Employee stock options
-
లక్కీ ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.లక్ష..
ఫిన్‌టెక్ యునికార్న్ రేజర్‌పే (Razorpay) తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను (ESOP) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ ఇంత భారీ మొత్తంలో ప్రతీ ఉద్యోగికీ స్టాక్ ఆప్షన్లను అందిచడం ఇదే మొదటిసారి. ఉద్యోగుల అంకితభావం, కృషిని గుర్తిస్తూ ఈ చొరవ తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రేజర్పేతోపాటు ఇటీవల ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసిన ఇతర కొత్త తరం కంపెనీలలో లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ ఢిల్లీవేరీ, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato), చెల్లింపు సేవల సంస్థ పేటీఎం (Paytm), ట్రావెల్ టెక్ సంస్థ ఇక్సిగో ఉన్నాయి.గత నెలలో ఢిల్లీవేరీ 4.9 లక్షల స్టాక్ ఆప్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. అదే నెలలో, పేటీఎం 4.05 లక్షల ఈక్విటీ షేర్లను మంజూరు చేసింది. ఇక్సిగో 17.6 లక్షల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసింది. నెల క్రితం జొమాటో సుమారు 12 మిలియన్ స్టాక్ ఆప్షన్లను జారీ చేసింది. రేజర్‌పే ఇప్పటి వరకు 1,940 మంది ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను అందించింది.రేజర్‌పేకి సంబంధించి గతంలో స్టాక్ ఆప్షన్లను అందుకున్న ఉద్యోగులు పలు రౌండ్ల బైబ్యాక్‌ల ద్వారా ప్రయోజనం పొందారు. కంపెనీ తన మొదటి ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ల బైబ్యాక్‌ను 2018లో ప్రారంభించింది. అప్పుడు 140 మంది ఉద్యోగులను వారి వెస్టెడ్ షేర్లను లిక్విడేట్ చేసుకున్నారు. 2019, 2021లో రెండవ, మూడవ బైబ్యాక్‌లలో వరుసగా 400, 750 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఇక 2022లో 75 మిలియన్ డాలర్ల విలువతో నాల్గవ బైబ్యాక్ 650 మంది ఉద్యోగులకు (మాజీ ఉద్యోగులతో సహా) ప్రయోజనం చేకూర్చింది. -
జొమాటో ఉద్యోగులకు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్లు
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది.శుక్రవారం వారంతపు ట్రేడింగ్ సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో జొమాటో షేర్లు రూ.275.20 వద్ద ముగిశాయి. దీంతో ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ మొత్తం విలువ రూ.330.17 కోట్లుగా మారింది. మొత్తం ఆప్షన్లలో 11,997,652 ఆప్షన్లు ‘ఈఎస్ఓపీ 2021’ ప్లాన్ కిందకు వస్తాయి. మరో 116 ఆప్షన్లు ‘ఈఎస్ఓపీ 2014’ కిందకు వస్తాయి. కంపెనీ వాటిని "ఫుడీ బే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్"గా పేర్కొంది.ఈఎస్ఓపీలు అనేవి ఉద్యోగులకు పరిహారంగా ఇచ్చే కంపెనీ స్టాక్ ఆప్షన్లు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి ప్రోత్సాహకంగా కంపెనీలు స్టాక్ ఆప్షన్లను కేటాయిస్తూ ఉంటాయి. వీటిని ఉద్యోగి కావాలంటే ఈక్విటీ షేర్‌గా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
ఓయోలో ఉద్యోగులకు వాటా
న్యూఢిల్లీ: వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే ఆతిథ్య రంగ కంపెనీ ఓయో.. ఉద్యోగులకు షేర్లను జారీ చేసింది. కంపెనీ ప్రస్తుత సిబ్బందిసహా మాజీ ఉద్యోగులు సైతం షేర్లను సొంతం చేసుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్(ఇసాప్)లో భాగంగా 3 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ పేర్కొంది. ఇసాప్‌ల మార్పిడి ద్వారా ఉద్యోగులు ఈక్విటీ షేర్లను పొందినట్లు వెల్లడించింది. కంపెనీ భారీ డిస్కౌంట్లో జారీ చేసిన ఇసాప్‌ల ద్వారా సిబ్బంది షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీ గతేడాది ఆగస్ట్‌లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 5 మిలియన్ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఓయో విలువ 9.6 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఉద్యోగులు కొనుగోలు చేసిన షేర్ల విలువను రూ. 330 కోట్లుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఇటీవల ఇసాప్‌ల జారీని 41 శాతానికి విస్తరించడంతో ప్రస్తుత సిబ్బందిలో 80 శాతం మందికి ఇవి లభించినట్లు తెలుస్తోంది. 2021 మార్చికల్లా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బంది సంఖ్య 5,130కు చేరింది. వీరిలో దాదాపు 71 శాతం మంది దేశీయంగానే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! గతేడాది అక్టోబర్‌లో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన విషయం విదితమే. తద్వారా రూ. 8,430 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
250 మంది ఉద్యోగులకు రూ. 150 కోట్ల ఎసాప్స్
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ తమ ఉద్యోగులతో పాటు అనుబంధ సంస్థల్లోని సిబ్బందికి భారీ నజరానాలు ప్రకటించింది. అర్హులైన 250 మంది ఉద్యోగులకు రూ. 150 కోట్ల విలువ చేసే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు (ఎసాప్స్) ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక స్కీము కింద రిలయన్స్ క్యాపిటల్ లిస్టెడ్ షేర్లు, ఇతర అనుబంధ సంస్థల ‘ఫాంటమ్ షేర్లు’ ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో 6,46,080 షేర్లు రిలయన్స్ క్యాపిటల్వి, మిగతావి ఫాంటమ్ షేర్ల రూపంలో అనుబంధ సంస్థలవీ ఉంటాయి. భౌతిక రూపంలో కాకుండా ‘కల్పిత’ రూపంలో జారీ చేసే షేర్లను ఫాంటమ్ షేర్లుగా వ్యవహరిస్తారు. ఇవి కల్పితమైనవే అయినప్పటికీ.. సంబంధిత కంపెనీ, ఆ షేర్లను జారీచేసినవారు విక్రయించదలిస్తే, మార్కెట్ విలువ ప్రకారం భవిష్యత్తులో చెల్లింపు చేయడం లేదా వాటి స్థానంలో వాస్తవ షేర్లను జారీచేయడం జరుగుతుంది. రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థలైన రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన వాటిల్లో అర్హులైన ఉద్యోగులకు ఎసాప్స్ లభిస్తాయి. రిలయన్స్ క్యాపిటల్ నజరానా