న్యూఢిల్లీ: ఆన్–డిమాండ్ కనీ్వనియెన్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అర్హులైన ఉద్యోగుల కోసం 50 మిలియన్ డాలర్లతో (దాదాపు రూ. 410 కోట్లు) ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. గతంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాల కింద ఇచి్చన షేర్లను కంపెనీ ఈ ప్రోగ్రాం ద్వారా బైబ్యాక్ చేయనుంది. తమ ఎసాప్స్‌ను సంస్థకు విక్రయించి నగదు పొందేందుకు అర్హులైన ఉద్యోగులకు ఈ రూపంలో ఒక ఆప్షన్ ఉంటుందని స్విగ్గీ తెలిపింది.
గతేడాది కొనుగోలు చేసిన డైన్‌అవుట్‌కి చెందిన సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని వివరించింది. ఉద్యోగులకు సంపదను సమకూర్చే ఉద్దేశంతో దీన్ని చేపట్టినట్లు స్విగ్గీ హెడ్ (హెచ్‌ఆర్ విభాగం) గిరీష్ మీనన్ తెలిపారు. సుమారు 2,000 మంది ఈ ప్రోగ్రాంకు అర్హత కలిగి ఉంటారని అంచనా. రెండేళ్ల ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రాం కింద.. స్విగ్గీ గతేడాది కూడా 23 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 180 కోట్లు) ఇదే తరహా ప్రక్రియ నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment