ఆనంద్ మహీంద్రా! పరిచయం అక్కర్లేని పేరు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా..స్ఫూర్తిదాయక కథనాలతో పాటు సమకాలీన సంఘటనలపై నిత్యం స్పందిస్తుంటారు. యూజర్లు వేసే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలో..ఆయన ఛైర్మన్‌గా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ గురించి ఓ ఆసక్తిర విషయం వెలుగులోకి వచ్చింది.
ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల్ని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. అదే ఏడాది జూన్ 3న భారత్ - పాక్‌లు వేరయ్యాయి. దీంతో కలిసి ఉన్నప్పుడు స్థాపించిన అనేక సంస్థలు విడిపోయాయి. అలాంటి వాటిల్లో మహీంద్రా అండ్ మహమ్మద్ కంపెనీ ఒకటి. ఇప్పుడు ఆ సంస్థే మహీంద్రా అండ్ మహీంద్రాగా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటీష్ ఇండియాలో 1945లో పంజాబ్‌లోని లూథియానాలో మహీంద్రా - ముహమ్మద్ సంస్థగా ప్రారంభమైంది. ఆనంద్ మహీంద్రా తాతా కైలాష్ చంద్ర మహీంద్రా, అతని సోదరుడు జగదీష్ చంద్ర మహీంద్రా.. మాలిక్ గులాం ముహమ్మద్‌తో కలిసి స్టీల్ ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు. కంపెనీ బొంబాయిలో విల్లీస్ జీపులను తయారు చేసేది. మాలిక్ గులాం మహమ్మద్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు. రెండేళ్ల తర్వాత విభజన జరగడం, మహమ్మద్ ఎం అండ్ ఎంలో తన వాటాను తీసుకొని పాకిస్తాన్‌కు వలస వెళ్ళాడు.
రాజకీయ నాయకుడిగా
పాక్ తొలి ఆర్థిక మంత్రిగా పనిచేయకముందు, మహీంద్రా అండ్ మహ్మద్ స్థాపించకముందే మహ్మద్ మాలిక్ గులాం రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. భోపాల్ రాష్ట్ర నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ నిజాంకు సలహాదారుగా పనిచేశాడు. యుద్ధ సమయంలో అతని సేవలను బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించింది.
ఒక అకౌంటెంట్, బ్యూరోక్రాట్, పారిశ్రామికవేత్తగా కంటే, ముహమ్మద్ తన రాజకీయ చాతుర్యానికి ప్రసిద్ధి చెందాడు. అతను రాజ్యాన్ని, దాని సంస్థలను నాశనం చేయడానికి, సైన్యాన్ని ప్రోత్సహించడానికి బాధ్యత వహించిన పాకిస్తాన్‌లోని ప్రారంభ నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అయినప్పటికీ అతను ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా మొదటి పంచవర్ష ప్రణాళికతో ఘనత పొందాడు.
విభజనకు ముందు బ్రిటీష్ ఇండియాలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాలిక్ గులాం ముహమ్మద్ ఖాన్‌తో క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు. అలా మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ పాక్ దేశానికి తొలి ఆర్ధిక మంత్రిని అందించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment