
బతుకమ్మ వేడుకల్లో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
హిమాయత్‌నగర్: కరోనా తగ్గిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకలకు కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మితో కలసి ఆయన బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడికి అర్పించే పూలతో బతుకమ్మ ఆడటం నిజంగా సంతోషదాయకమని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment