
చీమలవారిగూడెంలో చెట్టెక్కిన బాలుడిని తాడు సహాయంతో కిందకు దించుతున్న దృశ్యం, (ఇన్‌సెట్‌లో) రోహిత్‌కుమార్
బుట్టాయగూడెం: మతిస్థిమితంలేని బాలుడు మర్రిచెట్టు చిటారు కొమ్మకు చేరుకుని కిందకు దూకేస్తానంటూ ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన మండలంలోని చీమలవారిగూడెంలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో బాలుడిని చెట్టు నుంచి కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.దుర్గారావు, రమణ రెండో కుమారుడు రోహిత్ (12) ఐదు నెలలుగా మతిస్థిమితం కోల్పో యి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు వారి ఇంటి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు ఎక్కి చిటారు కొమ్మన కూర్చున్నాడు. దింపే ప్రయత్నం చేయగా దూకేస్తానని బెదిరించడంతో కుటుంబసభ్యులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఇక్కడకు చేరుకుని ఉప్పరిల్లకు చెందిన కొండరెడ్డి గిరిజనుడి సాయంతో తాడు కట్టి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడిని సురక్షితంగా కిందకు దించారు. రోహిత్ ఆరో తరగతి చదువుతున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment