ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
శ్రీశైలం: కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీఐజీ రమణకుమార్ ఆదేశించారు. గురువారం ఉదయం పుష్కరనగర్ 1 ప్రాంగణంలో ఓఎస్‌డి రవిప్రకాశ్, ట్రాఫిక్ డీఎస్పీలు రామచంద్ర, వినోద్‌కుమార్‌లతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఏ సెక్టార్, బీ సెక్టార్లుగా ట్రాఫిక్‌ను విభజించామని, ఆయా సెక్టార్‌లలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు, అదనపు ఎస్పీ ట్రాఫిక్ ఇన్‌చార్జి, ఓఎస్‌డి రవిప్రకాశ్‌కు సమాచారం అందజేయాలన్నారు. సమావేశానంతరం ఆయన ట్రాఫిక్ పోలీసులకు అత్యవసర మైన మందులు ఉచితంగా అందజేశారు.