Himayatnagar
-
హైదరాబాద్: మినర్వా కిచెన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మినర్వా కిచెన్ హోటల్లో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్ ఢీకొని యువతికి తీవ్ర గాయాలు
హిమాయత్‌నగర్: బస్‌స్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిని వేగంగా వచ్చిన బైక్ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లిబర్టీ చౌరస్తా నుంచి ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే దారిలో మోర్ మెడికల్ షాప్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్‌లో సోమవారం సాయంత్రం మయూరి అనే యువతి బస్సు కోసం ఎదురుచూస్తుండగా అదే సమయంలో హోండా యాక్టివాపై వేగంగా వచ్చిన యువకుడు ఆమెను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ట్రాఫిక్ పోలీసులు 108 లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నారాయణగూడ పోలీసులు ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకోవాలి
హిమాయత్‌నగర్: దేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులకు లాభాలు అందించే సరుకుగా విద్యుత్ మారిందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 7 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ‘2022 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను ఎండగడదాం’అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. అంతకముందు బషీర్‌బాగ్ విద్యుత్ కాల్పుల్లో మృతి చెందిన అమరులకు నివాళులర్వించారు. ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురగరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసా ద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లు–2022 అనే ది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమేనన్నారు.ఈ బిల్లు వల్ల విద్యుత్ చార్జీలు సామన్య వినియోగ దారులకు అందుబాటులో లేనివిధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పేదప్రజలు, రైతులు, ప్రజా వినియోగ రంగాలకు ఇచ్చే సబ్సిడీలు క్రమంగా రద్దు అవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించుకోవాలని,విద్యుత్ చట్టం–2003ను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ మీటర్ల యోచనను విరమించుకోవాలని, 100 యూనిట్లు లోపు గృహవినియోగదారులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలంటూ ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, తేజ, భరత్, హేమలత పాల్గొన్నారు. -
సీఎం సారూ.. మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు? వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకోలు
హిమాయత్‌నగర్: ‘‘అయ్యా.. సీఎం సారూ.. మిమ్మల్ని గెలిపించినవారిలో మేం కూడా ఉన్నామయ్యా. మీరంటే మాకూ అభిమానం, మా కేసీఆర్ సారు తెలంగాణ సాధించినోడు, ఆయనను సీఎంగా గెలిపించుకోవాలనే ఆశతో మీకు మా ఇంటిల్లిపాదీ ఓట్లు వేసి గెలిపించుకున్నాం సారూ. అందరికీ అన్నీ చేస్తున్నావు సారూ.. మరి మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు. ఉప్పు, పప్పు, కారం, నూనె.. ఇలా ఏది కొనాలన్నా కొనలేకపోతున్నాం. మాకిచ్చే ఆ రూ.25 వేల జీతాలు చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. మాయందు దయ తలచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సారూ’అంటూ సెకెండ్ ఏఎన్ఎంలు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి ఒక్కరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థిస్తున్న తీరు చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఈ సన్నివేశం గురువారం హిమాయ త్‌నగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. వీరి కన్నీటిబాధను చూసిన వాహన దారులు సైతం సంఘీభావం తెలిపారు. చలో అసెంబ్లీ నిమిత్తం అన్ని జిల్లాల నుంచి వీరు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్ వద్దకు తెల్లవారుజామునే చేరుకున్నారు. వీరిలో కొందరు తమ చంటిబిడ్డలను సైతం వెంట తీసు కొనివచ్చారు. పోలీసులకు, సెకెండ్ ఏఎన్ఎంలకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. మగ పోలీసులు పలువురిని ఈడ్చి రోడ్డు పక్కన వేశారు. మహిళా పోలీసులు చాలాసేపు పక్కనే నిలబడి చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఈ సందర్భంగా సెకెండ్ ఏఎన్ఎంల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మమత మాట్లాడుతూ 16 ఏళ్లుగా ప్రభుత్వాలు మాతో గొడ్డుచాకిరి చేయిస్తున్నా యన్నారు. కోవిడ్ సమయంలో నేరుగా కోవిడ్ పేషెంట్లకు ఇంజక్షన్లు చేసింది తామే నన్నారు. ప్రభుత్వం ఏ పనిమొదలు పెట్టినా ముందు ఉండి చేసేది తామేనన్నారు. తమను ఇప్పటికైనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని అభ్యర్థించారు. -
‘రాష్ట్ర బడ్జెట్ అన్నిటికంటే భారీ కుంభకోణం’
హిమాయత్‌నగర్: రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి కుంభకోణం అయితే.. ధరణి పోర్టల్ రెండో కుంభకోణమని బీజేపీ సీనియర్ నేతలు ఆరోపించారు. ఈ రెండింటిని మించిన అత్యంత భారీ కుంభకోణం తెలంగాణ బడ్జెట్ అని మాజీ ఎంపీలు వివేక్‌వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ భరోసా యాత్రకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం నారాయణగూడలోని వెంకటేశ్వరకాలనీలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు ప్రతి గ్రామలో కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తామన్నారు. వీటిలో తమ పార్టీకి చెందిన 800 మంది ప్రముఖులు హాజరై ప్రసంగించనున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌతమ్‌రావు, రాష్ట్ర నాయకులు గడ్డం రామన్‌గౌడ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్: పది అడుగుల మేర కుంగిన రోడ్డు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉన్నపళంగా రోడ్డు కుంగిపోయిన ఉదంతం చోటు చేసుకుంది. శనివారం హిమాయత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. హిమాయత్ నగర్‌లోని స్ట్రీట్ నెంబర్ 5లో పది అడుగుల మేర రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో ట్రక్కు అందులోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలుకాగా, ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. -
ఆర్డర్ ఇస్తే అడ్రస్ లేకుండా పరార్.. రూ.88లక్షల విలువైన ఆభరణాలతో..
సాక్షి, హైదరాబాద్: నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారు, వజ్రాలతో ఓ జ్యూవెలరీ షాప్ యజమాని పరారైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బషీర్‌బాగ్‌కు చెందిన శ్రీయాష్ జ్యూవెలరీస్ భాగస్వామి ఆనంద్‌కుమార్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని శ్రీయాష్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ షాప్‌లు, కస్టమర్ల కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా బంగారు, వజ్రాభరణాలను తయారు చేసి ఇస్తుంటారు. గత ఏడాది ఆనంద్‌కుమార్ అగర్వాల్‌కు గణేష్ చంద్ర దాస్(అతిక్ జ్యువెల్లర్స్) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన గత నవంబర్‌లో పలు దఫాలుగా రూ.కోటి విలువైన ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చంద్రదాస్ వీటిలో దాదాపు రూ.30లక్షల విలువైన ఆభరణాలను తయారు చేసి అప్పగించాడు. రూ.65లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.17లక్షల వజ్రాల ఆభరణాల తయారీలో జాప్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుంచి గణేష్ చంద్ర దాస్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన యాష్ జ్యూవెలరీస్ యజమాని ఆనంద్‌కుమార్ అగర్వాల్ చార్మినర్‌లోని అతని దుకాణానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం కోల్‌కత్తాకు వెళ్లింది. చదవండి: Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు
హిమాయత్‌నగర్: రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్క్ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తథ్యమని ట్రాఫిక్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బషీర్‌బాగ్, స్కైలాన్ థియేటర్ ఏరియా, హిమాయత్‌నగర్ విజయ డయాగ్నోస్టిక్ లైన్ ప్రాంతాల్ని అడిషినల్ డీసీపీ రంగారావు, సెంట్రల్‌జోన్ ఏసీపీ మురళీకృష్ణ, నారాయణగూడ ఇన్స్పెక్టర్ వెంకన్న, అబిడ్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులతో కలసి సోమవారం ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అక్కడే ఉన్న కొందరు వ్యాపారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీమీ అపార్ట్మెంట్లు, షాప్స్‌కు సంబంధించిన పార్కింగ్ ప్లేసులో మాత్రమే పార్క్ చేయాలని ఆదేశించారు. -
పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): నర్సుపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు రాంనగర్‌కు చెందిన కోటం సందీప్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసు స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు వైద్యుడు పరారీలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ లోగా అతడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం సోమవారం నిందితుడు కోటం సందీప్ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పేపర్లతో నిందితుడు, అతడి తండ్రి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. హిమాయత్‌నగర్‌లోని మ్యానికైండ్ ఆసుపత్రిలో బాధితురాలు నర్సుగా, సందీప్ భరద్వాజ్ వైద్యుడిగా చేసేవారు. నైట్‌షిఫ్ట్‌లో ఉన్న నర్సును పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో దాడి చేయడంతో ఆమె గత ఏడాదిలో రెండు సార్లు నారాయణగూడ పోలీసుల్ని ఆశ్రయించింది. చదవండి: (Hyderabad: నైట్ డ్యూటీ.. నమ్మించి నర్సుపై వైద్యుడి లైంగికదాడి) అప్పట్లో పోలీసు అధికారి అతడికి వార్నింగ్ ఇవ్వడంతో పోలీసుల ఎదుటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆర్య సమాజ్‌కు వెళ్లి వెనక్కి తీసుకొచ్చాడు. ఇటీవల మరోమారు పెళ్లి ప్రస్తావన తేవడంతో తన రాజకీయ పలుకుబడితో ఆమెను బెదిరింపులకు గురి చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భరద్వాజ్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. సుమారు 25 రోజుల పాటు నిందితుడి ఆచూకీ తెలియలేదు. పరారీలో ఉన్నట్లు పోలీసులు కాలయాపన చేశారు. అతడిని అరెస్టు చేయకుండా, ముందస్తు బెయిల్ వచ్చేలా పోలీసులు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అరవిరిసిన సోయగం... కళ్లు చెదిరే అందగత్తెలు (ఫొటోలు)
-
ఈ రోజే బతుకుతాను.. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు
భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది. రెండు కిడ్నీలు చెడిపోయి, 22 ఏళ్లుగా డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు మమత. కష్టాలను అధిగమిస్తూ సొంతంగా మ్యాగజీన్ నడుపుతూ, కిడ్నీ రోగులకు మానసిక స్థైర్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘మీ నవ్వు చాలా బాగుందండి’ అని పలకరిస్తే.. రేపటి నవ్వు కూడా ఈ రోజే నవ్వేస్తాను. ఈ రోజును ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాను’ అన్నారు. ‘ఇన్నేళ్లు కష్టాలన్నీ ఒక్కోటి అధిగమిస్తూ వచ్చాను. కానీ, ఇప్పుడు డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా లేక.. ఈ రోజు బతికితే చాలు అనుకుంటున్నాను’ అంటూ నవ్వు వెనకాల దాచుకున్న ఒక్కో వాస్తవాన్ని ఇలా కళ్లకు కట్టారు మమత. ‘‘నన్ను చూసి ఎవరు పలకరించినా ముందు నవ్వేస్తాను. ‘ఇంతబాధలోనూ నవ్వుతూ ఉంటావు’ అంటారు. కష్టం మరింత పరీక్ష పెట్టడానికే వస్తుందేమో అనిపిస్తుంటుంది. 22 ఏళ్ల క్రితం బాబు పుట్టినప్పుడు డెలివరీ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ పాకి, రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో రెండు కిడ్నీలను తొలగించారు. అప్పటినుంచి డయాలసిస్ తప్పనిసరైంది. మా వారికి ఉద్యోగం లేదు. ఊళ్లో ఉన్న తన తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటు నా ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అమ్మ వెన్నుదన్నుగా ఉండటంతో బిడ్డ పెంపకం భారంగా అనిపించలేదు. రాత మార్చుకున్నాను.. ఆర్థికంగా ఏమీ లేదు. ఆరోగ్యమూ లేదు. నా స్థితిని అప్పటి కలెక్టర్‌కు చెప్పాను. నా మాటతీరు చూసి, పుస్తకాలు రాయమన్నాడు. అలా ‘భారతీయ సంస్కృతి’ పేరుతో మ్యాగజీన్ పెట్టుకొని, ప్రకటనలు తెచ్చుకొని నాకంటూ ఓ చిన్న లోకాన్ని ఏర్పరుచుకున్నాను. పత్రిక ద్వారా నలుగురికి సాయం చేయగలిగాను. వారంలో మూడు రోజులు డయాలసిస్. నెలకు సరిపడా చేతినిండా పని. ఈ సమయంలోనే నాలాంటి డయాలసిస్ పేషెంట్ల కోసం ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశాను. కిడ్నీ రోగులకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో పాటు, కౌన్సిలింగ్ ఇచ్చాను. ప్రభుత్వంతో పోరాడి, వేలాది మందికి ఉచిత డయాలసిస్ అవకాశం వచ్చేలా చేశాను. మారిన రాత.. కరోనా టైమ్‌లో శారీరకంగా చాలా దెబ్బతిన్నాను. అసలే డయాలసిస్ పేషెంట్‌ను. దీనికితోడు కరోనా సోకింది. మ్యాగజీన్ ఆగిపోయింది. ఎన్జీవోలోని సభ్యులు కరోనా బారినపడి చాలామంది చనిపోయారు. సపోర్ట్‌గా ఉందనుకున్న అమ్మ మరణం... మానసికంగా బాగా కుంగిపోయాను. దీంతో చాలా ఒంటరిగా అనిపించింది. దాని నుంచి కోలుకుంటానన్న నమ్మకం కూడా కొన్నిరోజులపాటు లేదు. మా అబ్బాయి ‘ఎంతోమందికి కౌన్సెలింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా ఉంటే ఎలా..’ అని ధైర్యం ఇచ్చాడు. మా అబ్బాయి ఫిల్మ్‌మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇంకా వాడి జీవితం సెట్ అవ్వాల్సి ఉంది. ప్రాణం నిలబడాలంటే.. మ్యాగజీన్ నడిపించాలన్నా, చేపట్టిన ఆర్గనైజేషన్‌ను ముందుకుతీసుకువెళ్లాలన్నా మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలుపెట్టాను. ఈ ఉగాదికి మ్యాగజీన్‌ను మళ్లీ ప్రారంభించాను. కానీ, ఆర్థిక లేమి కారణంగా నడపలేకపోతున్నాను. అంతకుముందున్న శక్తి ఇప్పుడు ఉండటం లేదు. హిమోగ్లోబిన్ సడెన్‌గా పడిపోతోంది. ఇన్నేళ్లుగా డయాలసిస్ వల్ల శరీరంలో అకస్మాత్తు గా మార్పులు వస్తుంటాయి. డయాలసిస్‌కు డబ్బుల్లేక ఎప్పుడు మానేస్తానో, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో.. తెలియదు. నా కొడుకు జీవితం ఏం అవుతుందో అని మనసులో ఆందోళనగా ఉంటుంది. ఎవరైనా సాయం అందిస్తే, ఇంకొంతమందికి నా పని ద్వారా సాయం అందించగలను’’ అని వివరించారు మమత. నిన్నటి వరకు రేపటి గురించిన ఆలోచన లేకున్నా గుండెధైర్యంతో నిలదొక్కుకున్న మమత నేటి జీవనం కోసం చిరునవ్వు వెనుక దాగున్న విషాదాన్ని పరిచయం చేశారు. సాయమందించే మనసులు ఆమె చిరునవ్వును కాపాడతాయని ఆశిద్దాం. – నిర్మలారెడ్డి -
కటకటాల్లో గజదొంగ నాయక్
హిమాయత్‌నగర్: భారీ చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగ సంతోష్‌నాయక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 22.409 తులాల బంగారు ఆభరణాలు, 23.7 తులాల వెండి ఆభరణాలు, 11 విదేశీ కరెన్సీలు, 251 విదేశీ కరెన్సీ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో సెంట్రల్ జోన్ డీసీపీ రమణరెడ్డి, అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.జానయ్య, నారాయణగూడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, డీఐ రవికుమార్‌లతో కలసి వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దొంగలింగాల గ్రామానికి చెందిన జతావత్ సంతోష్‌నాయక్ 15 ఏళ్ల ప్రాయంలోనే చోరీల బాట పట్టాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు ఇతడిపై 29 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదన్నారు. జువైనల్ హోం నుంచి వచ్చాక కూడా చోరీలు చేశాడని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నారాయణగూడ పీఎస్ పరిధిలోని ఆయిల్‌సీడ్ కాలనీలో వైద్యుని ఇంట్లో ఇతని స్నేహితుడు విక్రమ్‌తో కలసి భారీ చోరీ చేశాడు. ఈ చోరీలో 50 తులాల బంగారు ఆభరణాలు, 3 వేల విదేశీ కరెన్సీ, కెమెరా, విలువైన వస్త్రాలు దొంగలించాడు. చోరీ అనంతరం నగరంలో రెండు రోజులున్న నాయక్ తిరుపతికి చేరాడు. విషయం పోలీసులకు తెలిసిందని గమనించిన నాయక్ వైజాగ్‌కు మకాం మార్చాడు. ఎట్టకేలకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాయక్‌ను అరెస్టు చేశారు. -
ఢిల్లీ గ్యాంగ్.. లక్షలు వసూల్!
హిమాయత్‌నగర్: ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షలు దండుకుంటున్న ముఠా గుట్టు రట్టయ్యింది. అక్రమంగా కాల్ సెంటర్ నడుపుతూ దగాకు పాల్పడుతున్న ఢిల్లీ గ్యాంగ్‌ను సిటీ సైబర్‌క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు అమ్మాయిలు షైఫలీ, యోగిత, షాలుకుమారి, ప్రియ, శివానీ, ముగ్గురు అబ్బాయిలు రాజేష్‌సింగ్, అనుభవ్‌సింగ్, నఫీజ్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. శనివారం సీసీఎస్ కార్యాలయంలో సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదర్‌గూడకు చెందిన యువతి ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం కావాలంటూ ‘షైన్ డాట్‌కామ్’లో రెజ్యూమ్ అప్లోడ్ చేసింది. రెజ్యూమ్ని చూసిన ఢిల్లీ గ్యాంగ్ యువతితో ఫోన్లో మాట్లాడారు. కంపెనీ నిబంధనలు చెప్పి యువతి నుంచి రూ. 8,02,426 వసూలు చేశారు. అయినా ఉద్యోగం రాలేదు. డబ్బులు అడిగినా వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితురాలు గత ఏడాది అక్టోబర్ 10న సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 26 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పీవీ నరసింహారావు స్థితప్రజ్ఞుడు: కేకే
హిమాయత్‌నగర్: సంఘ సంస్కరణకర్తగా, సామాజికవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ దురంధరుడిగా దివంగత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు, పి.వి.శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. అందుకే ఆయన్ని ప్రతిఒక్కరూ ‘స్థిత ప్రజ్ఞడు’గా కొనియాడుతున్నారని, ఈ పదం పి.వి.కి నూటికి నూరుశాతం సరిపోతుందని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి రచించిన ‘జాతిరత్న పి.వి.నరసింహారావు’గ్రంథాన్ని సోమవారం ఇక్కడి తెలుగు అకాడమీలో ఆయన ఆవిష్కరించారు. కేశవరావు మాట్లాడుతూ ‘పి.వి.పై ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంతో పుస్తకాన్ని, గ్రంథాన్ని రచిస్తున్నారు. ఒక్కో పుస్తకంలో ఒక్కో కోణాన్ని మనం గమనించి దానిని అనుసరించాలి’అని అన్నారు. కేవలం 560 పేజీలతో పి.వి.జీవితాన్ని లెక్కించలేమని పేర్కొన్నారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణం తర్వాత దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో పి.వి. ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఆయన అధిగమించారు. ప్రత్యేక పంజాబ్ కావాలని వేర్పాటువాదులు పోరాడుతున్న సమయంలో అక్కడ ఎన్నికలు జరిపించి శాంతి సామరస్యాలను సాధించిన ధైర్యసాహసిగా పీవీ నిలిచారు’అని కొనియాడారు. పీవీ గొప్ప పాలనాదక్షుడని పేర్కొన్నారు. తన తండ్రి పీవీ సంస్కరణాభిలాషి అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవలి తెలుగు అకాడమీ కుంభకోణం వార్తలు ఎంతో బాధించాయన్నారు. పీవీ గురించి ఓ గ్రంథాన్ని రాయడం నిజంగా వరంలాగా భావిస్తున్నానని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు. కార్యక్రమంలో అకాడమీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అవ్వం పాండయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు: కిషన్‌రెడ్డి
హిమాయత్‌నగర్: కరోనా తగ్గిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకలకు కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మితో కలసి ఆయన బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడికి అర్పించే పూలతో బతుకమ్మ ఆడటం నిజంగా సంతోషదాయకమని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తానని వెల్లడించారు. -
గూగుల్ సెర్చ్ చేసి నిండా మునిగిన బీటెక్ బాబులు..
సాక్షి, హిమాయత్‌నగర్: వారంతా బీటెక్ పూర్తి చేశారు.. పేరుగాంచిన కంపెనీలో ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. గూగూల్ ఉంది కదా అని సెర్చ్ చేసి ఓ నంబర్‌ను సాధించారు. అతగాడికి ఫోన్ కలపగా..మాదాపూర్‌లో కొత్తగా ‘లిమిటెక్స్’ పేరుతో పెద్ద కంపెనీ పెట్టా. నేనే సీఈఓ. నేనే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నా. ఆసక్తి ఉంటే రెజ్యూమ్‌లు పంపండి అని నమ్మబలికాడు. నిజమే కదా అని నమ్మిన సుమారు 35–40 మంది తమ రెజ్యూమ్‌లు పంపి మళ్లీ అతడిని ఫోన్లో కాంటాక్ట్ చేశారు. ఉద్యోగం రావాలంటే ముందుగా కొంత డబ్బు చెల్లించాలనడంతో..ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా ఒక్కొక్కరు పోస్టుకు తగ్గట్టు రూ.లక్ష, రూ.3లక్షల చొప్పున సుమారు రూ.27లక్షల 30 వేలు ఆన్లైన్ ద్వారా పంపారు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని అల్వాల్‌కు చెందిన బుచ్చిరాములు సోమవారం సైబర్‌క్రైం పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. తనలాగా ఎవరైనా బాధితులు ఉన్నారా అని గూగూల్లో సర్చ్ చేయగా..35– 40మంది బాధితులు ప్రస్తుతానికి బుచ్చిబాబును కాంటాక్ట్ చేశారు. దీంతో వీరంతా మంగళవారం నేరుగా సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. వీరితో పాటు మరింత కొంత మంది ఉండొచ్చనేది బాధితుల నుంచి వస్తున్న సమచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం యువకుడితో ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని వెళ్లి. -
Coronavirus: కొడుకా.. వెళ్లిపోయావా..!
హిమాయత్‌నగర్: ‘కొడుకా మేం బతికుండగానే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావా? మేమేం పాపం చేశాం బిడ్డా’ అంటూ కొడుకు మరణాన్ని తట్టుకోలేక రోదించిన ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరి వల్లా కాలేదు. 21రోజుల పాటు కోవిడ్‌తో పోరాడి మంగళవారం ఉదయం మృతి చెందిన కొడుకు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నరకూడి ఇబ్రాము, ఆండాలు కుమారుడు ప్రభాకర్ (32) కోవిడ్‌తో కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిద్దామంటే వారు రూ.10వేలు అడిగారు. రెండు గంటలపాటు ఎదురుచూసి అంత డబ్బు భరించే స్థోమతలేక ఆటో ట్రాలీలోనే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. కోఠి ఈఎన్టీలో బ్లాక్ ఫంగస్‌తో ఒకరి మృతి సుల్తాన్‌బజార్: కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో మొదటిసారి బ్లాక్‌ఫంగస్ పేషెంట్ మృతి చెందాడు. మహబూబాబాద్, బోదతండాకు చెందిన బోడా శ్రీను(50) గత నెల 30న బ్లాక్ ఫంగస్ సోకడంతో ఈఎన్టీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి డయాబెటిక్‌తో పాటు హైపర్‌టెన్షన్, అస్తమా ఉన్నాయి. కరోనా వచ్చి తగ్గిన తర్వాత శ్రీనుకు కన్నులో బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీంతో కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో తొలి బ్లాక్‌ఫంగస్ మృతికేసు నమోదైంది. ఇదిలా ఉండగా వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయలేదని..ఆపరేషన్ చేస్తామని చేయలేదని బంధువులు వాపోయారు. షుగర్ ఎక్కువగా ఉండడంతో పాటు హైపర్‌టెన్షన్ సమస్య వల్ల ఆపరేషన్ వాయిదా వేశామని, బాధితుడు గుండెపోటుతో మాత్రమే మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. చదవండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు ధరలు ఎందుకు నిర్ణయించలేదు? -
విషాదం: పొగతో ఊపిరి ఆడక.. వీధి కుక్కల అరుపులతో..
సాక్షి, హిమాయత్‌నగర్: నారాయణగూడ పరిధిలోని ఓ డూప్లెక్స్ హౌజ్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. పెద్దఎత్తున ఎగిరిపడిన మంటల నుంచి తప్పించుకునేందుకు మొదటి అంతస్తులో నిద్రిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. పొగతో ఊపిరి ఆడక భర్త మృతిచెందగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ కుటుంబ సభ్యుడిని పోలీసులు రక్షించారు. మిగతావారు ఫామ్‌హౌస్‌కు వెళ్లడంతో.. వ్యాపారి గోల్కొండ శాంతారామ్ తన భార్య శోభ, ముగ్గురు కుమారులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్లతో కలిసి బషీర్‌బాగ్ అవంతినగర్ పార్క్ ఎదురుగా ఉండే డూప్లెక్స్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శాంతారామ్ కుమారులు సైతం వ్యాపారులే. జీ+2 గా నిర్మించిన ఆ ఇంట్లో మొత్తం 15 మంది కుటుంబీకులు నివసిస్తుంటారు. లాక్డౌన్ నేపథ్యంలో శాంతారామ్, ఆయన భార్య శోభ, చిన్న కుమారుడు శ్రీనాథ్, ఇతడి భార్య దివ్య, వీరి పిల్లలు మన్వి, మహదేవ్‌లు వికారాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. వీరి కుమారుడు గౌరీనాథ్, ఆయన భార్య మీన, ఇద్దరి పిల్లలు లోకేష్(11), విగ్నేష్(8) ఇంటి రెండో అంతస్తులో ఉన్నారు. మరో కుమారుడు బద్రీనాథ్ మొదటి అంతస్థులో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున ఇల్లు పొగచూరి ఉండటాన్ని గమనించారు. తేరుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. దీంతో బద్రీనాథ్ బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. రెండో అంతస్తులో ఉన్న గోపీనాథ్ కుటుంబం కూడా ఇదే పని చేసింది. ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు వీధి కుక్కల అరుపులతో.. వీధి కుక్కలు అరవడంతో స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మొదటి ఫ్లోర్‌లోని బద్రీనాథ్‌ను కిటికీలోంచి బయ టకు తీసుకువచ్చారు. అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్ మంటలను ఆర్పుకుంటూ రెండో అంతస్తులోకి వెళ్లారు. అక్కడి బాత్రూమ్ నుంచి ‘కాపాడండి.. కాపాడండి’ అంటూ శబ్ధం రావడంతో మీనతో పాటు ఇద్దరు పిల్లల్ని రెస్క్యూ చేసి సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గౌరీనాథ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం గౌరీనాథ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏసీ నుంచి షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని నారాయణగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. గౌరీనాథ్ భార్య మీన, ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
పెళ్లి చేసుకుంటావా.. లేదా అంటూ యువతిని నడిరోడ్డుపై
హిమాయత్‌నగర్: నన్ను పెళ్లి చేసుకుంటావా... లేదా అంటూ ఓ యువతి చెంప చెల్లుమనిపించాడో యువకుడు. ఫోన్ చేసి పదేపదే విసిగిస్తుండడంతో ఆ యువతి నారాయణగూడ పోలీసులును ఆశ్రయించింది. వివరాలోకి వెళితే.. కవాడిగూడకు చెందిన యువతి నారాయణగూడలోని ఓ కూరగాయల షాప్‌లో పనిచేస్తోంది. బన్సీలాల్‌పేటకు చెందిన వేణు ఆ యువతి కొంతకాలంగా చనువుగా ఉన్నారు. ఇద్దరి నడుమా కొద్దిరోజుల క్రితం వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి ఆ యువతి వేణును దూరం పెట్టింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆ యువతి తాను పనిచేస్తున్న షాప్ నుంచి వేరేచోటకు వెళ్లింది. వారం రోజుల క్రితం నారాయణగూడ వైఏంసీ సమీపంలోని ఒక కూరగాయల స్టోర్‌లో చేరింది. విషయం తెలుసుకున్న వేణు సోమవారం ఆమెకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో షాప్ వద్దకు వచ్చి బయటకు రమ్మని పిలిచాడు. వచ్చీరాగానే ఆ యువతిపై చేయి చేసుకున్నాడు. ‘ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తడం లేదు...పెళ్లి అంటే ఏం మాట్లాడవని’ ఊగిపోతూ జుట్టు పట్టుకుని చితకబాదాడు.ఈ క్రమంలో ఆ యువతి చెల్లి, తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. పదిహేను నిమిషాల వ్యవధిలోనే యువతి చెల్లి సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికీ ఆమెను కొడుతూనే ఉన్నాడు. ‘మా అమ్మానాన్న వస్తున్నారు... ఇక్కడే ఉండు నీ సంగతి చూస్తారంటూ’ యువతి చెల్లి బెదిరించగా, క్షణాల వ్యవధిలో వేణు పరారయ్యాడు. ఆ యువతిని తీసుకుని తల్లిదండ్రులు ఇంటికి చేరారు. వేణు మళ్లీ ఫోన్ చేసి ఆ యువతిని బండబూతులు తిట్టాడు. దీంతో కుటుంబసభ్యులతో వచ్చి నారాయణగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లై ఏడాది కాకముందే.. వేధింపులతో వివాహిత బలవన్మరణం -
మతిస్థిమితం లేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని
సాక్షి, మొయినాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓవ్యక్తి మతిస్థిమితం సరిగా లేని ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలో రోడ్ల పక్కన తిరుగుతున్నమతిస్థిమితం లేని యువతికి మాయ మాటలు చెప్పి తన బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువకుడు ఆదిల్ (19) మంగళవారం రాత్రి నగరం నుంచి మతిస్థిమితం లేని ఓ యువతిని తన బైక్‌పై ఎక్కించుకుని హిమాయత్‌నగర్ గ్రామ సమీపానికి తీసుకొచ్చాడు. రోడ్డు పక్కన బైక్ పెట్టి యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోడ్డుపై అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు అనుమానం వచ్చి చూడగా చెట్ల పొదల్లోంచి యువకుడు పారిపోతుండగా పట్టుకున్నారు. యువతిని సైతం పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువతికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలియ రాలేదు. యువకుడిని విచారించగా అసలు విషయం అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణ కేంద్రానికి పంపించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటన జరిగి మూడు రోజులైనా వివరాలను బయటకు రాకపోవడం గమనార్హం. చదవండి:అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
న్యాయవాది తలకు గురిపెట్టిన గన్ ఎవరిది?
హిమాయత్‌నగర్: భూ వివాదంలో న్యాయవాదిపై జరిగిన హత్యాయత్నంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా మలక్‌పేటకు చెందిన వైద్యుడికి, ఓ వ్యక్తికి మధ్య భూమికి సంబంధించిన వ్యవహారంపై వాగ్వివాదం జరిగింది. ఆ భూమి ఎలాగైనా తనకే దక్కాలని మలక్‌పేటకు చెందిన డాక్టర్ మాలిక్.. హిమాయత్‌నగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌సింగ్ చౌదరిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో న్యాయవాది.. ఆ వ్యక్తితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడంటూ డాక్టర్ మాలిక్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. ఫైల్ అడిగి దాడికి యత్నం.. ఈ నెల 16న హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్–7లో నివాసం ఉండే సిద్ధార్థ్‌సింగ్ చౌదరి వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చారు. అపార్ట్మెంట్ వాచ్‌మన్‌కు తాము న్యాయవాదిని కలిసేందుకు వచ్చామని చెప్పి 2వ అంతస్తులోని సిద్ధార్థ్ సింగ్‌చౌదరి వద్దకు మాస్కులు, గ్లౌజులు ధరించి వెళ్లారు. వెళ్లగానే డాక్టర్ మాలిక్ ఫైల్ కావాలని అడిగారు. మీరెవరంటూ న్యాయవాది ప్రశ్నించాడు. ఆలోపే దుండగులు గన్ తీసి న్యాయవాది తలకు గురిపెట్టారు. కత్తులతో పొడిచేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే న్యాయవాది అరుస్తూ.. వారి నుంచి తప్పించుకుని బాల్కనీలోకి పరిగెత్తుకొచ్చాడు. అతడి అరుపులకు అపార్ట్‌మెంట్‌వాసులు, చుట్టుపక్కల వారు రావడంతో.. ఆ ముగ్గురు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల అదుపులో నిందితులు! అప్పటికే సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసేందుకు పాల్పడ్డ దుండగులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు నిందితులు సంఘటనా స్థలానికి కారులో వచ్చారు. ఇద్దరు కారులోనే ఉండగా.. సిద్ధార్థ్ ఇంటిలోకి ముగ్గురు మాత్రమే వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. న్యాయవాది ఇంటి నుంచి 7 బుల్లెట్లు, నాలుగైదు కత్తులను, చిన్నపాటి రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సుపారీ ఇచ్చిన వైద్యుడు ఘటన జరిగిన వెంటనే డాక్టర్ మాలిక్‌పై సిద్ధార్థ్ చౌదరి ఫిర్యాదు చేశారు. డాక్టర్‌కు సంబంధించిన వారే తనపై దాడి చేశారని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో డాక్టర్ మాలిక్‌కు, మరో వ్యక్తికి మధ్య వివాదం నడుస్తోందని చోటు చేసుకుంటున్నాయి. ఈ భూమి తనదంటే తనదంటూ.. ఇద్దరి మధ్యా కొంతకాలంగా వాగ్వివాదం జరుగుతోంది. అయితే ఈ కేసులో ఎలాగైనా గెలిచి ఆ భూమి దక్కించుకోవాలని డాక్టర్ మాలిక్.. సిద్ధార్థ్ సింగ్ చౌదరిని ఆశ్రయించారు. అయితే న్యాయవాది, తన ప్రత్యర్థితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడని డాక్టర్ కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని అంతమొందించేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. వైద్యుడిని ఈ కేసునుంచి తప్పించేందుకు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ గన్ ఎవరిది..? ఈ ఘటనలో లభ్యమైన గన్ ఎవరిదనే దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులను దీనిపై ప్రశ్నించగా.. వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సమాధానం ఇచ్చారు. కాగా, ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా.. ఈ విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేవు. దీంతో సమీపంలోని రెండు కిరాణా దుకాణాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, కారులో ఉన్న మరో ఇద్దరు ఏమయ్యారు.. అసలు ఎందరు అరెస్టయ్యారు..నిందితులను రిమాండ్‌కు పంపారా అనే విషయాలపై పోలీసులు స్పష్టత ఇవ్వట్లేదు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! 3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి.. -
నో కరోనా టీం... ఓన్లీ పోలీస్..!
హిమాయత్‌నగర్: అచేతన స్థితికి చేరుకొని రోడ్డుమీదే ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి మృతదేహం తరలించడానికి చివరికి పోలీసులే నడుంకట్టి శనివారం ఉదయం గాంధీ ఆసుపత్రికి చేర్చారు. కోవిడ్ టీం, జీహెచ్ఎంసీ కీ పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. పోలీసుల సమాచారం మేరకు ... శుక్రవారం రాత్రి బహదూర్(77) అనారోగ్యంతో చికిత్సకోసం యత్నించి రవాణా సాయం అందక లాలాపేటనుంచి గాంధీ ఆసు పత్రికి నడచి వెళ్లేందుకు యత్నించాడు. వయోభారంతో నారాయణగూడ శాంతి థియేటర్ ప్రాంతంలో పడిపోయాడు. లాలాపేట లోని ఓ మద్యం దుకాణంలో వాచ్‌మన్‌గా చే స్తున్న బహదూర్ కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, శ్వాస ఇబ్బందితో బాధ పడుతున్నాడు. దగ్గరలోని పీహెచ్ఎంసీకి వెళ్లాడు. వారు కింగ్‌కోఠికి రిఫర్ చేశారు.అక్కడికి అంబులెన్స్‌లో గురువారం మధ్యాహ్నం వచ్చిన బహుదూర్ కు కరోనా లక్షణాలున్నాయని అనుమానించిన వైద్యులు గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశా రు. గాం«ధీకి వెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో.. 108, 104కు సమాచారం ఇ చ్చినా స్పందించకపోవడంతో కాలినడకన నారాయణగూడ శాంతి థియేటర్ ఏరియాకు గురువారం సాయంత్రం చేరుకున్న బాధితు డు నిస్సత్తువకు లోనయ్యాడు.ఇలా శుక్రవా రం చనిపోయే వరకు రోడ్డుమీదే గడిపాడు. పోలీస్ అలర్ట్..14 గంటల ప్రయాస స్థానికులు మంచినీళ్లిస్తే తాగాడు, రోడ్డుపై కొందరు ఆహార పొట్లాలు ఇస్తే వాటితో కడు పు నింపుకున్నాడు. అలా సాయంత్రం 6.50 ప్రాంతంలో శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న ఓ లేడీస్ హాస్టల్ గేట్ వద్ద రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. స్థానికులు డయల్–100కు ఫిర్యా దు చేశారు. శుక్రవారం రాత్రి 7గంటల ప్రాం తంలో అబిడ్స్ డివిజన్ ఏసీపీ బిక్షంరెడ్డి, సి బ్బంది చేరుకొని అనాథ మృతదేహంగా భా వించి దాన్ని తరలించేందుకు సోషల్ వర్కర్ శ్రీనివాస్‌కు తెలిపారు. అతను వచ్చి బహ దూర్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించే క్రమంలో అతని జేబులో ఉన్న ప్రిస్క్రిప్షన్‌ను గుర్తించి కింగ్‌కోఠి వైద్యులు గాంధీకి రిఫర్ చేసినట్లు తెల్సుకున్నాడు. దీంతో మృతదేహాన్ని తరలించేందుకు ప్రత్యేకించిన కోవిడ్ బృందానికి, జీహెచ్ఎంసీకి.. పోలీసులు స మాచారమిచ్చినా వారు స్పందించలేదు. ఇ లా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉద యం 9.30 వరకు వేచి చూసి రోడ్డుపై అంబులెన్సులోనే మృతదేహాన్ని ఉంచి, చివరికి తా మే పూనుకొని గాంధీకి తరలించారు.అక్కడ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అతనికి కరోనా ఉన్నదీ లేనిదీ పరీక్షల అనంతరం వెల్లడికానుంది. పాజిటివ్ వస్తే అతనితో కాంటాక్ట్ అయిన వారందరినీ ఎలా గుర్తించాలనేది సమస్యగా మారింది. -
కిడ్స్ గ్లామ్ ఫ్యాషన్ షో
-
తమన్నాపైకి బూటు విసిరిన యువకుడు
-
హైదరాబాద్: తమన్నాకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు. నగల షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా కరీముల్లా.. తమన్నాపైకి షూ విసిరాడు. అయితే అది ఆమెకు కొంతదూరంలో పడింది. అప్రమత్తమైన పోలీసులు బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. కరీముల్లా.. ఎందుకు బూటు విసిరాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, సాయంత్రం కొండాపూర్‌లో మరో మలబార్ నగల దుకాణాన్ని తమన్నా ప్రారంభించనుంది. కాగా, ఇటీవల ఖమ్మంలో పర్యటించిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా చెప్పు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. -
ఎరుపు సింగారం..నడక వయ్యారం
-
ఎరుపు సింగారం..నడక వయ్యారం
-
పోస్టాఫీసులపై సీబీఐ ఆకస్మిక దాడులు
హిమాయత్‌నగర్‌లో రూ.40 లక్షలు అధీనంలోకి కొన్ని సేవింగ్స ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లపై కన్ను ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీల పరిశీలన బ్లాక్ మనీ మార్పిడి జరిగినట్లు అనుమానాలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల మార్పిడి నేపథ్యంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరవ్యాప్తంగా దాదాపు ఆరు చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. హిమాయత్‌నగర్ పోస్టాఫీస్‌లో ఉన్న రూ.40 లక్షల్ని తమ అధీనంలోకి తీసుకున్న సీబీఐ అధికారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోస్టాఫీసులపై దాడుల నేపథ్యంలో పోలీసుల సహకారం సైతం తీసుకున్న సీబీఐ అధికారులు కార్యాలయాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తనిఖీల్లో పోస్టల్ విజిలెన్స అధికారులు సైతం పాల్గొన్నారని సమాచారం. ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు ఈ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. దీంతో నగరవాసులు రూ.కోట్లలో పాత కరెన్సీని మార్పిడి చేసుకున్నారు. అరుుతే ప్రతి మార్పిడితోనూ కొన్ని ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలనే నిబంధన ఉంది. కొన్ని పోస్టాఫీసులకు చెందిన అధికారులు సిబ్బంది దీన్ని అతిక్రమించారని, కొందరికి ‘వెసులుబాటు’ కల్పిస్తూ పాత నోట్ల మార్పిడికి సహకరించారని సీబీఐకి వరుస ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సైతం సేకరించిన అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. పోస్టాఫీసులకు సంబంధించి నోట్ల మార్పిడితో అవకతవకలతో పాటు డిపాజిట్లు, సేవింగ్స ఖాతాల్లో జమల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల్ని పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటు ఈ నెల 10 తర్వాత జరిగిన అన్ని ఫిక్సిడ్ డిపాజిట్లు, సేవింగ్స ఖాతాల్లో జమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవకతవకలు నిర్ధారణ కాలేదు పోస్టాఫీసుల్లో సీబీఐ తనిఖీలు సాధారణమని, తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు నిర్ధారణ కాలేదని పోస్టాఫీసు హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కె.సుధీర్‌బాబు తెలిపారు. సీబీఐ బృందం సాధారణ ప్రక్రియలో భాగంగానే తనిఖీలు నిర్వహించి కరెన్సీ మార్పిడి విధానాన్ని పరిశీలించిందని, కరెన్సీ మార్పిడిలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు బహిర్గతం కాలేదని పేర్కొన్నారు. అనుమానిత పార్సిల్స్‌పైనా దృష్టి కొందరు ‘నల్లబాబులు’ పోస్టాఫీసుల్నే ఆధారంగా చేసుకుని అధికారులు, సిబ్బంది సహకారంతో అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సరైన ధ్రువీకరణ లేకుండానే, ఒకే ధ్రువీకరణపై పలు లావాదేవీలు అనుమతిస్తూ పాత నోట్లను మార్చుకునే అవకాశం ఇచ్చారన్నది సీబీఐ అనుమానం. ఇలా సాధ్యం కాని సందర్భాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫిక్సిడ్ డిపాజిట్లు చేయించుకుని, కొన్ని రోజులకే వాటిని రద్దు చేయిస్తూ కొత్త నోట్లు ఇచ్చినట్లు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. కొన్ని అనుమానాస్పద పార్శిల్స్ పైనా దృిష్టిపెట్టినట్లు సమాచారం. ఈ నెల 8 తర్వాత నగరంలోని వాణిజ్య ప్రాంతాల నుంచి ఉత్తరాదితో పాటు ఇతర చోట్లకు వెళ్లిన కొన్ని పార్శిల్స్ వ్యవహారాలను సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది. -
‘షీ–టీమ్స్’ షార్ట్ ఫిల్మ్స్ విడుదల
హిమాయత్‌నగర్: నగరంలో పోలీస్ శాఖతో సంబంధం లేకుండా జరిపిన సర్వేలో 76 శాతం మంది మహిళలు ‘షీ టీమ్స్’ వల్ల ధైర్యంగా జీవిస్తున్నామని తెలిపారని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళలకు ‘షీ టీమ్స్’పై మరింత అవగాహన కల్పించేందుకు లిటిల్ మ్యూజిక్ ఫౌండేషన్ మ్యుజిషీయన్ రామాచారి, షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ జయభారత్, డబ్బింగ్ ఆర్టిస్ట్ వంశీ నటించి, నిర్మించిన మూడు షార్ట్ ఫిల్మ్స్ ను గురువారం బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. తొలి సీడీని అడిషనల్ కమిషనర్ క్రైమ్ స్వాతిలక్రా, అడిషనల్ సీపీ అడ్మిన్ మురళీకృష్ణ, ట్రాఫిక్ కమిషనర్ జితేందర్, ఎస్బీ జాయింట్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, అడిషనల్ డీసీపీలు అవినాష్‌మహంతి, రంజన్లకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... నగరంలో మహిళల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నగర వ్యాప్తంగా రెండేళ్ల క్రితం 100 షీటీమ్స్‌ను ప్రారంభించిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు షీటీమ్స్ బస్టాప్‌లు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ నిఘాను ఏర్పాటు చేసి వీడియో రికార్డింగ్ సహాయంతో ఈవ్‌టీజర్స్‌ను పట్టుకున్నారన్నారు. నగరంలోని మహిళలకు ‘షీ టీమ్స్’ అభయహస్తంగా పని చేస్తున్నాయన్నారు. మొదటి రెండుసార్లు తప్పుచేసిన వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామని, మళ్లీ వారు తప్పు చేస్తే జైలుకు పంపుతున్నామన్నారు. షీటీమ్స్‌పై స్త్రీలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ వీడియోలు, ఆడియోలు రూపొందించారన్నారు. స్వాతిలక్రా మాట్లాడుతూ... నిమిషం నిడివి గల ఈ మూడు వీడియోలు అన్ని సినిమా థియేటర్స్‌లో ప్రదర్శిస్తామని, ఆడియో క్లిప్పింగ్‌లు ప్రతీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్లే అవుతాయన్నారు. వేధింపులకు గురయ్యేవారు నిర్భయంగా తమను వేధించేవారిపై షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయొచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్వాతిలక్రా భరోసా ఇచ్చారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ నంబర్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ‘షీ టీమ్స్’ ఏసీపీ కవిత పనితీరును మొచ్చుకుంటూ కమిషనర్ మహేందర్‌రెడ్డి జ్ఞాపికను అందచేశారు. ఈ షార్ట్ఫిల్్మలకు సహకారం అందించిన రామాచారి, జయభారత్, వంశీలను సత్కరించారు. -
పార్లమెంట్లో వికలాంగుల బిల్లు ప్రవేశపెట్టాలి
హిమాయత్‌నగర్: వికలాంగులకు ప్రయోజనం కలిగించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని పలు సంఘాల నాయకులు అన్నారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో “నూతన చట్టం అమలు–అభ్యంతరాలపై’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూనాయక్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం రూపొందించిన 1995యాక్ట్ నేటికీ అమలు కావడం లేదన్నారు. వికలాంగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెటనే బిల్లు చేస్తామని చెప్పిన బీజెపి ప్రభుత్వం దాని ఊసెత్తడం లేదన్నారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. డీఓపీటీ శాఖ వికలాంగులకు రిజర్వేషన్ల అభ్యంతరాలను వ్యక్తం చేయడం తగదని, వికలాంగులకు ఏ ఉద్యోగమైనా చేయగలిగే సత్తా ఉందన్నారు. కార్యక్రమంలో కస్తూరి జయప్రసాద్, రాంబాబు, వల్లభనేని ప్రసాద్, లక్ష్మీనారాయణ, నండూరి రమేష్, రాఘవన్, రాజేందర్ పాల్గొన్నారు. -
మందకృష్ణమాదిగ అగ్రకులాలకు తొత్తు:దయానంద్
హిమాయత్‌నగర్: వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మందకృష్ణమాదిగ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను అయోమయానికి గురిచేస్తున్నారని మాలమహాసభ రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్ అన్నారు. అగ్రకులాలకు తొత్తుగా మారిన సాంఘిక ద్రోహిగా అభివర్ణించారు. బుధవారం హిమాయత్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన స్వీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకే వర్గీకరణ పేరుతో దళితులను బజారు కీడుస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీలో పోరు జరుగతుంన్నా మాల ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోడం దారుణమన్నారు. ఈ నెల 10,11 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన మాలల ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సురేష్, శివకుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
15 రోజుల్లో 19 కేజీల బరువు తగ్గింపు
హిమాయత్‌నగర్ వాసికి ‘స్టార్’లో సర్జరీ.. ఎంపీ బూర వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తికి 15 రోజుల్లోనే 19 కేజీల బరువును విజయవంతంగా తగ్గించారు నగరంలోని స్టార్ ఆస్పత్రి వైద్యులు. బెరియాట్రిక్ సర్జరీ ద్వారా ఆ వ్యక్తి బరువును 205 కేజీల నుంచి 186 కేజీలకు తగ్గించారు. ఈ మేరకు బుధవారం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ, ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శస్త్రచికిత్స వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి ఊబకాయంతో బాధపడుతున్న హిమాయత్‌నగర్‌కు చెందిన సంయోద్దీన్(49) బూర నర్సయ్యగౌడ్‌ను ఆశ్రయించారు. వైద్యులు ఆయనకు ఈ నెల 6న బెరియాట్రిక్ సర్జరీ చేశారు. శరీరం నుంచి గ్రాము కొవ్వు కూడా బయటికి తీయలేదు. జీర్ణాశయ పేగు సైజు తగ్గించడం వల్ల ఆహారం, నీరు ఎక్కువ తీసుకోలేరు. తద్వారా పొట్ట, నడుం, ఇతర భాగాల్లో పేరుకపోయిన కొవ్వు కరిగి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇలా నెలకు సగటున ఆరు నుంచి ఏడు కేజీల చొప్పున బరువు తగ్గే అవకాశం ఉంది. ‘ప్రస్తుత జనాభాలో 10 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు పరోక్షంగా మధుమేహం, హైపర్ టెన్షన్, శ్వాసకోశ సమస్యలు, ప్యాటీ లివర్, హృద్రోగ సమస్యలకు కారణమవుతోంది. వీరి పాలిట బెరియాట్రిక్ సర్జరీ ఓ వరం లాంటిది. బెరియాట్రిక్ చికిత్సలపై ప్రజల్లో ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే ఇది చాలా సేఫ్ సర్జరీ’ అని డాక్టర్ నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. -
ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలకు టోపీ
హిమాయత్ నగర్ (హైదరాబాద్) : ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువకులను నమ్మించి రూ.40 లక్షల మేర మోసం చేసిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించి నారాయణగూడ ఇన్స్పెక్టర్ భీమ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా గుళ్లపల్లి గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు నగరంలోని న్యూ బాకారంలో నివాసం ఉంటున్నాడు. విలాసాలకు అలవాటు పడిన శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. దీనికోసం నారాయణగూడలో 4 జాబ్ ప్లేస్మెంట్ కన్సల్టేన్సీలను కూడా ప్రారభించాడు. కొందరికి ఫేక్ ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాడు. ఇలా సుమారు 150 మంది నుంచి రూ.40 లక్షల మేర వసూలు చేసి ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఎంతకీ అతడు ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని 420, 406, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
ప్రత్యామ్నాయంగా నిలుస్తాం!
పాలక పక్షాన్ని దారిలో పెడతామంటున్న టీయూవీ రేపు హిమాయత్‌నగర్‌లో మేధోమథనం 9న హైదరాబాద్‌లో సదస్సు ఒక్కతాటిపైకి టీఆర్ ఎస్ మాజీలు, ఉద్యమకారులు హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఒంటెత్తు పోకడలు పోతున్న పాలక పక్షాన్ని దారిలో పెడతామంటూ తెరపైకి వచ్చిన ‘తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ)’.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా మారే దిశగా ముందుకు కదులుతోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన, ప్రజలతో సంబంధాలు ఉన్న వారందరినీ ఒకతాటి మీదకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే జెండాను రూపొందించుకున్న ఈ వేదిక.. ఎజెండా రూపకల్పన కోసం బుధవారం (6వ తేదీన) హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో భేటీ కానుంది. వేదిక కార్యాచరణకు ఒక రూపం ఇచ్చేందుకు ఆ రోజంతా చర్చించనుంది. అవకాశవాదాన్ని నిలదీసేందుకు: ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో పిడికెడు మంది పాలన సాగుతోందని, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి అందలం వేస్తున్నారని టీయూవీ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ ప్రభుత్వం పచ్చి అవకాశవాదంతో పనిచేస్తోందని విమర్శిస్తోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఒక ప్రెషర్ గ్రూప్‌గా టీయూవీని తయారుచేస్తున్నామని వేదిక నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను మౌనంగా గమనిస్తున్న కళాకారులు, మేధావులు మౌనం వీడకుంటే తెలంగాణకు ప్రమాదమన్న విషయాన్ని తెలియజేస్తామని అంటున్నారు. పది జిల్లాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 9న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు కూడా నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. రైతాంగంలో భరోసా కల్పించేందుకు, రైతుల ఆత్మహత్యల నివారణకు ఓ యాత్ర చేపట్టే ఆలోచనలోనూ వేదిక ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తన ప్రాథమ్యాలు మరచిపోయిందని, ఉద్యోగాల భర్తీని విస్మరించిందని, అట్టడుగు కులాల్లో ఆత్మన్యూనత పెరిగిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని వేదిక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అన్నివర్గాల ప్రజలతో వేదిక తెలంగాణ ఉద్యమ వేదిక తెలంగాణ ప్రజల కోసమే. సీఎం కేసీఆర్‌కో, టీఆర్ఎస్ పార్టీకో, జేఏసీకో వ్యతిరేకం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలతో వేదిక రూపుదిద్దుకుంటోంది. పౌరహక్కుల కోసం నాయకత్వం వహిస్తామన్న వారు.. ప్రజాగాయనిపై కేసులు పెడతారు. 220 రోజులుగా సీమాంధ్ర కంపెనీ ఓసీటీఎల్ కార్మికులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పాలకపక్షానికి ప్రత్యామ్నాయంగా, ప్రజల గొంతుకగా నిలబడేందుకు సిద్ధమవుతున్నాం.. - చెరుకు సుధాకర్ -
మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి
-
జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం: నిండు ప్రాణం బలి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) సిబ్బంది నిర్లక్ష్యంతో మరో నిండు ప్రాణం బలైంది. మ్యాన్‌హోల్‌లో పడి సాయి అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఘటన గత అర్థరాత్రి హిమాయత్‌నగర్‌లోని 6వ నెంబర్లో విధిలో చోటు చేసుకుంది. శనివారం ఆ వీధిలోని మ్యాన్‌హోల్ మూత తీసి సిబ్బంది పని చేపట్టారు. అనంతరం ఆ మ్యాన్ హోల్‌కు మూత అమర్చకుండా వెళ్లిపోయారు. దీంతో గత అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న సాయి ఆ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వీధి నెం 6కు చేరుకుని మ్యాన్ హోల్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
గంగాధర, న్యూస్‌లైన్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మరుకు ఫ్యూజు వైరు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందగా, మరొకరు ప్రాణాపయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన గురువారం మండలంలోని హిమ్మత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. హిమ్మత్‌నగర్‌కు చెందిన సర్వు రాజమల్లు(45) మూడెకరాల వ్యవసాయభూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ భూమి సమీపంలోనే ఎస్ఎస్ 11 ట్రాన్స్ ఫార్మర్ ఉంది. గురువారం పొలం పనిచేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు వైరు కొట్టేసింది. గమనించిన రాజమల్లు ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి వైరు వేశాడు. అక్కడే ఉన్న మరో రైతు ఏగుర్ల బీరయ్యను డీపీ స్విచ్ఆన్ చేస్తుండగా ప్యూజ్‌లో మంటలు వచ్చి రాజమల్లు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో రైతు బీరయ్య సైతం విద్యుదాఘాతంతో గాయపడ్డాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్సై రాజేంద్రప్రసాద్, ఏఎస్సై రాజేశ్వర్ పరిశీలించారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ సిరిమల్ల చంద్రమోహన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.