Vehicles Parking
-
రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు
హిమాయత్‌నగర్: రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్క్ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తథ్యమని ట్రాఫిక్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బషీర్‌బాగ్, స్కైలాన్ థియేటర్ ఏరియా, హిమాయత్‌నగర్ విజయ డయాగ్నోస్టిక్ లైన్ ప్రాంతాల్ని అడిషినల్ డీసీపీ రంగారావు, సెంట్రల్‌జోన్ ఏసీపీ మురళీకృష్ణ, నారాయణగూడ ఇన్స్పెక్టర్ వెంకన్న, అబిడ్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులతో కలసి సోమవారం ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అక్కడే ఉన్న కొందరు వ్యాపారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీమీ అపార్ట్మెంట్లు, షాప్స్‌కు సంబంధించిన పార్కింగ్ ప్లేసులో మాత్రమే పార్క్ చేయాలని ఆదేశించారు. -
Bullet Bikes: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చాకచక్కంగా తప్పించుకుంటున్నారు. కొండాపూర్, మాదాపూర్ ఐటీ కారిడార్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న చోరీలు పోలీసులను నివ్వెర పరుస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన కొన్ని కేసులు దొంగల తెలివితేటలకు అద్దం పడుతున్నాయి. మణిప్రసాద్ అనే వ్యక్తి గురువారం ఉదయం కొండాపూర్‌లో స్టైయిల్ హెయిర్ సెలూన్‌కు వెళ్లాడు. తరువాత బయటకు వచ్చి చూస్తే తన బుల్లెట్ బైక్ కనిపించలేదు. సీసీ పుటేజీ పనిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై హెల్మెట్ పెట్టుకొని రెండు సార్లు రెక్కీ నిర్వహించి ఓ అపార్ట్మెంట్ వద్ద తన ప్యాషన్ బైక్ పెట్టి నడుచుకుంటూ సెలూన్ దగ్గరకు వచ్చాడు. హ్యాండిల్ లాక్ చేయకపోవడంతో కొద్ది దూరం తోసుకుంటూ వెళ్లి స్క్రూ డ్రైవర్‌తో హెడ్‌లైట్ తీసి వైర్ల సహయయంతో స్టార్ట్ చేసి బుల్లెతో ఉడాయించాడు. 30 నిమిషాల తరువాత వచ్చి అపార్ట్మమెంట్ వద్ద ఉన్న తన ప్యాషన్ బైక్‌ను తీసుకొని పరారయ్యాడు. బుల్లెట్ దొంగ కోసం గచ్చిబౌలి పోలీసులు రెండు బృందులుగా దర్యాప్తు చేపట్టారు. చదవండి👉వైరాలో వింత చేపల వర్షం.. మునుపెన్నడూ చూడలేదే! బుల్లెట్‌ని తోసుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి పార్క్ చేసిన బుల్లెట్లు మాయం... మాదాపూర్ పీఎస్ పరిధిలోని పర్వత్‌నగర్‌లో నివాసముండే అఖిల్ రెడ్డి మే 26న అర్థరాత్రి ఇంటి ముందు బుల్లెట్ పార్క్ చేశాడు. తెల్లవారు జామున చూడగా బుల్లెట్ కనిపించలేదు. బాధి తుడు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాల గూడలో ఓ ఇంటి ముందు పార్క్చేసిన బుల్లెట్‌ను నాలుగు రోజుల క్రితం చోరీ చేశారు. బాధితుడు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వరుసగా బుల్లెట్లు చోరీకి గురికావడం పోలీసులకు సవాల్‌గా మారింది. చదవండి👉వర్కర్‌పై కర్కశత్వం.. ఒళ్లంతా బెల్టు వాతలు -
32 చోట్ల మెట్రో మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్
- అందుబాటులోకి 400 బైక్ స్టేషన్లు.. 10 వేల సైకిళ్లు - మియాపూర్ –జేఎన్టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్ - మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్: మెట్రో రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల వాహనాల పార్కింగ్ కోసం ప్రాథమికంగా 32 చోట్ల మల్టీ లెవెల్ వాహన పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్అండ్టీ ఆధ్వర్యంలో 17 చోట్ల 57 ఎకరాల్లో, హెచ్ఎంఆర్ ఆధ్వర్యంలో 15 చోట్ల ఈ పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు ఆయన వివరించారు. మొత్తం 62 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుందని.. వీటితో పాటు ప్రభుత్వ భూములు గుర్తించి దాన్ని వాహనాల పార్కింగ్ సదుపాయం కోసం వినియోగిస్తామని చెప్పారు. మెట్రో మాల్స్‌లో రెండు, మూడు లెవెల్లో ఈ పార్కింగ్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ప్రైవేటు భూముల యజమానులు ముందుకు వస్తే వాటిని అభివృద్ధి చేస్తామని.. వీటిపై ప్రభుత్వం త్వరలోనే పాలసీ తీసుకుని రాబోతుందని తెలిపారు. అందుబాటులోకి మెట్రో ఫీడర్ బస్సులు నగరంలో ప్రైవేటు వాహనాలు తగ్గించి ప్రజారవాణా వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రతి స్టేషన్ నుంచి రైల్ టెర్మినల్స్, ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్ డిపోలను అనుసంధానం చేస్తామని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి కాలనీలకు వెళ్లేందుకు మెట్రో ఫీడర్ బస్‌లు అందుబాటులో ఉంచుతామని.. అదే టికెట్‌పై దీనిలో ప్రయా ణించవచ్చని చెప్పారు. స్టేషన్ల నుంచి నాలుగు కి.మీ. పరిధిలో వెళ్లేందుకు 400 బైక్ స్టేషన్లలో 10 వేల సైకిళ్లు అందుబాటులో ఉంచుతా మన్నారు. వాటిని ప్రయాణికులు తీసుకుని వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బైక్ స్టేషన్లో అప్పగించవచ్చని వివరించారు. ప్రతి స్టేషన్లో సోలార్ ప్యానెల్స్ రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ఉంటాయని.. ఎలక్ట్రికల్ వాహనాలు చార్జింగ్ చేసుకునేందుకు ప్రతి మెట్రో రైల్వే స్టేషన్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామ న్నారు. ఇందులో ఉత్పత్తి అయిన విద్యుత్‌తో ఎలక్ట్రికల్ వాహనాలను చార్జింగ్ చేసుకోవడం తో పాటు ఖాళీ బ్యాటరీ ఇచ్చి, చార్జింగ్ చేసిన బ్యాటరీ తీసుకుని వెళ్లే సౌకర్యం అందుబాటు లోకి తెస్తున్నామని వివరించారు. మియాపూర్ స్టేషన్ నుంచి హైదర్‌నగర్ మధ్య రెండు కి.మీ. పరిధిలో రాహ్‌గిరి వేదికను పిల్లలు ఆడుకునేం దుకు, యోగా తదితర అన్ని అవసరాలకు ప్రజలు ఉపయోగించుకునేందుకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భిన్న ఆకృతుల్లో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు మెట్రో కారిడార్ సెంట్రల్ మీడియంలో గ్రీనరీని పెంచి బ్యూటిఫికేషన్ చేస్తున్నామని మెట్రో స్టేషన్లలో ప్రజలు కూర్చునేందుకు భిన్న ఆకృతులతో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మియాపూర్, జేఎన్టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్ నిర్మిస్తామని.. మొదట ఎస్ఆర్నగర్ స్టేషన్లో దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే కూకట్పల్లి మీదుగా 200 మీటర్ల స్కై వాక్ ఉంటుందన్నారు. ప్రతి స్టేషన్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను వేరువేరుగా రోడ్డుపైన ఉండే ప్రధాన ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి స్టేషన్లో ఎయిర్‌పోర్టు మాదిరిగా సెక్యూరిటీ సిస్టమ్, లగేజ్ స్కానింగ్ ఉంటుందన్నారు. మెట్రో కారిడార్ 1, 3 పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని త్వరలోనే ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించాలనేది చెబుతుందని చెప్పారు. కారిడార్ 2 వచ్చే సంవత్సరానికి పూర్తవుతుందని చెప్పారు. -
ఆగేది ఇలా.. సాగేది ఇలా..
అంత్యపుష్కరాలు సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ ఇలా.. వాహనాలు పార్కింగ్ చేసేందుకు 10 పార్కింగ్ ప్రదేశాలు గోదావరి అంత్య పుష్కరాలు సందర్భంగా ఈ నెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ రాజమహేంద్రవరానికి విచ్చేసే యాత్రికుల సౌకర్యార్థం వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్టు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలకు మొత్తం పది పార్కింగ్ స్థలాలు కేటాయించినట్టు ఆమె పేర్కొన్నారు. వీటిలో ఐదు ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకంగా ఆ బస్సులు వచ్చే రూట్లను అనుసరించి ఘాట్లకు దగ్గరగా ఏర్పాటు చేశామన్నారు. – రాజమహేంద్రవరం క్రైం ఆర్టీసీ బస్సులకు కేటాయించిన స్థలాలివే.. విజయవాడ నుంచి వచ్చే బస్సులు గామన్ బ్రిడ్జిపై నుంచి వచ్చే బస్సులు, సీతానగరం, కోరుకొండ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు నేరుగా లూథర్‌గిరిలో నిలిపుకోవచ్చు. విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు లూథర్‌గిరి, గోకవరం బస్టాండ్‌లో నిలుపుకోవచ్చు. రావులపాలెం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కాంప్లెక్, రైల్వేగూడ్స్ షెడ్లలో నిలపవచ్చు వివిధ ప్రదేశాల నుంచి వచ్చే ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఇలా.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు, ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ కారేజ్లకు రోడ్డులోని ఆర్ట్ కాలేజీలో, రాజమహేంద్రవరం జిల్లా పోలీస్ కార్యాలయం పక్కన లాలాచెరువు వద్ద గల హుందాయ్ షోరూమ్ వద్ద ఉన్న ఖాళీస్థలంలో నిలుపుకోవచ్చు. కార్లు, మోటారు సైకిళ్ల కోసం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్యం మైదానంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్, హుందాయ్ షోరూమ్ పక్కన గ్రౌండ్స్‌లో వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. రావులపాలెం నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజీ వాహనాలు మున్సిపల్ స్టేడియం, రైల్వే గూడ్స్‌షెడ్ వద్ద కార్లు, మోటారు సైకిళ్లను పార్కింగ్ చేసుకోవచ్చు. విజ్జేశ్వరం మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై నుంచి వచ్చే వాహనాలకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ధవళేశ్వరం, గూడ్స్ షెడ్ వద్ద నిలుపుదల చేసుకోవచ్చు. జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు ప్రాంతాలు కాటన్ విగ్రహం : ధవళేశ్వరం బ్రిడ్జిపై నుంచి వచ్చే లారీలు, భారీ వాహనాలు, వేమగిరి వైపు మళ్లిస్తారు. వేమగిరి సెంటర్ : కడియం, రావులపాలెం నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు ఎన్‌హెచ్ 16 మీదుగా పంపుతారు. క్వారీ మార్కెట్ సెంటర్ : కోరుకొండ, గామన్ బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనాలు, లారీలు, భారీ వాహనాలను లాలా చెరువు ఎన్‌హెచ్ 16 వైపు మళ్లిస్తారు. సీతానగరం నుంచి వచ్చే లారీలు, భారీ వాహనాలు గామన్ బ్రిడ్జిపై వెళ్లాలి. డెక్కన్ క్రానికల్ రోడ్డు, క్వారీ కెనాల్ రోడ్డు, బొమ్మూరు సెంటర్, హుకుంపేట సెంటర్, మోరంపూడి సెంటర్, కవలగొయ్యి సెంటర్, డీటీసీ సెంటర్, లాలా చెరువు సెంటర్ మీదుగా వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలు అంత్య పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం నగరంలోకి అనుమతించరు. ఈ నెల 31వ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇది అమలులో ఉంటుంది. నగర వాసులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రెండంచెల ప్రణాళిక ఇలా.. పా్లన్ –ఏ సాయిబాబా గుడి, ధవళేశ్వరం, గోదావరి బండ్ , కైలాస భూమిన ఎన్టీఆర్ విగ్రహం, వ్యాఘ్రం రోడ్డు, వ్యాయామ కళాశాల రోడ్డు, డాక్టర్ రంగాచారి రోడ్డు, కుమారి థియేటర్ రోడ్డు, బరువారి వీధి, ఉల్లితోట వీధి, పుచ్చలవారి వీధి, కంబం చౌల్ట్రీ, వంకాయల వారి వీధి, నాళం భీమరాజు వీధి, గుండు వారి వీధి, ఇసుక వీధి, గోదావరి బండ్ మీదుగా రంగ్రీజు పేట నుంచి జేపీ రోడ్డు,(అన్నపూర్ణ పార్కు వరకూ) కళామందిర్, అండర్ గ్రౌండ్, ఎంసీఆర్ రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, శేషయ్య మెట్ట, శంకర్ ఘాట్ రోడ్డు, కనక దుర్గా ఘాట్, లక్షీ్మగణపతి ఘాట్ రోడ్డు, చింతలమ్మ ఘాట్ రోడ్డు, (గోదావరి బండ్) ఫారెస్ట్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం, కైలాస భూమి వర కు. మూసి వేసే రోడ్లు ఇవేl.. గాయత్రి బండ్ రోడ్డు, దొమ్మేటి వారి వీధి, కేసరి క్లబ్ వీధి, వ్యాయామ కళాశాల రోడ్డు, డాక్టర్ రంగాచారి రోడ్డు, రంగ్రీజు పేట, అజంతా హోటల్ రోడ్డు, ములగొయ్యి రోడ్డు, సీతం పేట నుంచి అంబేడ్కర్ విగ్రహం రోడ్డు, పెట్రోల్ బంక్ నుంచి గోదావరి బండ్. పా్లన్– బి : ఐఎల్టీడీ సెంటర్, రైల్వే స్టేషన్, గూడ్స్ షెడ్, ఆర్‌సీఆర్‌బీ వ్యాయామ కళాశాల, శ్యామల సెంటర్, డీలక్స్ సెంటర్, ఉల్లితోట వారి వీధి, కంబం చౌల్ట్రీ, వంకాయల వారి వీధి, నాళం భీమరాజు వీధి, నల్ల మందు సందు, గుండు వారి వీధి, మద్దూరి అన్నపూర్ణయ్య పార్క్, కళామందిర్, అండర్ గ్రౌండ్ , మున్సిపల్ కార్యాలయం మీదుగా అంబేడ్కర్ విగ్రహం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆర్యాపురం, సీతం పేట సెంటర్, లూథర్ గిరి. పా్లన్ ఏ, బీ ప్రాంతాల్లోకి ప్రవేశించే వారు తప్పని సరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు తదితర ఆధారాలు కచ్చితంగా ఉండాలి. ఈ ప్రాంతాల్లో ఆటోలకు నో ఎంట్రీ.. సీతంపేట సెంటర్, అంబేడ్కర్ సెంటర్, శ్యామలా సెంటర్, డీలక్స్ సెంటర్, గూడ్స్ షెడ్, కోటిపల్లి బస్టాండ్, వివేకానందా విగ్రహం, వద్దకు అనుమతించరు. భక్తులు అధికంగా ఉన్న సమయాల్లో ఆటోలను వివేకానంద విగ్రహం, కంబాల ట్యాంక్, శ్యామలా సెంటర్ వద్ద మళ్లిస్తారు. -
ఒక కుటుంబం.. ఒక వాహనం ప్రణాళిక అమలు చేయాలన్న బాంబే హైకోర్టు
సాక్షి, ముంబై: ముంబైలో జనాభాతోపాటు వాహనాల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలోని ప్రముఖ రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్రంకాగా, మరోవైపు వాహనాలను పార్కింగ్ చేయాలన్నా స్థలం లభించడంలేదు. ‘ఒక కుటుంబం.. ఒక వాహనం’ ట్రాఫిక్ సమస్యను తగ్గించాలంటే వాహనాల సంఖ్య తగ్గాలి. అందుకు ‘ఒక కుటుంబం ఒక వాహనం’ అనే ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన బాంబే హైకోర్టు ఇలాంటి ప్రణాళికను తొందరగా అమలు చేసే దిశగా ఆలోచించాలని ‘ఆర్టీఓ’కు సూచిం చింది. ఈ ప్రణాళికను అమలు చేస్తే పార్కింగ్ సమస్య కొంత తీరనుంది. మరోవైపు అనేక మంది ముంబైలో నివసిస్తున్నప్పటికీ ఠాణే, భివండీలో నివసిస్తున్నట్లు చిరునామాలో పేర్కొని వాహనాలు తీసుకుంటున్నారు. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా అక్ట్రాయి, ఇతర పన్నుల రూపంలో లభించే ఆదాయానికి గండిపడుతోంది. తప్పుడు చిరునామాతో వాహనాల కొనుగోలు ముఖ్యంగా కొందరు డీలర్లు కూడా పన్నులను ఎగ్గొట్టేందుకు ఇలాంటి తప్పుడు చిరునామాలతో వాహనాలు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇలా చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టులో ఠాణే మాజీ కార్పొరేటర్ సుధీర్ బర్గే ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్లో రెవెన్యూ కూడా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు ముంబైలోని ట్రాఫిక్ సమస్య తీరేందుకు పై విధంగా ఆర్టీఓకు సూచించింది. పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడండి వాహనాలు కొనుగోలు చేసే సమయంలో పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడాల్సిన అవసరం ఉందని ముంబై హైకోర్టు పేర్కొంది. అనేక కుటుంబాల వద్ద ఒకటి కంటే అధికంగా వాహనాలున్నాయి. అయితే వాటన్నింటికీ వారు నివసించే స్థలంలో పార్కింగ్ లేకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. దీంతో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మరోవైపు కొన్ని వాహనాలైతే ఒకే చోట అనేక రోజులుగా నిలిపి ఉంచుతున్నారు. దీంతో ఒక కుటుంబం ఒక వాహనం ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముంబై హైకోర్టు సూచించింది. తీవ్రమవుతున్న పార్కింగ్ సమస్య నగరంలో పార్కింగ్ సమస్య రోజు రోజుకి తీవ్రమవుతోంది. ముఖ్యంగా నగరంలో బీఎంసీకి చెందిన 89 ‘పే పార్కింగ్’ ప్రాంతాలున్నాయి. వీటిలో 10,314 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుంది. అయితే వాహనాల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో కొన్ని పార్కింగ్ ప్రాంతాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అపోలో మిల్లు వద్ద 650 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుండే బహుళ అంతస్తుల పే పార్క్‌ను నిర్మించింది. అదేవిధంగా మరో 33 బహుళ అంతస్తుల పే పార్కింగ్ భవనాలను నిర్మించేందుకు బీఎంసీ అనుమతులను ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా పార్కింగ్ సమస్య మాత్రం తీరే అవకాశాలు కన్పించడంలేదు. దీనికి ప్రధాన కారణంగా వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరగడం. ముఖ్యంగా ఒకే కుటుంబంలో నాలుగైదు వాహనాలు ఉండటం. ఇలాంటి వాటి ని తగ్గించి ట్రాఫిక్‌తోపాటు పార్కింగ్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. -
ఫ్లైఓవర్ కింద ‘నో పార్కింగ్’!
సాక్షి, ముంబై: నగరంలోని ఫ్లై ఓవర్ల కింద నిలిపి ఉంచిన వాహనాలను జప్తు చేయనున్నట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశానుశారం ఈ చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎంఎస్ఆర్టీసీ పరిధిలో మొత్తం 11 ఫ్లై ఓవర్లు ఉన్నాయి. వాటి దిగువ భాగంలో వేలాది వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. 2010లో నగరవ్యాప్తంగా ఉన్న ఫ్లై ఓవర్ల దిగువ భాగాన వాహనాలను పార్కింగ్ చేయడాన్ని నిషేధించింది. నగరానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఆర్టీసీ తగిన ప్రణాళికను తయారుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ వాహనాలను నిలిపి ఉంచడం నిషేధమని రెండు నెలల కిందటే ఎంఎస్ఆర్టీసీ ఆయా వాహనాల యజమానులను ఆదేశించింది. ఇప్పటికే నిలిచి ఉంచిన వాహనాలను తొలగించకుంటే వాటిని జప్తు చేస్తామని హెచ్చరించింది. అయితే సంస్థ ఆదేశాలను నగరవాసులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇదిలా ఉండగా ఆరే మిల్క్ కాలనీ ఫ్లై ఓవర్, ఠాణేలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న క్యాడ్బరీ జంక్షన్ ఫ్లై ఓవర్ దిగువన ఎప్పటినుంచో ధ్వంసమైన కార్లు అధిక సంఖ్యలో పడి ఉన్నాయి. కాగా, ఎంఎస్ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ బిపిన్ శ్రీమల్ మాట్లాడుతూ .. ఎంఎస్ఆర్టీసీ పరిధిలోని ఫ్లై ఓవర్ల దిగువ భాగంలో పార్క్చేసిన వాహనాల తొలగింపు చేపట్టామన్నారు. తాము ఇప్పటికే ఏడు, ఎనిమిది ఫ్లై ఓవర్ల దిగువన పార్క్ చేసిన వాహనాలను తొలగించి, ఆ స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. త్వరలోనే మొత్తం ఫ్లై ఓవర్ల కింద వాహనాల తొలగింపును పూర్తిచేస్తామన్నారు. కాగా వకోలా జోగేశ్వరి-విక్రోలి లింక్ రోడ్ ఫ్లై ఓవర్, కుర్లా-సీఎస్టీ ఫ్లై ఓవర్, అంధేరి-ఘాట్కోపర్ లింక్ రోడ్ ఫ్లై ఓవర్, వకోల ఫ్లై ఓవర్, గోరేగావ్-ములుండ్ లింక్ రోడ్, చెడా నగర్ ఫ్లై ఓవర్, వకోల, నితిన్ క్యాస్టింగ్, గోల్డెన్ డైస్, క్యాడ్బెరీ, ఫర్గ్యూసన్ రోడ్ ఫ్లై ఓవర్లు ఎంఎస్ఆర్టీసీ పరిధిలోకి వస్తాయి.