trafic
-
ఆ జంక్షన్ హిజ్రాల అడ్డా..సిగ్నల్ పడితే హడలే..
సాక్షి,రాజమహేంద్రరం రూరల్: నగరంలోని జంక్షన్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. కొందరు ఎటువంటి మాస్కు ధరించకుండా నగదు వసూలు చేయడంతో వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలలుగా మోరంపూడి జంక్షన్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరంలో అతిపెద్దది మోరంపూడి జంక్షన్. ఇక్కడ అధికంగా నగదు వస్తుందన్న అంచనాతో హిజ్రాలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇందులో సగం మంది ఎటువంటి మాస్కులు ధరించకుండా నగదు వసూలు చేస్తున్నారు. సిగ్నల్ పడినప్పుడు ఎక్కువ వాహనాలు ఆగుతాయి. ఆ సమయంలో నాలుగు వైపుల నుంచి హిజ్రాలు వచ్చి వాహన చోదకులను నగదు డిమాండ్ చేస్తున్నారు. కారులు, లారీలు, ఇతర వాహన చోదకుల నుంచి రూ.10 తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా వల్ల జాతరలు, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో జంక్షన్లలో నగదు వసూలు చేస్తున్నారన్న మానవతా దృక్పథంతో వాహన చోదకులు సైతం ఎంతో కొంత ఇస్తున్నారు. వీరితో పాటు భిక్షాటన చేసే చిన్నపిల్లలతో తల్లులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ వస్తువులు అమ్మకందారులతో జంక్షన్లో రద్దీగా ఉంటోంది. అన్నీ జంక్షన్లలోనూ.. మోరంపూడి జంక్షన్‌తో పాటు నగరంలోని ఇతర ముఖ్యకూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద హిజ్రాల నగదు వసూలు కొనసాగుతూనే ఉంది. ఇటీవల తాడితోట జంక్షన్లో హిజ్రాలను చెదరగొట్టే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై తిరగబడ్డారు. జంక్షన్లలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్‌ను చూసుకోవాలో, హిజ్రాల నుంచి తప్పించుకోవాలో తెలియక కంగారు పడుతున్నారు. కుటుంబంతో కలిసి మోటారుసైకిల్‌పై వచ్చిన వారిని కూడా వదలడం లేదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్య నుంచి రక్షించాలని వాహనచోదకులు కోరుతున్నారు. -
మారథాన్ రన్‌తో సిటీలో ట్రాఫిక్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఫుల్ మారథాన్‌ను నిర్వహించారు. నగరంలో పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్డు నుంచి హైటెక్ సిటీ మీదగా గచ్చిబౌలి వరుకు మొత్తం 42 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ మారథాన్‌ను సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు. అయితే, మారథాన్ సందర్భంగా పంజాగుట్ట, కేబీఆర్ పార్కు, జూబ్లీ చెక్‌పోస్టు, మాదాపూర్, గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రోడ్ల మీద బారికేడ్లు పెట్టడంతో వాహనాల రాకపోకలు కొంతమేర స్తంభించిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడాల్సి వచ్చింది. దీంతో చిరాకుపడ్డ వాహనదారులు పలుచోట్ల పోలీసులు, మారథాన్ రన్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. -
ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
– పగటిపూట నగరంలోకి భారీ వాహనాల నిషేధం – నగర పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష కర్నూలు : కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారుల సహకారంతో తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఎస్పీ గోపీనాథ్ జట్టి నగర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్, ట్రాఫిక్ సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్ఐ తిమ్మారెడ్డి, ఆర్ఎస్ఐ జయప్రకాష్‌లతో సమావేశం నిర్వహించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధాన జంక్షన్లలో రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ ఏర్పాటు, ఫ్రీ లెఫ్ట్, ఫ్రీ రైట్ (కుడి, ఎడమ మలుపులు) డివైడర్స్‌ను రీ డిజైనింగ్ చేయించాలని నిర్ణయించారు. పగటి పూట నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం అమలు చేయనున్నారు. బారీకేడ్లు, రోడ్ సిగ్నల్స్, డైరెక్షన్ బోర్డులు, నో పార్కింగ్ బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయించాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ పార్కింగే చేసే వాహనదారులకు జరిమానా విధించాలని సూచించారు. -
ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి
- మున్సిపల్ కమిషనర్‌తో ఎస్పీ సమీక్ష కర్నూలు : నగరంలో పద్మవ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ గోపినాథ్‌జట్టి ప్రత్యేక దృష్టి సారించారు. నగర పోలీసు అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ హరినాథ్‌రెడ్డితో ఆదివారం సమావేశమై చర్చించారు. ట్రాఫిక్ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ స్థలాలు, అవసరమైన చోట ఫుట్‌పాత్‌లు, సిగ్నల్స్, నోపార్కింగ్ బోర్డుల ఏర్పాటుపై చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోలీసు, మున్సిపల్, రోడ్డు రవాణా, నేషనల్ హైవే, ఎన్జీఓలు సిటిజన్స్ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో లైటింగ్, చెత్తకుండీలు, ప్యాచ్‌వర్స్క్, బారికేడ్స్, వైట్‌మార్కింగ్, జీబ్రా క్రాసింగ్, సైన్‌బోర్డులు తదితర అంశాలు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకునే విధంగా సమీక్షలో చర్చించారు. ట్రాఫిక్ సిబ్బందిని మరింత పెంచడంతోపాటు మొబైల్ పార్టీలు ఏర్పాటు చేసి నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించనున్నారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, టౌన్ డీఎస్పీ డీవీరమణమూర్తి, సీఐలు సుబ్రమణ్యం, దివాకర్‌రెడ్డి, రోడ్డు రవాణా అధికారులు పాల్గొన్నారు. -
రౌడీషీట్ ఉన్నా పోలీస్‌గా..!
- స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌పై ఎస్పీకి నివేదిక - ఉద్యోగంలో చేరక ముందు నుంచే మనోజ్ కుమార్‌పై పలు కేసులు - హోంగార్డుపై దాడి ఘటన నేపథ్యంలో వెలుగులోకి కర్నూలు : రాజ్‌విహార్ సెంటర్లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డు హుసేన్‌పై దాడికి పాల్పడిన స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మంచి వారు కాదని, వారిలో ఒకరిపై గతంలో రౌడీషీట్ ఉందని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి శనివారం ఎస్పీ ఆకే రవికృష్ణకు నివేదిక సమర్పించారు. ఈనెల 7వ తేదీన రాజ్‌విహార్ సెంటర్లో హోంగార్డుపై దాడి జరిగిన విషయం విదితమే. అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటో ఫుటేజ్‌ని కూడా ఎస్పీకి నివేదించారు. దాడి చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు మనోజ్‌కుమార్, మణికుమార్(వీరిరువురూ స్వయాన సోదరులు)లను ఎస్పీ సస్పెండ్ చేవారు. వీరిద్దరి నేరచరిత్రపై డీఎస్పీ పూర్తిస్థాయి విచారణ జరిపారు. కర్నూలు నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు మనోజ్కుమార్పై ఉన్నాయి. ఉద్యోగంలో చేరక ముందు ఐపీసీ 324 సెక్షన్ కింద పలు కేసులు ఉన్నట్లు సమాచారం. వీరి తండ్రి డేవిడ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసేటప్పుడు సహోద్యోగులతో ఏదో విభేదం తలెత్తింది. తన తండ్రిని వ్యతిరేకిస్తావా అంటూ 2011లో ఏఆర్ హెడ్ క్వార్టర్లో సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై స్నేహితుడు రాజేష్‌తో కలసి మనోజ్‌కుమార్ ఆయుధంతో దాడి చేసి గాయపరిచాడు. అప్పుడు ఐపీసీ 332 సెక్షన్ కింద కేసు కూడా నమోదయ్యింది. కర్నూలు నగర పరిధిలోని ఏయే స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయనే విషయంపై సీఐలతో డీఎస్పీ ఆరా తీసి నివేదికను తయారు చేసి ఎస్పీకి సమర్పించారు. రెండో పట్టణ సీఐగా శ్రీనివాసులు ఉన్నప్పుడు రౌడీషీట్ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. మనోజ్‌కుమార్.. కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాల వరకు కూడా అతనిపై రౌడీషీట్ ఉండేది. 2015లో రౌడీషీట్‌ను క్లోజ్ చేయించుకున్నాడు. ఎస్బీ విచారణపై అనుమానాలు... ఉద్యోగం వచ్చిన వ్యక్తి పూర్వాపరాలు, నేరచరిత్రపై స్పెషల్ అధికారులు విచారణ జరపడం సాధారణం. మనోజ్‌కుమార్‌కు ఉద్యోగం వచ్చిన సమయంలో రౌడీషీట్ ఉన్నప్పటికీ విచారణలో ఆ అంశాన్ని ప్రస్తావించకుండ ఉన్నతాధికారులకు అప్పటి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సమర్పించిన నివేదిక విషయంపై పోలీసు శాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనోజ్‌కుమార్ సోదరులకు అనుకూలంగా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడానికి భారీ మొత్తం డబ్బులు చేతులు మారాయన్న చర్చ జరుగుతోంది. వాస్తవంగా రౌడీషీట్లకు సంబంధించిన ఇళ్లకు నెలకు ఒకసారి ఎస్ఐలు వెళ్లి వారి ప్రవర్తన గురించి ఆరా తీయాలి. అందుబాటులో ఉంటున్నారా.. లేక రాత్రివేళల్లో నేరాలకు పాల్పడుతున్నారా అనే అంశంపై కూడా నిఘా ఏర్పాటు చేయాలి. మనోజ్‌కుమార్ విషయంలో ఈ విధమైన విచారణ జరగకపోవడం వల్లే పోలీసు శాఖలో ఉద్యోగం పొందాడని ఆ శాఖ ఉన్నతాధికారులే చర్చించుకుంటున్నారు. తప్పుడు నివేదిక సమర్పించిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ పనితీరుపై కూడా విచారణ జరిపితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయన్న చర్చ జరుగుతోంది. మనోజ్‌కుమార్ సోదరులపై కేసు నమోదు... రాజ్‌విహార్ సెంటర్లో జరిగిన దాడి విషయంలో బాధితుడు హోంగార్డు హుసేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదయ్యింది. మనోజ్‌కుమార్, మణికుమార్లపై సెక్షన్ 323, 353, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
కర్నూలు: నగరంలోని రాజ్‌విహార్ సెంటర్లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డు హుస్సేన్‌పై దాడికి పాల్పడిన స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. గురువారం సాయంత్రం హోంగార్డు హుస్సేన్ రాజ్‌విహార్ సెంటర్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మనోజ్, అతని తమ్ముడు మణికుమార్ ద్విచక్ర వాహనంపై రాజ్‌విహార్ చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా రోడ్డుపై వాహనాన్ని నిలుపుకుని ఫోన్లో మాట్లాడుతుండగా సైడ్‌కు వెళ్లండంటూ హోంగార్డు చెప్పాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించినందుకు కోపోద్రిక్తుడైన మనోజ్‌కుమార్ సోదరులు హోంగార్డు హుస్సేన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ‘ఫూలీసులు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ ఆకె రవికృష్ణ స్పందించారు. శుక్రవారం ఉదయం హోంగార్డు హుస్సేన్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి విచారించారు. ఆ తర్వాత కానిస్టేబుళ్లు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని రెండవ పట్టణ సీఐ డేగల ప్రభాకర్‌ను ఆదేశించారు. రాజ్‌విహార్ సెంటర్లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఫుటేజీలను కూడా సేకరించాలన్నారు. అలాగే మనోజ్‌కుమార్ సోదరులు పోలీస్ శాఖలో చేరకముందు ప్రవర్తన ఎలా ఉండేది.. వారిపై ఎన్ని కేసులు ఉన్నాయనే విషయాలపైనా పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. వీరిపై రౌడీషీట్లు నమోదై ఉంటే ఉద్యోగంలో చేరేటప్పుడు స్పెషల్ బ్రాంచ్ ఉద్యోగులు ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చారనే విషయంపైనా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. -
త్వరలో ఈ–చలానాలు
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదోని: జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాలలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ–చలానాలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. శనివారం ఆయన డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్ణీత వేగానికి మించి వాహనాలను నడిపేవారిని, నో పార్కింగ్ స్థలంలో వాహనాలు ఉంచేవారిని, వన్‌వేను ఉల్లంఘించిన వారిని సీసీ పుటేజీల ద్వారా గుర్తించి సంబంధిత వ్యక్తుల ఇళ్లకు చలానాలను పంపుతామని తెలిపారు. ఈ–చలానాలతో ట్రాఫిక్ నిబంధనలను తుచ తప్పకుండా అమలవుతాయన్నారు. చలానాలు అందుకున్న వారు వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి డబ్బు చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుందన్నారు. ఈ–బీట్స్ అమలుతో జిల్లాలో నేరాల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. బీట్స్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల కోసం 490 ల్యాప్టాప్స్ కేటాయించామని, ఇందులో ఇప్పటి వరకు 300 వరకు పంపిణీ చేశామని తెలిపారు. యువత ఆలోచనల్లో నిర్ణయాత్మక మార్పు వచ్చిందని దీంతో జిల్లాలో ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైందన్నారు. కానిస్టేబుళ్ల నియామకం పూర్తయితే ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సిబ్బందిని కేటాయిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రోడ్ల విస్తరణ తరువాతే పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. పట్టణంలో 2011లో జరిగిన అల్లర్లలో కొంతమంది అమాయకులు కూడా కేసులో ఇరుక్కున్నారని, వారిపై ఉన్న రౌడీషీట్లను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మొరాయించిన గూడ్స్ ఇంజిన్
– ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం డోన్ టౌన్ : సాంకేతికలోపంతో బుధవారం మధ్యాహ్నం గూడ్స్ ఇంజిన్ మోరాయించింది. పట్టణంలోని రైల్వేగేట్ మధ్యలో గూడ్స్ కంటైనర్లు నిలిచిపోయాయి. దీంతో గేటుకు ఇరువైపులా ట్రాపిక్ స్తంభించిపోయింది. వాహనదారులు, పాదచారులు గంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి గూడ్స్ కంటైనర్లను స్టేషన్లోకి తరలించడంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఏర్పడిన అంతరాయం తొలగిపోయింది. -
నిడదవోలు.. జనం ఘొల్లు
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని గూడెం రైల్వేగేటు వద్ద ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. తాడేపల్లిగూడెం–రాజమండ్రికి దగ్గరదారి కావడంతో ఇటుగా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది రైల్వే మెయిన్ లైన్ కావడబంతో రోజూ 200 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో సగటున రోజుకు 150 సార్లు రైల్వే గేటు వేస్తున్నారు. రోజూ 200 రైళ్లు నిడదవోలు మీదుగా రోజుకు సుమారు 200 రైళ్లు విజయవాడ, విశాఖ వైపునకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గేటు వేయాల్సి వస్తోంది. దీంతో రోజుకు సగటున 150 సార్లు గేటు పడుతుంది. ఈ సమయంలో వాహనాల రద్దీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. గేటు పడినప్పుడల్లా కనీసం 20 నిమిషాల సమయం వథా అవుతోంది. గేటు వేసేటప్పుడు, తీసేటప్పుడు కనీసం సిబ్బంది ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైల్వేగేటును వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికితోడు రైల్వేగేటు తరచుగా మోరాయించడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. కొన్నిసార్లు పట్టణంలో పోలీస్‌స్టేషన్ వరకు, గేటుకు అవతల బసివిరెడ్డిపేట వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. అధికారులు ప్రతిపాదించిన నమూనా.. సామర్లకోట బ్రిడ్జిని పోలిన నమూనాను అధికారులు ఇక్కడ రూపాందించారు. ప్రస్తుతం ఉన్న రైల్వేగేటుకు విజయవాడ వైపునకు 100 మీటర్ల దూరంలో రైల్వేట్రాక్ పైనుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు రైల్వేట్రాక్ నుంచి సుమారు 95 మీటర్ల పొడవునా ఫోర్ లైన్ బ్రిడ్జికి ప్రతిపాదించారు. దీనిని అనుసంధానం చేస్తూ ఇక్కడ నుంచి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలోకి, తాడేపల్లిగూడెం వైపు, సమిశ్రగూడెం కాలువ పైకి ఆర్మ్‌లు నిర్మించాల్సి ఉంది. అయితే ఆర్వోబీ నిర్మాణం కలగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా రూ.135 కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గూడెం గేటు వద్ద ఆర్వోబీ నిర్మిస్తే తప్ప పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు. -
ట్రాఫిక్ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ట్రాఫిక్ పాయింట్లను తనిఖీ చేసిన ఎస్పీ కర్నూలు: ట్రాఫిక్ విభాగంలో పని చేసే పోలీసులు విధులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసు దండయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం కర్నూలు నగరంలో ట్రాఫిక్ పాయింట్లను తనిఖీ చేశారు. ఆర్ఎస్ఐలతో మ్యాన్‌ప్యాక్‌లో మాట్లాడి, అప్రమత్తం చేశారు. రాజ్‌విహార్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, మౌర్యా ఇన్ జంక్షన్, జిల్లా పరిషత్ జంక్షన్ తదితర ట్రాఫిక్ పాయింట్లలో ఎస్పీ సందర్శించి ట్రాఫిక్ పోలీసుల పనితీరును పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వాహన జామ్‌లు తలెత్తకుండా సాఫీగా ప్రయాణించేందుకు ట్రాఫిక్ విభాగం పోలీసులు చర్యలు తీసుకోవాలని విధుల్లో ఉన్న సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ పాయింట్లలో ఉన్న సెక్టార్ ఇంచార్జిలైన ఆర్ఎస్ఐలతో మ్యాన్‌ప్యాక్‌లో మాట్లాడి, ట్రాఫిక్ జామ్ గురించి అడిగి తెలుసుకొని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ మానిటరింగ్ చేశారు. ట్రాఫిక్ పాయింట్లలో నిలబడి ట్రాఫిక్ క్రమబద్దీకరణపై స్వయంగా వీడియో తీశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, రాంగ్రూట్లో వెళ్తున్న వ్యక్తికి రూ.100 జరిమానా విధించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ దస్తగిరి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు ప్రతాప్, శ్రీనివాసగౌడ్, సోమశేఖర్‌నాయక్, వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ పాయింట్లలో విధులు నిర్వహించారు. ఆయా ప్రాంతాలను తనిఖీ చేసి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. -
లాఠీ ఝలిపించి.. లాడ్జీలను మూయించి!
మంగళవారం రాత్రి రంగంలోకి ఎస్పీ – లాఠీ పట్టుకుని పరుగెత్తించి.. – రాత్రివేళ ట్రాఫిక్‌పై ఉక్కుపాదం – పలు లాడ్జీల ఆకస్మిక తనిఖీ – కుప్పలు, తెప్పలుగా కండోమ్‌ల గుర్తింపు – ఐదు లాడ్జీల సీజ్ కర్నూలు(హాస్పిటల్): ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తుండే జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు కోపమొచ్చింది. నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మంగళవారం రాత్రి స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక కొత్తబస్టాండ్ ప్రాంతంలో రోడ్డుకు అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలను లాఠీ పట్టుకొని తరిమికొట్టారు. తోపుడు బండ్ల వ్యాపారులను మందలించారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారినీ హెచ్చరించారు. అనంతరం ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జీల్లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వందలాది కండోమ్‌లు ఆయన కంటపడ్డాయి. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారులకు నోటీసులు పంపి, లాడ్జీలను తనిఖీ చేయించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నాగరాజరావును ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా వాహనాలను పార్కింగ్ చేయవద్దన్నారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తే జరిమానా విధిస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. రద్దీ సమయంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో స్పెషల్ డ్రై వ్ నిర్వహించాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, ఎ.రామచంద్ర, సీఐలు నాగరాజరావు, మహేశ్వరరెడ్డి ఉన్నారు. ఐదు లాడ్జీలు సీజ్ జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు నాలుగవ పట్టణ సీఐ నాగరాజరావు కొత్తబస్టాండ్ సమీపంలోని మానస, శ్రీలేఖ, శ్రీ ఆంజనేయతో పాటు పేరు లేని మరో రెండు లాడ్జీలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే లాడ్జీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
శ్రీశైలం: కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీఐజీ రమణకుమార్ ఆదేశించారు. గురువారం ఉదయం పుష్కరనగర్ 1 ప్రాంగణంలో ఓఎస్డి రవిప్రకాశ్, ట్రాఫిక్ డీఎస్పీలు రామచంద్ర, వినోద్‌కుమార్‌లతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఏ సెక్టార్, బీ సెక్టార్లుగా ట్రాఫిక్‌ను విభజించామని, ఆయా సెక్టార్లలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు, అదనపు ఎస్పీ ట్రాఫిక్ ఇన్చార్జి, ఓఎస్డి రవిప్రకాశ్‌కు సమాచారం అందజేయాలన్నారు. సమావేశానంతరం ఆయన ట్రాఫిక్ పోలీసులకు అత్యవసర మైన మందులు ఉచితంగా అందజేశారు. -
కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలే కరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. త్వరలోనే ట్రైల్ రన్ వేసి మార్గాలను ప్రకటిస్తామని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. పుష్కర యాత్రికుల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఘాట్ ప్రాంతంలో ప్రత్యేకంగా లోపలికి, బయటకు వేర్వేరుగా మార్గాలను ఏర్పాట్లుచేశామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
ప్రధాని రాక నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
► రేపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న భారతీయ జనతా పార్టీ వర్కర్స్ సమ్మేళన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు. ► అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చాపెల్ రోడ్ వైపు మళ్ళిస్తారు. ► బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా పంపిస్తారు. ► ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా మళ్ళిస్తారు. ► కింగ్ కోఠి భారతీయ విద్యాభవన్ మీదుగా నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తాజ్‌మహల్ హోటల్ మీదుగా పంపిస్తారు. ► లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్ళిస్తారు. ► కార్యక్రమానికి వచ్చే ఆహుతులు, పాస్‌లు ఉన్న వారికి ఈ మళ్ళింపులు వర్తించవు. వీరికి ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, గేట్లు కేటాయించారు. ► ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు ఎస్పీ రోడ్, గ్రీన్‌ల్యాండ్స్, క్యాంప్ ఆఫీస్, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. -
అస్తవ్యస్తంగా ట్రాఫిక్
ప్రైవేట్ వాహనాల ఇష్టారాజ్యం నిరుపయోగంగా బస్టాండ్ రాయికల్: రాయికల్ అంగడిబజార్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో సమస్య మరింత జటిలంగా తయారైంది. గతంలో శివాజీ ఏరియా నుంచి గాంధీ విగ్రహం దాకా నిర్మించిన బైపాస్ రోడ్డు ద్వారా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపారు. అనంతరం వ్యాపారుల ఆందోళనతో విరమించారు. దీంతో మళ్లీ ప్రయాణికులకు తిప్పలు మొదలయ్యాయి. రాయికల్ మండలంలో 27 గ్రామాలతోపాటు మేడిపెల్లి, కోరుట్ల, మల్లాపూర్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు అంగడిబజార్ ముఖ్య కూడలిగా మారింది. కోరుట్ల, జగిత్యాల ఆర్టీసీ బస్సులు ఇక్కడే వచ్చి ఆగుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు ఇక్కడే నిలుపుతున్నారు. నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌ను మెరుగుపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. అంగడిబజార్‌లో అన్నీ సమస్యలే.. అంగడిబజార్‌లో ప్రయాణికులకు అన్నీ సమస్యలే. నిలబడేందుకు కూర్చొవడానికి షెల్టర్ లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లే క తిప్పలు పడుతున్నారు. ఎండాకాలం, వానకాలంలో దుకాణాల ఎదుట నిలబడితే వ్యాపారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లక్షలు వెచ్చించారు..నిర్లక్ష్యంగా వదిలేశారు.. మండల కేంద్రంలో లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ను నిర్లక్ష్యంగా వదిలేశారు. పందులు, పశువులకు నివాస కేంద్రంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. ఊరికి దూరంగా ఉందని కొంతమంది వ్యాపారులు బస్టాండ్‌ను వినియోగంలోకి రాకుండా చేశారు. బస్టాండ్ సమీపంలోనే తహసీల్, ఎంపీడీవో, ఐకేపీ, అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం బస్టాండ్‌ను ఆధునీకరించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
ఆగేది ఇలా.. సాగేది ఇలా..
అంత్యపుష్కరాలు సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ ఇలా.. వాహనాలు పార్కింగ్ చేసేందుకు 10 పార్కింగ్ ప్రదేశాలు గోదావరి అంత్య పుష్కరాలు సందర్భంగా ఈ నెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ రాజమహేంద్రవరానికి విచ్చేసే యాత్రికుల సౌకర్యార్థం వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్టు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలకు మొత్తం పది పార్కింగ్ స్థలాలు కేటాయించినట్టు ఆమె పేర్కొన్నారు. వీటిలో ఐదు ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకంగా ఆ బస్సులు వచ్చే రూట్లను అనుసరించి ఘాట్లకు దగ్గరగా ఏర్పాటు చేశామన్నారు. – రాజమహేంద్రవరం క్రైం ఆర్టీసీ బస్సులకు కేటాయించిన స్థలాలివే.. విజయవాడ నుంచి వచ్చే బస్సులు గామన్ బ్రిడ్జిపై నుంచి వచ్చే బస్సులు, సీతానగరం, కోరుకొండ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు నేరుగా లూథర్‌గిరిలో నిలిపుకోవచ్చు. విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు లూథర్‌గిరి, గోకవరం బస్టాండ్‌లో నిలుపుకోవచ్చు. రావులపాలెం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కాంప్లెక్, రైల్వేగూడ్స్ షెడ్లలో నిలపవచ్చు వివిధ ప్రదేశాల నుంచి వచ్చే ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఇలా.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు, ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ కారేజ్లకు రోడ్డులోని ఆర్ట్ కాలేజీలో, రాజమహేంద్రవరం జిల్లా పోలీస్ కార్యాలయం పక్కన లాలాచెరువు వద్ద గల హుందాయ్ షోరూమ్ వద్ద ఉన్న ఖాళీస్థలంలో నిలుపుకోవచ్చు. కార్లు, మోటారు సైకిళ్ల కోసం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్యం మైదానంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్, హుందాయ్ షోరూమ్ పక్కన గ్రౌండ్స్‌లో వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. రావులపాలెం నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజీ వాహనాలు మున్సిపల్ స్టేడియం, రైల్వే గూడ్స్‌షెడ్ వద్ద కార్లు, మోటారు సైకిళ్లను పార్కింగ్ చేసుకోవచ్చు. విజ్జేశ్వరం మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై నుంచి వచ్చే వాహనాలకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ధవళేశ్వరం, గూడ్స్ షెడ్ వద్ద నిలుపుదల చేసుకోవచ్చు. జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు ప్రాంతాలు కాటన్ విగ్రహం : ధవళేశ్వరం బ్రిడ్జిపై నుంచి వచ్చే లారీలు, భారీ వాహనాలు, వేమగిరి వైపు మళ్లిస్తారు. వేమగిరి సెంటర్ : కడియం, రావులపాలెం నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు ఎన్‌హెచ్ 16 మీదుగా పంపుతారు. క్వారీ మార్కెట్ సెంటర్ : కోరుకొండ, గామన్ బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనాలు, లారీలు, భారీ వాహనాలను లాలా చెరువు ఎన్‌హెచ్ 16 వైపు మళ్లిస్తారు. సీతానగరం నుంచి వచ్చే లారీలు, భారీ వాహనాలు గామన్ బ్రిడ్జిపై వెళ్లాలి. డెక్కన్ క్రానికల్ రోడ్డు, క్వారీ కెనాల్ రోడ్డు, బొమ్మూరు సెంటర్, హుకుంపేట సెంటర్, మోరంపూడి సెంటర్, కవలగొయ్యి సెంటర్, డీటీసీ సెంటర్, లాలా చెరువు సెంటర్ మీదుగా వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలు అంత్య పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం నగరంలోకి అనుమతించరు. ఈ నెల 31వ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇది అమలులో ఉంటుంది. నగర వాసులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రెండంచెల ప్రణాళిక ఇలా.. పా్లన్ –ఏ సాయిబాబా గుడి, ధవళేశ్వరం, గోదావరి బండ్ , కైలాస భూమిన ఎన్టీఆర్ విగ్రహం, వ్యాఘ్రం రోడ్డు, వ్యాయామ కళాశాల రోడ్డు, డాక్టర్ రంగాచారి రోడ్డు, కుమారి థియేటర్ రోడ్డు, బరువారి వీధి, ఉల్లితోట వీధి, పుచ్చలవారి వీధి, కంబం చౌల్ట్రీ, వంకాయల వారి వీధి, నాళం భీమరాజు వీధి, గుండు వారి వీధి, ఇసుక వీధి, గోదావరి బండ్ మీదుగా రంగ్రీజు పేట నుంచి జేపీ రోడ్డు,(అన్నపూర్ణ పార్కు వరకూ) కళామందిర్, అండర్ గ్రౌండ్, ఎంసీఆర్ రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, శేషయ్య మెట్ట, శంకర్ ఘాట్ రోడ్డు, కనక దుర్గా ఘాట్, లక్షీ్మగణపతి ఘాట్ రోడ్డు, చింతలమ్మ ఘాట్ రోడ్డు, (గోదావరి బండ్) ఫారెస్ట్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం, కైలాస భూమి వర కు. మూసి వేసే రోడ్లు ఇవేl.. గాయత్రి బండ్ రోడ్డు, దొమ్మేటి వారి వీధి, కేసరి క్లబ్ వీధి, వ్యాయామ కళాశాల రోడ్డు, డాక్టర్ రంగాచారి రోడ్డు, రంగ్రీజు పేట, అజంతా హోటల్ రోడ్డు, ములగొయ్యి రోడ్డు, సీతం పేట నుంచి అంబేడ్కర్ విగ్రహం రోడ్డు, పెట్రోల్ బంక్ నుంచి గోదావరి బండ్. పా్లన్– బి : ఐఎల్టీడీ సెంటర్, రైల్వే స్టేషన్, గూడ్స్ షెడ్, ఆర్‌సీఆర్‌బీ వ్యాయామ కళాశాల, శ్యామల సెంటర్, డీలక్స్ సెంటర్, ఉల్లితోట వారి వీధి, కంబం చౌల్ట్రీ, వంకాయల వారి వీధి, నాళం భీమరాజు వీధి, నల్ల మందు సందు, గుండు వారి వీధి, మద్దూరి అన్నపూర్ణయ్య పార్క్, కళామందిర్, అండర్ గ్రౌండ్ , మున్సిపల్ కార్యాలయం మీదుగా అంబేడ్కర్ విగ్రహం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆర్యాపురం, సీతం పేట సెంటర్, లూథర్ గిరి. పా్లన్ ఏ, బీ ప్రాంతాల్లోకి ప్రవేశించే వారు తప్పని సరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు తదితర ఆధారాలు కచ్చితంగా ఉండాలి. ఈ ప్రాంతాల్లో ఆటోలకు నో ఎంట్రీ.. సీతంపేట సెంటర్, అంబేడ్కర్ సెంటర్, శ్యామలా సెంటర్, డీలక్స్ సెంటర్, గూడ్స్ షెడ్, కోటిపల్లి బస్టాండ్, వివేకానందా విగ్రహం, వద్దకు అనుమతించరు. భక్తులు అధికంగా ఉన్న సమయాల్లో ఆటోలను వివేకానంద విగ్రహం, కంబాల ట్యాంక్, శ్యామలా సెంటర్ వద్ద మళ్లిస్తారు. -
నగరాన జడివాన
-
మెట్రో’కు అడ్డుతగలొద్దు
మెట్రో రైలు పనులకు అడ్డు తగిలే భవనాల్ని కూల్చి వేయూలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశిం చింది. ఆ పనులకు అడ్డుతగలొద్దని వ్యాపారులు, భవనాల యజమానుల్ని హెచ్చరించింది. సుప్రీం కోర్టులో వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిం చింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు రూ.15 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని,గిండీ మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కిలోమీటర్ల దూరానికి ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండీలను కలుపుతూ సెయింట్ థామస్‌మౌంట్ వరకు 22 కిలోమీటర్ల దూరానికి మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు నిర్ణయించారు. ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నారుు. కోయంబేడు-విమానాశ్ర యం మధ్య పనులు దాదాపు ముగింపు దశకు చేరాయి. కోయంబేడు - అశోక్ పిల్లర్ వరకు పనులు ముగిశాయి. పట్టాలు సిద్ధం కావడంతో బ్రెజిల్లో రూపుదిద్దుకున్న మెట్రో రైలు బోగీలను తీసుకువచ్చి ట్రయల్ రన్‌ను విజ యవంతంగా పూర్తి చేశారు. కోయంబేడు - సెంట్రల్, గిండీ - తిరువొత్తియూరు మధ్యలో కొన్ని చోట్ల భవనాలు, ప్రైవేటు స్థలాలు మెట్రో పనులకు అడ్డంకిగా మారాయి. ఆయా భవనాలు, స్థలాల సమీపంలో పనులు ఆగారుు. ఏళ్ల తరబడిగా ఉన్న తమ దుకాణాల్ని తొలగించొద్దంటూ వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. మెట్రోకు అండగా హైకోర్టు నిలబడడంతో చివరకు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ పరిశీలించింది. ఈ పిటిషన్‌ను విచారణ నిమిత్తం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. చెన్నై మహా నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న మెట్రో రైలు పనులకు అడ్డు తగల వద్దని స్పష్టం చేసింది. ఈ పనులకు అడ్డంగా ఉన్న భవనాల్ని కూల్చి వేయొచ్చని ఆదేశించింది. భవనాలు, స్థలాల యజమానులకు సకాలం లో నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో ఎక్కడెక్కడ ల్లా పనులు ఆగి ఉన్నాయో, పనులకు అడ్డం గా ఉన్న భవనాల్ని కూల్చి వేయడానికి మెట్రో ప్రాజెక్టు అధికారులు కసరత్తుల్లో ఉన్నారు.