Tech Mahindra Ltd
-
టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: టెక్ సేవల సంస్థ టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్టాక్ ఆప్షన్లుగా రూ. 6 లక్షల కంటే ఎక్కువ విలువైన ఈక్విటీ షేర్లను ఉద్యోగులకు అందించనుంది. ఈఎస్ఓపీ షేర్లు ఒక్కొక్కటి రూ. 5 చొప్పున మొత్తం రూ.6,15,525కి షేర్లను అందించనుంది. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల కింద 1,23,105 ఈక్విటీ షేర్లను అందజేస్తున్నట్లు టెక్ మహీంద్రా సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. మొత్తం రూ.6,15,525 విలువైన షేర్లను వారికి కేటాయిస్తున్నట్టు తెలిపింది. (ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి) కాగా టెక్ మహీంద్రా ఆగస్టులో ఈఎస్ఓపీ ఒక్కొక్కటి రూ. 5 చొప్పున 1.05 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఇష్యూలు 97,36,27,243గా ఉంటాయి. ఇది మొత్తం రూ.486 కోట్లకు చేరుకుంది. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) (ఇదీ చదవండి: ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) -
టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. కంపెనీలు వేగవంతంగా డిజిటల్ వైపు మళ్లేందుకు ఇది సహాయకరంగా ఉండగలదని సంస్థ చీఫ్ డెలివరీ ఆఫీసర్ సుధీర్ నాయర్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫాంతో 25-30 శాతం మేర వ్యయాలు ఆదా కాగలవని, క్లౌడ్‌కు మైగ్రేట్ అయ్యేందుకు పట్టే సమయం కూడా 30 శాతం తగ్గుతుందని వివరించారు. టెలికం, ఆటోమొబైల్ తదితర రంగాలకు అవసరమైన క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్‌ను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. -
‘మూన్‌లైటింగ్’ దుమారం : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్
ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిపై ఆయా టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు పనిచేస్తున్నారంటూ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. కానీ టెక్ మహీంద్రా మాత్రం అందుకు విభిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగులకు మూన్‌లైటింగ్ పాల్పడటాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా మూన్‌లైటింగ్‌పై మరో కీలక ప్రకటన చేసింది. నవంబర్ నెలలో ఉద్యోగుల కోసం తన మూన్‌లైటింగ్ పాలసీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. వర్క్‌కు ఆటంకం కలగనంత వరకు గిగ్ వర్క్స్‌కు అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారాంతంలో లేదా వారంలో రెండు గంటలు వంటి స్వల్ప కాలానికి మాత్రమే పనిచేసేందుకు అంగీకరించనున్నట్లు సమాచారం. చదవండి👉 ‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’ టెక్ మహీంద్రా మూన్ లైటింగ్ పాలసీలో ఆఫీస్‌కు వర్క్‌తో ఎలాంటి పోటీ ఉండకూడదు. మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ లేదా కస్టమర్ కాంట్రాక్ట్ కు కట్టుబడి ఉండాలి. కంపెనీ నుంచి రాతపూర్వక అనుమతి అవసరం’ వంటి సంస్థ నిర్ధిష్ట సూత్రాలను కలిగి ఉంటుందని ఈ సందర్భంగా సోయిన్ పేర్కొన్నారు. అట్రిషన్ రేటు తగ్గుతుంది ఈ ఏడాది ఆగస్టులో స్విగ్గీ తన ఉద్యోగులను పని గంటల తర్వాత గిగ్ వర్క్స్ చేసుకోవచ్చంటూ మూన్‌లైటింగ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫోసిస్ సైతం అంతకు ముందు మూన్‌లైటింగ్ చేసే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. కానీ అది కాస్త వివాదం కావడంతో గిగ్ ఉద్యోగాలు చేసేందుకు అనుమతించింది. అయితే టెక్ సంస్థలు తీసుకునే ఈ నిర్ణయం వల్ల అట్రిషన్ రేటు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే శాలరీల కోసం వేరే సంస్థలోకి వెళ్లే ఆలోచనల్ని విరమిస్తారని భావిస్తున్నారు. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
మూన్‌లైటింగ్‌పై టెక్ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒక్క మాటతో..!
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూన్‌లైటింగ్‌పై దేశీయ 5వ అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర కీలక వ్యాఖ్యలు చేసింది. మూన్‌లైటింగ్‌కు ఆదిగా మద్దతిచ్చిన కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీ స్పందిస్తూ తమది డిజిటల్ కంపెనీ తప్ప, వారసత్వ సంస్థ కాదని వ్యాఖ్యానించారు. తమ కంపెనీ సైడ్ గిగ్లకు మద్దతునిస్తుందని, అసలు అదే ఫ్యూచర్ అంటూ మంగళవారం కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించడం విశేషం. అయితే మహీంద్రా గ్రూప్ కంపెనీ ఈ అంశంపై ఇంకా ఒక విధానాన్ని తీసుకురాలేదన్నారు. ఎందుకంటే 90కి పైగా దేశాల్లో స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని గుర్నాని మీడియాతో అన్నారు. తన ఉద్యోగులకు మూన్లైట్ను అనుమతించే విధానంపై పనిచేస్తున్నామన్నారు. లెగసీ, డిజిటల్ కంపెనీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, తమది లెగసీ సంస్థ కాదు కాబట్టి మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడంలో విశ్వాసం వస్తుందన్నారు. అయితే సిబ్బంది ముందుకు వచ్చి వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని వెల్లడించాలని కంపెనీ భావిస్తోందని, విలువలు, నైతికత, పారదర్శకత వంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని పేర్కొన్నారు. ఎవరైనా మంచి పనితనం కలిగి ఉంటే సీఈవోగా చాలా సంతోషిస్తాను.. కానీ ఉద్యోగులు అనుమతి తీసుకుని, ఏ పని చేస్తున్నారో తమకు క్లియర్‌గా చెబితే బావుంటుందనే మాట మాత్రం కచ్చితంగా చెబుతానన్నారు. ఇది కంపెనీతోపాటు, ఆ ఉద్యోగికి కూడా శ్రేయస్కరమన్నారు. అయితే ప్రస్తుతం తమ వద్ద ఉన్న 1.63 లక్షల ఉద్యోగుల్లో ఎవరికైనా అనుమతి లేకుండా రెండు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించే విధానం ఏదీ లేదని స్పష్టం చేసిన ఆయన, ఏదైనా ఉల్లంఘన జరిగితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు సెప్టెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు శాతం క్షీణించాయి.సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో పన్ను తర్వాత కన్సాలిడేటెడ్ లాభం (గత ఏడాది నాటి 1,338.7 కోట్లతో పోలిస్తే) 1,285.4 కోట్లకు పడిపోయింది. (Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?) కాగా కోవిడ్ పరిస్థితులు, ఆంక్షలు, వర్క్ ఫ్రంహోం సమయంలో ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ అంశం వివాదాన్ని రేపింది. విప్రో, టీసీఎస్, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థల్లో చర్చకు దారి తీసింది. మూన్ లైటింగ్‌ను ఇన్ఫోసిస్ కూడా వ్యతిరేకించింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవంటూ ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విప్రో ఇదే ఆరోపణలతో 300మంది ఉద్యోగులను తొలగించడంతో ఇది మరింత ముదిరింది. ఫలితంగా 220 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ నైతికత, చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
టెక్ మహీంద్రా గుడ్ న్యూస్: రానున్న ఐదేళ్లలో భారీగా ఐటీ ఉద్యోగాలు
ముంబై: దేశంలోని ఐదవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా గుజరాత్‌లోని ఐటీ ఉద్యోగాలపై శుభవార్త అందించింది. వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో 3,000 మందిని నియమించుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది.(విమానంలో అనుకోని అతిధి, బెంబేలెత్తిన ప్రయాణీకులు) ఐటీ(IT ఎనేబుల్డ్ సర్వీసెస్) పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేసింది.అత్యాధునిక డిజిటల్ ఇంజినీరింగ్ సేవలను అందించేందుకు గుజరాత్ ప్రభుత్వంతో (ఎంఓయూ)పై సంతకం చేశామని టెక్ఎం ప్రకటించింది.అత్యాధునిక డిజిటల్ ఇంజనీరింగ్ సేవలను అందించడానికి ఈ డీల్ ఉపయోగ పడుతుందన్నారు. గుజరాత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నామని, వచ్చే ఐదేళ్లలో 3,000 మందికి పైగా నిపుణులను నియమించుకోనున్నామని కంపెనీ తెలిపింది. మారుతున్న ఇంజినీరింగ్ అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం కంపెనీకి వీలు కల్పిస్తుందని కంపెనీ సీఎండీ సీపీ గుర్నాని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఈజీ బిజినెస్‌కు అందిస్తున్న ప్రోత్సాహంపై ఆయన ప్రశంసలు కురిపించారు. -
2022లో ఐటీ షేర్లకు ఏమైంది? ఎందుకింత నష్టం
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ కంపెనీల షేర్లు ఈ ఏడాది ప్రధాన రంగాల నష్టాల్లో నిలిచాయి. సాధారణంగా రేసుగుర్రాల్లా దూసుకుపోయే ఐటీ కంపెనీలకు 2022లో ఎదురు దెబ్బ తగిలింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్యూ4 ఆదాయాల సీజన్లో ప్రతికూల సెంటిమెంట్, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు మార్కెట్లో ఐటీ షేర్లను అశనిపాతంలా చుట్టుకుంది. బిజినెస్ టుడే కథనం ప్రకారం బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2022లో 25 శాతం లేదా 9,524 పాయింట్లను కోల్పోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 7.44 శాతం లేదా 4,336 పాయింట్లు క్షీణించింది. అలాగే, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 37,071 స్థాయినుంచి 27,708కి పడిపోయింది. వార్షిక ప్రాతి పదికన 9,363 పాయింట్లు లేదా 25.25 శాతం నష్టపోయింది. అలాగే ఎఫ్ఐఐలు ఈ ఏడాది భారత మార్కెట్లో రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడంతో ఐటీ స్టాక్‌ల సెంటిమెంట్ బలహీనపడింది. టెక్ మహీంద్ర, విప్రో, సియంట్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, జస్ట్ డయల్, టీ సీఎస్ ప్రధానంగా నష్టపోయిన ఐటీ షేర్లు ఇక ఆదాయాల విషయంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వృద్ధి అంచనాలను అందుకో లేకపోయాయి. క్యూ4లో దిగ్గజ ఐటీ కంపెనీల మార్జిన్ ఔట్లుక్ మితంగా ఉండడం కూడా ఈ నష్టాలకుఒక కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 303 పాయింట్ల నష్టంతో 54 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ 99 పాయంట్లను కోల్పోయి 16025 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల నష్టాలతో వరుసగా మూడో రోజు కూడా ఈక్విటీ మార్కెట్ నెగిటివ్‌గా ముగిసింది. -
టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త.. వేతనాల పెంపు ఎంతంటే?
ముంబై: టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఈ కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ. త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్ మహీంద్రా ఉద్యోగులకు 10 శాతం వేతనాలు పెంచుతున్నాట్టు ప్రకటించారు. ‘‘సరఫరా వైపు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చాం. సగటున ఒక్కో ఉద్యోగికి వేతన పెంపు 10 శాతం మేర ఉంటుంది’’అని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. టెక్ మహీంద్రా లాభం భేష్ ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసికానికి పనితీరు పరంగా అంచనాలకు అందుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.1,506 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా (క్రితం త్రైమాసికం నుంచి) చూసినా నికర లాభం 10 శాతం వృద్ధిని చూపించింది. విశ్లేషకుల అంచనా రూ.1,411 కోట్ల కంటే ఇది ఎక్కువగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం వృద్ధితో రూ.12,116 కోట్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్)తో పోల్చి చూసినా ఆదాయంలో 5.8 శాతం వృద్ధి కనిపిస్తోంది. మార్చి త్రైమాసికంలో ఎస్ఈజెడ్ సంబంధిత కేటాయింపులు తిరిగి రావడం కూడా లాభాల్లో వృద్ధికి సాయపడిన అంశాల్లో ఒకటి. 2021–22 ఏడాదికి ఒక్కో షేరుకు తుది డివిడెండ్‌గా రూ.15 ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ‘‘ఆవిష్కరణలపై దృష్టి సారించడం, బలమైన కస్టమర్, భాగస్వామ్య ఎకోసిస్టమ్ ఏర్పాటులో మాకున్న సామర్థ్యాలు పటిష్ట వృద్ధికి దోహదపడినట్టు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. విభాగాల వారీగా.. - ఎంటర్ప్రైజ్ వెర్టికల్ ఆదాయం 5.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కమ్యూనికేషన్ విభాగం స్థిరమైన కరెన్సీ పరంగా 4.8 శాతం వృద్ధి చూపించింది. - బీఎఫ్ఎస్ఐ విభాగం మొత్తం ఆదాయం 15.4 శాతం మేర క్రితం త్రైమాసికంలో ఉంటే, అది మార్చి చివరికి 17.4 శాతానికి విస్తరించింది. - బ్రెడ్ అండ్ బటర్ కమ్యూనికేషన్స్, తయారీ విభాగాల ఆదాయం సీక్వెన్షియల్‌గా క్షీణతను చూశాయి. డీల్స్ జోరు... మార్చి త్రైమాసికంలో బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అతిపెద్ద డీల్‌ను టెక్ మహీంద్రా గెలుచుకుంది. 2021–22 మొత్తం మీద 3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను సొంతం చేసుకుంది. యూరోప్‌లో ఒక 5జీ ఆపరేటర్ నుంచి, రిటైల్, హెల్త్‌కేర్ విభాగాల నుంచి డీల్స్ వచ్చాయి. ‘‘సుస్థిర డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, నూతనతరం టెక్నాలజీపై పెట్టుబడులు కలసి గణనీయమైన వృద్ధికి తోడ్పడడమే కాకుండా.. గత ఏడేళ్లలోనే అతిపెద్ద డీల్ గెలుచుకోవడం సాధ్యపడింది’’అని గుర్నానీ తెలిపారు. కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్, మెటావర్స్ విభాగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని చూపిస్తాయన్నారు. నిర్వహణ మార్జిన్ డౌన్ ఆపరేటింగ్ మార్జిన్ 2021 డిసెంబర్ త్రైమాసికంలో 14.8% ఉంటే, మార్చి త్రైమాసికంలో 13.2 శాతానికి తగ్గిపోయింది. అధిక వేతనాలు, ఉద్యోగులను కాపాడుకునేందుకు చేసిన వ్యయాలు మార్జిన్లపై ప్రభాం చూపించినట్టు కంపెనీ తెలిపింది. 2021–22 సంవత్సరానికి.. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.44,646 కోట్లకు చేరింది. నికర లాభం కూడా 26 శాతం పుంజుకుని రూ.5,566 కోట్లుగా నమోదైంది. చదవండి: సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్ బజాజ్ -
గుడ్‌న్యూస్! టెక్ మహీంద్రాలో ఈ ఏడాది 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం బలపడి రూ. 1,378 కోట్లను అధిగమించింది. సరఫరా సవాళ్ల కారణంగా లాభాలు పరిమితమైనట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 11,450 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 15.9 శాతం నుంచి 14.8 శాతానికి నీరసించాయి. క్యూ3లో ఆదాయాలు మెరుగుపడినప్పటికీ సరఫరా సమస్యలు లాభదాయకతకు అడ్డుపడినట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి తెలియజేశారు. ప్రధానంగా కొత్త ఉద్యోగాలు, వేతన పెంపు, ప్రయాణ ఆంక్షల నడుమ సబ్‌కాంట్రాక్టులు వంటి అంశాలు దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. 10,000 మందికి చాన్స్ అంచనాలకు అనుగుణంగా క్యూ3లో 15 శాతం స్థాయిలో మార్జిన్లను సాధించినట్లు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ప్రస్తావించారు. గతంతో పోలిస్తే ఈ కాలంలో మానవ వనరుల అంశంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదని తెలియజేశారు. తాజాగా చేర్చుకున్న 3,800 మంది ఉద్యోగులతో కలిపి సిబ్బంది సంఖ్య 1.45 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు చోటు కల్పించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో మరో 15,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. తాజా సమీక్షా కాలంలో ఉద్యోగ వలసల(ఎట్రిషన్) రేటు రెట్టింపై 24 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు. చదవండి:హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు -
టెక్ మహీంద్రా- ఎంఅండ్ఎం ఫైనాన్స్ స్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టెక్ మహీంద్రా లిమిటెడ్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం అధికంగా రూ. 972 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో త్రైమాసిక ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం 33 శాతం వృద్ధి చూపి రూ. 1283 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు స్వల్పంగా బలపడి 14.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 703కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 685 వద్ద ట్రేడవుతోంది. తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 11.3 మిలియన్ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో చేతులు మారడం గమనార్హం! ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 3089 కోట్ల సమీకరణకు నేటి నుంచి రైట్స్ ఇష్యూ చేపట్టిన నేపథ్యంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. రైట్స్‌లో భాగంగా రూ. 2 ముఖ విలువగల 61.78 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వాటాదారుల వద్ద గల ప్రతీ 1 షేరుకీ మరొక షేరుని కేటాయించనుంది. ఆగస్ట్ 11న ముగియనున్న రైట్స్ ఇష్యూకి రూ. 50 ధరను నిర్ణయించిన విషయం విదితమే. -
టెక్ మహీంద్ర ఆఫీసు మూత
భువనేశ్వర్ : కరోనా మహమ్మారి ప్రకంపనలు ప్రముఖ టెక్ సేవల సంస్థ టెక్ మహీంద్రను తాకాయి. గత వారంలో ఏడుగురు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్ లోని టెక్ మహీంద్ర కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంపీ) మంగళవారం నగరంలోని టెక్ మహీంద్ర క్యాంపస్‌కు సీలు వేసింది. (బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా) కోవిడ్-19 కేసులను గుర్తించిన తరువాత శానిటైజేషన్ కోసం గురువారం వరకు సంస్థ కార్యాలయాన్ని 72 గంటలు మూసి వేసినట్లు బీఎంసీ నార్త్ జోనల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రస్టీ తెలిపారు. మొదటి కేసు జూన్ 29 న నమోదైనట్టు చెప్పారు. దీంతో 65 మంది ఉద్యోగులు హోం క్వారంటైన్ లో ఉన్నారని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకుంటారని ఆయన వెల్లడించారు. అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ ఏడుగురు వ్యక్తులతో పరిచయం ఉన్న ఇతరులను వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) కాగా ఒడిశాలో మంగళవారం కేసుల సంఖ్య 10,000 మార్కును దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 42 మంది మరణించారు. గత 24 గంటల్లో ఖుర్దాలో నమోదైన 37 కేసుల్లో 26 కేసులు భువనేశ్వర్ కు చెందినవేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్) -
టెక్ మహీంద్రలో 4వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర టెకీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాబోయే మూడు త్రైమాసికాల్లో సంస్థ ఉద్యోగులను పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్టు చెప్పింది. దాదాపు నాలుగు వేలమంది కొత్త ఉద్యోగాలను అదనంగా జోడించుకోవాలని చూస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,800 మందిని నియమించు కున్నట్లు వెల్లడించింది. వచ్చే తొమ్మిది నెలలకాలంలో 4వేల మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు. జూన్ 2018 నాటికి కంపెనీలో 1,13,552 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 72,462.. బీపీఓ విభాగంలో 34,700 మంది ఉద్యోగులు, సేల్స్‌లో 6,390 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. డిమాండ్ ఆధారిత నియామకంపై మరింత దృష్టి పెట్టినట్టు టెక్ మహీంద్ర ప్రధాన ఆర్థిక అధికారి మనోజ్ భట్ తెలిపారు. -
అంచనాలను అధిగమించిన టెక్ మహీంద్ర
సాక్షి,ముంబై: దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఈ ఏడాది మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను సోమవారం విడుదల చేసింది. విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికరలాభం 12.8 శాతం పెరిగి రూ .943 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం 2.2 శాతం పెరిగి రూ. 7776 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం( ఇబిటా) రూ. 1256 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 16.3 శాతంగా నమోదయ్యాయి. డాలర్ పరంగా రెవెన్యూ 2.5 శాతం పెరిగి 1,209 మిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. వడ్డీకి ముందు ఆదాయం 17.9 శాతం పెరిగి 990 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 12.7 శాతం పెరిగింది. డిజిటల్ ట్రాన్సఫర్మేషన్పై తాము ఎక్కువగా దృష్టిపెట్టామని, భవిష్యత్ ఆవశ్యకతల కనుగుణంగా తమ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని టెక్ మహీంద్ర వైస్ ఛైర్మన వినీత్ నయ్యర్ తెలిపారు. మరోవైపు సోమవారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించడంతో మంగళవారం ట్రేడింగ్‌లో సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఉద్యోగులకు రాంరాం చెబుతున్న టెక్ దిగ్గజాలు
సాక్షి, న్యూఢిల్లీ : 156 బిలియన్ డాలర్ల ఐటీ ఇండస్ట్రి ఇంకా పరిస్థితులు మారడం లేదు. ఉద్యోగాల సృష్టికి అతిపెద్ద పరిశ్రమగా ఉండే ఈ ఐటీ రంగం, గత కొన్నాళ్లుగా కొట్టుమిట్టాడుతూనే ఉంది. కొత్త నియామకాలు లేకపోవడం, పాత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టాప్ టెక్ దిగ్గజాలన్నీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్రా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించేసుకున్నాయి. కాగ్నిజెంట్‌లో ఈ సంఖ్య బాగా పడిపోయింది. టాప్-6 ఐటీ కంపెనీల్లో కేవలం టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఆరు టెక్ కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో 4,157 మంది తగ్గిపోయారు. గతేడాది ఇదే సమయంలో ఈ కంపెనీల్లో 60వేల మేర ఉద్యోగాలు పెరిగితే, ఈ ఏడాది మాత్రం 4,157 మేర ఉద్యోగాలు పడిపోయాయి. డిజిటలైజేషన్, ఆటోమేషన్ అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, కొన్ని సవాళ్లను కూడా ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు. కేవలం నియామకాలు పడిపోవడమే కాకుండా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం చూస్తున్నామని ఐటీ కన్సల్టింగ్ సంస్థ హెచ్ఎఫ్సీ రీసెర్చ్ తెలిపింది. ఆటోమేషన్ ప్రభావంతో రెడండెంట్‌గా ఉన్న వేల కొద్దీ ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలను కంపెనీలు తీసేస్తున్నాయని పేర్కొంది.. అధిక వినియోగం, ఉత్పాదకత మెరుగుదలతో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించామని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ ఎండీ రంగనాథ్ చెప్పారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు రీ-ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. -
టెక్ మహీంద్రా లాభం రూ.836 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.645 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.836 కోట్లకు పెరిగిందని టెక్ మహీంద్రా తెలిపింది. ఆదాయం రూ.7,167 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.7,606 కోట్లకు పెరిగిందని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. డాలర్ల పరంగా నికర లాభం 34 శాతం వృద్ధితో 12.9 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 117 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, పరిశ్రమ డిమాండ్లు అప్పటికప్పుడు మారుతూ ఉన్నప్పటికీ, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ మంచి వృద్ధి సాధించామని వినీత్ నయ్యర్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.5,961 కోట్లుగా ఉన్నాయని వివరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 75,587, బీపీఓ వ్యాపారానికి సంబంధించిన ఉద్యోగులు 35,287గా మొత్తం మీద తమ కంపెనీ ఉద్యోగులు 1.17 లక్షలుగా ఉన్నారని వివరించారు. డేవిడ్ వ్యూహంతో వృద్ధి... తమ డేవిడ్ (డిజిటైజేషన్, ఆటోమేషన్, వెర్టికలైజేషన్, ఇన్నోవేషన్, డిస్రప్షన్) వ్యూహం మంచి ఫలితాలనిస్తోందని, ఆదాయం, లాభం, కొత్త వ్యాపారాల్లో మంచి వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ ఎండీ, సీపీ, గుర్నాని పేర్కొన్నారు. ఫలి తాల నేపథ్యంలో మార్కెట్లో టెక్ మహీంద్రా షేరు 1.5 శాతం పెరిగి రూ.489 వద్ద ముగిసింది. -
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ
దేశీ బ్యాంకింగ్ రంగానికి ఊపునిస్తూ కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా మధ్య జరిగిన విలీన ఒప్పందం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. మరోవైపు చైనాసహా, యూరోపియన్ దేశాలు నామమాత్ర వడ్డీ రేట్లకే కట్టుబడటంతోపాటు సహాయక ప్యాకేజీలకు తెరలేపడం సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశముంటుందన్న అంచనాలు దేశీ స్టాక్ మార్కెట్లను మళ్లీ కొత్త రికార్డులవైపు పరుగు పెట్టించాయి. వెరసి 75 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 8,477 వద్ద నిలవగా, సెన్సెక్స్ 267 పాయింట్లు జంప్‌చేసి 28,335 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ గరిష్టంగా 28,361కు చేరగా, నిఫ్టీ 8,490ను తాకింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 8,500, సెన్సెక్స్ 28,500 పాయింట్ల మైలురాళ్ల సమీపానికి చేరాయి. బీఎస్ఈలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 2.5% ఎగసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు కూడా కొనుగోళ్లకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని విశేషాలివీ.... ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకోనున్న కొటక్ మహీంద్రా షేరు మరోసారి 4% పుంజుకోవడం ద్వారా రూ. 1,200 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9% జంప్‌చేసి రూ. 1,261కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, యాక్సి స్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 1.5-4% మధ్య పురోగమించాయి. ఈ బాటలో సౌత్ ఇండియా బ్యాంక్, కర్టాటక బ్యాంక్, యస్ బ్యాంక్ సైతం 5.5-4% మధ్య ఎగశాయి. గతంలో నిలిపివేసిన కేటాయింపులను విడుదల చేసేందుకు రైల్వే బోర్డు నిర్ణయించడంతో రైలు షేర్లు లాభాల పరుగందుకున్నాయి. సిమ్కో 20%, టిటాగఢ్ వ్యాగన్స్ 11%, టెక్స్మాకో 5%, కాళిందీ రైల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. మరిన్ని విలీనాలకు అవకాశముందన్న అంచనాలతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు పుంజుకుంటే, అవసరమైనమేర పెట్టుబడులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లు పురోగమించాయి. ఇక ఎఫ్ఐఐల తాజా పెట్టుబడులకు ఆర్బీఐ అనుమతించడంతో యస్ బ్యాంక్ షేరు ఊపందుకోగా, రూ. 10 ముఖవిలువగల షేరుని రూ. 2 ముఖ విలుగల 5 షేర్లుగా విభజించేందుకు డిసెంబర్ 5ను రికార్డు డేట్‌గా ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ జంప్ చేసింది. యస్ బ్యాంక్‌లో పరిమితికంటే దిగువకు ఎఫ్ఐఐల పెట్టుబడులు చేరుకోవడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. స్పైస్‌జెట్ షేరు జూమ్ స్పైస్‌జెట్‌లో ప్రమోటర్లకున్న వాటాను పూర్తిగా లేదా కొంతమేర విక్రయించనున్నట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కంపెనీలో సన్ గ్రూప్‌నకు 53.4% వాటా ఉంది. అయితే స్పైస్‌జెట్ ప్రమోటర్ కళానిధి మారన్ ఎంతమేర వాటా విక్రయించేదీ స్పష్టంకాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు 15% జంప్‌చేసింది.