one man died
-
నో కరోనా టీం... ఓన్లీ పోలీస్..!
హిమాయత్‌నగర్: అచేతన స్థితికి చేరుకొని రోడ్డుమీదే ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి మృతదేహం తరలించడానికి చివరికి పోలీసులే నడుంకట్టి శనివారం ఉదయం గాంధీ ఆసుపత్రికి చేర్చారు. కోవిడ్ టీం, జీహెచ్ఎంసీ కీ పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. పోలీసుల సమాచారం మేరకు ... శుక్రవారం రాత్రి బహదూర్(77) అనారోగ్యంతో చికిత్సకోసం యత్నించి రవాణా సాయం అందక లాలాపేటనుంచి గాంధీ ఆసు పత్రికి నడచి వెళ్లేందుకు యత్నించాడు. వయోభారంతో నారాయణగూడ శాంతి థియేటర్ ప్రాంతంలో పడిపోయాడు. లాలాపేట లోని ఓ మద్యం దుకాణంలో వాచ్‌మన్‌గా చే స్తున్న బహదూర్ కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, శ్వాస ఇబ్బందితో బాధ పడుతున్నాడు. దగ్గరలోని పీహెచ్ఎంసీకి వెళ్లాడు. వారు కింగ్‌కోఠికి రిఫర్ చేశారు.అక్కడికి అంబులెన్స్‌లో గురువారం మధ్యాహ్నం వచ్చిన బహుదూర్ కు కరోనా లక్షణాలున్నాయని అనుమానించిన వైద్యులు గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశా రు. గాం«ధీకి వెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో.. 108, 104కు సమాచారం ఇ చ్చినా స్పందించకపోవడంతో కాలినడకన నారాయణగూడ శాంతి థియేటర్ ఏరియాకు గురువారం సాయంత్రం చేరుకున్న బాధితు డు నిస్సత్తువకు లోనయ్యాడు.ఇలా శుక్రవా రం చనిపోయే వరకు రోడ్డుమీదే గడిపాడు. పోలీస్ అలర్ట్..14 గంటల ప్రయాస స్థానికులు మంచినీళ్లిస్తే తాగాడు, రోడ్డుపై కొందరు ఆహార పొట్లాలు ఇస్తే వాటితో కడు పు నింపుకున్నాడు. అలా సాయంత్రం 6.50 ప్రాంతంలో శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న ఓ లేడీస్ హాస్టల్ గేట్ వద్ద రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. స్థానికులు డయల్–100కు ఫిర్యా దు చేశారు. శుక్రవారం రాత్రి 7గంటల ప్రాం తంలో అబిడ్స్ డివిజన్ ఏసీపీ బిక్షంరెడ్డి, సి బ్బంది చేరుకొని అనాథ మృతదేహంగా భా వించి దాన్ని తరలించేందుకు సోషల్ వర్కర్ శ్రీనివాస్‌కు తెలిపారు. అతను వచ్చి బహ దూర్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించే క్రమంలో అతని జేబులో ఉన్న ప్రిస్క్రిప్షన్‌ను గుర్తించి కింగ్‌కోఠి వైద్యులు గాంధీకి రిఫర్ చేసినట్లు తెల్సుకున్నాడు. దీంతో మృతదేహాన్ని తరలించేందుకు ప్రత్యేకించిన కోవిడ్ బృందానికి, జీహెచ్ఎంసీకి.. పోలీసులు స మాచారమిచ్చినా వారు స్పందించలేదు. ఇ లా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉద యం 9.30 వరకు వేచి చూసి రోడ్డుపై అంబులెన్సులోనే మృతదేహాన్ని ఉంచి, చివరికి తా మే పూనుకొని గాంధీకి తరలించారు.అక్కడ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అతనికి కరోనా ఉన్నదీ లేనిదీ పరీక్షల అనంతరం వెల్లడికానుంది. పాజిటివ్ వస్తే అతనితో కాంటాక్ట్ అయిన వారందరినీ ఎలా గుర్తించాలనేది సమస్యగా మారింది. -
జనసేన సభలో అపశ్రుతి
సాక్షి, నంద్యాల : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సభా ప్రాంగణం వద్ద మైక్ సౌండ్ సెట్ తల మీద పడటంతో సిరాజ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే సిరాజ్ ప్రాణాలు వదిలాడు. దీంతో సభా ప్రాంగణం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. సభను కొనసాగించేందుకు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మృతి చెందిన సిరాజ్ నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌గా తెలిసింది. అతడికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కుమార్తె అంగవైకల్యంతో బాధపడుతోంది. సిరాజ్ మరణ వార్త తెలిసి కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
‘పుష్కర’ స్నానానికెళ్లి మృత్యు ఒడిలోకి..
హాలియా: కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో పుష్కరస్నానాన్ని ఆచరించేందుకు వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా ములుగు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్ర కారం.. హాలియాకు చెందిన బొల్లేపలి శ్రీధర్‌రాజు (36) తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో పుష్కరస్నానం ఆచరించేందుకు శనివారం కారులో కరీంనగర్ జిల్లా ధర్మపురికి వెళ్లాడు. పుణ్య కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో వరంగల్ జిల్లా ములుగు గ్రామం వద్దకు రాగానే కారును టాటా ఏస్ వా హనం ఢీకొట్టడంతో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెం దాడు. కారులో ఉన్న అతడి తల్లి ప్రమీల, భార్య విజ యలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు అమూల్య, అఖిలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు వరంగల్ జిల్లా ఎండీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ప్రమీల పరిస్థితి విషమంగా ఉ న్నట్టు తెలిసింది. శ్రీధర్ రాజు మరణవార్త విని కుటుంబ సభ్యులు, బంధువుల కంటతడి పెట్టారు. రెండు నెలల క్రితమే శ్రీధర్ తండ్రి మృతిచెందాడు. షాక్ నుంచి కోలుకోకముందే రోడ్డు ప్రమాదంలో శ్రీధర్‌రాజు మృతి చెందడం అందరినీ కలచివేసింది. -
జిలెటిన్ స్టిక్స్ పేలి ఒకరి మృతి
-
డీవైడర్‌ను ఢీకొట్టిన పల్సర్... వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: గుంటూరు నగరం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎ.విజయభాస్కర్(48) గుంటూరులోని నవభారత్ కాలనీలో ఓ ఫర్నిచర్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతడు మరో ఇద్దరితో కలసి పల్సర్ బైక్‌పై నవభారత్ కాలనీ నుంచి గుంటూరు వైపు వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాకుండా, రాసుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో విజయభాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు విజయభాస్కర్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
రాజమండ్రి(రూరల్): ట్రాక్టర్ డీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని శాటిలైట్ సిటి గ్రామంలో జరిగింది. హుక్కుంపేటకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్నప్పుడు ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
విధి నిర్వహణకు వెళుతూ...
ముమ్మిడివరం : విధినిర్వహణలో ఉన్న అగ్నిమాపక కేంద్రం ఉద్యోగి కొమానపల్లి సత్యం(55) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ముమ్మిడివరం గంటావీధికి చెందిన సత్యం అమలాపురం ఫైర్ స్టేషన్లో డిప్యుటేషన్‌పై లీడింగ్ ఫైర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అమలాపురం నుంచి కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ కార్యాలయానికి రిపోర్టు చేసేందుకు వెళుతుండగా ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు పల్లిపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై ఎదురుగా కొబ్బరిలోడుతో వస్తున్న మినీవ్యాన్ అతడిని బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో సత్యం తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సత్యానికి భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ముమ్మిడివరం చేరుకున్నాడు. 1994 నుంచి 2002 వరకు ముమ్మిడివరం ఫైర్స్టేషన్లో ఫైర్‌మెన్‌గా పనిచేశాడు. స్వగ్రామం ఐ.పోలవరం మండలం కేశనకుర్రు అయినప్పటి కీముమ్మిడివరంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. తమకు పెద్ద దిక్కుకోల్పోయిన కుటుంబ సబ్యులు సంఘటన స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ముమ్మిడివరం ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
డాక్టర్ కాకుండానే..
డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. అందుకనుగుణంగా ఎంతో కష్టపడి ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీటు పొందాడు.. నాలుగేళ్లయితే చాలు డాక్టరై పేదలకు సేవ చేయాలనుకున్నాడు.. అంతలోనే ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి.. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. హృదయ విదారకమైన ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆమనగల్లు / కల్వకుర్తి :జిల్లాలోని గుండ్లపల్లి(డిండి) మండలం చెర్కుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండాకు చెందిన రాత్లావత్ రామదాసునాయక్ (24)కు ఇటీవల ఎంసెట్ మెడిసిన్ విభాగంలో ఎస్టీ కోటాలో ఫ్రీ సీటు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు గ్రామపంచాయతీ పరిధిలోని జంగారెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనిం చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సాయికుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదే హంతో గంటపాటు బంధువులు కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో సీఐ భిక్షపతిరావు, ఎస్ఐ వీరబాబు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని డీఎం అజ్మతుల్లా హామీతో వారు శాంతించి వెనుదిరిగారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
శ్రీకాకుళం క్రైం: రిమ్స్ వైద్యుల నిర్లక్షానికి ఓ నిండు ప్రాణం బలైంది. దీంతో..మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండ మండలం ఎన్కే రాజపురం గ్రామానికి చెందిన నీలాపు శ్రీనివాసరావు కోటబొమ్మాళి ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ఆదివారం ఉదయం ఇంటికి బయల్దేరాడు. ఆటోలో వస్తుండగా.. నరసన్నపే ట మండలం తామరాపల్లి వద్ద జాతీయ రహదారిపై కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతనిని రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కానీ మధ్యాహ్నం మెరుగైన వైద్య సేవల కోసం కిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే..అప్పటికే..పరిస్థితి విషమించడం శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెంటనే..రిమ్స్‌కు తిరిగి తీసుకువచ్చారు. రిమ్స్ వైద్యులు మరోసారి పరీక్షించి..ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బంధువుల ఆందోళన.. ఇదిలా ఉండగా..రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే..శ్రీనివాసరావు మృతి చెందాడంటూ..ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. ఉదయం రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత ఆయన బాగానే మాట్లాడాడని..లోపల మాత్రం బాగా దెబ్బలు తగిలాయన్నారు. వైద్యులు ఆయనకు తగిలిన గాయాలపై దృష్టి సారించకుండా..పైపైనే వైద్యం చేశారని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే..ఆయన నిండు ప్రాణాలు బలయ్యాయంటూ..రిమ్స్ ఎదుట కొద్ది సేపు అందోళన చేశారు. ఎక్సైజ్ అధికారు లు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రిమ్స్‌కు తరలివచ్చారు. శ్రీనివాసరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరో ముగ్గురికి.. నరసన్నపేట : ఈ ఆటో ప్రమాదంలోనే శ్రీనివాసరావుతో పాటు..సత్యవరం గ్రామానికి చెందిన లబ్బ రమణ, పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన వెలమల నీలవేణి, దంత గ్రామానికి చెందిన పంగ అప్పన్నలకు గాయాలయ్యాయి. వీరంతా శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాలకొండలో విషాదం పాలకొండ: శ్రీనివాసరావు మృతి చెందడంతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎన్.కె.రాజపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు జిల్లాలోని పలు స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ శ్రీకాకుళంలో కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయనకు భార్య విమలతో పాటు కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె సాత్విక ఉన్నారు. శ్రీనివాసరావు హఠాన్మరణంతో ఈ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోపక్క శ్రీనివాసరావు తల్లిదండ్రులు ఇప్పటికే మరణించగా అతని సోదరుడు సురేష్ ఎన్.కె.రాజపురంలో నివాసముంటున్నాడు. అలాగే శ్రీనివాసరావు అక్కచెల్లెళ్లు మణి, పద్మ సోదరుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. -
స్నేహితుల దినం రోజే ..
ప్రొద్దుటూరుకు చెందిన విజయ్ కుమార్ స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనుకున్నాడు. స్నేహితులంతా సమీపంలోని కుందూ నది వద్దకు వెళ్లారు. ఈత కొట్టసాగారు.. ఇంతలోనే విజయ్ కుమార్ ఊబిలో చిక్కుకుపోయాడు. స్నేహితులు గమనించి వెలికితీసేలోపే ఊపిరి ఆగిపోయింది. స్నేహితుల రోజునే వారికి విషాదాన్ని మిగిల్చాడు. ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన సుజానమ్మ, ఆనందరావు దంపతుల పెద్ద కుమారుడు విజయకుమార్(22) ఈత కోసం కామనూరు సమీపంలోని కుందూనది ఊబిలో చిక్కి ఆదివారం అకాల మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. పనికెళ్లిన్నా.. బతికేటోడు విజయకుమార్ లారీ అన్‌లోడింగ్‌కు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే కావడంతో పనికి వెళ్లలేకపోయాడు. తోటి మిత్రులతో కలసి ఆనందంగా గడపాలనుకున్నాడు. తన ఆరుగురు మిత్రులతో కలసి కామనూరు సమీపంలోని కుందూనదికి ఈతకని వెళ్లాడు. అక్కడ ఈతకొడుతుండగా ఊబిలో చిక్కాడు. ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుని మరణించాడు. ఈతగాళ్లొచ్చినా ప్రయోజనం లేకపాయె.. సంఘటన జరిగిన వెంటనే విజయకుమార్ మిత్రులు వెంటనే గ్రామంలోకి చేరుకుని జరిగిన సంఘటనను తెలిపారు. వెంటనే గ్రామస్తులు ఈతగాళ్లను పిలిపించారు. వారు కుందూనదిలో అంతటా గాలించారు. చివరకు విజయకుమార్ మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. విజయకుమార్‌కు నివాళులు ఈతకు వెళ్లి విజయకుమార్ మృత్యువాతపడినట్లు తెలియగానే వార్డు కౌన్సిలర్ రాగుల శాంతి, ఆమె భర్త శ్రీనివాసులు, 19వ వార్డు కౌన్సిలర్ చక్రకోళ్ల రామదాసు, చౌడం రవీంద్ర తదితరులు తరలివచ్చారు. విజయకుమార్ మృతదేహాన్ని సందర్శించారు. నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. తల్లిడిల్లిన హృదయం తన బిడ్డ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లాడని, ఇక రాడని తెలిసి విజయకుమార్ తల్లి సుజానమ్మ తల్లడిల్లిపోయారు. అండగా ఉంటాడనుకుంటిమే.. మమ్మల్ని వదిలేసి ఎళ్లిపోతివా బిడ్డా.. అంటూ ఆమె విగతజీవిగా మారిన కుమారుడిపై పడి రోదించడం అందరి హృదయాలను బరువెక్కించింది. దేవుడా.. ఎంత అన్యాయం చేశావురా.. మాకు ఎందుకింత శిక్ష విధించావురా సామీ.. అంటూ ఆమె గద్గద స్వరంతో దేవుడ్ని నిలదీయడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు.. స్నేహితులు.. ఇలా అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఫ్రెండ్షిప్ డే రోజునే తాము మంచి స్నేహితుడ్ని కోల్పోవడం దురదృష్టకరమని అతని మిత్రులు బిగ్గరగా ఏడ ్వడం కరకు హృదయాలను సైతం కరిగించింది.