సమష్టి కృషితోనే పుష్కరాలు విజయవంతం
Published Wed, Aug 31 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
కర్నూలు: అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమష్టికృషితోనే కృష్ణాపుష్కరాలు విజయవంతమయ్యాయని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. పుష్కరాలు విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేసిన పోలీసు యంత్రాంగాన్ని ఎన్‌జీఓ సంఘం నాయకులు అభినందించారు. జిల్లా అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి, కార్యదర్శి జవహర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి, నగర అధ్యక్షుడు లక్ష్మన్న,కార్యదర్శి హరిశ్చంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, తాలుకా కార్యవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఎస్పీని కలిసి అభినందించారు.
Advertisement
Advertisement