Insane Lost
-
సెల్‌ఫోన్ భూతం.. మొబైల్ గేమ్‌తో మతిపోయింది
కణేకల్లు: స్మార్ట్‌ఫోన్ బానిసైన ఓ యువకుడు అదేపనిగా ‘ఫ్రీ ఫైర్ గేమ్’ ఆడుతూ మానసికస్థితిని కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో జరిగింది. కణేకల్లు మండలం బెణికల్లు గ్రామానికి చెందిన మహేష్ ఇంటర్ చదివేవాడు. తండ్రి అతన్ని చదువు మాన్పించి పనిలో చేర్పించాడు. పనిచేయగా వచ్చిన డబ్బుతో మహేష్ ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ‘ఫ్రీ ఫైర్ గేమ్’ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని గంటల తరబడి ఆడేవాడు. మహేష్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రెండు రోజుల క్రితం అతని తండ్రి కణేకల్లులోని ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. తన కుమారుడు 3 నెలలుగా రాత్రి పూట నిద్ర పోవడం లేదని, అన్నం కూడా సరిగా తినడం లేదని చెప్పాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ అహమ్మద్..ఫ్రీ ఫైర్ గేమ్ ఆడడం వల్ల ఆ యువకుడు మతిస్థిమితం కోల్పోయినట్లుగా గుర్తించి, బళ్లారిలోని న్యూరాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో యువకుడిని తీసుకుని తల్లిదండ్రులు బళ్లారికి వెళ్లినట్లు సమాచారం. -
మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. ఏఎస్ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష
మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతరసనహళ్లి వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒంటరి యువతిని చూసి.. 2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజు ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలికి అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి. దోషి ఉమేశయ్య -
ఏ జన్మలో చేసుకున్న పాపమో.. ఏడవని రోజంటూ లేదు
పుట్టుకతోనే వచ్చిన మాయదారి రోగం ఆ చిన్నారుల జీవితాల్లో అంధకారం నింపింది. 18 ఏళ్లుగా ఒకరు, 14 ఏళ్లుగా మరొకరు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఉల్లాసంగా ఆడుకోవాల్సిన పిల్లలు జీవచ్ఛవంలా మారడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఇల్లంతా కన్నీళ్లు పరచుకుని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ పేదింటి కథ ఇదీ.. రాప్తాడు: మండలంలోని మరూరు పంచాయతీ చాపట్ల గ్రామానికి చెందిన మేకల నడిపి కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు ఇద్దరు కవలలు పుట్టారు. పెద్ద కుమారుడు కుళ్లాయప్ప ప్రస్తుతం అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రెండో కుమారుడు ఆంజనేయులుకు మాయదారి జబ్బు వచ్చింది. తర్వాత నాలుగేళ్లకు అమ్మాయి కీర్తన జన్మించగా, తను కూడా మతిస్థిమితం కోల్పోయింది. వీరికి బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఎముకల్లో సారం లేక పిల్లలు జబ్బు పడ్డారని, బెంగళూరు లేదా హైదరాబాదులోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తే కొంత వరకు నయమవుతుందని వైద్యులు తెలిపారు. వైద్యానికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటికే రూ.30 లక్షల వరకూ ఖర్చు.. ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న ఆంజనేయులు, 14 ఏళ్ల వయసున్న కీర్తనకు వైద్యం కోసం గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులు రూ.30 లక్షల వరకూ ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం కన్పించలేదు. మెరుగైన వైద్యం చేయించేందుకు డబ్బు లేక, పిల్లలను పోషించుకోలేక కన్నీటిని దిగమింగుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కుమారుణ్ని ఇంట్లోకి తీసుకెళుతున్న తల్లిదండ్రులు భారమైన పిల్లల పోషణ.. మతిస్థిమితం లేని, కాళ్లూ చేతులు చచ్చుబడి కదల్లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పోషణకు నెలకు రూ.10 వేలు ఖర్చవుతోంది. ఒక్కొక్కరికి రూ.3 వేల పింఛన్ వస్తున్నా.. ఆ డబ్బు మందులకే సరిపోతోంది. అమ్మ ఈశ్వరమ్మే వారికి రోజూ స్నానం చేయించాలి. అన్నం తినిపించాలి. నీళ్లు తాగించాలి. ఇతర పనులన్నీ చేయాలి. ఇద్దరినీ చూసుకునేందుకు అమ్మా నాన్న ఇద్దరూ తప్పనిసరిగా వాళ్ల దగ్గరే ఉండాలి. ఆపన్నహస్తం అందించరూ.. కుళ్లాయప్ప వంట చేసేందుకు వెళుతుంటాడు. అక్కడ వచ్చిన డబ్బుతో పిల్లలకు వైద్యం, కుటుంబ అవసరాలు చూసుకునేవాడు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి శుభకార్యాలు తగ్గిపోయాయి. దీంతో వంట పని పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నాడు. కూలి డబ్బులతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. పైగా ఎక్కువ సమయం పిల్లల వద్దే ఉండాల్సి వస్తుండడంతో కూలి పనులకు కూడా రెగ్యులర్‌గా వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం ఆంజనేయులు 60 కిలోలు, కీర్తన 40 కిలోల బరువు ఉండడంతో వారిని ఒకరే పైకి ఎత్తలేని పరిస్థితి. వారిని పక్కకు తిప్పాలన్నా, మరో చోటకు మార్చాలన్నా ఇద్దరూ ఉండాల్సిందే. ఇలా ఐదారేళ్ల నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ వారి బాగోగులు చూసుకుంటూ ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్నారు. పిల్లలు శారీరకంగా ఎదుగుతున్నా మానసికంగా ఎటువంటి మార్పూ లేదు. చనిపోవాలనుకున్నాం.. ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఈ జన్మలో నరకం అనుభవిస్తున్నాం. మేం ఏడవని రోజంటూ లేదు. ఈ కష్టం పగవాడికీ రాకూడదు. పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. పెద్దాస్పత్రులకు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు అప్పులు చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి తెస్తున్నారు. పిల్లల దయనీయస్థితి చూసి తట్టుకోలేకపోతున్నాం. ఒకానొక దశలో పురుగుల మందు తాగి చనిపోవాలనుకున్నాం. కానీ పిల్లలను చంపడం ఇష్టం లేక ఆ నిర్ణయం మానుకున్నాం. – మేకల నడిపి కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ సాయం చేయదలిస్తే.. పేరు : టి.ఈశ్వరమ్మ బ్యాంకు : ఏపీజీబీ, మామిళ్లపల్లి, కనగానపల్లి మండలం ఖాతా నంబర్ : 9105172249 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏపీజీబీ 0001085 సంప్రదించాల్సిన నంబర్: 97011 41349 -
అయ్యో పాపం.. ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ పెరిగిందో..!
సాక్షి, నల్లజర్ల (పశ్చిమగోదావరి): ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ పెరిగిందో తెలియదు. మన ఊరు, భాష కాదు. సుమారు 25 – 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓ గుర్తు తెలియని యువతి దూబచర్ల శివారులో ఉన్న బైపాస్ రహదారి అండర్ పాస్ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. వంటిపై దుస్తులు కూడా సక్రమంగా లేవు. హిందీ, ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడుతోంది. ఉన్నత చదువులు చదివినట్లు కనిపిస్తున్నా మతిస్థిమితం లేదు. ఎవరైనా కొట్టారో, ఎక్కడైనా పడిపోయిందో తెలియదు. కానీ కాళ్లకు దెబ్బలు ఉన్నాయి. మంగళవారం అటుగా వెళ్తున్న విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ డేవిడ్, మరో వ్యక్తి ఉండ్రాజవరం వెంకటేశ్వరావు ఆమె స్ధితిని గమనించి దుస్తులు తెచ్చి ఇచ్చారు. కాళ్ల గాయాలకు మందు రాశారు. ఆహారం పెట్టారు. ఆమె వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా, పోలీసుల ద్వారా ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో చేర్చుతామని చెబుతున్నారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. చదవండి: (దివ్యాంగ బాలికపై అత్యాచారం) -
మతిస్థిమితం లేని యువతికి చిత్రహింసలు
సాక్షి, నెల్లూరు: మతిస్థిమితం లేని ఓ యువతిని బంధువులే చిత్రహింసలకు గురి చేస్తున్న హృదయ విదారక ఘటన బాలాయపల్లిలో వెలుగుచూసింది. ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం యార్లపూడి గ్రామానికి చెందిన పద్మకు చిన్న వయసు నుంచే మతిస్థిమితం లేదు. ఆమె చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా, తండ్రి ఎటో వెళ్లిపోయాడు. పద్మ తన మేనమామ గగనం మల్లికార్జున, ప్రసన్న దంపతుల సంరక్షణలో ఉంటుంది. ఏడాది క్రితం పద్మకు అక్క వరసయ్యే బాలాయపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సుమతి, బావ వెంకటయ్య వద్ద మేనమామ వదిలి వెళ్లిపోయాడు. అయితే కొంతకాలం నుంచి పద్మను వారు చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొడుతున్నారు. పద్మను ఇంట్లో నిర్బంధించి పైశాచికంగా ప్రవర్తించేవారు. ఈ విషయం వైఎస్సార్సీపీ నాయకురాలు రాయి దేవికాచౌదరి దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, ఎస్సై నరసింహారావు, నెల్లూరు దిశ పోలీసులు మంగళవారం పద్మ నివాసం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో ఉన్న పద్మను చూసి నివ్వెరపోయారు. వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి, పక్కనే ఉన్న సఖి కేంద్రానికి తరలించారు. పద్మకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛన్ వస్తున్న విషయం గమనార్హం. -
మతిస్థిమితం లేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని
సాక్షి, మొయినాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓవ్యక్తి మతిస్థిమితం సరిగా లేని ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలో రోడ్ల పక్కన తిరుగుతున్నమతిస్థిమితం లేని యువతికి మాయ మాటలు చెప్పి తన బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువకుడు ఆదిల్ (19) మంగళవారం రాత్రి నగరం నుంచి మతిస్థిమితం లేని ఓ యువతిని తన బైక్‌పై ఎక్కించుకుని హిమాయత్‌నగర్ గ్రామ సమీపానికి తీసుకొచ్చాడు. రోడ్డు పక్కన బైక్ పెట్టి యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోడ్డుపై అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు అనుమానం వచ్చి చూడగా చెట్ల పొదల్లోంచి యువకుడు పారిపోతుండగా పట్టుకున్నారు. యువతిని సైతం పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువతికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలియ రాలేదు. యువకుడిని విచారించగా అసలు విషయం అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణ కేంద్రానికి పంపించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటన జరిగి మూడు రోజులైనా వివరాలను బయటకు రాకపోవడం గమనార్హం. చదవండి:అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
చెట్టెక్కి.. చెమటలు పట్టించి..
బుట్టాయగూడెం: మతిస్థిమితంలేని బాలుడు మర్రిచెట్టు చిటారు కొమ్మకు చేరుకుని కిందకు దూకేస్తానంటూ ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన మండలంలోని చీమలవారిగూడెంలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో బాలుడిని చెట్టు నుంచి కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.దుర్గారావు, రమణ రెండో కుమారుడు రోహిత్ (12) ఐదు నెలలుగా మతిస్థిమితం కోల్పో యి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు వారి ఇంటి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు ఎక్కి చిటారు కొమ్మన కూర్చున్నాడు. దింపే ప్రయత్నం చేయగా దూకేస్తానని బెదిరించడంతో కుటుంబసభ్యులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఇక్కడకు చేరుకుని ఉప్పరిల్లకు చెందిన కొండరెడ్డి గిరిజనుడి సాయంతో తాడు కట్టి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడిని సురక్షితంగా కిందకు దించారు. రోహిత్ ఆరో తరగతి చదువుతున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు. -
పబ్జీకి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు
సాక్షి, విశాఖపట్నం: పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు.అరకులోయ మండలకేంద్రానికి చెందిన కౌశిక్ నిత్యం పబ్జీ గేమ్‌లో మునిగితేలేవాడు. అకస్మాత్తుగా బిగ్గరగా అరుస్తూ, పిచ్చిగా ప్రవర్తించడంతో గమనించిన కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తలించారు. వైద్యులు ప్రథమ చికిత్సచేసి, విశాఖ తరలించాలని సూచించారు. పబ్జీ గేమ్‌కు బానిస కావడంతోనే మతిస్థిమితం కోల్పోయాడని వారు చెప్పారు. చదవండి: పబ్జీ గేమ్‌కి బానిసై.. -
ఇంజినీరింగ్ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు..!
సాక్షి, ఉలవపాడు: రోడ్‌సేఫ్టీ పోలీసుల మానవత్వం ఓ యువకుడిని తన సొంత ఇంటికి చేర్చింది. మతి స్థిమితం లేకుండా జాతీయ రహదారిపై తిరుగుతున్న యువకుడిని చేరతీసి సమాచారం సేకరించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా.. ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు కలిపి ఏర్పాటు చేసిన రోడ్డుసేప్టీ వాహనంలో కానిస్టేబుళ్లు ప్రసాద్, బ్రహ్మయ్యలు విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై బీట్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు తడుస్తూ కనిపించాడు. తొలుత అనుమానించలేదు. మరలా తిరిగివస్తున్న సమయంలో కూడా అలానే కనిపించడంతో సోమవారం ఉదయం అతనిని దగ్గరకు తీసుకున్నారు. ముందు ఉలవపాడు హోటల్లో టిఫిన్ పెట్టించారు. తమ వాహనంలోనే ఉంచుకుని సమాచారం అడిగారు. మధ్యాహ్నం, రాత్రి కూడా భోజనం పెట్టించారు. అతని వద్ద ఆధార్ కార్డు ఉండడం గమనించి కార్డుతీసుకుని అతని ఫొటోలు తీసి అక్కడ ఉన్న వారికి పంపించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు గుర్తించి మంగళవారం ఉదయం ఉలవపాడుకు వచ్చారు. వచ్చిన తరువాత ఆ యువకుడు అలా మతిస్థిమితం లేకుండా తిరగడానికి గల కారణాలు, ఆ కుటుంబం పడుతున్న బాధలను తల్లిదండ్రులు వివరించారు. ఇంజినీరింగ్ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు... ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామంలోని ఉమ్మడివరం కాలనీకి చెందిన కందుకూరి రాములు, సృజనల కుమారుడు కందుకూరి రాజేష్. 2012 లో విజయవాడలోని ఆర్.కె ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చేరాడు. మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో గొడవ జరిగింది. కళాశాలలో తల పై కొట్టడంతో గాయపడ్డాడు. ఆ తరువాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేశాడు. అప్పటి నుండి క్రమంగా మతి స్థిమితం లేకుండా తయారవుతున్నాడు. ఈ పరిస్థితులో హైదరాబాద్, బెంగళూరు ఇలా పలు చోట్ల చూపించారు. అయినా తగ్గలేదు. తరువాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 14న ఒంగోలు రిమ్స్ లో చేర్చారు. అక్కడే 21 వరకు ఉన్నాడు. వైద్యశాలలో తల్లి నిద్రపోతున్న సమయంలో పారిపోయి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి మతి స్థిమితం లేకుండా ఇలా రోడ్ల పై తిరుగుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి వారి తల్లితండ్రులు వెతికినా ఆచూకీ కనపడలేదు. ఈ పరిస్థితుల్లో రోడ్‌సేఫ్టీ పోలీసులు గుర్తించి అతనితో మంచిగా మాట్లాడుతూ దాదాపు 12 గంటలు ఉంచుకున్న తరువాత తన అడ్రస్‌కు సంబంధించి కార్డును చూపించాడు. తల్లిదండ్రులకు అప్పగింత... ఇక్కడ తీసిన ఫొటోలను అక్కడి పోలీసులకు, మిత్రులకు రోడ్ సేఫ్టీ సిబ్బంది వాట్సప్ ద్వారా పంపించారు. వారి తల్లితండ్రులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారి తల్లితండ్రులు కందుకూరి రాములు, సృజనలు ఆ ఫోటోలు చూసి తమ కుమారుడిని గుర్తించారు. వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం రావడంతో రోడ్‌సేఫ్టీ పోలీసు సిబ్బంది ప్రసాద్, బ్రహ్మయ్యలు రాజేష్‌ను వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
అమ్మగా మారిన కూతురు
సాక్షి, వెంకటాపురం(వరంగల్) : అందరు పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి అలా చేయడంలేదు. మతిస్థిమితం కోల్పోయిన కన్నతల్లికే అమ్మగా మారి సేవచేస్తుంది. బడికి పోయి చదువుకోవాల్సిన ఆ బాలిక తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ములుగు జిల్లా వెంకటాపురంలోని ఎస్సీకాలనీకి చెందిన గాజుల రాజమ్మ–దుర్గయ్యల కుమార్తె రాధను హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ శంకర్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి శ్రీవల్లి(9), అమ్ములు (2) ఇద్దరు పిల్లలు జన్మించగా రాధ మూడు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయింది. ఎవరినీ గుర్తు పట్టకపోవడంతో భర్త శంకర్ భార్య, పిల్లలను వెంకటాపురంలోని తల్లి రాజమ్మ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. జూన్‌లో ములుగులోని ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాలలో శ్రీవల్లిని ఐదో తరగతిలో చేర్పించారు. అయితే, మతిస్థిమితం కోల్పోయిన రాధ గ్రామంలో తిరుగుతూ అందరినీ కొడుతోంది. ఈ క్రమంలో 10రోజుల క్రితం రాధ తల్లి రాజమ్మ సైతం అనారోగ్యానికి గురికావడంతో రాధ ఆలన పాలన చూసుకునేవారు లేరు. దీంతో శ్రీవల్లి చదువు మానేసి ఇంటికి వచ్చేసింది. కన్నతల్లికి అమ్మగా మారి స్నానం చేయిస్తూ, దుస్తులు వేస్తూ, అన్నం తినిపిస్తూ సేవలందిస్తుంది. అంతేకాకుండా చెల్లి అమ్ములు, అమ్మమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ చిన్న వయస్సులోనే పెద్దకష్టం అనుభవిస్తోంది. ఈ మేరకు రాధకు చికిత్స జరిగేలా దాతలు చేయూతనివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అమ్మకు ఏమైందో తెలియదు మా అమ్మకు ఏమైందో తెలియదు. నన్ను, మా చెల్లిని చూస్తే కూడా కొడుతుంది. అమ్మను ఆస్పత్రి ఎక్కడికి, ఎలా తీసుకెవెళ్లాలో తెలియదు. అమ్మ కోసం హాస్టల్ వదిలి ఇంటికొచ్చా. బడికి పోకున్నా మంచిదే కానీ మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. నేను లేకపోతే మా అమ్మను ఎవరు చూసుకుంటారు? మా అమ్మమ్మకు కూడా జ్వరం వచ్చింది. – శ్రీవల్లి, కూతురు -
పేగుబంధం కలిసిన వేళ..!
ఖానాపురం: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 30 ఏళ్ల క్రితం బిడ్డలకు దూరమైన ఓ తల్లి అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. మతిస్థిమితం సరిగ్గా లేక కనిపించకుండాపోయిన ఆ మాతృమూర్తి శుక్రవారం ఇంటికి చేరింది. ఇక ఆశలు వదులుకున్నాక.. తమ తల్లి కళ్ల ముందే కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది కలనా.. నిజమా అని తల్లిని హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి రామక్క, వెంకటయ్య దంపతులకు కుమార్తెలు పద్మ, యశోద, కుమారుడు బండి కృష్ణ ఉన్నారు. వారిలో పద్మ, కృష్ణ ఖానాపురంలోనే నివాసం ఉంటున్నారు. రామక్క మతిస్థిమితం కోల్పోయి ఇంటి వద్ద ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. ఇలా ఆమె అదృశ్యమై ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. అయితే.. రామక్క రోడ్డు పక్కన మతిస్థిమితం కోల్పోయి ఉండగా మహారాష్ట్రలోని సేవా సంకల్ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఆ తర్వాత ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్ బాధ్యులు తీసుకొచ్చి వైద్యం చేయించారు. దీంతో కోలుకున్న రామక్క వివరాలను కనుక్కునే క్రమంలో తన తల్లిగారి గ్రామం వరంగల్ జిల్లా కోరుకొండపల్లి అని చెప్పింది. దీంతో ఫౌండేషన్ ప్రతినిధులు రహెన్, సురేఖ, ప్రదీప్, నితీష్, గణేష్ ఆమెను గురువారం ఉదయం కేసముద్రం మండలం కోరుకొండపల్లికి తీసుకొచ్చారు. అయితే.. రామక్క కుటుంబ సభ్యులు వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో ఉంటారని చెప్పడంతో వారు తిరిగి అంబులెన్స్‌లోనే వరంగల్‌కు వెళ్లారు. శుక్రవారం గూగుల్ మ్యాప్ సాయంతో ఖానాపురం చేరుకున్నారు. గ్రామానికి వచ్చి వివరాలు సేకరించే క్రమంలో ఆమె కుమార్తె పద్మ, కుమారుడు కృష్ణ రామక్కను గుర్తించి సంభ్రమాశ్చార్యానికి లోనై బోరున విలపించారు. ఇక లేదనుకున్న తల్లి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో ఆమెపై పడి వారు రోదిస్తున్న తీరును చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ‘మన ఇంటికి పోదాం పద బిడ్డా..’అంటూ రామక్క వారి కన్నీళ్లను తుడిచింది. తమ తల్లిని అక్కున చేర్చుకుని, అప్పగించిన శ్రద్ధ ఫౌండేషన్ బాధ్యులకు కుటుంబ సభ్యులు చేతులెత్తి నమస్కరించారు. రామక్కతోపాటు వెంకటేశ్వరమ్మ, బిందు, లక్ష్మిలను కూడా వారివారి కుటుంబాలకు అప్పగించేందుకు వెళ్తున్నట్లు ఫౌండేషన్ బాధ్యులు వెల్లడించారు. శ్రద్ధ ఫౌండేషన్ సభ్యుల కృషిని స్థానికులు అభినందించారు. -
వద్దంటావేం నాన్నా..
ఇంటికి నాన్న రాగానే కాళ్లకు అడ్డం పడతారు. మూట కట్టి దాచిన కబుర్లన్నీ చెవిలో వినిపిస్తారు. ఇష్టమైన వస్తువుల జాబితా చిట్టా జేబులో తోస్తారు. ఒడిలో కూర్చుని గారాలు పోతారు. ఏ కూతురైనా నాన్న ప్రేమవర్షంలో తడిసిపోతుంది.. ఆ అదృష్టం ఓ చిట్టితల్లికి దక్కలేదు. ఆ అనురాగం ఆమెపై కురవలేదు. భవిష్యత్తుకు బంగారు బాట వేయలేదు. ప్రయోజకురాలిని చేయాల్సిన నాన్న సహజీవ నాల మోజులో మునిగి తేలుతున్నాడు. కుమార్తె ఉన్నతిని గాలికొదిలేశాడు. తల్లి కన్నుమూసింది. చదువు ఆగిపోయింది. నాన్న ఆదరణ కరువైపోయింది. అదే ఆమెను కుంగదీసింది. మతిస్థిమితం లేకుండా చేసింది. ఆ అభాగ్యురాలు బుదరువాడ పంచాయతీ, టేకులోవ గ్రామానికి చెందిన విద్యార్థిని సీదరపు లక్ష్మీ సరస్వతి. బాధితురాలి సోదరుడు వెంకటేశ్వర్రావు, పెద్దమ్మ కాంతమ్మలు అందించిన వివరాలకు అక్షర రూపమిది.పార్వతీపురం: సాలూరు మండలం తోణాం స్కూలు కాంప్లెక్స్‌కు చెందిన కొట్టుపరువు కొత్తవలస పాఠశాల ఉపాధ్యాయుడు సీదరపు సన్యాసయ్య దొర తొలుత కాంతమ్మను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సింహాచలం, వెంకటేష్ ఇద్దరు పిల్లలు పుట్టారు. అనంతరం ఆమె సొంత చెల్లెలు గంగమ్మను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సీతారాం, లక్ష్మీ సరస్వతి పుట్టారు. లక్ష్మీ సరస్వతి స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివి అత్యధిక మార్కులు సాధించింది. అనంతరం విజయనగరం గొట్లాం కళాశాలలో డిగ్రీ (బయోటెక్నాలజీ)లో చేరింది. అదే సమయంలో తల్లి కాంతమ్మ మృతి చె ందింది. తండ్రి మరో స్త్రీతో సహజీవనం చేస్తూ బిడ్డల్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో లక్ష్మీసరస్వతి చదువు మధ్యలో ఆగిపోయింది. తండ్రి కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై మతిస్థిమితం కోల్పోయింది. కుమార్తె అనారోగ్యంపై స్పందించని తండ్రి అందం, చదువు, చలాకీతనంతో ఆడుతూపాడుతూ తిరిగే పిల్ల.. ఇప్పుడు నోటమాట రాక.. కేకలు వేస్తుంటే కుటుంబ సభ్యులే కాదు... తెలిసినవారి గుండె తరుక్కుపోతోంది. కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తున్నా తండ్రి కరుణించడం లేదు. ఇంటిని పట్టించుకోకపోవడంతో పిల్లల పోషణ కష్టంగా ఉందని బాధితురాలి పెద్దమ్మ కాంతమ్మ, అన్నయ్య వెంకటేశ్వర్రావులు వాపోయారు. ఉపాధ్యాయుడైన సన్యాసయ్య దొర జీతం నుంచి కొత్తమొత్తం నెల నెలా తమకు ఇప్పించాలని ఐటీడీఏ పీఓను కోరేందుకు సోమవారం గ్రీవెన్స్కొచ్చారు. లక్ష్మీసరస్వతి దీనగాథ విన్నవారంతా చలించిపోయారు.