గా కనపడాలంటే..!) -
కొమురవెల్లిలో దేవుని చెట్టు
సాక్షి, సిద్దిపేట: ఏ దేవాలయానికి వెళ్లినా సహజంగా రావి, వేప చెట్లే దర్శనమిస్తాయి. కానీ సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి దేవాలయంలో మాత్రం గంగరేగు చెట్టు కనిపిస్తుంది. స్వామివారి మండపానికి ఎదురుగా ఉన్న గంగరేగు చెట్టు వద్దనే భక్తులు పట్నాలు వేసి, మొక్కులు చెల్లిస్తారు. చెట్టుకు ముడుపు కూడా కడతారు. మొక్కులన్నీ ఇక్కడే..ప్రతి ఏడాది మూడు నెలల పాటు కొమురవెల్లి జాతర జరుగుతుంది. జనవరి 19వ తేదీ నుంచి ప్రారంభమై..మార్చి 24న అగ్ని గుండాల ప్రవేశంతో జాతర ముగుస్తుంది. బుధ, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకున్న తర్వాత ‘కష్టాలు తీరిస్తే గంగరేగు చెట్టు కింద పట్నం వేస్తాం’అని మొక్కుకుంటారు. సమస్యలు తీరగానే సకుటుంబంగా కొమురవెల్లికి తరలివస్తారు. ఒగ్గు పూజారితో గంగరేగు చెట్టు కింద మల్లన్న పట్నాలు వేయిస్తారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించేది కూడా ఇక్కడే. కల్యాణకట్టలో కత్తిరించిన తలనీలాలను వెంట తెచ్చుకొని, గంగరేగు చెట్టు మొదల్లో వేయడం ఆనవాయితీ. ఈ చెట్టుకు బంతిపూల మాల వేసి, స్వయంగా స్వామివారికే అలంకరించిన అనుభూతిని పొందుతారు.ఎప్పుడూ పచ్చగా...ఈ గంగరేగు చెట్టుకు ఎంతో మహిమ ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఈ చెట్టు మాత్రం ఏడాది పొడవునా పచ్చదనంతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇందుకు కారణం స్వామి మహిమేనని నమ్ముతారు. ఈ చెట్టు ఆకుతోపాటు స్వామి చేతిలో బండారి(పసుపు) తింటే అనారోగ్యం దూరమవుతుందని భక్తుల నమ్మకం. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెట్టు ఆకులను వెంట తీసుకెళ్లి, అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తూ ఉంటారు. ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే, వారిని మల్లన్న దేవాలయానికి తీసుకొచ్చి.. స్వామి దర్శనం చేయించడంతోపాటు గంగరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంటారు.మంచి జరుగుతుందని..గంగరేగు చెట్టును దేవుడు చెట్టుగా భావిస్తారు. గంగరేగు చెట్టు ఆకుతోపాటు స్వామి వారి చేతిలోని బండారి తినడం వలన ఆరోగ్యంగా ఉండటంతోపాటు మంచి జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా భక్తుల ముడుపులు, పట్నాలు వేస్తారు.– మహాదేవుని మల్లికార్జున్, వంశపారంపర్య అర్చకుడు -
Tata Family Tree: టాటా వంశవృక్షం ఇదే..
టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. టాటా గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. టాటా గ్రూప్ 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. ఈ కంపెనీ అధిపతి రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు.టాటా గ్రూప్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే ఈ కుటుంబంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. టాటా కుటుంబ వ్యాపారానికి రతన్ దొరబ్ టాటా పునాది వేశారు. ఆయనకు ఇద్దరు సంతానం. వారు బాయి నవాజ్‌బాయి రతన్ టాటా, నుస్సర్వాన్జీ రతన్ టాటా. నుస్సర్వాన్జీ ఒక పార్సీ పండితుడు. ఈ కుటుంబం నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. అతను 1822లో జన్మించి 1886లో మరణించారు. జంషెడ్జీ టాటానుస్సర్వాన్జీ టాటాకు ఐదుగురు సంతానం. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా ఒకరు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. టాటా గ్రూప్‌లోని స్టీల్ (టాటా స్టీల్), హోటళ్లు (తాజ్ మహల్) వంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు. ఆయనను భారతీయ పరిశ్రమ పితామహునిగా పిలుస్తారు. అతని జీవిత కాలం 1839 నుండి 1904.దొరాబ్జీ టాటాదొరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడు. జంషెడ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు. అతని జీవిత కాలం 1859-1932. టాటా పవర్ వంటి వ్యాపారాలను నెలకొల్పడంలో దొరాబ్జీ కీలక పాత్ర పోషించారు.రతన్ జీ టాటారతన్జీ టాటా జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు. అతని జీవితకాలం 1871 నుండి 1918. అతను టాటా గ్రూప్‌నకు పత్తి- వస్త్ర పరిశ్రమల వంటి వ్యాపారాలను జోడించారు.జేఆర్డీ టాటాజేఆర్డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. అతని జీవితకాలం 1904-1993. ఇతను రతన్జీ టాటా, సుజానే బ్రియర్ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను జెఆర్‌డి టాటా స్థాపించారు. ఈ విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా.నావల్ టాటానావల్ టాటా జీవిత కాలం 1904- 1989. ఇతను రతన్జీ టాటా దత్తపుత్రుడు. రతన్ నావల్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా, 2016-17మధ్యలో తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ , టెట్లీ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కొనుగోలులో నావల్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.రతన్ టాటారతన్ టాటా జీవిత కాలం 1937 నుండి 2024. ఈయన నావల్ టాటా, సునీ కమిషరియట్ల కుమారుడు. రతన్ టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.నోయల్ టాటాకు ముగ్గురు కుమారులురతన్ టాటా వరుస సోదరుడు నోయెల్ టాటా ముగ్గురు సంతానం. వారు మాయా టాటా, నెవిల్లే టాటా, లియా టాటా. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వేర్వేరు వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
మీకు తెలుసా? చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి
మనం శ్వాస తీసుకునే విధంగానే చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి. కానీ మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తే, చెట్లు కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అయితే. ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ విడుదల చేస్తుంది అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఒక చెట్టు తన జీవితకాలంలో విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వేర్వేరు రకాల చెట్లు వేర్వేరు పరిమాణాల్లో ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.ఒక చెట్టు వయసు పెరిగే కొద్దీ అది విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం కూడా పెరుగుతుంది. పెద్ద చెట్లు చిన్న చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. వెలుతురు, నీరు, మట్టి నాణ్యత వంటి పరిస్థితులు చెట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆక్సిజన్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది.స్పష్టంగా చె΄్పాలంటే, 50 సంవత్సరాల వయసు ఉన్న ఒక మామిడి చెట్టు తన జీవితకాలంలో 81 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. 271 టన్నుల ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని అంచనా. మనకు స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్లు ఎంత అవసరమో దీనిని బట్టి అర్థం అవుతోంది కదా... -
వాయుగుండాలు.. పెనుగాలులు.. క్లౌడ్ బరస్ట్!
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్), ఎ¯న్జీఆర్ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక.. పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్‌షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ఆ చెట్టు మళ్లీ బతకాలి..
కొవ్వూరు: సితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఆయన గురువారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వచ్చి కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తాను చిన్నప్పుడు పట్టిసీమ వెళుతూ ఈ చెట్టును చూసినట్టు తెలిపారు. తాను దర్శకత్వం వహించే ప్రతి చిత్రంలోనూ గోదావరి సీన్ కచ్చితంగా ఉంటుందని, సుమారు 18 సినిమాల్లో ఈ కుమారదేవం చెట్టు ఉందని వెల్లడించారు. తాను రాసిన గోకులంలో రాధ నవలలో ప్రధానంగా ఈ చెట్టు గురించే ఉంటుందని చెప్పారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్‌లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్‌లు రాలేదన్నారు. ఇటువైపు వచ్చినప్పుడల్లా మిత్రులతో కలిసి ఇక్కడ చెట్టు కింద సేద తీరేవాడినని, మిత్రులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా వృక్షాన్ని చిగురింపజేసే పనులను ప్రారంభించారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. -
విశాఖ: వందేళ్ల చరిత్ర సాక్ష్యానికి రక్షాబంధన్ (ఫొటోలు)
-
తిరుమలలో ఊహించని ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, తిరుమల: తిరుమలలో చెట్టుకొమ్మ విరిగి యువతి గాయాలపాలైయింది. ఈ ఘటన ఆలస్యం వెలుగు చూసింది. జపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఘటన జరిగింది.తిరుమలకు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న జపాలి ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తున్న సమయంలో కర్ణాటకకి చెందిన మహిళపై భారీ వృక్షం కొమ్మ విరిగి తలపై పడింది. చెదలు పట్టడం వల్ల చెట్టు కొమ్మ విరిగిపడింది.తల, వెన్నుముకు తీవ్రగాయాలు తగిలాయి. వెంటనే అంబులెన్‌లో తిరుమల అశ్విని ఆసుపత్రి తరలించారు.. గాయాలతో ఆ మహిళ బయటపడింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది. -
ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!
గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
మండే ఎండల్లో కదిలి వచ్చిన మామిడిచెట్టు.. వైరల్ వీడియో
ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరూ.. ఒక్కో రకంగా తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తమ చేష్టలతో తోటి వారికి ప్రేరణగా నిలవాలని భావిస్తారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది. ఇందులో ఒక వ్యక్తి చేసిన పని చూసినవారంతా వాహ్.. అంటున్నారు. మరి అదేంటో మీరూ చూసేయండి...ఇన్‌స్టాలో షేర్ అయిన వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం వెనుకాల సీట్లో కుండీలో పెరుగుతున్న మామిడి మొక్క (చెట్టు)ను భద్రంగా కట్టి తీసుకెళ్తున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేశాడా? నిరంతర ప్రయాణంలో కూలర్లను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లలేం గనుక ఇలా తీసుకెళ్లాడా? లేక నర్సరీనుంచి మొక్కను కొనుగోలు చేసి తీసుకెళుతున్నాడా? పెద్దగా పెరిగిన మామిడి చెట్టును ఒకచోటు నుంచి మరో చోటుకి షిఫ్ట్ చేస్తున్నాడా అనేది స్పష్టత లేదు. కానీ కొంతమంది అద్భుతమైన ఐడియా అంటూ కమెంట్ చేశారు. ఇది కావాలనే చేసిన జిమ్మిక్కు అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sethumadhavan Thampi (@sethumadhavan_thampi)ఏది ఏమైనా గ్రోబ్యాగ్‌లో భారీగా పెరిగిన మామిడి చెట్టును బండిపై తీసుకెళ్లడం వింతగా అనిపిస్తోంది. అంతేకాదు దీనికి మామిడి కాయలు కూడా కనబడుతుండటం విశేషం. వేగానికి చెట్టు కొమ్మలు హాయిగా ఊగుతోంటే.. అంతకంటే గమ్మత్తుగా ఆ మామిడికాయలు నాట్యం చేస్తున్నాయి. ఈ విన్యాసం చూడడానికి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ వీడియో లక్షకు పైగా లైక్‌లను పొందింది. ప్రస్తుతం ఈ వీడియో 'సేతుమాధవన్ థంపి' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెగ వైరల్ అవుతోంది. ఇవి చదవండి: మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే.. -
అర్జున బెరడు గురించి విన్నారా? దీని ఔషధ గుణాలు తెలిస్తే..!
అర్జున చెట్టు లేదా తెల్ల మద్ది గురించి ఎపుడైనా విన్నారా? ఈ చెట్టు నుంచి తీసిన బెరడులో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. అర్జున బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పలు రకాల ఔషధాల తయారీలో దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. దీని అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.దీని బొటానికల్ పేరు: టెర్మినలియా అర్జున. దీని బెరడు గుండెకు టానిక్‌గా పనిచేస్తుందట. ఈ చెట్టు గురించిన ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. గుండె జబ్బులు, శ్వాసకోసం వ్యాధులు మొదలు సంతాన లేమి సమస్యలతో బాధపడే పురుషులకు కూడా ఇది దివ్యౌషధంలా పని చేస్తుంది.ఎముకల బలహీనతతో బాధ పడే వారికి అర్జున బెరడుచాలా ఉపయోడపడుతుంది. అర్జున బెరడును మెత్తగా పొడి చేసి, తేనె కలిపి రోజుకు పావు స్పూన్ చొప్పున తీసుకుంటే బలహీనమైన ఎముకలు దృఢంగా మారతాయి. ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి పరిష్కారం అర్జున బెరడు.అలాగే వాతావరణం చల్లగా ఉన్నపుడు గోరు వెచ్చటి పాలల్లో అర్జున బెరడు పొడిని అర స్పూన్ చప్పున కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులకు కూడా మంచి పరిష్కారం ఇది.సంతాన సమస్యలతో బాధ పడే పురుషులు రోజూ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోవాలి. దీంతో వీర్య కణాల వృద్ధిచెంది సంతాన భాగ్యం కలిగే అవకాశాలు పెరుగుతాయి.అర్జున బెరడుతో కషాయాన్ని తయారు చేసుకుని తరచూ తీసుకుంటే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ధమనులు, సిరల్లో రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది. లిపో ప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. కడుపు అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని వృద్ది చేస్తుంది. రక్త పోటు స్థాయిలను నియంత్రిస్తుంది. శారీరక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా అర్జున బెరడు పొగాకు, ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.కణుతుల పెరుగుదలను నియంత్రించడంలోఉపయోగపడుతుంది. అర్జున బెరడులోని విటమిన్ ఈ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల అర్జున బెరడు తోడ్పడుతుంది. -
చెట్టు నుంచి నీళ్లు రావడం చూశారా?
ప్రకృతి ఎప్పటికప్పుడూ తన వైవిధ్యంతో మనుషులను మంత్రముగ్దులయ్యేలా చేస్తూనే ఉంటుంది. కొన్నింటిని చూస్తే ప్రకృతిలో ఇంగ గొప్ప శక్తి ఉందా అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఓ విచిత్రమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వేసవి వచ్చిందంటే ఎందురయ్యే నీటి సమస్యకు ఆ అద్భుతం ఓ గొప్ప మార్గాన్ని అందించే ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా అద్భుతం అంటే.. ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి జిల్లాలోని రంపచోడవరం -కింటుకూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది . ఏం జరిగిందంటే..భూమి మూడోంతుల నీరు ఉంటుందని విన్నాం. కానీ కొన్ని చోట్ల భూమ్మీద నీరు కనిపించకపోయినా..తవ్వగానే ఉబికి రావడం జరగుతుంది. మరొకొన్ని చోట్ల కొండల్లోంచి పుట్టుకురావడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అత్యంత విభిన్నంగా చెట్టులోంచి నీరు వస్తోంది. అంది కూడా పంపు నుంచి లీకైనట్లుగా ధారాపాతంగా వస్తోంది. ఈ చెట్టుకి పూలు, కాయల తోపాటు నీళ్లు కూడా వస్తాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఆ చెట్టు పేరు నల్ల మద్ది చెల్లు. దీన్నుంచి నిరంతరాయంగా పంపు మాదిరిగా నీళ్లు ఫోర్స్‌గా వస్తాయి. అక్కడే ఇలాంటి చెట్లు వేలాదిగా ఉన్నాయి. ఈ చెట్టుకి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందట. ఆ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అందుకు సంబంధించిన వీడియోని తీసి నెట్టింట షేర్ చేయండతో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వింతైన దృశ్యాన్ని చూసేయండి. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an — Telugu Scribe (@TeluguScribe) March 30, 2024 (చదవండి: పాము కాటు వేయగానే ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేయండి!) -
మద్దిచెట్టు నుంచి నీటి ధార
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది. దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్‌బాబు పాల్గొన్నారు. -
800 ఏళ్ల నాటి చెట్టు! చూస్తే బంగారంలా..!
ఇంతవరకు ఎన్నో పురాతనమైన చెట్ల గురించి విన్నాం. మహా అయితే రెండొందలు లేదా నూటయాభై ఏళ్లు అంతే. కానీ ఏకంగా 800 ఏళ్ల నాటి చెట్ల గురించి విని ఉండం. పైగా అన్నేళ్ల పాటు సజీవంగా చెట్లు ఉన్న దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడూ ఈ చెట్టు అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందేమో!. ప్రస్తుతం ఈ చెట్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడ ఉంది? ఏంటా విశేషాలంటే.. ఆ పురాతనమైన చెట్టు దక్షిణ కొరియాలో ఉంది. పరిశోధకులు దీన్ని 800 ఏళ్ల నాటి వృక్షంగా చెబుతారు. ఇది దక్షిణ కొరియా జాతీయ స్మారకంగా చిహ్నంగా పిలుస్తారు. అంతేగాదు అత్యధికంగా పర్యాటకులు సందర్శించే చెట్టుగా కూడా చెబుతుంటారు. ఈ చెట్టు సుమారు 17 మీటరల చుట్టుకొలతను కలిగి విశాలమైన కొమ్మలతో పరుచుకుని ఉంది. ఈ చెట్టు బంగారు రంగులో మెరుస్తూ ఓ దేవతా వృక్షం మాదిరిగా కనిపిస్తుంది. అందువల్ల నెటిజన్లు ఈ చెట్టుకి "ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టు"గా కితాబిచ్చారు. ఇది క్రీస్తూ పూర్వం సిల్లా రాజవంశ కాలంలోనే మొలకెత్తిందని చరిత్రకారులు చెబుతున్నారు. మరికొంతమంది పురాణాల ప్రకారం సిల్లా చివరి రాజు సన్యాసిగా మారేందుకు కుమ్గాంగ్ పర్వాతానికి వెళ్తుండగా.. తన గుర్తుగా ఈ చెట్టుని నాటాడని కథలుకథలుగా చెబుతుంటారు అక్కడి ప్రజలు. ఐతే అందుకు సరైనా ఆధారాలు లేవు. కానీ పరిశోధకులు ఈ చెట్టు వయసుని వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా పేర్కొన్నారు. ఈ చెట్టును జోసోన్ రాజవంశ కాలంలోనే అప్పటి ప్రభుత్వం దీన్ని గుర్తించి సమున్నత స్థానం కల్పించిందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు. ఈ చెట్టుని జింకో చెట్టుగా పిలుస్తారు దక్షిణ కొరియా వాసులు. శాస్త్రవేత్తలకు ఈ చెట్టు పెరుగుదల అంతు చిక్కని మిస్టరీలా ఉంది. దీనిపై ఇప్పటికీ పలు పరిశోధలనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో..జింకో అనేది తూర్పు ఆసియాకు చెందిన జిమ్నోస్పెర్మ్ చెట్టు జాతి చెందినదిగా గుర్తించారు. పైగా ఇది 290 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటిసారిగా కనిపించిన చివరి జీవజాతి అని చెప్పుకొచ్చారు పరిశోధకులు. This ginkgo tree, in the village of Bangye-ri in South Korea, is thought to be at least 800 years old pic.twitter.com/0NxlFQ0USd — Science girl (@gunsnrosesgirl3) December 4, 2023 (చదవండి: ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా? డైనోసర్‌ని చూసొండొచ్చా?) -
విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో చెట్టును ఢీకొట్టిన బస్సు రెండుగా విడిపోయింది. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందారు. శిథిలాల్లో చిక్కుకున్న భాధితులను బయటకు తీశారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
చూడటానికి డబ్బాలా కనిపించే ఈ గాడ్జెట్ .. మొక్కలకు మంచి నేస్తం
చూడటానికి డబ్బాలా కనిపించే ఈ పరికరం మొక్కలకు స్మార్ట్ నేస్తం. ఇది మొక్కలకు నిత్యం నీటిని సరఫరా చేస్తూ, వాటి పచ్చదనాన్ని కాపాడుతుంది. ఇందులో ఐదులీటర్ల వాటర్‌ట్యాంకు ఉంటుంది. దీనిని ఇంటి ఓవర్‌హెడ్ ట్యాంకు లేదా సంప్కి అనుసంధానం చేసుకోవచ్చు. దానివల్ల ట్యాంకులో నీటిమట్టం నిరంతరం ఒకేలా ఉంటుంది. ఇందులోని నీరు దీని వెనుకనున్న సన్నని గొట్టాల ద్వారా మొక్కలకు చేరుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఇందులోని మ్యాగ్నెటిక్ సెన్సర్లు పరిసరాల్లోని ఉష్ణోగ్రతను, మొక్కల్లోని తేమను, మట్టిలోని తేమను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. మొక్కల అడుగున మట్టిలోను, మొక్కల్లోను తేమ ఏమాత్రం తగ్గినా, వాటికి తగిన నీటిని విడుదల చేస్తుంది. ‘ప్లాంట్మేట్’ పేరుతో స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ప్లాంటప్’ కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, ఇంట్లోని మొక్కల సంరక్షణ గురించి ఎలాంటి దిగులు ఉండదు. ఒకవేళ ఇల్లు విడిచి కొద్దిరోజులు ఊరికి వెళ్లాల్సి వచ్చినా మొక్కలకు నీరు అందకపోయే సమస్యే ఉండదు. దీని ధర 199 డాలర్లు (రూ.16,561) మాత్రమే! -
వైఎస్సార్ స్మృతివనంలో ఆఫ్రికా వృక్షం
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంవత్సరాలు జీవించే వృక్షజాతుల్లో అడెనేషియా సోనియా ఒకటి. ఆఫ్రికా ఖండంలో విస్తారంగా కనిపించే ఈ మహావృక్షం మనదేశంలోనూ అక్కడక్కడా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా గార్గేయపురం గ్రామంలో ఒకటి, గ్రామ శివార్లలో కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పక్కన మరో రెండు వృక్షాలున్నాయి. అలాగే జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఎస్పీజీ గ్రౌండ్స్ పక్కనున్న క్రైస్తవ శ్మశాన వాటికలో రెండు వృక్షాలు కనిపిస్తున్నాయి. గార్గేయపురంలో ఉన్న చెట్లలో ఒకదానిని ట్రీ ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో అక్కడ నుంచి ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో ఉన్న వైఎస్సార్ స్మృతివనంలో పునఃస్థాపించారు. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న అడెన్ సోనియా చెట్టు వయస్సు 6వేల ఏళ్లుగా నిర్ధారించి ఇది ప్రపంచంలో ఎక్కువ కాలంగా జీవించిన చెట్టుగా చెబుతున్నారు. వీటిని ఇక్కడ బ్రహ్మమల్లిక, ఏనుగు చెట్టు, పారిజాతంగా పిలుస్తున్నారు. -
ఆకులు మార్చి.. ఏమార్చే.. ఊసరవెల్లి చెట్టు!
పరిసరాలను బట్టి రంగులు మార్చేసే ఊసరవెల్లులు తెలుసు! అక్కడ ఉన్నాయా లేవా అన్నట్టుగా పరిసరాల్లో కలిసిపోయే కీటకాలు, జంతువులూ మనకు తెలుసు! కానీ తాను పాకే చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసుకునే తీగ చెట్టు తెలుసా? ప్రకృతి వింతల్లోనే వింతైనదిగా శాస్త్రవేత్తలు చెప్తున్న ఆ తీగ చెట్టు ఏమిటి? ఆకుల ఆకృతిని మార్చుకోవడం ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ చెట్టు వేరు.. ఆకులు ఒకటే.. చిలీలోని దట్టమైన అడవులు.. ఎర్నెస్టో గియనోలి అనే వృక్ష శాస్త్రవేత్త చెట్లు, మొక్కలపై పరిశోధన చేస్తున్నారు. నడు స్తూ వెళ్తున్న ఆయన ఓ చోట పడి ఉన్న ఆకులను చూసి ఆశ్చర్యంతో ఆగిపోయారు. అక్కడున్న చెట్టు ఆకులు ఒక ఆకారంలో ఉంటే.. కిందపడి ఉన్న ఆకులు భిన్నమైన ఆకారాల్లో ఉండటమే దానికి కారణం. ఇదేమిటా అని పరిశోధన చేసిన ఎర్నెస్టో.. తానున్న చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసే తీగ చెట్టును గుర్తించారు. ఆ తీగ చెట్టుకు ‘బోక్విలా ట్రైఫోలోలిటా’గా పేరు పెట్టారు. చెట్టులో చెట్టు.. తీగలో తీగ.. ఏ చెట్టు, మొక్క అయినా దాని ఆకుల న్నీ ఒకేలా ఉంటాయి. ఆకారం నుంచి రంగు దాకా పెద్దగా తేడా ఉండదు. కానీ ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తీగ చెట్టు మాత్రం.. తాను పాకుతూ పెరిగే ఇతర చెట్లు, మొక్కల ఆకులను పోలినట్టుగా తన ఆకులను మార్చుకుంటుంది. ఒక్క ఆకారమే కాదు, పరిమాణం, రంగు కూడా మార్చుకోగలగడం విచిత్రం. పలు దక్షిణ అమెరికా దేశాల్లోని అడవుల్లో ఈ తీగ చెట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఒకే తీగపై.. వేర్వేరు ఆకులతో.. ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ తన ఆకులను గుండ్రంగా, చతురస్రాకారంగా, సన్నగా, పొడవుగా భిన్నమైన ఆకారాలు, పరిమాణాల్లోకి.. రంగుల్లోకి మార్చుకుంటున్నట్టు గుర్తించారు. అంతేకాదు ఒకే తీగ చెట్టు ఎక్కడైనా రెండు వేర్వేరు రకాల చెట్లపైకి పాకి ఉంటే.. ఏ చెట్టుపై పాకి ఉన్న భాగంలో ఆ చెట్టు తరహాలోకి ఆకులను మార్చేసుకుంటున్నట్టు తేల్చారు. అంటే ఒకే తీగచెట్టుకు వేర్వేరు ఆకారాలు, రంగులు, పరిమాణాల్లో ఆకులు ఉండటం గమనార్హం. మార్చేసుకోవడం ఎందుకు? చెట్లు, మొక్కలను తినే జంతువులు, కీటకాల నుంచి రక్షణ కోసమే ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ ఆకుల ఆకా రాలను మార్చుకుంటున్న ట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నా రు. జంతువులు, కీటకాలు పెద్దగా ఇష్టపడని, తినని చెట్లు/మొక్కల ఆకుల రూపంలోకి తీగచెట్టు తన ఆకులను మార్చేసుకోవడం దీనికి ఉదాహరణ అని వివరిస్తున్నారు. ఎలా మార్చేసుకుంటోంది? ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగకు ఇతర చెట్లు/మొక్కలతో భౌతికంగా ఎలాంటి అనుసంధానం లేదని.. అయినా ఆకుల రూపాన్ని ఎలా మార్చుకుంటోందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్, కరాస్కో చెప్తున్నారు. అయితే చెట్లు/మొక్కల నుంచి వెలువడే కొన్ని రసాయన సంకేతాల సాయంతో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తన ఆకుల ఆకారాన్ని మార్చుకుంటూ ఉండొచ్చని ప్రతిపాదించారు. అలాకాకుండా కీటకాలు, సూక్ష్మజీవుల ద్వారా చెట్ల జన్యువులు తీగ చెట్టుకు చేరడం.. అనుకరణకు మార్గం వేస్తుండవచ్చని మరో ప్రతిపాదన కూడా చేశారు. తీగ చెట్టుకు కళ్లున్నాయా? శాస్త్రవేత్తలు అలంకరణ కోసం వాడే ఓ ప్లాస్టిక్ చెట్టును తీసుకుని.. దానిపైకి ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ పెరిగేలా చేశారు. ఆ ప్లాస్టిక్ ఆకుల రూపంలోకి కూడా ఈ తీగ చెట్టు ఆకులను మార్చుకుంది. దీనితో జన్యువుల మార్పిడి, రసాయన సంకేతాల వంటి ప్రతిపాదనలు తేలిపోయాయి. ఈ క్రమంలో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’లో కాంతిని గ్రహించే కణాలు ఉన్నాయని.. వాటి సాయంతో ఇతర చెట్లు/ మొక్కల ఆకులను గమనించి (చూసి) మార్చుకుంటోందని కొత్త ప్రతిపాదన వచ్చింది. అయితే చెట్లు చూడటమనే ప్రతిపాదనే అసంబద్ధమని శాస్త్రవేత్త ఎర్నెస్ట్ స్పష్టం చేస్తున్నారు. మరి ఆకులు ఎలా మార్చుకుంటోంది?.. ఇది ఇప్పటికీ మిస్టరీయే.. -
చెట్టు కూలడానికి అధికారుల నిర్లక్షమే కారణమా?
అధికారుల నిర్లక్ష్యం... పాలకుల అలసత్వం ఓ అమాయకుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఎంతో మందికి నీడనిచ్చే భారీ వృక్షానికి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం చుక్క నీరు పీల్చే అవకాశం ఇవ్వకుండా మొదళ్లల్లో కాంక్రీట్‌తో కప్పేశారు. మరో పక్క బిల్డింగ్ యజమాని బిల్డింగ్ మరమ్మతుల సమయంలో ఈ భారీ వృక్షాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బిల్డింగ్ యజమాని, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, హార్టికల్చర్ల నిర్లక్ష్యమే భారీ వృక్షం కుప్పకూలడానికి.. ఆటోడ్రైవర్ మహ్మద్ గౌస్ మరణానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్: హైదర్‌గూడ సిగ్నల్ వద్ద శనివారం భారీ వృక్షం కూలడంతో ఒక్కసారిగా వాహనదారులు, స్థానికులు ఆందోళన చెందారు. చెట్టు కూలిన ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ మూడేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. అప్పట్లోనే ఈ చెట్టును ఇక్కడ నుంచి తరలించేందుకు కాంట్రాక్టర్ స్థానిక రాజకీయ నేతలతో కలసి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. గత ఏడాది ఫుట్‌పాత్ నిర్మాణాల్లో భాగంగా సర్కిల్–16కు సంబంధించిన ఇంజినీరింగ్ విభాగం హిమాయత్‌నగర్ వైజంక్షన్ నుంచి హైదర్‌గూడ చెట్టు కూలిన ప్రాంతం వరకు ఫుట్‌పాత్‌లను నిర్మించారు. కాసులకు కక్కుర్తి పడ్డ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం బిల్డింగ్ యజమానుల మాటలు విని చెట్టు మొదళ్లల్లో మొత్తం కాంక్రీట్ వేసి పూడ్చేశారు. ఒక్క చుక్క నీరు చెట్టు వేర్లుకు తగలకుండా చేశారు. దీనికారణంగా ఏడాదికి పైగా ఒక్క బొట్టు నీటిని పీల్చుకోని ఆ చెట్టు శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే కోవలో మరిన్ని చెట్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయనడం ఏమాత్రం సందేహం లేదు. శనివారం కూలిన చెట్టుపక్కనే మరో చెట్టును కూడా కాంక్రీట్‌తో కూల్చేయడం జరిగింది. దీనితో పాటు మరికొన్ని చెట్లు ఇదేతరహాలో ఉన్నాయి. మొద్దునిద్రలో హార్టికల్చర్ విభాగం... చెట్లను సంరక్షించాల్సిన హారి్టకల్చర్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. బిల్డింగ్ నిర్మాణాలకు భారీ వృక్షాలు అడ్డు వస్తున్న తరుణంలో కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బుకు దాసోహం అవుతున్న హారి్టకల్చర్ ఆయా ప్రాంతాల్లోని చెట్లను కూల్చేస్తున్నారు. సీసీ ఫుటేజీలకు చెట్ల కొమ్మలు అడ్డొస్తున్నాయి. ట్రాఫిక్‌కు విఘాతం కలిగే వాటిని తొలగించాలంటూ పలుమార్లు నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు హారి్టకల్చర్ శాఖలో లేకపోవడం గమనార్హం. -
నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు!
చెట్లు అందించే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే పట్టణాల్లోని చెట్లు ఆ ప్రాంతానికి మరింత ప్రయోజనాన్ని కల్పిస్తాయి. అవేమిటో 12 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉష్ణోగ్రత నియంత్రణ ఒక పెద్ద వృక్షం 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. అది అందిచే నీడ ఆ ప్రాంత ఉష్ణోగ్రతను 30 శాతానికి మించి తగ్గిస్తుంది. 2. శబ్ద కాలుష్యానికి చెక్ చెట్లు 50 శాతం మేరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాహనాలు, నిర్మాణ పనులు, సైరన్లు ఇతరత్రా శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్లు ఆ శబ్దాన్ని నిరోధించడానికి ఉపకరిస్తాయి. ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచడానికి వృక్షాలు దోహదపడగాయి. 3. స్వచ్ఛమైన గాలి చెట్ల నుంచి విడుదలయ్యే గాలి.. హానికరమైన కాలుష్య కారకాలను, టాక్సిన్లను భారీ మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చెట్లు మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. 4. ఆక్సిజన్ అందిస్తూ.. కాలుష్యాలను తరిమికొట్టే చెట్లు మరింత ఆక్సిజన్‌ను కూడా అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి. చెట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి దోహదపడతాయి. 5. నీటి నిర్వహణ చెట్లు మనకు భవనాలకు మించిన ఆశ్రయం కల్పిస్తాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్లు భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. వరదల తీవ్రతను నియంత్రిస్తాయి. వరదలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చెట్లు కాలుష్య కారకాలను గ్రహిస్తాయని, నీటి వనరులను కాపాడుతాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు. 6. మానసిక ఆరోగ్యం పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతి మధ్యలో మెలిగే మనుషులు సంతోషంగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. మన భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనలు మనం ఉంటున్న ప్రదేశాలపై ఆధారపడివుంటాయి. చెట్లు మన మనస్తత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి శాంతియుతంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. 7. శారీరక ఆరోగ్యం చెట్లు గాలి నాణ్యతను మెరుగు పరుస్తాయి. పట్టణంలోని చెట్లతో కూడిన వాతావరణం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చెట్లు విరివిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక మొదలైనవి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. 8. గోప్యత చెట్లు గోప్యతను అందిస్తాయి. ఇంటివాతావరణాన్ని కల్పిస్తాయి. 9. ఆర్థికపరంగా.. పట్టణంలోని చెట్లు అందించే ఆర్థిక ప్రయోజనాలను లెక్కించడం కష్టం. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులకు చెట్లు ఉపకరిస్తాయి. చెట్లను పెంచే ఖర్చు కంటే అవి అందించే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. చెట్లు నగరాలను సంపన్నం చేస్తాయి. 10. వన్యప్రాణులకు ఆవాసం పక్షులు,క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు ఉపకరిస్తాయి. 11. కాంతి కాలుష్యం చెట్లు కాంతి కాలుష్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. చెట్లు ఉన్న నగరాల్లో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 12. ఆహ్లాదాన్ని అందిస్తూ.. చెట్లు అందంగా ఉంటాయి. గ్రేస్కేల్ రోడ్లు, భవనాలు, అంతులేని ట్రాఫిక్ మధ్య చెట్లు ఉపశమనాన్ని కల్పిస్తాయనడంలో సందేహం లేదు. 12 Reasons Why Cities Need More Trees: 1. Temperature Control One large tree is equivalent to 10 air conditioning units, and the shade they provide can reduce street temperature by more than 30%. 2. Noise Reduction Trees can reduce loudness by up to 50%. In urban areas… pic.twitter.com/KRfskttfxx — The Cultural Tutor (@culturaltutor) August 28, 2023 -
మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..
మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. మేకలను, పావురాలను చోరీ చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అహ్మద్‌నగర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాము విచారణ చేపట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారని తెలిపారు. ఈ ఘటన దరిమిలా దీనికి నిరసనగా హరేగావ్లో బంద్ పాటించారు. స్థానిక విపక్ష కాంగ్రెస్ ఈ ఘటనకు బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషమే కారణమని ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25న గ్రామానికి చెందిన నలుగురు దళితయువకుల ఇళ్లలోకి చొరబడిన ఆరుగురు యువకులు బలవంతంగా వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత యువకుల వయసు 20 ఏళ్లకు అటునిటుగా ఉంటుంది. ఆ యువకులు మేకలు, పావురాలు దొంగిలించారని ఆరోపిస్తూ, వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో విపరీతంగా కొట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను యువరాజ్, మనోజ్, పప్పు పార్ఖే, దీపక్, దుర్గేష్, రాజులుగా గుర్తించారు. ఈ నిందితులలో ఒకరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితులను స్థానికులు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితులలో ఒకరైన శుభం మగాడే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితులపై సెక్షన్ 307 (హత్యాయత్నం),360 (కిడ్నాప్), ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ ఈ ఉదంతం మానవత్వానికే మాయనిమచ్చ అని అన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార బీజేపీ దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతా వృక్షం.. రాత్రయితే అంతులేని అందాల విందు!
స్వర్గం ఎంత అందంగా ఉంటుందో మనం అనేక కథల రూపంలో వినేవుంటాం. స్వర్గం నుంచి దిగివచ్చే అప్సరసలు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటారని కొందరు అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా స్వర్గం నుంచి దిగివచ్చిన వృక్షం గురించి విన్నారా? అవును.. ఇప్పుడు మనం స్వర్గపు వృక్షం అంటే పారిజాత వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దివ్య వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ వృక్షానికి ప్రతిరాత్రి రంగురంగుల పూలు వికసిస్తాయి. అవి ఉదయానికి రాలిపోతాయి. ఈ దివ్య వృక్షాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. పౌరాణిక గాథల ప్రకారం సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటు పారిజాత వృక్షం కూడా వెలికి వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ పారిజాతాన్ని తన తన భార్య సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని చెబుతారు. అర్జునుడు మహాభారత కాలంలో ద్వారకా నగరంలోని ఈ వృక్షాన్ని కింతూర్ గ్రామానికి తీసుకువచ్చాడని స్థానికులు చెబుతుంటారు. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గల కింతూర్ గ్రామంలో ఉంది. ఈ పారిజాత వృక్షానికి స్థిరమైన పేరు లేదు. దీనిని హర్సింగర్, షెఫాలీ, ప్రజక్త అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. పారిజాతంనకు బెంగాల్ రాష్ట్ర పుష్పం హోదా కూడా ఉంది. ఈ భారీ పారిజాత వృక్షం ఈ గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రతి రాత్రి ఈ చెట్టుకు చాలా అందమైన పూలు వికసిస్తాయి. ఉదయం కాగానే ఈ పూలన్నీ నేలరాలిపోతాయి. యూపీలోని బారాబంకి జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూర్ గ్రామం మహాభారత కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. పాండవుల తల్లి అయిన కుంతి పేరు మీదుగా ఈ గ్రామం ఏర్పడిందంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఈ గ్రామంలోనే ఉన్నారట. కుంతీమాత ప్రతిరోజూ శివునికి పూలు సమర్పించవలసి వచ్చినప్పుడు, అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు. గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది. ఇతర పూలతో పోలిస్తే పారిజాతం పూలు ప్రత్యేక సమయంలో మాత్రమే వికసిస్తాయి. దీని వెనుక ఇంద్రుని శాప వృత్తాంతం దాగి ఉంది. ప్రపంచం మొత్తంలో పూలు ఉదయం పూస్తుండగా, పారిజాతం పూలు రాత్రి పూట వికసించి, చూపరులకు అందాలను అందిస్తాయి. సత్యభామ ఈ పూలతో తన కురులకు అలంకరించుకునేదని, రుక్మణి ఈ పూలను పూజకు ఉపయోగించేదని చెబుతుంటారు.ఈ తరహా పారిజాత వృక్షం భారతదేశంలోని కింతూర్ గ్రామంలో మాత్రమే కనిపించడం విశేషం. ఇది కూడా చదవండి: తండ్రి బకాయి కోసం.. కుమార్తెతో 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. తుపాకీ చూపించి.. -
చెట్లు నరుకుతుండగా వింత ఘటన
-
చెట్లు నరుకుతుండగా వింత ఘటన.. వీడియో వైరల్
ప్రకాశం జిల్లా: ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చెట్లు నరుకుతుండగా అకస్మాత్తుగా చెట్టులోంచి మంచినీళ్లు వచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో కొంతమంది చెట్లు నరుకుతుండగా, ఓ చెట్టులోంచి అకస్మాత్తుగా మంచినీళ్లు వచ్చాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను సైతం తాగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి.. -
ఏడడుగుల బంధానికి ఏడేళ్ల గుర్తుగా.. చెట్టుకి పుట్టినరోజు..
వికారాబాద్: ఆలుమగల అనుబంధానికి గుర్తుగా మిగిలింది ఆ వృక్షం. భర్త బతుకున్న రోజుల్లో కలిసి నాటిన మొక్క నేడు మానువైనా.. మనువాడినవాడికి తీపపిగుర్తుగా మలచుకొని.. ఆ పచ్చని చెట్టువద్దే ఏటా అతడి జన్మదిన వేడుకలు నిర్వహిస్తోంది ఓ ఇల్లాలు.తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, వెంకటయ్య భార్యభర్తలు. ఏడేళ్ల క్రితం వెంకటయ్య జన్మదినం సందర్భంగా చించోళి రోడ్డు మార్గంలో ఉన్న వారి నివాసం ఎదుట ఇద్దరూ కలిసి ఓ మొక్క నాటారు. ఏడాది తర్వాత వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టువద్దే వెంకటయ్య జయంతి వేడుకలు నిర్వహించే వారు. రోడ్డు విస్తరణలో భాగంగా చెట్టును అక్కడి నుంచి తొలగించాల్సి రావడంతో వేర్లతో సహా చెట్టును తీసుకెళ్లి తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నాటారు. కాగా శనివారం భర్త వెంకటయ్య జయంతి కావడంతో అదే చెట్టు వద్ద భార్య, బంధువులు వేడుకలు నిర్వహించారు. -
అక్కడ అదే ఆచారం.. చిన్న పిల్లల మృతదేహాలను తీసుకెళ్లి
భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. చనిపోయిన వాళ్లు గురించి తలుచుకుని కొందరు బాధపడుతుంటారు. మరొకొందరు వారి గుర్తుగా దానధర్మాలు వంటివి చేస్తుంటారు. ఏదేమైన మనకిష్టమైన వాళ్లని పోగొట్టుకుంటే అది బాధ అని చెప్పడం కంటే నరకమనే చెప్పాలి. అందుకే దీని నుంచి కాస్తైన ఉపశమనం పొందేందుకు ఇండోనేసియా ప్రజలు ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. సాధారణంగా ఎవరైన చనిపోతే.. వాళ్లుని శాస్త్ర ప్రకారం దహనం చేసి అంత్యక్రియలను పూర్తి చేస్తారు. కానీ ఇండోనేసియాలో చనిపోయిన పిల్లలను చెట్ల వేరు కింద పాతిపెడతారంట. వినడానికి వింతగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారట. ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తానా తరోజాలో గ్రామంలో ఎవరి ఇంట్లో అయినా చిన్న పిల్లలు చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించరు. దహన సంస్కారాలు చేపట్టరు. ఎందుకంటే పిల్లలు చనిపోతే.. ఆ తల్లిదండ్రులకు ఎంతగానో బాధను మిగిలుస్తుంది. అది వర్ణనాతీతమనే చెప్పాలి. అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ చిన్నారుల మృతదేహాల్ని చెట్టు కింద మొదలు వేరు బాగంలో పాతిపెడతారు. చనిపోయిన పిల్లవాడు క్రమంగా ఈ చెట్టులోనే భాగమైపోతాడు. ఇలా చేయడం వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టిన చిన్న పిల్లవాడు చెట్టు రూపంలో శాశ్వతంగా జీవిస్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యులు భావిస్తారు. ఇది ఇక్కడి విచిత్రమైన సంప్రదాయం. అయితే పెద్దలు చనిపోయినప్పుడు సాధారణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. చదవండి దుబాయ్‌లో భారత ఆర్కిటెక్ట్ జాక్‌పాట్.. 25 ఏళ్లపాటు, నెలకు రూ.5.59 లక్షలు.. -
నేలకూలిన నూరేళ్ల చెట్టు
మంచిర్యాల: వేమనపల్లి మండంలోని నాగారం గ్రామంలో మంగళవారం ఉదయం భారీ వర్షానికి నూరేళ్ల కాలం నాటి చింత చెట్టు నేలకులింది. వేమనపల్లి–బెల్లంపల్లి మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో నియోజకవర్గం కేంద్రానికి, కాగజ్‌నగర్ వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. త్రీఫేజ్ విద్యుత్ లైన్ తెగిపోవడంతో పంట పొలాలు, గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. ఎంపీవో బాపురావు సూచన మేరకు స్థానిక సర్పంచ్ గ్రామస్తులతో చెట్టు తొలగించే ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి నుంచి కటింగ్ మిషన్ తెప్పించి అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించారు. ట్రాన్స్‌కో ఏఈ దీక్షిత్‌తో మాట్లాడి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించి సరఫరా చేపట్టారు. సాయంత్రం వరకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. -
చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
భద్రాద్రి: అశ్వాపురం మండలంలోని జగ్గారం క్రాస్ రోడ్డు వద్ద మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మణుగూరు డిపోకు చెందిన బస్సు మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తోంది. జగ్గారం క్రాస్ రోడ్డు సమీపంలో మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బస్సుకు ఎద్దు అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి రహదారి కిందకు దిగి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
మహోగని చెట్ల పెంపకం ద్వారా దీర్ఘకాలిక ఆదాయం
-
ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి.. సీఎం నాటిన మొక్కకు హ్యాపీ బర్త్‌డే
సాక్షి, మహేశ్వరం: విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు పయనంలో మన్సాన్పల్లి చౌరస్తా వద్ద తన కాన్వా య్‌ను ఆపారు. నాగారం వైపు వెళ్తున్న బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఏ పాఠశాలలో చదు తున్నారు? బస్సులు సమయానికి వస్తున్నాయా? ప్రభుత్వ పాఠశాలలో బోధన, వసతులు బాగున్నాయా?.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆమె ఫొటోలు దిగారు. కాసేపు బస్సులో ప్రయాణించిన తర్వాత మంత్రి .. తిరిగి తన కారులో హైదరాబాద్ బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...తన ఇంటి వద్ద ఎనిమిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కకు గురువారం పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ చొరవ వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయన్నారు. -వేల్పూర్ అరక పట్టిన అమాత్యుడు నిర్మల్ జిల్లాలో గిరిజనులకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారంగాపూర్ మండలం రవీంద్రనగర్ తండాకు వెళ్లి పోడు భూమిలో ఇలా అరక పట్టి దుక్కి దున్నారు. పోడు భూముల్లో రతనాలు పండించి ఆదర్శంగా నిలవాలని ఆదివాసీ రైతులకు సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ అల‘గెల’గా సాధారణంగా ఒక అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే కాస్తుంది. ఇందుకు భిన్నంగా ఒకే చెట్టుకు రెండు అరటి గెలలు కాశాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ మద్దిపుట్టులో ఓ గిరిజనుడి ఇంటి వద్ద ఈ అద్భుతాన్ని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – హుకుంపేట -
సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత
బిహార్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాయాలపాలైన బాధితున్ని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్ జిల్లాలోని వసుదేవ్పుర్ సరాయ్ గ్రామంలో జరిగింది. సెల్ఫీ తీసుకునే నెపంతో.. సెల్ఫీ తీసుకునే నెపంతో భార్య తన భర్తను చెట్టుకు కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి, నిప్పంటించింది. బాధితుడు అరుపులు పెట్టడంతో ఘటనా స్థలం నుంచి పారిపోయింది. చుట్టుపక్కలవారు చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఘటనకు గల సరైన కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకే భర్తపై భార్య ఈ ఘాతుకానికి పాల్పడిందని గ్రామస్థులు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి:భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్‌లో వెతికిన భార్య -
ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా హర్దా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడిని చేరుకుని విచారణ చేపట్టారు. వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టడంతో ఇటీవలే వివాహమైన జంటతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారని తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతవారమే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో స్లీపర్ బస్సు.. ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. బస్సు అహ్మదాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. చదవండి: Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్ -
చెట్లకు డబ్బులు కాస్తున్నాయ్...!
-
డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ను స్టార్స్టోర్ట్స్లో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌లో ఒక్కో డాట్ బాల్‌ను సదరు బ్రాడ్కాస్ట్ సంస్థ స్కోరుబోర్డులో ఒక్కో చెట్టు గుర్తును చూపించింది. అదేంటి డాట్ బాల్ అనగానే స్కోరు బోర్డును సున్నా కనిపించాలి గాని ఇలా చెట్టు కనిపించడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక బీసీసీఐ చేసిన ఒక గొప్ప ఆలోచన బయటకొచ్చింది. అదేంటంటే.. Green Initiative(పర్యావరణం పెంపొందించడానికి) పేరిట బీసీసీఐ ఒక వినూత్న కార్యం చేపట్టింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్‌లో అన్ని డాట్ బాల్స్‌ను కలిపి 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. బీసీసీఐ ఆలోచనను అభినందించిన స్టార్స్టోర్ట్స్ యాజమాన్యం గుజరాత్, సీఎస్కే ప్లేఆఫ్ మ్యాచ్‌లో నమోదైన డాట్ బాల్స్ స్థానంలో చెట్టు గుర్తును ఉంచేలా ప్రణాళిక రూపొందించింది.ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పర్యావరణాన్ని కాపాడేందుకు బీసీసీఐ చేసిన గొప్ప ఆలోచనను మెచ్చుకుంటున్నారు. Qualifier 1 | #GTvCSK What's that Tree for @JioCinema??#IPLPlayOffs #CricketTwitter pic.twitter.com/TYiOy8tczr — Anika🇮🇳 (@SportsIndia036) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు -
టెక్నాలజీ అదిరింది, మొక్కలకు జబ్బు చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌కు అలెర్ట్ వస్తుంది!
మొక్కలకు, చెట్లకు కూడా రకరకాల జబ్బులు వస్తుంటాయి. తెగుళ్లు సోకుతుంటాయి. వాటిని నయం చేయడానికి మందులు మాకులు వాడుతుంటాం. ఇదంతా అందరికీ తెలిసిన సంగతే! మొక్కలకు వ్యాధులు సోకిన వెనువెంటనే కనిపెట్టడం చాలా కష్టం. కొంత నష్టం జరిగాక గాని, మొక్కల ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకోలేం. అయితే, వాటికి తెగుళ్లు లేదా ఏదైనా జబ్బులు సోకిన వెనువెంటనే ఆ సంగతిని గుర్తించే సాధనాన్ని ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇదొక పలుచని గాజు పలకలాంటి చిన్న ఎలక్ట్రానిక్ ప్యాచ్. దీని పొడవు, వెడల్పులు సమానంగా ముప్పయి మిల్లీ మీటర్లు మాత్రమే! దీనిని ఆకులకు తగిలించి ఉంచితే, ఇందులోని సెన్సర్లు మొక్కలకు సోకిన వ్యాధికారక సూక్ష్మజీవులను, పరాన్నజీవులను, పరిసరాల్లోని కాలుష్యం వల్ల మొక్కలకు ఎదురవుతున్న ఒత్తిడిని, మొక్కల్లోని తేమను, ఉష్ణోగ్రతను కూడా నిర్దిష్టంగా గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని దీనికి అనుసంధానమై ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. దీనివల్ల మొక్కలకు సోకే వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, ఎలాంటి నష్టం జరగకముందే వాటిని కాపాడుకోవచ్చని దీని రూపకల్పనలో కీలకపాత్ర వహించిన ప్రొఫెసర్ యోంగ్ ఝు చెబుతున్నారు. ప్రస్తుతం నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీని పనితీరుపై ఇంకా పరీక్షలు జరుపుతున్నారు. పరీక్షలు పూర్తిగా విజయవంతమైతే, ఇది రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి -
మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
-
మామిడి చెట్టు తెచ్చిన తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని
సాక్షి, హైదరాబాద్: ‘పచ్చని చెట్లు ప్రగతి మెట్లు’ అని నేర్పించాల్సిన టీచర్ బుద్దే వక్రంగా మారింది. ఇంటి మేడ మీద ఆకులు పడుతున్నాయని, చెట్టు వేర్లు గోడ లోపలికి చొచ్చుకుపోతున్నాయని లేనిపోని తగాదాతో తంటాలు తెచ్చుకుంది ఓ రిటైర్డ్ మహిళా టీచర్. చెట్టును కొట్టేయాలని ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించారు. దీంతో మొదలైన గొడవ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే వరకు వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లికాంబ (పేరు మార్చాం) ఎల్బీనగర్లోని ఫతుల్లగూడలో నివాసం ఉంటుంది. ఆమె ఇంటి వెనక ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారి ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మలు, ఆకులు వృద్ధురాలి భవనం మేడ మీద పడుతున్నాయని ప్రతి రోజు అద్దెవాసులతో గొడవ పడేది. దీంతో వారు పలుమార్లు కొమ్మలను కొట్టేశారు. అయినా ఓర్వలేక చెట్టు వేర్లు గోడల్లోపలికి వెళుతున్నాయని మళ్లీ గొడవ పెట్టుకుంది. కిరాయిదారులు వినకపోవడంతో చెట్టును తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోపోవడంతో ఈసారి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. చెట్టుతో తన ఇంటికి నష్టం వాటిళ్లుతోందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. చేసేదిలేక సంబంధిత అధికారులు మామిడి చెట్టును కొట్టేశారు. ఇటీవల అద్దె వసూలు చేసేందుకు ఇంటికి వచ్చిన యజమాని మామిడి చెట్టు కొట్టేసి ఉండటాన్ని గుర్తించి అద్దెవాసులను ప్రశ్నించాడు. వారు అసలు విషయం చెప్పడంతో మల్లికాంబ, ఇంటి యజమాని, అద్దెదారులకు మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరడంతో.. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రిటైర్డ్ టీచర్ వాళ్ల మోహం మీదే తలుపులు వేసి లోపలికి వెళ్లిపోయింది. దీంతో ఇరుగుపొరుగును విచారించిన అధికారులకు ఆమె వైఖరి తెలుసుకుని అవాక్కయ్యారు. కాలనీలోని ప్రతి ఒక్కరితోనూ ఆమెకు తగువులాటేనని, ప్రతి చిన్న విషయానికి దూర్భాషలాడుతుందని చెప్పారు. అద్దెదారుల ఫిర్యాదు మేరకు మలికాంబపై ఎస్సీఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని అరెస్టు చేయకుండా 41–ఏ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఎస్సీఎస్టీ కేసులో చార్జిషీటు దాఖలు చేయాలంటే బాధితులు, నిందితులు ఇరువర్గాల కుల ధ్రువీకరణ పత్రం అనివార్యం. దీంతో పోలీసుల సూచన మేరకు ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆమె ఇంటికి వెళ్లగా.. మీరెవరు, ఎందుకు వచ్చారు. వారిపై విరుచుకుపడింది. దీంతో విస్తుపోయిన అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారని, వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనూ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు. -
చిరుత దాడిలో తప్పించుకుని.. చెట్టెక్కి..
యశవంతపుర(కర్ణాటక): చిరుత దాడిలో తప్పించుకుని చెట్టు ఎక్కిన యువతి జారి కింద పడి గాయపడిన ఘటన రామనగర జిల్లా మాగడి తాలూకా మరళుదేవనపురలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన విజయలక్ష్మీ బుధవారం గొర్రెలు మేపుతుండగా గొర్రెలపై చిరుత దాడి చేసింది. భయంతో విజయలక్ష్మీ చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకుంది. చిరుత వెళ్లి పోయిన తరువాత చెట్టు దిగే క్రమంలో జారికిందపడింది. దీంతో ఆమెకు నడుం విరిగింది. బాధితురాలిని కుటుంబసభ్యులు మాగడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చదవండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు.. -
అయ్యో.. ఉరి తప్పింది కానీ చావు తప్పలేదు!
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): ఓ యువకుడి పాలిట ఉరి తప్పిందనుకుంటే మృత్యువు మరో రూపంలో వచ్చింది. చెట్టుపై ఉరివేసుకుని కొన ఊపిరితో ఉన్న యువకుడిని కిందికి దించుతుండగా జారి పడి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొత్తకొండ బీరయ్య(35) మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత ఉరివేసుకుని చచ్చిపోతానంటూ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు ఎక్కాడు. జనాలు గుమిగూడటంతో...ఎవరైనా చెట్టెక్కితే పైనుంచి దూకుతానంటూ బెదిరించాడు. భార్య, పిల్లలు, గ్రామ సర్పంచ్, బంధువులు అతడిని దిగమని అడిగినా పట్టించుకోలేదు. అంతలోనే చెట్టుకి ఉరి వేసుకున్నాడు. కొనప్రాణం ఉండటంతో గమనించిన గ్రామస్తులు చెట్టు ఎక్కి కిందికి దించుతుండగా జారి నేలపై పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అయి మృతి చెందాడు. మృతునికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు -
నాటిన ప్రతి మొక్క.. చెట్టవ్వాల్సిందే!
సాక్షి, అమరావతి: మొక్కల పెంపకాన్ని మొక్కుబడిగా కాకుండా.. ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వాతావరణం, నేల స్వరూపాలకు తగినట్లుగా మొక్కలను పెంచేలా కొత్త గ్రీనింగ్ పాలసీ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్ని మొక్కలు నాటామనే సంఖ్యకు కాకుండా.. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని అటవీ శాఖ నిర్ణయించింది. గ్రో మోర్ వుడ్.. యూజ్ మోర్ వుడ్(ఎక్కువ కలప పెంచు.. ఎక్కువ కలప ఉపయోగించు) అనే నినాదానికి అనుగుణంగా కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది. గతంలో కలపతో చేసిన వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండేది. దీంతో కలప తరిగిపోయి.. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగింది. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ప్రమాదమని గ్రహించిన ప్రజలు మళ్లీ చెక్క వస్తువుల వైపు చూస్తున్నారు. అలాగే వాతావరణంలో కూడా కర్బన ఉద్గారాలు పెరిగిపోయాయి. పచ్చదనం పెరిగితే తప్ప ఆక్సిజన్ ఉత్పత్తికి వేరే మార్గం లేదని తేలిపోయింది. ఇందుకు తగ్గట్టుగా మొక్కలు నాటే విధానాన్ని ఆధునికంగా, శాస్త్రీయంగా మార్చాలనే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏపీలోనూ ఇందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అడవులతో పాటు వాటి వెలుపల, రోడ్లు, కాలువలు పక్కన, పార్కులు, ఇతర ప్రాంతాల్లో అక్కడి వాతావరణం, నేల స్వభావం, నీటి వనరుల లభ్యత, కలప అవసరాలకు అనుగుణంగా.. ఏ జాతి మొక్కలు నాటాలో నిర్ణయించేలా రాష్ట్ర అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాలో వాణిజ్య నర్సరీలు రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చివేయాలని భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒకటి, రెండు వాణిజ్య నర్సరీలను ఆధునిక రీతిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నర్సరీల్లో స్థానికంగా పెరిగే వృక్ష జాతులు, జన్యుమార్పిడి చేసిన మొక్కలు లభించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో రెండు, మూడు చోట్ల పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యాధునికంగా మొక్కలు పెంచే విధానం, వేగంగా పెరిగే మొక్కలు తదితర కోణాల్లో పరిశోధనలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. సరికొత్తగా పచ్చదనం.. అడవులతో పాటు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో.. ప్రతి చోటా అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఏ మొక్కలు నాటాలి, వాటి నిర్వహణ తదితరాలపై శాస్త్రీయంగా పరిశోధనలు చేయిస్తాం. ఎలాంటి మొక్కలు నాటాలో చెప్పడంతో పాటు.. అవి సక్రమంగా పెరిగేలా చూసేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్త గ్రీనింగ్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో పచ్చదనం పెంపు సరికొత్తగా, నాణ్యంగా ఉండేలా చూస్తాం. – వై.మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
గురువాణి: ఒక్క చెట్టు పెట్టు... పుణ్యం మూటకట్టు
చెట్టు అనేది ఎంత గొప్పది... ఒక మొక్క నాటడం, దానికి నీళ్ళు పోయడం, చెట్టయ్యేదాకా దానిని సంరక్షించడం... అది చెట్టుగా మారిననాడు అది నాటినవాడికి, పెంచినవాడికి, సంరక్షించినవాడికి ఎంత ఫలితం లభిస్తుందనే దానికి మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే... లోకంలో శరీరం కలిగిన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మనుష్యులే కానక్కరలేదు. శరీరం ఉన్న ప్రతి ప్రాణికీ దాని పోషణకు ఆహారం కావాలి. అది సమయానికి పడకపోతే ఆకలికి విలవిల్లాడిపోతాయి. ఆకలి గొప్ప బాధ.. క్షుత్ అగ్ని.. అది అగ్నిహోత్రం, మంట. ఆ మంట తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలేస్తే మొదట ఏది పోతుంది... ధర్మం. ఆకలేసిన వాడికి ధర్మ విచక్షణ ఉండదు. అయ్యా! నా ప్రాణం పోయినా సరే ధర్మాన్ని కాపాడతాను, ఏదీ దొంగిలించను అనడు కదా ! చివరకు తెగించి దొంగతనానికి పాల్పడి అయినా ఆ బాధ తీర్చుకుంటాడు. ఆ మంట అటువంటిది. దహించి వేస్తుంది. అందుకే ఆకలి అన్నది ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మనుష్యులకే కాదు, సమస్త ప్రాణులకూ ఆహారం కావాలి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు... ఆకలితో ఉన్న మనుష్యులకు వారి ఆర్తిని చూసి జాలిపడి ఎవరయినా ఆహారమిస్తారు.. వీటి ఆకలి ఎవరు తీరుస్తారు? చెట్టు. దానికి కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, కాయలు, పళ్ళను కూడా ఇస్తుంది. దానిని ఆశ్రయించి మనుష్యులే కాదు, క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి. దాని బెరడులో చేరిన వందలాది క్రిములు వాటి ఆకలిని అక్కడ తీర్చుకొంటాయి. జంతువులు ఆకులు తింటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడమే కాక కాయలు, పండ్లు తింటాయి. కొన్ని చిగుళ్ళను తింటాయి. ఎన్నో రెక్కల పురుగులు దాని పూలమీద వాలి ఆకలి తీర్చుకుంటాయి. రాలిన కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు భూమిలో కలిసి అక్కడున్న ఎన్నో పురుగులకు ఆహారమవుతాయి. ఒక చెట్టు... ఒక్క చెట్టే ఇన్నింటికి జీవాధారమవుతున్నది. మొక్కనాటిన వాడు, చెట్టుగా చేసినవాడు తరువాత కాలంలో శరీరాన్ని వదిలివేయవచ్చు గాక. కానీ అసంఖ్యాకమైన జీవులకు కేవలం ఆకలి తీర్చడమే కాక, వాటి ప్రాణాలను కూడా నిలబెట్టాడు, ఎన్నో జీవులు సేదదీరడానికి కారణమయ్యాడు. చెట్టు ప్రాణవాయువు వదులుతుంది. ప్రకృతి సమతౌల్యతను కాపాడుతుంది. అది మనుష్యులతోపాటూ అనేక జీవులకు ప్రాణాధారంగా నిలబడుతుంది. అటువంటి మంచి పనికి కారణమయ్యాడు కనుక వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వారి శరీరం పతనమయిన తరువాత దేవతలు స్వాగతం పలికి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెడతారట. అంతేకాదు ఎన్నో ప్రాణులకు కొన్ని సంవత్సరాల పాటు ఆకలిబాధ తీర్చాడు కనుక వారిని మేం సేవిస్తాం అని దేవతలు అంటారట. చెట్లను పెంచే పనిని ప్రోత్సహించడానికి, మనుషులు తమకే కాకుండా సమస్త జీవకోటిపట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి, ప్రకృతి సమతుల్యత కాపాడేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన పూర్వీకులు‘‘యావంతి ఖాసంతి ఫలాని వృక్షాత్ క్షుద్వహ్ని దగ్ధా ...’’ అంటూ ఒక శ్లోకం ద్వారా చేసిన ధర్మబోధ ఇది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అత్యంత ఎత్తైన వృక్షం... ఫలించిన మూడేళ్ల నిరీక్షణ
బ్రెజిలియన్, బ్రిటిష్ పరిశోధకులు బృందం 2019లో త్రీడీ మ్యాపింగ్ ప్రాజెక్టు అధ్యయనంలో భాగంగా ఉపగ్రహ చిత్రాల్లో ఒక అత్యంత ఎత్తైన చెట్టును కనుగొన్నారు. దీంతో వారిలో ఆ చెట్టు గురించి ఏదో తెలియని కుతుహలం కలిగింది. ఎలాగైనా ఆ చెట్టు గురించి తెలుసుకోవాలి, అక్కడకు చేరుకుని ఆ చెట్టును చూడాలి అని పరిశోధకులు అనుకున్నారు. ఈ మేరకు శాస్తవేత్తల బృందం ఈ చెట్టుని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అడవుల్లో ఉన్నట్లు గుర్తించింది. ఇది ఎంజెలిమ్ వెర్మల్హో అని పిలిచే డినిజియా ఎక్సెల్సా చెట్టు. ఈ చెట్టు ఎత్తు 30 అంతస్థుల భవనం అంత ఎత్తు ఉంటుంది. ఈ చెట్టు వద్దకు వెళ్లేందుకు శాస్తవేత్తలు మూడేళ్లుగా అనేక రకాలుగా ప్లాన్లు వేశారు. అందుకోసం సుమారు ఐదుసార్లకు పైగా అమెజాన్ అడవుల్లో పర్యటించారు. ఎట్టకేలకు సెప్టెంబర్17న ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. ఇది దట్టమైన అమెజాన్ అడవుల్లో ఉండటం వల్ల చేరుకోవడం కష్టమైంది. దాదాపు రెండు వారాలకు పైగా ట్రెక్కింగ్ చేసి ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. ఇది 400 ఏళ్ల నాటి పురాతనమైన చెట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ చెట్టు 9.9 మీటలర్ల చుట్టుకొలతతో దాదాపు 290 అడుగుల పొడవు ఉంది. ఇలాంటి చెట్లను పర్యవేక్షించడం, దానిలో దాగున్న ప్రత్యేక లక్షణాలు, జరిగే పర్యావరణ ప్రక్రియలపై అధ్యయనం చేయనున్నట్లు శాస్తవేత్తల బృందం వెల్లడించింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా) -
ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం. న్యూజిలాండ్‌కు దక్షిణాన దాదాపు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంప్‌బెల్ దీవిలో ఉందిది. ఈ చిన్నదీవిలో విచిత్ర వాతావరణం ఉంటుంది. ఈ దీవిలో ఏడాదికి 325 రోజులు వర్షం కురుస్తూనే ఉంటుంది. ఏడాదిలో చాలారోజులు రోజులో గంట సేపు మాత్రమే సూర్యుడు కనిపిస్తుంటాడు. ఇక్కడ ఏడాదిలో ఎక్కువ రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతూ ఉంటుంది. ఈ దీవిలో కొన్నేళ్ల కిందట నాటిన ‘సిట్కా స్ప్రస్’ వృక్షం 120 ఏళ్లుగా ఈ దీవిలో ఒంటరిగానే ఉంది. ఈ దీవిలో ఎటుచూసినా గడ్డి, చిన్నా చితకా మొక్కలు తప్ప మరో భారీ వృక్షమేదీ కనిపించదు. ఈ వృక్షానికి ఒక అరుదైన విశేషం కూడా ఉంది. దీనికి చేరువలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భూభాగాల నుంచి, వాటికి దక్షిణాన ఉన్న సముద్రం నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్లో పది శాతం ఉద్గారాలను ఈ ఒక్క వృక్షమే పీల్చేసుకుంటుంది. భూతాపం వల్ల తలెత్తుతున్న వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో ఈ వృక్షం కీలకంగా ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చదవండి: 1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి -
హెటెక్ మొక్కల కుండీ..చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది హైటెక్ మొక్కల కుండీ. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఏకకాలంలో ఇరవై ఒక్క రకాల మొక్కలను పెంచుకునే వీలుంది. ఇందులోని నాటిన మొక్కలకు ఈ కుండీ తానే స్వయంగా కావలసిన నీరు, పోషకాలు అందిస్తుంది. సూర్యకాంతి అవసరమైన సమయంలో దీనిపైన ఉన్న రూఫ్‌లో అమర్చిన ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఇందులో పెరిగే మొక్కలకు ఎలాంటి మట్టి అవసరం లేదు. మట్టి, బురద బెడద లేకుండానే ఇందులో వేసిన మొక్కలు ఇట్టే పెరిగిపోతాయి. హెటెక్ కుండీలను తయారుచేసే బహుళజాతి సంస్థ ‘లెట్‌పాట్’ ఈ కుండీని ‘ఎల్‌పీహెచ్–మ్యాక్స్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే, బ్లూటూత్ ద్వారా ఇందులోని మొక్కల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ‘స్మార్ట్ హైడ్రోపోనిక్ ప్లాంట్ కల్టివేటర్’. మనుషుల ప్రమేయం పెద్దగా అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. దీని ట్యాంకును నీటితో నింపి, ఫ్రిజ్ మాదిరిగా ప్లగ్ పెట్టి, ఆన్ చేసుకుంటే చాలు. మరేమీ చూసుకోనక్కర్లేదు. ఇందులో పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలను భేషుగ్గా పెంచుకోవచ్చు. దీని ధర 329 డాలర్లు (సుమారు రూ.27 వేలు) మాత్రమే! -
Pillalamarri: ఆసియాలోనే రెండో పెద్ద వృక్షం
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో ఉన్న పిల్లలమర్రి ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద వృక్షం అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని పిల్లలమర్రిని ఆయన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో హరితహారం విజయవంతమైనందుకే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఈ మంచి కార్యంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రోత్సహిస్తున్నారన్నారు. వివిధ కారణాల వల్ల మర్రి వృక్షం చనిపోయే దశకు రాగా కలెక్టర్లు, అటవీశాఖ తదితర శాఖల సహకారంతో పునర్జీవం ఇచ్చారన్నారు. జిల్లాలో గతేడాది 2 కోట్ల విత్తన బంతులను తయారు చేసి డ్రోన్ ద్వారా గుట్టలు, కొండలలో, బంజరు భూములలో చల్లించామన్నారు. అంతే కాక విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించామని, ఈ సంవత్సరం కూడా చల్లుతున్నామని తెలిపారు. అపురూపంగా చూసుకోవడం సంతోషం గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలమర్రి అభివృద్ధికి తనవంతుగా ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్లో సైతం పేర్కొన్నారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని అపురూపంగా చూసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రితో కలిసి పిల్లలమర్రి చెట్లు ఎక్కిన ఫొటోను ట్విటర్‌కు ట్యాగ్ చేశారు. వివిధ కారణాలతో పూర్తిగా పాడైపోయే దశకు చేరుకున్న పిల్లలమర్రి వృక్షానికి సెలైన్లు ఎక్కించి బతికించడమే కాక ప్రతి వేరును అభివృద్ధి చేస్తున్న మంత్రిని, అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర క్రీడా అధికార సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారు 'మేషువా'.. ‘అల్లూరి’ జిల్లాలో అరుదైన వృక్షాలు
హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో తూర్పు కనుమల్లో పలు చోట్ల ఔషధ గుణాలున్న అరుదైన మేషువా ఫెరే చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ చెట్లను గిరిజనులు ఉప్ప, బంగారం చెట్లుగా పిలుస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బంగారం గరువు అనే చిన్న గ్రామంలో సుమారు 25 ఎకరాల్లో 1,500 చెట్లున్నాయి. ఈ చెట్ల వల్లే అక్కడ ఉన్న గ్రామానికి బంగారం గరువు అని పేరొచ్చింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,050 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వృక్ష జాతి వైద్య, వాణిజ్య పరంగా చాలా విలువైంది. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఇవి చిగురిస్తాయి. ఆసక్తికర విషయమేంటంటే ఈ చెట్లు చిగురించేప్పుడు వాటి ఆకులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఆకులు మొదట లేత ఎరుపు రంగు, తర్వాత గోధుమ రంగు, ఆ తర్వాత లేత ఆకుపచ్చ రంగు, చివరిగా పూర్తి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. వీటి పువ్వులు తెలుపు రంగులో పెద్దవిగా ఉంటాయి. వీటిని గిరిజన స్త్రీలు అలంకరణ కోసం వినియోగిస్తారు. మంచి సువాసన ఉండటంతో వాణిజ్య పరంగా సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ చెట్లను గిరిజనులు నరకరు ఈ పువ్వులు ఫలదీకరణం చెంది పూర్తి ఫలాలుగా మారేందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఒక్కో ఫలంలో ఒకటి నుంచి నాలుగు గింజలుంటాయి. ఇవి నూనె స్వభావం కలిగి ఉండటం వల్ల కాల్చినప్పుడు కొద్ది సమయం పాటు వెలుగుతాయి. గతంలో ఈ గింజలను అక్కడి గిరిజనులు వెలుగు కోసం వినియోగించేవారు. వీటి నుంచి తీసిన నూనెను తలకు రాసుకోవడానికి, దీపాలు వెలిగించేందుకు, చర్మ వ్యాధుల నివారణకు వినియోగిస్తారు. ఈ చెట్లు ఉన్న స్థలంలో పూర్వం నుంచి ఓ ఆలయం ఉంది. ఆలయంలో ఉన్న దేవతను గంగమ్మగా కొలుస్తారు. ఆ ప్రాంతంలో జాతర నిర్వహిస్తారు. ఈ స్థలాన్ని అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ వృక్షాలను నరికేందుకు గిరిజనులు ఇష్టపడరు. అయితే ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ చెట్లను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. అత్యంత ఔషధ గుణాలున్న ఉప్ప చెట్లను పరిరక్షించాల్సిన అవసరముంది. ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి – డాక్టర్ సమరెడ్డి శ్రావణ్‌కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్,ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కృషి దేశంలోనే అరుదైన ఉప్ప చెట్లు ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో చర్చించాం. సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పర్యాటక ప్రాంతంబబగా అభివృద్ధి చేస్తాం. – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే -
గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం
వైరల్: గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో ఓ భారీ వృక్షాన్ని నేల్చకూల్చగా.. అంతకాలం ఆ చెట్టు మీద గూళ్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి. అంతకంటే బాధాకరం ఏంటంటే.. పాపం ఆ చెట్టు కిందే నలిగి కొన్ని చనిపోవడం. వైరల్ అయిన ఈ వీడియో.. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు, పిల్ల పక్షులు మాత్రం సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి. అక్కడున్న చాలామంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు. It not about road widening.. It’s about “how we treat other living-beings on earth..” Hope concerned authorities must have taken needful legal action..#wilderness #UrbanEcology #nature #ConserveNature pic.twitter.com/aV16cIWmo8 — Surender Mehra IFS (@surenmehra) September 2, 2022 చెట్టు నెలకొరిగాక.. చనిపోయిన పక్షుల్ని బాధతో ఒకవైపుగా వేశారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారో అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే.. ఈ ఘటన ఆగష్టు తొలివారంలోనే కేరళ మలప్పురం జిల్లా తిరురంగడి వీకే పడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. క్రూరమైన ఈ పనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని కోరారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి తన అసంతృప్తి వెల్లగక్కారు. అటు ఇటు తిరిగి ఈ వీడియో కాస్త గడ్కరీ కార్యాలయానికి చేరింది. దీంతో.. Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij — Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం స్పందించింది. విషయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దాకా వెళ్లిందని, ఆయన వీడియో చూసి విచారం వ్యక్తం చేశారని తెలిపింది. సేవల్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ మూమెంట్ సీఈవో థామస్ లారెస్స్ ఫిర్యాదు మేరకు.. స్వయంగా స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను, బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను, స్థానిక అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ విభాగం స్పందించింది. ఆ చెట్టు కూల్చివేతలకు అనుమతులు లేకపోవడంతో జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేరళ అటవీ పరిరక్షణ శాఖ మంత్రిణేకే ససీంద్రన్ ఈ ఘటనను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తమ అనుమతులు లేకుండానే ఈ ఘటన జరిగిందని ఆయన నేషనల్ హైవేస్ అథారిటీపై ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: మనిషి జీవితం నీటి బుడగ.. అందుకు ఉదాహరణే ఈ వీడియో -
వింత చెట్టు: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో వైరల్
చెట్లు గాలి పీల్చుకుంటాయని అవి కార్బన్డయాక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ వదలుతాయని విన్నాం. ఔనా! కానీ చెట్టు గాలి పీల్చుకుంటాయనే తెలుసు తప్ప కళ్లతో చూడలేం కదా. వృక్షశాస్త్ర పితామహుడు జగదీష్ చంద్రబోస్ లాంటి శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా చెట్టు గాలి పీల్చుకుంటాయని పరిశోధనల్లో వెల్లడించారని మనం చిన్నానాటి పుస్తకాల్లో చదివిన జ్ఞాపకమే తప్ప. వాస్తవంగా కుదరదు. ఒకవేళ ఏమైన శాస్త్రవేత్తల సమక్షంలో ప్రత్యేకమైన పరికరాల సాయంతో చూడవచ్చునేమో మరీ. కానీ ఇక్కడొక చెట్టు మాత్రం మనుషులు గాలి పీల్చుకుంటున్నట్లు ఎలా తెలుస్తోందో అలా ఈ చెట్టును చూస్తే నేరుగా తెలిసిపోతుంది. వివరాల్లోకెళ్తే...కెనడాలో కాల్గరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాల్గరీలో గంటకు 70 కిమీ వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు వచ్చాయి. ఆ విపత్తు అనంతరం ఒక వ్యక్తి ఏదైనా చెట్టు పడిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయా? అని చెక్ చేయడానికి అడవిలోకి వచ్చినప్పుడూ ఈ వింత చూసినట్లు పేర్కొన్నాడు. ఆ చెట్టు పెద్దగా పగ్గుళ్లు వచ్చి గాలి వీచినప్పుడల్లా గాలి పీల్చుకుంటున్నట్లు ఉందని వివరించాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా ఈ వీడియోకి ఐదు మిలియన్ల వ్యూస్, నాలుగు వేల లైక్‌లు వచ్చాయి. మీరుకూడా ఓ లుక్కేయండి. (చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!) -
భార్యను ఏడు గంటల పాటు చెట్టుకి కట్టి...చిత్రహింసలకు గురి చేసి...
చిన్న అనుమానం తలెత్తిన భార్యలపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. వాస్తవం తెలుసుకునేందుకు యత్నించకుండా ఇరు జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మహిళల భద్రతకై ఎన్ని చట్టాలను ప్రభుత్వ యంత్రాంగం తీసుకువచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయలేక పోతున్నాం. ఇక్కడొక వ్యక్తి అలానే కట్టుకున్న భార్య పై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే....రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఓ మహిళను ఆమె భర్త, భర్త తరుపు ఇతర బంధువులు ఆమెను చెట్టుకి కట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ మహిళ దెబ్బలకి తాళలేక కేకలుపెడతూనే ఉంది. అసలేం జరిగిందంటే ఆమెను తన స్నేహితుడితో ఉండటం చూసిన సదరు వ్యక్తి ఆగ్రహవేశాలకు లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో కనిపించిన వ్యక్తిని కూడా చెట్టుకు కట్టి ఇలానే హింసించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీజేపీ నేతలు రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల ఎక్కుపెట్టారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) రాజస్తాన్ డీజీపీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయడమే కాకుండా బాధితురాలికి తగిన వైద్యం అందించి, భద్రత కల్పించాలని అధికారులను కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి భర్త, బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ ) -
Viral Video: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!
Lion Hangs From A Tree: జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలను చూశాం. క్రూరమృగాలైన సైలెంట్‌గా ఉన్నాయని వేలాకోళం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఒక్కోసారి ఆ క్రూరమృగాలు కూడా టైం బాగోకపోతే చిన్న జంతువులకు భయపడాల్సిందే. చలి చీమల చేత చచ్చిన పాము మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే ఒక అడవిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింహాలను అడవికి రాజు అంటారు . అలాంటి సింహాన్ని చూసి ఏ జంతువైన భయంతో పరిగెడుతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సింహమే భయంతో చెట్టెక్కింది. అసలేం జరిగిందంటే.. అడవి గేదేల మందను చూసి సంహం ఒక్కసారిగి బిత్తరపోయి భయంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. పైగా అక్కడకు దగ్గరలో ఉన్న చెట్టెక్కి బిక్కుబిక్కు మంటూ వేలాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్న గేదెల మంద ఆ సింహ ఎప్పుడూ కిందకు దిగుతుందా అన్నట్లుగా ఆ చెట్టు చుట్టూ చేరి చూస్తున్నాయి. ఈ ఘటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by wild animal shorts (@wild_animal_shorts_) (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం) -
వామ్మో.. చుక్క పడకపోతే ఎలా... కరోనా టీకా వద్దంటే వద్దు..
ఈ ఫోటోలో చెట్టెక్కి కూచున్న వ్యక్తి పేరు ముత్తువేల్. పుదుచ్చేరి వాసి. కరోనా టీకా తీసుకోవడానికి నిరాకరిస్తూ ఇలా చెట్టెక్కి కూర్చున్నాడు. పుదుచ్చేరిలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అందరికీ టీకాలు వేస్తున్నారు. వారిని చూడగానే ముత్తువేల్ ఇదిగో ఇలా చెట్టేక్కాశాడు. ఇదివరకు కూడా అతనిలాగే టీకా తీసుకోకుండా తప్పించుకున్నాడని అధికారులు తర్వాత గుర్తించారు. చదవండి: రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్‌కి అధికం సూది మందు అంటే భయం కాబట్టి ఇలా చేశాడనుకుంటున్నారేమో! అసలు విషయం అది కాదు... కరోనా టీకా తీసుకుంటే కొద్దిరోజులు మద్యం జోలికి వెళ్లొద్దని ముత్తువేల్‌కు చెప్పారు. వామ్మో... చుక్క పడకపోతే ఎలా... అని టీకా వద్దంటే వద్దంటున్నాడు. అరోగ్య కార్యకర్తలు ఎంత బతిమిలాడినా కిందకు దిగలేదు. వారు వెళ్లిపోయిన తర్వాతే దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
తగ్గేదేలే! చిరుతను చెట్టెక్కించిన ఏనుగు.. ఫోటోలు వైరల్
ఇక్కడ చిరుతపులి గజగజమంటోంది మనలా చలికి కాదండోయ్.. తనని తరుముకొచ్చిన గజరాజుని చూసి భయపడి.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు కదా. అయితే ఆ గొప్పోళ్ల జాబితాలో ఈ చిరుత ఉన్నట్లు లేదు.. అందుకే.. వేట కోసం బయలుదేరి.. తీరా వెళ్లకవెళ్లక ఏనుగుల గుంపు జోలికి పోయింది. దాని దురదృష్టానికి తగ్గట్లు ఆ వెళ్లిన గ్రూపులో ఇలాంటి తిక్క ఏనుగు కూడా ఉంది. అది ఊరుకుంటుందా.. వార్నింగ్ ఇవ్వడంతో సరిపెట్టకుండా.. ఉరుకులెత్తించింది. చదవండి: కోడి, గుర్రపు పందేలు తెలుసు కానీ.. పందుల పోటీలు గురించి విన్నారా ఏనుగులకు చెట్లెక్కడం రాదు కాబట్టి ఇదిగో ఇలా బతికి బట్టకట్టింది. లేకుంటే.. బతుకు బస్టాండు అయిపోయేది. దక్షిణాఫ్రికాలోని నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో ఉన్న రిజర్వు పార్కులో చోటుచేసుకున్న ఈ సన్నివేశాన్ని ఫొటోగ్రాఫర్ కెవిన్ డూలే క్లిక్‌మనిపించారు. చెట్టెక్కింది కదా అని ఈ ఏనుగు చిరుతను అంత ఈజీగా వదిలేయలేదట. దాదాపు గంటపాటు అక్కడే ఉండి.. రకరకాల విన్యాసాలతో చిరుతకు చుక్కలు చూపించిందట. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!
కొంతమంది పర్యావరణం కోసం ఎంతలా పాటుపడతారంటే తమ జీవితం మొత్తం ధారపోసేలా శ్రమిస్తారు. ఆహర్నిసలు మొక్కలు పెంచుతూ ఒక అడవినే తయారు చేసి అవార్డులు పొందిన మహామహుల్ని చూశాం. అంతేకాదు సుందర్లాల బహుగుణ చిప్కో ఉద్యమానికి యావత్తు దేశం ఆకర్షింపబడటమే కాక చాలామంది అదేబాటలో నడిచినవాళ్లు కూడా ఉన్నారు. అచ్చం అలానే మెక్సికన్ దేశంలోని మహిళా పర్యావరణ ప్రేమికులను ఆదర్శంగా తీసుకుని యూకేకి చెందిన ఒక మహిళ ఒక విన్నూతమైన పనికి శ్రీకారం చుట్టింది. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలి!...అని పిటిషన్ దాఖలు చేసినందుకు రూ లక్ష జరిమానా!!) అసలు విషయంలోకెళ్లితే...యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ 2019లో చాలా ఏళ్ల నాటి పెద్ద వృక్షాన్ని పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన ఇంటిపేరును ఎల్డర్‌గా మార్చుకుంది. పైగా వారానికి ఐదు సార్లు చెట్టును సందర్శిస్తానని కూడా చెబుతుంది. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులందర్నీ ఇంట్లో వదిలి బాక్సింగ్ డేని తన బెటర్ హాఫ్‌తో గడపాలని ప్లాన్ చేసుకుంటుందట. అయితే రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా కేట్ ఆ పార్క్‌లోని ఆ మహా వృక్షాన్ని వివాహం చేసుకుంది. అంతేకాదు చాలా ఏళ్ల క్రితం ల్యాండ్ క్లియరెన్స్ కోసం చట్టవిరుద్ధంగా చెట్టను నరకడాన్ని వ్యతిరేకించి చెట్లను వివాహం చేసుకున్న మెక్సికన్ మహిళలు తనకు ఆదర్శం అని కేట్ చెప్పింది. పైగా తాను పెళ్లి చేసుకోవాలనుకునే చెట్టుని వెతకడానికే ఆ పార్క్‌ని సందర్శించానని కూడా చెబుతోంది. అంతేకాదు కేట్ ఆ చెట్టుతో కలిసి మూడో క్రిస్మస్ని జరుపుకోనున్నట్లు చెప్పింది. ఈ మేరకు కేట్ పండుగ కోసం చెట్టును పుష్పగుచ్ఛం, టిన్సెల్, బాబుల్స్‌తో కూడా అలంకరించింది. పైగా కేట్ తన క్రిస్మస్ కార్డులపై 'విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్' అని సంతకాలు కూడా చేసింది. కేట్ కుటుంబ సభ్యులు స్నేహితులు ఆమె వివాహానికి పూర్తిగా మద్ధతు ఇవ్వడం విశేషం. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) -
చెట్టు మీద చెట్టు.. ఎలాంటి కనికట్టు లేదు ఒట్టు..
పాములపాడు(కర్నూలు): ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు. అక్కడక్కడ కొన్ని ఆశ్చర్యాలు.. పాములపాడు మండలం ఎర్రగూడూరు సమీపంలో ఓ వింత ప్రజలను ఆకర్షిస్తోంది. కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారికి పక్కన మర్రి చెట్టుపై తాటి మొక్క మొలచి, వృక్షంగా వృద్ధి చెందింది. ఎలాంటి కనికట్టు లేకుండా కొన్నేళ్లుగా చెట్టుమీద చెట్టు నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదవండి: గుడిసె.. అందాలు మెరిసె.. -
సిగరెట్ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది
ఇటీవల కాలంలో కొన్ని అనూహ్య ప్రమాదాల్లో చాలా మంది వెట్రుక వాసిలో తప్పించుకుంటున్న ఉదంతాలను చాలా చూశాం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తికి ఉన్న చెడ్డ అలవాటే అతని ప్రాణాన్ని కాపాడింది. (చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!) అసలు విషయంలోకెళ్లితే... అర్వెన్ తుఫాను యూకేలోని అనేక ప్రాంతాలను వర్షం ముంచెత్తడంతో ముగ్గురు వ్యక్తుల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ తుపాన్ వస్తున్న సమయంలో బ్రిడ్జెండ్‌లోని ఒక పబ్ మేనేజర్ చెరిల్ పౌండ్ అనే 55 ఏళ్ల మహిళ పబ్‌ని మూసి వేసేద్దామనకుని అక్కడ ఉన్న టేబుల్స్ అన్నింటిని శుభ్రం చేస్తూ ఉంది. అయితే కాసేపు విరామం తీసుకుని సిగరెట్ కాల్చుకున్నాక మిగతా టేబుల్స్‌ని శుభ్రం చేద్దామనుకుంది. దీంతో ఆమె ఆ పబ్‌లో ఉన్న టేబుల్స్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి సిగరెట్ కాల్చుకుంటుంది. అంతే ఒక్కసారిగా అక్కడ ఉన్న టేబుల్స్ అన్నింటిపై ఒక పెద్ద వృక్షం పడింది. ఆమె గనుక విరామం తీసుకోకుండా అక్కడ క్లీన్ చేస్తూ ఉండి ఉంటే ఆమె చనిపోయి ఉండేది. అంతేకాదు ఆ చెట్టు ఆమెకు అంగుళం దూరంలోనే పడటం గమనార్హం. (చదవండి: ఐఏఎస్ ఆఫీసర్‌నంటూ.... బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌కి టోకరా) -
ఇదో వెరైటీ చెట్టు.. తాకితే స్పందిస్తుంది..కితకితలు పెడితే నవ్వుతుంది.. ఎక్కడో తెలుసా?
Laughing Tree In Kaladhungi Forest: ప్రకృతి మనకిచ్చిన వరం చెట్లని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అవి మానవ మనుగడకు చాలా ఉపయోగపుడతుంటాయి. అయితే చెట్ల ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే. కానీ అవి కూడా మనుషుల్లానే స్పందిస్తాయని, తాకినా కదులుతాయని, కితకితలు పెడితే నవ్వుతాయని ఉత్తర ప్రదేశ్‌లోని నైనిటాల్ జిల్లాలోని స్థానికులకు మాత్రమే తెలుసు. అసలా కథేంటంటే.. గడ్డి మైదానాల్లో పెరిగే ఈ రకమైన చెట్టును మొదటిసారిగా శాస్త్రవేత్త జెస్సే బోస్ కనిపెట్టారు. ఇవి మనుషుల సైగలను బట్టి స్పందిస్తాయి. కానీ మనం ఆ స్పందనలను చూడలేమని జెస్సే బోస్ తెలిపినట్లు కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ డీఎఫ్ఓ యశ్వంత్ చెప్పారు. అయితే మనుషులు నవ్వినప్పుడు సౌండ్ వచ్చినట్లు ఈ చెట్లు నవ్వినప్పుడు సౌండ్ రాదట. కానీ వాటి ప్రవర్తనను మనం చూడగలమని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నైనిటాల్ జిల్లాలోని కలదుంగి అడవిలో చెట్టును తాకడం, చక్కిలిగింతలు పెట్టడం లేదా నొక్కడం వంటి చేసినప్పుడు అది చేసే ప్రవర్తన కారణంగా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ చెట్టును గురించి అక్కడి స్థానికులు మాట్లాడుతూ.. చెట్టు చక్కిలిగింతలు పెడితే నవ్వుతుందని అందుకే దానికి 'లాఫింగ్ ట్రీ' అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇలాంటి వింత,అరుదైన చెట్లు అంతరించిపోతున్న జాతులలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చెట్ల సంఖ్యను పెంచేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని, ఎందుకంటే ఆ చెట్టు గింజలు, కాండాలను పాతిపెట్టి కొత్త మొక్కలు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ చెట్టుకి గ్రాఫ్టింగ్ ప్రక్రియలో కొత్త మొక్కలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అటవీ అధికారులు తెలిపారు. చదవండి: Queen Elizabeth Purple Hands: రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. అసలు నిజం బయటపెట్టిన వైద్యులు -
ఆ చెట్లకి డై బ్యాక్ వ్యాధి.. ఆందోళనలో అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేప చెట్లు డై బ్యాక్ వ్యాధితో ‘ఫోమోప్సిస్ అజాడిరిక్టే’అనే శీలీంధ్రం సోకి ఎండిపోయి, చనిపోతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. దేశ కల్పతరువు, సహజ సంజీవిని, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య మంజరి అయిన వేప నేడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నందున దీన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. ఈమేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు తమ సామాజిక బాధ్యతగా ఉద్యమించి వేప చెట్టుకు జీవం పోసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. కార్బెండిజమ్ (50 శాతం డబ్ల్యూపీ) మందును లీటర్ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిచేలా పోస్తే వేర్లు, కాండం మొదలులో ఉన్న శీలీంధ్రాన్ని.. ఈ మందు సమర్థవంతంగా అరికడుతుందని పేర్కొంది. ఏడు రోజుల తర్వాత థయోఫనేట్ మిథైల్ (70 శాతండబ్ల్యూపీ) మందును లీటర్ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిసేలా పోస్తే చెట్టు మొత్తానికి ఈ మందు చేరుకుని శీలీంధ్రాన్ని నాశనం చేస్తుందని తెలిపింది. ఇది మార్కెట్లో రోకో, థెరపీ తదితర పేర్లతో దొరుకుతుందని పేర్కొంది. 20 రోజుల తర్వాత మూడోచర్యలో భాగంగా ప్రోఫినోపాస్ మందును లీటర్ నీటిలో 3 మి.లీ. కలిపి చెట్టు మొదలు తడిచేలా పోయాలని తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది. చదవండి: Hyderabad: మాకొద్దు సారూ ఈ తిండి..! చారు నీళ్లలాగా.. కూరలు చారులాగా, గుడ్ల సంగతి సరేసరి.. -
1400 ఏళ్ల నాటి ‘బంగారు’ వృక్షం ఎక్కడుందో తెలుసా..!
బీజింగ్: చెట్టుకు బంగారం కాసిందా అన్న భ్రాంతిని కలిగిస్తోన్న ఈ చిత్రం 1,400 ఏళ్లనాటి గిన్‌కోగో వృక్షానిది. ప్రతి నవంబర్‌లో ఆకు రాల్చే ఈ చెట్టు.. ఆ నేలంతా పసడివర్ణ శోభితం చేస్తుంది. చైనాలో హోంగన్ మౌంటైన్స్‌లోని గు గునిన్ బుద్ధిస్ట్ టెంపుల్ ఆవరణలో ఏటా కనిపించే దృశ్యమిది. ఆలయంతోపాటు ఈ పసుపు వన్నె సోయగాన్ని చూసేందుకే ప్రత్యేకంగా వస్తుంటారు జనం. ఎన్నెన్ని వర్ణాలో ప్రకృతి ఒడిలో! రుతువు రుతువుకో రంగు! రాలిపోవడం, చిగురించడం... సహజం! -
చెట్టుకి పోస్టర్ అంటించిన మావోయిస్టులు.. క్షణం క్షణం భయంగా గడుపుతున్న జనం
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి, కుముడాబల్లి వంతెన దగ్గరి ఓ చెట్టుకి మావోయిస్టులు ఓ పోస్టరు అతికించారు. నాగావళి–గుముసుర డివిజన్ మావోయిస్ట్ పార్టీ పేరిట మంగళవారం కనిపించిన ఈ పోస్టరుని చూసి, అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టరు నకళ్లు సైతం గ్రామంలోని ఐదు ప్రాంతాల్లో దర్శనమివ్వడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కరువైందని మావోయిస్టులు ఆరోపించారు. కలహండి జిల్లా, గోలముండ పరిధి, మహాలింగ సన్‌షైన్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ మమిత మెహర్ హత్యకు గురికావడం దారుణమని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మమిత హత్య కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని, శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందజేయాలని మావోయిస్టులు పోస్టర్లలో కోరారు. ఇదే విషయంపై స్పందించిన పోలీస్ అధికారులు ఇటువంటి గాలి వార్తలకు భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే భర్త పైశాచికత్వం.. కట్టుకున్న భార్యను ముసలోడికి.. -
The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే..
చెట్లు పలికే స్వరమాధుర్యాన్ని ఎప్పుడైనా విన్నారా? చెట్లు పాటలు పాడటమేంటి? ఇదేం పిచ్చి ప్రశ్న అని కోప్పడిపోకండి. చెట్టు పలికే వాయుగీతాన్ని వినాలంటే మీరు ఇంగ్లాండ్ వెళ్లాల్సిందే. అక్కడ లాంకషైర్ కౌంటీలోని బర్న్లీ పట్టణానికి చేరువలో కనిపించే చెట్టు రోజంతా వాయుగీతాలను వినిపిస్తుంది. నెమ్మదిగా పిల్లగాలులు వీచేటప్పుడు మంద్రంగా, గాలులు ఒకమోస్తరుగా వీచేటప్పుడు కాస్త మధ్యమంగా, శరవేగంగా పెనుగాలులు వీచేటప్పుడు తారస్థాయిలోను స్వరాలాపన చేసే ఈ వృక్షం అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇది సహజమైన వృక్షం కాదు, ఉక్కుతో రూపొందించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది. దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు మాదిరి లోహపు గొట్టాలను ఏర్పాటు చేయడంతో, ఈ గొట్టాల గుండా గాలి వెళ్లేటప్పుడల్లా చిత్రవిచిత్రమైన స్వరధ్వనులు వినిపిస్తాయి. మైక్ టాంకిన్, అన్నాలియు అనే లోహశిల్పులు ఈ లోహవృక్షాన్ని స్వరాలు పలికేలా తీర్చిదిద్దారు. బెర్న్‌లీ పట్టణానికి చేరువలోని ఖాళీ మైదానంలో దీనిని 2006లో ఏర్పాటు చేశారు. బీబీసీలో ప్రసారమైన 1960ల నాటి ఫాంటసీ సీరియల్ స్ఫూర్తితో దీనికి ‘ద సింగింగ్ రింగింగ్ ట్రీ’ అనే పేరు పెట్టారు. ఈ లోహవృక్ష రూపకల్పనలో కనపరచిన అమోఘ శిల్పనైపుణ్యానికి గుర్తింపుగా 2007లో దీనిని రూపొందించిన శిల్పులకు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఏటా ఇచ్చే జాతీయ అవార్డు కూడా లభించింది. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
Beauty of Nature: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!!
కుప్పి గంతులు.. కోతి గంతులు.. ఆఖరుకు పిచ్చి గంతుల గురించి కూడా విని ఉంటారు. కానీ, చెట్ల గంతుల గురించి తెలుసా? సంతోషం వస్తే మనిషి గంతులేసి డాన్స్ చేసినట్లు.. డాన్స్ చేసే చెట్లు కూడా ఉన్నాయి. అది కూడా అలాంటి ఇలాంటి డాన్స్ కాదు సాల్సా డాన్స్. ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో ఈ ‘డాన్సింగ్ ట్రీస్’ మీకు దర్శనమిస్తాయి. ప్రశాంతమైన సముద్రతీరంలో.. తెల్లని ఇసుక మధ్యలో నిల్చుని సాల్సా డాన్స్ చేస్తాయి. నిజానికి ఇవి సాధారణ చెట్లలాగే నిశ్చలంగా ఉంటాయి. కానీ, మనిషిలాగా రెండు కాళ్లు, రెండు చేతులు ఉన్నట్లు పొట్టిగా రెండు లేదా మూడు కొమ్మలు, చిన్న చిన్న ఆకులతో కనిపించే వీటి విభిన్న ఆకృతి, డాన్స్ చేస్తుంటే మధ్యలో ఆగిన మనిషి భంగిమలా భ్రమింప జేస్తాయి. అప్పుడప్పుడు అలల తాకిడికి స్థానభ్రంశం కూడా చెందుతాయి. వీటి కారణంగానే ఈ చెట్లు సాల్సా డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఎవరో ఫేమస్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసినట్లు.. ఓ క్రమ పద్ధతిలో ఉండి, చక్కటి డాన్స్ పోజ్‌లో నిల్చుంటాయి. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో వీటి అందాలను చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ప్రస్తుతం ఈ డాన్సింగ్ ట్రీస్‌ను చూడ్డానికి పర్యాటకులు, ఆ అందాలను ఫొటోల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు క్యూ కడుతున్నారు. మీరు కూడా చూడాలనుకుంటే ఇండోనేషియా బయలుదేరండి. చదవండి: అందమైన విలన్.. నెగెటివ్ రోల్ దక్కడం ఓ వరం: కీర్తి చౌదరి -
అనేక రంగుల్లో ఉన్న ఆకును ఎప్పుడైనా చూశారా..
న్యూయార్క్: ఆకులు ఏ రంగులో ఉంటాయో తెలుసా? అంటే.. ఇదేం ప్రశ్న.. ఆకుపచ్చ రంగులోనే కదా అంటారా.. మనకు కనబడేది ఆకుపచ్చ రంగులోనే. కానీ దాన్ని దగ్గరగా జూమ్ చేసి చూస్తే.. చాలా రంగులు కనిపిస్తాయి. ఇదిగో.. ఈ ఫొటోనే దీనికి ఎగ్జాంపుల్. ఇందులో వివిధ రంగుల్లో మెరిసిపోతున్నది ఆలివ్ చెట్టు ఆకు. అమెరికాలోని బేలోర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త జేసన్ కిర్క్ మైక్రోస్కోప్‌తో ఈ ఫొటో తీశారు. ఇందులో తెల్లగా పైకి పొడుచుకు వచ్చిన భాగాలను ట్రైకోమ్స్ అంటారు. ఆకులపై ఒత్తిడి పడినప్పుడు అవి షాక్ అబ్జార్వర్లలా పనిచేసి రక్షిస్తాయి. వంకాయ రంగులో ఉన్నవేమో ఆకులు కార్బన్డయాక్సైడ్, ఆక్సిజన్లను పీల్చి వదిలేసే రంధ్రాలు (స్టొమాటా). ఆకుల్లో నీళ్లు, ఇతర పోషకాలను రవాణా చేసే నాళాలు నీలం రంగులో కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత కెమెరా తయారీ సంస్థ నికాన్ నిర్వహించే ‘స్మాల్ వరల్డ్ కాంపిటీషన్’లో ఈ ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి -
రెండే ఆకులతో వేల ఏళ్లు బతుకుతుంది!
ఏవైనా మొక్కలు, చెట్లు ఎన్ని రోజులు బతుకుతాయి. కొన్ని అయితే నెలలు, మరికొన్ని అయితే సంవత్సరాలు.. అత్యంత భారీ వృక్షాలు అయితే కొన్ని వందల ఏళ్లు బతుకుతాయి. కానీ కేవలం రెండే ఆకులతో, రెండు మూడు అడుగుల పొడవు మాత్రమే ఉండే ఓ చిన్న మొక్క కొన్ని వేల ఏళ్లు బతుకుతుంది తెలుసా? ఆ మొక్క పేరు.. ‘వెల్విస్చియా’. భూమ్మీద అత్యంత పురాతన ఎడారుల్లో ఒకటైన నమీబియా ఎడారిలో ఈ మొక్కలు కనిపిస్తాయి. ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త ఫ్రెడ్రిక్ వెల్విస్చ్ 1859లో ఈ చిత్రమైన మొక్కలను గుర్తించారు. ఆయన పేరుమీదుగానే దీనికి ‘వెల్విస్చియా’ అని పేరుపెట్టారు. ఎప్పటికీ చావదని.. వెల్విస్చియా మొక్కలను ఆఫ్రికాలో స్థానికంగా ‘ట్వీబ్లార్కన్నీడూడ్’ అని పిలుస్తారు. ఈ పదానికి ‘ఎప్పటికీ చావులేని రెండు ఆకులు’ అని అర్థం. దీనికి తగ్గట్టే రెండే ఆకులు ఉండే ఈ మొక్క.. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను తట్టుకుని మరీ కొన్ని వేల ఏళ్లు బతుకుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ఉన్న రెండు ఆకులే పొడవుపెరుగుతున్న కొద్దీ చీలిపోతూ చుట్టూ విస్తరిస్తాయని తేల్చారు. కొన్ని మొక్కల శాంపిల్స్‌ను తీసుకుని పరీక్షించారు. వాటిలో కొన్ని మూడు వేల ఏళ్ల కిందటే పుట్టి, ఇప్పటికీ బతుకుతున్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. చాలా మొక్కల వయసు వెయ్యేళ్లకుపైనే ఉన్నట్టు వెల్లడికావడం గమనార్హం. ఆ మార్పులతో వ్యవసాయానికి తోడ్పాటు అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటూ.. అతి తక్కువ శక్తిని వినియోగించుకునేలా ఈ మొక్కల్లో జరిగిన జన్యుమార్పులను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. వీటిని వ్యవసాయంలో అమలు చేయగలిగితే.. క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా, తక్కువ నీళ్లు, ఎరువులను వినియోగించుకునేలా పంటలను అభివృద్ధి చేయవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ లీబెన్స్ తెలిపారు. -
ఆన్లైన్ కష్టాలు.. చదవాలంటే చెట్టెక్కాల్సిందే
సాక్షి, పర్లాకిమిడి( భువనేశ్వర్): ఆన్లైన్ విద్యా బోధనతో గజపతి జిల్లా విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఇంటర్నెట్ సిగ్నల్స్ సక్రమంగా అందకపోవడంతో ఆన్లైన్ బోధన విద్యార్థులకు అందని ద్రాక్షలా తయారైంది. దేశంలోని అన్ని చోట్లా 4జీ సేవలు అందుబాటులో ఉండగా మెట్రో సిటీల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు కావొస్తున్నా జిల్లాలో మొబైల్ సేవలకు ప్రజలు నోచుకోవడం లేదు. ప్రతి పంచాయతీకి ఫైబర్ నెట్ వర్క్ అందిస్తామని కేంద్రం చెబుతున్నా గజపతి జిల్లాలో ఆ సేవల జాడే లేదు. జిల్లాలో విద్యార్థులకు కనీసం 2జీ సేవలు కూడా అందకపోవడంతో చెట్లు, కొండలు ఎక్కుత సిగ్నల్స్ కోసం వెతుక్కుంటూ క్లాసులు వింటున్నారు. ఈ కష్టాలపై జిల్లా ప్రజలు పలుమార్లు కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది. పట్టించుకోని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రతిసారీ జరుగుతున్న జిల్లా సమీక్షలో ఇంటర్నెట్ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ టవర్స్‌తో పాటు నెట్వర్క్ స్పీడ్ పెంచాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నా పట్టించుకునే వారే కరువయయ్యారు. జిల్లాలో ఇతర ప్రైవేటు నెట్వర్క్ కనెక్షన్లు పనిచేయవు. బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్‌పైనే ఉద్యోగులు, విద్యార్ధులు ఆధారపడుతున్నారు. ఆధార్, ఈ–సేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆన్లైన్లోనే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుంటే నెట్వర్క్ అందకుండా పనిచేయడం ఎలా అని పశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రం పర్లాకిమిడిలోనే నెట్వర్క్ సిగ్నల్స్ అందడం లేదంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని అవస్థలు పడుతున్నా బీఎస్ఎన్ఎల్ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేకపోతోందని జిల్లా ప్రజలు వాపోతున్నారు. -
Photo Stories: మొక్కకూ క్యూఆర్ కోడ్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్కకు సంబంధించి వివరాలతో క్యూఆర్ కోడ్లను రూపొందించారు. ప్రతి మొక్క వద్ద ఉండే క్యూఆర్ కోడ్లను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే మొక్క శాస్త్రీయ నామం, స్థానిక నామం తదితర వివరాలు తెలుసుకోవచ్చునని ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్‌సింగ్ తెలిపారు. ఈ క్యూర్ కోడ్లను బాటనీ లెక్చరర్ సహకారంతో టీఎస్కేసీ మెంటార్ ఇమ్రాన్ రూపొందించారని చెప్పారు. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడు తా యన్నారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ బొగత పరవళ్లు బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఎగువన తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తుతూ జలపాతంలో కలుస్తోంది. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలంలో గల ఈ జలపాతాన్ని వీక్షించేందుకు శనివారం పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. – వాజేడు ‘నీటి పిల్లుల’ హల్చల్ కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో నీటి పిల్లులు సంచరిస్తూ హల్చల్ చేస్తున్నాయి. గతేడాది నుంచి కాళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ పెరగడంతో గోదావరిలో నీటి పిల్లులు అధికంగా వచ్చి చేరాయి. రాత్రి వేళ సంచరిస్తూ అవి చేపలను తింటూ జాలర్లు వేసిన వలలను కొరికి తెంపేస్తున్నాయి. దీంతో జాలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ పరిధి మండలపురం గ్రామానికి చెందిన జాలరి కొమ్మలి గోదావరిలో తరుచూ చేపలు పడుతున్నాడు. కాగా వలలను తెంపి పాడుచేస్తున్న రెండు నీటి పిల్లులను శుక్రవారం రాత్రి పట్టుకుని తర్వాత గోదావరికి దూరంగా అడవిలో వదిలేశాడు. నేను గానీ వల వేస్తే.. వల విసరడమూ ఓ కళే. సరిగ్గా విసిరితేనే చేపలు చిక్కుతాయి. లేదంటే వల వేయలేక విలవిల్లాడాల్సిందే. శుక్రవారం కురిసిన వర్షానికి మంచిర్యాలలోని రాళ్లవాగులో వరద నీరు చేరింది. శనివారం చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉత్సాహం చూపారు. పోటీపడి వలలు విసురుతూ చేపలు పడుతున్న దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల భారీ మీనం.. మత్స్యకారుడి ఆనందం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువులో శనివారం ఓ జాలరికి 25 కిలోల చేప దొరికింది. చేప విలువ సుమారు రూ.5 వేలు ఉంటుందని జాలరీ గూండ్ల సాయిలు తెలిపారు. – ఎడపల్లి(బోధన్) -
చదువు కోసం చెట్టెక్కిన విద్యార్థులు..
ముంబై: కరోనా కారణంగా స్కూళ్లు మాతపడిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లాస్‌లు కోసం విద్యార్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మహారాష్ట్ర లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్ధులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోండియా జిల్లాలోని మూరుమూల గ్రామానికి చెందిన విద్యార్థులు మొబైల్ సిగ్నల్ కోసం గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టు ఎక్కి తమ మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. మొబైల్ టవర్‌కు 200 మీటర్ల ఉన్న ఈ చెట్టును నెట్వర్క్ ట్రీగా వారు పిలుస్తారు. గత 15 నెలల్లో సుమారు 150 మంది గ్రామీణ విద్యార్థులు ఈ చెట్టు వద్దకు వచ్చి ఆన్లైన్ క్లాసులు విన్నట్లు స్థానికులు తెలిపారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అడుగులు వేస్తుంటే ..మరో వైపు ఇటువంటి సంఘటనలు జరగడం మన దేశ దౌర్భాగ్యాన్నీ ప్రతిబింబిస్తోందని స్థానికులు అంటున్నారు. -
కరోనా వ్యాక్సిన్ భయంతో చెట్టెక్కిన గ్రామస్తులు
-
బలంగా తన్నాడు.. మొద్దు వచ్చి మీద పడింది.. అంతే!
చర్యకు ప్రతి చర్య అనేది సహజం. మనిషి చేసే ప్రతి పనికి ఫలితం అనుభవంచి తీరాల్సిందే అని పెద్దలు వూరికే అనలేదు. ఇక మనుషుల రకరకాలుగా ఉన్నట్లే.. వారి మనస్తత్వం కూడా అనేక విధాలుగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి చెట్టును తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలోని వ్యక్తి తన బలాన్ని చూపించుకోవాలనుకున్నాడేమో.. అదే పనిగా మొద్దుబారిన ఓ చెట్టును తన్నడం మొదలు పెట్టాడు. బలంగా తన్నుతున్నాడు గానీ.. బుద్దికి పని చెప్పినట్టు లేడు. ఇంకేముంది చెట్టు విరిగింది. కానీ మొద్దు వచ్చి తలపై పడింది. అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ వీడియోను భారతీయ అటవీ అధికారి సుధా రామెన్ ‘‘మీరు చేసేది.. మీకు తిరిగి వస్తుంది. అది మంచైనా.. చెడైనా’’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 91 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వందల మంది కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘కర్మ ఫలం అంటే ఇదే.. మనం ఏ చేస్తామో.. అది తిరిగి వస్తుంది.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ గొప్పకు పోయాడు.. చివరకు పాఠం నేర్చుకున్నాడు.’’ అని రాసుకొచ్చారు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలిరాలేదు. కానీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. All that you do comes back to you - Good and Bad pic.twitter.com/kMHZGF3NLi — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 1, 2021 చదవండి: 97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు -
‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!
అతనికి చెట్లంటే ప్రాణం. పర్యావరణ ప్రేమికుడు. ఏటా వందల సంఖ్యలో మొక్కలు నాటుతాడు. అడవులను పెంచే ఉద్దేశంతో విత్తన బంతులు తయారుచేసి చెట్లు లేనిచోట విసురుతాడు. చిన్న మొక్కనూ ఎండనివ్వడు. పెద్ద చెట్లను నరకనివ్వడు. అతనే సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్తాపూర్‌కు చెందిన జ్ఞానేశ్వర్. ఇటీవల తన సొంత గ్రామంలో గ్రామస్తులు పెద్ద రావిచెట్టును నరికివేశారు. అది తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పెద్ద గుంత తవ్వి మళ్లీ ఆ చెట్టును నాటించాడు. రోజూ నీళ్లుపోస్తూ దానికి ప్రాణం పోస్తున్నాడు. ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పర్యావరణానికి హాని జరుగుతుందని.. చెట్లను నరకొద్దని సూచిస్తున్నాడు. -
వైరల్: చెట్టుపై గొడ్డలి వేటు పడకుండా అడ్డుకున్న శునకం
ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతుంటే మనుషులు మరింత బుద్దిహీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ భూమ్మీద కేవలం తాము మాత్రమే సంతోషంగా జీవించాలనే అంతగా స్వార్ధంగా ఆలోచిస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. సొంత ప్రయోజనం కోసం చెట్లు, మొక్కలను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారు. తాజాగా అలాంటి పొరపాటే ఓ వ్యక్తి చేయబోయాడు. కానీ ఆ మనిషి చేస్తున్న తప్పును ఓ నోరులేని జంతువు అడ్డుకుంది. ఓ వ్యక్తి చెట్టును నరికేందుకు గొడ్డలి తీసుకురాగా.. ఓ కుక్క వద్దంటూ అతడికి అడ్డు పడింది. చెట్టును కొట్టేసేందుకు ఎంత ప్రయత్నించినా ఆ శునకం ఆపే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలీదో కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. పర్యావరణం పట్ల శునకం చూపిస్తున్న శ్రద్దకు అందరూ శభాష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కుక్క చూపించే విశ్వాసం కూడా మనిషి చూపించలేకపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Viral Video: శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) -
ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా..
చెన్నె: ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్ ప్రమాదానికి గురయ్యింది. చెట్టును ఢీకొట్టడంతో తొమ్మిది నెలల నిండు గర్భిణితో పాటు ఆమె అత్తి, వదిన దుర్మరణం పాలయ్యారు. పురుటినొప్పులతో బాధపడుతుండడంతో తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కొన్ని గంటల్లో మరో ప్రాణానికి జన్మనిచ్చే మహిళ మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ఒకేసారి ముగ్గురిని కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో జరిగింది. సొరపట్టు గ్రామానికి చెందిన సెల్వీ తన కోడలు జయలక్ష్మికి తొమ్మిది నెలలు నిండడంతో బుధవారం తెల్లవారుజామున నొప్పులు వచ్చాయి. వెంటనే కుమార్తె అంబికతో కలిసి అంబులెన్స్ తీసుకుని ఆస్ప్రతకి బయల్దేరారు. అయితే తెల్లవారుజామున 4.45 గంటలకు మార్గమధ్యలో అంబులెన్స్ టైర్ పేలి వాహనం అదుపు తప్పింది. వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో వాహనంలోని అత్తాకోడళ్లతోపాటు ఆమె కుమార్తె తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజాము కావడంతో ఈ ప్రమాదం వార్త ఎవరికీ తెలియలేదు. దీంతో కొన ప్రాణం మీద ఉన్నవారిని ఎవరూ కాపాడలేకపోయారు. గాయాలతో బాధపడుతూ అక్కడికక్కడే మృతి చెందారు. కొన్ని గంటల తర్వాత అటుగా వెళ్లేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. జయలక్ష్మి కుటుంబానికి రూ.5 లక్షలు, సెల్వీ, అంబిక కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బీమా పరిహారం వెంటనే కుటుంబాలకు అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. చదవండి: పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
క్వారంటైన్: చెట్టుకింద కరోనా రోగి..
జయపురం: కరోనా పాజిటివ్ నమోదైన ఓ బాధితుడు నవరంగపూర్ జిల్లా చందాహండి సమితి గంభారిగుడ పంచాయతీ మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సమితికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో హోం క్వారెంటైన్లో ఉండమని వైద్యులు సూచించారు. అయితే ఆ వ్యక్తికి హోం క్వారంటైన్ అవకాశం లేకపోవడంతో మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందాడు. దీంతో మెడిగాం గ్రామస్తులు వణికిపోతున్నారు. వైద్యాధికారులు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ నమోదైన వారిని గాలికి వదిలేస్తున్నారని హోం క్వారంటైన్లో ఉండే అవకాశం లేని వారికి తగిన ఏర్పాట్లు చేయాలి కానీ గాలికి వదిలేయకూయడదని మండిపడుతున్నారు. కరోనా రోగులు చెట్ల కింద ఉంటే ఇతరులకూ కరోనా సంక్రమించే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమితిలోని హలదిగ్రామంలో 100 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్, పనాబెడ డిగ్రీ కళాశాల, సాలెబిడి ఆశ్రమంలో రెండు టీఎంసీ (తాత్కాలిక వైద్య కేంద్రం) లు ఉన్నా తమ గ్రామంలో చెట్టు కింద కరోనా రోగి ఉండడానికి కారణం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. సహాయం చేస్తున్న గ్రామ యువత చెట్టు కింద ఉంటున్న కరోనా రోగికి తిండి, మందులు ఎవరూ సమకూర్చడం లేదు. ఆ రోగి పరిస్థితి చూసి చలించిన మెడిగాం గ్రామానికి చెందిన యువకులు తినేందుకు, తాగేందుకు సమకూర్చారు. అలాగే రోగికి దూరంగా ఉండి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అవసరమైన మందులు తెచ్చి ఇస్తున్నారు. -
చెట్టెక్కి కూర్చున్న దొంగ.. పోలీసులు ఏం చేశారంటే?
రాయ్‌పూర్: చిన్నప్పుడు అందరూ దొంగ-పోలీస్ ఆట ఆడే ఉంటారు. దొంగలు దాక్కుంటే పోలీసు వారిని వెతికి పట్టుకోవడమే ఈ ఆట. సరిగ్గా చిన్నప్పుడు ఆడే ఈ ఆటలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులకు చిక్కుకుండా ఓ దొంగ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చెట్టెక్కి మీద కూర్చున్నాడు. చెట్టు వద్దకు చేరుకున్న పోలీసులు దొంగను కిందకు దిగి రావాలని కోరారు. వాళ్లు ఎంత చెప్పిన సదరు దొంగ ససేమిరా రానన్నాడు. దీంతో విసుగు చెందిన పోలీసులు ఓ ప్లాన్ వేశారు. ఓ పోలీస్ ఆఫీసర్ బూట్లు విప్పీసి చెట్టెక్కేశారు. తప్పించుకునే దారిలేదని తెలిసి కూడా ఆ దొంగ.. చెట్టుమీదనే మరింత పైకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, వేరే మార్గం లేక ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ వీడియోను చత్తీస్ఘడ్ ఐపీఎస్ పోలీస్ అధికారి తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. దొంగోడి అతి తెలివికి నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది.. ‘చెట్టెక్కి తప్పించుకోవటం ఏంట్రా బాబు.. దొరకి పోయావ్గా’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వైరల్: అతడిపై ‘థూ’ అని ఉమ్మింది.. యుద్ధం మొదలైంది! खुदी को कर के बुलंद इतना चढ़ गए ऊपर जैसे तैसे, पर #Khakhi वाले उतार देंगे, बड़े आराम से 😅😝 pic.twitter.com/FoePjKOLfj — Dipanshu Kabra (@ipskabra) May 12, 2021 -
ఘోరం: ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం
అగర్తల: ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన త్రిపురలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ పరిణామం బీజేపీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మినీ ట్రక్కులో బీజేపీ కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దక్షిణ త్రిపురలోని నూతన్‌బజార్‌కు చేరుకోగానే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. టక్కు చెట్టును ఢీకొని పల్టీ కొట్టి లోతట్టు ప్రాంతంలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
భర్త చీటింగ్.. పోస్టర్లతో భార్య నిరసన!
లండన్: తన భర్త మోసం చేస్తే ఏ మహిళ అయినా ఏం చేస్తుంది. మొబైల్‌తో మెస్సెజ్ లేదా కాల్ చేసి తన కోపాన్ని తీర్చుకుంటుంది. పెద్దలకు దృష్టికి తీసుకువెళుతుంది. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండి దూరంగా వెళ్ళపోవడమో.. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడమో చేస్తుంది. అయితే యూకేలోని ఓల్డ్ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త చేసిన మోసానికి వెరైటిగా నిరసన తెలిపింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్హోమ్కు చెందిన ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. తన భర్త ఫోటోను ఏ4 సైజ్‌లో ప్రింట్ తీయించి గోడలకు అంటించింది. ఆ పోస్టర్ కింద ఇతనొక పెద్ద మోసగాడు అని కూడా రాసింది. చెట్లు, కార్లు వేటిని వదలకుండా అన్నిచోట్ల అతికించి తన కోపాన్ని వెల్లగక్కింది. అంతటితో ఆగకుండా మోసాలకు పాల్పడుతున్న మగాళ్ళను ఉద్దేశించి కూడా మరికొన్ని పోస్టర్లను గోడలకు అతికించింది. ‘మీ భార్యను మోసం చేస్తున్నారా? తొందర్లోనే మీ బండారం బయట పడుతొంది’ అని కామెంట్లు కూడా రాసింది. అయితే భార్యలను ఉద్దేశించి ‘ఈరోజు మీ భర్త మీతోనే ఉన్నాడా? నిన్నరాత్రి? గతవారం కూడా మీతోనే ఉన్నాడా?’ అని రాసి ఉన్న పోస్టర్లను గోడలకు అతికించి ప్రచారం చేసింది. అయితే గుర్తు తెలియని ఈ మహిళ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎమిలీ అనే మహిళ కూడా తన లవర్ మోసం చేశాడని అతని గది చుట్టూ ఇటువంటి పోస్టర్లను అతికించి నిరసన తెలిపింది. కాగా, 2019లో ఓ యువకుడు ఏకంగా తనను మోసంచేసిన అమ్మాయి ఫోటోను పట్టుకొని రద్దీగా ఉండే వీధిలో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తనను మోసం చేసిందని రోడ్డుకెక్కాడు. ఆమెకు తను బ్రేకప్ చెప్తున్నాను అంటూ రోడ్డుపైనే ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా! -
చెట్లకు కూడా చెవులుంటాయి!
చెట్లు కూడా ప్రాణమున్న జీవులేనని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ ప్రయోగపూర్వకంగా వివరించారు. అయితే వీటిలో ఇతర జీవుల్లో కనిపించే చలనావయవాలుండవు. మొక్కలకు ప్రాణముందని తెలిసినా, ఇతర జీవజాతుల్లాగా చేతన(కాన్షియస్నెస్) ఉండదని ఎక్కువమంది భావిస్తారు. కానీ తాజాగా జరిపిన అధ్యయనాల్లో మొక్కల్లో కూడా చేతనత్వం, స్మృతి, వివేకం ఉంటాయట..! లండన్, స్పెయిన్, కెనెడాలోని వేర్వేరు యూనివర్సిటీలు మొక్కల్లో చేతనపై ప్రయోగాలు జరిపాయి. 20 బీన్స్ మొక్కలను కుండీల్లో నాటి, వాటిలో కొన్నింటిని ఒంటరిగా వదిలేశారు, కొన్నింటికి 30 సెంటీమీటర్ల దూరంలో చిన్న కర్రముక్కను పాతారు. వీటి కదలికలను టైమ్‌లాప్స్ ఫొటోగ్రఫీ ద్వారా అధ్యయనం చేశారు. కర్రముక్క దగ్గరగా ఉన్న మొక్కలు, ఆ కర్రముక్క ఆనవాలు పసిగట్టి తదనుగుణంగా చిగుర్లు వేస్తూ గ్రోత్ ప్యాట్రన్స్‌ను నిర్దేశించుకున్నట్లు అధ్యయనంలో తెలిసింది. అంటే మొక్కలు తమ దగ్గరలో ఉండే వస్తువుల ఉనికిని గుర్తిస్తాయని తెలుస్తోంది. జ్ఞానేంద్రియాలు లేకున్నా.. ప్రత్యేకంగా జంతువుల్లో ఉన్నట్లు మొక్కల్లో చెవుల్లాంటి అవయవాలు లేకున్నా, పక్కన ఆబ్జెక్ట్స్ ఉనికినైతే గుర్తించగలవని నిరూపితమైంది. అంతమాత్రాన వీటికి పూర్తిస్థాయి చేతన ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని ఈపరిశోధనల్లో పాల్గొన్న సైంటిస్టు డా. విసెంటె రాజా చెప్పారు. ఒకవేళ మొక్కలకు చేతన ఉండేట్లయితే అది ఎక్కడ నుంచి వస్తుందనే విషయమై ఎంతోకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2006 నుంచి ప్లాంట్ న్యూరోబయాలజీ అనే శాఖను అధికారికంగా ప్రారంభించారు. జంతువుల్లోలాగే మొక్కల్లో కూడా విద్యుదయిస్కాంత సిగ్నలింగ్ ద్వారా చేతన పుడుతుందని ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఈ భావనను వ్యతిరేకించే పరిశోధకులు కూడా ఉన్నారు. మొక్కలకు ఎలాంటి చేతన ఉండదని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టు లింకన్ టైజ్ చెబుతున్నారు. అలాంటి వ్యవస్థకు తగిన నిర్మితి ఏదీ చెట్లలో ఉండదని, అందువల్ల చెట్లకు చేతన అనేది వట్టిమాటని ఆయన అభిప్రాయం. కానీ మొక్కలకు కూడా చేతన ఉంటుందనేది నిర్విదాంశమని, ఇకపై జంతువులకు మాత్రమే ఇది సొంతమని భావించే వీలు లేదన్నది ఎక్కువమంది సైంటిస్టుల మాట. సో.., ఈ సారి చెట్ల దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్త! అవి వింటాయేమో! -
‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు'
చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. అన్నమూ పెడుతుంది. అయితే అది ‘పద్మశ్రీ’ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం చెట్టునే నమ్ముకున్న ఇద్దరు వ్యక్తులు పద్మశ్రీ పొందారు. ఒకరు రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ సుందర్ పాలివాల్. మరొకరు తమిళనాడుకు చెందిన పాప్పమ్మాళ్. కూతురి తుదిశ్వాస నుంచి ఒక వనాన్నే సృష్టించాడు శ్యామ్ సుందర్. నానమ్మ పోతూ పోతూ ఇచ్చిన చిన్న కిరాణా అంగడి నుంచి భూమి కొని సేంద్రియ వ్యవసాయం చేసేంతగా ఎదిగింది పాప్పమ్మాళ్. కొంత నేల దొరికితే అందులో విత్తు నాటితే ఎలాగూ ఆనందం వస్తుంది. కాని ఆ కొమ్మకు పద్మశ్రీ పూస్తే ఇంకా ఆనందం కదా. ఆ ఇరువురి స్ఫూర్తిదాయకమైన పరిచయం ఇది. ‘నేనేం చదువుకోలేదు. నాకు ఇంగ్లిష్ రాదు’ అంటాడు 55 ఏళ్ల శ్యామ్‌సుందర్ పాలివాల్. కాని అతడు మాట్లాడేది ఇవాళ ప్రపంచమంతా అర్థం చేసుకుంటోంది. కారణం అతడు మాట్లాడేది ప్రకృతి భాష. చెట్టు భాష. పచ్చదనపు భాష. 2021 సంవత్సరానికి గాను శ్యామ్సుందర్కు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. నిజానికి ఈ పురస్కారం అతనికొక్కడికి మాత్రమే కాదు. అతని ఊరు ‘పిప్లాంత్రి’కి. ఆ ఊరి గ్రామస్తులకి. ఈ ఊళ్లో ప్రస్తుతం తలలూపుతున్న దాదాపు మూడు లక్షల చెట్లకి. ‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు ఈ ధరిత్రి సుఖంగా ఉంటుంది’ అంటాడు శ్యామ్‌సుందర్. అతడు కూడా రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని తన ఊరు పిప్లాంత్రిలో 2007 వరకూ ఒక సామాన్య రైతే. తను తన ఇల్లు అనుకుంటూ వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అతనికి. అయితే 2007లో అతని జీవితంలో పెనుమార్పు వచ్చింది. ఆ సంవత్సరం ఆగస్టులో అతని రెండో కూతురు 16ఏళ్ల కిరణ్ స్కూల్ నుంచి సగంలో తిరిగి వచ్చింది కడుపు నొప్పితో. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేలోపు డీహైడ్రేషన్‌తో మరణించింది. ఎంతో ఇష్టమైన కుమార్తె మరణించడంతో కదిలిపోయాడు శ్యామ్‌సుందర్. ‘ప్రమాదవశాత్తు మరణిస్తేనే నాకు ఇంత దుఃఖంగా ఉంది. చేతులారా చంపేస్తే ఆ తల్లిదండ్రులకు ఇంకెత దుఃఖం ఉండాలి అనిపించింది’ అంటాడు అతడు. ఎకో–ఫెమినిజమ్ మొదలు ఆడపిల్ల చెట్టును కాపాడుతుంది... చెట్టు ఆడపిల్లను కాపాడుతుంది అని ఉద్యమం మొదలెట్టాడు శ్యామ్‌సుందర్. ఆ సమయంలో అతను తన ఊరి సర్పంచ్ కూడా. అప్పటికి రాజస్తాన్‌లో అమ్మాయి కట్నకానుకలకు భయపడి వడ్లగింజలు నోట్లో పోసి శిశుహత్యలు చేస్తుండేవారు. ‘మా ప్రాంతంలో ఇక అలా జరక్కూడదు అనుకున్నాను’ అంటాడు శ్యామ్‌సుందర్. మొదట తన కూతురి పేరున ఒక కదంబ మొక్క నాటాడు. ‘మా ఊరిలో ప్రతి సంవత్సరం యాభై అరవై కాన్పులు జరుగుతాయి. ఆడపిల్ల పుడితే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి పేరున 111 మొక్కలు నాటాలి. వాటి బాగోగులు చూడాలి. వాటి మీద రాబడి భవిష్యత్తులో ఆ పిల్లకే చెందుతుంది. అలాగే ఆడపిల్లను చదివిస్తామని, వయసుకు ముందు పెళ్లి చేయమని వాళ్లు నోటు రాయాలి. ఆడపిల్ల పుడితే ఊరు మొత్తం 21 వేలు చందా ఇవ్వాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకో పది వేలు ఇవ్వాలి. దానిని డిపాజిట్ చేస్తాం. 18 ఏళ్ల తర్వాత దానిపై వచ్చే డబ్బు ఆ అమ్మాయి పెళ్లికి ఉపయోగపడేలా భరోసా కల్పించాం. దాంతో మా ప్రాంతంలో ఆడపిల్ల మరణాలు బాగా తగ్గాయి’ అంటాడు శ్యామ్‌సుందర్. దీనిని నిపుణులు ఎకో ఫెమినిజం అంటున్నారు. ఇది మాత్రమే కాదు... శ్యామ్‌సుందర్ తన గ్రామంలో దాదాపు రెండున్నర లక్షల అలొవెరా మొక్కలు నాటి వాటి నుంచి జెల్, జ్యూస్ వంటి ప్రాడక్ట్స్ తయారు చేయించి మార్కెటింగ్ చేస్తున్నాడు. ‘ఒక్కో మహిళ నెలకు కనీసం ఆరు వేల రూపాయలు ఆదాయం గడిస్తోంది’ అన్నాడతను సంతోషంగా. గత దశాబ్ద కాలంలో గత దశాబ్ద కాలంలో పిప్లాంత్రిలో నాటిన వేప, మామిడి, ఉసిరి చెట్ల వల్ల పిప్లాంతి పచ్చదనం నింపుకోవడమే కాదు కరువు బారిన పడటం లేదు. భూసారం పెరిగి వలస ఆగింది. భూగర్భ జలాల మట్టం పెరిగింది. శ్యామ్‌సుందర్‌ను అనేక పురస్కారాలు వరించాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఊరిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘నేను చేయగలగితే దేశంలో ఎవరైనా చేయొచ్చు’ అంటాడు శ్యామ్‌సుందర్. అతడు చెప్పే ఆ ‘ఎవరైనా’ అనే వ్యక్తి ప్రతి గ్రామంలో ఉండాలని కోరుకుందాం. చెట్ల మధ్య ఒక తెల్లజుట్టు చెట్టు 105 ఏళ్ల పాప్పమ్మాళ్ ఉదయం ఐదు గంటలకు టంచన్‌గా నిద్రలేచి ఆరోగంటకంతా తన పొలంలో ఉంటుంది. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవాని నది ఒడ్డున ఆ పొలం ఉంటుంది. రెండున్నర ఎకరా ఉన్న ఆ పొలం ఆమె పైసా పైసా కూడగట్టి కొనుక్కున్నది. అందులోని ప్రతి మొక్కా ప్రతి పాదూ ఆమె చేతుల మీదుగా రూపుదిద్దుకున్నవే. పాప్పమ్మాళ్ గత యాభైఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమిళనాడులో పేరు తెచ్చుకుంది. ‘నా నానమ్మ పోతూ పోతూ నాకు చిన్న కిరాణా షాపు ఇచ్చి వెళ్లింది’ అంది పాప్పమ్మాళ్. ఆమెకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. వచ్చి నానమ్మ దగ్గర చెల్లెలితో పాటు ఉండిపోయింది. కిరాణా షాపును, చిన్న హోటల్‌ను నడుపుతూ దానిమీద రాబడితో పది ఎకరాల పొలం కొంది. అరటి, బెండ పండించడంలో ఆమె ఎక్స్పర్ట్. అయితే చెల్లెలి పెళ్లి, ఆమె పిల్లల పెంపకం కోసం ఏడున్నర ఎకరాల పొలం ధారాదత్తం చేసేసింది. మిగిలిన రెండున్నర ఎకరాల పొలంలో ఇప్పటికీ అరటి పండిస్తోంది. పాప్పమ్మాళ్‌ను తమిళనాడు గవర్నమెంట్ చాలా త్వరగా గుర్తించింది. తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ ఆమెను తరచూ ఆహ్వానిస్తుంటుంది. 105 ఏళ్ల వయసులో గట్టిగా పనులు చేసుకుంటూ ఉండటానికి కారణం వారంలో రెండుసార్లు మటన్ సూప్ తాగడమే కావచ్చునని ఆమె చెబుతుంది. ఆమె మటన్ బిరియాని కూడా ఇష్టంగా తింటుంది. ఆకులో తినడం ఆమె అలవాటు. వేడి నీరు తాగుతుంది. ఈ వయసులో ఆమె తాను ఉత్సాహంగా ఉంటూ తనవారిని ఉత్సాహంగా ఉంచుతోంది. ఈసురోమనేవారెవరైనా ఈమెను చూసి కదా నేర్చుకోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ
సాక్షి,కొచ్చి: ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. నివిన్ పర్సనల్ మేకప్‌మేన్ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుముశారు. క్రిస్మస్ స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి నప్పటికీ షాబూని రక్షించలేకపోయామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. షాబు అకాల మరణం తీరని లోటంటూ హీరో దుల్కర్ సల్మాన్ సంతాపం తెలిపారు. బెంగుళూరు డేస్ , విక్రమాదిత్యన్ మూవీల్లో ఆయనతో కలిసి పనిచేశానంటూ ఆయన జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్నారు. ఇంకా నటుడు ఉన్ని ముకుందన్, దర్శకుడు బోబన్ శామ్యూల్ మలయాళ మూవీ అండ్ మ్యూజిక్ డేటాబేస్ (ఎం 3 డిబి) కూడా షాబూకి సంతాపాన్ని ప్రకటించాయి. వీరితోపాటు మలయాళ నటీ నటులు, ఇతర పరిశ్రమ పెద్దలు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2012 లో ‘పుతియా తీరంగల్’ చిత్రంతో నివిన్పాలీతో షాబు జర్నీ ప్రారంభమైంది. పరిశ్రమలో తనదైన ముద్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రెండ్రోజులుగా చెట్టుపైనే మృతదేహం
సాక్షి, సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గంగాధర్ మృతదేహం రెండ్రోజులుగా చెట్టు పైనే ఉంది. గత అక్టోబర్‌లో గ్రామానికి చెందిన మమత హత్య కేసులో గంగాధర్‌ను అనుమానితుడిగా భావించి పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు, మహిళలు ఆరోపిస్తున్నారు. గంగాధర్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, మమత హత్య కేసులో అసలైన నిందితులను తక్షణం పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చదవండి: ఇల్లు అమ్మనివ్వడంలేదని.. ఫ్యానుకు ఉరి! ఇరు కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, గంగాధర్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. శవాన్ని చెట్టుపై నుంచి దించేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకున్నారు. వారితో మాట్లాడటానికి వచ్చిన నిజామాబాద్ ఆర్డీవో రవిని ఆదివారం రాత్రి వరకు అక్కడే అడ్డుకున్నారు. తగిన న్యాయం జరిగేంత వరకు చెట్టుకు వేలాడుతున్న మృతదేహన్ని కిందకు దించనిచ్చేది లేదని వారు పట్టుబట్టారు. చదవండి: అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య -
కారు డోరులో చిక్కుకుని మహిళ మృతి
బెంగళూరు: కొన్ని సార్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద నష్టాలను మిగుల్చుతాయి. అలాంటి సంఘటన ఒకటి కర్ణాటక రాజధాని బెంగళూరులోని సదాశివనగర్లోబుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని రావ్(45) అనే మహిళ మృతి చెందింది. రివర్స్ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టు, కారు డోర్ మధ్య ఇరుక్కుని సదరు మహిళ మరణించింది. నందిని రావు(45) కొడుకును ఆడిస్తూ బయటకు వచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న కారు డోర్ తీసింది. రివర్స్ గేర్‌లో నిలిపిన విషయం మరిచి పోయి అందులో ఎక్కబోయింది. దాంతో అనుకోకుండా కారు వెనక్కి కదిలింది. అయితే ఆ సమీపంలోనే చెట్టు ఉంది. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ] దీంతో కారు తలుపుకు చెట్టుకి మధ్య నందిని రావు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయం కోసం కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. కారు పార్కింగ్‌కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలగించాలని ఆమె పలుసార్లు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
చెట్టెక్కి.. చెమటలు పట్టించి..
బుట్టాయగూడెం: మతిస్థిమితంలేని బాలుడు మర్రిచెట్టు చిటారు కొమ్మకు చేరుకుని కిందకు దూకేస్తానంటూ ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన మండలంలోని చీమలవారిగూడెంలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో బాలుడిని చెట్టు నుంచి కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.దుర్గారావు, రమణ రెండో కుమారుడు రోహిత్ (12) ఐదు నెలలుగా మతిస్థిమితం కోల్పో యి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు వారి ఇంటి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు ఎక్కి చిటారు కొమ్మన కూర్చున్నాడు. దింపే ప్రయత్నం చేయగా దూకేస్తానని బెదిరించడంతో కుటుంబసభ్యులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఇక్కడకు చేరుకుని ఉప్పరిల్లకు చెందిన కొండరెడ్డి గిరిజనుడి సాయంతో తాడు కట్టి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడిని సురక్షితంగా కిందకు దించారు. రోహిత్ ఆరో తరగతి చదువుతున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు. -
అమితాబ్ చెప్పిన చెట్టు కథ
బాధ ఇంటి మనిషిని కోల్పోయినప్పుడు మాత్రమే ఉండదు. ఇంటి చెట్టును పోగొట్టుకున్నప్పుడు కూడా ఉంటుంది. అమితాబ్ ఇప్పుడు అలాంటి బాధలో ఉన్నాడు. 43లో ఏళ్లుగా ఆయన ఇంట నీడనిస్తూ వచ్చిన ఒక గుల్మొహర్ చెట్టు మొన్నటి భారీ వర్షాలకు కూకటివేళ్లతో సహా కూలిపోయింది. అమితాబ్ ఆ చెట్టు ఫొటోలను తన బ్లాగ్‌లో పెట్టి దానితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ‘అది పోయేటప్పుడు కూడా నిశ్శబ్దంగా పోయింది. ఎవరికీ హాని కలిగించకుండా మెల్లగా వాలిపోయింది’ అని రాశాడాయన. అమితాబ్ బంగ్లా పేరు ‘ప్రతీక్ష’ అని చాలామందికి తెలుసు. 1976లో అమితాబ్ ఆ బంగ్లా కొన్నప్పుడు బంగ్లా మధ్యస్థలంలో అడుగు ఎత్తున ఉన్న ఆ మొక్కను నాటారట. అప్పటి నుంచి ఇంట్లో అది కూడా ఒక సదస్యుడయ్యింది. ‘పిల్లలు దాంతో పాటు పెరిగారు. దాని కిందనే ఆడుకున్నారు. హోలీ వచ్చినా, దివాలి వచ్చినా ఆ చెట్టుకే మేము సోకు చేసేవారం. అభిషేక్ బచ్చన్ పెళ్లి ఆ చెట్టు కిందనే జరిగింది. మా అమ్మా నాన్నలు మరణించినప్పుడు ఆ చెట్టు కింద జరిగిన ప్రార్థనల్లో అది కూడా పాల్గొనింది. ఇవాళ అది లేదు’ అని ఆయన భావోద్వేగంతో రాసుకొచ్చారు. బంగ్లా కొన్నాక తండ్రి హరివంశరాయ్ బచ్చన్ వచ్చి చూసి సంతోషించాడట. దానికి పేరు కూడా ఆయన కవిత్వం నుంచే తీసుకున్నారు. ‘అందరికీ ఇక్కడ స్వాగతం ఉంటుంది. ఎవరి గురించీ ప్రతీక్ష ఉండదు’ అని తండ్రి రాసిన కవిత నుంచి అమితాబ్ ప్రతీక్ష అనే మాట తీసుకుని తన బంగ్లాకు పెట్టుకున్నారు. అమితాబ్‌కు తన బాధ చెప్పుకుంటూ ఉంటే మధ్యతరగతి వారికి కొన్ని జ్ఞాపకాలు తాకవచ్చు. అద్దె ఇళ్లల్లో ఇష్టపడి పెంచుకున్న చెట్లను ఆ ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నప్పుడు వదల్లేక బాధ పడేవారు ఎందరో. ఏ బంధానికైనా ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో ఎడబాటు తప్పదు కదా. -
ప్రతి వ్యక్తీ ఐదు మొక్కలు నాటాలి; అంబటి రాయుడు
యాచారం: ప్రతి వ్యక్తీ ప్రతి యేటా ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు కోరారు. ఆరో విడత హరితహారంలో భాగంగా గురువారం యాచారం మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా హరితహారం నిర్వహించడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటి సంరక్షణ చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, యాచారం సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గొల్లపల్లి లలిత, ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. మొక్క నాటి నీళ్లు పోస్తున్న క్రికెటర్ అంబటి రాయుడు -
గ్రేటర్లో జపాన్ మియా వాక్
మియావాకీ..తక్కువ విస్తీర్ణంలోనే పెరిగే పచ్చని వనం..జపాన్‌లోని ప్రత్యేక విధానం!. నగరంలో రోజురోజుకూ హరించుకుపోతున్న లంగ్‌స్పేస్‌ను పెంచేందుకు ఈసారి హరితహారంలో ఈ విధానానికి ప్రాధాన్యమివ్వనున్నారు.నగరవ్యాప్తంగా వీలైనన్ని చోట్ల ఈ వనాలను పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్న హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ హరితహారం లక్ష్యం 50 లక్షల మొక్కలు. ఖాళీ ప్రదేశాలతోపాటు ఈసారి ఎక్కువగా రోడ్లు, చెరువు గట్లు, బఫర్జోన్లు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వీటితోపాటు మూసీ వెంబడి గ్రీనరీ పెంచేందుకు దాని పొడవునా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్‌గా మారిన గ్రేటర్ నగరంలో లంగ్‌స్పేస్ పెంచేందుకు తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ పద్ధతి మియావాకీకి ప్రాధాన్యతనిస్తున్నారు. అన్ని మార్గాల్లోని మేజర్ రోడ్లు, మైనర్ రోడ్లలో అవకాశమున్న అన్ని చోట్లా మొక్కలు నాటుతారు. కాలనీల్లోని రహదారుల్లోనూ స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో మొక్కలు నాటనున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల్లో వీలున్న ప్రాంతాల్లోనూ, గతంలో నాటిన మొక్కలు బతకని ప్రాంతాల్లోనూతిరిగి మొక్కలు నాటనున్నారు. అన్ని జోన్లలో.. జీహెచ్ఎంసీ లోని ఆరు జోన్లలోనూ ఈవిధానాన్ని అమలు చేయడంతోపాటు జోన్ల పరిధిలో ఈసారి అవెన్యూ ప్లాంటేషన్లు, గ్రీన్‌కర్టెన్లు వంటì వాటికి శ్రద్ధ చూపుతున్నారు. ఖాలీ ప్రదేశాలున్న ప్రాంతాల్లో ట్రీపార్కులుగా తీర్చిదిద్దడంతోపాటు అక్కడ వాకింగ్ ట్రాక్‌లు, తదితరసదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ల కింద, మీడియన్లలో తక్కువఎత్తుతో ఉండే ప్రత్యేక మొక్కలు నాటనున్నట్లు అడిషనల్ కమిషనర్ క్రిష్ట (బయోడైవర్సిటీ) క్రిష్ణ తెలిపారు. కాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల కనుగుణంగా నగరంలో పచ్చదనాన్ని పెంచి, కాలుష్యాన్ని నియంత్రించి, ఉష్ణోగ్రతలు తగ్గించి, ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందించేకు ప్రతియేటా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హరితహారం కోసం జీహెచ్ఎంసీ ఆయా నర్సరీల్లో మొక్కల్ని సిద్ధం చేస్తోంది. మియావాకీ అంటే.. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్‌కు చెందిన బొటానిస్ట్ అకీరా మియావాకీ కనుగొనడంతో ఈ పేరు వచ్చింది. సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్‌లలో అర్బన్ ఫారెస్ట్‌లను అభివృద్ధి చేయనున్నారు. అక్కడ మియావాకీ విధానాన్ని అమలు చేయనున్నారు. నగరవ్యాప్తంగా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
గుడ్రంగా తిరుగుతున్న మొక్క
-
ఆ రాణికి చిన్ననాటి నుంచే చెట్లంటే ప్రాణం
సాక్షి, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడంతో మొక్కలు నాటి వన సంపదను పెంచడం కోసం ఒక్కో దేశం ఒక్కోరకమైన ఉద్యమాలను చేపట్టాయి. ప్రస్తుతం భారత దేశంలో ‘గ్రీన్ చాలెంజ్’ పేరిట సెలబ్రిటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా, ఇంగ్లండ్‌లో ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ అన్న ప్రచారంతో మొక్కలు నాటే ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తోంది. లండన్ నగరంలో ఈ ఉద్యమానికి ‘ది నేషనల్ ట్రస్ట్’ నాయకత్వం వహిస్తోంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరం చుట్టూ ఐదు భారీ వనాలు ఉన్నాయి. ఒక్కో వనంలో కోటి పాతిక లక్షల వరకు చెట్లను ఇప్పటికే పెంచారు. ఒక్కో వనం 25వే హెక్టార్ల విస్తీర్ణం ఉంటుంది. అదనంగా మరో 30 వేల హెక్టార్లలో భారీ వక్షాల సంరక్షణ బాధ్యతను ఈ ట్రస్టే చూస్తోంది. ఇప్పుడు ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ ఉద్యమం సందర్భంగా ఈ ఐదు వనాల్లోకి పర్యాటకులను ఉచితంగా అనుమతిస్తోంది. అంటే 20 పౌండ్ల (దాదాపు 1850 రూపాయలు) చార్జీలను రద్దు చేసింది. అలాగే ఒక రోజు వేలాడే టెంటులో బస చేసే చార్జీల్లో వంద పౌండ్లను అంటే, దాదాపు ఏడు వేల రూపాయలను తగ్గించింది. అయితే ఒక షరతు వచ్చే పర్యాటకుడు తప్పనిసరిగా ఓ చెట్టును తీసుకొచ్చి ఈ వనంలో నాటాల్సి ఉంటుంది. ఇది కూడా నగర ప్రజలకు మాత్రమే పరిమితం. బ్రిటష్ రాణి ఎలిజబెత్–2 అలెగ్జాండ్ర మేరి స్ఫూర్తితోని ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ అని పేరు పెట్టి ఉంటారు. ఆమె ఒక్క ఇంగ్లండ్‌లోనే కాకుండా కామన్వెల్త్ దేశాలతో సహా 53 దేశాల్లో ఆమె చెట్లను విరివిగా నాటడం వల్ల ఆమెను ‘ట్రీ ఏంజెల్’ అని పిలుస్తారు. ఎలిజబెత్ రాణి తన 11 ఏళ్ల ప్రాయంలో స్కాట్లాండ్లోని తన తల్లి ఇల్లైన గ్లామిస్ క్యాజల్ ఆవరణలో 1937లో మొదటిసారి మొక్కను నాటారు. అప్పటి నుంచి ఆమె మొక్కలు నాటే ఉద్యమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. -
ప్రమాదం తప్పింది!
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ పాతగవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లేదారిలో ఏలూరు లాకుల సమీపంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఆటోపై చెట్టు విరిగిపడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఏలూరు కాల్వగట్టు పొడవునా పెద్ద చెట్లు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో ఆటో, రిక్షా వాలాలు చెట్లకిం ద వాహనాలు నిలిపి సేదతీరు తూ ఉంటా రు. ఎప్పటిలాగే ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను పార్క్ చేసి పక్కకు వెళ్లాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కాల్వగట్టుపై ఉన్న జామాయిల్ చెట్టు విరిగి ఆటోపై పడింది, ఈ ఘటనలో ఆటో పై భాగం దెబ్బతింది. చెట్టు విరిగిపడిన సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత సమయం తరువాత చెట్టును తొలగించి ఆటోను అక్కడి నుంచి తరలించారు. -
పైపై పూతలు మనుషులకే!
ఒకసారి యేసుక్రీస్తు యెరికో పట్టణం గుండా వెళుతున్నాడు. అప్పుడు పన్ను వసూలు చేసే అధికారి జక్కయ్య అనే వ్యక్తి యేసు గురించి అప్పటికే ఎంతో గొప్పగా విని ఉండటం చేత యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అతడు ధనవంతుడు. కాని పొట్టివాడు కావడంతో యేసును చూడాలనుకొని ఆయన చుట్టూ చేరిన జనసందోహంలోకి చొచ్చుకుని పోయి యేసును చూడలేకపోయాడు. దాంతో అతను ఒక మేడి చెట్టు ఎక్కి యేసును తదేకంగా చూడసాగాడు. అతని అంతరంగాన్ని, తన పట్ల అతనికి గల ప్రేమాభిమానాలను గుర్తించిన యేసుక్రీస్తు అతనితో – జక్కయ్యా త్వరగా చెట్టు దిగి రమ్ము, ఈ రోజు నేను నీ గృహంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానన్నాడు. అందుకతడు సంతోషించి, యేసును అతని ఇంటికి ఆహ్వానించాడు. అందరూ అది చూసి ‘ఇదేం విడ్డూరం! ఈయన పాపిౖయెన మనుష్యుని ఇంట బస చేయడానికి వెళ్లాడు’ అని గుస గుసలాడుకోసాగారు. యేసును చూసిన ఆనందంతో జక్కయ్య – ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకిచ్చేస్తాను. నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా దేనినైనను సంపాదించిన యెడల అంతకు నాలుగు వంతులు అదనంగా ఇస్తానని ఆయన పాదాల నంటి వాగ్దానం చేశాడు. అందుకు యేసు – జక్కయ్యా! నీవు కూడా అబ్రహాము కుమారుడవే, నేడు ఈ ఇంటికి ‘రక్షణ’ వచ్చింది, పాడైపోయిన వ్యవస్థను చూచి, రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడని చెప్పాడు (లూకా 19:1–10). మనుషుల అంతరంగాన్ని ఎరిగినందుననే పాపిగా మనుష్యులు సణుగుకొన్న జక్కయ్య ఇంటికి వెళ్లాడు యేసుక్రీస్తు. పాపిగా ఎంచబడ్డ గోడను అడ్డు తొలగించి రక్షణ కలిగించాడు. ఈ తేడాలు, మనుష్యులకే కాని దేవుని దృష్టిలో అందరూ సమానులేనని చెప్పకనే చెప్పాడు. పై పై రూపాలు, పైపై పూతలను చూసి మోసపోయేది మనుషులే కాని, దేవుడు కాదు కదా... యెహోవా హృదయమును లక్ష్యపెట్టాడు. అందుచేత హృదయములోని తలంపు యెరిగి జక్కయ్య వద్దకు యేసుక్రీస్తు వెళ్లాడు (1 సమూ 16:7).– బి.బి.చంద్రపాల్ కోట -
'బవొబాబ్' 500 ఏళ్లు
రాయదుర్గం: భౌగోళిక వాతావరణాన్ని బట్టి కొన్ని చెట్లు కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుతాయి. ముఖ్యంగా మధ్య ఆఫ్రికాలో ఉండే వాతావరణం, మట్టి మరో ఖండంలోగాని, దేశంలోగాని కనిపించవు. అక్కడ పెరిగే చెట్లు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ‘మడగాస్కర్ ట్రీ’గా పేరు పొందిన ‘బవొబాబ్’ ఎంతో ప్రత్యేకం. ఇవి బయటి ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదే. ఈ మహా వృక్షాలు ఆస్ట్రేలియాలో రెండు చోట్ల కనిపిస్తాయి. కానీ మన దేశంలో మాత్రం దాదాపు 38 ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. పైగా ఈ అరుదైన వృక్షాలు నగరంలోనే నాలుగు ఉన్నాయి. అందులో ఒకటి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమర్‌రాజా భవనం ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే నిర్మిస్తున్న భవన ప్రాంగణంలో ఉంది. దీని వయసు దాపు 500 ఏళ్లకు పైగానే ఉండడం విశేషం. కాండం నిండా నీరే... సాధారణంగా ఎచెట్టయినా కాలానుగుణంగా ఆకులు రాలుస్తుంది. కానీ బవొబాబ్ చెట్టుకు మాత్రం ఆకులు రాల్చడం చాలా అరుదు. ప్రాంతాన్ని బట్టి ఈ చెట్టుకు చాలా పేర్లే ఉన్నాయండోయ్. ‘బాటిల్ ట్రీ, ది ట్రీ ఆఫ్ లైఫ్, అప్సైడ్డౌన్ ట్రీ, మంకీబ్రీడ్ ట్రీ, హతీజాడ్’ వంటి పేర్లతో పిలుస్తుంటారట. ఇది దాదాపు 30 మీటర్ల వరకు పెరుగుతుంది. అంతేకాదు.. ఇవి వేల సంవత్సరాలు బతుకుతాయి కూడా. ఈ వృక్షం కాండంలో సుమారు 1,20,000 లీటర్ల నీరు ఉంటుందని అంచనా. ఈ చెట్టుకు అరుదుగా కాసే కాయలు కొబ్బరి బొండాం తరహా ఉంటుంది. మడగాస్కర్ జాతీయ వృక్షం ఇదే.. హిందూ మహాసముద్రంలో గల మడగాస్కర్ దేశం జాతీయ వృక్షంగా ఈ బబొబాట్ వృక్షం గుర్తింపు పొందింది. వీటిలో తొమ్మిది రకాల జాతులు ఉన్నాయి. అందులో ఆరు రకాలు మడగాస్కర్ ప్రాంతంలో ఉండగా, రెండు రకాలు ఆఫ్రికాలోను, ఒక రకం ఆస్ట్రేలియా, మూడు రకాలు మన దేశంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికాలో ఈ చెట్టు బెరడును సబ్బులు, మందుల తయారీలోనూ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఆరు చోట్ల చారిత్రక ఆధారాల ప్రకారం మనదేశంలో ఈ వృక్షాలు 38 చోట్ల మాత్రమే పెరుగుతున్నట్టు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు చోట్ల ఈ వృక్షాలు ఉండగా.. అందులో నాలుగు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండడం విశేషం. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకటి ఉండగా.. అత్తాపూర్, వనస్థలిపురం, చప్పల్రోడ్కు సమీపంలో, చెంగిచెర్ల రిజర్వు ఫారెస్ట్లోను, నల్గొండ జిల్లా బాలచంద్రునిగుట్టపై శివాలయం సమీపంలో ఈ వృక్షాలు ఉన్నట్టు వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అమర్‌రాజా భవనం ఎదురుగా ఉన్న వృక్షం వయసు సుమారు 500 ఏళ్లుగా అంచనా వేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో రంగనాథస్వామి దేవాలయం మాత్రమే ఉండేది. నగరీకరణ నేపథ్యంలో ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ అరుదైన వృక్షం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ మడగాస్కర్ చెట్టు కనిపిస్తున్నా భవిష్యత్‌పై మాత్రం అనుమానం వ్యక్తమవుతోంది. ఈ అరుదైన వృక్ష జాతిని పరిరక్షించి, భావి తరాలకు అందించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. -
200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ ప్రభుత్వం ఒకప్పుడు చెట్లతోపాటు, వెలుతురు (ఎండ)కు ఎక్కువ ప్రాధాన్యతన ఇచ్చేది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మధ్య వెలుతురుకు బదులు చెట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా ఓ చెట్టును కొట్టివేస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా, ఎక్కువ చెట్లను కొట్టివేస్తే అసాధారణ జరిమానా విధించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని తన పెరంట్లోని చెట్టును రక్షించుకునేందుకు ఇంగ్లండ్‌లోని బర్న్లీ పట్టణ ప్రాంతంలోని 51 ఏళ్ల జిల్ సార్చెట్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సార్చెట్‌కు వృక్ష సంపద అంటే ఎంతో ఇష్టం. అందుకోసం ఆమె ప్రాచీన వృక్ష సంపద కలిగిన ఓ ఇంట్లో గత పదేళ్లుగా నివసిస్తున్నారు. ఆమె ఇంటి పెరట్లో వంద అడుగుల ఎల్తైన 200 ఏళ్ల నాటి రావి చెట్టు ఉంది. ఆ చెట్టు గత కొద్ది రోజులుగా గోధుమ రంగులోకి మారుతుండడం చూసి సార్చెట్‌కు అనుమానం వేసింది. దగ్గరికెళ్లి చూడగా, చెట్టు కాండం చుట్టూ ఐదు అంగుళాల లోతు చొప్పున 52 డ్రిల్లింగ్ చేసిన రంధ్రాలు ఉన్నాయి. వాటి వద్ద ముక్కు పెట్టి వాసన చూడగా, ఒక విధమైన విష రసాయనం వాసన వస్తోంది. ఇది పక్కింటావిట కుట్రేనని సార్చెట్ ఆరోపిస్తోంది. ఆ చెట్టు వల్ల తమ ఇంట్లోకి ఎండ రావడం లేదంటూ పక్కింటావిడ గత కొన్ని నెలలుగా గొడవ చేస్తోందని, దాన్ని కొట్టి వేయాల్సిందిగా సూచిస్తూ వచ్చిందని, అందుకు నిరాకరించడంతో ఆమె ఈ కుట్ర పన్ని ఉంటుందని సార్చెట్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సార్చెట్‌కు బర్న్లీ కౌన్సిలర్, మాజీ లిబరల్ డెమోక్రట్ ఎంపీ గోర్దాన్ బర్ట్ విజిల్ మద్దతిస్తున్నారు. కొన్ని టన్నుల కొద్ది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకొని టన్నుల కొద్ది ఆక్సిజన్‌ను ఈ రావి చెట్టు ఇస్తోందని, ఈ చెట్టుపై పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని, అలాంటి చెట్టును చంపేయడానికి ఎలా చేతులొచ్చాని సార్చెట్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కింటి వారు పెరట్లోకి ప్రవేశించకుండా సార్చెట్ 50 వేల రూపాయలతో కంచె నిర్మాణం చేపట్టారు. చెట్టును రక్షించేందుకు ఆమె వృక్ష శాస్త్రవేత్తలను కూడా పిలిపించారు. చెట్టును బతికించడం కష్టమేనని, అయినా తమ వంతు ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు. ఇదే విషయమై పోలీసులను సంప్రతించగా, తాము ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టామని, ఇంకా పక్కింటి వారిపై కేసు దాఖలు చేయలేదని, కేసు దాఖలు చేయకుండా వారి వివరాలు బయట పెట్టడానికి వీల్లేదని చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు వారు నిరాకరించారు. -
కేటీఆర్ స్ఫూర్తితో..
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ఛాలెంజ్‌ను టాలీవుడ్ హీరో నితిన్ తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ఛాలెంజ్‌ను టాలీవుడ్ హీరో నితిన్ తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి.. నితిన్‌తో పాటు మాజీ ఎంపీ కవిత, విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేశారు. దీన్ని స్వీకరించిన నితిన్ తన పెరట్లో మొక్కలు నాటారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం మంచి ప్రయత్నమని, ఇలాంటి సామాజిక బాధ్యతతో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రపంచాన్ని అందంగా మార్చడంలో తన బాధ్యతను గుర్తు చేసే ఏ సవాలైనా స్వీకరించడానికి తాను సిద్ధమని.. తన పని పూర్తి చేశానన్నారు. ఇప్పుడు మీ ఫాలోవర్స్ సమయం ఆసన్నమైందని, ‘హ్యాపీబర్త్ డే కేటీఆర్’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. నాన్నకు ప్రేమతో.. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన తనయుడు హిమాన్స్ యాదగిరినగర్‌లోని శ్రీకుమార్ హైస్కూల్లో కేక్ కట్ చేశారు. -
చిన్నోడికి ‘చిలుక’ కష్టాలు
రాంచీ : చిలుక చాలా అందమైన రంగుల పక్షి. దాన్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. దాని పలుకులు వింటే నవ్వోస్తుంది. అది కనిపిస్తే పట్టుకోవడానికి ట్రై చేస్తాం.. పారిపోతే వదిలేస్తాం. కానీ మనోడు మాత్రం చిలుక కోసం ఏకంగా 40 ఫీట్ల పొడవు ఉన్న చెట్టు ఎక్కి.. చేతిని విరగ్గొట్టుకొని.. చివరకు చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని గధ్వాకు చెందిన బబ్లూ అనే వ్యక్తికి గత మంగళవారం ఉదయం ఓ చిలుక కనిపించింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ బబ్లూ.. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ చిలుక దగ్గర్లో ఉన్న చెట్టు తొర్రలోకి తుర్రుమని పారిపోయింది. వెంటనే మనోడు 40 అడుగుల ఎత్తు ఉన్న చెట్టును చకచకా ఎక్కేశాడు. చిలుక కోసం తొర్రలో చెయ్యి దూర్చాడు. కానీ ఆ తొర్ర నుంచి అతగాడి చెయ్యి రాలేదు. దీంతో గట్టిగా చేతిని లాగే ప్రయత్నం చేశాడు. బబ్లూ ఒక్కసారిగా చేతిని లాగడంతో బ్యాలెన్స్ తప్పి కొమ్మ నుంచి కిందకు జారాడు. అదృష్టం కొద్ది కిందపడకుండా కొమ్మ భాగాన్ని పట్టుకొని గాల్లో వేలాడుతూ కన్పించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రేన్ సహాయంతో బబ్లూను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. చెట్టు తొర్ర నుంచి చేతిని లాగే క్రమంలో చేతి మణికట్టు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు చిలుక కోసం చిన్నోడు పడ్డ కష్టాలు చూసి స్థానికులు తెగ నవ్వుకుంటున్నారు. -
మహా వృక్షం.. ఇప్పుడు లైబ్రరీగా మారింది
వయసు పైబడి, ఎండిపోయిన చెట్టు కనిపిస్తే ఏం చేస్తారు? కలప కోసమో, వంట చెరకు కోసమో నరికేస్తారు. ఎలాగో చనిపోయింది కాబట్టి ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. కానీ అమెరికాలోని బోయిస్ ప్రాంతానికి ఆర్టిస్ట్ కమ్ లైబ్రేరియన్ అయిన షరాలీ ఆర్మిటేజ్ సృజనాత్మకంగా ఆలోచించింది. అప్పటికే కొమ్మలన్నీ నేలరాలి, మోడుగా మిగిలిన 110 ఏళ్ల కిందటి చెట్టును ఓ అందమైన లైబ్రరీగా మార్చేసింది. దానికి ‘లిటిల్ ఫ్రీ లైబ్రరీ’ అని పేరు పెట్టింది. నిజానికి ఈ పేరుతోనే ఓ ఎన్జీవో ఉంది. దీనికి 88 దేశాల్లో లైబ్రరీ షేరింగ్ నెట్వర్క్ ఉంది. ఎవరికి ఏ బుక్ కావాలన్నా తీసుకోవడం, చదివిన వెంటనే తిరిగి ఇచ్చేయడం ఈ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది. ఈ సర్వీస్ అంతా ఫ్రీనే. ఇప్పుడా నెట్‌వర్క్‌లోనే ఈ చెట్టు లైబ్రరీని చేర్చింది షరాలీ. చెట్టు కాండానికి ఓ డోర్ పెట్టింది. లోపల అరలు ఏర్పాటు చేసి బుక్స్‌ను అందులో ఉంచింది. ఈ చెట్టు లైబ్రరీ ఫొటోను గతేడాది డిసెంబర్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే లక్ష మందికిపైగా షేర్ చేశారు. -
శ్రీ కొత్త అల్లుడుగారు
చెట్టు మీద ఉన్న శవాన్ని ఎప్పటిలాగే భుజాన వేసుకున్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! ఏదో చెప్పబోవుచున్నావు?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘చెప్పడమా పాడా.... నములుచున్నాను. సంక్రాంతి పిండి వంటలు భలే పసందుగా ఉన్నవి’’ నములుతూనే చెప్పాడు విక్రమార్కుడు.‘‘నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక ప్రశ్న అడుగుతాను. ఓకేనా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఓకే’’ అన్నాడు మురుకులు నములుతూ విక్రమార్కుడు.‘‘విక్రమార్కా! పండక్కి అత్తారింటికి వెళ్లని అల్లుడు ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఉన్నాడంటావా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఎందుకులేడు, ఒకే ఒక్కడున్నాడు’’ అన్నాడు విక్రమార్కుడు అర్ష ముక్క నోట్లో వేసుకుంటూ.‘‘యూ మీన్ అర్జున్?’’ అన్నాడు భేతాళుడు.‘‘కాదెహే... నేను చెప్పేది చె.చె. గురించి’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘చె.చె? అదేం పేరు!’’ ఆశ్చర్యపడ్డాడు భేతాళుడు.‘‘చెంబూరు చెంగయ్య. షార్ట్కర్ట్లో చె.చె. అని పిలుస్తుంటారు’’ వివరించాడు విక్రమార్కుడు.‘‘ఈ చెంగయ్య పండక్కి అత్తారింటికి ఎందుకు వెళ్లడు? ఆ కథాకమామిషు ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు:అనగనగా ఒక చెంగయ్య. అతనికి కొత్తగా పెళ్లయింది. పెళ్లయిన కొన్నిరోజులకు పెద్ద పండగ వచ్చింది.‘‘మీరు పండక్కి తప్పనిసరిగా రావాలి అల్లుడు’’ అని గోముగా అడిగాడు మామ.‘‘అలాగే మామయ్య... తప్పకుండా వస్తాను’’ అంటే లెవల్ పడిపోతుందని...‘‘అబ్బే! కుదరదు మామయ్య.... బోలెడంత పని ఉంది’’ అబద్ధమాడాడు చెంగయ్య.‘‘ఓకే అల్లుడూ...పని ముఖ్యం. పని పట్ల నీ శ్రద్ధ నాకు బాగా నచ్చింది. పనికొచ్చే లక్షణం’’ అని నాన్‌స్టాప్‌గా పొగడటం మొదలుపెట్టాడు మామయ్య.ఆయన పొగడ్తల్లో ‘పొగడ్త’ కంటే... ఖర్చు తప్పిందనే సంతోషమే ఎక్కువగా ధ్వనించింది.‘కలికాలం. ఏదో మాట వరసకు పని ఉందంటే, ఖండించాల్సింది పోయి, ఏది ఏమైనా మీరు తప్పకుండా రావాలి అని బతిమిలాడాల్సింది పోయి.... తాపీగా ఓకే అంటాడా’ తనలో తాను కుమిలిపోయాడు చెంగయ్య. అది పండగరోజు.పెద్ద బ్యాగుతో ఊడిపడ్డ అల్లుడిని చూసి ఆటంబాంబును చూసినట్లు అదిరిపడ్డాడు చెంగయ్య.అయినప్పటికీ ఆ అదురు పాటును ముఖంలో కనిపించకుండా...‘‘చాలా సంతోషంగా ఉంది అల్లుడు’’ అంటూ మందులో సోడా కలిపినట్లు నవ్వులో ఏడ్పును కలిపాడు మామయ్య.అల్లుడుగారికి అత్తారింటి మర్యాదలు మొదలయ్యాయి.‘ఆపరేషన్ పిండివంటలు’ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతుంది.‘‘నేను పిండివంటలు పెద్దగా తిననండి’’ అంటున్నాడు అల్లుడు. అయినా తింటూనే ఉన్నాడు!‘‘అయ్యో! కడుపు నిండింది’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘‘ఇక చాలు’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘చాలు బాబోయ్’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.కొద్దిసేపటి తరువాత...అతడి కడుపులో సునామీమొదలైంది.ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అవి ‘స్వచ్ఛ్భారత్’ ‘ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి’ లేని రోజులు. ఎంతటి మొనగాడైనా చెంబట్టుకొని ఊరవతలికి పోవాల్సిందే.కడుపులో ఏదో కీడు శంకించడంతో తినడం ఆపేశాడు చెంగయ్య.వింటి నుంచి దూసుకొచ్చిన బాణంలా ఇంటి వెనక్కి దూసుకొచ్చి చెంబు పట్టుకొని అదే వేగంతో వీధిలోకి పరుగులు తీశాడు.ఇప్పుడు మనం పీపారాయుడి గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ రాయుడి ఇంటి ముందు ప్రతి సంక్రాంతికి గొబ్బెమ్మ పెడతారు. ఇందులో విశేషం ఏముంది అందరి ఇండ్ల ముందు గొబ్బెమ్మలు పెడతారనే కదా మీ డౌటు! కానీ ఊళ్లో ఉన్న గొబ్బెమ్మల కంటే ఈ గొబ్బెమ్మ పెద్దది. ఎత్తయినదీనూ!‘గొబ్బెమ్మ అయినా సరే మన తాహతకు తగినట్లు ఉండాలి’ అంటాడు పీపారాయుడు.మరి అలాంటి గొబ్బెమ్మకు ఏమైంది?ఏమీ కాలేదు... కానీ చెంగయ్యకి అయ్యింది.చెంబుతో పరుగెత్తుకుంటూ వస్తున్న చెంగయ్య పీపారాయుడి గొబ్బెమ్మను తాకి బొక్కబోర్లా పడ్డాడు. పడితే పడ్డాడు... కానీ అతని చేతిలోని చెంబు వెళ్లి పీపారాయుడి బట్టతల మీద పడింది.పడితే పడింది కాని చెంబుదెబ్బకు పీపారాయుడి మతి చలించింది.అతని నోటి నుంచి వింతవింత మాటలు వినిపిస్తున్నాయి.వెంటనే డాక్టర్‌ను పిలిపించారు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైన పని ఏదీ లేదు డాక్టర్!’’ అన్నాడు పీపారాయుడు.‘‘ఎవరయ్యా రాయుడిగారికి మతిచలించింది అని చెప్పింది.... శుభ్రంగా మాట్లాడుతుంటేనూ.... ఆయన మాటల్లో పిచ్చి ఎక్కడిది? ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. అంతేగా!’’ భరోసాగా అన్నాడు డాక్టర్.‘‘నేను చెప్పినదానితో ఏకీభవిస్తారా డాక్టర్?’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత గొప్పగా చెప్పారండీ’’ తన్మయంగా వంకర్లు తిరిగాడు డాక్టరు. ‘‘మీ సూది ఇలా ఇస్తారా డాక్టరు’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఎందుకు?’’ భయంగా అడిగాడు డాక్టర్.‘‘ఆ సూదిబెజ్జంలో దూరుతాను... ఈ ప్రపంచంలో అసాధ్యమైంది లేదు...’’ అంటున్నాడు రాయుడు.‘‘ఓరి నాయనో...’’ అంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడు డాక్టరు.‘‘మా రాయుడిని విత్ ఇన్ టెన్మినిట్స్లో పిచ్చెక్కిస్తావా? నీకు ఎన్ని గుండెలు?’’ అంటూ చెంగయ్యను చావబాదడమే కాకుండా, ‘‘ఇక ముందు ఎప్పుడూ మా ఊళ్లోకి అడుగుపెట్టవద్దు’’ అని శాసనం చేశారు ఊరి ప్రజలు. ఇక అప్పటి నుంచి అత్తింటివారి ఊరి పేరు వింటే చాలు గజగజా వణికిపోతాడు చెంగయ్య! – యాకుబ్ పాషా -
‘బర్త్ డే విత్ ఎ ట్రీ’
రాయదుర్గం: పుట్టిన రోజు అనగానే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, కేక్ కట్ చేయడం దాన్ని అంతా కలిసి బర్త్ డే చేసుకొనే వ్యక్తి ముఖానికి కేకంతా పూయడం ఇదో ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. కానీ అందుకు భిన్నంగా గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. బర్త్ డే రోజున ఒక మొక్కను నాటాలని నిర్ణయించారు. ‘షేర్ యువర్ బర్త్‌డే విత్ ఏ ట్రీ’ పేరిట నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 2016 జూలై 16న క్యాంపస్‌లోని వైల్డ్‌లెన్స్ టీం ఆధ్వర్యంలో బర్త్‌డే పార్కును ఏర్పాటు చేశారు. హెచ్‌సీయూలోని సౌత్ క్యాంపస్ ప్రాంతంలోని స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ సమీపంలో 1000 గజాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ బర్త్‌డే పార్కును వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలె అప్పారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పటి వరకు 300 మొక్కలను బర్త్ డే పార్కులో నాటడం విశేషం. జీవితాంతంగుర్తుండిపోయేలా.. హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్ మొదలుకొని ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్‌టీచింగ్, ఉద్యోగ విరమణ చేసినవారు, విద్యార్థులు బర్త్‌డే పార్కులో మొక్కలు నాటడం ప్రారంభించడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. పుట్టిన రోజున ఓ మొక్కను నాటడం సంప్రదాయంగా, జీవితంలో ఆకుపచ్చని తీపి జ్ఞాపకంగా మిగిలిపోయేలా అందరి మనసుల్లో నిలిచిపోతోంది. తమ పుట్టిన రోజున మొక్కను నాటి.. తీరిక దొరికనప్పుడల్లా వచ్చి దానిని చూసుకొని గొప్ప అనుభూతిని పొందుతుండడం విశేషం. ఇప్పటికే వీసీ ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, వైల్డ్‌లెన్స్ బృందం నిర్వాహకుడు రవి జిల్లపల్లి, పరిశోధక విద్యార్థి మారుతి.. ఇలా చాలా మంది తమ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటారు. స్పందన భేష్.. బర్త్ డే రోజు మొక్కలు నాటే వినూత్న ఆలోచనకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 300 మొక్కలను నాటారు. ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్‌టీచింగ్ ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇందులో భాగస్వాములు కావడం అభినందనీయం. – రవి జిల్లపల్లి, వైల్డ్‌లెన్స్ వ్యవస్థాపకుడు -
టెస్ట్ ట్యూబ్ చెట్లు!
బ్రిటన్: టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి విన్నాం. కానీ... ఈ టెస్ట్ ట్యూబ్ చెట్లు ఏంటని ఆలోచిస్తున్నారా? అంతరించి పోతున్న వృక్ష జాతిని సంరక్షించడానికి శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన విధానమే ఈ టెస్ట్ ట్యూబ్ చెట్లు. ప్రపంచంలో అనేక వృక్షాల జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వృక్షజాతుల్లో ఐదింట్లో ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందుకే వాటిని పరిరక్షించడంపై దృష్టి సారించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టెస్ట్ ట్యూబుల్లో చెట్లను పెంచుతున్నారు. ఈ టెస్ట్ ట్యూబ్ చెట్ల విధానం ఇన్సూరెన్స్ పాలసీలాంటిదని బ్రిటన్‌లోని వెస్ట్ ససెక్స్లోగల క్యూస్ మిలీనియం సీడ్ బ్యాంక్‌లో పని చేస్తున్న డాక్టర్ జాన్ డికీ అభిప్రాయపడ్డారు. అంతరించి పోయే ప్రమాదమున్న విత్తనాలను సీడ్ బ్యాంక్‌లో ఉన్న రేడియేషన్ ప్రూఫ్ నేల మాళిగల్లో భద్రపరుస్తున్నారు. 2020 నాటికి అంతరించిపోయే ప్రమాదం ఉన్న వృక్షాల్లో కనీసం 75 శాతం వృక్ష జాతులను పరిరక్షించడం వీరి లక్ష్యం. సీడ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మరో పరిశోధకులు డేనియల్ బాలెస్టెరోస్ మాట్లాడుతూ.. ‘సీడ్ బ్యాంక్ ఫ్రీజర్‌లో భద్రపరిచినట్లు, అన్ని రకాల మొక్కల విత్తనాలను ఎండబెట్టి భద్రపరచడం సాధ్యం కాదు. ఉదాహరణకు సింధూర వృక్షం లేదా చెస్ట్నట్ విత్తనాలు చాలా సున్నితమైనవి. వాటిని ఎండబెడితే వాటి నుంచి చెట్లు రావు. ఇలాంటి విత్తనాల పరిరక్షణ కోసం ‘క్రయోప్రిజర్వేషన్’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ విధానం ద్వారా మొక్క బీజాన్ని విత్తనం నుంచి వేరు చేసి, దాన్ని ద్రవరూప నైట్రోజన్‌లో అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఘనీభవింజేస్తాం. ఇలాంటి సీడ్ బ్యాంకుల ఉపయోగం ఇప్పటికే కనిపిస్తోంది. బ్రిటన్‌లో అంతరించిపోతున్న పచ్చికబయళ్లను సీడ్ బ్యాంక్‌లో భద్రపర్చిన విత్తనాల ద్వారా పరిరక్షించే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయ’న్నారు. -
దెయ్యం చెట్టు..!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏడాకుల పాల.. ఈ చెట్టు శాస్త్రీయ నామం ఆల్సో్టనియా స్కాలరీస్. వరంగల్ జిల్లాలో 50 లక్షలకు పైగానే పెరుగుతున్నాయి. అడవుల్లో పుట్టిన ఈ వృక్షాన్ని ఆదిమ జాతి గిరిజనులు దెయ్యం చెట్టు అని పిలుస్తారు. చెట్టు వైపు కన్నెత్తి కూడా చూడరు. దాని నీడను తాకడానికి కూడా భయపడుతారు. ఎందుకంటే ఈ వృక్షం మీద దెయ్యాలు ఉంటాయంటారు. ఇటీవల పరిశోధనల్లో ఇది నిజంగా దెయ్యపు వృక్షమే అని తేలింది. దీని పుప్పొడి రేణువులు మానవాళికి అత్యంత ప్రమాదకరమని, శ్వాస కోశ వ్యాధులు, అస్తమా, అలర్జీ వస్తుందని తేలింది. అదే పనిగా చెట్టు కింద ఉండేవారి ఊపిరితిత్తుల్లో పుప్పడి రేణువులు పేరుకపోయి స్పృహ కోల్పోతారని తేలింది. ప్రధానంగా చెట్టు సమీపంలో నివసించే వారికి, మార్నింగ్ వాక్ చేసే వాళ్లు, వృద్ధులు, పిల్లల మీద ప్రభావం ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ హరితహారంలో ఈ మొక్కలను నాటొద్దని అటవీ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరోగ్యంపై ప్రభావం.. నీళ్లు లేకపోయిన ఏపుగా, అత్యంగా వేగంగా పెరిగే ఏడాకుల పాల చెట్టును హరితహారంలో భాగంగా వరంగల్ నగరంతోపాటు సమీప ప్రాంతంలో భారీ ఎత్తున నాటారు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం 50 లక్షలకు పైగానే మొక్కలను నాటినట్లు తెలుస్తోంది. ఈ పొడవైన, సొగసైన వృక్షం కఠినమైన బూడిదరంగు బెరడును కలిగి ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు వలయంగా, ఆకులు ఒకే చోట అనేకం వస్తాయి. ఈ ఆకులు కొంచెం గుండ్రంగా, తోలు వలె ముదురు ఆకుపచ్చగా గుచ్ఛంలా ఉంటాయి. దాదాపుగా ఒక్కో గుచ్ఛానికి ఏడు ఆకులే ఉంటాయి, ఈ ఆకులను గిల్లుతే పాలు కారుతాయి. అందువలనే ఈ చెట్టును ఏడాకుల పాల అని పిలుస్తారు. ఇప్పుడా మొక్కలు పెరిగి పెద్దవి అయ్యాయి.. పుష్పిస్తున్నాయి. ఇవి వెదజల్లుతున్న పుప్పడితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్టోబరులో అంటే చలికాలం సీజన్లో ఈ చెట్టు కొమ్మలకు ఉన్న పుష్పాలు అన్నీ ఒకే సారి పుష్పిస్తాయి. లక్షల కొద్ది పుప్పడిని బయటికి వెదజల్లుతాయి. చలి మంచుకు çపుప్పడి రేణువులు బరువుగా మారి వాతావరణంతో మనుషుల శ్వాసకు అందే ఎత్తులో వాతావరణంలో తేలియాడుతూ ఉంటాయి. దీంతో మనుషుల్లో అలర్జీ, అస్తమా, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. వచ్చే హరితహారంలో వీటిని నాటం ఏడాకుల పాల చెట్లతో అస్తమా రోగులకు ఇబ్బంది అనేది కొంత మేరకు వాస్తవమే. ఇప్పటివరకు 50 లక్షల మొక్కల వరకు నాటాం. వచ్చే హరితహారం నుంచి ఆ మొక్కలను పెట్టం. నీడనిచ్చే మొక్కలు కాబట్టి వీటి పెంపకాన్ని చేపట్టాం. ఆరోగ్యపరంగా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతంలో తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. – కె.పురుషోత్తం, అర్బన్ జిల్లా ఇన్చార్జి అటవీ శాఖాధికారి ఊపిరితిత్తులపై ప్రభావం.. ఏడాకుల పాల చెట్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇవి ప్రమాదరకమని తెలియక నాటడంతో పెరిగాయి. పుప్పడి రేణువులతో మనుషులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. లక్షలాది పుప్పొడి రేణువులు గాలిలో కలిసిపోతాయి, వాటిని పీల్చడం వల్ల మనుషులకు అలర్జీ, అస్తమా, కళ్లమంటలు వస్తాయి. అంతేగాకుండా ఊపిరితిత్తులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. – వి.కృష్ణారెడ్డి, కేయూ బాటనీ ఆచార్యులు కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఏడాకుల పాలతో ప్రమాదకరమే. కిడ్నీ, ఊపిరితిత్తులు, చర్మ, కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి. నా దగ్గరకు వచ్చే పేషెంట్లను చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించమని సలహా ఇస్తాను, ఏడాకుల పాల చెట్టు సమీపంలో ఉన్న వాళ్లకు సీజన్ ముగిసే వరకు దానికి దూరంగా ఉండడం మంచిదని సలహా ఇస్తున్నాను. – డాక్టర్ శ్రీనివాసవర్మ, చెస్ట్ ఫిజీషియన్ -
చెట్టు మీద పడి వ్యక్తి మృతి
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం నల్లకుంటలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై రోడ్డు పక్కన ఎండిన చెట్టు మీద పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు చిన్నగొల్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి(30)గా గుర్తించారు. -
మృత్యు ఒడిలో అడవి రాజు
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే వృక్షం మృత్యువుతో పోరాడుతోంది. ఆ దేశంలోని కౌరీ వృక్షాల్లో ఇదే అత్యంత పురాతనమైనది కూడా. దీని వయసు దాదాపు 2500 ఏళ్లు. అందుకే దీన్ని టేన్ మహుటా(అడవి రాజు)అని ముద్దుగా పిలుచుకుంటారు. 13.77 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల ఎత్తు ఉండే ఈ చెట్టు ఉత్తర న్యూజిలాండ్‌లోని వైపోవా అటవీ క్షేత్రంలో ఉంది. కౌరీ జాతి వృక్షాలకు మాత్రమే సోకే అరుదైన కౌరీ డైబ్యాక్ వ్యాధి సోకడంతో టేన్ మహుటా అతి త్వరలో మరణించబోతోంది. దీంతో వేలాది మంది ఈ వృక్షాన్ని చివరిసారిగా సందర్శించేందుకు క్యూ కడుతున్నారు. ఏంటీ కౌరీ డైబ్యాక్ వ్యాధి? కౌరీ డైబ్యాక్ అనేది ఓ ప్రత్యేకమైన శిలీంధ్ర వ్యాధి. దీన్ని నిర్మూలించేందుకు ప్రస్తుతం మందు లేదు. దీంతో పవిత్రంగా భావించే కౌరీ వృక్షాలను సంరక్షించడం న్యూజిలాండ్‌లోని అటవీ శాఖ అధికారులకు సవాలుగా మారింది. అందుకే చెట్టును సందర్శించేందుకు వచ్చే యాత్రికుల నుంచి ఎలాంటి వ్యాధులు కౌరీ వృక్షానికి సోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఎంతో అందంగా కనిపించే కౌరీ చెట్లు చాలా బలమైనవి. వీటి చెక్కను పడవలు, ఇళ్లు నిర్మాణాల్లో వినియోగిస్తారు. అయితే, కౌరీ డైబ్యాక్ వ్యాధి ధాటికి పరిస్థితి మారిపోయింది. ఎక్కడో ఒకచోట అరుదుగా ఈ వృక్షం ప్రస్తుతం కనబడుతోంది. న్యూజిలాండ్ అడవుల్లోని మావోరి తెగ ప్రజలు కౌరీ వృక్షాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ సాయం కోసం కూడా అర్థిస్తున్నారు. టేన్ మహుటాకు వ్యాధి సోకి ఆరు నెలలు అవుతోందని లింకన్ విశ్వవిద్యాలయంలోని బయో ప్రోటెక్షన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన అమాండా బ్లాక్ తెలిపారు. -
చేసిన మోసం!
అదొక మామిడి చెట్టు. ఆకు కనిపించకుండా కాయలు విరగ్గాశాయి. దాని యజమాని చెట్టు నుండి పండిన కొన్ని కాయలు కోసుకుపోయాడు. అందరి దృష్టీ వాటి మీద పడింది. తలా కొన్ని కాయలు కోసుకుపోతున్నారు. కొన్ని కాయలు పండి నేలమీద పడుతున్నాయి. వాటిలో ఒక కాయ మాత్రం బాగా పిరికిది. ఆ పిరికి కాయ ఆకుల గుబుర్ల మాటున దాక్కుని అలానే ఉండిపోయింది. తన సహచరులందరూ దూరం అవడంతో గాభరా పడసాగింది. అలాగని తనంతట తాను పండి నేలమీద పడడం కానీ, ఎవరి కంటా పడడం కానీ ఇష్టం లేదు. దాంతో చెట్టుకే అతుక్కుపోయింది. తన మీద తనకు ఉన్న ‘మోహం’ దానిని బయటపడనివ్వలేదు. కానీ కాలం ఊరుకుంటుందా? కాయ కుళ్లి, అందులో పురుగులు పడ్డాయి. అలా చెట్టుకు ఉండగానే దానిని తినేయసాగాయి. అలా మరికొంత కాలం గడిచింది. చెట్టుకే ఎండి, మరింతగా అతుక్కుపోయింది ఆ పిరికి మామిడి. ఒకరోజు బాగా వేగంగా వీచిన గాలి, ఎండిన ఆకులతో సహా దీనిని కూడా తెంచి పక్కనే ఉన్న మురికి గుంటలో పడేసింది. అప్పుడు కానీ దానికి అర్థం కాలేదు తాను ఎందుకూ పనికి రాకుండా పోవడానికి తనలో దాగి ఉన్న మోహమే కారణమని. – డి.వి.ఆర్. -
13 తరాల చెట్టు.. పర్వతమే పట్టు
మీరెన్ని తరాలను చూశారు? మహా అయితే మీ ముందు 3 తరాలను చూసుంటారు. ఇక మీ తర్వాతి 3 తరాలను చూడగలరు. అదీ కూడా మీరు వందేళ్లు బతికితేనే! ఫొటోలో ఉన్న ఈ చెట్టును చూశారా.. ఇది పదమూడు తరాలకు ప్రత్యక్ష సాక్షి. ఈ చెట్టు వయసు 1,230 సంవత్సరాలు. ఐరోపా ఖండంలోనే ఇది అతిపురాతన వృక్షం. ఇంతటితో దీని కథ ముగిసిందనుకోకండి ఇంకా కొన్ని శతాబ్దాల వరకు బతుకుతుందట! దక్షిణ ఇటలీలోని పొల్లినొ జాతీయ పార్కులో ఉన్న ఈ చెట్టును యూనివర్సిటీ ఆఫ్ టుసికా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీని శాస్త్రీయ నామం హెల్డ్రీచ్ పైన్. ముద్దుగా ఇటాలస్ అని పిలుస్తారు. కార్చిచ్చు, తుపాన్లు వంటి భారీ ప్రకృతి విపత్తుల నుంచి ఎలా కాపాడుకోగలిగిందనే అనుమానం వస్తోంది కదూ? నిటారుగా ఉన్న పర్వతపు వాలు ప్రాంతంలో ఈ చెట్టు ఉండటమే కారణమట. ఆ పర్వతమే ఈ చెట్టుకు పట్టు అన్నమాట! ఈ చెట్టు వేర్లు పాక్షికంగా బయటకు ఉండటంతో రేడియోకార్బన్ డేటింగ్ పరిజ్ఞానం ద్వారా కచ్చితమైన వయసును అంచనా వేయగలిగారు శాస్త్రవేత్తలు. -
దివి నుంచి భువికి దిగిన దేవతావృక్షం
పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రి పూట వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. సాధారణంగా కింద పడిన పూలను పూజకు వాడరు. అయితే, పారిజాతపుష్పాల విషయంలో మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు కింద పడినా, వాటి పవిత్రత ఏమాత్రం చెడదు. పారిజాత పుష్పాలతో పూజ దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఈ పూలనుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు విరేచనకారిగా వాడతారు. దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న నిఫా వైరస్‌ను ఈ చెట్టు ఆకులతో నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుండి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. దీని ఆధారంగానే కదా నంది తిమ్మన రంచిన పారిజాతాపహరణం కథ నడిచింది.శ్రీ కృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది . ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కల నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వక్షం వికసిస్తుంది. అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. దీని వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా భావిస్తున్నారు. ఈ వృక్ష కాండం చుట్టుకొలత 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు. దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగకపోవడం ఈ వృక్షం ప్రత్యేకత. -
చెట్టుకింద వైద్యం..
మైదుకూరు టౌన్ : మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదు నెలలుగా ఆసుపత్రికి మరమ్మతులు జరుగుతుండటంతో పక్కనే ఉన్న ఆయుష్, క్లస్టర్ కార్యాలయంలోకి ఆసుపత్రిని మార్చారు. నిత్యం 300 నుంచి 320 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. సరైన సౌకర్యాలు లేక ఆవరణంలోని చెట్ల కిందనో, బల్లలపైనో పడుకొని చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆసుపత్రికి వచ్చే డాక్టర్లు సమయపాలన పాటించకపోవడంతో అక్కడి కిందిస్థాయి సిబ్బంది చేసే చికిత్సతోనే సరిపెట్టుకోవాల్సి ఉంది. ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు, ముగ్గురే ఉంటున్నారు. చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో బిజీగా ఉంటున్నారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఒక్కరు మినహా మిగిలిన వారందరూ ప్రొద్దూటూరు, కడప ప్రాంతం నుంచి రావడం గమనార్హం. ఇక రాత్రి వేళల్లో ఒక్క నర్సు తప్ప మినహా ఏ సిబ్బంది అక్కడ అందుబాటులో ఉండరు. అంతేకాదు ఆసుపత్రిలో కనీసం విద్యుత్ దీపాలు కూడా ఉండవు. రాత్రి వేళల్లో గర్భిణులు ప్రసవం కోసం వస్తే డాక్టర్లు ఎవ్వరూ లేరంటూ అక్కడ ఉన్న సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో ప్రతి నెలా 30నుంచి40వరకు కాన్పులు అయ్యే ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత 5నెలలుగా కనీసం 20కూడా కాన్పులు కాకపోవడం గమనార్హం. రోగులకు కనీస సౌకర్యాలైన బెడ్లు, మంచాలు ఏర్పాటు చేయకుండా అన్నీ ఓ గదిలో పడవేయడం ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండి వారికి వైద్య చికిత్సలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అశ్వత్థ నారాయణుడు
ప్రకృతిలో ఉన్న వృక్షరాజాలలో రావి చెట్టు ఒకటి. ఇది దేవతావృక్షంగా పేరు పొందింది. అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలలో కూడా రావిచెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. వృక్షాలలో తాను అశ్వత్థ వృక్షాన్నని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడంటే రావిచెట్టు ఎంతటి విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హిందూ మతంలోనే కాదు, బౌద్ధ. జైన మతాలలో కూడా రావిచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మహిమాన్వితమైన వృక్షంగా పేరు పొందింది. బుద్ధుడు రావి చెట్టు కిందనే జ్ఞానం పొందాడు. సంతానం లేనివారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు స్వరూపిణే! అగ్రతశ్శివ రూపాయ వృక్షరాజాయతే నమః అని చదువుతూ రావిచెట్టు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేయడం శుభప్రదం. వైజ్ఞానిక పరంగా కూడా రావి గాలి వంటికి ఎంతో మంచిదని రుజువైంది. హోమంలో సమిధలుగా వాడేది రావి సమిధలనే. ఆయుర్వేదంలో రావిచెట్టుకు ఎంతో ప్రాధాన్యముంది. అనేక ఔషధాల తయారీలో విరివిగా ఉ పయోగిస్తారు. అయితే, రావిచెట్టును ఇంటి ఆవరణలలో పెంచకూడదని అంటారు. కారణం రావి చెట్టు వేర్లు నేలలో బాగా లోతుకు చొచ్చుకుని పోయి, పునాదులను కూడా కదిలించి వేయగలగడమే. అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడయినా రావిచెట్టు మొలిస్తే దానిని వెంటనే పెరికి వేస్తుంటారు. జాతకంలో శని, రాహు, కుజదోషాలున్నవారు ప్రతిరోజూ రావిచెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. కుజదోషం ఉన్నవారు రావిచెట్టు మొదలులో పచ్చిపాలు పోసి, తడిసిన మట్టిని నుదుట బొట్టుగా పెట్టుకోవడం మరిన్ని సత్ఫలితాలనిస్తుందంటారు. రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు దానిని తాకరాదు. ఒక్క శనివారం మాత్రమే తాకాలని పెద్దలు చెబుతారు. రావిచెట్టును సంస్కృతంలో అశ్వత్థ వృక్షమని అంటారు. ఈ పవిత్ర వృక్షం పేరుమీదుగానే కొందరు అశ్వత్థ నారాయణ అని తమ పిల్లలకు పేరు పెట్టుకుంటారు. ప్రముఖ పౌరాణికుడు విదురుడు నాటిన అశ్వత్థవృక్షం విదురాశ్వత్థంగా ఇప్పటికీ పూజలందుకుంటున్న విషయం తెలిసిందే! -
ఒకే చెట్టుకు పది రకాల మామిళ్లు!
గుణదల (విజయవాడ తూర్పు): అంటుకట్టే విధానం ద్వారా విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన చతుర్వేదుల శ్రీనివాస శర్మ తమ పెరట్లో పెంచిన మామిటి చెట్టు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకే చెట్టుకు దాదాపు పది రకాల మామిడి కాయలు కాయడంతో వీక్షకులను అబ్బుర పరుస్తోంది. నాటు మామిడి మొక్క పెరుగుతున్న కొద్దీ దాని కొమ్మలకు బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు వంటి వివిధ రకాల కొమ్మలను శ్రీనివాసరావు అంటుకట్టారు. ప్రస్తుతం ఈ చెట్టుకు తోతపురి, బంగినపల్లి, సువర్ణరేఖ, సొరమామిడి, చిన్నరసాలు, పెద్దరసాలు, చెరుకురసం, తుమాని వంటి పది రకాలు మామిడి కాయలు కాస్తున్నాయి. తన ప్రయోగం ద్వారా ఒకే చెట్టుకు ఇన్ని రకాల మామిళ్లు కాయిస్తున్న శ్రీనివాస శర్మ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ అంటుకట్టే విధానంలో ఆయన ఇప్పటివరకూ మామిడి, సీతాఫలం, నేరేడు, బత్తాయి, రేగు పండ్లతో పాటు మందారం, గన్నేరు, వంటి పుష్ప జాతులకూ అంటుకట్టారు. -
పెళ్లింట పెను విషాదం
పాయకరావుపేట : పెళ్లి సంబరాలతో ఆనందోత్సాహాలు వెల్లివిరియాల్సిన ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. పెళ్లి రాట వేసేందుకు కొమ్మను తీసుకొచ్చేందుకు చెట్టు ఎక్కిన పెళ్లికుమారుడు తండ్రి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలో అరట్లకోట గ్రామానికి చెందిన దేవరకొండ అప్పారావు (60)కు ముగ్గురు కొడుకులు. వీరిలో ఇద్దరికి వివాహాలు చేశాడు. చివరి కొడుక్కి కూడా వివాహం నిశ్చయమైంది. ఈ నెల 27న పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టారు. గురువారం ఇంట్లో పెళ్లిరాట వేయడానికి నిర్ణయించారు. రాట వేసేందుకు అవసరమైన నేరేడు కొమ్మను తెచ్చేందుకు ఉదయం గ్రామంలో చెట్టు ఎక్కి, కొమ్మనరికి దిగబోతున్న సమయంలో కాలు జారి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో కుటుంబ సభ్యులు తుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పారావు రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని పెద్ద కోడలు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తనను ఒక ఇంటివాడిని చేయడం కోసం తపనపడుతున్న తండ్రి కళ్లముందే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పెళ్లికొడుకు చిన్ని కన్నీరుమున్నీరుగా విలపించాడు. అప్పారావు భార్య నాగలక్ష్మి రోదన వర్ణనాతీతం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీసీ నాయకులు చిక్కాల రామారావు, దగ్గుపల్లి సాయి పరామర్శించారు. -
చెట్టంత అనుబంధం
గుంటూరు మెడికల్: ఆ మహావృక్షానికి, ఆ ఇంటికీ అనుబంధం 60 ఏళ్లు. ఆ మహావృక్షంలా అందరూ జీవితంలో ఉన్నతంగా ఎదిగారు. డాక్టర్లుగా స్థిరపడ్డారు. గుంటూరు నగరంలో ఆస్పత్రి కట్టేందుకు చెట్టు అడ్డమైంది. కుటుంబ సభ్యుల మనసుల్లో గ్రీష్మకాలాన ఎండిన మోడులా వేదన మొదలైంది. అప్పుడు వారి మదిలో ఓ ఆలోచన వసంతమై చిగురించింది. కుటుంబంలో చెట్టును భాగం చేసుకోవాలని.. చిన్నప్పుడు ఆ చెట్టు కింద అమ్మ పెట్టిన గోరుముద్దల తియ్యదనం గుర్తు చేసుకుంటూ ఉండాలని.. అల్లుకున్న వేరుల్లా చెట్టుకు, తమకు అనుబంధం వీడిపోకుండా చేయాలని.. అందుకే చెట్టుకు కొంత స్థలం వదిలారు. ఆస్పత్రిలోనే చెట్టును భాగం చేశారు. పర్యావరణహితులై ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారే గుంటూరులోని కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్డులో మల్లిక స్పయిన్ సెంటర్ అధినేత, వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణులు జెరుబులగిన్నె నరేష్‌బాబు. వీరి తల్లి డాక్టర్ ఓలేటి శివలీల గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, తండ్రి ప్రొఫెసర్ రంగస్వామి జీజీహెచ్‌లో ఫిజిస్ట్‌గా పదవీ విరమణ చేశారు. సోదరులు డాక్టర్ మహేష్‌బాబు కార్డియాలజిస్ట్‌గా, డాక్టర్ రంగనా«థ్ నెఫ్రాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆస్పత్రి నిర్మించిన స్థలంలో గతంలో వీరి ఇల్లు. -
రాత్రంతా జాగారం
రాత్రి ఒంటి గంట.. జగదల్పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.. వారు ఉదయానికి విశాఖ చేరుకోవాలి.. అంతలో బొర్రాగుహలు స్టేషన్లో రైలు నిలిచిపోయింది.. గంటలు గడుస్తున్నా కదలకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.. అప్పుడు తెలిసింది విద్యుత్ వైర్లపై చెట్టు పడి అంతరాయం ఏర్పడిందని.. దీంతో రైల్లో ప్రయాణిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.. బుధవారం ఉదయం 10.30 గంటలకు గానీ పునరుద్ధరణ పనులు పూర్తికాలేదు.. అదీ పాక్షికంగానే.. అనంతగిరి (అరకులోయ):కొత్తవలస–కిరండూల్ (కేకే) లైన్లో మంగళవారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. వివిధ పనులపై విశాఖ వెళదామని రైలెక్కిన వారంతా అర్ధరాత్రి పూట మార్గమధ్యంలో బండి నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ వైర్లు తెగిపడడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిమిడిపల్లి–తైడా మధ్యలో 58/89లో ఓహెచ్సీ విద్యు™Œ వైర్లు, స్తంభాలపై చెట్టు పడడంతో సమస్య తలెత్తింది. రాత్రి 1 గంట సమయంలో ఓహెచ్ఈ విద్యుత్ వైర్ల మీద చెట్టు పడడం వల్ల జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును బొర్రా రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. వేసవి కాలం కావటంతో ఆకులు రాలిపోయి చెట్లు ఎండిపోతున్నాయి. వీటికి కొద్దిపాటి నిప్పు రవ్వ అంటుకున్నా అది కార్చిచ్చుగా మారి అడవిని సైతం తగులబెట్టే విధంగా మంటలు చెలరేగుతున్నాయి. ఈ విధంగా మంగళవారం రాత్రి అనంతగిరి మండలంలో ఎక్కడ బడితే అక్కడ కార్చిచ్చు చెలరేగింది. కేకే లైన్‌ను అనుకుని ఉన్న కొండపై ఓ వృక్షానికి నిప్పు అంటుకుని అది నేలకొరిగింది. తైడా, చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఈ సమయంలో ప్రయాణిస్తున్న రైళ్లను రైల్వే అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు బొర్రా స్టేషన్లో నిలచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా అవస్థల మధ్య గడిపారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృక్షాన్ని యుద్ధప్రతిపాదికన తొలగించడంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు రైలు కదిలింది. జగదల్పూర్ వరకే కిరండూల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కేకే లైన్లో బుధవారం తెల్లవారుజామున చెట్ల కొమ్మలు విరిగిపడడంతో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం(08512/11)స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం జగదల్పూర్ వరకే నడిచిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ తెలిపారు. తిరుగు ప్రయాణంలో గురువారం ఈ రైలు కిరండూల్ నుంచి కాకుండా జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వస్తుందని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. పూర్తి టికెట్ డబ్బులు ఇవ్వాలని ప్రయాణికులు రైల్వే సిబ్బందిని డిమాండ్ చేశారు. అయితే రైల్వే సిబ్బంది ప్రయాణికుల టికెట్ డబ్బులో 50 శాతం తిరిగి ఇచ్చారు. నరకం చూశాం.. రాత్రంతా బొర్రా స్టేషన్లోనే గడిపాం. అర్ధరాత్రి రైలు నిలిచిపోవడంతో పిల్లా పాపలతో ప్రయాణిస్తున్న కుటుంబాలన్నీ తీవ్ర అవస్థలు పడ్డాయి. తాగడానికి మంచి నీరు సైతం దొరకలేదు. బొర్రా గుహల నుంచి ములియగుడ చేరుకుని విశాఖపట్నం వెళుతున్నాం.– శరభన్, జగదల్పూర్ అర్జంటు పనులు ఆగిపోయాయి.. కోరాపుట్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు రైలెక్కాను. రాత్రి ఒంటిగంటకు నిలిచిపోయిన రైలు తెల్లారినా కదలకపోవడంతో నా పనులన్నీ ఆగిపోయాయి. రాత్రంతా ఆందోళనే. చాలా ఇబ్బందులకు గురయ్యాం. – చైతన్య, కోరాపుట్ -
చెట్టును ఢీకొన్న బైక్..ఇద్దరి మృతి
వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండలం గుంటూరుపల్లి వద్ద గురువారం వేకువజామున ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన కాయక సంపత్(29), పల్లె ప్రభాకర్(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వరంగల్ నుంచి స్వగ్రామము వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
పెళ్లి ఖాయం!
బ్రుటిగామ్సీష్ డోడార్ ఫోర్ట్స్ 23701 యూటిన్, జర్మనీ ..ఇదెవరి అడ్రస్ అనుకుంటున్నారా.. జర్మనీలోని ఓ చెట్టు అడ్రస్. జర్మనీలో చెట్టుకు కూడా అడ్రస్ ఉంటుందా అని ఆశ్చర్యపడకండి. అయితే ఆ ఒక్క చెట్టుకే అడ్రస్ ఉంది. ఇదో వోక్ చెట్టు. దీనికి వయసు దాదాపు 500 సంవత్సరాలు. అయితే ఏంటంటారా.. ఈ చెట్టుకు ఉత్తరం రాస్తే అబ్బాయిలకు పెళ్లవుతుందట. అందుకే దీనికి ‘పెళ్లి కుమారుడి’ చెట్టు అని పిలుస్తారు. ఆ ఉత్తరం చివరికి ఆ చెట్టుకు ఉన్న తొర్రలోకి వెళ్తుంది. ఆ తర్వాత కోరుకున్న అమ్మాయితో పెళ్లవుతుందని అక్కడి వారి నమ్మకం. నమ్మకమే కాదు అలా ఉత్తరాలు రాసిన వందలాది మందికి వారు కోరుకున్నట్లుగానే పెళ్లయిందట. ఓర్ట్ అనే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ ఫెల్షీకి చేరవేసేందుకు ఓ ఉత్తరాన్ని ఈ చెట్టు తొర్రలో వేసిందట. దీంతో వారిద్దరికీ 1891 జూన్ 2న పెళ్లయిందట. అప్పటి నుంచి ఆ నమ్మకం కొనసాగుతోంది. -
‘చెట్టు’పక్కల వెతికినా..
అది న్యూజిలాండ్ దేశంలోని క్యాంప్‌బెల్ అనే ద్వీపం.. ఆ ద్వీపంలో ఒక చెట్టుంది. ఒక చెట్టుందనే ఎందుకు అంటున్నామంటే అక్కడ ఒక్కటే చెట్టుంది కాబట్టి. అదేంటి ఒక్కటే చెట్టుండటం ఏంటి అని ఆశ్చర్చపోతున్నారా..? అవును ఆ చెట్టుకు చుట్టుపక్కల దాదాపు 200 కిలోమీటర్ల మేర మరో చెట్టు ఉండదట! ఈ ద్వీపం ప్రపంచంలోనే కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. చాలా వేగమైన గాలులు వీయడమే కాకుండా ఏడాది పొడవునా కేవలం 600 గంటల కన్నా తక్కువ సేపు సూర్యరశ్మి ఉంటుందట. అంతేకాదు వర్షం లేకుండా 40 రోజులు మాత్రమే ఉంటుందట. దీంతో ఇక్కడ జనజీవనం దాదాపు అసాధ్యం. కాకపోతే చాలా చిన్న చిన్న పొదలు, గడ్డి మాత్రమే పెరుగుతుందట. అయితే ఇక్కడ పెరిగిన చెట్టు పేరు సిట్కా స్ప్రూస్. దీన్ని 1901–1907 మధ్య కాలంలో న్యూజిలాండ్ మాజీ గవర్నర్ లార్డ్ రాన్ఫర్లీ నాటినట్లు భావిస్తుంటారు. అక్కడ పెద్ద అడవిని సృష్టించాలనే ఉద్దేశంతో దీన్ని నాటినా ఫలితం లేకుండాపోయింది. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని ఈ ఒక్క చెట్టు మాత్రమే బతికి బట్టకట్టగలిగింది. అంతేకాదు వంద ఏళ్లుగా అది వర్ధిల్లుతోంది. దీంతో ప్రపంచంలోనే ఒంటరి మొక్కగా మిగిలిపోయింది. -
గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు
సాక్షి, సిద్దిపేట: గీత కార్మికులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న చెట్టు పన్నును రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ప్రకటించారు. పన్ను చెల్లించలేక గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయా న్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పన్ను రద్దుకు సీఎం అంగీకరించారని, ఈ మేరకు త్వరలోనే జీవో వెలువడుతుందన్నా రు. ఎక్సైజ్ అధికారులు గీత కార్మికుల నుంచి పన్ను వసూళ్లు చేయవద్దన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.1.5 కోట్లతో నిర్మించనున్న గౌడ ఫంక్షన్ హాల్ భవనానికి మంత్రి టి.హరీశ్‌రావు, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలసి పద్మారావు గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చెట్టు పన్ను రద్దు తో రాష్ట్రవ్యాప్తంగా 2.16 లక్షల మంది గీత కార్మి కులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,342 సోసైటీలు, 3,688 టీఎఫ్‌టీల్లో 2,16,785 మంది గీత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. గీత కార్మికులు తాటి, ఈత చెట్టు ఒక్కోదానికి ఏడాదికి రూరల్ ప్రాంతం లో అయితే రూ.25, అర్బన్ ప్రాంతంలో రూ.50 పన్ను చెల్లిస్తున్నారు. ఈ పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.15 కోట్లు సమ కూరుతున్నాయి. తమకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు చెట్టు పన్ను రద్దు చేయాలని పలు సందర్భాల్లో గీత కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులు ప్రభుత్వా న్ని కోరారు. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. -
దెయ్యం చెట్టు
హైదరాబాద్ వరంగల్ హైవేలో సి.పి.ఆర్.ఐ. మలుపు దాటిన మూడు నిముషాలకు నారపల్లి క్రాస్ వస్తుంది. అక్కడి నుంచి కుడివైపు లోపలికి ఇరవై నిముషాలు నడుచుకుంటూ వెళ్తే ప్రహ్లాద్ ఇల్లు వస్తుంది. ప్రహ్లాద్ ఆఫీస్ జూబ్లీ హిల్స్‌లో. ఉంటున్నది ఇదిగో.. ఈ నారపల్లి క్రాస్ నుంచి కుడివైపు కొంత దూరం నడిచాక, కాలికి తగిలినట్లుగా వచ్చే కాలనీ లాంటి ప్రదేశంలో. ఆఫీస్‌కి ప్రహ్లాద్ పగలు ఏ సమయంలో బయల్దేరినా రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం పన్నెండు దాటుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి కాదు, ఇంటికి చేరుకోడానికి నారపల్లి క్రాస్‌కు వచ్చేటప్పటికి. ఇక అక్కడి నుంచి ఆ చీకట్లో ఒకటే నడక. ఒక్కడే నడక. దారికి రెండు పక్కల తుప్పలు, పొదలు. రెండు వైపులా అక్కడొక చెట్టు, ఇక్కడొక చెట్టు.. అలా కొన్ని చిన్న చెట్లు. వాటిల్లో ఒకే ఒక పెద్ద చెట్టు. దెయ్యంలా ఉంటుందది! పదేళ్లు అవుతోంది ప్రహ్లాద్ ఫ్యామిలీ ఆ ఏరియాకు వచ్చి. ‘‘ఇంత దూరం ఎందుకండీ’’ అనలేదు ప్రహ్లాద్ భార్య. ప్రహ్లాద్‌కి చెట్లు, పుట్టలు అంటే ఇష్టం అని పెళ్లికి ముందే ఆమెకు తెలుసు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో అభిరుచుల్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ప్రహ్లాద్లోని పచ్చదనం బయటపడింది. ‘‘నాకూ ఇష్టమే’’ అంది. ప్రహ్లాద్ ఇష్టమయ్యాడు కాబట్టి, నాకూ ఇష్టమేనని ఆమె అంది కానీ, ప్రహ్లాద్ భార్యకు సిటీలో ఉండడమే ఇష్టం. సిటీలో పచ్చదనం ఉండకపోవచ్చు. మంచి అపార్ట్మెంట్ తీసుకుని, బాల్కనీలో రెండు మొక్కల్ని వేలాడదీసుకుంటే పచ్చదనం రావడానికి ఎంతసేపని?! ఆ మాటే ఆమె అంటే.. ‘‘అది పచ్చదనం కాదు. పాలకూర పప్పులో ఉండేది కూడా పచ్చదనమే కదా’’ అని నవ్వాడు ప్రహ్లాద్.సిటికీ అన్ని మైళ్ల దూరంలో ప్రహ్లాద్ నారపల్లినే ఎంచుకోడానికి కారణం పచ్చదనం అయితే, అతడు చెప్పే కారణం మాత్రం అక్కడ అద్దెలు తక్కువని. ఎవరో వెంచర్వాళ్లు ఆఫీసుకొచ్చి, సైట్ సీయింగ్‌కి ప్రహ్లాద్‌ని తీసుకెళ్లినప్పుడు నారపల్లి అనేదొకటి ఈ భూమ్మీద ఉందన్న సంగతి ప్రహ్లాద్‌కి మొదటిసారిగా తెలిసింది. ప్రహ్లాద్‌ని తీసుకెళ్లి చూపించినందువల్ల వెంచర్ వాళ్లకు ఒరిగిందేమీ లేదు. ప్రహ్లాద్‌కి మాత్రం పచ్చదనం దొరికింది. ఆల్రెడీ అక్కడ కట్టి ఉన్న ఇళ్లలో వెలుతురు బాగా వచ్చే ఒక ఇంట్లోకి వెంటనే అద్దెకు దిగేశాడు.భార్య, తను, ఇద్దరు చిన్న పిల్లలు, చుట్టు పక్కల పచ్చటి చెట్లు, వాటి మీదకు వచ్చి వాలి ఉదయాన్నే కువకువమనే పిట్టలు, డ్యూటీ అయ్యాక నడిరేయి చీకట్లో సుదీర్ఘంగా నడుచుకుంటూ ఇంటికి చేరుకోవడం.. ఇదీ పదేళ్లుగా ప్రహ్లాద్ పచ్చటి ప్రపంచం. ఆ నిశ్శబ్దపు చీకట్లో దారి పక్కన పెద్ద భూతంలా కనిపించే ఆ చెట్టును భయం భయంగానే అయినా ఒకసారి తలెత్తి చూడడం అతడి అలవాటు. మొక్కను పెంచుకున్నట్లుగా ఆ దెయ్యపు చెట్టుపై తనకు తెలియకుండానే ఇష్టం లాంటిదేదో పెంచుకున్నాడు ప్రహ్లాద్. ‘‘సరే, జాగ్రత్తగా వెళ్లండి. ఈ దారిలో దెయ్యం తిరుగుతోంది’’ దేవుడు ప్రతి మనిషికీ ఏదో ఒకటి ఇస్తాడు.. ‘ఇది నీది.. తీసుకుని సంతోషంగా’ ఉండు అని! అలా దేవుడు తనకు ఇచ్చింది.. చీకట్లో ప్రతి రాత్రీ ఒంటరిగా నడిచే ఆ ఇరవై నిముషాల నడక అని ప్రహ్లాద్ అనుకుంటూ ఉంటాడు. నడుస్తున్నప్పుడు ఒక్కోసారి ఏ బైకో వచ్చి, పక్కన ఆగుతుంది. ‘కాలనీ లోకే కదా.. ఎక్కు బాస్’ అని! నవ్వి థ్యాంక్స్ చెప్తాడు. అంతే కానీ బైక్ ఎక్కడు. నడుచుకుంటూనే వెళ్తాడు. ఓసారి బైక్ మీద ఇద్దరు పోలీసులు వచ్చి ప్రహ్లాద్‌ని ఆపారు. ఆ రోజైతే మరీ ఒంటి గంట దాటింది ప్రహ్లాద్‌కి అక్కడికి చేరుకోడానికి.‘‘ఎక్కడుంటారు మీరు’’ అని అడిగారు వాళ్లు. ‘‘ఇక్కడే.. ఆ కాలనీలో ఉంటాను’’ అని చెప్పాడు.‘‘ఈ టైమ్‌లో ఈ దారి వెంట వెళ్లడం మంచిది కాదు’’ అన్నాడు.. ఆ ఇద్దరిలో ఒక పోలీసు. అతడి చేతిలో టార్చ్‌లైట్ ఉంది.‘‘ఆఫీస్‌లో కొద్దిగా లేట్ అయింది’’.. చెప్పాడు ప్రహ్లాద్.‘‘సరే, జాగ్రత్తగా వెళ్లండి. దెయ్యం తిరుగుతోందట’’ అన్నాడు పక్కనే ఉన్న పోలీసు.ప్రహ్లాద్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆశ్చర్యంగా చూడలేదు. అతడూ అప్పటికి కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాడు. సి.పి.ఆర్.ఐ. మలుపులో ఆక్సిడెంట్ అయి చనిపోయినవాళ్లలో ఒకరు ఈ దారిలో దెయ్యమై తిరుగుతున్నారని. అతడు ఆశ్చర్యపోయింది ఎందుకంటే.. పోలీసులు దెయ్యాల గురించి మాట్లాడ్డం ఏంటని! ప్రహ్లాద్‌కు దేవుడిచ్చిన సంతోషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదయాన్నే భార్య తన కన్నా ముందే లేచి, తను లేచిన వెంటనే కాఫీ అందివ్వడం అతడికి సంతోషాన్నిస్తుంది. కూతురు, కొడుకు స్కూల్‌కి చకచకా తయారై ‘బై.. డాడీ’ అని తన రెండు చెంపలకు అటొకరు, ఇటొకరు.. ముద్దు పెట్టి స్కూల్ వ్యాన్ దగ్గరికి పరుగులు తియ్యడం సంతోషాన్నిస్తుంది. ఆఫీస్‌లో తన పని తను త్వరగా పూర్తి చేసేయడం సంతోషాన్నిస్తుంది. అయితే అన్నిటికన్నా అతడికి ఎక్కువ సంతోషాన్నిచ్చేది మాత్రం.. రోజూ ఇంటికి వెళ్లే ఆ చీకటి దారిలో ఆ దెయ్యపు చెట్టును చూసీ చూడనట్లు చూసి దాటుకుని వెళ్లడం. దాటుకుని వెళ్లాక ప్రహ్లాద్ ఇక ఆ చెట్టును వెనక్కు తిరిగి చూడడు. తిరిగి చూస్తే, చెట్టు కొమ్మకు ఊగుతూ ఏ దెయ్యమో తనని చూస్తూ ఉంటుందేమోనని అతడి అనుమానం. అనుమానమే. భయం కాదు. చాలాకాలం తర్వాత ఆఫీసులో మళ్లీ లేటయింది ప్రహ్లాద్‌కి. నారపల్లి క్రాస్ దగ్గరికి వచ్చేసరికి ఒంటి గంట అయింది. ఎప్పటిలా చీకట్లో ఒక్కడే నడక మొదలుపెట్టాడు. ఆ వేళ ఎందుకో ఆ దారి కొత్తగా ఉంది ప్రహ్లాద్‌కి! తనది కాని దారిలోకి వచ్చినట్లుగా ఉంది. నడుస్తున్నాడు. నడుస్తున్నాడు. నడుస్తున్నాడు. దెయ్యపు చెట్టు దగ్గరికి వచ్చేసరికి నడక వేగం తగ్గించాడు. చెట్టు ఉన్న వైపు చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కొన్ని క్షణాలు శిలలా స్తంభించిపోయాడు. ముందుకు మరికొంత దూరం నడిచి, ఎప్పుడూ చూడని వాడు, వెనక్కి తిరిగి చెట్టు వైపు చూశాడు. అంతే అతడి గుండె ఆగినంత పనైంది.ఆ రాత్రి బాగా జ్వరం వచ్చింది ప్రహ్లాద్‌కి. ‘చెట్టు.. చెట్టు..’ అని అతడు కలవరించడం అతడి భార్య వింది. చెట్టేమిటో ఆమెకు అర్థం కాలేదు. దెయ్యపు చెట్టు గురించి ప్రహ్లాద్ ఎప్పుడూ ఆమెకు చెప్పలేదు. భర్తను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘జ్వరమే.. ఇంకేం లేదు’ అని మందులు రాసిచ్చాడు డాక్టర్. ఇద్దరూ వెళుతుంటే, మళ్లీ ఆమెను మాత్రమే వెనక్కి పిలిచి డాక్టర్ చెప్పాడు.. ‘ఎందుకో మీవారు బాగా భయపడినట్లున్నారు’ అని.ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రహ్లాద్ తన ఫ్యామిలీని సిటీలోకి షిఫ్ట్ చేశాడు. ఎందుకో.. ఆ దెయ్యపు చెట్టు లేని ఆ దారిని అతడు చూడలేకపోయాడు. ఇప్పటికీ ఎక్కడ రోడ్ వైడెనింగ్ అన్నా.. ఆ రోజు అకస్మాత్తుగా మాయం అయిపోయిన ఆ దెయ్యం చెట్టే గుర్తుకు వస్తుంటుంది ప్రహ్లాద్‌కి. అప్పుడు ఈ మనుషులంతా అతడికి చెట్టును పొట్టన పెట్టుకుంటున్న దెయ్యాల్లా కనిపిస్తుంటారు. -
షాకింగ్: యాంకర్‌ను మింగేసిన కొబ్బరిచెట్టు
ముంబై: ముంబైలో అనూహ్యమైన ప్రమాదం కలకలం రేపింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్ వాక్ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర్శన్ మాజీ యాంకర్ మరణించిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ రజత్ నాథ్(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది దూరదర్శన్ మాజీ యాంకర్, యోగ టీచర్ కూడా అయిన కంచన్ నాథ్ గురువారం ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లారు. ఇంటికి సమీపంలో నడుస్తుండగా కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా ఆమెమీద విరుచుకుపడింది. దీంతో ఆమె చెట్టుకింద పడి నలిగిపోయింది. అకస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో శనివారం ఉదయం కన్ను మూశారని కంచన్ భర్త తెలిపారు. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాడైపోయి.. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు కొట్టివేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీ అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు. -
ప్రేమికుని తండ్రిని చెట్టుకు కట్టేసి..
బెంగళూరు: మతాంతర ప్రేమ జంట ఇంట్లో నుంచి పారిపోవడంతో ఆగ్రహం చెందిన యువతి తండ్రి, బంధువులు యువకుడి తండ్రిని చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన కర్ణాటకలోని బిజాపుర జిల్లాలోని సింధగి తాలూకాలో జరిగింది. హాళగుండకనాళ గ్రామానికి చెందిన నింగప్ప, మాషాబీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరువురి మతాలు వేరు కావడంతో మాషాబీ ఇంట్లో వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. దీంతో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఆగ్రహం చెందిన యువతి తండ్రి అల్లాభక్ష్తో పాటు ఏడుగురు బంధువులు నింగప్ప తండ్రిని గ్రామంలోని చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న రెండవ కుమారుడు రమేశ్ తండ్రిని విడిపించడానికి రావడంతో అతడిని కూడా చెట్టుకు కట్టేసి ఇద్దరినీ ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న కలకేరి పోలీసులు బుధవారం ఇరువురిని విడిపించి ఆసుపత్రిలో చేర్పించి కేసు నమోదు చేసుకున్నారు. -
విరిగిన ధనమ్మ మర్రి చెట్టు
- ఈదురు గాలులకు వెయ్యి ఎకరాల అరటితోట నేలమట్టం - అంధకారంలో లంక గ్రామాలు కపిలేశ్వరపురం (మండపేట): గోదావరి చెంత ఆహ్లాదకరంగా ఉన్న లంక గ్రామాలు సోమవారం కకావికలమయ్యాయి. ఉన్నట్టుండి విరుచుకుపడ్డ ఈదురు గాలులకు ఉద్యాన పంటలు నేలనంటాయి, జిల్లాలోపర్యాటక కేంద్రంగా గుర్తింపుపొందిన ధనమ్మ మర్రి ఆవరణలోని మర్రి చెట్టు నేలకొరిగింది. కేదారిలంక, వీధివారిలంక, నారాయణలంక గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల అరటి తోట కుప్పకూలిపోయింది. కురిసిన వర్షానికి నేలలోని కంద కుళ్ళిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఆయా గ్రామాల్లో ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లంక గ్రామాల ప్రజలు చీకటిమాటున బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. వీఆర్వో స్వామినాయుడు, సర్పంచి రంకిరెడ్డి సత్యవతి, పంచాయతీ అధికారులు పరిస్థితిని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. -
చెట్టుపై పిడుగు..వ్యాపించిన మంటలు
సైదాబాద్: సైదాబాద్‌లో శుక్రవారం రాత్రి ఓ చెట్టుపై పిడుగుపడింది. దీంతో వెంటనే చెట్టుకు మంటలు అంటుకున్నాయి. అంతేకాకుండా పక్కనే ఉన్న ఇంటికి కూడా అగ్నికీలలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలు ఆర్పుతున్నారు. -
చెట్టు కూలి ఇద్దరు మృతి
బసలదొడ్డి (పెద్దకడబూరు): ఈదురు గాలుల బీభత్సంతో చెట్టు కూలి దాని కింద కూర్చున్న అవ్వ, మనుమరాలు మృతి చెందారు. బసలదొడ్డి గ్రామానికి చెందిన బొంపల్లి రంగమ్మ(60), మనుమరాలు అంజనమ్మ(7)లు ఆదివారం తమ పొలంలో ఉల్లినాటు వేయడానికి కూలీలతో వెళ్లారు. సాయంత్రం సమయంలో బలమైన ఈదురు గాలులు, చినుకులు వచ్చాయి. దీంతో పొలంలో పనిచేస్తున్న వారందరూ పక్కనే ఉన్న తుమ్మచెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కొంతసేపటికి చెట్టు కుకటి వేళ్లతో కూర్చున్న వారిపై పడిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా కూలీలలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివాంజల్ తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మహానందిలో పిడుగుపాటు
- ముగ్గురికి గాయాలు - పార్వతీపురం తాటిచెట్టుపై మంటలు మహానంది: శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన వారి వివాహ వేడుకల సందర్భంగా నాగనంది సదనం వద్ద వంటలు చేస్తున్న సమయంలో పిడుగుపాటు సంభవించడంతో గంగవరానికి చెందిన పడకండ్ల బ్రహ్మం, కురిచేడుకు చెందిన రామాంజి, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిడుగుపాటు కారణంగా అక్కడే ఉన్న చెట్టుపై మంటలు చెలరేగాయి. -
చెట్టును ఢీకొట్టిన ఆటో..
జగిత్యాల: వేగంగా వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహానాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల మండలంలోని కల్లెడ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా నడికుడికి చెందిన ఓ కుటుంబ సభ్యులు ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానాలు చేసి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆసుపత్రికి చేర్చే దిక్కులేక మృత్యుఒడికి..
బ్రాహ్మణచెరువు (పెనుమంట్ర) : మోటారు సైకిల్‌తో చెట్టును ఢీకొన్న ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యువకుడ్ని ఎవరూ గమనించలేదు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ఆస్పత్రికి చేర్చే దిక్కులేకపోయింది. దీంతో యువకుడు మృత్యుఒడికి చేరాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్(30) గురువారం రాత్రి బ్రాహ్మణచెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును మోటారు సైకిల్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలపాలైన గణేష్‌ను ఎవరూ గమనించకపోవడంతో తెల్లవారేసరికి ఘటనస్థలంలో మృతి చెందాడు. అవివాహితుడైన గణేష్ ఇటీవలనే విదేశాల నుంచి ఇక్కడకు వచ్చాడని అతని బంధువులు తెలిపారు. పెనుమంట్ర ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కొత్త ఆలోచన:తాటిచెట్టుకు తాళం!
-
తాటికి తాళం !!
-
కారు చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
నరసరావుపేట రూరల్ : కోటప్పకొండ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన బొడ్డపాటి కృష్ణారెడ్డి (32), పలగాని సతీష్ స్నేహితులు. తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న క్రీడలలో పాల్గొనేందుకు వచ్చిన తమ స్నేహితులు కోసం వీరు శనివారం రాత్రి పట్టణానికి వచ్చారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో తమ స్నేహితులకు వసతి కేటాయించిన కోటప్పకొండ కాపు సత్రంలో వదిలిపెట్టేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో చిలకలూరిపేట మేజర్ కాలువ మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనున్న చెట్టుకు ఢీకొట్టి చిన్నయ మిషన్ ప్రహారీకి తగిలింది. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడగా, సతీష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కృష్ణారెడ్డిని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై ఏవీ బ్రహ్మం తెలిపారు. -
అవినీతి పండించారు
మొక్కలు వేయకుండానే సబ్సిడీలు మింగేశారు రూ.3 కోట్ల వరకు మెక్కేశారు కామవరపుకోట కేంద్రంగా అధికార పార్టీ నేతలు పంచుకున్నారు ఉద్యాన శాఖలో భారీ కుంభకోణం విత్తనం వేస్తే మొక్క రావటం.. ఆ మొక్క పెరిగి పెద్దదై ఫలాలు ఇవ్వడం సహజం. కానీ.. మంత్రిగారి నియోజకవర్గంలో ఎంపీ వర్గానికి చెందిన టీడీపీ నేతలు విత్తనాలు చల్లలేదు. మొక్కలూ నాటలేదు. కాగితాలపై మాత్రం పంటలు పండించేశారు. అవినీతి అనే పంట నుంచి రూ.3 కోట్ల దిగుబడి సాధించారు. తిలాపాపం.. తలాపిడికెడు అన్నట్టుగా ఫలహారం కానిచ్చేశారు. కామవరపుకోట కేంద్రంగా ఉద్యాన శాఖలో ఈ తంతు సాగింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : కనీసం పంట కూడా వేయకుండానే కోట్లాది రూపాయల సబ్సిడీలను దిగమింగిన వైనం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మూడేళ్లుగా ఉద్యాన పంటలు వేస్తున్నట్టు రికార్డుల్లో చూపించి కోట్లాది రూపాయల సబ్సిడీలను నొక్కేశారు. వాటాల పంపకాల్లో వివాదాలు తలెత్తి తెలుగుదేశం నాయకులు పోట్లాడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. జెడ్పీటీసీ, ఓ గ్రామ ఉప సర్పంచ్ దీనిపై పంచాయితీ చేసి.. రూ.9 లక్షలు వెనక్కి ఇవ్వాలని అధికారిని కోరడం.. అందుకు అంగీకరించిన అధికారి ఆ మొత్తాన్ని ఇవ్వకుండా పదోన్నతిపై శ్రీశైలం వెళ్లిపోవడం.. ఎట్టిపరిస్థితుల్లో వాటా సొమ్ము ఇవ్వాలని పట్టుబట్టడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగులో ఉన్న కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కొత్త తోటలు వేసినట్టుగా చూపించి మూడేళ్ల కాలంలో రూ.3.50 కోట్లను సబ్సిడీ రూపంలో డ్రా చేసి రూ.3 కోట్ల వరకు బొక్కేసినట్టు సమాచారం. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని కామవరపుకోట, మంకెనపల్లి, తడికలపూడి, కొండగూడెం తదితర గ్రామాల్లో మంత్రి పీతల సుజాతకు తెలియకుండా ఎంపీ మాగంటి బాబు వర్గానికి చెందిన నేతల ఈ వ్యవహారం చక్కబెట్టినట్టు తెలిసింది. రైతులను ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది. దీనిని అవకాశంగా మలుచుకుని ఆ శాఖ అధికారులతో కుమ్మక్కై తెలుగుదేశం నాయకులు అవినీతికి తెరలేపారు. రెవెన్యూ రికార్డుల్లో లేని భూముల్లోనూ.. ఒకే సర్వే నంబర్లతో రెండుచోట్ల సబ్సిడీ తీసుకోగా.. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లనూ చేర్చి సబ్సిడీ తీసుకున్నారు. ఎక్కడా కొత్తగా పంటలు వేయకపోవడం గమనార్హం. వారు సబ్సిడీలు తీసుకున్న భూముల్లో దశాబ్దాల కాలంగా కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. సాక్ష్యాలివిగో.. + గంటా వీర వెంకట సత్యవరప్రసాద్‌కు కామవరపుకోట రెవెన్యూ పరిధిలోని 127/1,2, 128/2 సర్వే నంబర్లలో భూమి ఉంది. ఈ నంబర్లతో 201617 సంవత్సరానికి తడికలపూడిలో జామ తోట పెంపకం పేరుతో రూ.43,118 ఽసబ్సిడీ తీసుకున్నారు. ఈ సర్వే నంబర్లలో భూమి కోటేశ్వరరావు, వెంకయ్య పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఇదే సర్వే నంబర్లతో 201415లో కూర అరటి తోటలు వేసినట్టు చూపించి తడికలపూడిలో రూ.1,62,297 సబ్సిడీ డ్రా చేశారు. ఈ భూమి ఏలూరి లక్ష్మీనారాయణ పేరుతో రికార్డుల్లో ఉంది. ఈ భూమిలో దాదాపు 30 సంవత్సరాల వయసు గల కొబ్బరి, కోకో, నిమ్మ తోటలు ఉన్నాయి. + గంటా నాగేశ్వరరావు 169/3, 172/1 సర్వే నంబర్లలో గల భూమిలో అరటి తోట వేసినట్టుగా రూ.59,756ను సబ్సిడీ రూపంలో తీసుకున్నారు. 117/7 సర్వే నంబర్ భూమిలో కర్ర పెండలం వేసినట్టుగా రూ.లక్ష మొక్కేశారు. అయితే, ఈ భూమి అతని తండ్రి గంటా వెంకయ్య పేరుతో ఉంది. + గోపాలకృష్ణ అనే వ్యక్తి 41/2ఎ సర్వే నంబర్‌తో కూర అరటి తోట వేసినట్టు చూపించి రూ.1,16,854 సబ్సిడీ తీసుకున్నారు. నిజానికి ఈ భూమి ఎం.ముసలయ్య పేరుతో ఉంది. దీన్ని కూడా తన పొలంలో కలిపేసుకుని సబ్సిడీ డ్రా చేశారు. ఈ స్థలంలో అసలు అరటి తోట వేయలేదు. సొంగా స్వామిదాస్ పేరుతో రూ.54,099 డ్రా చేశారు. ఒక్క మండలంలోనే రూ.3.36 కోట్లు సబ్సిడీలు డ్రా చేసిన సర్వే నంబర్లకు సంబంధించి కొన్ని రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నాట్ ఫౌండ్ అని వస్తుంటే, కొన్నిచోట్ల అసలు సర్వే నంబర్లు లేవు. గడచిన మూడేళ్లలో అరటికి రూ.1,85,72,466, కోకో పంటకు రూ.1,01,93,600, కర్ర పెండలానికి రూ.42,55,300, నిమ్మకు రూ.5,08,031, జామకు రూ.1,63,142 కలిపి మొత్తం రూ.3.36 కోట్ల సబ్సిడీని ఒక్క కామవరపుకోట మండలంలో డ్రా చేశారు. ఇందులో 80 నుంచి 90 శాతం వరకూ టీడీపీ నాయకులు వేరే పేర్లతో పంటలు వేయకుండానే మింగేశారు. వాటాల పంపకంలో విభేదాలొచ్చి.. వాటాల పంపకాల్లో విభేదాలు రావడంతో టీడీపీ నేతలు పంచాయితీ పెట్టారు. సదరు ఉద్యాన అధికారిని పిలిచి ఆయన వాటాకు ఇచ్చిన సొమ్ములో రూ.9 లక్షలు తిరిగి ఇవ్వాలని పెద్దమనుషుల ఒప్పందం చేశారు. ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించిన సదరు అధికారి ఫిబ్రవరి నెలలో ముట్టజెబుతానని చెప్పాడు. ఈలోగా శ్రీశైలం దేవస్థానానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిపోయారు. ఈ విభేదాల నేపథ్యంలో టీడీపీ నేత ఒకరు ’మీ కోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. దీంతో లెక్కలు సరిచేసే పనిలో ఉద్యాన శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తే మరింత అవినీతి వెలుగుచూసే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రత్తిపాడు ఫుడ్స్‌ఫ్యాట్స్ వద్ద కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన అడపా రామారావు(58), అతని భార్య వరలక్షి్మ(50) పూళ్లలో ఉన్న బంధువులను పలకరించేందుకు సోమవారం ఉదయం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బంధువులకు చెందిన కారులో స్వగ్రామం ఆరుగొలను వెళ్తుం డగా ఫుడ్స్‌ఫ్యాట్స్ సమీపంలో డ్రైవర్ వెంకటకృష్ణకు ఫిట్స్ రావడంతో బ్రేక్‌కు బదులుగా ఎక్స్‌లేటర్‌ను తొక్కాడు. దీంతో కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అడపా రామారావు, అతని భార్య వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ వెంకటకృష్ణకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులను పలకరించేందుకు వెళ్లి భార్యభర్తలు మృత్యువాత పడడంతో ఆరుగొలను గ్రామం విషాదంలో మునిగింది. ఘటనాస్థలానికి బంధువులు భారీగా తరలిరావడంతో ఫుడ్స్‌ఫ్యాట్స్ వద్ద తణుకు – ఏలూరు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. -
బైక్ చెట్టును ఢీకొని యువకుడి మృతి
పాలకోడేరు : బైక్ చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఉండి మండలం సాగుపాడు గ్రామానికి చెందిన గోపే హేమంతకుమార్(25) తన అన్న చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున బైక్‌పై భీమవరం రైల్వేస్టేషన్‌కు బయలుదేరాడు. పాలకోడేరు మండలం గరగపర్రు సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి మంచువల్ల దారి కనపడకపోవడంతో బైక్ చెట్టును ఢీకొట్టింది. దీంతో హేమంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. హేమంత్‌కుమార్ భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శశికుమార్ తెలిపారు. -
లాఠీ దాష్టీకం
దివీస్ కోసం పోలీసుల అతి.. అట్టుడికిన కోన తీరం బందోబస్తుతో రైతుల భూముల్లో చెట్ల తొలగింపు కోర్టు స్టే ఉన్న, అమ్మని భూముల్లో పనులపై ప్రజల ఆగ్రహం గ్రామాల్లో మహిళలపై దౌర్జన్యం అడ్డుకున్న 100 మంది అరెస్టు బాధితులను విడిపించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొండంగి : జీడిచెట్ల వద్ద పిక్కలు ఏరుకుంటూ, గొర్రెల మందలను కాచుకుంటూ జీవనం సాగించే కోనతీరంలోని అమాయక ప్రజలపై కాలుష్య దివీస్ పరిశ్రమ కోసం ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ స్థాపన కోసం కోనఫారెస్ట్ భూములు 670 ఎకరాలను కేటాయించింది. ఈ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులు, బాధిత గ్రామాల ప్రజల కాలుష్య పరిశ్రమ స్థాపనను, భూముల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసే పోరుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్), జనశక్తి, ఏపీ వ్యవసాయరైతు కూలీసంఘం, సీఐటీయూ, ఐద్వా మహిళాసంఘం తదితర సంఘాలు, పార్టీల మద్దతునిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు రైతులు ప్రభుత్వానికి అప్పగించని భూముల్లో బలవంతంగా చెట్లను తొలగించబోతుంటే బాధిత గ్రామాల ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా రెవెన్యూ అధికారులు భారీగా జేసీబీలు, కోత యంత్రాలతో చెట్లను తొలగించారు. విషయం తెలుసుకున్నతాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట తదితర గ్రామాలకు చెందిన వారంతా తమ భూముల్లోకి వెళ్లి చెట్లుతొలగిస్తున్న జేసీబీ, కోత యంత్రాలను నిలుపుదల చేయించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి అరెస్టు చేశారు. తాటియాకులపాలెం రైతు సన్ని సత్యనారాయణను పోలీసులు దారుణంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 100 మందిని కోటనందూరు, అన్నవరం, ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దివీస్ కోసం బలవంతపు భూసేకరణకు చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో కోన తీరప్రాంతంలో బాధిత గ్రామాల వద్ద సుమారు వెయ్యిమంది పోలీసులను మోహరించారు. మానవత్వాన్ని మరిచి.. పోలీసులు మానవత్వాన్ని మరచి బహిర్భూమికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలు, రోడ్డుకు సమీపంలో చదువుకుంటున్న విద్యార్థులు, యువతులు, బీచ్‌రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై ధాషీ్టకాన్ని ప్రదర్శించారు. పంపాదిపేటలో బీచ్‌రోడ్డుకు ఆవల ఉన్న పశువుల మకాంలోకి, ఇళ్ల వద్దకు వెళ్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ జీపుల్లో ఎక్కించారు. బాధితులకు అండగా ఎమ్మెల్యే రాజా అరెస్టుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధిత ప్రజలకు అండగా నిలిచారు. అరెస్టు సంఘటనలు తెలిసిన వెంటనే ఆయన కొత్తపాకలు సమీపంలో దివీస్‌కు ప్రతిపాదిత భూములు వద్దకు వెళ్లారు. దీంతో బాధిత రైతులంతా అక్కడకు చేరుకున్నారు. హైకొర్టు స్టేటస్కో విధించిన భూముల్లోనూ పనులు నిర్వహించారని, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ కొట్టి అరెస్టు చేశారని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. దీంతో అక్కడ ఉన్న డీఎస్పీ రాజశేఖర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. దివీస్‌కు ప్రతిపాదించిన భూముల్లో వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసినది ఎంత, అమ్మని భూమి ఎంత ఉందో రెవెన్యూ అధికారులు గుర్తించి, అవసరమైతే సర్వే నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజా అన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డీఎస్పీని కోరారు. లేదంటే వారి తరఫున ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అరెస్టయినవారిని విడిపించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు 32 మందిని, కోటనందూరు 66 మందిని, ఒంటిమామిడిపోలీస్స్టేషన్కు ఇద్దరిని వాహనాల్లో తరలించారు. డీఎస్పీతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే రాజా వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు. -
తాడిచెట్టు పడి వ్యక్తి దుర్మరణం
బాధ్యులు, బాధితుల మధ్య వాగ్వాదం పరిస్థితి ఉద్రిక్తం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్ పోలీసుల హామీతో పరిస్థితి ప్రశాంతం సిరిపురం(కరప) : కరప మండలంలోని సిరిపురం సమీపంలో ఒకరైతు పొలంలో కొడుతున్న తాడిచెట్టు అటుగా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు, వేళంగి, సిరిపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పరిíస్థితి ఉద్రిక్తతగా మారి పోలీసుల జోక్యంతో సమస్య సమసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలం వేళంగి గ్రామానికి చెందిన మెర్ల రాజేంద్రప్రసాద్ పొలంలో బుధవారం రోడ్డుపక్క ఉండే తాడిచెట్లు కొట్టిస్తున్నారు. అదే సమయంలో సిరిపురంలోని అత్తవారింటికి వెళ్తున్న వేళంగికి చెందిన చెరువు దుర్గాప్రసాద్(26)పై చెట్టు పడి అతడు దుర్మరణం పాలయ్యాడు. దుర్గాప్రసాద్ తండ్రి సత్యనారాయణ, బాబాయ్ బదిరెడ్డి వెంకన్న తదితర బంధువులు, వేళంగి, సిరిపురం గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో రైతు, చెట్లు కొడుతున్న కూలీలతో వాగ్వాదం జరిగి అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కరప ఎస్సై మెల్లం జానకీరాం కాకినాడరూరల్ సీఐ పవన్ కిశోర్‌కు సమాచారం అందించారు. అనుమతిలేకుండా ప్రభుత్వ స్ధలంలోని చెట్లుకొట్టడమేకాకుండా, ఒకమనిషి ప్రాణం పోగొడతారా అంటూ గొడవకు దిగారు. ఒకసమయంలో రైతు రాజేంద్రప్రసాద్‌పై ప్రజలు తిరగబడటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కాకినాడ రూరల్, కాకినాడటౌన్ సీఐలు పవన్ కిశోర్, ఎ.సన్యాసిరావు నలుగురు ఎస్సైలు, పదిమంది పోలీసులు బందోబస్తుగా ఉండటంతో గొడవ సద్దుమణిగింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : కురసాల కాగా ఈ కేసును తారుమారుచేసే ప్రయత్నం జరుగుతోందని పార్టీకార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా్లఅధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు సమాచారం అందించారు. కన్నబాబు స్పందించి హుటాహుటిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకుని బాధ్యతారాహిత్యంగా చెట్లు నరికించడం వల్లే ఒకనిండుప్రాణం బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దుర్గాప్రసాద్‌కు ఆరునెలల క్రితం వివాహం కావడం, భార్య చాముండేశ్వరి మూడు నెలల గర్భిణి కావడం బాధాకరమైన విషయమన్నారు. కాకినాడ రూరల్ సీఐ పవన్ కిశోర్, స్థానిక నాయకులతో కన్నబాబు చర్చించి, బాధిత కుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలన్నారు. పోలీసులు ఆ మేరకు హామీ ఇవ్వడంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డువద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్టు సీఐ పవన్ కిశోర్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామన్నారు. కరప ఎస్సై జానకిరాం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును నాటారు..!
చెట్టును నాటడమేమిటనుకుంటున్నారా.. ఇది నిజమే నండి. నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం నిర్మించేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలంలో జీగు వృక్షం (పాలకొమ్మ చెట్టు) ఉంది. దానిని నరికి వేయకుండా రూ. 10 వేలు ఖర్చు పెట్టి క్రేన్ ద్వారా కుంటకు అందుబాటులో నాటించారు. జీగు చెట్టు కొమ్మ లేనిది హిందువులు పెళ్లిళ్లు చేసుకోరు. చెట్టును రక్షించిన సర్పంచు అనురాధ గ్రామ ప్రజలు అభినందించారు. - నందికొట్కూరు -
అదుపు తప్పిన స్కూల్ బస్సు
- పక్కనే చెట్లు ఉండటంతో తగ్గిన ప్రమాద తీవ్రత - గాయాలతో బయటపడిన విద్యార్థులు కృష్ణగిరి: త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అతి వేగంతో స్కూల్‌బస్సు అదుపు తప్పగా.. రోడ్డు పక్కన చెట్లు ప్రమాద తీవ్రతను తగ్గించాయి. చెట్లు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడేది. డోన్ పట్టణనికి చెందిన నవభారత్ ఎడ్యూకేషనల్ సోసైటీ పాఠశాలకు చెందిన మినీ బస్సు గురువారం ఉదయం అమకతాడు గ్రామం నుంచి 20 విద్యార్థులతో బయలుదేరింది. గ్రామం నుంచి రెండు కిలో మీటర్ల దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపు తప్పింది. రహదారి పక్కన చెట్లు ఉండటంతో బస్సు చెట్లను ఢీకొని వేగం తగ్గి ఓ పక్కకు ఒరిగింది. అక్కడ గుంత ఉండటం, బస్సు గుంతలో పడకుండా విరిగిన చెట్లు అడ్డుపడటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి వినోద్‌కుమార్ చెయ్యి విరిగింది. మగ్బుల్‌బాషా, అసీనా, రఫీకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డోన్ సీఐ శ్రీనివాసులు, వెల్దుర్తి ఎస్ఐ తులసీ నాగప్రసాద్, కృష్ణగిరి ఏఎస్ఐ హరినాథసింగ్ çఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. గాయపడిన విద్యార్థులను డోన్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డ్రైవర్ రాంప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి
కోరుట్ల(జగిత్యాల): అతివేగంతో వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్టుపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెట్టుకూ మెదడు ఉంది!
‘చెట్టు నా ఆదర్శం’ అన్నారు కవి ఇస్మాయిల్. ఆయన కవితల్లో చెట్టు ఇంతై, అంతై...భువనమంతై... తన విశ్వరూపాన్ని చూపుతుంది. ఒక కవితలో ఆయన ఇలా అంటారు... ‘మనిషీ మనిషీ పిట్టలకు ఎగరడం నేర్పిన చెట్టుని చూడు ఏ భాషలో పుష్పిస్తుందది? ఊడల నీడల్లో మాపటి వేళల్లో ఊడల్లా కావలించుకునే ప్రియుల హస్తాలు ఏ భాషలో తడుముకుంటాయి?’ ‘చెట్టు ఉన్నచోటు నుంచి కదలదు. కానీ దానిలోని స్పందనలు మాత్రం స్థిరంగా ఉండవు. గాలితో పాటు భావాలు ప్రయాణిస్తాయి. వాటి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే...ఎన్నో భావాలు అర్థమవుతాయి’ ఈ రకంగా ఎప్పుడైనా ఆలోచిస్తే... అది ‘భావుకత’ కేటగిరీలోకి పోతుందేగానీ ‘వాస్తవం’లోకి పోదు. అయితే మన ‘భావుకత’లో అతిశయోక్తి, అవాస్తవం ఏవీ లేవంటున్నాయి తాజా పరిశోధనలు. యూనివర్సిటీ ఆఫ్ టురిన్, ఇటలీకి చెందిన ప్రొఫెసర్ మాసిమో, ఇంకా కొద్ది మంది పరిశోధకులు చెట్టు చెట్టు తిరిగి, వేరు వేరుని పలకరించి ఎంతో పరిశోధన చేశారు. వీరు చెప్పేదాని ప్రకారం... చెట్లకు మెదడు ఉంటుంది. జ్ఞానం ఉంటుంది. చెట్లు ఒకదానితో ఒకటి మౌనంగా సంభాషించుకుంటాయి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఒక చెట్టు యోగక్షేమం గురించి మరొకటి ఆలోచిస్తుంది. వాటికి జ్ఞానమే కాదు... బాధ కూడా ఉంటుంది. ఇక ఒకే జాతి చెట్ల మధ్య చాల గట్టి బంధం ఉంటుందట. వాటి బంధం వేర్ల సహాయంతో బలపడుతుందట. కొన్ని సందర్భాల్లోనైతే... అవి కలిసికట్టుగా చనిపోతాయట! ఎంత చిత్రం!! -
శునకంపై వానర ప్రేమ
కుక్క పిల్లను కోతి తీసుకెళ్తున్న దృశ్యమిది. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంంలో శనివారం ఉదయం కోతులు హల్చల్ చేశాయి. ఈక్రమంలో ఓ కోతి చెట్టు దిగి వచ్చి కుక్కపిల్లను గట్టిగా పట్టుకొని పరుగులు తీసింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత దాన్ని సురక్షితంగా వదిలేయడం గమనార్హం. ఈ సంఘటనను పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. -
చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు
* ప్రమాదంలో మందికి గాయాలు * బస్సులో 40 మంది ప్రయాణం * మిగతా వారంతా సురక్షితం వినుకొండ రూరల్: ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు బస్సు చెట్టు ఢీకొని 8 మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చీకటీగలపాలెం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు గుంటూరు వసంతరాయనిపురం, శ్రీనగర్‌కు చెందిన సుమారు 40 మంది బంధువులు విహారీ ట్రావెల్స్‌కు చెందిన ప్రై వేటు బస్సులో తన బంధువు కుమారుడైన పవన్ నిశ్చితార్థానికని ప్రొద్దుటూరు చేరుకున్నారు. శుభకార్యాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న నేపథ్యంలో చీకటీగలపాలెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ప్రమాదవశాత్తు బస్సు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో బాలమర్తి శ్రీహరి, రాయిసల సత్యవతమ్మ, రాయిసల సూరిబాబు, సీతలపాటి చలపతిరావు, కావ్య లక్ష్మి, బి. పద్మ, బాలమర్తి బాలకష్ణ, డ్రై వర్లు కొల్లూరి సుబ్బారావు గాయాలయ్యాయి. బాధితులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి రక్షణ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో 108 సిబ్బంది అద్దాలను పగుల గొట్టి బయటకు తీశారు. అనంతరం ఆగమేఘాలపై విడతలవారీగా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలమర్తి శ్రీహరి, సత్యవతమ్మ సూరిబాబు, చలపతిరావు, బాలమర్తి బాలకృష్ణను ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం
మరిపెడ : మానసిక స్థితి బాగా లేక మండలంలోని బాబోజీగూడేనికి చెందిన భీమనపెల్లి రామ్మూర్తి(60) గ్రామం శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి కుటుంబం పదిసంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ రామ్మూర్తి కల్లుకు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈనెల 19న హైదరాబాద్ నుంచి బాబోజీగూడేనికి చేరుకున్నాడు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న అనుమానంతో కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి గ్రామానికి వచ్చారు. ఈనెల 20న ఉదయం బయటికి వెళ్లిన రామ్మూర్తి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా గ్రామశివారులోని చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందినట్లుగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
చెట్టు తల్లి.. చెమ్మగిల్లి
కడెం : చెట్టు తల్లి రోదనలు చెవిన పట్టించుకున్నారు. సహదయంతో స్పందించారు. చెట్టుకు ప్రాణం ఉంటుందని చెట్టూ ప్రాణం పోస్తుందని ప్రచారం చేస్తున్నారు. చెట్లను నరకవద్దని వినూత్న రీతిలో ప్రచారం చేపట్టి పలువురి మన్ననలు పొందుతున్నారు అటవీశాఖ సిబ్బంది. విలువైన కలపను నరకవద్దు. కలపను నరికితే అడవి తల్లి రోదిస్తుంది. ఒక చెట్టును నరికితే దాని పర్యవసనం అనేక కష్టాలు. అంటూ వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది అటవీశాఖ. టైగర్ జోను పరిధిలోని కడెం అటవీ క్షేత్రంలోని దోస్తునగర్ గ్రామ సమీపంలో ఇందన్పల్లి క్రాసింగు వద్ద ప్రధాన రహదారి పక్కన కళాత్మక సందేశాన్నిస్తున్నట్లుగా అందమైన శిల్పాలను ఏర్పాటు చే శారు. స్మగ్లర్లు అడవి తల్లిని రంపంతో కోస్తుంటే దాని నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లుగా,ఆ చెట్టు పిల్ల రోదిస్తున్నట్లుగా శిల్పాలను పెట్టారు. వీటిని కొద్దిరోజుల క్రితమే అటవీ శాఖ వారు పెట్టించారు. ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో అందరి దష్టిని ఆ శిల్పాలు ఎంతో ఆకర్షిస్తున్నాయి. -
ఇదో లోకం!
ఫొటో తీయడం కోసం మేకల్ని చెట్టు మీద పెట్టారా లేక ఫొటోషాప్‌లో ఇలా క్రియేట్ చేశారా అని అనుమానం వస్తోంది కదూ! అవి రెండూ కాదు. నిజంగానే మేకలు చెట్టు మీదికెక్కి ఆకులు తింటున్నాయి. మొరాకోలోని కొన్ని ప్రాంతాల్లో అర్గాన్ అనే చెట్లు పెరుగుతాయి. సంవత్సరమంతా కాసే ఈ చెట్టు పండ్లు, ఆకులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట. చాలా రుచిగా కూడా ఉంటాయట. దాంతో మేకలు ఇలా చెట్లు ఎక్కి మరీ మేస్తుంటాయన్నమాట! అర్మేనియా దేశంలోని స్కూళ్లలో ఆరేళ్ల వయసు నుంచే పిల్లలకు చెస్ ఆడటం నేర్పిస్తారు. అది అక్కడ మ్యాన్డేటరీ. చెస్ నేర్పించడం వల్ల పిల్లల మెదళ్లు బాగా పదునెక్కుతాయని వాళ్ల ఉద్దేశం, నమ్మకం. యూకేకి చెందిన ఈ అంద మైన భామల పేర్లు లూసీ, మారియా. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. పైగా కవలలు. అలా చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఎలా నమ్ముతారు? ఎక్కడైనా ఒక్క పోలిక ఉంటే కదా! వీళ్లు ఇలా ఎలా పుట్టారో మాకే అర్థం కావడం లేదు అంటుం టారు వాళ్ల తల్లిదండ్రులు. ప్రపంచం మొత్తంలో ఏమాత్రం పోలిక లేని ట్విన్స్ వీళ్లిద్దరేనట! తెల్లని గౌను, మెడలో పూసల దండ, చేతిలో చాకు, ఎదురుగా కేకు... దీని స్టైల్ చూశారా? క్రిస్టల్ అనే ఈ కోతిగారు పెద్ద సెలెబ్రిటీ. అందుకే అంత ఫోజు మరి. సినిమాలకు జంతువుల్ని సప్లై చేసే ఓ కంపెనీ దీనికి నటనలో తర్ఫీదునిచ్చింది. మన క్రిస్టల్గారు సహజ నటి కావడంతో బాగా ఫేమస్ అయిపోయారు. పాతిక పైగా సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రాల్లో నటించి ‘లైఫ్ టైమ్ దివా అచీవ్మెంట్’ అవార్డు కూడా అందుకున్నారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోయే ఇది! మామూలుగా జూలో జంతువులు బోనుల్లో ఉంటాయి. సందర్శకులు వెళ్లి వాటిని చూస్తుంటారు. కానీ చైనాలోని లెహె లెడూ వైల్డ్ లైఫ్ జూలో అంతా రివర్స్. సందర్శకులను వాహనాలకు అమర్చిన బోనుల్లో బంధించి జూ అంతా తిప్పుతారు. జంతువులేమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇలా! బ్రిటన్‌లోని సమ్మర్‌హిల్ స్కూల్లో ఉన్నంత స్వేచ్ఛ మరే స్కూల్లోనూ ఉండదు. అక్కడ చదివే పిల్లలు తమకు ఆసక్తి ఉన్నప్పుడే పాఠాలు వినొచ్చు. లేదంటే డ్రామానో, సినిమానో చూడొచ్చు. మ్యూజిక్, పెయింటింగ్ ఇంకేదైనా నేర్చుకోవచ్చు. తమకు నచ్చిన పని చేయొచ్చు. అదంతా కూడా ఎడ్యుకేషనే అంటుంది స్కూల్ యాజమాన్యం. లండన్‌లోని హాంకీ టాంక్ రెస్టారెంట్లో పనిచేసే క్రిస్ అనే చెఫ్ ఓ బర్గర్‌ను తయారు చేశాడు. దాని పేరు గ్లామ్బర్గర్. నాణ్యమైన బీఫ్, ఖరీదైన బటర్, ప్రత్యేకంగా పండించిన మిర్చి, రకరకాల సాస్‌లతో అతడు తయారు చేసిన ఈ బర్గర్ బాగా ఫేమస్ అయ్యింది. దాంతో రేటు చుక్కలను చేరింది. దీని ఖరీదెంతో తెలుసా... 1100 పౌండ్లు. అంటే మన కరెన్సీలో తొంభై ఆరు వేల పైనే. కనిపించాయి కదా చుక్కలు!!! హ్యారీపాటర్ చిత్రాల హీరో డ్యానియెల్ రెడ్క్లిఫ్కి ఓసారి మీడియా మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా వెంటపడి ఫొటోలు తీయడంతో విసుగొచ్చి, ఓ ఆరు నెలల పాటు ఎక్కడికి వెళ్లినా ఒకే డ్రెస్ వేసుకుని వెళ్లాడు. కొత్త ఫొటో ఇవ్వ కుండా మీడియాని విసిగించాలని! డిస్నీ వాళ్లు ‘ప్రిన్సెస్ అండ్ ఫ్రాగ్’ పేరుతో ఓ యాని మేషన్ చిత్రం తీశారు. ఇది సూపర్‌హిట్ అయ్యింది. దీని ప్రభావం పిల్లల మీద ఎంతగా పడిందంటే... ఆ చిత్రంలోని హీరోయిన్ మాదిరిగానే కప్పలను ముద్దాడదామని ప్రయత్నించి, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా బారిన పడి యాభై మందికి పైగా చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారట! జపాన్లోకి ఒకినావా దీవిలో వందేళ్ల వయసు దాటినవాళ్లు 450 మంది వరకూ ఉన్నారు. అక్కడి వాతావరణం, ఆహారపుటలవాట్ల వల్ల ఇలా ఎక్కువకాలం జీవిస్తున్నారట. అందుకే ఈ దీవిని ‘హెల్దీయెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్’ అంటారు. రోమ్‌లో ‘ద ఆపియన్ వే’ అనే రోడ్డు ఉంది. ఇది అత్యంత పురాతనమైనది. క్రీస్తు శకం 312లో వేశారట. ఇప్పటికీ ప్రజలు దీన్ని వాడుతున్నారు. -
చెట్టుకు పుట్టిన రోజు
మేడ్చల్: గత ఏడాది ఇదే రోజు నాటిన మొక్కకు అధికారులు, విద్యార్థులు కేక్ కట్‌చేసి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. మేడ్చల్‌లోని న్యూ లిటిల్ లిల్లి హైస్కూల్లో గత ఏడాది ఇదే రోజు నిర్వహించిన హరితహారంలో స్థానిక తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని ఓ మొక్క నాటారు. అది ఏపుగా పెరిగింది. దీంతో మంగళవారం స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు తహశీల్దార్, సీఐ రాజశేఖర్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ రాంరెడ్డిలు స్కూల్‌కు వెళ్లి విద్యార్థుల సమక్షంలో ఆనాటి మొక్క వద్ద కేక్ కట్‌చేసి పుట్టినరోజు వేడుక చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మంజులప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు హరితహారం సందర్భంగా కిష్టాపూర్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి పాఠశాల ఆవరణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
పర్యావరణాన్ని సంరక్షించాలి
ఏయూక్యాంపస్: పర్యావరణ సంరక్షణ తక్షణ కర్తవ్యమని ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య టి.భైరాగి రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. విభాగ విద్యార్థులు పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్లకార్డులతో అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు అవలంభించాల్సిన చర్యలను పోస్ట్‌కార్డుల రూపంలో వర్సిటీ ఉపకులపతికి పంపారు. ప్లాస్టిక్ రహితంగా వర్సిటీని ఉంచాలని, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని వీటిలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆచార్య భైరాగి రెడ్డి అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం వలన పర్యావరణ స్పహ కలిగించాలన్నారు. ప్రతీ విద్యార్థి పర్యావరణ చైతన్యంతో మెలగాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. ప్రతీ వ్యక్తి పర్యావరణ హితంగా మెలగాలన్నారు. విద్యార్థులు ఆలోచింపజేసే విధంగా నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో విభాగ పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వాడవాడలా హరితహారం
ఎమ్మెల్యే దివాకర్‌రావు మంచిర్యాల రూరల్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండంలోని హాజీపూర్, దొనబండ జీపీల్లో బుధవారం విస్తృతంగా మొక్కలు నాటారు. మండలంలోని హాజీపూర్ జీపీ పరిధిలోని ధర్మారం, దొనబండ గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మొక్కలు నాటారు. వాడవాడలా హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ కాలుష్యం నివారణకు, వర్షాలు సమృద్ధిగా కురవాలంటే వన సంపందను విరివిగా పెంచాలని కోరారు. భవిష్యత్‌లో రైతాంగానికి సాగునీరు కూడా అందాలంటే మొక్కల పెంపకంలో పొలం, చెరువు గట్లపై మొక్కలు నాటేలా చైతన్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బేర సత్యనారాయణ, వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, హాజీపూర్, దొనబండ సర్పంచులు ఆకుతోట సత్తమ్మ, జాడి సత్యం, ఉప సర్పంచులు బెడ్డల సత్తయ్య, దొమ్మాటి లచ్చన్న, ఎంపీటీసీలు బేతు రమాదేవి, మడావి సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి సత్తయ్య, నాయకులు మాధవరపు రాజేశ్వర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ కొట్టె సత్తయ్య పాల్గొన్నారు. -
నాటిన మొక్కలను సంరక్షించాలి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పదో వార్డు నెంబర్ 2 ఇంకై ్లన్ బస్తీలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎక్కడా ఖాళీ స్థలం కనిపించకుండా విస్తారంగా మొక్కలు నాటించాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో మహిళలు ముందుండడం అభినందనీయమన్నారు.మున్సిపాలిటీలో లక్ష్యం ప్రకారంగా మొక్కలు నాటడం జరుగుతోం§lన్నారు. అనంతరం ఎమ్మెల్యే, చైర్పర్సన్, అధికారులు నెంబర్ 2 ఇంకై ్లన్ బస్తీలో కలియతిరిగి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు తాళ్లపల్లి లక్ష్మి, బత్తుల సుదర్శన్, ఎస్కె యూసుఫ్, ఎలిగేటి శ్రీనివాస్, లింగంపల్లి రాములు, వంశీకష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్, రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, నాయకులు మునిమంద రమేష్, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షుడు ఎండీ. ఎజాజ్, ఖలీల్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు లక్ష్మి, మున్సిపల్ రెవెన్యూ అధికారి మల్లారెడ్డి పాల్గొన్నారు. -
బాధ్యతగా భావించి మొక్కలు నాటాలి
ఆదిలాబాద్ టౌన్ : మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ఎంతో దోహదపడుతాయన్నారు. మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్ విడుదల చేసి పర్యావరణాన్ని కాపాడుతాయన్నారు. నాటిన మొక్కలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, కమిషనర్ అలివేలు మంగతాయారు, టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలురి గోవర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, కౌన్సిలర్ జయశ్రీ, రైల్వే ఏఈ చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న కారు
చెట్టును ఢీకొన్న కారు car dash tree, 8 members injured చెట్టును, ఢీకొన్న, కారు car, dash, tree, 8 members, injured ఎనిమిది మందికి గాయాలు పెనుబల్లి : కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్య జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బృందావనం కాలనీకి చెందిన ఎనిమిది మంది కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్యలో ఉన్న ఒంపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, భార్గవ్ రాజేశ్వరరావు, నాగకుమారి, కేశవాణి, గాయత్రి, మనీష, సునీత, మూర్తిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఎస్సై పి.నవీన్, ట్రెయినీ ఎస్సై బి.పవన్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ కొండా శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు
చెట్టును ఢీకొన్న కారు car dash tree, 8 members injured చెట్టును, ఢీకొన్న, కారు car, dash, tree, 8 members, injured ఎనిమిది మందికి గాయాలు పెనుబల్లి : కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్య జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బృందావనం కాలనీకి చెందిన ఎనిమిది మంది కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో రామచందర్‌రావుబంజర్–లంకాసాగర్ క్రాస్ రోడ్డు మధ్యలో ఉన్న ఒంపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, భార్గవ్ రాజేశ్వరరావు, నాగకుమారి, కేశవాణి, గాయత్రి, మనీష, సునీత, మూర్తిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఎస్సై పి.నవీన్, ట్రెయినీ ఎస్సై బి.పవన్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ కొండా శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి
-
హరితవన అభివృద్ధిలో ఖాకీలు!
ముంబై ప్రజలు ట్రీ ప్లాంటేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్క్లలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు సైతం భాగస్వాములయ్యారు. నగరంలో హరిత వనాన్ని అభివృద్ధి చేసి, కాలుష్యాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు పాలుపంచుకున్నారు. జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 కోట్ల మొక్కలను నాటాలన్న తలంపుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో తమవంతు ప్రయత్నంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీసులతోపాటు, స్థానిక రాజకీయ నాయకులు, ఎన్జీవో సంస్థలు, ప్రజలు సైతం భాగం పంచుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. హరిత వనాన్ని అభివృద్ధి చేసేందుకు పోలీసులు ట్విట్టర్ ను కూడ వాడుకున్నారు. ఆయా ప్రాంతాల పోలీస్టేషన్లలో మొక్కలు నాటుతూ తీసుకున్నఫోటోలను ప్రచారంలో భాగంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
చెట్టును ఢీకొంటే.. బస్సును తగులబెట్టారు!
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ ప్రాంతంలో ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 12 మందికి గాయాలయ్యాయి. అతివేగంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టువైపు దూసుకెళ్లింది. చెట్టును బలంగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై ఆగ్రహించిన అక్కడి స్థానికులు బస్సుకు నిప్పుపెట్టినట్టు తెలిసింది. దాంతో బస్సు మంటల్లో దగ్ధమైంది. -
చెట్టును ఢీకొన్న డీసీఎం-క్లీనర్ మృతి
రాయపర్తి(వరంగల్): మోరిపిరాయల క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లీనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి తీవ్రంగా గాయపడి, అసస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.