► రేపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న భారతీయ జనతా పార్టీ వర్కర్స్ సమ్మేళన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
► ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు.
► అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చాపెల్ రోడ్ వైపు మళ్ళిస్తారు.
► బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా పంపిస్తారు.
► ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా మళ్ళిస్తారు.
► కింగ్ కోఠి భారతీయ విద్యాభవన్ మీదుగా నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తాజ్‌మహల్ హోటల్ మీదుగా పంపిస్తారు.
► లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్ళిస్తారు.
► కార్యక్రమానికి వచ్చే ఆహుతులు, పాస్‌లు ఉన్న వారికి ఈ మళ్ళింపులు వర్తించవు. వీరికి ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, గేట్లు కేటాయించారు.
► ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు ఎస్పీ రోడ్, గ్రీన్‌ల్యాండ్స్, క్యాంప్ ఆఫీస్, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.