CP Gurnani
-
గుర్నానీకి హైసియా పురస్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ మహీంద్రా మాజీ సీఈవో, ఎండీ సి.పి.గుర్నానీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. హైసియా 31వ జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. 2022–23 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో మొత్తం 36 కంపెనీలు, వ్యక్తులు హైసియా అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
మహీంద్రా బోర్డు డైరెక్టర్ పదవికి సీపీ గుర్నానీ రాజీనామా!
సీపీ గుర్నానీ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్ర తెలిపింది. గుర్నానీ రాజీనామాను కంపెనీ బోర్డు సమావేశంలో చర్చలు జరిగినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సందర్భంగా డిసెంబర్ 20, 2023 నుంచి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పదవీ విరమణ చేస్తున్నాను. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డు డైరెక్టర్ పదవి నుంచి వైదొలుగుతున్నాను' అని గుర్నానీ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘నేను ఈ బోర్డులో మూడేళ్లకు పైగా పనిచేశాను. ఈ సమయంలో నా తోటి బోర్డు సభ్యులు, ఎం అండ్ ఎం మేనేజ్ మెంట్ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని గుర్నానీ తన లేఖలో చెప్పారు. ఉచితంగా స్పెక్ట్రమ్ ప్రైవేట్ 5జీ నెట్వర్క్ ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు ఉచిత స్పెక్ట్రమ్ కేటాయించాలని, ఇది దేశ ఆత్మనిర్భరతను పెంచుతుందని, ప్రపంచ రంగంలో భారత పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని గుర్నానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ
యువ ఉద్యోగులు, పనిగంటలపై ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలామంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ నారాయణ మూర్తికి మద్దతుగా నిలిచాయి. అటు మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా మూర్తి వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. ఇంటా, బయటా అలుపెరగకుండా పనిచేస్తున్నా కూడా, వారికి తగిన గుర్తింపు లభించడం లేదనీ, దీనికి గురించి ఎవరూ మాట్లాడక పోవడం విచారకరమంటూ ట్వీట్ చేశారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్ ) తాజాగా వ్యాపారవేత్త హర్హ్ గోయెంకా నారాయణ మూర్తి చెప్పినట్టుగా భావిస్తున్న వారానికి 70 గంటల పనివిధానం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 🚀 The 5-day office week is dead! 🏢 People are working nearly 33% of their office time remotely, and it's a game-changer. Flexibility is worth as much to people as an 8% raise. 💰 What we value most is skipping the daily commute and the sense of flexibility! 🚗🚆 🌟 Hybrid work… — Harsh Goenka (@hvgoenka) October 30, 2023 హర్ష్ గోయెంకా ఏమన్నారంటే.. ‘‘వారానికి 5 రోజుల ఆఫీస్ పని విధానానికి కాలం చెల్లింది. ఆఫీసు పనిలో దాదాపు 33 శాతం రిమోట్‌గా పని చేస్తున్నారు. ఇదోక గేమ్-ఛేంజర్. 8 శాతం ప్రొడక్టవిటీని పెంచే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. అలాగే ఆఫీసులకు రోజువారి రాకపోకల్ని నివారించడం, ఫ్లెక్సిబిలీటీ అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.’’ ప్రస్తుతం జరుగుతోంది.. భవిష్యత్తు అంతా హైబ్రిడ్ పని విధానమే. కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుంచా ,రిమోట్‌గానే అనే దానికి మిళితం చేసుకోవాలి. అంతే తప్ప 50-70 గంటలా అనేది కాదు చర్చ. దీనికి బదులుగా మన లక్ష్యం, ప్రయోజనాలు, ఉత్పదకత గురించి ఆలోచించాలి. మార్పును స్వాగతించాల్సిందే.. కొత్త వర్క్ ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా మారాలి. వర్క్ లైఫ్‌లో వర్క్ ఫ్రం హోం, లేదా ఆఫీసా అనే దాంట్లో నిజంగా ముఖ్యమైన దాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది! అంటూ పరోక్షంగా నారాయణమూర్తికి కౌంటర్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇన్పీ మూర్తి మద్దతుగా టెక్ మహీంద్రా సీఈవో పీ గుర్నానీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఆయా కంపెనీల కోసం 70 గంటలు పనిచేయడం గురించి మాట్లాడడం లేదని, వ్యక్తులుగా తమ కోసం లేదా తమ దేశ అభివృద్ధి కోసం 70 గంటలు పనిచేయాలని సూచించాలని గుర్నాని అన్నారు. అంతేకాదు యువత తాము ఎంచుకున్న రంగంలో మాస్టర్‌గా మారాలంటే యువత 10 వేల గంటలను పెట్టుబడిగా పెట్టాలని కూడా గుర్నాని పిలుపు నిచ్చారు. -
సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ సీపీ గుర్నాని
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు వివరించారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్ర సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్ర విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. చదవండి: సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్ -
మేం రెడీ: ఆల్ట్‌మాన్‌కు సీపీ గుర్నానీ చాలెంజ్, ఏం జరిగిందంటే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్ సిలికాన్ వ్యాలీతో భారతీయ నిపుణులు పోటీ పడలేరన్న వ్యాఖ్యలపై టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ స్పందించారు. భారతీయ కంపెనీలు తమ సిలికాన్ వ్యాలీ కౌంటర్ పార్ట్లతో పోటీ పడలేరన్న ఆల్ట్మాన్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశంతో సహా ఆరు దేశాల పర్యటనలో ఉన్న ఆల్ట్‌మాన్‌ను ఇండియాలో చాలా పవర్ ఫుల్ ఎకోసిస్టం ఉంది. ప్రత్యేకంగా ఏఐపై దృష్టి పెడుతున్నాం, కానీ చాట్‌జీపీటీ లాంటి కృత్రిమ మేధస్సు సాధనాన్ని ఇండియా, ఆగ్నేయాసియాలో తయారు చేయగలదా అని మాజీ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. (వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!) "ఇది ఎలా పని చేస్తుందో మీకు చెప్పబోతున్నాం, ట్రైనింగ్ ఫౌండేషన్ మోడల్స్‌పై పోటీ పడటం పూర్తిగా ప్రయోజనం లేనిది, ఆఫ్కోర్స్.. ఎలాగైనా ప్రయత్నించడం మీ జాబ్ అయినా కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందడని సమాధానమిచ్చాడు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఆల్ట్మాన్ వ్యాఖ్యలను పూర్తి తిప్పికొడుతూ గుర్నానీ ట్వీట్ చేశారు. ఒక సీఈవోకి మరో సీఈవోకి ఇచ్చిన సవాలును స్వీకరిస్తున్నానంటూ ప్రతి సవాల్ విసిరారు. మరోవైపు చాట్‌జిపిటి వంటి టూల్‌ను రూపొందించే సామర్థ్యం భారత్‌కు లేదని ఆల్ట్మాన్ పేర్కొన్నప్పటికీ, భారతీయ పారిశ్రామికవేత్తలు తమ సొంత సాధనాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారని ఆనందన్ కూడా ట్వీట్ చేశారు. అంతేకాదు 5000 సంవత్సరాల భారతీయ వ్యవస్థాపకత, భారతీయ పారిశ్రామిక వేత్తలను మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు, తామూ ప్రయత్నించాలనుకుంటున్నామన్నారు. OpenAI founder Sam Altman said it’s pretty hopeless for Indian companies to try and compete with them. Dear @sama, From one CEO to another.. CHALLENGE ACCEPTED. pic.twitter.com/67FDUtLNq0 — CP Gurnani (@C_P_Gurnani) June 9, 2023 -
ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు
సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరనున్నారు. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో శనివారం ప్రకటించింది. గుర్నానీ పదవీ కాలం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపాయి. 2000 నుండి ఇన్ఫోసిస్‌లో భాగమైన మోహిత్ జోషి 2023,మార్చి 11రాజీనామా చేశారు.జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని, జూన్ 9 చివరి తేదీ అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే మోహిత్ జోషి డిసెంబర్ 2023 నుండి 5 (ఐదు) సంవత్సరాలపాటు 2028 వరకు పదవిలో ఉంటారని టెక్ ఎం వెల్లడించింది. ఇన్పీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపార హెడ్‌గా పనిచేసిన జోషికి ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ మరియు కన్సల్టింగ్ స్పేస్‌లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్‌లో, జోషి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్‌కేర్, సాఫ్ట్వేర్ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. అలాగే ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌తో పాటు, ABN AMRO, ANZ Grindlays వంటి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడా పనిచేశారు. సీబీఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్‌గా సేవలందించారు. Aviva Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, రిస్క్ అండ్ గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానితుడు కూడా. మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు
ముంబై: ఐటీ సర్వీసుల దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ విభాగంపై రూ. 700 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న రెండేళ్లలో ఈ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. టెలికం రంగానికి సేవలందిస్తున్న కామ్వివా కొనుగోలు ద్వారా కంపెనీ ఇప్పటికే ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్‌లో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటితోపాటు ఇతర సర్వీసులు సైతం అందిస్తున్న కామ్వివా వార్షికంగా 45 కోట్ల డాలర్ల ఆదాయ రన్‌రేట్‌ను సాధించినట్లు గుర్నానీ వెల్లడించారు. కాగా.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్ ద్వారా రెండేళ్లలో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్ డే సందర్భంగా పుణే నుంచి వర్చువల్‌గా గుర్నానీ ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంపై పెట్టుబడులను కామ్వివా బృందం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కామ్వివా భువనేవ్వర్, బెంగళూరులలోనూ కార్యకలాపాలు విస్తరించినట్లు తెలియజేశారు. టెలికంతోపాటు తాజా విభాగం బీఎఫ్ఎస్ఐ తదితర రంగాలకూ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మరో 20 కోట్ల డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ వార్తల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 1,085 దిగువన ముగిసింది. -
7 బిలియన్ డాలర్లకు ఆదాయం
బార్సిలోనా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 7 బిలియన్ డాలర్ల ఆదాయం(రన్ రేటు)ను అందుకోగలమని ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనిలో టెలికం విభాగం నుంచి 3 బిలియన్ డాలర్లు సమకూరగలదని అంచనా వేశారు. టెలికం కంపెనీలకు అందించే 5జీ సొల్యూషన్ల నుంచి ఇప్పటికే బిలియన్ డాలర్ల(రూ. 8,300 కోట్లు) రన్ రేటును సాధించినట్లు వెల్లడించారు. 6.6 బిలియన్ డాలర్ల రన్ రేటును అందుకున్న తాము త్వరలోనే 7 బిలియన్ డాలర్ల(సుమారురూ. 58,000 కోట్లు)కు చేరుకోగలమని తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్న 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా గుర్నానీ ఈ వివరాలు వెల్లడించారు. లాభం డౌన్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. అయితే ఆదాయం మాత్రం 20 శాతం ఎగసి రూ. 13,735 కోట్లకు చేరింది. అమెరికా ప్రాంతాల నుంచే ఆదాయంలో 50 శాతం లభిస్తున్నట్లు కంపెనీ సీఎంఈ బిజినెస్ ప్రెసిడెంట్, నెట్వర్క్ సర్వీసుల సీఈవో మనీష్ వ్యాస్ తెలియజేశారు. యూరప్ నుంచి 30 శాతం, మిగిలిన ప్రపంచ దేశాల నుంచి 20 శాతం చొప్పున టర్నోవర్ నమోదవుతున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాలలో పెట్టుబడులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఫైబర్, ఫిక్స్డ్ వైర్లెస్.. తదితర టెలికం సంబంధ అన్ని విభాగాలలోనూ వృద్ధి నమోదుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితికి కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. -
HyderabadEPrix వారిద్దరినీ కలవడం అద్భుతం: మెగా పవర్ స్టార్
సాక్షి, హైదరాబాద్: మహేంద్ర రేసింగ్ లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను, టెక్ మహీంద్ర సీఎండీ సీపీ గుర్నాని కలవడం అద్భుతంగా ఉందంటూ మెగా పవర్ స్టార్ రాం చరణ్ ట్వీట్ చేశారు. దీంతోపాటు అంతకంటే అద్భుతమైన పిక్స్‌ను షేర్ చేశారు. ఫార్ములాఈ రేసింగ్‌లో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తెలంగాణా మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. కాగా హుస్సేన్ సాగర్ ఒడ్డున ఫార్ములా ఈ కార్లు రేపు పరుగులు తీయనున్నాయి. ఈ రేసులో భారత సంస్థ మహీంద్రా గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఫార్ములా-ఈ రేసింగ్‌లో పాల్గొనే తమ జనరేషన్-3 ఫార్ములా-ఈ రేస్ కారును శుక్రవారం రాత్రి మహీంద్రా గ్రూప్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రాతో పాటు మంత్రి కేటీఆర్, హీరో రాం చరణ్, టెక్ మహీంద్ర సీఎండీ, ఆటో అండ్ ఫాం సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజిరూకర్, కంపెనీ ఇతర సిబ్బంది హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) It was wonderful meeting @anandmahindra Ji & @C_P_Gurnani Ji at @MahindraRacing Wishing them great success at the Formula E racing! Thank you @KTRBRS Garu for bringing such amazing initiatives to our city.#CheerForTeamMahindra @GreenkoIndia #HyderabadEPrix pic.twitter.com/yKOqpuJ6z5 — Ram Charan (@AlwaysRamCharan) February 10, 2023 A trip to Hyderabad seems almost incomplete without meeting Mr.Hyderabad.. Thank you @KTRBRS for helping bring @MahindraRacing to the home turf.. https://t.co/lUliMXZq5P pic.twitter.com/gHwcnlDHsx — CP Gurnani (@C_P_Gurnani) February 10, 2023 -
మూన్‌లైటింగ్‌పై టెక్ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒక్క మాటతో..!
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూన్‌లైటింగ్‌పై దేశీయ 5వ అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర కీలక వ్యాఖ్యలు చేసింది. మూన్‌లైటింగ్‌కు ఆదిగా మద్దతిచ్చిన కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీ స్పందిస్తూ తమది డిజిటల్ కంపెనీ తప్ప, వారసత్వ సంస్థ కాదని వ్యాఖ్యానించారు. తమ కంపెనీ సైడ్ గిగ్లకు మద్దతునిస్తుందని, అసలు అదే ఫ్యూచర్ అంటూ మంగళవారం కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించడం విశేషం. అయితే మహీంద్రా గ్రూప్ కంపెనీ ఈ అంశంపై ఇంకా ఒక విధానాన్ని తీసుకురాలేదన్నారు. ఎందుకంటే 90కి పైగా దేశాల్లో స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని గుర్నాని మీడియాతో అన్నారు. తన ఉద్యోగులకు మూన్లైట్ను అనుమతించే విధానంపై పనిచేస్తున్నామన్నారు. లెగసీ, డిజిటల్ కంపెనీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, తమది లెగసీ సంస్థ కాదు కాబట్టి మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడంలో విశ్వాసం వస్తుందన్నారు. అయితే సిబ్బంది ముందుకు వచ్చి వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని వెల్లడించాలని కంపెనీ భావిస్తోందని, విలువలు, నైతికత, పారదర్శకత వంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని పేర్కొన్నారు. ఎవరైనా మంచి పనితనం కలిగి ఉంటే సీఈవోగా చాలా సంతోషిస్తాను.. కానీ ఉద్యోగులు అనుమతి తీసుకుని, ఏ పని చేస్తున్నారో తమకు క్లియర్‌గా చెబితే బావుంటుందనే మాట మాత్రం కచ్చితంగా చెబుతానన్నారు. ఇది కంపెనీతోపాటు, ఆ ఉద్యోగికి కూడా శ్రేయస్కరమన్నారు. అయితే ప్రస్తుతం తమ వద్ద ఉన్న 1.63 లక్షల ఉద్యోగుల్లో ఎవరికైనా అనుమతి లేకుండా రెండు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించే విధానం ఏదీ లేదని స్పష్టం చేసిన ఆయన, ఏదైనా ఉల్లంఘన జరిగితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు సెప్టెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు శాతం క్షీణించాయి.సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో పన్ను తర్వాత కన్సాలిడేటెడ్ లాభం (గత ఏడాది నాటి 1,338.7 కోట్లతో పోలిస్తే) 1,285.4 కోట్లకు పడిపోయింది. (Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?) కాగా కోవిడ్ పరిస్థితులు, ఆంక్షలు, వర్క్ ఫ్రంహోం సమయంలో ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ అంశం వివాదాన్ని రేపింది. విప్రో, టీసీఎస్, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థల్లో చర్చకు దారి తీసింది. మూన్ లైటింగ్‌ను ఇన్ఫోసిస్ కూడా వ్యతిరేకించింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవంటూ ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విప్రో ఇదే ఆరోపణలతో 300మంది ఉద్యోగులను తొలగించడంతో ఇది మరింత ముదిరింది. ఫలితంగా 220 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ నైతికత, చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
టెక్ మహీంద్రా గుడ్ న్యూస్: రానున్న ఐదేళ్లలో భారీగా ఐటీ ఉద్యోగాలు
ముంబై: దేశంలోని ఐదవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా గుజరాత్‌లోని ఐటీ ఉద్యోగాలపై శుభవార్త అందించింది. వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో 3,000 మందిని నియమించుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది.(విమానంలో అనుకోని అతిధి, బెంబేలెత్తిన ప్రయాణీకులు) ఐటీ(IT ఎనేబుల్డ్ సర్వీసెస్) పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేసింది.అత్యాధునిక డిజిటల్ ఇంజినీరింగ్ సేవలను అందించేందుకు గుజరాత్ ప్రభుత్వంతో (ఎంఓయూ)పై సంతకం చేశామని టెక్ఎం ప్రకటించింది.అత్యాధునిక డిజిటల్ ఇంజనీరింగ్ సేవలను అందించడానికి ఈ డీల్ ఉపయోగ పడుతుందన్నారు. గుజరాత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నామని, వచ్చే ఐదేళ్లలో 3,000 మందికి పైగా నిపుణులను నియమించుకోనున్నామని కంపెనీ తెలిపింది. మారుతున్న ఇంజినీరింగ్ అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం కంపెనీకి వీలు కల్పిస్తుందని కంపెనీ సీఎండీ సీపీ గుర్నాని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఈజీ బిజినెస్‌కు అందిస్తున్న ప్రోత్సాహంపై ఆయన ప్రశంసలు కురిపించారు. -
టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్ చర్చలు
దావోస్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు రెండో రోజు ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతున్నారు. రెండో రోజు ఉదయం సెషన్లో ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు. విద్యారంగంలో పెట్టుబడులు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిపారు. అదే విధంగా కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు. విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ట్ ఉత్సాహంగా ఉందని ఆమె తెలిపారు. విశాఖ కేంద్రంగా ఐటీ దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కి వచ్చిన టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీతో సీఎం సమావేశం అయ్యారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. సమావేశం ముగిసిన తర్వాత సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని టెక్ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు. దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్ మహీంద్రా చైర్మన్ వెల్లడించారు. మానవ నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు అదే విధంగా ఆర్టిఫియల్ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలనే సంకల్పంతో సీఎం జగన్ ఉన్నట్టు గుర్నానీ వెల్లడించారు. మరింత మంది ప్రముఖులతో దావోస్‌లో జరుగుతున్న సమావేశాల ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సదస్సు రెండో రోజు సీఎం పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అదే విధంగా హీరోమోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ పవన్ ముంజల్‌తోనూ జగన్ సమావేశం కానున్నారు. చివరగా ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ సీఎం జగన్ చర్చలు జరపనున్నారు. ఇంకా మరింత మంది ప్రముఖులనూ ఆయన కలిసే అవకాశం ఉంది. చదవండి: ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్’ - డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టెక్ మహీంద్రా లాభం హైజంప్
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం ఎగసి రూ. 1,081 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 804 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పం గా 2.5 శాతం పుంజుకుని రూ. 9,730 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి నికర లాభం 10 శాతం పురోగమించి రూ. 4,428 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 2.7 శాతం వృద్ధితో రూ. 37,855 కోట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఆగస్ట్ 11న డివిడెండ్... టెక్ మహీంద్రా బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండును సిఫారసు చేసింది. దీనిలో రూ. 15 ప్రత్యేక డివిడెండు కలసి ఉంది. ఆగస్ట్ 11కల్లా డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కలిపి గతేడాదికి కంపెనీ మొత్తం రూ. 45 డివిడెండును చెల్లించినట్లవుతుంది. క్యూ4లో 847 మంది ఉద్యోగులు వైదొలగడంతో 2021 మార్చికల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 1,21,054కు పరిమితమైంది. ఈ ఏప్రిల్ నుంచీ ఉద్యోగులకు వేతన పెంపును చేపడుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి వెల్లడించారు. గతేడాది మార్జిన్లు 2.6 శాతం బలపడి 18.1 శాతానికి చేరటంతోపాటు.. క్యాష్‌ఫ్లో మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఒక ఆసుపత్రితో ఒప్పందం ద్వారా నోయిడాలోని క్యాంపస్‌లో 50 పడకల కోవిడ్ కేర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో గుర్నానీ వెల్లడించారు. బీపీఎస్‌లో పట్టు కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులందించే యూఎస్ కంపెనీ ఎవెంటస్ సొల్యూషన్స్ గ్రూప్‌ను సొంతం చేసుకున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలియజేసింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్(బీపీఎస్) విభాగంలో మరింత సమర్థవంత సేవలందించనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో 2% ఎగసి రూ. 970 వద్ద ముగిసింది. అత్యున్నత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టితో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. దీంతో క్యూ4లో భారీ డీల్స్ దక్కాయి. ఇవి రెట్టింపునకు ఎగసి 100 కోట్ల డాలర్లకు చేరాయి. ఇకపై వృద్ధి బాటలో సాగనున్నాం. ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వచ్చే రెండు త్రైమాసికాలలో 8–10% మేర ఉద్యోగ కల్పన చేపట్టనున్నాం. 5జీ, క్లౌడ్ తదితర విభాగాలలో అధిక వృద్ధికి వీలుంది. – సీపీ గుర్నానీ, టెక్ మహీంద్రా సీఈవో -
టెక్ మహింద్రా సీఈవోకి భారీ వేతనం
ముంబై: ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో టెక్ కంపెలన్నీ ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ వేతనాల పెంపు వాయిదా వేసిన కంపెనీలో టెక్‌మహింద్రా కూడా ఒకటి. వేతనపెంపుకు ఆశపడే టెక్ మహింద్రా ఉద్యోగులు మరో రెండు నెలల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న సీపీ గుర్నాని వేతన ప్యాకేజీ వివరాలు బహిర్గతమయ్యాయి. గత మూడేళ్లలో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలతో పోల్చుకుంటే గుర్నానికే భారీ వేతనాలు అందినట్టు తెలిసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా వ్యవహరిస్తున్న గుర్నాని రూ.150.7 కోట్ల పారితోషికాలను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థికసంవత్సరంలో కూడా టాప్-3 కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సీఈవోల కంటే కూడా అత్యధికంగా గుర్నాని, పరిహారాలు పొందినట్టు వీసీసర్కిల్ రిపోర్టు నివేదించింది. పబ్లిక్ కంపెనీల్లో అత్యధికంగా వేతనాలు పొందే ఎగ్జిక్యూటివ్‌ల వివరాలను ఇది రిపోర్టు చేస్తుంది. గుర్నాని పారితోషికాల్లో రూ.147.17 కోట్లు స్టాక్ ఆప్షన్ల నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఆయన వేతనం, ప్రావిడెంట్‌కు ఆయన అందించే సహకారం మొత్తం కలిపి కేవలం రూ.2.56కోట్లేనట. కాగ, టీసీఎస్ మాజీ సీఈవో, ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పారితోషికాలు రూ.30.15 కోట్లకు పెరుగగా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వేతనం స్వల్పంగా తగ్గి రూ.45.11 కోట్లగా ఉంది. విప్రో చీఫ్‌కు వేతనాలు పెరిగినట్టు రిపోర్టు తెలిపింది.