PM Modi Meeting at LB stadium-Updates..
బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ ప్రసంగం
►పీఎం ఆవాజ్ యోజన్ కింద తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు ఇచ్చాం
► కోవిడ్ కష్టకాలంలో ప్రతీ పేదకుటుంబాన్ని ఆదుకున్నాం.
►పేదలకు ఇచ్చిన ఉచిత రేషన్‌ను మరో 5 ఏళ్లు పెంచుతున్నాం
►బీసీ కమిషన్‌కు మా ప్రభుత్వం రాజ్యాంగ మోదా కల్పించింది.
►తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.
►బీఆర్‌ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్నాయి.
►లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారు.
►అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ.
►అవినీతి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
►ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వాటిని తిరిగి రాబడతాం.
►2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు.
►బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోంది.
►బీఆర్‌ఎస్ వైఫల్యం వల్ల టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.
►అన్నీ నియామకాల పరీక్షల్లో అవకతకవకలు కామన్ అయిపోయాయి.
►ఒక తరం భవిష్యత్తును బీఆర్‌ఎస్ నాశనం చేసింది.
► తెలంగాణలో వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
►అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది బీజేపీనే
►బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీ వర్గానికి చెందిన నన్ను ప్రధానిని చేశారు.
►కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు.
►లోక్‌సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది బీజేపీనే.
►ఇదే మైదదానం సాక్షిగా బీసీ ముఖ్యబమంత్రి రాబోతున్నారు
►తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోంది
►తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం
►యువతను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ను సాగనంపాలా.. వద్దా?
►సమ్మక్మ- సారలమ్మకు జై అంటూ ప్రసంగం మొదలు పెట్టిన మోదీ
►బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా
►ఎల్బీ స్టేడియంతో నాకు సంబంధం ఉంది
►నాటి సభలో నా ప్రసంగం కోసం టికెట్ పెట్టారు
►భారతదేశంలో అది ఒక కొత్త ప్రయోగం
►ఇదే గ్రౌండ్‌లో ప్రజలు ఆశీర్వదించడంతో నేను ప్రధాని అయ్యాను.
►ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు
►తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు.
►నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించింది.
►తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలను అణగదొక్కారు.
►9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, స్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉంది.
►బీసీ ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.
►కాంగ్రెస్.. బీఆర్‌ఎస్‌కు సీ టీమ్‌గా పనిచేస్తుంది.
►బీఆర్‌ఎస్ కేవలం తన కుటుంబ సభ్యుల కోసమే పనిచేసింది.
►కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలే
►కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎప్పుడూ బీసీలకు పదవులు ఇవ్వలేదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారు: కిషన్ రెడ్డి
►తమ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.
►అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్.. కొనుగోలు చేసేపార్టీ బీఆర్‌ఎస్.
►బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నియంతృత్వ పార్టీలే.. డీఎన్‌ఏ ఒక్కటే.
►తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు.
►తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ రావాలి.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధానికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో మోదీ స్టేడియమంతా కలియతిరిగారు. బీసీ ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Live : Shri Narendra Modi BC Aatma Gourava Public Meeting at LB Stadium. https://t.co/Hs18g62m3V
— BJP Telangana (@BJP4Telangana) November 7, 2023
కాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. కేవలం గంటన్నర సేపట్లోనే ప్రధాని పర్యటన ముగియనుంది.
తెలంగాణ మదిలో మన మోదీ!
— BJP (@BJP4India) November 7, 2023
A wave of love and admiration for PM Modi in Telangana!#BCsWithBJP pic.twitter.com/g4tfuRefUj
Comments
Please login to add a commentAdd a comment