చుట్టూ కనిపించే విషయాల నుంచే చక్కని బిజినెస్ పాఠాలు చెప్పడం ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా స్పెషాలిటీ. ముఖ్యంగా మనకు తెలియకుండా సాధారణంగా చేసే పనుల్లో ఎంతో విలువైన వ్యాపార సూత్రాలు దాగి ఉంటాయి. అలాంటి అంశాలకు సంబంధఙంచిన ఓ వీడియోను తాజాగా ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు పిల్లలు ఒకే సారి సైకిల్ తొక్కుతూ ముందుకు పోతుంటారు. సైకిల్‌కి ఉండే రెండు పెడల్స్‌పై చేరోవైపునా ఇద్దరు నిలబడి సైకిల్ ముందుకు కదిలేందుకు అవసరమైన ఫోర్స్‌ను అందిస్తుంటారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా కొలాబరేషన్, టీమ్ వర్క్‌లతో ఉపయోగం ఏంటో వివరించేందుకు ఇంతకంటే మంచి వీడియోను హార్వర్డ్ యూనివర్సిటీ కూడా చూపలేదంటూ కామెంట్ చేశారు.
Even Harvard Business School would not have a better video to communicate the virtues of collaboration & teamwork! pic.twitter.com/ALBRYRCFN0
— anand mahindra (@anandmahindra) April 23, 2022
చదవండి👉🏾ప్రపంచ దిగ్గజంగా టీసీఎస్ !
Comments
Please login to add a commentAdd a comment