మతిస్థిమితం లేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని | Himayatnagar: Man Molested Mentally Challenged Woman | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని

Published Fri, Apr 2 2021 10:50 AM | Last Updated on Fri, Apr 2 2021 1:55 PM

Himayatnagar: Man Molested Mentally Challenged Woman - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మొయినాబాద్‌: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓవ్యక్తి మతిస్థిమితం సరిగా లేని ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలో రోడ్ల పక్కన తిరుగుతున్నమతిస్థిమితం లేని యువతికి మాయ మాటలు చెప్పి తన బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం  హిమాయత్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువకుడు ఆదిల్‌ (19) మంగళవారం రాత్రి నగరం నుంచి మతిస్థిమితం లేని ఓ యువతిని తన బైక్‌పై ఎక్కించుకుని హిమాయత్‌నగర్‌ గ్రామ సమీపానికి తీసుకొచ్చాడు.

రోడ్డు పక్కన బైక్‌ పెట్టి యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోడ్డుపై అటుగా వెళ్తున్న పెట్రోలింగ్‌ పోలీసులు అనుమానం వచ్చి చూడగా చెట్ల పొదల్లోంచి యువకుడు పారిపోతుండగా పట్టుకున్నారు. యువతిని సైతం పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువతికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలియ రాలేదు. యువకుడిని విచారించగా అసలు విషయం అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణ కేంద్రానికి పంపించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటన జరిగి మూడు రోజులైనా వివరాలను బయటకు రాకపోవడం గమనార్హం. 

చదవండి:అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement