team work
-
సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఐకమత్యం గురించి తెలిపే ఒక అద్భుతమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. వ్యాపార వ్యవహరాల్లో తలమునకలై ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎడ్యుకేట్ చేయడంలో, మోటివేట్ చేయడంలో ఈ బిజినెస్ టైకూన్ తరువాతే మరెవ్వరైనా అని చెప్పవచ్చు.మట్టిలో మాణిక్యాల్లాంటి వ్యక్తుల ప్రతిభను పరిచయం చేయడమే కాదు, తనవంతుబాధ్యతగా వారికి అండగా నిలుస్తారు. ఇన్స్పిరేషనల్ వీడియోస్, సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలు, అప్పుడప్పుడు మరికొన్ని ఫన్నీ విడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్ పేరుతో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బలం, శక్తి, స్వేచ్ఛకు ప్రతీకలు పక్షులు గుంపుగా ఎగురుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒంటరిగా ఎగరడం, అదీ అందనంత ఎత్తున ఆకాశతీరాన విహరించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ పనిలో జట్టుగా, జమిలిగా ఎగరడం(ఎదగడం)లో చాలా మేజిక్ ఉంది. దానికి చాలా శక్తి ఉంది అంటూ కలిసికట్టుగా ఉండటంలోని ప్రయోజనాన్ని గురించి ఆనంద్ మహీంద్ర గురించి చెప్పారు. ఇది ఆయన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘అవును సార్, టీమ్‌వర్క్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అనుకున్నకలలను నెరవేర్చుకోవచ్చు, కలిసి, కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మరపురాని అనుభవాన్ని సాధించవచ్చు! అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేయడం విశేషం.Flying solo and soaring high in the skies can be exhilarating. But there is as much magic—and power—in flying together, as a Team….#MondayMotivation#TogetherWeRisepic.twitter.com/ARVcoEJtwM— anand mahindra (@anandmahindra) October 7, 2024 -
తెలుగు తేజానికి ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
దేశ బ్యాడ్మింటన్ చరిత్ర తిరగ రాస్తూ భారత జట్టు థామస్ కప్‌ని గెలుచుకుంది. క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు భారత జట్టును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే గెలిచిన జట్టులో ఓ సభ్యుడైన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చేసిన ఓ వ్యాఖ్య ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. కిదాంబి శ్రీకాంత్ చెప్పిన విషయం ఆటలకే కాదు వ్యాపార రంగానికి ఆ మాటకు వస్తే నిత్య జీవితంలో కూడా పాటించాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం అంటూ కొనియాడారు. థామస్ గెలుపును ఆస్వాదిస్తూ కిదాంబి శ్రీకాంత్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఈ టోర్నమెంట్లో మేమంతా ఒక టీంగా ఎంతో బాగా ఆడామని, ఆ అనుభవం విభిన్నమైనదని తెలిపారు. కప్ గెలుచుకోవడం అనేది పైపూత మాత్రమేనని. నిజానికి ఓ టీమ్‌గా కచ్చితంగా ఆడటమే అసలైన విజయమంటూ తెలిపారు. అనేక మంది వ్యక్తులతో ముడిపడి ఉండే బిజినెస్‌లో టీంస్పిరిట్ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఇదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా ఎన్నోసార్లు చెప్పారు కూడా. లాభాలు అనేవి బోనస్ మాత్రమేనని అసలైన విజయం లక్ష్యాన్ని చేరుకోవడంలో ఓక టీంగా మనం ఎలా పని చేశానమనేది ముఖ్యమని గతంలో మహీంద్రా చెప్పారు. అదే రకమైన అభిప్రాయాన్ని కిదాంబి శ్రీకాంత్ సైతం వ్యక్తం చేశాడు. And here’s a good addition to #mondaythoughts He says the Thomas Cup title was simply ‘Icing on the cake.’ It was the Team Experience that was the real prize! Brilliant. Let’s remember that; in Business and in all of Life.. pic.twitter.com/wN3FtLiVhz — anand mahindra (@anandmahindra) May 16, 2022 చదవండి: మహీంద్రా రైజ్.. ఆటోమొబైల్ సెక్టార్లో తొలిసారిగా.. -
ఆ విషయం గురించి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కూడా ఇలా చెప్పలేరు
చుట్టూ కనిపించే విషయాల నుంచే చక్కని బిజినెస్ పాఠాలు చెప్పడం ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా స్పెషాలిటీ. ముఖ్యంగా మనకు తెలియకుండా సాధారణంగా చేసే పనుల్లో ఎంతో విలువైన వ్యాపార సూత్రాలు దాగి ఉంటాయి. అలాంటి అంశాలకు సంబంధఙంచిన ఓ వీడియోను తాజాగా ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు పిల్లలు ఒకే సారి సైకిల్ తొక్కుతూ ముందుకు పోతుంటారు. సైకిల్‌కి ఉండే రెండు పెడల్స్‌పై చేరోవైపునా ఇద్దరు నిలబడి సైకిల్ ముందుకు కదిలేందుకు అవసరమైన ఫోర్స్‌ను అందిస్తుంటారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా కొలాబరేషన్, టీమ్ వర్క్‌లతో ఉపయోగం ఏంటో వివరించేందుకు ఇంతకంటే మంచి వీడియోను హార్వర్డ్ యూనివర్సిటీ కూడా చూపలేదంటూ కామెంట్ చేశారు. Even Harvard Business School would not have a better video to communicate the virtues of collaboration & teamwork! pic.twitter.com/ALBRYRCFN0 — anand mahindra (@anandmahindra) April 23, 2022 చదవండి👉🏾ప్రపంచ దిగ్గజంగా టీసీఎస్ ! -
అద్భుతమైన బిజినెస్ మంత్రం చెప్పిన ఆనంద్ మహీంద్రా
వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. దేశం నలుమూలలా దాగిన ప్రతిభను ప్రోత్సహించడం. భిన్నత్వంలోని ఏకత్వానికి నిదర్శనంగా నిలిచే అంశాలను పంచుకోవడంతో పాటు అప్పుడప్పుడు మంచి బిజినేస్ పాఠాలను కూడా చెబుతుంటారు. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు కానీ.. సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి ఆ సలహా వచ్చినప్పుడు దాని రేంజ్ వేరే లెవల్లో ఉంటుంది. తాజాగా టీమ్ వర్క్‌కి సంబంధించిన ఐడియాను ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ఉదహరిస్తూ నెటిజన్లతో పంచుకున్నారు. ఓ పార్కింగ్ స్లాట్‌లో ఒక చిన్న తినుబండరం కోసం ఒక పిల్లి, రెండు కాకులు పోటీ పడుతుంటాయి. అప్పటికే తినుబండం పిల్లి నోటికి అందేంత దూరంలో ఉంటుంది. అయితే రెండు కాకులు ఒక టీమ్‌గా పని చేస్తూ ఆ తినుబండరాన్ని తమ కంటే బలవంతమైన పిల్లి దగ్గర నుంచి తీసుకుంటాయి. Remember…you’re always going to be more effective if you work collaboratively with a team.. 😊 #MondayMorning pic.twitter.com/lsKKKuJbcc — anand mahindra (@anandmahindra) March 28, 2022 ఒక పిల్లి, రెండు కాకులకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా... మీరు కనుక టీమ్ వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారంటూ తేల్చి చెప్పారు. -
‘మెదడు మొద్దుబారిపోతోంది.. ఆఫీసులకే వస్తం’
థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆఫీసులను తెరిచే ఉద్దేశాన్ని చాలా కంపెనీలు వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ‘వర్క్ ఫ్రమ్ హోం’.. జనవరి దాకా కంటిన్యూ కానుంది. అయితే ఇక తమ వల్ల కాదని, ఆఫీసులకు వచ్చేస్తామని కరాకండిగా చెప్పేస్తున్నారు కొందరు ఉద్యోగులు. అందుకు తమ దగ్గర సరైన కారణాలు ఉన్నాయంటున్నారు మరి! ►రియల్ టైం కమ్యూనికేషన్ లోపం.. ఏడాదిన్నరగా ఉద్యోగుల మధ్య ఈ-మెయిల్స్, ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్‌లతో కంపెనీ పనులు జరుగుతున్నాయి. ఫోన్, వీడియో కాల్స్ ఆధారంగా మీటింగ్‌లను, సమీక్షలను నిర్వహించుకుంటున్నారు. తద్వారా ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్స్ అనేది గణనీయంగా తగ్గిపోయింది. ► కంపెనీ సక్సెస్‌లో టీం వర్క్ ఎంత శక్తివంతమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకోసమే టీంల మధ్య ఇంటెరాక్షన్ ఎక్కువ ఉండాలని చెప్తుంటారు. అయితే కరోనాకు ముందున్న పరిస్థితులతో పోలిస్తే.. సగటున వర్క్ ఫ్రమ్ హోం వల్ల కొలీగ్స్ మధ్య గడిపే టైం 25 శాతం తగ్గిపోయింది. సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం, ఒకవేళ కలిసినా ఎక్కువసేపు గడపలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇన్నోవేషన్‌తో పాటు కంపెనీ ప్రొడక్టివిటీపైనా నెగెటివ్ ప్రభావం చూపెడుతోంది. ► ఎంప్లాయిస్ వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది వర్క్ ఫ్రమ్ హోం సిస్టమ్. ఏడాదిన్నరగా ఇంటికే పరిమితం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య తగదాలు నెలకొంటున్నాయి. పిల్లల వల్ల పనులు ఆగిపోతున్నాయనే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది పరోక్షంగా వర్క్ మీద చూపెడుతోంది. ఉద్యోగులను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. క్లిక్: నా భర్తను ఆఫీస్‌కు పిలవండి.. ప్లీజ్ ► టార్గెట్లు.. ఉద్యోగుల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఆఫీస్ స్పేస్‌లో లేకపోవడంతో మానిటరింగ్ పేరుతో ఉద్యోగుల్ని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై శారీరక, మానసిక అనారోగ్యం బారినపడుతున్నారు. ► మానసిక స్థితిపై ప్రభావం.. దీని ప్రభావంతో ఉద్యోగుల మెదడు మొద్దుబారిపోతోంది. స్కిల్స్‌ను పెంచుకునే వాళ్లకు తీరిక లేకుండా చేస్తోంది. చివరికి.. జాబ్ మారాలనే ఆలోచనల్ని సైతం దూరం చేస్తున్నాయి వర్క్‌ఫ్రమ్ హోమ్ పరిస్థితులు. ► ఇంటర్నెట్ ఇష్యూస్. ఒక్కోసారి సిగ్నల్స్ లేక వర్క్ ఆగిపోవడం, ఆలస్యం కావడం. చిరాకు తెప్పిస్తున్న అంశాలు. ► అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.. ఆఫీస్ అట్మాస్పియర్‌ను మిస్ కావడం. కెరీర్ ఎదుగుదలకు వర్క్ ఫ్రమ్ హోం అడ్డుపడుతుందనే భావనలోకి కూరుకుపోతున్నారు ఉద్యోగులు . వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల జాబ్ సెక్యూరిటీ చూసుకుంటున్న ఉద్యోగులు చాలామట్టుకు.. హైక్‌లు, బోనస్‌లకు దూరంగా పని చేస్తున్నారు. ఇది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందనే ఆందోళన ఉద్యోగుల తరపు నుంచి వ్యక్తం అవుతోంది. టెక్ కంపెనీలు భారీ ఎత్తున్న నిర్వహించిన సర్వేలో ఎంప్లాయిస్ వెల్లడించిన అభిప్రాయాలివి. చదవండి: వర్క్ ఫ్రమ్లోనూ లైంగిక వేధింపులు.. ఇలా! -
కలిసికట్టుగా ఊడ్చేశారు.. టీంవర్క్ అంటే ఇది
ఏ పనైనా ఒక్కరే చేస్తే తొందరగా అలసటకు గురవుతుంటాం.. కానీ అదే పనిని కలిసికట్టుగా చేస్తే ఎంత శ్రమిస్తున్నా అలసట మాత్రం అనిపించదు. ఒక టీమ్ వర్క్‌తో ముందుకు సాగితే పనులు ఎలా సాగుతాయన్నది చెప్పేందుకు ఈ వార్త ఉదాహరణగా చెప్పవచ్చు. అసలు విషయంలోకి వస్తే.. భారీ వర్షాలు కురిస్తే రోడ్డుపై నీరు నిలవడం సర్వసాధారణం. రోడ్డుపై నిలిచిపోయిన నీరును డ్రైనేజీల్లోకి పంపించడానికి పారిశుద్య కార్మికులు చాలా కష్టపడతారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ నీరును డ్రైనేజీలోకి పంపిస్తారు. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు గాని.. ఒకేసారి నలుగురు వ్యక్తులు కలిసి రోడ్డుపై నిలిచిపోయిన నీరును ఏకదాటిగా డ్రైనేజీలోకి పంపించారు. (చదవండి : ఈత కొట్టి సేద తీరాడు.. ఇంతలోనే) కాగా ఈ వీడియోనూ ఐఎఫ్ఎస్ అధికారి సుషాంత్ నంద తన ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ' టీం వర్క్ అనే పదానికి వీళ్లే ఉదాహరణ. కలిసికట్టుగా పనిచేస్తే ఫలితం కూడా తొందరగా వస్తుంది. నలుగురు కలిస్తేనే టీం.. ఆ టీమ్‌కున్న బలం అందులో ఉన్న ఒక్కో వ్యక్తి.' అని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్స్ షేర్ చేశారు. ' టీం ఉందంటే అందులో టీమ్ లీడర్ కృషి చాలా ఉంటుంది.. కలిసికట్టుగా ఉంటే ఏదైనా విజయవంతమే.. ఈ వీడియోలో చాలా గొప్ప మెసేజ్ ఉంది ' అంటూ పేర్కొన్నారు. “The strength of the team is each individual member. The strength of each member is the team." Teamwork💕 pic.twitter.com/VcY5J7jEfS — Susanta Nanda IFS (@susantananda3) October 15, 2020 -
సమన్వయంతో వ్యవహరించాలి
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ) : రాష్ట్రంలో 10 లక్షల పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ¯ŒS అన్నారు. రాజమండ్రి బార్ అసోసియేష¯ŒSలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు, బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు అధ్యక్షతన శనివారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేష¯ŒS ఎంతో ప్రఖ్యాతి పొందినదని, అనేకమంది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, కోకా సుబ్బారావువంటి ఉద్దండులు దీని నుంచే ఆవిర్భవించారని కొనియాడారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బార్ అసోసియేష¯ŒS సావనీర్‌ను జస్టిస్ రంగనాథ¯ŒSకు ముప్పాళ్ళ సుబ్బారావు అందజేశారు. అలాగే, వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఆ సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తామని జస్టిస్ రంగనాథ¯ŒS హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్‌జీ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రాంబాబు, అసోసియేష¯ŒS కార్యదర్శి పీఆర్ఎస్ మిత్రా, సీనియర్ న్యాయవాదులు ఎం.శేషగిరిరావు, నండూరి సూర్యనారాయణమూర్తి, తవ్వల వీరేంద్రనాథ్, సీహెచ్‌వీ ప్రసాద్, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. యాసిడ్ దాడులు హేయం : జిల్లా జడ్జి తుకారామ్‌జీ యాసిడ్ దాడులు అత్యంత హేయమైనవని జిల్లా జడ్జి ఎ¯ŒS.తుకారామ్‌జీ అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యాన ‘లీగల్ సర్వీసెస్ టు విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ ఎటాక్స్ స్కీమ్–2016’పై జిల్లా అధికారులకు శనివారం నిర్వహించిన శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడుల నిరోధంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసిడ్ దాడులకు ఉపయోగించే పదార్థాలను నియంత్రించాలి : కలెక్టర్ యాసిడ్ దాడులకు ఉపయోగించే పదార్థాలను నియంత్రించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆ పదార్థాలను బయటి వ్యక్తులకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడులకు పాల్పడినవారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. లీగల్, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ ఇ.దామోదర్ మాట్లాడుతూ, లక్ష్మీ అగర్వాల్‌పై జరిగిన యాసిడ్ దాడి యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. యాసిడ్ దాడులు బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, కంబోడియా తదితర దేశాల్లో జరుగుతున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్‌లో చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. అదే తరహాలో ఇతర దేశాల్లోనూ చేపట్టాలని సూచించారు. దీనిపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిపారు. వాటిని పాటిస్తే చాలా వరకూ దాడులను నివారించవచ్చని అన్నారు. పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవిధంగా తల్లిదండ్రులు పెంచాలని అన్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ, గడచిన పదేళ్లలో 17 యాసిడ్ దాడులకు ప్రయత్నాలు జరిగాయని, వీటిలో ఒక దాడి జరిగిందని, జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అన్నారు. విశాఖపట్నంలోని దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రీదేవి యాసిడ్ దాడుల నివారణపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎల్.వెంకటేశ్వరరావు, సెక్రటరీ పీవీ రాంబాబు, రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, వివిధ విభాగాల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే పుష్కరాలు విజయవంతం
కర్నూలు: అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమష్టికృషితోనే కృష్ణాపుష్కరాలు విజయవంతమయ్యాయని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. పుష్కరాలు విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేసిన పోలీసు యంత్రాంగాన్ని ఎన్జీఓ సంఘం నాయకులు అభినందించారు. జిల్లా అధ్యక్షుడు వెంగల్రెడ్డి, కార్యదర్శి జవహర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి, నగర అధ్యక్షుడు లక్ష్మన్న,కార్యదర్శి హరిశ్చంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, తాలుకా కార్యవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఎస్పీని కలిసి అభినందించారు. -
ఏ ఉద్యోగమూ తక్కువ కాదు!
ప్రేరణ ఆన్లైన్ కొనుగోళ్ల వెబ్సైట్ అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికన్ హాస్యనటుడు జే లెనో, మెక్‌డోనాల్డ్స్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) జాక్ స్కిన్నర్ల మధ్య ఉన్న సారూప్యం ఏమిటో తెలుసా? వారు తమ కెరీర్‌ను మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్లో ప్రారంభించారు. ప్రారంభంలో వారు అందులో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోసుకున్నారు. మనదేశంలో అలాంటి పరిస్థితిని ఊహించగలమా? ఇక్కడ చాలామందికి చిన్న ఉద్యోగాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. తమ స్థాయికి తగ్గ కొలువులే కావాలని కోరుకుంటారు. సవాళ్లను ఎదుర్కోవాలంటే భయపడతారు. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని అనుకుంటారు. జెఫ్ బెజోస్, జే లెనో, జాక్ స్కిన్నర్ల నుంచి భారత్‌లోని యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎదురుచూపులకు స్వస్తి పలకండి నేటి యువత తమకు ‘సరైన’ ఉద్యోగమే రావాలని కోరుకుంటున్నారు. వస్తున్న ఉద్యోగాలు వారికి నచ్చడం లేదు. అవి చాలా తక్కువ స్థాయి జాబ్లని, అందులో ఎక్కువ జీతం రాదనేది వారి ఫిర్యాదు. కాబట్టి పెద్ద కొలువు కోసమే ఎదురు చూస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఆశించిన జాబ్ రావాలంటే చాలా కష్టం. నేడు విజయవంతమైన వ్యక్తులెందరో ప్రారంభంలో దిగువ స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ పైకొచ్చినవారే. అలాంటి ఉద్యోగాలే వారి ఉన్నతికి తోడ్పడ్డాయి. కాబట్టి ఎదురుచూపులకు ఇకనైనా స్వస్తి పలకండి. మీకు వచ్చిన ఏదో ఒక ఉద్యోగంలో వెంటనే చేరిపోండి. బద్ధకాన్ని వదిలి, పని ప్రారంభించండి. పనిలో నిరాసక్తత వద్దు బర్గర్లు సరఫరా చేసే రెస్టారెంట్లో ఎక్కువ కాలం పనిచేయాలంటే ఎవరికైనా విసుగు అనిపిస్తుంది. చాలా ఉద్యోగాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. నేటి యువతీ యువకులు చాలా త్వరగా బోర్ ఫీలవుతుంటారు. వెంటనే మార్పును కోరుకుంటారు. లాంగ్‌టర్మ్‌లో సక్సెస్ సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అప్పగించిన పనిని సమర్థంగా పూర్తిచేయగలగాలి. నిరాసక్తత కలగకుండా చూసుకోవాలి. మెక్ డోనాల్డ్స్‌లో పనిచేసేటప్పుడు జెఫ్ బెజోస్ ప్రతిరోజూ కనీసం 300 కోడిగుడ్లను పగలగొట్టి, బర్గర్లు తయారు చేయాల్సి వచ్చేది. అయినా బెజోస్ ఎక్కడా నిరాశ చెందలేదు. ఇచ్చిన పనిని ఉత్సాహంగా చేసేవాడు. తర్వాత రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది లావాదేవీలను కొనసాగించే అమెజాన్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఈ వెబ్సైట్ విజయం వెనుక మెక్‌డొనాల్డ్స్‌లో నేర్చుకున్న పని అనుభవం అతడికి ఎంతగానో ఉపయోగపడింది. చిన్నచిన్న పనులను సైతం సమర్థంగా పూర్తిచేయగల లక్షణం వెలకట్టలేనిది. కస్టమర్ చెప్పిందే రైట్! ఒక సంస్థలో మీరు నిర్వర్తిస్తున్న పాత్ర ఎలాంటిదైనా కావొచ్చు. వినియోగదారులను మెప్పించడమే అన్నింటికంటే ప్రధానం. వినియోగదారులకు సేవ చేసే విషయంలో చాలామందికి అహంభావం అడ్డొస్తూ ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే అహంభావాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. సేల్స్ జాబ్‌లో ఉన్నవారు, ఫాస్టుఫుడ్ ఔట్లెట్లలో పనిచేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ మీ మాటే చెల్లుబాటు కావాలనుకుంటే కుదరదు. విజయం.. ఒక్కరోజులో అసాధ్యం! జీవితంలో కోరుకున్న విజయం సాధించాలంటే నిరంతర శ్రమ, బాధ్యతలను భుజానికెత్తుకోవడం, గట్టి పట్టుదల వంటి లక్షణాలు అవసరం. సక్సెస్ వచ్చేవరకూ పట్టువిడవక పనిచేయాలి. ఇన్స్టంట్ సక్సెస్ రావాలని కోరుకుంటే నిరాశ తప్పదు. జాక్ స్కిన్నర్ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లో కౌంటర్ వెనుక 30 ఏళ్లు పనిచేశాడు. అనంతరం అదే సంస్థకు గ్లోబల్ సీఈఓగా ఎదిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన కనీసం కాలేజీకి కూడా వెళ్లలేదు. చేతులకు బురద అంటుకోనివ్వండి బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలు సైతం చిన్నచిన్న పనులు చేసేందుకు ఏమాత్రం సిగ్గుపడరు. భారత్‌లోని ఓ భారీ రిటైల్ మార్కెట్ చైన్ గ్రూప్ కంపెనీ సీఈఓ తమ స్టోర్లలో ఎలాంటి పనులైనా సంతోషంగా చేస్తుంటారు. ఆటోమొబైల్ కంపెనీల యజమానులు కూడా కార్లను మరమ్మత్తు చేస్తుంటారు. చేతులకు గ్రీజ్ మరకలు అంటుకున్నా తమ పనిలోనే ఆనందం పొందుతుంటారు. మెక్ డొనాల్డ్స్‌లో ఉద్యోగంలో ఉన్నప్పుడు జే లెనో అన్ని రకాల పనులు చేసేవారు. అవసరాన్ని బట్టి స్వయంగా చీపురు చేతబట్టి రెస్టారెంట్‌ను శుభ్రం చేసేవారు. కాబట్టి చేతులకు బురద అంటుకున్నా ఫర్వాలేదు, వెంటనే పనిలోకి దిగండి. టీమ్ వర్క్‌తో అద్భుతాలే! మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరితే.. మీరొక్కరే అన్ని పనులూ చేయలేరు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తారు. యాజమాన్యం ఎలాంటి బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పూర్తి చేయాలి. బృందమంతా కలిసి పనిచేస్తేనే సంస్థ విజయం సాధిస్తుంది. మీరు కెరీర్ ప్రారంభించబోయే ముందు జెఫ్ బెజోస్, జే లెనో, జాక్ స్కిన్నర్లను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు చేరబోయే సంస్థ, చేసే ఉద్యోగం, వచ్చే జీతం చాలా తక్కువే కావొచ్చు. కానీ, అక్కడ నేర్చుకునే అనుభవం ఎంతో గొప్పది. భావి జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. -‘కెరీర్స్’ 360 సౌజన్యంతో