Tech Mahindra Rewards Employees ESOP Rs 5 per Share - Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్ర ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

Published Tue, Dec 13 2022 3:16 PM | Last Updated on Tue, Dec 13 2022 3:48 PM

Tech Mahindra rewards employees ESOP Rs 5 per share - Sakshi

సాక్షి,ముంబై: టెక్‌ సేవల సంస్థ  టెక్ మహీంద్ర  ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది.  స్టాక్ ఆప్షన్‌లుగా రూ. 6 లక్షల కంటే ఎక్కువ విలువైన ఈక్విటీ షేర్లను  ఉద్యోగులకు అందించనుంది. ఈఎస్‌ఓపీ షేర్లు ఒక్కొక్కటి రూ. 5 చొప్పున మొత్తం రూ.6,15,525కి  షేర్లను  అందించనుంది. 

ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల కింద 1,23,105 ఈక్విటీ షేర్లను అందజేస్తున్నట్లు టెక్ మహీంద్రా సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. మొత్తం రూ.6,15,525 విలువైన షేర్లను వారికి కేటాయిస్తున్నట్టు తెలిపింది.  (ఐఐపీ డేటా షాక్‌: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి)

కాగా టెక్ మహీంద్రా ఆగస్టులో ఈఎస్‌ఓపీ ఒక్కొక్కటి రూ. 5 చొప్పున 1.05 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఇష్యూలు 97,36,27,243గా ఉంటాయి. ఇది మొత్తం రూ.486 కోట్లకు చేరుకుంది.  (మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌)

(ఇదీ చదవండి: ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్‌ వెరిఫైడ్‌ మార్క్‌ షురూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement