పుష్కరాల విజయవంతంలో మీడియా పాత్రే కీలకం
కృష్ణా పుష్కరాల విజయవంతంలో మీడియా పాత్రే కీలకమని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ పేర్కొన్నారు. పుష్కరాలు జరుగుతున్న మూడు జిల్లాలో కర్నూలు మొదటి స్థానంలో నిలవడానికి మీడియా సహకారం ఎనలేనిదన్నారు. పుష్కరాల ముగింపు రోజైన మంగళవారం ఆయన పాతాళగంగ పుష్కర ఘాట్లలో స్నానమచరించిన భక్తులను సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ..పుష్కర వి«ధుల్లో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సదుపాయాలు కల్పించడంతోనే విజయవాడ, గుంటూరు జిల్లాలను కాదని మొదటి స్థానం కర్నూలుకు వచ్చిందన్నారు. అహర్నిశలు పనిచేసిన సిబ్బందిని వారు అభినందించారు.
– శ్రీశైలం (కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)