Pushkaras
-
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు
-
పుష్కరాల్లో అధికారుల సేవలు భేష్
–డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల్లో అధికారులు సేవలు బాగున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి కితాబిచ్చారు. అందుకే పుష్కర్లా నిర్వహణలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిందన్నారు. బుధవారం రాత్రి వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్లో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు, మహిళా సంఘాల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఈ మాట్లాడుతూ.. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతమంది అధికారులను ఒకేచోట చూడటం ఇదే మొదటిసారి అన్నారు. ఈ ఖ్యాతి జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌కు దక్కుతుందన్నారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ.. మహా సంకల్పం కలిగివుండటం వల్లే దేవుడు కరుణించి కష్ణా నదికి పుష్కలంగా నీరు వచ్చిందన్నారు. పుష్కరాల అనుభూతులు వచ్చే పన్నెండేళ్లు గుర్తుండిపోయేలా ఉన్నాయని ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సర్వేలోనే సంగమేశ్వరం ఘాట్‌కు మొదటిస్థానం దక్కడం సంతోషంగా ఉందని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానం ఈవో నారాయణ భరత్ గుప్త, జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ ఎస్ఈ మల్లికార్జునరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడు, విద్యుత్ ఎస్ఈ భార్గవరాముడు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు పుష్కరాల విజయోత్సవ సభ
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలం, సంగమేశ్వరంలో ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాల విధులను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగుల అభినందన సభ ఈనెల 31న నిర్వహించనున్నారు. డోన్ రోడ్డులోని వీజేఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం 5 గంటలకు అభినందన సభ ఏర్పాటవుతుంది. పుష్కరాల విజయవంతానికి సహకరించిన అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలతో అభినందన సభ నిర్వహిస్తామన్నారు. అందరికీ ఉపముఖ్యమంత్రి కేఇ కష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. -
సమష్టి కృషితోనే పుష్కరాలు విజయవంతం
కర్నూలు: అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమష్టికృషితోనే కృష్ణాపుష్కరాలు విజయవంతమయ్యాయని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. పుష్కరాలు విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేసిన పోలీసు యంత్రాంగాన్ని ఎన్జీఓ సంఘం నాయకులు అభినందించారు. జిల్లా అధ్యక్షుడు వెంగల్రెడ్డి, కార్యదర్శి జవహర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి, నగర అధ్యక్షుడు లక్ష్మన్న,కార్యదర్శి హరిశ్చంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, తాలుకా కార్యవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఎస్పీని కలిసి అభినందించారు. -
శభాష్.. బాగా పని చేశారు
– జిల్లా అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి – పుష్కర విధుల్లోని ఉద్యోగులందరికీ 26న సెలవు కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సహా జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు డీఐజీ రమణకుమార్, జిల్లా కలెక్టర్, జేసీ పలువురు అధికారులు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించడంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా రాష్ట్రంలో 170 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయగా.. సంగమేశ్వరం ఘాట్ ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి.. కలెక్టర్, జేసీలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అధికారులంతా పుష్కరాలకు రెండు రోజుల ముందు నుంచే రేయింబవళ్లు శ్రమించడంతో పుష్కర విధుల్లోని ఉద్యోగులందరికీ ఈనెల 26న సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి నుంచి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకష్ణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశం, మల్లికార్జున తదితరులు ఉన్నారు. -
ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నా..
– గుడులను కూల్చి మరుగుదొడ్లను కట్టారని రోజా విమర్శ – లింగాలగట్టులో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కృష్ణమ్మను వేడుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉందని అభిప్రాయపడ్డారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో మంగళవారం పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణ నది ఎంతో పవిత్రమైనదని.. కోరుకున్నది ప్రసాదిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. అందుకే కృష్ణా నదిలో స్నానమాచరించి ప్రత్యేక హోదా కోరుకున్నట్లు తెలిపారు. విజయవాడలో దేవుళ్ల గుడులను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో మరుగుదొడ్లను నిర్మించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఆధ్యాత్మికత పట్ల ఉన్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుందని విమర్శించారు. ఆమెతో పాటు భర్త సెల్వమణి, కూతురు, కుమారుడు ఉన్నారు. -
పుష్కరాల విజయవంతంలో మీడియా పాత్రే కీలకం
కృష్ణా పుష్కరాల విజయవంతంలో మీడియా పాత్రే కీలకమని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆర్కే రవికృష్ణ పేర్కొన్నారు. పుష్కరాలు జరుగుతున్న మూడు జిల్లాలో కర్నూలు మొదటి స్థానంలో నిలవడానికి మీడియా సహకారం ఎనలేనిదన్నారు. పుష్కరాల ముగింపు రోజైన మంగళవారం ఆయన పాతాళగంగ పుష్కర ఘాట్లలో స్నానమచరించిన భక్తులను సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ..పుష్కర వి«ధుల్లో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సదుపాయాలు కల్పించడంతోనే విజయవాడ, గుంటూరు జిల్లాలను కాదని మొదటి స్థానం కర్నూలుకు వచ్చిందన్నారు. అహర్నిశలు పనిచేసిన సిబ్బందిని వారు అభినందించారు. – శ్రీశైలం (కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) -
నేడు మల్లన్నకు రుద్రాభిషేకం
– సాయంత్రం ఉత్సవమూర్తులతో పాతాళగంగవరకు ఊరేగింపు – నదీమాతల్లికి విశేషపూజలు, దశవిధ నదీహారతులు – 1,116 మంది దంపతుల కలశజలాభిషేకం – 10 కేజీల పూలతో వస్తేనే పుష్పాభిషేకానికి అర్హులు శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణాపుష్కరాల చివరి రోజు మంగళవారం శ్రీశైల మల్లికార్జునస్వామివార్లకు కృష్ణా జలాలతో రుద్రాభిషేకం, పుష్పార్చనను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మహా పుణ్యకార్యంలో భక్తులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానంలో నమోదు చేసుకున్న 1,116 మంది దంపతులకు మొదటి ప్రాధాన్యతన్నిచి వారితో కలిసి పాతాళగంగ యాత్ర చేపడుతారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు వేదమంత్రోచ్చరణలతో మంగవాయిద్యాల నడుమ శ్రీభ్రమరాంబామల్లికార్జునేస్వామివార్ల ఉత్సవమూర్లును పల్లకీలో పాతాళగంగవ ద్దకు తీసుకెళ్తారు. అనంతరం పవిత్ర పాతాళగంగ నదీ తీరాన కృష్ణవేణీ నదీమాతల్లికి విశేషపూజలను నిర్వహించి, దశవిధ హారతులతో కృష్ణమ్మకు నదీహారతులను సమర్పిస్తారు. అనంతరం ప్రత్యేకపూజలలో పాల్గొనే దంపతులందరూ పుష్కర స్నానం చేసి కలశంలో కృష్ణా జలాలను నింపుకుని పాతాలగంగ మెట్ల మార్గం ద్వారా పైకిS చేరుకుని అక్కడినుంచ కలశాయత్రతో స్వామివార్ల ఆలయాన్ని చేరుకుంటారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తరీతిలో పుష్పోత్సవ సేవను నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే దంపతులు కచ్చితంగా 10 కేజీల పూలను (బంతిపూలు మినహా) తీసుకురావాల్సి ఉంటుంది. అలా తీసుకువచ్చిన వారికి మాత్రమే దేవస్థానం అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే పాతాళగంగ కలశ జలాలతో వచ్చిన దంపతులు శ్రీమల్లికార్జునస్వామివార్ల మూలవిరాట్‌కు వేదగోష్టి మ«ధ్య రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు సేవాకర్తలకు మహాదాశీర్వచనాలు: మంగళవారం సాయం్రం శ్రీ మల్లికార్జునస్వామివారికి జరిగే కృష్ణాజలాల కలశాభిషేకం, పుష్పోత్సవ సేవలో పాల్గొనే సేవాకర్తలకు ఆలయ అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్చరణలతో మహాదాశీర్వచనాలను 1,116 మంది జంటలకు అందజేస్తారు. శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దేవస్థానం తరుపున ఈ క్రతువులో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు (కండువా, చీర,రవికె, పసుపు,కుంకుమలు), లడ్డూప్రసాదాలను ఆలయ అధికారులు అందజేస్తారు. -
సాధికార సర్వే @ 9
– జిల్లాలో 3,12,999 కుటుంబాల సర్వేపూర్తి – రాష్ట్రంలో జిల్లాకు తొమ్మిదో స్థానం కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసాధికార సర్వే పుష్కరాల కారణంగా నత్తనడకన సాగుతోంది. వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల ఉద్యోగులు పుష్కరాల విధుల్లో ఉండటం వల్ల సర్వే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు నిలిచిపోయింది. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరుగా జరుగుతోంది. గత నెల 8న ప్రారంభమైన సర్వే ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా సర్వేలో 9వ స్థానంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 2,52,624 కుటుంబాలకు సంబంధించి 8,51,378 మంది సభ్యులను సర్వే చేశారు. ఆర్బన్ ప్రాంతాల్లో 60,375 కుటుంబాల్లో 2,22,435 సభ్యులను సర్వే చేశారు. జిల్లా మొత్తంగా 3,12,999 కుటుంబాలకు చెందిన 10,73,813 మంది సభ్యుల వివరాలు నమోదు చేశారు. ఇంకా 6 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. పుష్కరాల తర్వాత సర్వే ఊపందుకునే అవకాశం ఉంది. -
గిరిపుత్రులు.. పుష్కర పూజకు దూరం
శ్రీశైలం ప్రాజెక్టు: అనాదిగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎటువంటి పూజలు జరగాలన్నా ముందుగా చెంచు గిరిజనులనే ఆహ్వానించేవారు. రోడ్డు, రవాణా సౌకర్యం లేని కాలంలో శివుని సన్నిధిలో ప్రథమ పూజారులు చెంచు గిరిజనులే. అటువంటి వారికి కష్ణా పుష్కరాల సందర్భంగా అధికార యంత్రాంగం ఎటువంటి ప్రాధాన్యతన కల్పించలేదు. శ్రీశైలం క్షేత్ర సమీపంలో హఠకేశ్వరం సమీపంలోని అప్పటి లింగమయ్య చెంచుగూడెం, శిఖరేశ్వరం, మాణిక్యమ్మ సెల, మేకలబండ ప్రాంతంలో సుమారు 320 మంది గిరిజనులు నివసిస్తున్నారు. పుష్కరాల ప్రారంభం సమయంలో వారికి అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇవ్వకపోగా, కనీసం పుష్కరాలపై అవగాహనను కూడా ప్రభుత్వం కల్పించలేకపోయింది. పుష్కరాలంటే మాకు తెలియదు: జెండాలమ్మ, చెంచుగూడెం పుష్కరాలంటే మాకేందో తెలియదు సామీ. శివరాత్రి, ఉగాదిపండగలప్పుడు గుడిసారోళ్లు వచ్చి మమల్ని పిలుచుకుపోతారు. రథం ముందు చిందులు తొక్కమని చెబుతారు. చిందులు తొక్కినందుకు ఆ రోజుకు మాకు ఖర్చులకు డబ్బులు ఇస్తారు. ఆ పండగలు తప్ప, మాకు ఇంకొకటి తెలవదు. పుష్కరాలంటే భక్తులు వస్తారనే తెలుసు. అంతకుమించి ఏమి తెలవదు. పుష్కర పూజకు పనికిరామా: గజ్జెల్, చెంచుగూడెం శ్రీశైలంలో శివుడు కొలువైనప్పటి నుంచి మా తాత ముత్తాతలు ఆయనకు పూజలు చేసేవాళని చెబుతారు. మమల్ని కూడా శివరాత్రి, ఉగాది, ఇతర పండుగలప్పుడు ఆలయాన్ని కడగడం, శివలింగాన్ని కడగడం వంటి పనులకు పిలుస్తారు. మా చెంచోలంతా ఆ పండుగలప్పుడు ఎంతో సంబరం చేసుకుంటాం. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా పుష్కరాలకు మా జాతిని, మా సేవలను ఎవరు గుర్తించలేదు. ఏ పూజకు మమల్ని పిలవలేదు. -
జనసాగరం
-
పుష్కరాలకు వెళ్తే నగలు మాయం
అనంతపురం సెంట్రల్ : పుణ్యం కోసం పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు లూటీ చేసిన సంఘటన అనంతపురం విద్యారణ్య నగర్లో వెలుగు చూసింది. స్థానిక రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం... విద్యారణ్య నగర్‌కు చెందిన రవికుమార్ కార్ల అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో కలసి జీడీపల్లి జలాశయం వద్ద పుష్కరాలకు ఆదివారం ఉదయం బయలుదేరివెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటిలోని బీరువా తలుపు పగులగొట్టి అందులోని ఏడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిన్స్‌తో నేరస్తుల భరతం పడ్తాం
– పుష్కరాల్లో నలుగురు నేరస్తులను గుర్తించాం – విజయవాడలో వందమందిని పట్టించింది – త్వరలో అన్ని పోలీసు స్టేషన్‌కు విస్తరిస్తాం శ్రీశైలం(జూపాడుబంగ్లా): ఫిన్స్(ఫింగర్ ఫ్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టం)తో నేరస్తుల భరతం పట్టనున్నట్లు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ఆదివారం లింగాలగట్టు దిగువఘాటులో ఫిన్స్ ద్వారా అనుమానితుల వేలి ముద్రలను సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫిన్స్ యంత్రంలో రాష్ట్రనలుమూలలకు చెందిన నేరస్తుల వేలిముద్రలతోపాటు వారి సమాచారాన్ని ట్యాబ్‌లో పొందుపర్చి వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామని తెలిపారు. అనుమానితులు ఎవరైనా పట్టుబడినçప్పుడు ఫింగర్‌ఫ్రింట్ యంత్రాన్ని ట్యాబ్‌ను అనుసంధానించి తద్వారా వారి వేలిముద్రలు సేకరించటం జరుగుతుందని వారి వేలిముద్రలు అప్పటికే నమోదైన వేలిముద్రలతో సరిపోతే వారి వివరాలు వెంటనే వెల్లడవుతాయన్నారు. తద్వారా గతంలో వారు ఎక్కడెక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు, ప్రస్తుతం మారు పేర్లతో ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. పుష్కరాల సందర్భంగా పాతాళగంగ ఘాటులో టీ అమ్ముకుంటూ అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరి వ్యక్తుల వేలిముద్రలు సేకరించగా వారి గత నేరచరిత్ర వెల్లడవ్వటంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడలో ఫిన్స్ యంత్రం ద్వారా వంద మందికిపైగా నేరస్తులను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ యంత్రం ద్వారా సత్ఫలితాలు వస్తే ఐజీ, డీఐజీల సహకారంతో ఫిన్స్ యంత్రాన్ని అన్ని పోలీసుస్టేషన్లకు విస్తరిస్తామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. -
సంగమేశ్వరం.. పుష్కర ప్రభంజనం
– ఎండ తీవ్రతతో అవస్థలు – 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు – ఉచిత బస్సులు చాలక కాలినడక సంగమేశ్వరం(ఆత్మకూరు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా పదవ రోజు ఆదివారం సంగమేశ్వర క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. మరో రెండు రోజులే సమయం ఉండటం.. సెలవు దినం కావడంతో సుమారు అరలక్షకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. వేకువజామున 6 గంటల నుంచే సంగమేశ్వరం, లలితాదేవి పుష్కర ఘాట్ల వద్ద రద్దీ కనిపించింది. ఘాట్ల వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినా.. భక్తుల రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో సంగమేశ్వరం, కపిలేశ్వరం, పాతమాడుగుల వరకు కృష్ణా బ్యాక్ వాటర్‌లో భక్తులు ఎక్కడపడితే అక్కడ పుణ్యస్నానం చేశారు. సంగమేశ్వరం చేరుకోవాలంటే వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలను దాటుకొని వెళ్లడం అసాధ్యం కావడంతో ఇలా కానిచ్చేశారు. ఎలాంటి భద్రత లేని చోట్ల భక్తులు పుణ్య స్నానం ఆచరించడం కాస్త ఆందోళనకు కారణమయింది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కారణంగా భక్తులు సంగమేశ్వర క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. భారీగా స్తంభించిన ట్రాఫిక్ పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పార్కింగ్ స్థలం చాలకపోవడంతో రహదారి వెంట ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడం సమస్యకు దారితీసింది. అధికారులు లింగాపురం, మాడుగుల గ్రామాల వద్దే పలు వాహనాలను నిలిపివేయించినా ఫలితం లేకపోయింది. కపిలేశ్వరం నుంచి పాత మాడుగుల గ్రామ సమీపంలోని లింగమయ్య ఆలయం వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరానికి 45 కిలోమీటర్ల దూరం కాగా.. గంటర్నర సమయంలో క్షేత్రం చేరుకోవాల్సి ఉంది. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా భక్తులు క్షేత్రం చేరుకునేందుకు 4 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. భక్తుల ఇక్కట్లు ట్రాఫిక్ సమస్యకు తోడు ఎండ తీవ్రతతో భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఉచిత భస్సులు సరిపడక.. కపిలేశ్వరం నుంచి చాలా మంది భక్తులు నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఓవైపు లగేజీ.. చిన్న పిల్లలను చంకనెత్తుకొని దారి పొడవునా నానా అవస్థలు పడ్డారు. -
తల్లి కోసం.. ఒక్కటై
శ్రీశైలం (జూపాడుబంగ్లా): కాశీ, గయా, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలతోపాటు గోదావరి పుష్కర స్నానం అచరించిన 90 ఏళ్ల పిడూరు సుశీలమ్మ చివరిపర్యాయంగా కృష్ణాపుష్కరాలు చేసేందుకు కుటుంబసభ్యులతో శనివారం శ్రీశైలం తరలివచ్చారు. తల్లి చివరి కోరికను తీర్చేందుకు ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆమె రెండో కుమార్తె పుష్పలత తోపాటు హైదరాబాదులో నివాసం ఉంటున్న పెద్దకుమార్తె సుబ్బారత్నం, మూడోకుమార్తె లత, నాలుగోవకుమార్తె వేదావతి, పెద్దకుమారుడు సుబ్బారావు, రెండోకొడుకు సుధాకర్‌లతోపాటు కృష్ణాపుష్కరస్నానం చేసేందుకు లింగాలగట్టు దిగువఘాటుకు చేరుకున్నారు. ఈసందర్భంగా వారిని ‘సాక్షి’పలకరించగా జన్మనిచ్చిన తల్లి కోర్కెను తీర్చేందుకు తాము శ్రీశైలంలో పుష్కరస్నానం చేసి స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చినట్లు తెలిపారు. -
పుష్కర స్నానం.. పునీతం
కళ్యాణదుర్గం : బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌లోని కృష్ణాజలాల్లో పుష్కర స్నానం చేయటానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రావణ మూడో శనివారాన్ని పురస్కరించుకుని ఇంటిల్లిపాదీ జీడిపల్లికి చేరుకుని పుష్కరస్నానాలాచరించారు. సుదూర ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్లకు వెళ్లకుండా జీడిపల్లి చెంతనే ఉన్న కృష్ణా జలాల్లో స్నానాలు చేసి మురిసిపోతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఓపికతో వచ్చి పుష్కర స్నానంతో పునీతులవుతున్నారు. కృష్ణా పుష్కర స్నానం కోసం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ వద్దకు శనివారం వేలాదిమంది భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో చేరుకున్నారు. ఘాట్లతోపాటు రిజర్వాయర్ పొడవునా ఉన్న కృష్ణా జలాలతో పుష్కరస్నానమాచరించి పునీతులయ్యారు. అనంతపురానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో కూడా ఒక్కరోజు అన్నదానం చేపట్టారు. పరిటాల ట్రస్ట్ ద్వారా అన్నదానంతోపాటు తాగునీటి పాకెట్లు అందజేశారు. తహశీల్దార్ వెంకటాచలపతి, ఇన్చార్జ్ డీఎస్పీ సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తుల డిమాండ్లు = పుష్కరస్నానాలు చేసిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైనన్ని టెంట్లు ఏర్పాటు చేయాలి. = వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నందున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. = వేలాదిమంది భక్తులు తరలి వస్తున్నందున తాగునీటì సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి. = పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. -
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం రోజు రోజుకు తగ్గుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాల్సి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వచ్చే ఇన్‌ఫ్లో కూడా తగ్గడంతో డ్యాంలో నీటినిల్వ తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 157.5068 టీఎంసీల నీరు నిల్వఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు 25,537 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 14,200 క్యూసెక్కులు హంద్రీనీవా సుజల స్రవంతికి 2,025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులకు చేరుకుంది. -
జలానుబంధం..!
-
గంగను విడిచిన విభునికి... విడతల వారీగా అభిషేకం
– కృష్ణా పుష్కరాల సందర్భంగా అభిషేకాల నిలుపుదల – వారం తర్వాత నిర్ణయం మార్చుకున్న అధికారులు – ప్రతి మూడు గంటలకు ఒకసారి శాస్త్రోక్తంగా మల్లన్నకు అభిషేకం శ్రీశైలం: వారం రోజులుగా అభిషేకాలకు దూరంగా ఉన్న శ్రీశైల మహా చక్రవర్తికి విడతల వారీగా అభిషేకాలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు నీళ్లు లేవని భక్తులు, అధికారులు ఆందోళన చెందుతున్న తరుణంలో శివుడు గంగను విడవటంతో కృష్ణమ్మ బిరబిరమంటూ పరుగులెత్తింది. భక్తులు పుష్కర స్నానం చేసి పునీతలయ్యారు. అయితే పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు అభిషేకాలను నిలుపుదల చేశారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు విమర్శలు చేశారు. కనీసం స్వామివార్ల రుద్రాక్ష మండపానికి ఉండే ఘంటాపాత్రోలో నైనా నీటిని పోసి నిరంతరం శ్రీశైలమహాలింగ చక్రవర్తి శిరస్సుపై నీరు పడేలా ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి అధికారుల ఆలోచనలలో మార్పు వచ్చింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మల్లికార్జునస్వామికి మహా నైవేద్యం ముగిశాక ఈఓ భరత్ గుప్త ద్వారా ఆలయప్రధానార్చకులు, అర్చకులతో వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రతి మూడు గంటలకు ఒకసారి మల్లన్నకు అభిషేకం నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆలయప్రాంగణం అభిషేక సమయాన ఆధ్యాత్మిక వేదమంత్రోచ్చరణల తరంగాలతో ప్రభావితమైంది. అనంతరం తిరిగి 2.30 గంటల నుంచి 3.30గంటల వరకు అర్చకులు రుద్రాభిషేకంతో మల్లన్నకు పరమానందం కలిగిందనే చెప్పవచ్చు. అలాగే సాయంత్రం కూడా ఒకసారి, రాత్రి మరోసారి మల్లన్నకు రుద్రాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుష్కరాలలో మిగిలిన అన్ని రోజులు ఈ అభిషేకం కొనసాగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏలా ఉన్నా అభిషేక ప్రియుడైన శ్రీశైల మల్లికార్జునస్వామికి ఏదో రూపేణా అభిషేకం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా భక్తులు పేర్కొంటున్నారు. -
పున్నమి ఘాట్‌లో వీఐపీల పుష్కర స్నానాలు
-
ఆరో రోజు 12 లక్షలపైనే
- పాలమూరులో హారతిచ్చిన కలెక్టర్ సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాలకు మంగళవారం కాస్త తగ్గిన భక్తుల సంఖ్య ఆరో రోజు బుధవారం మళ్లీ పెరిగింది. 13 లక్షల మంది దాకా పుష్కర స్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 9.2లక్షల మంది కృష్ణలో స్నానాలు చేశారు. ఉదయం 8 గంటల వరకు ప్రధాన ఘాట్లలో స్వల్పంగా భక్తుల రద్దీ ఉన్నా ్తర్వాత క్రమేణా పెరిగింది. బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, సోమశిల, నది అగ్రహారం, పస్పుల, కృష్ణ, క్యాతూర్, పాతాళగంగ తదితర ఘాట్లు భక్తులతో కళకళలాడాయి. వీపనగండ్ల మండలం మంచాలకట్ట వద్ద దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదాయ పద్ధతిలో పిండప్రదానం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తదితరులు పుణ్య స్నానాలు చేశారు. గొందిమళ్ల వీఐపీ పుష్కరఘాట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ హరినాథరావు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. నీళ్లు లేకపోవడంతో జూరాల ఘాట్‌లో బుధవారం కూడా స్నానాలను నిలిపివేశారు. పలు ఘాట్లలో నీటి మట్టం తగ్గింది. శ్రీశైలం వరద జలాలతో గొందిమళ్ల, సోమశిల ఘాట్లు నీటితో కళకళలాడాయి. గొందిమళ్లలో కలెక్టర్ టి.కె.శ్రీదేవి నదీ హారతి ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో 3.5 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లకు భక్తులు భారీగా వచ్చారు. తెలుగు ప్రజల ఆత్మబంధువు వైఎస్ వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా మంచాలకట్టలో వైఎస్‌కు పిండప్రదానం కొల్లాపూర్: దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల ఆత్మ బంధువని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మం డలంలోని మంచాలకట్టలో వైఎస్‌కు ఆయన పిండ ప్రదానం చేశారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సేవాదళ్ చైర్మన్ బండారు వెంకటరమణలతో కలిసి పిండ ప్రదాన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కృష్ణా నదిలో తర్పణం వదిలాక విలేకరులతో మాట్లాడారు. పలు సం క్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో వైఎస్ ఇప్పటికీ పదిలంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శులు వి.రాజశేఖర్, మేనుగొండ రాము యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వరదారెడ్డి పాల్గొన్నారు. -
'పుష్కరాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ'
-
ఐదో రోజు పలుచన!
-
పుష్కర ముగింపున పుష్పాభిషేకం
– నేటి నుంచి దంపతుల రిజిస్ట్రేషన్ నమోదు – ఎస్ఎంఎస్ ద్వారా నమోదు చేసుకున్న వారికే అవకాశం – ఇప్పటి వరకు 5లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు – జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సాక్షి, కర్నూలు: పుష్కరాల ముగింపును పురస్కరించుకొని ఈనెల 23న స్వామి, అమ్మవార్లకు 10టన్నుల పూలతో అభిషేకం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన శ్రీశైలంలోని మల్లికార్జున సదన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో ఈఓ నారాయణ భరత్‌గుప్తా, స్వామివార్ల ప్రధాన అర్చకులు మల్లికార్జునస్వామి, వేద పండితులు గంటి రాధాకష్ణ శర్మలతో కలిసి మాట్లాడారు. పుష్కరాల్లో భక్తిభావం ఉప్పొంగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. ముగింపు రోజున నిర్వహించే పుష్పాభిషేకానికి 1,116 జంటలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పాల్గొనాలనుకునే జంటలు 9985330026 నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్లతో బుధవారం ఉదయం 10 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ముగింపు రోజున స్వామి, అమ్మవార్లకు 20 నుంచి 30 మంది వేద పండితులతో పుష్పాభిషేకం చేపట్టిన అనంతరం.. సాయంప్రదాయ దుస్తుల్లోని 1,116 జంటలు కష్ణా జలాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత జంటలకు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలతో సన్మానించి లడ్డూ ప్రసాదాలను అందజేస్తామన్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర, దేశ ప్రజలు వీక్షించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
పుష్కరాలకు వెళ్లి వస్తూ..
శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్ర– తెలంగాణా సరిహద్దులోని దోమలపెంట సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన కేశవ, సత్యనారాయణ, ఇస్మాయిల్, రాజ్ స్నేహితులు. వీరు కర్నూలు జిల్లాకు చెందిన వారు కాగా.. వత్తి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం తిలక్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరంతా పుష్కరాల సందర్భంగా డ్రైవర్ శివకుమార్‌తో కలిసి కారులో సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. పుష్కర స్నానాలు చేసి మల్లన్న దర్శనానంతరం మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వీరు బయలుదేరిన కొద్ది నిమిషాలకు ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడంతో డ్రైవర్ శివకుమార్ అక్కడిక్కడే మతి చెందాడు. గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కేశవ చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ, ఇస్మాయిల్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రాజు స్వల్పంగా గాయపడ్డాడు. మన్ననూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
వజ్రకరూరు : మండలపరిధిలోని రాగులపాడు గ్రామసమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణాజలాలు పరుగులు తీస్తున్నాయి. ఈ నెల10న కర్నూలు జిల్లా మాళ్యాలనుంచి కృష్ణా జలాలు రాగులపాడులిఫ్ట్కు చేరుకున్నాయి. అప్పటినుంచి లిఫ్ట్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు పంపుతున్నారు. లిఫ్ట్‌కు నీటి ఉధృతి పెరగడంతో అధికారులు మంగళవారం నాలుగు పంపులద్వారా నీటిపంపింగ్ చేపడుతున్నారు. ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కులమేర నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. హంద్రీనీవా కాలువలో కృష్ణాజలాలు ప్రవహిస్తుండటంతో పొట్టిపాడు, పీసీ.ప్యాపిలి, రాగులపాడు, కడమలకుంట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
పుష్కర స్నానం.. పుణ్యఫలం
ఉరవకొండ : బెళుగుప్ప మండలం జీడిపల్లిలోని కృష్ణా జలాల్లో పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరించారు. భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి, పిండప్రదానం, గంగపూజ చేశారు. అనంతరం సమీపంలోని ఆంజనేయస్వామి, పద్మావతి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. -
మనసు కేరింత.. తనువు తుళ్లింత
– పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తుల రద్దీ – పనిచేయని మెటల్ డిటెక్టర్లు – ఘాటు వద్ద సేకరించిన చెత్తను పక్కనే పడేస్తున్న వైనం – వసతి సౌకర్యం లేక ఆలయం ముందే బస – అధికారుల హాజరుకు బయోమెట్రిక్ అమలు – భక్తులకు అన్నం వడ్డించిన కలెక్టర్ శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి: మనసులో శివున్ని తలచుకుంటూ.. కృష్ణా నదిలో మునకేస్తూ.. చల్లని కొండగాలి పీలుస్తూ పుష్కరస్నానంతో పునీతులవుతున్న భక్లు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సెలవు దినాలు కావడంతో పుష్కరాల మూడవ రోజు ఆదివారం జిల్లాలోని ఐదు ఘాట్లలో భక్తుల సంఖ్య లక్ష దాటినట్లు అధికారుల అంచనా. రెండు రోజుల పాటు పాతాళగంగ ఘాట్‌లో పలుచగా ఉన్న భక్తుల సంఖ్య కాస్తా ఆదివారం నాటికి భారీగా పెరిగింది. రోప్‌వేను అనుమతించడంతో పాతాళగంగలో స్నానం చేసేందుకు వచ్చే భక్తుల సంఖ్య అమాంతంగా అధికం కాగా.. లింగాలగట్టు, సంగమేశ్వరంలో పుష్కర హోరు కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి పాతాళగంగలో పుణ్యస్నానం చేసి పిండ ప్రదానం చేశారు. ఇక కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు ఘాట్లను పర్యవేక్షిస్తూ భక్తుల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు అధికమవుతున్నాయి. బట్టలు మార్చుకునేందుకు గదులు లేక, మరుగుదొడ్ల డోర్లు విరిగిపోవడంతో ప్రధానంగా స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భక్తులను చెకింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు సరిగా పనిచేయలేదు. లింగాలగట్టు వద్ద చార్జింగ్ లేక డిటెక్టర్లు మొరాయించాయి. సిబ్బంది అంతా విధులకు హాజరవుతున్నారా? లేదా అని పర్యవేక్షించేందుకు ట్యాబ్‌ల ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లింగాలగట్టు వద్ద వచ్చే భక్తులకు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం వద్ద కలెక్టర్ విజయమోహన్ స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. రోప్వేకు తాకిడి.. పాతాళగంగకు వెళ్లే మార్గంలో రోప్వేకు అనుమతించారు. దీంతో పాతాళగంగలో స్నానం ఆచరించే భక్తుల సంఖ్య రెండు రోజులతో పోలిస్తే ఆదివారం భారీగా పెరిగింది. ఫలితంగా రోప్వేకు తాకిడి అధికమయింది. ఈ నేపథ్యంలో రోప్‌వేతో పాటు పాతాళగంగకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా జీపులను వేశారు. పాతాళగంగ ఘాటు వద్ద పిండ ప్రదానానికి, బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లే మార్గంలో హడావుడిగా ఏర్పాటు చేసిన నాపరాతి బండలను తొలగించారు. ఈ స్థానంలో కొత్తగా సిమెంట్ రోడ్డును రాత్రికి రాత్రి సిద్ధం చేశారు. పాము కలకలం పాతాళగంగ ఘాటు వద్ద పాము కలకలం రేపింది. ఘాటు వద్ద పాము కనిపించడంలో భక్తులు ఆందోళనకు లోనయ్యారు. అయితే, మరోవైపు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రంలో తేలు, పాముకాటుకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు మందులు అందుబాటులో లేకపోవడం ఏదయినా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటనే చర్చకు తావిచ్చింది. కేవలం జ్వరం, ఒళ్లునొప్పులు, గాయాలకు మాత్రమే మందులు అందుబాటులో ఉంచారు. ఇవీ పుష్కర ఇబ్బందులు – భక్తులందరికీ వసతి కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. ఇదే అదనుగా కొద్ది మంది మధ్యవర్తులు భక్తులను దోచుకుంటున్నారు. మాములు గదికి రూ.1700 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత అధిక మొత్తం చెల్లించలేని భక్తులు ఆలయం ముందే నిద్రిస్తున్నారు. – లింగాలగట్టు ఘాట్ వద్ద సేకరించిన చెత్తను పక్కనే పడేస్తున్నారు. ఇది గాలికి మళ్లీ తిరిగి వచ్చి ఘాటుకు వస్తోంది. – ఘాట్ల వద్ద అన్ని శాఖల అధికారులు సక్రమంగా హాజరుకావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 8 గంటలకే ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆయుష్, హోమియో స్టాల్స్ 9 గంటల 40 నిమిషాలకు కానీ ఏర్పాటు కాలేదు. -
పుష్కరాలకు కదిలిన బస్సులు
కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాల కోసం రోడ్డు రవాణ సంస్థ బస్సులు శుక్రవారం కదిలాయి. ఉదయం 4 గంటల నుంచే సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు సాయంత్రం 6గంటల వరకు 122 బస్సులు వివిధ ప్రాంతాలకు నడపగా.. 6400 మంది భక్తులు ప్రయాణించారు. ఇందులో ప్రధానంగా శ్రీశైలానికి 66 బస్సులు నడపగా 2వేల మంది, సంగమేశ్వరానికి 65 బస్సుల్లో 2వేల మంది, నెహ్రూనగర్‌కు నాలుగు బస్సుల్లో 60 బస్సులు, బీచుపల్లికి 40 బస్సుల్లో 1500 మంది భక్తులు ప్రయాణించారు. అయితే కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేస్తున్న పుష్కర నగర్ పనులు పూర్తి కాలేదు. శుక్రవారం పుష్కరాలు ప్రారంభం అయినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి: ఆర్ఎం కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజరు గిడుగు వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీకి తగ్గట్లు బస్సులు నడిపేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టామని, ఇబ్బందులు ఉంటే సంబంధిత ఇన్‌చార్జీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీశైలం ఇన్‌చార్జీగా డీసీటీఎం మధుసూదన్ 91009 98217, కర్నూలు బస్‌స్టేషన్‌కు జోనల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రజియా సుల్తానా 99592 25753, లింగాలగట్టుకు వర్క్స్ మేనేజరు జగదీష్ 99592 25749, బీచుపల్లికి డీసీటీఎం శ్రీనివాసులు 99592 25788, సంగమేశ్వరానికి ఈడీ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి 73828 19666, ఆత్మకూరుకు కడప డీసీటీఎం మోహన్‌కుమార్ 99592 25768 నియమించామన్నారు. సమస్యల పరిష్కారం కోసం కర్నూలు ఏటీఎం ప్రసాద్ 73828 65444, కమర్షియల్ ఏటీఎం శ్రీనివాసు 99499 07306, ప్రొద్దుటూరు డీఎం హరి 99592 25777, ఎస్ఓ (డీఅండ్టీ) మహేశ్వర 90005 03580, సంగమేశ్వరం విచారణ కేంద్రం 73828 70216, బీచుపల్లి విచారణ కేంద్రం 99592 25805, జిల్లా ఓవరాల్ ఇన్చార్జీ ఆర్ఎం వెంకటేశ్వర రావు 99592 25787 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. -
సంగమేశ్వరం..భక్తి పారవశ్యం
– శాస్త్రోక్తంగా నదీమ తల్లికి హారతులు – తెల్లవారుజామున 5.45 నిమిషాలకు ప్రారంభమైన పుష్కరాలు – తరలివచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు – తొలిరోజు పుష్కర స్నానమాచరించిన ప్రజాప్రతినిధులు – భక్తుల సేవలలో అధికార యంత్రాంగం సంగమేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి : సప్తనదుల కూడలి సంగమేశ్వర క్షేత్రం..భక్తిపారవశ్యంతో ఓలలాడింది. శుక్రవారం తెల్లవారుజామున 5.54 నిమిషాలకు వేదపండితులు నదీమ తల్లి కృష్ణమ్మకు పూజలు చేసి.. హారతులిచ్చి పుష్కరాలను ప్రారంభించారు. సంగమేశ్వర ఘాట్ వద్ద జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ హరికిరణ్, టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శివానందరెడ్డి తొలిసారిగా పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తుల సంఖ్య ఉదయం చాలా మందకొడిగా ఉండటంతో ఘాట్లు వెలవెలబోయాయి. అయితే ఈ సంఖ్య 11 గంటల తరువాత రానురాను పుంజుకోవడంతో కోలాహలం కనిపించింది. తొలిరోజు సాయంత్రం 6.10 గంటలకు పుష్కర స్నానాలను ముగించారు. డిప్యూటీ సీఎం గైర్హాజరు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన కృష్ణా పుష్కర ప్రారంభోత్సవ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. సంగమేశ్వర క్షేత్రం వద్ద డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులే పుష్కరాలను ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల పుణ్యస్నానాలు సప్తనదీ సంగమేశ్వర క్షేత్రం వద్ద పుష్కర స్నానం ఆచరించేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐజయ్య క్షేత్రానికి చేరుకుని పుష్కర స్నానమాచరించారు. అనంతరం లలిత సంగమేశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. అక్కడ ఏర్పాట్లపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వీఐపీ ఘాట్ ఇక్కడ లేదా అంటూ కొత్తపల్లి తహశీల్దార్ నరసింహులును నిలదీశారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సతీసమేతంగా పుష్కరస్నానాలు ఆచరించి లలిత సంగమేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి పుష్కరిణిలో స్నానాలు చేశారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టి.. రాయలసీమ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించమని సంగమేశ్వరుడిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపారు. పరవశించిన భక్తులు.. సంగమేశ్వరంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు కష్ణానది పరవళ్ల సోయగాలను, సముద్రాన్ని తలపించేలా ఉన్న కృష్ణమ్మను చూస్తూ పరవశించిపోయారు. నిజంగానే నదీమ తల్లిలో స్నానం ఆచరించగానే తమ పాపాలు తొలగిపోయినట్లుగా భావన కలిగిందని మరికొందరు చెప్పుకోవడం జరిగింది. రాయలసీమ వాసులతోపాటు ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భక్తులు తరలివచ్చారు. జేసీ పర్యవేక్షణలో ఏర్పాట్లు.. సంగమేశ్వరం వద్ద భక్తుల కోసం చేపట్టిన పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో వాటిని పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. భక్తులెవరైనా తేలు, పాము కాటుకు గురైతే వారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించి.. అవసరమైతే జిల్లా కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సహాయ వైద్యాధికారి రాజా సుబ్బారావుకు సూచించారు. పుష్కరాలకు వచ్చే వికలాంగులను వలంటీర్లు జాగ్రత్తగా పుష్కర స్నానాలు చేయించి అదేక్రమంలో వారిని సురక్షితంగా వాహనాల్లో కూర్చోబెట్టాలన్నారు. అయితే అక్కడ పుష్కర విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు, సిబ్బంది అరకొర వసతులు కల్పించడం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో ఉన్న వారికి కనీసం మంచినీటిని అందించకపోవడంతో వారందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
పుష్కరాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
అనంతపురం న్యూసిటీ: పుష్కర భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని 12 ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్ఎం భట్టు చిట్టిబాబు తెలిపారు. విజయవాడకు రెగ్యులర్‌గా నడిపే 12 బస్సులతో పాటు మరో 15 బస్సులను అదనంగా పంపుతున్నామన్నారు. అలాగే కర్నూలుకు 25 ఎక్స్‌ప్రెస్ బస్సులు, విజయవాడకు 175 బస్సులు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో విజయవాడకు 100, కర్నూలుకు 75 బస్సులు కేటాయించామన్నారు. అనంతపురం బస్సులు బయలుదేరే సమయం డిపో ఉదయం సాయంత్రం అనంతపురం – విజయవాడ 6 గంటలకు 5 గంటలకు హిందూపురం–విజయవాడ 5 గంటలకు 5గంటలకు ఉరవకొండ–విజయవాడ 5 గంటలకు 7 గంటలకు తాడిపత్రి–విజయవాడ 7గంటలకు 6 గంటలకు గుంతకల్లు–విజయవాడ 8గంటలకు 8 గంటలకు కదిరి–విజయవాడ(ఈ బస్సు కదిరి నుంచే వెళ్తుంది.అనంతకు రాదు) 8 గంటలకు 8 గంటలకు పుట్టపర్తి 8.30 గంటలకు – అనంతపురం–శ్రీశైలం 6.గంటలకు – అనంతపురం–బీచుపల్లి 7గంటలకు – -
వసతులు లేవని ఆందోళన
శ్రీశైలం ప్రాజెక్టు : కృష్ణా పుష్కరాలలో 12 రోజులపాటు శ్రీశైలం పరిసర ప్రాంతాలలో వైద్య సేవలు అందించేందుకు శ్రీశైలం చేరుకున్న పారా మెడికల్ సిబ్బందికి వసతిని కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 150 మంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది లింగాలగట్టు, పాతాళగంగ, శ్రీశైలం,సున్నిపెంట ఇతర ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుఝాము నుంచి విధులకు హాజరయ్యేందుకు వివిధ ప్రాంతాల నుంచి గురువారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. పారా మెడికల్ సిబ్బందికి వసతిని కేటాయించకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. -
లక్ష లడ్డూలు సిద్ధం
మహానంది(కర్నూలు): కృష్ణా పుష్కరాల సందర్భంగా మహానంది క్షేత్రానికి భక్తులరద్దీ పెరుగుతుందన్న అంచనాల మేరకు లక్ష లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ కష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీశైలం, సంగమేశ్వరం క్షేత్రాలకు భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుందన్నారు. రెండు పుణ్యక్షేత్రాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు మహానందికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందులో భాగంగా మహానంది క్షేత్రంలో 12 నుంచి 23 వరకు ప్రతి రోజూ పదివేల లడ్లు సిద్ధంగా ఉండేలా చూస్తామన్నారు. భక్తులకు ప్రసాదాల కొరత రానివ్వమన్నారు. అలాగే గత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి వెళ్లి గోదావరి జలాలు తెచ్చి భక్తులకు పవిత్ర తీర్థంగా పంపిణీ చేశామన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు అందజేస్తే ఈ ఏడాది కూడా అలాగే పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
జీడిపల్లికి చేరిన కృష్ణమ్మ
పుష్కర స్నానానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నేటి ఉదయం ఏడు గంటలకు విగ్రహ ప్రతిష్ట, పూజలు అత్యవసరమైతే... ఏదైనా సమస్య తలెత్తితే అత్యవసర సహాయం కోసం బెళుగుప్ప తహశీల్దారు చలపతి తన సిబ్బందితో అందుబాటులో ఉంటారు. ఆయన సెల్ నంబర్ 9493188847. ఇలా చేరుకోవాలి.. ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలంలో జీడిపల్లి జలాశయం ఉంది. అనంతపురం– కళ్యాణదుర్గం మార్గంలో ఆత్మకూరు దాటిన తరువాత కాల్వపల్లి వస్తుంది. అక్కడి నుంచి ఆటోల్లో జీడిపల్లి జలాశయం చేరుకోవచ్చు. అనంతపురం– కళ్యాణదుర్గం మధ్య ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. అనంతపురం అర్బన్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జీడిపల్లి జలాశయంలో గురువారం అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 23న ముగుస్తాయి. ఈ తరుణంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి జలాశయం వద్ద పుష్కర స్నానాలు చేసేందుకు అధికారులు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కృష్ణమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి.. పూజలు నిర్వహిస్తారు. అనంతరం పుష్కరాలను ప్రారంభిస్తారు. పుష్కర పూజలు చేసేందుకు నలుగురు పురోహితులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తుల రద్దీని బట్టి మరో ఘాట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం షామియానా వేసి 200 కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. లైటింగ్ కూడా ఉంటుంది. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినా చికిత్స అందించేందుకు వైద్యులు, సిబ్బంది, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుతున్నారు. రక్షణ కోసం ఘాట్ వద్ద పది మంది గత ఈతగాళ్లను ఉంచుతున్నారు. పుష్కర స్నానాలు ఆచరించిన తరువాత మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. పెద్దలకు పిండ ప్రదానం చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక బస్సులు నడిపితే మేలు జీడిపల్లి జలాశయం వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపితే భక్తులకు అనుకూలంగా ఉంటుంది. భక్తులు పూజా సామగ్రితో వెళతారు. ఈ క్రమంలో కాల్వపల్లి వద్ద దిగి ఆటోలో జలాశయానికి చేరుకోవడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రత్యేక సర్వీసులు నడిపితే వారు నేరుగా జలాశయం వద్దకు చేరుకుంటారు. -
కృష్ణా పుష్కరాలకు 665 ప్రత్యేక రైళ్లు
నూనెపల్లె: కృష్ణా పుష్కరాలకు భక్తుల రద్దీ దృష్ట్యా 665 ప్రత్యేక రైళ్లు వేశామని సౌత్ సెంట్రల్ రైల్వే సీఓఎం(చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్) మధుసూదన్ రావు తెలిపారు. నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వేలైన్ పరిశీలినకు వచ్చిన ఆయన గురువారం నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భక్తులకు 13 రోజుల పాటు సేవలు కొనసాగిస్తామన్నారు. ప్రత్యేక రైళ్లలో 150 రిజర్వు›్డ రైళ్లు, 490 నాన్ రిజర్వేషన్ రైళ్లు ఉంటాయన్నారు. అన్ని రైళ్లకు 180 పైగా అదనపు భోగీలు వేస్తున్నామన్నారు. కృష్ణా కెనాల్, రాయనపాడు, సిరిపురం, బద్వేల్ మార్గాల్లో రైళ్లు నడుస్తాయన్నారు. రైళ్ల రాకపోకలపై 24 గంటల పర్యవేక్షణ ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రద్దీ దష్ట్యా క్రాసింగ్, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తామన్నారు. భక్తుల భద్రత కోసం ఆర్పీఎఫ్, జీఆర్పీ, మెడికల్ కిట్లు, క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పుష్కర ఘాట్లు, రైలు మార్గాలు తెలుసుకునేందుకు రైల్వేశాఖ ఆధ్వర్యంలో సౌత్‌సెంట్రల్ రైల్వే కృష్ణా పుష్కరాల వెబ్సైట్ తెరిచామని.. ఇందులో హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌లో రైళ్ల వివరాలు ఉంటాయన్నారు. -
పుష్కర సన్నద్ధం
– ముస్తాబైన శ్రీశైల క్షేత్రం – పార్కింగ్ స్థలాలు ఏర్పాటు – అందుబాటులో పుష్కర నగర్లు – పిండప్రదానానికి ప్రత్యేక స్థలాలు శ్రీశైలం కృష్ణా పుష్కరాలకు శ్రీశైల మహాక్షేత్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 5.30గంటలకు పాతాగంగవద్ద కృష్ణవేణీ మాతకు పూజాధికాలు చేసి సారెను సమర్పిస్తారు. కృష్ణా జలాలతో పాతాళగంగ మెట్లపై భాగాన ఉన్న పాతాళేశ్వరస్వామిని అభిషేకించిన అనంతరం నందిమండపంలో నందీశ్వరుడికి అభిషేకాది అర్చనలను చేస్తారు. ఆ తరువాత క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామికి కృష్ణాజలాలతో అభిషేకించాక స్వామివార్లకు పుష్కర జలాలతో అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పుష్కరాల సందర్భంగా శ్రీగిరి కొత్త శోభను సంతరించుకుంది. భక్తుల కోసం జిల్లా అధికార యంత్రాంగం, శ్రీశైలదేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. – బస్సుల ద్వారా శ్రీశైలం చేరుకునే యాత్రికులు టోల్గేట్ వద్ద దిగాల్సి ఉంటుంది. – టోల్గేట్ ద్వారా చేరుకున్న వాహనాలను యజ్ఞవాటిక వైపునకు మళ్లిస్తారు. – యజ్ఞవాటిక వద్ద పుష్కరనగర్(1)ని నిర్మించారు. భోజన, లాకర్ సౌకర్యాలతో పాటు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ 24గంటలు ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉంటుంది. సుమారు 10వేల చదరపు విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ పుష్కర నగర్లో రెండు వేల మంది కూర్చోవచ్చు, వెయ్యి మందికిపైగా విశ్రమించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. – యజ్ఞవాటిక ఖాళీ ప్రదేశాన్ని ఆంధ్ర, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సుల పార్కింగ్ కేటాయించారు. – పుష్కర్ నగర్ 1 నుంచి రింగ్‌రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించి మల్లమ్మ కన్నీరు వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. – హెలిపాడ్ వద్ద సుమారు రూ. 50లక్షల వ్యయంతో నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఫుడ్‌కోర్టు, లాకర్లు, మంచినీరు, క్లాక్‌రూమ్, ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో 10వేల చదరపు విస్తీరణంలో పుష్కరనగర్2 నిర్మిస్తున్నారు. – పాతాళగంగ రోడ్డులో శివదీక్షా శిబిరాలవ ద్ద తాత్కాలికంగా షామియానాలను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. – సర్వతోభద్రవనంలో క్షేత్రవ్యాప్తంగా ఉన్న సత్రాల సంఘాలు అన్ని కలిపి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. – దేవస్థానం వైద్యశాలలో అత్యవసర వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. 30 పడకల అసుపత్రిని కూడా అందులోనే ఏర్పాటు చేశారు. – పీజీరోడ్డులో ఉన్న పీహెచ్సీ సెంటర్‌ను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. – పాతాళగంగ పుష్కరఘాట్ చేరుకోవడానికి ఘాట్ రోడ్డు ద్వారా వెళ్లడం ఒక మార్గం. రెండో మార్గం పాతాగంగ రోడ్డు నుంచి నేరుగా మెట్ల ద్వారా ఘాట్లను చేరుకోవచ్చు. పుష్కర ఘాట్ల సమీపంలో 108 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. – భద్రతా కారణాల దష్ట్యా రోప్‌వేను పూర్తిగా నిలిపివేశారు. – భ్రమరాంబాఘాట్ వద్ద పిండప్రదానానికి ఒకప్రదేశాన్ని, ఒక ప్లాట్‌పాం, ఒక దుస్తులు మార్చుకునే గదిని ఘాట్ పై భాగాన ఏర్పాటు చేశారు. దానికి సమీపంలోనే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘాట్ వద్ద ఎలాంటి టాయిలెట్స్ నిర్మించలేదు. ఈ ఘాట్‌ను వీఐపీలకు మాత్రమే వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. –మల్లికార్జున పుష్కరఘాట్ పైభాగంపైన కొద్ది దూరంలో పిండప్రదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానికి సమీపంలోనే దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ప్రథమచికిత్స కేంద్రం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఘాట్‌లో స్నానాలు చేసుకున్న భక్తులు పాతాళగంగ పాతమెట్ల మార్గం ద్వారా తిరిగి పై భాగానికి చేరుకుంటారు. – పాతాళగంగ వద్ద లైఫ్బోట్లు, లైఫ్ జాకెట్లు, అగ్నిమాపక సామగ్రితో ఫైర్‌సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు. – స్వచ్ఛంద సేవాకర్తల సేవలను వినియోగించనున్నారు. -
పుష్కర సన్నద్ధం
-
పుష్కరనగర్లు సిద్ధం
కర్నూలు(అగ్రికల్చర్): పుష్కర భక్తుల కోసం కర్నూలులో పుష్కరనగర్లు సిద్ధం అయ్యాయి. భక్తులు ప్రధానంగా వేచి ఉండే కొత్త బస్టాండు, రాజ్ విహార్ సెంటర్( అంబేద్కర్ భవన్ ఎదుట), నంద్యాల చెక్‌పోస్టులో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి పుష్కరనగర్‌లో ఒక డాక్టర్, పారా సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. భక్తులను అలరించేందుకు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. స్రీలు, పురుషులకు వేరువేరుగా టాయ్‌లెట్స్ వసతి కల్పించారు. ఒక్కో పుష్కరనగర్‌లో పురుషులకు 100, స్త్రీలకు 100 టాయ్‌లెట్స్ వసతి ఉంటుందని అధికార యంత్రాంగం ప్రకటించింది. భక్తులకు తాగు నీరు, స్నాక్స్ లభిస్తాయి. స్నాక్స్ కొనుగోలుపై ఇస్తారు. పుష్కరనగర్లకు ఏరియా ఆఫీసర్లు, ఆయన కింద ప్లేస్ ఆఫీసర్లు ఉంటారు. -
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
శ్రీశైలం: కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీఐజీ రమణకుమార్ ఆదేశించారు. గురువారం ఉదయం పుష్కరనగర్ 1 ప్రాంగణంలో ఓఎస్డి రవిప్రకాశ్, ట్రాఫిక్ డీఎస్పీలు రామచంద్ర, వినోద్‌కుమార్‌లతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఏ సెక్టార్, బీ సెక్టార్లుగా ట్రాఫిక్‌ను విభజించామని, ఆయా సెక్టార్లలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు, అదనపు ఎస్పీ ట్రాఫిక్ ఇన్చార్జి, ఓఎస్డి రవిప్రకాశ్‌కు సమాచారం అందజేయాలన్నారు. సమావేశానంతరం ఆయన ట్రాఫిక్ పోలీసులకు అత్యవసర మైన మందులు ఉచితంగా అందజేశారు. -
రేపు శ్రీశైలంలో పుష్కర ప్రారంభ పూజ
శ్రీశైలం: కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభమవుతుండడంతో అదేరోజు వేకువజామున దేవస్థానం వారు పాతాళగంగ నదీమాతల్లికి ప్రథమ పూజ నిర్వహించడానికి ఉదయం 5.30గంటలకు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. అర్చకులు, వేదపండితుల సలహా మేరకు వేకువజామున 4గంటలకు ఆలయ రాజగోపురం నుంచి మంగళవాయిద్యాలతో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధికారులు పూజాద్రవ్యాలు, వస్త్రాలను తీసుకుని ఆలయం నుంచి బయలుదేరుతారని అన్నారు. ఆ తరువాత కార్యక్రమ వివరాలు ఇవి... శుక్రవారం ఉదయం 5.30గంటలకు... నదీమాతల్లికి పూజాధికాలు, సారె సమర్పణ 6.40గంటలకు కృష్ణానదీ జలాలతో పాతాళేశ్వరస్వామికి అభిషేకం 7గంటలకు కృష్ణానదీ జలాలచే నంది మండపంలోని నందీశ్వరుడికి అభిషేకాది అర్చనలు 7.25 గంటలకు క్షేత్రపాలకుడైన వీరభద్ర స్వామికి కష్ణా జలంతో అభిషేకం 7.40గంటలకు కృష్ణా జలాలతో ఆలయ ప్రదక్షిణ చేసి శ్రీమల్లికార్జున స్వామివార్లకు ఆజలంతో అభిషేకాది ప్రత్యేక పూజలు -
శిరస్నానం..పవిత్రత ప్రధానం
కృష్ణా పుష్కరాల్లో నదీస్నానమాచరించండానికి చాలా మంది ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. స్నానమెలా ఆచరించాలో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు.. – పవిత్రమైన హృదయంతో నది దగ్గరకు చేరుకోవాలి. – తీరం నుంచి నదికి నమస్కరించాలి – నదిని, తీరాన్ని పవిత్రంగా ఉంచాలి.. – మొదటగా పవిత్ర నదీ జలాలను శిరస్సుపై చల్లుకొని స్నానానికి ఉపక్రమించాలి. – వీలైతే సమంత్ర పూర్వకంగా సంకల్పం చెప్పుకొని (చెప్పించుకొని) స్నానం చేయాలి. – లేదంటే తమ గోత్రనామాలను చెప్పుకుని ‘‘కృష్ణా కృష్ణా కృష్ణా’’ అని మూడుసార్లు నదిని స్మరించి స్నానం చేయాలి. –ఖచ్చితంగా శిరస్నానం చేయాలి. – నదిలో సూర్యుడికి మూడు అర్ఘ్యములనివ్వాలి. – స్నానమైన తర్వాత శుభ్రమైన పొడిబట్టలను కట్టుకొని కుంకుమ ధరించాలి. – కృష్ణానదీమ తల్లిని పూజించి వాయనం సమర్పించాలి. – ఒడ్డున ఉన్న లేదా దగ్గరలో ఉన్న దేవాలయాలను తప్పక దర్శించాలి. – యథాశక్తి ధానధర్మాలను ఆరచించాలి. – పుష్కర సమయంలో పెద్దలకు పిండప్రదానము ఆచరించాలి. – పిండ ప్రదానినికి ఆకులతో తయారు చేసిన విస్తరాకులనే ఉపయోగించాలి. – శ్రాద్ధమైన తదుపరి తప్పక పిండములను నదిలో నిమజ్జనం చేయాలి. – నది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. – పవిత్ర కృష్ణాపుష్కర జలాలను ఇంటికి తీసుకెళ్లి పూజా మందిరంలో ఉంచి నిత్యం పూజించాలి. – కర్నూలు(న్యూసిటీ) -
రెడ్ అలర్ట్
రద్దీ ప్రాంతాలో విస్తృత తనిఖీలు – ఛత్తీస్‌ఘడ్ నుంచి అసాంఘిక శక్తులు జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల హెచ్చరిక – డీజీపీ కార్యాలయ ఉత్తర్వులతో ఎస్పీ అప్రమత్తం – పుష్కరాలు, స్వాతంత్య్ర వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన కర్నూలు: ఉగ్రవాదుల కదలికలపై జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా పుష్కరాలు, పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి అసాంఘిక శక్తులు జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో ఎస్పీ ఆకె రవికష్ణ రెడ్అలర్ట్ ప్రకటించారు. పుష్కర బందోబస్తు విధుల్లో భాగంగా శ్రీశైలం వెళ్తుండగా, బుధవారం సాయంత్రం డీజీపీ కార్యాలయం నుంచి ఎస్పీకి ఉత్తర్వులు అందడంతో వెంటనే కర్నూలుకు చేరుకొని నగరంలోని పోలీసు అధికారులతో డీపీఓలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. భద్రత విషయాలపై పోలీసు అధికారులు ప్రతి కానిస్టేబుల్‌కు బ్రీఫింగ్ ఇవ్వాలన్నారు. జిల్లాకు వచ్చే వీవీఐపీలకు రక్షణ కల్పించాలన్నారు. నగరంలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి మెరుగుపర్చాలని డీఎస్పీ రమణమూర్తికి సూచించారు. వజ్ర వాహనంతో నగరంలో కవాతు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అనుమానితులు కనిపిస్తే సమీపంలోని పోలీసులకు, డయల్ 100, పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లకు కానీ సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెక్‌పోస్టుల్లో వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, హైవే ఢాబాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అంతకుముందు పెరేడ్ మైదానంలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు, రిహార్స్ను ఎస్పీ పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ రమణమూర్తి, సీఐలు శ్రీనివాసులు, ములకన్న, నాగరాజురావు, మహేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐలు మోహన్‌రెడ్డి, రఘురాముడు, శివయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు. నగరంలో విస్తృత తనిఖీలు ఎస్పీ ఆకె రవికష్ణ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో బుధవారం నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐలు ములకన్న, నాగరాజు రావు, మహేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రావు సిబ్బందితో వారి స్టేషన్ల పరిధితో పాటు రైల్వే స్టేషన్, కొత్తబస్టాండు, రాజ్‌విహార్, మౌర్యాఇన్ సర్కిల్ ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు నిర్వహించారు. -
‘అనంత’లోనూ పుష్కర స్నానం
= శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవాకు మొదలైన ఎత్తిపోతలు = జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరనున్న కృష్ణా జలాలు = ఇక్కడే పుష్కర స్నానానికి అవకాశం = కృష్ణా నీళ్లు పారే ప్రతిచోట పుష్కరుడు ఉంటారంటున్న పండితులు మీరు ఇంటిల్లిపాది పుష్కర స్నానం చేసేందుకు సిద్ధమవుతున్నారా? విజయవాడకు గానీ, మరొక ప్రాంతానికి గానీ వెళ్లి కృష్ణానదిలో స్నానం చేసేందుకు సమయం, ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా? అయితే.. ఆ చింత అక్కర్లేదు. కృష్ణమ్మ మన చెంతకే వస్తోంది. మన జిల్లాలోనే పుష్కర స్నానం ఆచరించే అవకాశముంది. సాక్షిప్రతినిధి, అనంతపురం : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్ (కృష్ణా జలాలు)ను మల్యాల వద్ద హంద్రీ–నీవా కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ జలాలు కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి, పత్తికొండ మీదుగా 216 కిలోమీటర్లు ప్రయాణించి మన జిల్లాలోని బెళుగుప్ప మండల పరిధిలో గల జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరతాయి. మల్యాల వద్ద నీటి ఎత్తిపోతల ఈ నెల ఐదు నుంచి మొదలైంది. మరో నాలుగు నెలల పాటు ఈ నీరు నిరంతరాయంగా ప్రవహిస్తుంది. హంద్రీ–నీవా ప్రధాన కాలువతో పాటు కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి, పత్తికొండ జలాశయాల్లో నిల్వ ఉంటుంది. అలాగే జీడిపల్లి రిజర్వాయర్‌లోనూ తొణికిసలాడుతుంది. ఈ నెల 12 నుంచి కృష్ణాపుష్కరాలు మొదలు కానున్నాయి. 23వ తేదీ వరకూ కృష్ణాజలాల్లో పుష్కరస్నానాలు ఆచరించవచ్చు. లక్షలాది మంది ఈ పుణ్యస్నానాలను ఆచరిస్తారు. మన జిల్లా నుంచి కూడా పుష్కరస్నానాలు చేసేందుకు చాలామంది సిద్ధమయ్యారు. అయితే.. వీరంతా శ్రీశైలం, సంగమేశ్వరం, విజయవాడ లాంటి సుదూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో స్నానాలు చేయొచ్చు. ఎందుకంటే ఈ నెల 12– 23 వరకూ కృష్ణాజలాల్లో పుష్కరుడు ఉంటాడు. మన జిల్లాకు వచ్చే కృష్ణాజలాలు కూడా నిత్యం పారుతూ ఉంటాయి.. కాబట్టి ఇక్కడే పుష్కరస్నానాలు ఆచరించవచ్చు. ప్రధాన కాలువలో తస్మాత్ జాగ్రత్త! హంద్రీ–నీవా ప్రధాన కాలువ 10 అడుగులకు పైగా లోతులో ఉంది. ఎక్కడా దిగేందుకు మెట్లు కూడా లేవు. ఈ కాలువలో స్నానం కోసం దిగితే ప్రమాదం తలెత్తే అవకాశముంది. కాబట్టి జీడిపల్లి లాంటి అనువైన ప్రాంతాలలో స్నానం ఆచరిస్తే మంచిది. జిల్లా యంత్రాంగం కూడా మన జిల్లాలో జీడిపల్లితో పాటు హంద్రీ–నీవా కాలువ ప్రవహించే ప్రాంతాల్లో స్నానానికి యోగ్యమైన ప్రాంతాలను ఎంపిక చేస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. లక్షణంగా పుష్కర స్నానాలు చేయొచ్చు కృష్ణాపుష్కరాలు ఎంతో పవిత్రమైనవి. కృష్ణాజలాలు ఏయే పాయలలో, ప్రాంతాలలో ప్రవహిస్తాయో అక్కడ పుష్కరస్నానం చేయొచ్చు. హంద్రీ–నీవా సుజలస్రవంతి అని పేరు ఉన్నా...అందులో ప్రవహించేది కృష్ణాజలాలే! కాబట్టి విజయవాడకు వెళ్లలేని సామాన్య, మధ్య తరగతి ప్రజలే కాదు.. ‘అనంత’ వాసులందరూ మన జిల్లాలోనే పుష్కరస్నానం ఆచరించవచ్చు. – శివకుమార్ సిద్ధాంతి కృష్ణానీరు పారే ప్రతిచోట పుష్కరుడు ఉంటాడు కృష్ణాజలాలు పారే ప్రతిచోట పుష్కరుడు ఉంటాడు. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా ఎంత వరకూ జలం పారుతుందో అక్కడి వరకూ పుష్కరుడు ఉంటాడు. – బాలాజీ శర్మ, ప్రముఖ సిద్ధాంతి పండితులతో చర్చిస్తాం జీడిపల్లి రిజర్వాయర్‌లో కృష్ణాపుష్కరాలు చేస్తారా, లేదా అనే విషయం నాకు తెలీదు. పండితులను పిలిపించి మాట్లాడతా. పుష్కరాలు చేయొచ్చని నిర్ధారిస్తే అక్కడ భక్తులకు అవసరమైన ఘాట్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తాం. దీనిపై అధికారులతో కూడా చర్చిస్తాం. – కోన శశిధర్, కలెక్టర్ -
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
మహానంది: పుష్కరాల సందర్భంగా సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని సంగమేశ్వరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కమలాకర్ తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మహానంది క్షేత్రం నుంచి ప్రసాదాల నిమిత్తం అందించాల్సిన చెక్కు కోసం ఆయన సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సంగమేశ్వరంలో పిండప్రదానాలు, ఇతర పూజాధికాలకు 97 మంది అర్చకులు ఉంటారన్నారు. కపిలేశ్వరం వద్ద వాహనాలను పార్కింగ్ ఉంటుందని, అక్కడి నుంచి ఘాట్ల వరకు 60 సెట్విన్ బస్సులను ఉచితంగా నడుపుతారన్నారు. సంగమేశ్వరంలో రెండు ఫుడ్‌కోర్టులు, ఆత్మకూరులో ఒక ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేస్తున్నారన్నారు. భక్తులకు సేవలందించేందుకు 500 మంది వలంటీర్లు ఉంటారని, దేవాదాయశాఖ నుంచి వివిధ కేడర్లలో ఉన్న 51 మంది సిబ్బంది వస్తారన్నారు. ఆలయం ఆధ్వర్యంలో పది వీల్చెయిర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. -
‘బీచుపల్లి’ ప్రయాణం భారమే!
– ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించని తెలంగాణ – కర్నూలు నుంచి సమీపంలో ఉన్న ఘాటు అదే – శ్రీశైలం కంటే రెట్టింపు భక్తులు వెళ్తారని ఆర్టీసీ ప్రణాళిక కర్నూలు(రాజ్‌విహార్): బీచుపల్లి పుష్కర ఘాట్‌కు ప్రయాణం భారం కానుందా... ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఆలయ, ఘాటు సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, స్టాపింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. కర్నూలుకు సమీపంలో ఉన్న పుష్కర ఘాటు కావడంతో స్థానిక అధికారులు రోజుకు 40 బస్సులు ప్రత్యేకంగా నడిపేందుకు చర్యలు చేపట్టారు. గత వారం పది రోజుల నుంచి ఇక్కడి అధికారులు తమ సర్వీసులకు స్థలం కేటాయించాలని విన్నపాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. శ్రీశైలంతోపాటు సంగమేశ్వరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులు పూర్తి స్థాయి కాకపోవడం, దూర ప్రయాణం వంటి కారణాలతో భక్తులు బీచుపల్లికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి బీచుపల్లికి ప్రతి రోజు 40 బస్సులు చొప్పున నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీసీటీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. మురుగుతున్న నిధులు: బీచుపల్లి వద్ద పార్కింగ్‌కు స్థలం కేటాయించకపోవడంతో నిధులు మురుగుతున్నాయి. అక్కడ పలు అభివద్ధి పనులు చేపట్టేందుకు రూ.5లక్షలు మంజూరయ్యాయి. శాటిలైట్ బస్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు పష్కరాలకు వచ్చే భక్తులకు సమాచారాన్ని అందించేందుకు అనౌన్స్మెంట్ సెంటర్, ముత్ర శాలలు, మరుగదొడ్లు, వలంటీర్లు ఉండే సెంటర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బస్సుల సౌకర్యార్థం రోడ్డు చదును, విస్తరణ పనులు చేసుకోవాల్సి ఉంది. -
శ్రీశైలం రోప్‌వే 12వ తేదీ వరకు బంద్
సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో పాతాళాగంగకు వెళ్లే రోప్‌వే మార్గాన్ని ఈ నెల 12వ తేదీ వరకు బంద్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్ వద్ద కొండ చరియలు విరిగిపడిన విషయం విదితమే. భద్రతా చర్యల్లో భాగంగా రోప్‌వే మార్గాన్ని నాలుగు రోజులపాటు మూసివేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మర్మతుల పేరిట రోప్‌వే మార్గాన్ని మూసివేసినట్లు టూరిజం అధికారులు ప్రకటించారు. అయితే 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా వీవీఐపీలకు మాత్రమే రోప్‌వే మార్గం గుండా పాతాళాగంగ వీఐపీ ఘాట్‌కు చేరుకునేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. వద్ధులు, వికలాంగులను.. ప్రత్యేక బస్సుల ద్వారా పాతాళాగంగ వద్దకు తరలించనున్నారు. -
అడిగేదెవరు!
కృష్ణా జలాల్లో సీమ వాటా ఎంత? – మొన్న తాగునీటికని 10, నేడు పుష్కరాల పేరుతో మరో 5 టీఎంసీలకు ఎసరు – గుండ్రేవుల డీపీఆర్‌పై నోరు మెదపని అధికార పార్టీ నేతలుl – తుంగ నీటిపై కేసీ, దిగువ రైతుల్లో దిగాలు – గత రెండేళ్ల తీర్మానాలను ప్రభుత్వానికి పంపని అధికారులు – నేడు సాగు నీటి సలహా మండలి సమావేశం జిల్లా ఆయకట్టుదారులకు తుంగభద్ర, కృష్ణానదులు ఆధారం. అయితే, పాలకులు చూపుతున్న వివక్షతో ఈసారి ఆయకట్టు సాగు చేస్తామో...లేదోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. తుంగభద్ర నది పరివాహాక ప్రాంతంలో ఆశించిన మేరా వర్షాలు కురవలేదు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఇక కృష్ణమ్మ మాత్రం బిర బిర మంటున్నా కరువు సీమ గొంతు తడపకముందే దిగువకు తరలిస్తున్నారు. కష్ణా జలాల్లో రాయల సీమ జిల్లాలకు రావాల్సిన వాటా ఎంత? అని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అధికారపార్టీకి చెందిన జిల్లా నేతలు అధికారులపై చిందులు వేసి చేతులు దులుపుకుంటున్నారు. నేటి ఐఏబీ సమావేశంపై ఆశలు మంగళవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2016–17 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సాగు నీటి కాల్వలకు ఖరీఫ్ సీజన్లో ఇచ్చే నీరు, సాగుపై నీటిపారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనైనా సీమకు కృష్ణా జలాల్లో రావాల్సిన వాటా నీటిపై, దిగువ నీటి జల చౌర్యంపై, హంద్రీనీవా నుంచి ట్యాంకులకు నీటిని నింపేందుకు 155 కోట్ల ప్రతిపాదనలపై, గుండ్రేవుల ప్రాజెక్టు కోసం 2300 కోట్లతో పంపిన డీపీఆర్(డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) మంజూరు చేయకపోవడంపై నేతలు గళమెత్తి...జల వాటా సాధిస్తారని ఆయకట్టుదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కర్నూలు సిటీ: కృష్ణా జలాలతో ఒకప్పుడు కళ కళలాడిన పంట భూములు నేడు బీళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం కర్నూలు, కడప జిల్లాల్లోనే సుమారు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. జలాల్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 118 టీఎంసీల నీరు కేటాయించింది. ఇందులో 48 టీఎంసీలు నికర జలాల వాటాగా, మిగిలిన 70 టీఎంసీల నీరు వరద జలాల వాటా ఉంది. మొదటగా సీమకు రావాల్సిన 48 టీఎంసీల నికర జలాలు ఇచ్చిన తర్వాతనే దిగువన ఉన్న సాగర్‌కు నీటిని విడుదల చేయాలి. ఈ నీరు సీమ జిల్లాలకు రావాలంటే శ్రీశైలం డ్యాంలో కనీస నీటి మట్టం 854 అడుగుల మేరకు నీరు ఉండాలి. కానీ 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ 69 జీఓ తీసుకువచ్చారు. ఈ జీఓతో రాయల సీమ జిల్లాలకు కనీసం నికర జలాల వాటా కూడా రావడం లేదు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక 2004లో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా 107 జీఓ తీసుకువచ్చారు. ఈ జీఓను 2010 నుంచి సక్రమంగా అమలు చేయడం లేదు. దీంతో 69 జీఓను సాకు చూపి «శ్రీశైలం నీటిని 790 అడుగుల వరకు తాగునీటి అవసరాల పేరుతో దిగువకు తీసుకుపోతున్నా కర్నూలు జిల్లా నుంచి అడిగేవారు కరువయ్యారు. గతేడాది 790 అడుగుల వరకు నీటిని సాగర్‌కు తీసుకుపోయారు. కానీ రాయల సీమలో నెలకొన్న తాగు నీటి ఎద్దడి గురించి మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది కూడా 790 అడుగుల వరకు నీటిని తీసుకుపోయేందుకు త్రెషోల్డ్ లెవెల్ అనే పేరును ఇటీవల కష్ణా బోర్డు మీటింగ్‌లో తీసుకువచ్చారు. శ్రీశైలంలో కనీస నీటి మట్టానికి కూడా చేరకముందే తాగు నీటి పేరుతో 7 టీఎంసీలు డెల్టాకు, 3 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. మరో సారి పుష్కరాల పేరుతో మరో 5 టీఎంసీలను సాగర్‌కు తరలించేందుకు కష్ణా బోర్డు అనుమతి తీసుకున్నారు. నేడో, రేపో పవర్ ఉత్పత్తి ద్వారా20 వేలు, గేట్లు ఎత్తి మరో 30 వేల క్యుసెక్కుల నీరు దిగువకు వదలనున్నారు. ఇప్పటికైనా సీమ నేతలు మేల్కోకుంటే ఈ ఏడాది ఆయకట్టురైతులక మిగిలేది కన్నీళ్లే. 6.3 టీఎంసీలతో సరిపెట్టే ఎత్తుగడ...! పట్టిసీమ పూర్తి అయ్యాక..కష్ణాడెల్టాకు శ్రీశైలం నీరు అవసరం లేదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ తాగునీటి పేరుతో 10 టీఎంసీలు, పుష్కరాల పేరుతో మరో 5 టీఎంసీలకు ఎసరు పెట్టారు. ఇప్పటి వరకు డెల్టాకు పట్టిసీమ ద్వారా 6.3 టీఎంసీల నీరు ఇచ్చామని, అంతే మొత్తంలో 6.3 టీఎంసీలు రాయల సీమ ప్రాజెక్టులకు ఇస్తామని ఇటీవల మంత్రి ప్రకటన చేశారు. వాస్తవంగా శ్రీశైలంలో నీటి మట్టం పెరగడంతోనే నీటిని వదిలారు. అయితే దిగువకు నీటిని వదిలేసి 6.3 టీఎంసీల నీటితోనే సీమకు పరిమితం చేసేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. గత సమావేశాల్లో తీర్మానాలకే సరి...! గత రెండేళ్ల ఖరీఫ్ సీజన్లో నిర్వహించిన నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశాల్లో చేసిన తీర్మానాలేవి నేటికి అమలుకు నోచుకోలేదు. వాస్తవంగా ఈ సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఐఏబీ చైర్మన్‌గా వ్యవహారించే కలెక్టర్ ప్రభుత్వానికి పంపించాలి. అయితే ఏ ఒక్క తీర్మారం కూడా ప్రభుత్వానికి పంపించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో తుంగభద్రపై నిర్మిస్తామన్న గుండ్రేవుల ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేసి రెండేళ్లు గడిచినా...నాలుగు సార్లు ఐఏబీలో తీర్మానం చేసినా అతీగతీ లేదు. ఇక వేదావతి, జోలదరాశి ఊసే ఎత్తడం లేదు. కష్ణా జలాల్లో సీమ న్యాయం జరగాలంటే కష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో పెట్టాలని డిమాండ్ ఉన్నా నేతలు పట్టించుకోవం లేదు. వీటిపై సభ్యులు సమావేశంలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని అన్నదాతలు కోరుకుంటున్నారు. -
కృష్ణార్పణం..!
– నీట మునిగిన పుష్కర పనులు – కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లపాలు – ప్రభుత్వానికి కొరవడిన ముందు చూపు – జల దిగ్బంధంలో సంగమేశ్వరం – వరదలో కొట్టుకుపోయిన నాణ్యత – పైకి తేలుతోన్న నాసిరకం పనులు సాక్షి, కర్నూలు: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పుష్కర పనులు నీటిపాలయ్యాయి. కృష్ణమ్మ వరద తాకికి నిర్మాణాలు కొట్టుకుపోతున్నాయి. పదిహేను రోజుల క్రితం వరకు కృష్ణమ్మ ఎక్కడ అంటూ వేయి కనులతో వేచి చూశారు.. ఇప్పుడు.. ఇదిగో నేను రానే వచ్చానంటూ పరవళ్లలో నదీమతల్లి తరలి వచ్చింది. జూరాల నుంచి ఆదివారం సాయంత్రానికి 1.47 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు వెళ్తోంది. ఎగువనున్న ఆల్మట్టి నుంచి 1.62 లక్షల క్యూసెక్కులు.. నారాయణపూర్ జలాశయం నుంచి 1.49 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. దీంతో పుష్కరాలకు ఇంకా నాలుగు రోజులు ఉండగానే నది పరవళ్లు తొక్కుతోంది. పనుల్లో జాప్యం కారణంగా పుష్కర నిర్మాణాలు కృష్ణమ్మ వరదలో కొట్టుకుపోతున్నాయి. మరోవైపు..నాసిరకం పనుల జాడ పైకి తేలుతోంది. కొట్టుకుపోతున్న నిర్మాణాలు! కృష్ణా నదీ వరద నీటితో సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం మునిగిపోయింది. ఇక్కడ అభివృద్ధి పనులన్నీ నీటి పాలయ్యాయి. పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన టైల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. సిమెంట్ పూత కూడా కొట్టుకుపోయింది. సరైన ప్రణాళిక వేసుకోకపోవడం.. ముందస్తు అంచనా లేకపోవడంతో నష్టం వాటిల్లినటై ్లంది. శ్రీశైలం డ్యాం దిగువన ఉన్న లింగాలగట్టు లోలెవల్ ఘాట్ కాంక్రిటు నిర్మాణాలు నీటిలో మునిగిపోయాయి. నీళ్లు ఉండగా సిమెంట్ నిర్మాణాలు చేపట్టడంతో కొట్టుకుపోతున్నాయి. నాణ్యతకు తూట్లు! కష్ణా పుష్కర పనులకు చాలా ఆలస్యంగా ఏప్రిల్ 7న పాలనామోదం లభించింది. నామినేషన్ పద్ధతిలో పనులు చేజిక్కించుకునేందుకు ఆలస్యం చేశారనే విమర్శలు వచ్చాయి. లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్న అంచనాలతో ప్రభుత్వం జిల్లాలో పుష్కర పనుల కోసం దాదాపు రూ. 160 కోట్లకుపైగా నిధులు వెచ్చించింది. అయితే పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం.. హడావుడి చేపట్టండటంతో పనుల్లో నాణ్యత లోపించింది. వరద నీటిలో నాణ్యత కొట్టుకుపోయింది. వర్షంతో అవస్థలు.. వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో పుష్కర పనులకు ఆటంకం కలుగుతోంది. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులకు చెదురు మదురు వర్షాలు అడ్డంకిగా మారతున్నాయి. టెండర్లు కొంత ముందుగా నిర్వహించి పనులు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. -
సా...గుతూనే!
– పూర్తికాని పుష్కర పనులు – ముంచుకొస్తున్న గడువు – ఘాట్లకు తొలగని విఘ్నాలు – శ్రీశైలం పురవీధుల్లో దర్శనమిస్తున్న బండరాళ్లు సాక్షి ప్రతినిధి,కర్నూలు: – శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ ఎగు వఘాట్. ఈ ఘాట్‌లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మెట్ల పనులు సాగుతున్నాయి. ఇరువైపులా ఇంకా రక్షణకు చర్యలు కూడా తీసుకోలేదు. – సమయం.. శనివారం ఉదయం 8 గంటలు. ఘాటు పనులు పూర్తికాలేదు. రాత్రింబవళ్లు పనిచేయాలని స్వయంగా జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ ఆదేశాలు. అయితే, లింగాలగట్టులోని ఎగువఘాటు వద్ద మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఘాటు వద్ద పనిచేస్తూ ఏ ఒక్కరూ కనిపించలేదు. – పాతాళగంగకు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతం. ఇక్కడ రక్షణ చర్యలను వెంటనే తీసుకోవాలని స్వయంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సూచించింది. అయితే, రక్షణ చర్యల పనులు ఇంకా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ చరియ విరిగిపడుతోందననే ఆందోళనతోనే కింద మాత్రం పనులు కానిచ్చేస్తున్నారు. – సున్నిపెంటలో ఏర్పాటు చేయతలపెట్టిన పుష్కరనగర్ ప్రాంతం. ఇక్కడ భూమిచదును పనులు మినహా ఏ ఒక్క పనీ మొదలుకాలేదు. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల పుష్కరాల పనులు మాత్రం ఇంకా సాగు..తూనే ఉన్నాయి. గడువు మీద గడువు... వాస్తవానికి పుష్కరాల పనులన్నింటికీ జూలై చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈలోగా పనులు పూర్తిచేయకపోతే చర్యలూ తప్పవని హెచ్చరించారు. అయితే, ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. అయితే పనుల్లో మాత్రం వేగం పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో 5వ తేదీ నాటికి ఘాట్ పనులను పూర్తిచేయాలని తాజాగా గడువు విధించారు. అయినప్పటికీ పనుల్లో కొంచెం వేగం పెరిగినప్పటికీ పూర్తికావాల్సిన పనులు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. తాజాగా ఈ గడువు కాస్తా 8వ తేదీకి పెరిగింది. అప్పటికీ పూర్తవుతాయనే నమ్మకం మాత్రం కలగడం లేదు. సబ్కాంట్రాక్టులతోనే సమస్య పుష్కరాల పనుల్లో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా దోచేసుకుంటున్నారు. అసలు కాంట్రాక్టర్‌ను కాదని... తమ అనుచరులకు సబ్ కాంట్రాక్టు పేరుతో పనులు తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారపార్టీకి దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు... అసలు కాంట్రాక్టు సంస్థ నుంచి కొంత మొత్తం పర్సంటేజీ ఇచ్చి పనులు తీసేసుకున్నారు. వాస్తవానికి ఈ పనులను చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కానీ, మనుషులు కానీ లేకపోవడంతోనే వీరందరూ టెండరులో పాల్గొనలేదు. అయినప్పటికీ అధికారపార్టీ ప్రాపకంతో సబ్ కాంట్రాక్టు పేరుతో పనులు సంపాదించుకున్నారు. వీరికి అనుభవం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీశైలంలోనూ ఇదే పరిస్థితి... పుష్కరాలకు ఒకవైపు శ్రీశైలం ముస్తాబవుతోంది. అయితే, గతంలో బహత్తర ప్రణాళిక కింద చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడు హడావుడిగా చేస్తున్న పనులను నిలిపివేశారు. ఇదే విధంగా నీటి సరఫరా వ్యవస్థ కోసం శ్రీశైలం పురవీధుల్లో తవ్విన రోడ్లను తాత్కాలికంగా పూడ్చేశారు. ఇక్కడ ఇప్పటివరకు రోడ్లు వేయలేదు. దీంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా మట్టితో పూడ్చిన తర్వాత మిగిలిన బండరాళ్లు ఎక్కడికక్కడ ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. -
8న పుష్కర ట్రయల్ రన్
· అడుగడుగునా సీసీ కెమెరాలు · మూడు పుష్కరనగర్లు, అన్నదాన కేంద్రాలు · రద్దీకనుగుణంగా దోర్నాల వద్దే వాహనాల నిలుపుదల శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో పుష్కర పనులు చివరి దశకు చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. బుధవారం సాయంత్రం పాతాళగంగ కొత్త పుష్కరఘాట్ (భ్రమరాంబాఘాట్), మల్లికార్జున పుష్కరఘాట్ల వద్ద జరుగుతున్న పనులను ఈవో నారాయణ భరత్‌గుప్తతో కలిసి పరిశీలించారు. అలాగే రింగ్‌రోడ్డు, పార్కింగ్ ప్రదేశాలు, పుష్కరనగర్ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి సంతప్తిని వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఘాట్ల వద్ద రూపురేఖలన్నీ మారిపోతాయని.. 6వ తేదీలోగా అన్ని పనులు పూరై ్త 8న ట్రై ల్ రన్‌కు సిద్ధం కావాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. 500 మంది భక్తులు ఒకేసారి దుస్తులు మార్చుకునేందుకు వీలుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులరద్దీ ఎక్కువగా ఉంటే దోర్నాల వద్దే వాహనాలను నిలుపుదల చేసి అక్కడి నుంచి శ్రీశైలానికి చేరుకోవడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. భద్రతాపరంగా అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, బందోబస్తు విషయంలో పూర్తిస్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాతాగంగకు వెళ్లే ఘాట్‌రోడ్డులో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, కాలినడకన చేరుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీశైలంలోని అర్‌అండ్‌బీశాఖ వసతిగహాన్ని ఆర్డీఓకు అప్పగించాలని ఇంజనీర్లకు ఆదేశించారు. అనంతరం ఈవో నారాయణ భరత్‌గుప్త మాట్లాడుతూ.. భక్తులరద్దీని దష్టిలో పెట్టుకుని క్యూలు, స్వామిఅమ్మవార్ల దర్శనం, ప్రసాదం కౌంటర్లు అవసరమైన మేరకు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల సమయంలో స్వామివార్ల స్పర్శదర్శనం, అభిషేకాలను రద్దు చేశామని, సామాన్య భక్తులకు స్వామిఅమ్మవార్ల దర్శనం, పిండ ప్రదానాలకు ఏర్పాటు, మూడు పుష్కర నగరాలు, 3 అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంత మంది భక్తులు క్షేత్రానికి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌కు ఈవో తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డిఓ రఘుబాబు, అర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ విజయుడు, దేవస్థానం ఈఈ రామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
పురష్కరాలను విజయవంతంగా నిర్వహిద్దాం
– సంగమేశ్వరం ఏరియా, ప్లేస్‌ఆఫీసర్ల సమావేశంలో జేసీ కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పురష్కారాలను సంగమేశ్వరంలో పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించేందుకు ఏరియా, ప్లేస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో సంగమేశ్వరంలో పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంగమేశ్వరంలో మూడు ఘాట్లు ఏర్పాటు చేశామని, వీటికి రోజుకు 10 నుంచి 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏరియా ఆఫీసర్లు, ప్లేసు ఆఫీసర్లు ఈనెల 8 నుంచి సంగమేశ్వరంలోనే ఉండి ఏర్పాట్లపై మరింత పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పుష్కర నగర్, పార్కింగ్ ప్లేసు, ఘాట్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ జవాబుదారి తనంతో విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏజేసీ రామస్వామి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు
– 3వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియామకం – ఐజీ శ్రీధర్‌రావు వెల్లడి – సంగమేశ్వరంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన కర్నూలు : కృష్ణా పుష్కరాల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు హెచ్చరించారు. మంగళవారం సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. భక్తుల సంఖ్యను బట్టి ఘాట్ల వద్దకు విడతలవారీగా పంపించాలన్నారు. అనుమానితులపై నిఘా ఉంచి అప్రమత్తం కావాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం, సంగమేశ్వర పుష్కర ఘాట్లలో 3వేల మంది భద్రతా దళాలను నియమిస్తామన్నారు. అనంతరం సంగమేశ్వరం వద్ద విధులు నిర్వహించే పోలీసులకు విడిదికోసం ఏర్పాటు చేసిన ముసలిమడుగు ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కొలనుభారతి క్షేత్రం చేరుకొనిఅమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, ఆదోని మహిళా డీఎస్పీ వెంకటాద్రి, ఆత్మకూరు, ఆదోని సీఐలు దివాకర్‌రెడ్డి, రామయ్యనాయుడు, గౌస్, పాములపాడు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఉన్నారు. -
పుష్కర బాధ్యులు వీరే..!
– శ్రీశైలం ఓవరాల్ ఇన్చార్జిగా ఈవో భరత్ గుప్త – సంగమేశ్వరం ఓవరాల్ ఇన్చార్జిగా జేసీ హరికిరణ్ – కంట్రోల్ రూముల్లో 19 మంది అధికారులు – ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాలను విజయవంతం నిర్వహించడంలో భాగంగా జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, వసతులు తదితర వాటిని విభజించి వాటికి జిల్లాస్థాయి అధికారులను, ఏరియా ప్రత్యేక అధికారులను, ప్లేస్ అధికారులను నియమించారు. వారి విధులు, బాధ్యతలను వివరించారు. వీరంతా ఈనెల 8వ తేదీ నుంచి ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రధానంగా శ్రీశైలంపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుష్కరాలు విజయవంతం కావడంలో ఏరియా ప్రత్యేక అధికారి, ప్లేస్ అధికారుల పాత్ర ఎంతో ఉంటుంది. వీరికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. శ్రీశైలం శ్రీశైలం దేవస్థానం ఓవరాల్ ఇన్చార్జి ఆఫీసర్‌గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్తను నియమించారు. అక్కడ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది నంద్యాల ఎస్ఆర్బీసీ ప్రత్యేక ఉప కలెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో పోలీసు, ఇరిగేషన్, మత్స్య శాఖ, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, దేవదాయ శాఖ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అధికారులు, సమాచార శాఖ డీడీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్(శానిటేషన్), విద్యుత్, కమ్యూనికేషన్, వికలాంగుల శాఖ ఏడీ, రవాణా, ఆర్టీసీ, ఎకై ్సజ్ సివిల్ సప్లయ్ అండ్ ధరల నియంత్రణ అధికారులు, ప్రొటోకాల్ అధికారులు ఉంటారు. పార్కింగ్ ప్లేస్‌లు శ్రీశైలంలో పార్కింగ్ ప్లేస్‌లను ఐదింటిని ఏర్పాటు చేసి వాటికి జిల్లా అధికారులను ఏరియా ప్రత్యేక అధికారులను నియమించారు. పార్కింగ్ ప్లేస్–1 ప్రత్యేక ఏరియా అధికారిగా జిల్లా సహకార అధికారి, పార్కింగ్ ప్లేస్–2 ప్రత్యేక అధికారిగా పట్టు పరిశ్రమ శాఖ డీడీ, పార్కింగ్ ప్లేస్–3 చేనేత జౌళి శాఖ ఏడీ, పార్కింగ్ ప్లేస్–4కు సర్వశిక్ష అభియాన్ పీఓ, పార్కింగ్ ప్లేస్–5కు నంద్యాల ఉద్యాన శాఖ ఏడీని ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ఓవరాల్‌గా పర్యవేక్షిస్తుండగా వీరికి సహాయకంగా ప్లేస్ అధికారులు ఉంటారు. పుష్కర నగర్... శ్రీశైలంలో పుష్కర నగర్లు మూడు ఏర్పాటు అయ్యాయి. ఇందులో స్త్రీలు, పురుషులకు ప్రత్యేక వసతులు ఉంటాయి. ఒకటో పుష్కర నగర్‌కు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, రెండో పుష్కర నగర్‌కు జిల్లా విద్యాశాఖాధికారి, మూడో పుష్కర నగర్‌కు హౌసింగ్ పీడీలను ప్రత్యేక ఏరియా అధికారులుగా నియమించారు. ఘాట్ ఇన్చార్జి... మల్లికార్జున ఘాట్ (పాత)కు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ, భ్రమరాంబిక ఘాట్(కొత్త)కు వ్యవసాయ శాఖ జేడీ, హోల్డింగ్ ఏరియా–1(మల్లికార్జున ఘాట్ వెనుక)కు బీసీ కార్పొరేషన్ ఈడీ, హోల్డింగ్ ఏరియా–2(భ్రమరాంబిక ఘాట్ వెనుక)కు బీసీ సంక్షేమ అధికారి, రోప్ వేకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, లింగాల ఘాట్‌కు డ్వామా పీడీ, లో లెవల్ లింగాల ఘాట్‌కు మెప్మా పీడీ, పాలధార, పంచధారకు జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం, సాక్షి గణపతికి మార్కెటింగ్ శాఖ ఏడీ, సున్నిపెంటలోని పుష్కర నగర్‌కు గనుల శాఖ ఏడీ, భ్రామరీ కళామందిరం, శివదీక్ష శిబిరాలకు శ్రీశైలం జేఈఓ, దేవస్థానం ఏరియాకు జెడ్పీ సీఈఓలను ఏరియా స్పెషల్ అధికారులుగా నియమించారు. వీరికి సహాయకంగా గజిటెడ్ అధికారులను నియమించారు. సంగమేశ్వరం... సంగమేశ్వరం ఓవరాల్ ఇన్చార్జి ఆఫీసర్‌గా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ వ్యవహరిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ హెచ్ఎన్ఎస్ఎస్–4 స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ మల్లికార్జున నేతత్వంలో పనిచేస్తుంది. ఇందులో శ్రీశైలంలోని కంట్రోల్ రూమ్‌లో ఉంటున్న విధంగానే 18 శాఖల ద్వితీయ స్థాయి అధికారులు ఉంటారు. సంగమేశ్వర నగర్... దీనికి ఏరియా ప్రత్యేక అధికారిగా శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇందులోనే పార్కింగ్ ప్లేస్, స్త్రీలు, పురుషుల వసతి, క్లాక్రూము, ఫుడ్ కోర్టు, అన్నదాన సత్రం, డ్వాక్రా ఉత్పత్తులు, పూజా సామాగ్రి లభిస్తాయి. పార్కింగ్ ప్లేస్‌కు హెచ్ఎన్ఎస్ఎస్–3 స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉంటారు. ఒక్కోదానికి విడివిడిగా ప్లేస్ అధికారులను నియమించారు. బీమానగర్... బీమా నగర్ పర్యవేక్షణ అధికారిగా జేసీ–2 రామస్వామి వ్యవహరిస్తారు. ఇందులో వీఐపీ సిబ్బంది వాహనాల పార్కింగ్, సిబ్బంది వసతి, సిబ్బంది క్యాంటీన్, క్లాక్రూము, 10 బెడ్స్ ఆసుపత్రి, వీఐపీలకు వాటర్‌ప్రూఫ్ పందిళ్లు (వంద మందికి తగ్గట్లుగా) ఫుడ్ కోర్టు ఉంటాయి. ఘాట్ ఏరియా... ఘాట్ ఏరియా ప్రత్యేక అధికారిగా కర్నూలు ఆర్డీఓ వ్యవహరిస్తారు. ఇందులో సంగమేశ్వరం ఘాట్, పిండ ప్రదానం ఘాట్, దుస్తులు మార్చుకునే గదులు, పూజాసామాగ్రి, పిండ ప్రధాన సామాగ్రి స్టాల్స్, వీవీఐపీ ఘాట్, లలితాదేవి ఘాట్లు ఉంటాయి. వీవీఐపీ ఘాట్ ప్రత్యేక అధికారిగా ప్యాపిలి ఎంపీడీఓను నియమించారు. దేవస్థానం ఏరియా... టెంపుల్ ఏరియా ప్రత్యేక అధికారిగా కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇందులో లో లెవల్ ఘాట్, పిండ ప్రదాన ఘాట్, ఆలయం ఉంటాయి. ప్రతి విభాగానికి ప్లేస్ అధికారి ఉంటారు. మొత్తంగా పుష్కరాలకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులందరినీ వినియోగిస్తున్నారు. -
భద్రత..మల్లన్నకెరుక?
– అమలుకు నోచుకోని ఎస్పీ ప్రతిపాదనలు – కనిపించని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు – సెల్ జామర్ల జాడ కరువు – సోలార్ ఫెన్సింగ్ ఊసే లేదు శ్రీశైలం: శ్రీశైలం..జ్యోతిర్లింగ క్షేత్రం. ఆగస్టు 12వ తేదీన ఇక్కడ కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. పాతాళగంగ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ వద్ద ఇటీవల కొండ చరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన పుష్కరాల సమీక్షలో మొత్తం 22 భద్రతా అంశాలపై కలెక్టర్ విజయమోహన్‌కు జిల్లా ఎస్పీ రవికష్ణ నివేదిక సమర్పించారు. రెండు, మూడు మినహా మిగిలినవి ఏవీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఎస్పీ స్వయంగా చెప్పారు. కృష్ణా పుష్కరాలకు ముందే ఆగస్టు 3 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. భక్తులరద్దీ లక్షల సంఖ్యలో ఉంటుందని, సుమారు 30 లక్షలకు పైగా భక్తులు పుష్కరాలలో పవిత్ర పుణ్యస్నానాలు చేసుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్షేత్రంలో భద్రత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన మధుసూదన్‌రెడ్డి మహాశివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చి పలు సూచనలను జారీ చేశారు. అవేవి గడిచిన 9 ఏళ్లుగా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత జిల్లా ఎస్పీ రవికష్ణ కూడా ఆలయప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందే బ్యాగ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. అలాగే దేవస్థానం అధికారులకు కూడా ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను చేయాల్సిందిగా సూచించారు. అయితే ఇప్పటి వరకు ప్రధానాలయ గోపురం ముందు రెండు డోర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్లు మినహా ఎక్కడా అమర్చలేదు. కేవలం సీసీ కెమెరాలతో నిఘాకు మాత్రమే ఆలయం పరిమితమైంది. ఆలయ రక్షణ కోసం ఏం చేయాలంటే... · మల్లన్న ఆలయరక్షణ చర్యలలో భాగంగా ఆలయప్రాకార కుడ్యానికి నాలుగు వైపులా వాచ్ టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. · ప్రవేటు భద్రతా సిబ్బంది ప్రస్తుతం 70 మంది మాత్రమే ఉన్నారు. మరో 40 మందికిపైగా నియమించాల్సి ఉంది. · కోట గోడ పై భాగం చుట్టూ నలువైపులా సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి. · బ్యాగ్ స్కానర్లను ఆలయప్రవేశానికి ముందే ఏర్పాటు చేయాలి. · ఆలయప్రాంగణంలో సెల్ జామర్లను వినియోగించాలి. · డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఆలయం ముందు భాగం, దర్శనం చేసుకుని వెళ్లే ఎగ్జిట్‌లో ఏర్పాటు చేయాలి. · మెటల్ డిటెక్టర్లు పనితీరు ఎప్పటికప్పుడు గమనించాలి. ·ప్రస్తుతం ఎప్పీఎఫ్ సిబ్బంది అమ్మవారికి గుడికి మాత్రమే పరిమితమయ్యారు. స్వామివారి ఆలయప్రాంగణంలో కూడా వీరిని నియమించాలి. · ఆలయప్రాంగణంలో ఏఆర్ సిబ్బందిని నియమించాలి. ·అధునాతన స్కానర్లను ఏర్పాటు చేయాలి. · క్లాక్ రూమ్ వద్ద మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానర్లు ఏర్పాటు చేయాలి. ·అమ్మవారి గర్భాలయానికి ఆగ్నేయ దిశగా ఉన్న ప్రాకారకుడ్యం ఎత్తు పెంచాలి. -
పుష్కరాల్లో పక్కాగా పారిశుద్ధ్యం
విజయవాడ సెంట్రల్ : పుష్కరాల్లో పారిశుధ్యపనుల్ని యాక్షన్‌ప్లాన్ ప్రకారం పక్కగా నిర్వహించాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీడీఎంఏ) కన్నబాబు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీన ప్రీ పుష్కర పనుల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు తాము సరఫరా చేయాల్సిన కార్మికుల్ని ఆ తేదీనాటికి విధుల్లో చేర్చాలన్నారు. ప్రతిరోజు మూడు షిప్టులుగా విభజించి పనులు కేటాయిస్తామని, విధులకు అరగంట ముందే ఘాట్లలోని శానిటరీ ఇన్స్పెక్టర్లకు కార్మికులు రిపోర్టు చేయాలని ఆదేశించారు. విధుల మధ్యలో కార్మికులు వెళ్లిపోయినట్లైతే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవన్నారు. ప్రతి ఐదు రోజులకు ఒకసారి కార్మికులకు జీతాలు విడుదల చేస్తామన్నారు. సక్రమంగా జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్లపై జరిమానా విధించడంతో పాటు బిల్లుల చెల్లింపుల్ని నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. చెత్త కనిపించరాదు చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజారోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని కన్నబాబు ఆదేశించారు. మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్ల సిల్టును తొలగించేందుకు నగరపాలక సంస్థ సిబ్బందినిమాత్రమే వినియోగించాల న్నారు. పారిశుద్ధ్య పనిముట్లను కాంట్రాక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. పిండప్రదానాల షెడ్లలో మౌలిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు వినియోగించే వాహనాల వివరాలను రూట్ మ్యాపులను పోలీస్‌శాఖకు ముందుగానే అందించి అనుమతులుపొందాలన్నారు. మరుగుదొడ్లు ఉండే ప్రాంతాల్లో నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, జేడీ పూర్ణచంద్రరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, ఈఈలు జీఆర్టి. ఓం ప్రకాష్, ధనుంజయ, వివిధ మునిసిపాల్టీల కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
పుష్కరాలను విజయవంతంగా నిర్వహిద్దాం
కర్నూలు(అగ్రికల్చర్): పుష్కరాలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. పుష్కర విధులు నిర్వహించేవారు అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పుష్కర విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విపత్తుల నిర్వహణ నిపుణుడు, హైదరాబాద్ మానవ వనరుల అభివద్ధి సంస్థ ప్రతినిధి ప్రసన్నకుమార్ పుష్కరాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని, విధులు నిర్వహించే అధికారులు వచ్చే ప్రతి ఒక్కరిని అథితిగా భావించి గౌరవించాలన్నారు. సంగమేశ్వరం మారుమూల ప్రాంతం అయినందున రహదారి సదుపాయం సరిగా లేకపోవడంతో మెటల్‌రోడ్డు నిర్మించామన్నారు. దారి పొడవున లైట్లు ఏర్పాటు చేయాలని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. శ్రీశైలానికి ప్రతి రోజు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున విధులు నిర్వహించే వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఘాట్ల దగ్గర భక్తులకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయలు కల్పించాలన్నారు. ప్రత్యేక అధికారి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..ఘాట్ల దగ్గర ఎటువంటి షాపులు ఉండరాదన్నారు. షాపులు ఉంటే సమస్యలు తీవ్రంగా ఉత్పన్నం అవుతాయని తెలిపారు. ఘాట్లకు దూరంగా షాపులు ఏర్పాటు చేసుకుంటే ప్రతి నాలుగైదు షాపులకు మధ్య ఖాలీ ఉంచాలన్నారు. విపత్తల నిర్వహణకు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్‌గుప్త, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహానందికి 4న గవర్నర్ రాక..?
మహానంది: గవర్నర్ నరసింహన్ ఈ నెల 4న మహానందికి వస్తున్నట్లు దేవస్థానం కార్యాలయానికి సమాచారం అందింది. పుష్కర ఏర్పాట్ల పరిశీలనకు వస్తున్న ఆయన శ్రీశైలం క్షేత్రానికి వెళ్తూ అహోబిలం క్షేత్రానికి వస్తారని, అక్కడ రాత్రి బస చేసి 4వ తేదీ ఉదయం మహానందికి చేరుకుని శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుంటారని సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పుష్కరాలకు సిద్ధమవుతున్న గెస్ట్‌హౌస్
నాగర్‌కర్నూల్: ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణాపుష్కరాల కోసం నాగర్‌కర్నూల్ గెస్ట్‌హౌస్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొల్లాపూర్‌తోపాటు, నల్లమల ప్రాంతాల్లో కొన్ని పుష్కర ఘాట్లు ఉండడతో చాలా మంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ప్రస్తుతం గెస్ట్‌హౌస్‌లో ఉన్న సమస్యలు తీర్చేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికోసం రూ.8.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఇప్పటికే గెస్ట్‌హౌజ్‌కు పేయింటింగ్, టాయిలెట్స్, డైనింగ్‌కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రిషన్ పనులు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున ప్రముఖులు ఇక్కడే బస చేసే అవకాశం ఉన్నందున ప్రస్తుతం గెస్ట్‌హౌజ్‌ను సిద్ధం చేస్తున్నారు. -
ఆగస్టు ఆరులోగా పనులన్నీ పూర్తి
– పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరామ్ శ్రీశైలం: కష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో చేపట్టిన పనులన్ని ఆగస్టు ఆరో తేదీలోగా పూర్తవుతాయని పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరామ్ తెలిపారు. శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఆయన ఈఓ నారాయణ భరత్ గుప్తతో కలిసి పాతాళగంగ వద్ద జరగుతున్న ఘాట్ల పనులను పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ నూతన ఘాట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఘాట్ల వద్ద జరిగే పనులన్నీ ఆగస్టు 2వ తేదీలోగా పూర్తి అవుతాయని అనుకున్నామన్నా.. అనివార్య పరిస్థితుల కారణంగా ఎర్త్‌వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమైందన్నారు. ఆగస్టు ఆరు లోగా అన్ని పనులు పూర్తవుతాయనే ధీమాను వ్యక్తం చేశారు. అలాగే కొండ చరియలు విరిగిన ఘటనపై కమిటీ సూచన మేరకు పనులు చేపట్టామన్నారు. హైటెన్షన్ వైర్‌తో రిటైర్నింగ్ చేసి మెష్ వేయాలని సూచించడంతో ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పాతఘాట్లు కూడా ఒక వైపు పూర్తయ్యాయని, మెట్ల మార్గంలో ఈఓ నారాయణ భరత్ గుప్తతో కలిసి దిగి చూశామని, మధ్యలో బారికేడింగ్ కూడా పూర్తవుతుందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ప్యాచింగ్ వర్క్ చేయలేదని విలేకరులు అడుగగా, ఇప్పటికే వాటి గురించి సూచించానని, పూర్తవుతాయన్నారు. పుష్కర పనులలో ఎలాంటి రాజీ పడటం లేదని, సీఎం కూడా పనులలో నాణ్యత ఉండాలని ఆదేశించారన్నారు. అనంతరం ఆయన దేవస్థానం పరిధిలో నిర్మిస్తున్న చంద్రావతి కల్యాణమండపం, యజ్ఞవాటిక, హెలిప్యాడ్ ప్రదేశాలను పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్డీ రవిప్రకాశ్, డీఎస్పీ రమేష్‌బాబు, ఇరిగేషన్ సీఈ, ఎస్ఈ డీఈ,ఈఈ, దేవస్థానం ఈఈ రామిరెడ్డి , ఇంజనీరింగ్ అధికారులు, సీఐవెంకటచక్రవర్తి తదతరులు పాల్గొన్నారు. -
ప్రమాదాలకు చోటివ్వొద్దు
– అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కర్నూలు: పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నీటిమునక ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. లింగాలగట్టు, సంగమేశ్వరం, నెహ్రూ నగర్ ఘాట్లలో విధులకు నియమించిన పోలీసు సిబ్బందికి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ స్థాయినుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు మొత్తం వంద మంది సిబ్బంది హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు శిక్షణాకేంద్రం వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్‌రాజు, హోంగార్డ్స్ డీఎస్పీ కష్ణమోహన్ తదితరులు కార్యక్రమానికి హాజరై పుష్కర ఘాట్ల వద్ద పోలీసు సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీటీసీ వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకుని రెయిన్‌కోట్స్, టార్చ్లైట్లు, జంగిల్ షూస్, వాటర్‌బాటిళ్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులతో మర్యాదగా, సేవా దక్పథంతో ప్రవర్తించాలని సూచించారు. ఘాట్ల రద్దీని ఎప్పటికప్పుడు మ్యాన్‌ప్యాక్ ద్వారా స్నానాలు జరిగే సందర్భాల్లో క్రమ పద్ధతిలో అనుమతిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పైఅధికారులకు చేరవేయాలని సూచించారు. తొక్కిసలాటకు తావు లేకుండ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకుని నీటిమునక ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్స్పెక్టర్లు శ్రీనాథరెడ్డి, దివాకర్‌రెడ్డి, దైవప్రసాద్, శ్రీనివాసమూర్తి, ప్రసాద్, రామయ్య నాయుడు, పూలరామకష్ణ తదితరులు శిక్షణా తరగతులకు హాజరయ్యారు. -
ఘాట్లకు కోతల్లేని కరెంట్
– నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు – ఆకర్షణకు ప్రత్యేక లైటింగ్ వెలుగులు – 60 మంది సిబ్బందితో ప్రత్యేక టీములు కర్నూలు(రాజ్‌విహార్): పుష్కరాలకు విద్యుత్ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం ఘాట్లకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన 348 విద్యుత్ స్తంభాలతోపాటు 100 కేవీఏ సామర్థ్యం ఉన్న ఐదు ట్రాన్స్ఫార్మర్లు, నాలుగు జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక లైనులో సాంకేతిక సమస్య ఏర్పడితే మరో మార్గం ద్వారా సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద విద్యుత్ దీపాలతో ప్రత్యేక తోరణాలు నిర్మించనున్నారు. భక్తులను ఆకర్షించేందుకు లైటింగ్ ఎఫెక్ట్స్ సిద్ధం చేస్తున్నారు. సంగమేశ్వరం పుష్కర ఘాట్ వద్ద ఐదు కిలో మీటర్ల పొడవు 11కేవీ లైను, 7కిలో మీటర్లు ఎల్టీ ఏబీ కేబుల్ తీగను ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలంతోపాటు సంగమేశ్వరం, లింగాటగట్టు వద్ద ఉన్న ఘాట్లలో లైటింగ్స్ ఏర్పాటు చేసేందుకు రూ.23.59 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపించారు. ఎస్పీడీసీఎల్ కర్నూలు జోన్ సీఈ పీరయ్యతోపాటు ఆపరేషన్స్ ఎస్ఈ భార్గవ రాముడు ఓవరల్‌గా ఇన్‌చార్జ్‌లుగా, నలుగురు డీఈలు, ఏడీఈలు, ఏఈలు, లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు తదితరులతో కూడిన 60 మందిని విధుల్లో పాల్గొననున్నారు. మూడు ఘాట్ల వద్ద దేవుళ్ల చిత్రాలు ప్రతిబింబించేలా ఎల్ఈడీ లైట్లు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కర్నూలు ఆపరేషన్స్ డీఈ రమేష్ పేర్కొన్నారు. ఘాట్ల వారీగా ఏర్పాట్ల వివరాలు శ్రీశైలం ఘాటు లింగాల ఘాట్ సంగమేశ్వరం ఘాట్ విద్యుత్ స్తంభాలు 35 39 273 ట్రాన్స్ఫార్మర్ 100 కేవీఏ 100 కేవీఏ 100కేవీఏ జనరేటర్ ఒకటి ఒకటి రెండు సూపర్వైజర్లు ఇద్దరు ఇద్దరు ఇద్దరు సిబ్బంది 13 ఏడుగురు 11 -
సమష్టి ప్రణాళికతో ముందుకెళ్దాం
– విధుల్లో అలసత్వం వద్దు – 8వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలి – భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించొద్దు – కలెక్టర్ విజయమోహన్ సాక్షి, కర్నూలు: శ్రీశైలం, సంగమేశ్వరంలో మృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సమష్టి ప్రణాళికతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కష్ణా పుష్కరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని సూచించారు. పుష్కర విధుల్లో ఉన్న అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 25వ తేదీ వరకు పుష్కర విధుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పుష్కర విధులు నిర్వహించే అధికారులందరూ సాధారణ విధులను కిందిస్థాయి సిబ్బందికి అప్పగించాలని సూచించారు. శ్రీశైల క్షేత్రానికి ఈవో నారాయణ భరత్‌గుప్తా, సంగమేశ్వర క్షేత్రానికి జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్చార్జ్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. వారి పర్యవేక్షణలో పుష్కర, ఏరియా అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు మొదటివారంలో చెక్‌లిస్ట్ ప్రకారం నిర్వహించాల్సి విధులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే 8వ తేదీన కేటాయించిన ప్రదేశాలకు చేరుకుని 11వ తేదీ వరకు విధులు ఎలా చేపట్టాలన్న దానిపై ట్రై ల్ రన్ చేసుకోవాలని ఆదేశించారు. 12వ తేదీకి పకడ్బందీగా విధులకు హాజరుకావాలన్నారు. పాతాళాగంగ, సంగమేశ్వర ఘాట్ల లోతు ఎక్కువగా ఉంటుందని 4 అడుగుల మేర నీరు నిల్వ ఉండే ల్యాండింగ్ ఏరియాలలోనే స్నాలు చేసేందుకు అనుమతించాలన్నారు. ప్రతి రోజు సమీక్ష: ఒక రోజు శ్రీశైలం, ఒకరోజు సంగమేశ్వరంలో పర్యటించి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు కో–ఆర్డినేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ఏరోజుకారోజు ప్రణాళికలను సరిదిద్దుకొంటూ భక్తులకు అనువైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంట్రోలు రూములో 18 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పుష్కర విధుల అధికారులు 24 గంటలపాటు విధులు నిర్వహిస్తూ సంబంధిత ఏరియా, సిబ్బంది విధుల నిర్వహణపై పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇన్చార్జ్ అధికారి, పుష్కర అధికారులు భక్తుల సౌకర్యార్థం సొంత నిర్ణయాలు తీసుకొని తనకు తెలియజేయాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సేవాసంస్థలను గుర్తించాలని, అలాగే వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వారు కోరిన విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆగస్టు 4వ తేదీన సంగమేశ్వరంలో మరోసారి పుష్కర ఏర్పాట్లపై సమీక్షిస్తానని చెప్పారు. భక్తుల భద్రతపై పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్వో గంగాధర్‌గౌడ్, ఏఎస్పీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర ఏర్పాట్లు వేగవంతం చేయండి
కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రోడ్డు రవాణ సంస్థ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు జయరావు సూచించారు. బుధవారం ఆయన విజయవాడ నుంచి స్థానిక అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండడంతో 5వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. భక్తుల కోసం తిప్పే బస్సుల కండిషన్‌ను మెరుగుపరచాలన్నారు. వీటి కోసం అవసరమైన సామాగ్రిని, వస్తువులను కడప జోనల్ కార్యాలయం నుంచి తెప్పించుకోవాలన్నారు. సమావేశంలో ఆర్ఎం వెంకటేశ్వర రావు, డీసీటీఎంలు శ్రీనివాసులు, మధుసూధన్, డీసీఎంఈ జీవన్, పర్సనల్ ఆఫీసర్ సర్దార్ హుసేన్ పాల్గొన్నారు. -
ఘాటు చర్చ
– నిపుణుల కమిటీ చెబితే పాతాళగంగ ఘాట్‌ను మూసివేస్తా... – రోప్వేనూ మూసివేస్తా.. ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న కలెక్టర్ – భద్రతా కోణంలో సూచనలు చేస్తున్నామన్న ఎస్పీ కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడిన ఘటన కలెక్టరేట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం కలెక్టరేట్లో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంపైనే ప్రధానంగా చర్చ సాగింది. పుష్కరాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో భద్రతా కోణంలో కొన్ని సూచనలు చేసే ప్రయత్నం ఎస్పీ ఆకే రవికృష్ణ చేయగా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని అవసరమైతే ఘాట్నే మూసివేస్తామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ స్పష్టం చేశారు. ఈ విషయంపైనే ఇరువురు అధికారుల మధ్య సమావేశంలో ప్రధానంగా చర్చ జరగడం గమనార్హం. నిపుణుల కమిటీ చెబితే రోప్‌వేను కూడా మూసివేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం మీద శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడిన ఘటన జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భయాందోళనలకు గురి అవుతారనే.. కొండ చరియలు విరిగి పడిన ప్రాంతానికి వెళితే ప్రజలు మరింత భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో తాను అక్కడికి వెళ్లలేదని కలెక్టర్ వివరించారు. సంబంధిత శాఖల అధికారులు దగ్గరుండీ పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నిపుణుల కమిటీ ఆదేశిస్తే ఘాట్‌ను మూసివేయడానికి సిద్ధమని ఆయన వివరించారు. నీటిపారుదల శాఖ, భూగర్భ జలశాఖలు దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నాయని.. వాటి నివేదికలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్లను నీటిపారుదల శాఖ, తదితర శాఖలు చేపడుతున్నాయని ఏదీ జరిగినా బాధ్యత వాటిదేనన్నారు. తాను ఏమైన చెప్పి పనులు చేయిస్తే.. ఏదైన జరిగితే ‘‘కలెక్టర్ చెప్పారు.. చేశామని’’ చెబుతారని.. అందువల్ల ఘాట్ పనులు ఆయా శాఖలే చేపట్టాలన్నారు. ఎస్పీ ఘాట్ల భద్రతపై వివరించడానికి ప్రయత్నించిన వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుంటూ ఒకింత అసహనంతో మాట్లాడారు. ఒక హెచ్ఓడీగా ఏదైన సలహా ఇవ్వవచ్చని.. అయితే అది వివాదాస్పదం కాకూడదని వివరించారు. ఎస్పీ స్పందిస్తూ.. ఎలాంటి దస్సంఘటనలకు తావులేకుండా తీసుకోవాల్సిన భద్రత చర్యలపై తాము కొన్ని సూచనలు చేశామని తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ సూచనలు చేస్తున్నట్లు వివరించారు. సంపూర్ణ సమాచారంతో పుష్కర మాన్యువల్ పుష్కరాలు నిర్వహించే సంగమేశ్వరం, శ్రీశైలం పుణ్య క్షేత్రాల్లో భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా అధికారులు నిర్వహిస్తున్న విధులు, సిబ్బంది కేటాయింపులు ప్రాంతాల వారీగా తెలియజేస్తూ పుష్కరాల మాన్యువల్ రూపొందిస్తామన్నారు. పుష్కరాల పనులపై విధి విధానాలపై ఆగస్టు 2న శాఖల వారీగా శిక్షణనిస్తామన్నారు. ఆగస్టు 8వ తేదీ నాటికి అధికారులు, సిబ్బంది కేటాయించిన స్థానాలకు వెళ్లాలని సూచించారు. 9, 10, 11 తేదీల్లో ఏర్పాట్లను సరిచూసుకోవాలన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని వివరించారు. శ్రీశైలంలో పుష్కరాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ఇన్చార్జి జేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో చేపట్టిన పుష్కర ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కృష్ణా పుష్కారాల ప్రత్యేక అధికారి అనంతరాం కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టర్ విజయమోహన్‌తో కలసితో ఘాట్ల పనులను పరిశీలించారు. ముందుగా వారు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ప్రత్యేకపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం పాతాళగంగ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 30లోగా పుష్కరఘాట్ల పనులన్ని పూర్తి కావాలని ఆదేశించించిందని, దానికనుగుణంగానే పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి చూస్తే గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉందా అని విలేకరులు అడుగగా, జరుగుతున్న పనులను భద్రతను దష్టిలో ఉంచుకుని వర్క్‌లు చేస్తున్నారని, 20 మీటర్ల చొప్పున రెండు పెద్ద ఘాట్లు తయారవుతాయని, ఈ ఘాట్లు ఆగస్టు 2లోగా పూర్తి చేస్తామన్నారు. అలాగే మిగతా పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు, తదితరులు కూడా ఘాట్ల వద్ద జరుగుతున్న పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అడుగుగా, దీనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ సపరేట్ వింగ్ ఉంటుందని, అధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్పానని అన్నారు. క్వాలిటీ కంట్రోల్ నుంచి శ్యాంపిల్స్, టైమ్ టూ టైమ్ టెస్ట్ చేసి వారికే ఇన్చూర్ అయ్యేటట్లు చెబుతామన్నారు. ఘాట్ల పనులో భాగంగా మట్టిని పాతాళగంగలో వేస్తున్నారని కొందరు విలేకరులు చెప్పలగా.. అలా చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట ఈఓ నారాయణభరత్‌గుప్త, తహసీల్దార్ విజయుడు, దేవస్థానం ఈఈ రామిరెడ్డి, టూరిజం డీవిఎం, ఇరిగేషన్‌శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో వైద్యం అంది ఉంటే..
రాజమండ్రి: పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు మృత్యువాత పడడం వెనుక సకాలంలో సహాయ చర్యలు అందకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బాధితులకు వెనువెంటనే వైద్యసేవలందించి ఉంటే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన సదుపాయాలు కల్పించలేదు సరికదా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా భక్తులకు వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. పుష్కర ఘాట్ వద్ద తక్షణ వైద్య సేవలందించేందుకు నలుగురు వైద్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని, వీరికి మరో ఇద్దరు అదనంగా వైద్యులను అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు. భక్తులు గాయపడినా, మరైదేనా అనారోగ్యం బారిన పడినా ఆస్పత్రులకు తరలించేందుకు రివర్ అంబులెన్స్‌తో కలిపి ఆరు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు ఒకే ఒక్క అంబులెన్స్ ఉండడం గమనార్హం. అంబులెన్స్‌ను ఘాట్ వద్దకు పంపాలని మైకుల ద్వారా పదేపదే చెబుతున్నా పట్టించుకున్నవారే లేకుండాపోయారు. ఉన్న ఒక్క అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. పైగా అంబులెన్స్‌లో వీల్చైర్లు, స్ట్రెచర్లు లేకపోవడంతో అస్వస్థతకు గురైనవారిని చేతులతో మోసుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మిగిలినవారిని పోలీసు జీపుల్లో ప్రభుత్వాస్పత్రులకు తరలించాల్సి వచ్చిందంటే ఘాట్ల వద్ద వైద్యసేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఘాట్ల వద్ద సరైన వైద్యసేవలు అంది ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అత్యధిక శాతం మంది అంటున్నారు. అపస్మారక స్థితికి వెళ్లిన భక్తులను సమీపంలో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. వారి బంధువులు నెత్తీనోరు బాదుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోకురోటి మాణిక్యం అనే వృద్ధురాలు ఘాట్ వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులను బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. ఇది గమనించిన ‘సాక్షి’ బృందం విషయాన్ని అర్బన్ ఎస్పీ ఎస్.హరికృష్ణ దృష్టికి వెళ్లింది. ఆయన అధికారులకు చెప్పి వదిలేశారు. దీంతో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్వయంగా మాణిక్యం వద్దకు వచ్చి అక్కడ నుంచి తరలించి వైద్య సేవలందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. -
అల్టిమేటమ్..!
* ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకపోతే పుష్కరాలు, ఇసుక రీచ్‌ల్లో విధులు బహిష్కరిస్తామని రెవెన్యూ సంఘాల హెచ్చరిక * మహిళా అధికారిపై దాడి ఘటనపై వెల్లువెత్తిన నిరసన * ఎమ్మెల్యేను అరెస్టు చేయకుంటే బాబును గద్దె దింపుతామని హెచ్చరిక * నేడు రాష్ట్రంలో అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు * ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు * తహశీల్దార్ వనజాక్షికి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల సంఘీభావం * దాడి జరిగి 24 గంటలు దాటినా స్పందించని ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్/ ఏలూరు/ విజయవాడ/ నూజివీడు: ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహశీల్దార్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని పలు జిల్లాల్లో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏన్జీవో అసోసియేషన్లు ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల్ని శుక్రవారం ఉదయం 10గంటలలోపు అరెస్టు చేయకపోతే పుష్కరాలు, ఇసుక రీచ్‌ల్లో విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. శుక్రవారం అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళనలు నిర్వహించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తహశీల్దార్ వనజాక్షికి రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. మహిళా అధికారిపై దాడిని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేను, ఆయన అనుచరులనూ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడిని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దాడిజరిగి 24 గంటై లెనా ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం స్పందిం చారు. దీనిపై కలెక్టర్‌తో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల ధర్నాలు టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని నిరసిస్తూ కృష్ణాజిల్లాలో జిల్లాలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ బాబు.ఏకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుకు కూడా వినతిపత్రం పంపించారు. ఉద్యోగుల ఆందోళనకు కలెక్టర్ బాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్ జెనీసన్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేను శుక్రవారం ఉదయం పది గంటల్లోపు అరెస్టు చేయకపోతే రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాకు తాళాలు వేస్తామని, పుష్కర, ఇసుక విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు ఆందోళనకు వీఆర్వో, వీఆర్ఏ సంఘాలు కూడా మద్దతు పలికాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ రెవెన్యూ ఉద్యోగులు భారీగా ఆందోళన నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎల్.విద్యాసాగర్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే సీఎం చంద్రబాబును గద్దె దింపి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టంచేశారు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ విద్యార్థి, మహిళా విభాగాల ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో ధర్నా చేశారు. ప్రకాశం జిల్లాలో ఎన్జీవోలు ఆందోళన చేశారు. అనంతపురంలో రెవెన్యూ అసోసియేషన్ నిర్వహించిన నిరసనలో జాయింట్ కలెక్టర్ ఖాజామొహీద్దీన్తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. చిత్తూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు వైఖరిపై ధ్వజమెత్తిన రాజకీయ పార్టీలు రౌడీషీటర్లను టీడీపీలోకి తెచ్చుకుని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని శ్రీకాకుళంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారామ్ ధ్వజమెత్తారు. రౌడీరాజకీయం చేస్తున్న టీడీపీ చివరకు ప్రభుత్వ అధికారులపై కూడా రౌడీయిజం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే నేరుగా మహిళా అధికారిపై దాడికి దిగడం సిగ్గుచేటని, రౌడీయిజాన్ని చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసుకోవాలని అనంతపురంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలని విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట కార్యదర్శి కె.రామకృష్ణ, పలువురు వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. అధికారులపై దాడులను ఉపేక్షించం: డిప్యుటీ సీఎం కేఈ కృష్ణా జిల్లా ముసునూరులో విధి నిర్వహణలో ఉన్న మహిళా తహశీల్దారుపై జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు జరిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి తరఫున మీడియా లైజనింగ్ అధికారి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా తహసీల్దారుపై దాడి సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టరును ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టరు నుంచి నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. చింతమనేనిపై కేసు నమోదు.. మహిళా తహశీల్దార్‌పై దాడికి సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ముసునూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే, ఆయన గన్‌మెన్, అనుచరులు, డ్వాక్రా మహిళలు మొత్తం 52 మందిపై బుధవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో తహశీల్దారు వనజాక్షి ముసునూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిని కొట్టడం, ఎదిరించడం, అసభ్యకర పదజాలంతో దూషించడం, దొంగతనంగా ఇసుకను దొంగిలించడం వంటి కారణాలతో ఐపీసీ 353,332,379, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 103/2015) నమోదు చేశారు. ఇదే సంఘటనలో దాడికి గురైన ముసునూరు సాక్షి విలేకరి కర్రా నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు గురువారం మరో కేసు నమోదు చేశారు. బాధితులకు నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చికిత్స జరిపి పంపారు. నూజివీడు డీఎస్పీ వెంకట్రామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, రక్షణ కల్పించాలని వనజాక్షి ప్రభుత్వాన్ని కోరారు. ‘ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’ ముసునూరు మండల తహశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు పిడుగు బాబూరావులు తమ సంఘాల ప్రతినిధులతో కలిసి గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే విప్ పదవినుంచి తప్పించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నామని వీధిరౌడీలా ప్రవర్తిస్తారా? అధికారంలో ఉన్నాం కదా అని వీధిరౌడీలా ప్రవర్తిస్తారా అని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు పిడుగు బాబూరావు మండిపడ్డారు. తక్షణమే చింతమనేని ప్రభాకర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన చీఫ్‌విప్ పదవికే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడని, ఆ పదవులనుంచి ఆయనను తక్షణమే తప్పించాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పి.వాసు, అంజిప్రసాద్, దుర్గాప్రసాద్ తదితరులున్నారు. దుందుడుకుగా ఉండడం నా నైజం: ఎమ్మెల్యే ప్రభాకర్ దుందుడుకుగా ఉండడం తన నైజమని.. అందుకే ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నానని.. ఇది కూడా అందులో ఒకటని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ఆయన గురువారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా ముసునూరు మండలంలో జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదన్నారు. అక్కడ డ్వాక్రా సంఘాల మహిళలకు, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలిసి సర్దిచెప్పడానికి ప్రయత్నించానని చెప్పారు. తాను ఇసుక మాఫియాకు పాల్పడినట్టు ఎవరైనా రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. తహశీల్దార్‌తో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ విషయంలో ఎవరైనా బాధపడితే చింతిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, త్వరలోనే అంతా సద్దుమణుగుతుందని తెలిపారు. అయితే తహశీల్దార్ వనజాక్షి మీ మీదనే ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించగా... అదంతా మీ వల్లేనంటూ ‘సాక్షి’ చానల్ విలేకరిపైకి నెపం నెట్టేశారు. ఇతర మీడియా వాళ్లు బాధ పడతారనే ‘సాక్షి’ విలేకరులను సమావేశానికి రానిస్తున్నానని, లేనిపక్షంలో వారిని రానిచ్చేది లేదని ‘సాక్షి’పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి: ట్విట్టర్లో జగన్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరులో మహిళా తహసీల్దార్‌పై దౌర్జన్యానికి పాల్పడిన అధికార పార్టీ విప్‌ను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా అధికారిపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ఒక మహిళా అధికారిని అధికార తెలుగుదేశం పార్టీ విప్ దూషిస్తూ అవమానపరిచి, దౌర్జన్యానికి పాల్పడిన ఈ ఘటన.. ఇసుక మాఫియాతో సిగ్గుమాలిన చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న అపవిత్ర బంధమేంటో తేటతెల్లం చేస్తోంది. ఈ చర్యను అందరూ ఖండించాలి. ఆ ఎమ్మెల్యేను తక్షణం అరెస్ట్ చేయాలి’’ అని జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
శరవేగంగా పుష్కర పనులు
రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం {పధాన పీఠాధిపతులకూ పిలుపు గోదావరి పుష్కర పనులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశం మరిన్ని నిధులకు కేంద్రానికి విజ్ఞప్తి ఈ నెల 15 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. జూన్ 15లోగా అన్నింటినీ పూర్తి చేయాలన్నారు. గోదావరి పుష్కరాలకు చేస్తున్న ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. కుంభమేళా తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానిస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ప్రధాన పీఠాధిపతులను కూడా రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారికి ఆ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు పుష్కరాలకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి వివరించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలోనే అధికంగా ఉందని.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పుష్కరాలకు కేంద్రం అధిక నిధులను కేటాయించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పుష్కర పనుల పురోగతిని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖల అధికారులు మంత్రికి వివరించారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి పర్యటించనున్నట్లు, ఎక్కడికక్కడ జిల్లా అధికారులతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అందరితో సమన్వయం చేసుకుంటూ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. -
మే చివరికల్లా పుష్కరాల పనులు పూర్తి చేయాలి
హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనులను మే చివరికల్లా పూర్తి చేయాలని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్‌లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఆలోపే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇప్పటికే 66 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించిందని, అదనంగా మరో 16 కొత్త ఘాట్ల కోసం సీఎం నుంచి అనుమతి కోరామన్నారు. పుష్కర ఏర్పాట్లపై ఆయన వివిధ విభాగాలతో శనివారం సమీక్షించారు. ఉత్సవాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ దిశలోనే చర్యలు తీసుకోవాలన్నారు. స్నాన ఘట్టాలు సులభంగా తెలుసుకునేలా రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. రూ.82.33 కోట్లతో 66 పుష్కర, స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు.