Razorpay
-
లక్కీ ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.లక్ష..
ఫిన్‌టెక్ యునికార్న్ రేజర్‌పే (Razorpay) తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను (ESOP) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ ఇంత భారీ మొత్తంలో ప్రతీ ఉద్యోగికీ స్టాక్ ఆప్షన్లను అందిచడం ఇదే మొదటిసారి. ఉద్యోగుల అంకితభావం, కృషిని గుర్తిస్తూ ఈ చొరవ తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రేజర్పేతోపాటు ఇటీవల ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసిన ఇతర కొత్త తరం కంపెనీలలో లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ ఢిల్లీవేరీ, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato), చెల్లింపు సేవల సంస్థ పేటీఎం (Paytm), ట్రావెల్ టెక్ సంస్థ ఇక్సిగో ఉన్నాయి.గత నెలలో ఢిల్లీవేరీ 4.9 లక్షల స్టాక్ ఆప్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. అదే నెలలో, పేటీఎం 4.05 లక్షల ఈక్విటీ షేర్లను మంజూరు చేసింది. ఇక్సిగో 17.6 లక్షల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసింది. నెల క్రితం జొమాటో సుమారు 12 మిలియన్ స్టాక్ ఆప్షన్లను జారీ చేసింది. రేజర్‌పే ఇప్పటి వరకు 1,940 మంది ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను అందించింది.రేజర్‌పేకి సంబంధించి గతంలో స్టాక్ ఆప్షన్లను అందుకున్న ఉద్యోగులు పలు రౌండ్ల బైబ్యాక్‌ల ద్వారా ప్రయోజనం పొందారు. కంపెనీ తన మొదటి ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ల బైబ్యాక్‌ను 2018లో ప్రారంభించింది. అప్పుడు 140 మంది ఉద్యోగులను వారి వెస్టెడ్ షేర్లను లిక్విడేట్ చేసుకున్నారు. 2019, 2021లో రెండవ, మూడవ బైబ్యాక్‌లలో వరుసగా 400, 750 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఇక 2022లో 75 మిలియన్ డాలర్ల విలువతో నాల్గవ బైబ్యాక్ 650 మంది ఉద్యోగులకు (మాజీ ఉద్యోగులతో సహా) ప్రయోజనం చేకూర్చింది. -
ఎగుమతిదార్లకు ‘రేజర్‌పే’ ఖాతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ రేజర్‌పే తాజాగా మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ సేవలను ప్రారంభించింది. ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా జరిపే నగదు లావాదేవీల చార్జీలపై 50 శాతం వరకు పొదుపు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ‘చిన్న, మధ్య తరహా ఎగుమతిదార్లు తమకు నచి్చన దేశంలో ఖాతాను తెరవడానికి, అలాగే రేజర్‌పే ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానికంగా చెల్లింపులను స్వీకరించడానికి కంపెనీ సహాయం చేస్తుంది. తద్వారా చార్జ్బ్యాక్స్, ట్రాన్స్ఫర్ ఖర్చులను నివారించవచ్చు’ అని రేజర్‌పే వెల్లడించింది. మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్‌తో 160 దేశాల నుండి బ్యాంకుల ద్వారా నగదును స్వీకరించడానికి ఎగుమతిదారులకు వీలు కలుగుతుంది. అన్ని చెల్లింపులు ఎల్రక్టానిక్ ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ స్టేట్మెంట్తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 10,000 పైచిలుకు మంది ఎగుమతిదార్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని రేజర్‌పే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ కొఠారి చెప్పారు. -
రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ కంపెనీలకు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ: పేమెంట్ గేట్‌వే సేవలు అందిస్తున్న రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. పేమెంట్ ప్రాసెసింగ్ వ్యాపారంలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘పేమెంట్ అగ్రిగేటర్, పేమెంట్ గేట్‌వే లైసెన్స్ కోసం ఆర్బీఐ నుంచి జూలైలో సూత్రప్రాయ ఆమోదం లభించింది. తుది లైసెన్స్ కోసం ఆర్బీఐకి కంపెనీ అదనపు సమాచారం అందించాల్సి ఉంది. అంత వరకు కొత్త ఆన్లైన్ వ్యాపారులను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ కోరింది’ అని రేజర్‌పే తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రభావం ప్రస్తుత వ్యాపారాలపై ఉండబోదని కంపెనీ వెల్లడించింది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
ఇక ఈ క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు...ఫస్ట్ చాన్స్ వారికే
సాక్షి,ముంబై: యూపీఐ చెల్లింపుల విషయంలో క్రెడిట్ కార్డ్ యూజర్లకు తీపి కబురు అందించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు త్వరలో వస్తువులు, సేవల కోసం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆపరేటెడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే పరిమితమైన యూపీఐ చెల్లింపులు ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా అందుబాటులో వస్తాయి. బుధవారం నుంచి యూపీఐలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రారంభమైనట్లు రేజర్ పే ప్రకటించింది. వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐతో లింక్ చేయడానికి అనుమతించే ఎన్సీపీఐ ఫీచర్‌ను స్వీకరించిన తొలి చెల్లింపు గేట్‌వే తామేనని రేజర్ పే తెలిపింది. తమ చెల్లింపుల గేట్‌వేని ఉపయోగించే వ్యాపారులకు మాత్రమే పరిమితమని వెల్లడించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని రేజర్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డిఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ,ఇండియన్ బ్యాంక్‌ల కస్టమర్లు ఈ ప్రయోజనాలను మొదట పొందుతారని తెలిపింది. ఇప్పటికే రూపేక్రెడిట్ కార్డ్‌ల చెల్లింపులు మొదలైన సంగతి తెలిసిందే. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) యూపీఐ క్రెడిట్ కార్డ్ లింకింగ్ ద్వారా కస్టమర్లు ఇకపై చెల్లింపుల కోసం తమ క్రెడిట్ కార్డ్‌లను అన్ని సమయాల్లో తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.తద్వారా చోరీ, లేదా క్రెడిట్ కార్డ్ పోగొట్టుకోవడం లాంటి కష్టాలు లేకుండా కస్టమర్లకు భద్రతను పెంచుతుంది. అలాగే స్వైపింగ్ మెషీన్ల వద్ద సున్నితమైన కస్టమర్ సమాచారాన్ని స్కిమ్మింగ్ చేసే లేదా కాపీ చేసే ముప్పునుంచి తప్పిస్తుంది. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) కాగా దాదాపు 250 మిలియన్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం UPIని ఉపయోగిస్తున్నారు మరియు దాదాపు 50 మిలియన్ల మంది వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గత మూడు సంవత్సరాలలో 30 శాతం పెరిగింది.