ఫిన్‌టెక్ యునికార్న్ రేజర్‌పే (Razorpay) తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్‌లను (ESOP) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ ఇంత భారీ మొత్తంలో ప్రతీ ఉద్యోగికీ స్టాక్ ఆప్షన్‌లను అందిచడం ఇదే మొదటిసారి. ఉద్యోగుల అంకితభావం, కృషిని గుర్తిస్తూ ఈ చొరవ తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్‌లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్‌లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రేజర్‌పేతోపాటు ఇటీవల ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసిన ఇతర కొత్త తరం కంపెనీలలో లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ ఢిల్లీవేరీ, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato), చెల్లింపు సేవల సంస్థ పేటీఎం (Paytm), ట్రావెల్ టెక్ సంస్థ ఇక్సిగో ఉన్నాయి.
గత నెలలో ఢిల్లీవేరీ 4.9 లక్షల స్టాక్ ఆప్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. అదే నెలలో, పేటీఎం 4.05 లక్షల ఈక్విటీ షేర్లను మంజూరు చేసింది. ఇక్సిగో 17.6 లక్షల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసింది. నెల క్రితం జొమాటో సుమారు 12 మిలియన్ స్టాక్ ఆప్షన్లను జారీ చేసింది. రేజర్‌పే ఇప్పటి వరకు 1,940 మంది ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్‌లను అందించింది.
రేజర్‌పేకి సంబంధించి గతంలో స్టాక్ ఆప్షన్‌లను అందుకున్న ఉద్యోగులు పలు రౌండ్ల బైబ్యాక్‌ల ద్వారా ప్రయోజనం పొందారు. కంపెనీ తన మొదటి ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్‌ల బైబ్యాక్‌ను 2018లో ప్రారంభించింది. అప్పుడు 140 మంది ఉద్యోగులను వారి వెస్టెడ్ షేర్లను లిక్విడేట్ చేసుకున్నారు. 2019, 2021లో రెండవ, మూడవ బైబ్యాక్‌లలో వరుసగా 400, 750 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఇక 2022లో 75 మిలియన్ డాలర్ల విలువతో నాల్గవ బైబ్యాక్ 650 మంది ఉద్యోగులకు (మాజీ ఉద్యోగులతో సహా) ప్రయోజనం చేకూర్చింది.
Comments
Please login to add a commentAdd a comment