హిమాయత్‌నగర్: అచేతన స్థితికి చేరుకొని రోడ్డుమీదే ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి మృతదేహం తరలించడానికి చివరికి పోలీసులే నడుంకట్టి శనివారం ఉదయం గాంధీ ఆసుపత్రికి చేర్చారు. కోవిడ్ టీం, జీహెచ్‌ఎంసీ కీ పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. పోలీసుల సమాచారం మేరకు ... శుక్రవారం రాత్రి బహదూర్(77) అనారోగ్యంతో చికిత్సకోసం యత్నించి రవాణా సాయం అందక లాలాపేటనుంచి గాంధీ ఆసు పత్రికి నడచి వెళ్లేందుకు యత్నించాడు. వయోభారంతో నారాయణగూడ శాంతి థియేటర్ ప్రాంతంలో పడిపోయాడు. లాలాపేట లోని ఓ మద్యం దుకాణంలో వాచ్‌మన్‌గా చే స్తున్న బహదూర్ కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, శ్వాస ఇబ్బందితో బాధ పడుతున్నాడు. దగ్గరలోని పీహెచ్‌ఎంసీకి వెళ్లాడు. వారు కింగ్‌కోఠికి రిఫర్ చేశారు.అక్కడికి అంబులెన్స్‌లో గురువారం మధ్యాహ్నం వచ్చిన బహుదూర్ కు కరోనా లక్షణాలున్నాయని అనుమానించిన వైద్యులు గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశా రు. గాం«ధీకి వెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో.. 108, 104కు సమాచారం ఇ చ్చినా స్పందించకపోవడంతో కాలినడకన నారాయణగూడ శాంతి థియేటర్ ఏరియాకు గురువారం సాయంత్రం చేరుకున్న బాధితు డు నిస్సత్తువకు లోనయ్యాడు.ఇలా శుక్రవా రం చనిపోయే వరకు రోడ్డుమీదే గడిపాడు.
పోలీస్ అలర్ట్..14 గంటల ప్రయాస
స్థానికులు మంచినీళ్లిస్తే తాగాడు, రోడ్డుపై కొందరు ఆహార పొట్లాలు ఇస్తే వాటితో కడు పు నింపుకున్నాడు. అలా సాయంత్రం 6.50 ప్రాంతంలో శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న ఓ లేడీస్ హాస్టల్ గేట్ వద్ద రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. స్థానికులు డయల్–100కు ఫిర్యా దు చేశారు. శుక్రవారం రాత్రి 7గంటల ప్రాం తంలో అబిడ్స్ డివిజన్ ఏసీపీ బిక్షంరెడ్డి, సి బ్బంది చేరుకొని అనాథ మృతదేహంగా భా వించి దాన్ని తరలించేందుకు సోషల్ వర్కర్ శ్రీనివాస్‌కు తెలిపారు. అతను వచ్చి బహ దూర్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించే క్రమంలో అతని జేబులో ఉన్న ప్రిస్క్రిప్షన్‌ను గుర్తించి కింగ్‌కోఠి వైద్యులు గాంధీకి రిఫర్ చేసినట్లు తెల్సుకున్నాడు. దీంతో మృతదేహాన్ని తరలించేందుకు ప్రత్యేకించిన కోవిడ్ బృందానికి, జీహెచ్‌ఎంసీకి.. పోలీసులు స మాచారమిచ్చినా వారు స్పందించలేదు. ఇ లా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉద యం 9.30 వరకు వేచి చూసి రోడ్డుపై అంబులెన్సులోనే మృతదేహాన్ని ఉంచి, చివరికి తా మే పూనుకొని గాంధీకి తరలించారు.అక్కడ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అతనికి కరోనా ఉన్నదీ లేనిదీ పరీక్షల అనంతరం వెల్లడికానుంది. పాజిటివ్ వస్తే అతనితో కాంటాక్ట్ అయిన వారందరినీ ఎలా గుర్తించాలనేది సమస్యగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment