
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఫుల్ మారథాన్‌ను నిర్వహించారు. నగరంలో పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్డు నుంచి హైటెక్ సిటీ మీదగా గచ్చిబౌలి వరుకు మొత్తం 42 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ మారథాన్‌ను సీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు. అయితే, మారథాన్ సందర్భంగా పంజాగుట్ట, కేబీఆర్ పార్కు, జూబ్లీ చెక్‌పోస్టు, మాదాపూర్, గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రోడ్ల మీద బారికేడ్లు పెట్టడంతో వాహనాల రాకపోకలు కొంతమేర స్తంభించిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడాల్సి వచ్చింది. దీంతో చిరాకుపడ్డ వాహనదారులు పలుచోట్ల పోలీసులు, మారథాన్ రన్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment