ఆగేది ఇలా.. సాగేది ఇలా.. | aagedi ila..sagedi ela | Sakshi
Sakshi News home page

ఆగేది ఇలా.. సాగేది ఇలా..

Published Thu, Jul 28 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఆగేది ఇలా.. సాగేది ఇలా..

ఆగేది ఇలా.. సాగేది ఇలా..

  • అంత్యపుష్కరాలు సందర్భంగా ట్రాఫిక్‌ నియంత్రణ ఇలా..   
  • వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు 10 పార్కింగ్‌ ప్రదేశాలు
  • గోదావరి అంత్య పుష్కరాలు సందర్భంగా ఈ నెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ రాజమహేంద్రవరానికి విచ్చేసే యాత్రికుల సౌకర్యార్థం వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలకు మొత్తం పది పార్కింగ్‌ స్థలాలు కేటాయించినట్టు ఆమె పేర్కొన్నారు. వీటిలో ఐదు ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకంగా ఆ బస్సులు వచ్చే రూట్లను అనుసరించి ఘాట్లకు దగ్గరగా ఏర్పాటు చేశామన్నారు.
    – రాజమహేంద్రవరం క్రైం
    ఆర్టీసీ బస్సులకు కేటాయించిన స్థలాలివే..
    • విజయవాడ నుంచి వచ్చే బస్సులు గామన్‌ బ్రిడ్జిపై నుంచి వచ్చే బస్సులు, సీతానగరం, కోరుకొండ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు నేరుగా లూథర్‌గిరిలో నిలిపుకోవచ్చు.
    • విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు లూథర్‌గిరి, గోకవరం బస్టాండ్‌లో నిలుపుకోవచ్చు.
    • రావులపాలెం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కాంప్లెక్, రైల్వేగూడ్స్‌ షెడ్‌లలో నిలపవచ్చు
    •  
    • వివిధ ప్రదేశాల నుంచి వచ్చే ఇతర వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలు ఇలా..
    • ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు, ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్‌ కారేజ్‌లకు రోడ్డులోని ఆర్ట్‌ కాలేజీలో, రాజమహేంద్రవరం జిల్లా పోలీస్‌ కార్యాలయం పక్కన లాలాచెరువు వద్ద గల హుందాయ్‌ షోరూమ్‌ వద్ద ఉన్న ఖాళీస్థలంలో నిలుపుకోవచ్చు. 
    • కార్లు, మోటారు సైకిళ్ల కోసం మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్యం మైదానంలో ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్, హుందాయ్‌ షోరూమ్‌ పక్కన గ్రౌండ్స్‌లో వాహనాలు పార్క్‌ చేసుకోవచ్చు.
    • రావులపాలెం నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్‌ క్యారేజీ వాహనాలు మున్సిపల్‌ స్టేడియం, రైల్వే గూడ్స్‌షెడ్‌ వద్ద కార్లు, మోటారు సైకిళ్లను పార్కింగ్‌ చేసుకోవచ్చు.
    • విజ్జేశ్వరం మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై నుంచి వచ్చే వాహనాలకు గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్, ధవళేశ్వరం, గూడ్స్‌ షెడ్‌ వద్ద నిలుపుదల చేసుకోవచ్చు.
    జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు ప్రాంతాలు
    • కాటన్‌ విగ్రహం : ధవళేశ్వరం బ్రిడ్జిపై నుంచి వచ్చే లారీలు, భారీ వాహనాలు, వేమగిరి వైపు మళ్లిస్తారు.  
    • వేమగిరి సెంటర్‌ : కడియం, రావులపాలెం నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు ఎన్‌హెచ్‌ 16 మీదుగా పంపుతారు.
    • క్వారీ మార్కెట్‌ సెంటర్‌ : కోరుకొండ, గామన్‌ బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనాలు, లారీలు, భారీ వాహనాలను లాలా చెరువు ఎన్‌హెచ్‌ 16 వైపు మళ్లిస్తారు.
    • సీతానగరం నుంచి వచ్చే లారీలు, భారీ వాహనాలు గామన్‌ బ్రిడ్జిపై వెళ్లాలి. డెక్కన్‌ క్రానికల్‌ రోడ్డు, క్వారీ కెనాల్‌ రోడ్డు, బొమ్మూరు సెంటర్, హుకుంపేట సెంటర్, మోరంపూడి సెంటర్, కవలగొయ్యి సెంటర్, డీటీసీ సెంటర్, లాలా చెరువు సెంటర్‌ మీదుగా వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలు అంత్య పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం నగరంలోకి అనుమతించరు.
    ఈ నెల 31వ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇది అమలులో ఉంటుంది.
    నగర వాసులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ రెండంచెల ప్రణాళిక ఇలా..
    పా్లన్‌ –ఏ 
    సాయిబాబా గుడి, ధవళేశ్వరం, గోదావరి బండ్‌ , కైలాస భూమిన ఎన్‌టీఆర్‌ విగ్రహం, వ్యాఘ్రం రోడ్డు, వ్యాయామ కళాశాల రోడ్డు, డాక్టర్‌ రంగాచారి రోడ్డు, కుమారి థియేటర్‌ రోడ్డు, బరువారి వీధి, ఉల్లితోట వీధి, పుచ్చలవారి వీధి, కంబం చౌల్ట్రీ, వంకాయల వారి వీధి, నాళం భీమరాజు వీధి, గుండు వారి వీధి, ఇసుక వీధి, గోదావరి బండ్‌ మీదుగా రంగ్రీజు పేట నుంచి జేపీ రోడ్డు,(అన్నపూర్ణ పార్కు వరకూ) కళామందిర్, అండర్‌ గ్రౌండ్, ఎంసీఆర్‌ రోడ్డు, అంబేడ్కర్‌ విగ్రహం, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్, శేషయ్య మెట్ట, శంకర్‌ ఘాట్‌ రోడ్డు, కనక దుర్గా ఘాట్, లక్షీ్మగణపతి ఘాట్‌ రోడ్డు, చింతలమ్మ ఘాట్‌ రోడ్డు, (గోదావరి బండ్‌) ఫారెస్ట్‌ ఆఫీస్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం, కైలాస భూమి వర కు.
     
    మూసి వేసే రోడ్లు ఇవేl..
    గాయత్రి బండ్‌ రోడ్డు, దొమ్మేటి వారి వీధి, కేసరి క్లబ్‌ వీధి, వ్యాయామ కళాశాల రోడ్డు, డాక్టర్‌ రంగాచారి రోడ్డు, రంగ్రీజు పేట, అజంతా హోటల్‌ రోడ్డు, ములగొయ్యి రోడ్డు, సీతం పేట నుంచి అంబేడ్కర్‌ విగ్రహం రోడ్డు, పెట్రోల్‌ బంక్‌ నుంచి గోదావరి బండ్‌. 
    పా్లన్‌– బి :
    ఐఎల్‌టీడీ సెంటర్, రైల్వే స్టేషన్, గూడ్స్‌ షెడ్, ఆర్‌సీఆర్‌బీ వ్యాయామ కళాశాల, శ్యామల సెంటర్, డీలక్స్‌ సెంటర్, ఉల్లితోట వారి వీధి, కంబం చౌల్ట్రీ, వంకాయల వారి వీధి, నాళం భీమరాజు వీధి, నల్ల మందు సందు, గుండు వారి వీధి, మద్దూరి అన్నపూర్ణయ్య పార్క్, కళామందిర్, అండర్‌ గ్రౌండ్‌ , మున్సిపల్‌ కార్యాలయం మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆర్యాపురం, సీతం పేట సెంటర్, లూథర్‌ గిరి.
    పా్లన్‌ ఏ, బీ ప్రాంతాల్లోకి ప్రవేశించే వారు తప్పని సరిగా ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ ఐడీ కార్డు, పాస్‌ పోర్టు తదితర ఆధారాలు కచ్చితంగా ఉండాలి. 
    ఈ ప్రాంతాల్లో ఆటోలకు నో ఎంట్రీ.. 
    సీతంపేట సెంటర్, అంబేడ్కర్‌ సెంటర్, శ్యామలా సెంటర్, డీలక్స్‌ సెంటర్, గూడ్స్‌ షెడ్, కోటిపల్లి బస్టాండ్, వివేకానందా విగ్రహం, వద్దకు అనుమతించరు. భక్తులు అధికంగా ఉన్న సమయాల్లో ఆటోలను వివేకానంద విగ్రహం, కంబాల ట్యాంక్, శ్యామలా సెంటర్‌ వద్ద మళ్లిస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement