సీపీ గుర్నానీ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్ర తెలిపింది. గుర్నానీ రాజీనామాను కంపెనీ బోర్డు సమావేశంలో చర్చలు జరిగినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ సందర్భంగా డిసెంబర్ 20, 2023 నుంచి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పదవీ విరమణ చేస్తున్నాను. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డు డైరెక్టర్ పదవి నుంచి వైదొలుగుతున్నాను' అని గుర్నానీ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘నేను ఈ బోర్డులో మూడేళ్లకు పైగా పనిచేశాను. ఈ సమయంలో నా తోటి బోర్డు సభ్యులు, ఎం అండ్ ఎం మేనేజ్ మెంట్ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని గుర్నానీ తన లేఖలో చెప్పారు.
ఉచితంగా స్పెక్ట్రమ్
ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు ఉచిత స్పెక్ట్రమ్ కేటాయించాలని, ఇది దేశ ఆత్మనిర్భరతను పెంచుతుందని, ప్రపంచ రంగంలో భారత పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని గుర్నానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment