ESOP
-
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఉద్యోగులకు స్విగ్గీ మరో విడత ఎసాప్ల లిక్విడిటీ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: ఆన్–డిమాండ్ కనీ్వనియెన్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అర్హులైన ఉద్యోగుల కోసం 50 మిలియన్ డాలర్లతో (దాదాపు రూ. 410 కోట్లు) ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. గతంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాల కింద ఇచి్చన షేర్లను కంపెనీ ఈ ప్రోగ్రాం ద్వారా బైబ్యాక్ చేయనుంది. తమ ఎసాప్స్‌ను సంస్థకు విక్రయించి నగదు పొందేందుకు అర్హులైన ఉద్యోగులకు ఈ రూపంలో ఒక ఆప్షన్ ఉంటుందని స్విగ్గీ తెలిపింది. గతేడాది కొనుగోలు చేసిన డైన్అవుట్కి చెందిన సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని వివరించింది. ఉద్యోగులకు సంపదను సమకూర్చే ఉద్దేశంతో దీన్ని చేపట్టినట్లు స్విగ్గీ హెడ్ (హెచ్ఆర్ విభాగం) గిరీష్ మీనన్ తెలిపారు. సుమారు 2,000 మంది ఈ ప్రోగ్రాంకు అర్హత కలిగి ఉంటారని అంచనా. రెండేళ్ల ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రాం కింద.. స్విగ్గీ గతేడాది కూడా 23 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 180 కోట్లు) ఇదే తరహా ప్రక్రియ నిర్వహించింది. -
టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: టెక్ సేవల సంస్థ టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్టాక్ ఆప్షన్లుగా రూ. 6 లక్షల కంటే ఎక్కువ విలువైన ఈక్విటీ షేర్లను ఉద్యోగులకు అందించనుంది. ఈఎస్ఓపీ షేర్లు ఒక్కొక్కటి రూ. 5 చొప్పున మొత్తం రూ.6,15,525కి షేర్లను అందించనుంది. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల కింద 1,23,105 ఈక్విటీ షేర్లను అందజేస్తున్నట్లు టెక్ మహీంద్రా సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. మొత్తం రూ.6,15,525 విలువైన షేర్లను వారికి కేటాయిస్తున్నట్టు తెలిపింది. (ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి) కాగా టెక్ మహీంద్రా ఆగస్టులో ఈఎస్ఓపీ ఒక్కొక్కటి రూ. 5 చొప్పున 1.05 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఇష్యూలు 97,36,27,243గా ఉంటాయి. ఇది మొత్తం రూ.486 కోట్లకు చేరుకుంది. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) (ఇదీ చదవండి: ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) -
మిలియనీర్లుగా మారనున్న ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు
న్యూఢిల్లీ : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన విషయం తెలిసిందే. 16 బిలియన్ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కూడా ఇటీవలే ఆమోదం తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ కింద 126- 128 డాలర్ల(ఒక్కో యూనిట్) విలువైన షేర్లను విక్రయించేందుకు అనుమతినిస్తూ లేఖ రాసింది. దీంతో ఫ్లిప్‌కార్టు ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు. ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లోని 6, 242, 271 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందులో ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్లవిలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఒక్కో యూనిట్ 126- 128 డాలర్ల చొప్పున వాల్‌మార్ట్ కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఈఎస్ఓపీ కింద ఉన్న షేర్లను నగదుగా మార్చుకునేందుకు ఉద్యోగులకు అవకాశం దక్కింది. మా ఉద్యోగుల శ్రమకు ఫలితంగా ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందిస్తాం. ప్రస్తుతం ఈ కొనుగోలు ద్వారా ఉద్యోగులు సుమారు 800 మిలియన్లు ఆర్జించనున్నారు’ అని ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ రెండు ఆన్లైన్ దిగ్గజాల మధ్య లావాదేవీలు పూర్తయ్యే రెండేళ్లలోగా ఉద్యోగులు ఈఎస్ఓపీ కింద 100 శాతం వాటాను విక్రయించవచ్చు. అయితే ఈ ఏడాది 50 శాతం, వచ్చే ఏడాది 25 శాతం, 2020లో మరో 25 శాతం వాటాను నగదుగా మార్చుకునే వీలు కల్పించింది కంపెనీ యాజమాన్యం. కాగా తాము పనిచేస్తున్న కంపెనీలో షేర్లను ఉద్యోగులు కొనుగోలుచేసేందుకు ఈఎస్ఓపీ అనేది ఒక ప్రయోజనకర ప్లాన్. -
పేటీఎం ఆఫీసు బాయ్‌కి ఒక్కసారిగా రూ.20 లక్షలు
ముంబై : డిజిటల్ లావాదేవీల్లో శరవేగంగా దూసుకెళ్తున్న పేటీఎం ఇటీవల ప్రకటించిన రెండో స్టాక్ విక్రయంతో, 100కు పైగా ఆ కంపెనీ ఉద్యోగులు మిలీనియర్లుగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్ల విలువైన స్టాక్ సేల్‌ను ఈ కంపెనీ చేపట్టింది. ఈ విక్రయంలో కంపెనీలో పనిచేసే, పనిచేసిన ఉద్యోగులు వారికున్న వాటాను(ఈసాప్స్) విక్రయించుకున్నారని పేటీఎం తెలిపింది. అయితే ఈ విక్రయం ద్వారా పేటీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరిందర్ థాకర్ దాదాపు రూ.40 కోట్లను ఆర్జించారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారు మాత్రమే కాక, ఆ కంపెనీలో పనిచేసే ఆఫీసు బాయ్ కూడా లక్షాధికారి అయిపోయాడు. ఈ స్టాక్ విక్రయంతో తమ కంపెనీకి చెందిన ఆఫీసు బాయ్, రూ.20 లక్షలకు పైగా ఆర్జించినట్టు వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ సోమవారం రిపోర్టు చేసింది. ఇతర ఉద్యోగుల వివరాలను బహిర్గతం చేయనప్పటికీ, కెనడా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసు బాయ్ వివరాలను మాత్రం బయటికి వెల్లడించింది. 2017 మార్చిలో లెక్కించిన విలువ కంటే పేటీఎం ప్రస్తుత విలువ 3 బిలియన్ డాలర్లు అధికంగా ఉంది. కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లుగా సాఫ్ట్‌బ్యాంకు, ఎస్ఏఐఎఫ్ పార్టనర్స్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, యాంట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్రూప్‌లు ఉన్నాయి. కంపెనీ ఈసాప్స్ కేవలం టాప్, మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లకు మాత్రమే కాకుండా.. ముందు నుంచి కంపెనీ పనిచేసిన ఉద్యోగులకు, ఆఫీసు స్టాఫ్‌కు కూడా కంపెనీ అందించింది. ఉద్యోగులు సొంతంగా షేర్లను కలిగి ఉండటానికి అనుమతించే ఆర్థిక సాధనమే ఈసాప్స్. కొంత కాలం తర్వాత ఈ షేర్లను అమ్మి, నగదుగా మార్చుకోవచ్చు. -
మిలీనియర్స్‌గా మారిన పేటీఎం ఉద్యోగులు
ముంబై : పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరగడంతో, కేవలం పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ మాత్రమే బిలీనియర్ కాలేదు. ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు కూడా మిలీనియర్లుగా మారిపోయారు. సంస్థకు చెందిన మాజీ, ప్రస్తుత ఉద్యోగులు 200 మంది రూ.5 బిలియన్లకు ధనవంతులైనట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ ఇటీవల ప్రకటించిన రెండో షేరు విక్రయంతో, కంపెనీ విలువ రూ.635.8 బిలియన్లకు చేరుకుంది. దీంతో పేటీఎం ఉద్యోగులు తమ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్(ఈఎస్ఓపీ)ను నగదుగా మార్చుకునేందుకు అవకాశం లభించింది. ఇలా నగదుగా మార్చుకున్న క్రమంలో ఉద్యోగులు మొత్తం రూ.5 బిలియన్లను ఆర్జించినట్టు తెలిసింది. కంపెనీలో షేర్లను ఉద్యోగులు కొనుగోలుచేసేందుకు ఈఎస్ఓపీ ఒక ప్రయోజనకర ప్లాన్. 2017 మే నాటికి పేటీఎం విలువ రూ.445.09 బిలియన్లుగా ఉంది. అయితే రెండోసారి విక్రయించిన షేర్లలో కంపెనీ విలువ రూ.635.8 బిలియన్లకు పెరిగింది. బిజినెస్, టెక్నాలజీ, ప్రొడక్ట్, అడ్మినిస్ట్రేటివ్, హ్యుమన్ రిసోర్సస్, సేల్స్, ఫైనాన్స్‌లలో పనిచేసే, పనిచేసిన 200 మంది పేటీఎం ఉద్యోగులకు రెండోసారి విక్రయం ద్వారా రూ.5 బిలియన్ల విలువైన షేర్లను లిక్విడిటీ మార్చుకునే అవకాశం కల్పించినట్టు కంపెనీ పేర్కొంది. దీనిలో చాలా మంది ఉద్యోగులు కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఉన్నవారే. గతేడాది డిసెంబర్లో ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా రూ.6.5 బిలియన్ల విలువైన ఈఎస్ఓపీలను బైబ్యాక్ చేసింది. మొబైల్-ఫస్ట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ అయిన పేటీఎంను, వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ నడిపిస్తోంది. -
దీపావళి బొనాంజ
బెంగళూరు : ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు దీపావళి బొనాంజ ఇవ్వబోతుంది. దీపావళి కానుకగా ఉద్యోగుల స్టాక్ ఆప్షన్లను(ఈఎస్ఓపీలను) తిరిగి కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ బోర్డు ఆమోదించినట్టు తెలిసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో 6వేల మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని ఈ విషయం తెలిసిన సంబంధిత వర్గాలు చెప్పాయి. దేశీయ స్టార్టప్ సెక్టార్లో ఇప్పటి వరకు అతిపెద్ద షేర్ బైబ్యాక్ ప్లాన్ ఇదే కావడం విశేషం. కంపెనీ వాటాదారులకు ఇది అతిపెద్ద అవకాశమని తెలిసింది. 100 మిలియన్ డాలర్లకు(రూ.656 కోట్లకు పైగా) ఈ ఈఎస్ఓపీలను ఫ్లిప్‌కార్ట్ తిరిగి కొనుగోలు చేయబోతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.. జపాన్ సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేషన్, చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ వంటి పెట్టుబడివారుల నుంచి 4 బిలియన్ డాలర్లను సమీకరించిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఈ ప్లాన్‌కు తెరతీసింది. ఫ్లిప్‌కార్ట్ సబ్సిడరీలు ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రా, పేమెంట్ యూనిట్ ఫోన్‌పే ఉద్యోగులు కూడా ఈ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల తిరిగి కొనుగోలు ప్రొగ్రామ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ ప్రొగ్రామ్ కింద ఉద్యోగులు కొంత మొత్తంలో షేర్లను విక్రయించుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ వరకు ఈ ప్రక్రియను ముగించేయాలని ఫ్లిప్‌కార్ట్ చూస్తోంది. అయితే ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. -
ఫైనాన్షియల్ బేసిక్స్
స్టార్టప్స్ ఉద్యోగులకు ఈసాప్స్ మంచివేనా? ప్రస్తుతం చాలా భారతీయ స్టార్టప్ కంపెనీలు ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈఎస్ఓపీ) ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. సాధారణంగా ఇవి వేతన ప్యాకేజ్, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈఎస్ఓపీ ఆప్షన్‌ను ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఉద్యోగులు వారి వేతనంలో నిర్ణీత మొత్తంతో వారు పనిచేసే సంస్థ షేర్లను కొనుగోలు చేయడానికి అంగీకరించడమే ఈఎస్ఓపీ అని ఒక్కమాటలో చెప్పొచ్చు. సంస్థలోనే పనిచేస్తున్నందున ఉద్యోగికి షేర్లు మార్కెట్ ధర కన్నా కొంత డిస్కౌంట్‌కు వస్తాయి. ఈ మేరకు సంస్థకు, ఉద్యోగికి నియామకం సమయంలోనే డీల్ కుదురుతుంది. అంటే కంపెనీ ఉద్యోగికి రూ.15 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తోందనుకుంటే.. అందులో రూ.5 లక్షలను ఈఎస్ఓపీ రూపంలో ఇస్తోందనుకుందాం. అంటే ఈ రూ.5 లక్షల మొత్తానికి విలువైన కంపెనీ షేర్లు ఉద్యోగికి అలాట్ అవుతాయి. మిగతా రూ.10 లక్షల జీతం ఖాతాలో జమ అవుతుంది. మన పేరు మీది షేర్లను నిర్ణీత కాలం తర్వాత మాత్రమే విక్రయించుకోగలం. దీన్ని వెస్టింగ్ పీరియడ్‌గా పిలుస్తారు. ఈ విధానం ఎవరికీ మేలు.. స్టార్టప్ కంపెనీ, ఉద్యోగి ఇరువురికి ఈఎస్ఓపీ ఆప్షన్ ఉత్తమమే. అయితే ఇక్కడ కొన్ని రిస్క్‌లు ఉంటాయి. ఈఎస్ఓపీ ఆప్షన్ ఎంచుకొని మిలియనీర్లు అయిన వారు ఉన్నారు. నష్టపోయిన వారు కూడా ఉన్నారు. పది స్టార్టప్‌లలో ఒకటి మాత్రమే విజయవంతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే మనం తీసుకునే రిస్క్‌ను బట్టి ఆప్షన్ ఎంచుకోవాలి. భారీ మొత్తంలో వేతనాలు చెల్లించకుండా మంచి టాలెంట్‌ను నియమించుకోవటానికి కంపెనీలకు ఈసాప్ విధానం అనువుగా ఉంటుంది. దీనికి గూగుల్ సుందర్ పిచాయ్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే షేర్ల కేటాయింపు వల్ల ఉద్యోగి తను కూడా సంస్థలో భాగస్వామి అని భావించి మరింత బాగా పనిచేసే అవకాశముంటుంది. ఇది కూడా కంపెనీకి అనుకూలించే అంశమే. ఇదే సమయంలో ఈఎస్ఓపీ వల్ల కంపెనీ వ్యవస్థాపకుల షేర్ హోల్డింగ్ వాటా తగ్గుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు షేర్లు అలాట్ అవుతాయి కాబట్టి. చివరగా ఉద్యోగులు ఈఎస్ఓపీ ఆప్షన్‌ను ఎంచుకునేటప్పుడు పన్నులు, డాక్యుమెంటేషన్, ఎగ్జిట్ వంటి పలు అంశాలపై దృష్టిపెట్టాలి.