![Fire Accident At Minerva Kitchen Hotel In Himayatnagar](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/5/Minarva%20kitchen.jpg.webp?itok=0UCzeMJx)
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మినర్వా కిచెన్ హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment