దేశ బ్యాడ్మింటన్ చరిత్ర తిరగ రాస్తూ భారత జట్టు థామస్ కప్‌ని గెలుచుకుంది. క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు భారత జట్టును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే గెలిచిన జట్టులో ఓ సభ్యుడైన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చేసిన ఓ వ్యాఖ్య ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. కిదాంబి శ్రీకాంత్ చెప్పిన విషయం ఆటలకే కాదు వ్యాపార రంగానికి ఆ మాటకు వస్తే నిత్య జీవితంలో కూడా పాటించాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం అంటూ కొనియాడారు.
థామస్ గెలుపును ఆస్వాదిస్తూ కిదాంబి శ్రీకాంత్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఈ టోర్నమెంట్‌లో మేమంతా ఒక టీంగా ఎంతో బాగా ఆడామని, ఆ అనుభవం విభిన్నమైనదని తెలిపారు. కప్ గెలుచుకోవడం అనేది పైపూత మాత్రమేనని. నిజానికి ఓ టీమ్‌గా కచ్చితంగా ఆడటమే అసలైన విజయమంటూ తెలిపారు.
అనేక మంది వ్యక్తులతో ముడిపడి ఉండే బిజినెస్‌లో టీంస్పిరిట్ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఇదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా ఎన్నోసార్లు చెప్పారు కూడా. లాభాలు అనేవి బోనస్ మాత్రమేనని అసలైన విజయం లక్ష్యాన్ని చేరుకోవడంలో ఓక టీంగా మనం ఎలా పని చేశానమనేది ముఖ్యమని గతంలో మహీంద్రా చెప్పారు. అదే రకమైన అభిప్రాయాన్ని కిదాంబి శ్రీకాంత్ సైతం వ్యక్తం చేశాడు.
And here’s a good addition to #mondaythoughts He says the Thomas Cup title was simply ‘Icing on the cake.’ It was the Team Experience that was the real prize! Brilliant. Let’s remember that; in Business and in all of Life.. pic.twitter.com/wN3FtLiVhz
— anand mahindra (@anandmahindra) May 16, 2022
చదవండి: మహీంద్రా రైజ్.. ఆటోమొబైల్ సెక్టార్‌లో తొలిసారిగా..
Comments
Please login to add a commentAdd a comment