ముంబై: దేశంలోని ఐదవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా గుజరాత్‌లోని ఐటీ ఉద్యోగాలపై శుభవార్త అందించింది. వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో 3,000 మందిని నియమించుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది.(విమానంలో అనుకోని అతిధి, బెంబేలెత్తిన ప్రయాణీకులు)
ఐటీ(IT ఎనేబుల్డ్ సర్వీసెస్) పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేసింది.అత్యాధునిక డిజిటల్ ఇంజినీరింగ్ సేవలను అందించేందుకు గుజరాత్ ప్రభుత్వంతో (ఎంఓయూ)పై సంతకం చేశామని టెక్‌ఎం ప్రకటించింది.అత్యాధునిక డిజిటల్ ఇంజనీరింగ్ సేవలను అందించడానికి ఈ డీల్ ఉపయోగ పడుతుందన్నారు. గుజరాత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నామని, వచ్చే ఐదేళ్లలో 3,000 మందికి పైగా నిపుణులను నియమించుకోనున్నామని కంపెనీ తెలిపింది. మారుతున్న ఇంజినీరింగ్ అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం కంపెనీకి వీలు కల్పిస్తుందని కంపెనీ సీఎండీ సీపీ గుర్నాని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఈజీ బిజినెస్‌కు అందిస్తున్న ప్రోత్సాహంపై ఆయన ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment