హాలియా: కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో పుష్కరస్నానాన్ని ఆచరించేందుకు వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా ములుగు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్ర కారం.. హాలియాకు చెందిన బొల్లేపలి శ్రీధర్‌రాజు (36) తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో పుష్కరస్నానం ఆచరించేందుకు శనివారం కారులో కరీంనగర్ జిల్లా ధర్మపురికి వెళ్లాడు. పుణ్య కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.
మార్గమధ్యలో వరంగల్ జిల్లా ములుగు గ్రామం వద్దకు రాగానే కారును టాటా ఏస్ వా హనం ఢీకొట్టడంతో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెం దాడు. కారులో ఉన్న అతడి తల్లి ప్రమీల, భార్య విజ యలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు అమూల్య, అఖిలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు వరంగల్ జిల్లా ఎండీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ప్రమీల పరిస్థితి విషమంగా ఉ న్నట్టు తెలిసింది. శ్రీధర్ రాజు మరణవార్త విని కుటుంబ సభ్యులు, బంధువుల కంటతడి పెట్టారు. రెండు నెలల క్రితమే శ్రీధర్ తండ్రి మృతిచెందాడు. షాక్ నుంచి కోలుకోకముందే రోడ్డు ప్రమాదంలో శ్రీధర్‌రాజు మృతి చెందడం అందరినీ కలచివేసింది.
‘పుష్కర’ స్నానానికెళ్లి మృత్యు ఒడిలోకి..
Published Sun, Jul 19 2015 11:24 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement