
హిమాయత్‌నగర్‌లో వ్యాపారులతో మాట్లాడుతున్న ట్రాఫిక్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి
హిమాయత్‌నగర్: రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్క్ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తథ్యమని ట్రాఫిక్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బషీర్‌బాగ్, స్కైలాన్ థియేటర్ ఏరియా, హిమాయత్‌నగర్ విజయ డయాగ్నోస్టిక్ లైన్ ప్రాంతాల్ని అడిషినల్ డీసీపీ రంగారావు, సెంట్రల్‌జోన్ ఏసీపీ మురళీకృష్ణ, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తదితరులతో కలసి సోమవారం ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు.
రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అక్కడే ఉన్న కొందరు వ్యాపారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీమీ అపార్ట్‌మెంట్‌లు, షాప్స్‌కు సంబంధించిన పార్కింగ్ ప్లేసులో మాత్రమే పార్క్ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment